రైతులను అన్ని విధాలా ఆదుకోవాలి: సీఎం రోశయ్య

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య పేర్కొన్నారు. ఇంకా నష్టపోయిన రైతులకు సహాయక చర్యలు అందేలా చూడాలని ఆదేశించారు. దీనిపై ప్రభుత్వ కార్యదర్శితోనూ రోశయ్య సమీక్ష జరిపారు. నష్టపోయిన రైతులను అన్నివిధాలా ఆదుకోవాలని ఆదేశించారు.
Source: Yahoo! Telugu: News | 15 Apr 2010 | 9:15 am

మిశ్రమ ఫలితాల్లో బాంబే స్టాక్ మార్కెట్

చైనా జీడీపీ వృద్ధిరేటు 11.9 శాతానికి పెరిగినప్పటికీ బాంబే స్టాక్ మార్కెట్ మిశ్రమఫలితాలను నమోదు చేసుకుంటోంది. మార్చి 2010తో ముగిసిన త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధిరేటు 11.9 శాతానికి చేరుకుంది. దీంతో ఆసియా, అమెరికా మార్కెట్ల ట్రేడింగ్ ఊపందుకుంది. కానీ బాంబే స్టాక్ మార్కెట్ మాత్రం మిశ్రమ ఫలితాలను నమోదుచేసుకుంది.
Source: Yahoo! Telugu: News | 15 Apr 2010 | 8:49 am

హైకోర్టులో పిటిషన్ వేసిన నూతన వరుడు షోయబ్!!

పాకిస్థాన్ క్రికెట్ ఆటగాడు, హైదరాబాదీ అల్లుడు షోయబ్ మాలిక్ తన పాస్‌పోర్టును తిరిగి అప్పజెప్పాలంటూ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను వివాహం చేసుకునే నేపథ్యంలో హైదరాబాద్ వచ్చి, ఆయేషా సిద్దీకీ వివాదంలో చిక్కుకున్న షోయబ్ పాస్‌పోర్టును నగర పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకుని కోర్టుకు సమర్పించారు.
Source: Yahoo! Telugu: News | 15 Apr 2010 | 8:26 am

కేసీఆరూ.. సీమాంధ్రలో పర్యటించవయ్యా.!: అనంత ఎంపీ

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు యధేచ్చగా సీమాంధ్రలో పర్యటించవచ్చునని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా యాత్రలు చేపట్టవచ్చునని కేసీఆర్‌కు అనంత ఎంపీ హితవు పలికారు.
Source: Yahoo! Telugu: News | 15 Apr 2010 | 8:09 am

స్వల్పంగా పెరిగి 9.9 శాతానికి చేరుకున్న ద్రవ్యోల్బణం

టోకు ధరల ఆధారంగా మార్చి నెల ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 9.9 శాతానికి చేరుకుంది. అదే ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణం 9.89 శాతంగా ఉండింది. ఈ పెరుగుదల పంచదార, పప్పుదినుసుల ధరలు పెరగడంతో స్వల్పంగా ద్రవ్యోల్బణం పెరిగిందని కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 15 Apr 2010 | 7:56 am

మంత్రివర్యా.. ఏమిటిదంతా..?!!: సోనియా గాంధీ ప్రశ్న

కేంద్ర ప్రభుత్వానికి తలవంపులు తెచ్చే దిశగా శశి థరూర్ వ్యవహారం సాగుతుందోన్న ఆందోళనల నేపధ్యంలో యూపీఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కొచ్చి వ్యవహారంపై మంత్రి శశి థరూర్‌ను వివరణ కోరినట్లు సమాచారం. సోనియా ప్రశ్నతో ఖంగు తిన్న మంత్రి తనకు జవాబు చెప్పేందుకు కాస్త సమయం కావాలని అడినట్లు తెలుస్తోంది.
Source: Yahoo! Telugu: News | 15 Apr 2010 | 7:44 am

ఏడు శాతం వృద్ధి సాధించిన పాల ఉత్పత్తి ఎగుమతులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో (ఏప్రిల్-డిసెంబరు,2009-10) పాలు, డెయిరీ ఉత్పత్తుల ఎగుమతుల్లో దాదాపు ఏడు శాతం వృద్ధి సాధించింది. అదే నిత్యావసర సరుకుల ఎగుమతుల్లో 90 శాతం వృద్ధి సాధించినట్లు ప్రభుత్వ అధికార యంత్రాంగం న్యూ ఢిల్లీలో తెలిపింది
Source: Yahoo! Telugu: News | 15 Apr 2010 | 7:39 am

లాభాల్లో స్టాక్ మార్కెట్: పురోగమనం వైపు సెన్సెక్స్

గురువారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి పుంజుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 54 పాయింట్లు బలపడింది. దీంతో సెన్సెక్స్ సూచీ, 17,876 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 19 పాయింట్లు స్వల్పంగా పుంజుకుని, 5,342 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 15 Apr 2010 | 7:25 am

ఇలినయానాను టాలీవుడ్ పొమ్మంటోందా...?

ఒక భాషలో నటిస్తే మరో భాషలో సినిమాలు మిస్ అవుతాయని తాను అనుకోవడం లేదని ఇలినయానా చెపుతోంది. తమిళ చిత్రాల్లో నటిస్తే తెలుగులో అవకాశాలు పోతాయనే వాదనను కొట్టి వేస్తూ తెలుగులో తనకంటూ ప్రత్యేక స్థానముందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇకపై తమిళ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తానని చెపుతోంది. ఈ మధ్య నితిన్, విష్ణువతో ఆమె నటించిన చిత్రాలు బోర్లా పడ్డాయి. దీంతో తమిళం వైపు మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. అన్నట్లు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలియానా అందాలకు మించిన అందగత్తెలు రంగప్రవేశం చేసిన దరిమిలా, ఇలియానా పక్క చూపులు చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Apr 2010 | 7:18 am

కేంద్ర మంత్రి శశి థరూర్‌ను నీడలా వెంటాడుతున్న మీడియా

కొచ్చి ఐపీఎల్ వ్యవహారం, తన గాళ్ ఫ్రెండ్ సునందకు సంబంధించిన అంశాలపై పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి శశిథరూర్ గురువారం లోక్‌సభవద్ద మీడియా నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారు.
Source: Yahoo! Telugu: News | 15 Apr 2010 | 7:10 am

అంతర్జాతీయంగా మరింత ప్రియంకానున్న పసిడి ధరలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి బంగారం ధరలు మరింత ప్రియం కానున్నాయి. బంగారం ధర 1,300ల అమెరికా డాలర్లకు చేరుకుంటుందని యూకేకు చెందిన జీఎఫ్ఎస్ఎస్ కన్సల్టెన్సీ సంస్థ గురువారం హోస్టన్‌లో వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 15 Apr 2010 | 6:45 am

మే నెలలో మహేష్ - శ్రీను వైట్ల చిత్రం

మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్న చిత్రం మే నెలలో ప్రారంభం కానుంది. ఇందులో ఏ మాయ చేసావె ఫేమ్ సమంత కథానాయిక. ఈ చిత్రాన్ని 2011 సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ సంస్థ వెంకటేష్‌తో నమో వెంకటేశ చిత్రాన్ని నిర్మించింది.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Apr 2010 | 5:59 am

ప్రభుత్వాన్ని కూలదోయడమే మావోల లక్ష్యం: చిదంబరం

దంతెవాడ సంఘటనపై పార్లమెంటు దద్ధరిల్లింది. దంతెవాడ ఘటన 76మంది జవాన్ల ప్రాణాలను మావోలు బలిగొన్న సంఘటనపై భుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ విపక్షాలు ధ్వజమెత్తాయి. అసలు మావోల అణచివేతకు సంబంధించి యూపీఎ భాగస్వామ్య పార్టీల మధ్య ఐక్యత లేదని ఆరోపించాయి.
Source: జాతీయ | 15 Apr 2010 | 3:55 am

రైతులను అన్ని విధాలా ఆదుకోవాలి: సీఎం రోశయ్య

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య పేర్కొన్నారు. ఇంకా నష్టపోయిన రైతులకు సహాయక చర్యలు అందేలా చూడాలని ఆదేశించారు. దీనిపై ప్రభుత్వ కార్యదర్శితోనూ రోశయ్య సమీక్ష జరిపారు. నష్టపోయిన రైతులను అన్నివిధాలా ఆదుకోవాలని ఆదేశించారు.
Source: ఏపీ న్యూస్ | 15 Apr 2010 | 3:46 am

హైకోర్టులో పిటిషన్ వేసిన నూతన వరుడు షోయబ్!!

పాకిస్థాన్ క్రికెట్ ఆటగాడు, హైదరాబాదీ అల్లుడు షోయబ్ మాలిక్ తన పాస్‌పోర్టును తిరిగి అప్పజెప్పాలంటూ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను వివాహం చేసుకునే నేపథ్యంలో హైదరాబాద్ వచ్చి, ఆయేషా సిద్దీకీ వివాదంలో చిక్కుకున్న షోయబ్ పాస్‌పోర్టును నగర పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకుని కోర్టుకు సమర్పించారు.
Source: ఏపీ న్యూస్ | 15 Apr 2010 | 2:57 am

కేసీఆరూ.. సీమాంధ్రలో పర్యటించవయ్యా.!: అనంత ఎంపీ

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు యధేచ్చగా సీమాంధ్రలో పర్యటించవచ్చునని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా యాత్రలు చేపట్టవచ్చునని కేసీఆర్‌కు అనంత ఎంపీ హితవు పలికారు.
Source: ఏపీ న్యూస్ | 15 Apr 2010 | 2:43 am

శ్రీహరికోటలో జీఎస్ఎల్‌‍వీ-డీ3 ప్రయోగం: కౌంట్‌డౌన్ ప్రారంభం!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మొట్టమొదటిసారిగా క్రియోజోనిక్ టెక్నాలజీతో రూపొందించిన జిఎస్ఎల్‌వి-డీ3 రాకెట్‌ ప్రయోగానికి శ్రీహరి కోట వేదికైంది. అత్యాధునిక టెక్నాలజీతో ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన జీఎస్ఎల్‌‍వీ-డీ3 రాకెట్ గురువారం నింగికి ఎగసేందుకు సిద్ధమవుతోంది.
Source: జాతీయ | 15 Apr 2010 | 2:28 am

మంత్రివర్యా.. ఏమిటిదంతా..?!!: సోనియా గాంధీ ప్రశ్న

కేంద్ర ప్రభుత్వానికి తలవంపులు తెచ్చే దిశగా శశి థరూర్ వ్యవహారం సాగుతుందోన్న ఆందోళనల నేపధ్యంలో యూపీఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కొచ్చి వ్యవహారంపై మంత్రి శశి థరూర్‌ను వివరణ కోరినట్లు సమాచారం. సోనియా ప్రశ్నతో ఖంగు తిన్న మంత్రి తనకు జవాబు చెప్పేందుకు కాస్త సమయం కావాలని అడినట్లు తెలుస్తోంది.
Source: జాతీయ | 15 Apr 2010 | 2:17 am

కేంద్ర మంత్రి శశి థరూర్‌ను నీడలా వెంటాడుతున్న మీడియా

కొచ్చి ఐపీఎల్ వ్యవహారం, తన గాళ్ ఫ్రెండ్ సునందకు సంబంధించిన అంశాలపై పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి శశిథరూర్ గురువారం లోక్‌సభవద్ద మీడియా నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారు.
Source: జాతీయ | 15 Apr 2010 | 1:46 am

ఐక్యత లేకుంటే మావోలపై పైచేయి అసాధ్యం: యశ్వంత్ సిన్హా

గురువారంనాడు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో విపక్షాలు ధరల పెరుగుదల, దంతెవాడ ఘటన, శశి థరూర్ వివాదం వంటి అంశాలతో యూపీఎపై దాడి చేస్తున్నాయి.
Source: జాతీయ | 15 Apr 2010 | 1:09 am

మీ ఆప్యాయత చూశాక.. ఆ బాధను మర్చిపోయా..!: జగన్

రాష్ట్ర ప్రజల ఆప్యాయత కళ్లారా చూశాక.. తనకు తండ్రి లేరనే బాధను పూర్తిగా మరిచిపోయానని కడప ఎంపీ వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి లక్షలాది కుటుంబాలు ఉన్నాయని జగన్ వెల్లడించారు. అందుకే తనను ఇంతగా అభిమానిస్తున్నారని ఆయన అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 15 Apr 2010 | 12:33 am

చిదంబరం మహా మొండి ఘటం: దిగ్విజయ్‌ సింగ్ వ్యాఖ్య

దేశంలో వేళ్లూనుకునివున్న నక్సలైట్ల ఏరివేతకు కేంద్రం చేపడుతున్న 'ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌'పై అధికార కాంగ్రెస్‌ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నక్సల్స్‌ను ఎదుర్కోవడంలో కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం అనుసరిస్తున్న వైఖరిని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ బుధవారం బహిరంగంగానే తప్పుబట్టారు.
Source: జాతీయ | 15 Apr 2010 | 12:10 am

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్, ఆంటోనీలను కలిసిన శశి థరూర్

కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రణబ్, రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీలను కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి శశిధరూర్ బుధవారం రాత్రి కలిసి తనపై ఐపీఎల్‌కు సంబంధించి వస్తున్న ఆరోపణలు, బెదిరింపులపై చర్చించారు.
Source: జాతీయ | 15 Apr 2010 | 12:09 am

విపక్షాల మెయిన్ టార్గెట్: మంత్రి శశి "గాళ్ ఫ్రెండ్" వగైరాలపై...

లోక్‌సభ మలి విడత బడ్జెట్‌ సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి. ఈ సమావేశాలు వచ్చే నెల 7 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, మహిళా రిజర్వేషన్‌ బిల్లు, అణు జవాబుదారీ బిల్లు, దంతెవాడ మారణకాండ, కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి శశిథరూర్‌పై వచ్చిన ఆరోపణలు తదితర కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Source: జాతీయ | 15 Apr 2010 | 12:08 am

నగరంలోని తాజ్‌లో సానియా రిసెప్షన్ ఈరోజే

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెట్ ఆటగాడు షోయబ్ మాలిక్‌ల పెళ్ళి రిసెప్షన్ గురువారం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో జరుగనుంది. ఈ రిసెప్షన్‌లో క్రీడారంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
Source: ఏపీ న్యూస్ | 14 Apr 2010 | 11:39 pm

బీఎస్పీ నేతను కాల్చి చంపిన ఆగంతకులు

ఉత్తరప్రదేశ్‌ అధికారపార్టీకి చెందిన బహుజనసమాజ్ పార్టీ మహిళా బిల్లుకు వ్యతిరేకంగా సభలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో యూపీలోని గోండాలో బీఎస్పీ సీనియర్ నాయకుడు హనుమాన్ శరణ్ శుక్లా ఒక కార్యక్రమంలో వేదికపై కూర్చున్న సమయంలోనే ఆయుధాలు ధరించిన వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Source: జాతీయ | 14 Apr 2010 | 6:54 am

సందర్భాన్నిబట్టి అధిష్టానంతో మాట్లాడుతా: రోశయ్య

రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 4-30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై సందర్భాన్నిబట్టి సోనియాగాంధీతో చర్చిస్తాన్నారు. అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆమెకు వివరించనున్నట్లు తెలిపారు
Source: ఏపీ న్యూస్ | 14 Apr 2010 | 6:11 am

దళితులకు గౌరవం దక్కింది అంబేద్కర్‌ వల్లనేః డీఎస్

హైదరాబాద్ నగరంలోని గాంధీభవన్‌లో బుధవారం అంబేద్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్) బాబాసాహెబ్ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
Source: ఏపీ న్యూస్ | 14 Apr 2010 | 4:35 am

మాయా సర్కారుపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉత్తరప్రదేశ్‌‍ నుంచి బుధవారం చైతన్య యాత్ర ప్రారంభించేందుకు అంబేద్కర్ నగర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయావతి దళితుల విరోధి అని విరుచుకుపడ్డారు.
Source: జాతీయ | 14 Apr 2010 | 3:49 am

ఐదవ విడత భూపంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం

రాష్ట్రంలో ఐదవ విడత భూ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రోశయ్య బుధవారం మహబూబ్ నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ప్రారంభించారు. భూ పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఇంటి యజమాని పేరుతో భూమిని ఇస్తే అది దుర్వినియోగం అయిన సంఘటనలే ఎక్కువగా ఉన్నాయన్నారు.
Source: ఏపీ న్యూస్ | 14 Apr 2010 | 3:08 am