మాయా సర్కారుపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉత్తరప్రదేశ్‌‍ నుంచి బుధవారం చైతన్య యాత్ర ప్రారంభించేందుకు అంబేద్కర్ నగర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయావతి దళితుల విరోధి అని విరుచుకుపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 14 Apr 2010 | 9:18 am

హరిద్వార్ కుంభమేళాలో తొక్కిసలాట : ముగ్గురి మృతి

హరిద్వార్ కుంభమేళాలో బుధవారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా కొందరు తీవ్రంగా గాయాలపాలైనారు. కుంభమేళాలో చివరి మహారాజయోగ స్నానానికి కనీవిని రీతిలో ప్రజలు లక్షల సంఖ్యలో తరలి వచ్చారు.
Source: Yahoo! Telugu: News | 14 Apr 2010 | 8:51 am

ఐదవ విడత భూపంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం

రాష్ట్రంలో ఐదవ విడత భూ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రోశయ్య బుధవారం మహబూబ్ నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ప్రారంభించారు. భూ పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఇంటి యజమాని పేరుతో భూమిని ఇస్తే అది దుర్వినియోగం అయిన సంఘటనలే ఎక్కువగా ఉన్నాయన్నారు.
Source: Yahoo! Telugu: News | 14 Apr 2010 | 8:37 am

భారత ఆర్థిక వృద్ధి 8.2 శాతంగా ఉంటుందిః ఏడీబీ

గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు ఆర్థిక వృద్ధి 8.2 శాతంగా ఉంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) తన వార్షిక నివేదికలో తెలిపింది. కాని ద్రవ్యోల్బణ ప్రభావం అధికంగానే ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది
Source: Yahoo! Telugu: News | 14 Apr 2010 | 7:41 am

దళితులకు కాంగ్రెస్‌ పార్టీ చేసింది శూన్యం: చంద్రబాబు

దేశంలోను, రాష్ట్రంలోను ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఇన్నేళ్ల పాలనలోను దళితులకు చేసింది శూన్యమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో అన్నారు. అంబేద్కర్ 120వ జయంతి వేడుకల్ని ఆయన తెదేపా ట్రస్ట్ భవన్‌లో ఘనంగా ప్రారంభించారు
Source: Yahoo! Telugu: News | 14 Apr 2010 | 7:20 am

జిన్నాపై పుస్తకం రాయడం తప్పు కాదుః జస్వంత్ సింగ్

పాకిస్థాన్ వ్యవస్థాపకుడు ముహమ్మద్ అలీ జిన్నాపై పుస్తకం రాయడాన్ని తాను తప్పుగా భావించడం లేదని భారత మాజీ విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ అన్నారు. ఏదైతే జిన్నాపై రాశానో దానికి తాను బాధపడటం లేదని కరాచీలో మీడియాకు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 14 Apr 2010 | 7:03 am

పశ్చిమబెంగాల్‌, బీహార్‌లో తుఫాను భీభత్సం:49 మంది మృతి

పశ్చిమబెంగాల్‌, బీహార్‌లో చక్రవాత్ తుఫాను మంగళవారం అర్ధరాత్రి భీభత్సం సృష్టించింది. దీంతో 49 మంది మృత్యువాత పడ్డారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల పంటపొలాలు నీట మునిగాయని అధికారులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 14 Apr 2010 | 6:31 am

తమ వ్యాపార లక్ష్యం మూడింతలుః ఇంద్రానూయి

శీతల పానీయాల ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పెప్సికో కార్పొరేషన్‌ తమ ఆరోగ్య పానీయాల వ్యాపారాన్ని మూడింతలకు పెంచుకున్నామని, వచ్చే పది సంవత్సరాల్లో ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు తమ సంస్థ ప్రణాళికలు రూపొందించుకుందని పెప్సికో సంస్థ ఛైర్మెన్‌, సీఈఓ ఇంద్రానూయి తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 14 Apr 2010 | 6:19 am

జీఎస్ఎల్‌వీ-డి3 ప్రయోగానికి ప్రారంభమైన కౌంట్‌‍డౌన్

నెల్లూరు జిల్లాలోని సుళ్ళూరుపేటకు సమీపంలోనున్న శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి గురువారం సాయంత్రం 4-27 గంటలకు జీఎస్ఎల్వీ-డి3 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇందుకు సంబంధించి షార్ సెంటర్ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. మంగళవారమే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సోమవారంనాడు జీశాట్-4 ఉపగ్రహాన్ని రాకెట్ శీర్షభాగాన అమర్చినట్లు అధికారులు మీడియాకు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 14 Apr 2010 | 6:08 am

నేటి బులియన్ మార్కెట్ ధరలు

నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 16,870 అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 16,780గా ఉంది. కిలో వెండి ధర 28,240 రూపాయలుగా ఉంది.విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) 17,050 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,620 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 27,800 రూపాయలుగా ఉంది.చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 16,815 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,640 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 28,390 రూపాయలుగా పలుకుతోంది.
Source: Yahoo! Telugu: News | 14 Apr 2010 | 6:00 am

మాయా సర్కారుపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉత్తరప్రదేశ్‌‍ నుంచి బుధవారం చైతన్య యాత్ర ప్రారంభించేందుకు అంబేద్కర్ నగర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయావతి దళితుల విరోధి అని విరుచుకుపడ్డారు.
Source: జాతీయ | 14 Apr 2010 | 3:49 am

హరిద్వార్ కుంభమేళాలో తొక్కిసలాట : ముగ్గురి మృతి

హరిద్వార్ కుంభమేళాలో బుధవారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా కొందరు తీవ్రంగా గాయాలపాలైనారు. కుంభమేళాలో చివరి మహారాజయోగ స్నానానికి కనీవిని రీతిలో ప్రజలు లక్షల సంఖ్యలో తరలి వచ్చారు.
Source: జాతీయ | 14 Apr 2010 | 3:22 am

ఐదవ విడత భూపంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం

రాష్ట్రంలో ఐదవ విడత భూ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రోశయ్య బుధవారం మహబూబ్ నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ప్రారంభించారు. భూ పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఇంటి యజమాని పేరుతో భూమిని ఇస్తే అది దుర్వినియోగం అయిన సంఘటనలే ఎక్కువగా ఉన్నాయన్నారు.
Source: ఏపీ న్యూస్ | 14 Apr 2010 | 3:08 am

దళితులకు కాంగ్రెస్‌ పార్టీ చేసింది శూన్యం: చంద్రబాబు

దేశంలోను, రాష్ట్రంలోను ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఇన్నేళ్ల పాలనలోను దళితులకు చేసింది శూన్యమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో అన్నారు. అంబేద్కర్ 120వ జయంతి వేడుకల్ని ఆయన తెదేపా ట్రస్ట్ భవన్‌లో ఘనంగా ప్రారంభించారు
Source: ఏపీ న్యూస్ | 14 Apr 2010 | 1:51 am

భద్రతా దళాల ఆపరేషన్‌లో హతమైన విదేశీ మిలిటెంట్‌

ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రతా దళాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఓ మిలిటెంట్‌ అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపి మిలిటెంట్‌ను హతమార్చారు
Source: జాతీయ | 14 Apr 2010 | 1:02 am

పశ్చిమబెంగాల్‌, బీహార్‌లో తుఫాను భీభత్సం:49 మంది మృతి

పశ్చిమబెంగాల్‌, బీహార్‌లో చక్రవాత్ తుఫాను మంగళవారం అర్ధరాత్రి భీభత్సం సృష్టించింది. దీంతో 49 మంది మృత్యువాత పడ్డారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల పంటపొలాలు నీట మునిగాయని అధికారులు తెలిపారు.
Source: జాతీయ | 14 Apr 2010 | 1:02 am

జీఎస్ఎల్‌వీ-డి3 ప్రయోగానికి ప్రారంభమైన కౌంట్‌‍డౌన్

నెల్లూరు జిల్లాలోని సుళ్ళూరుపేటకు సమీపంలోనున్న శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి గురువారం సాయంత్రం 4-27 గంటలకు జీఎస్ఎల్వీ-డి3 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇందుకు సంబంధించి షార్ సెంటర్ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. మంగళవారమే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సోమవారంనాడు జీశాట్-4 ఉపగ్రహాన్ని రాకెట్ శీర్షభాగాన అమర్చినట్లు అధికారులు మీడియాకు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 14 Apr 2010 | 12:38 am

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 120వ జయంతిని పురస్కరించుకుని బుధవారం ముఖ్యమంత్రి రోశయ్య ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు.
Source: ఏపీ న్యూస్ | 14 Apr 2010 | 12:11 am

పశ్చిమ ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా ప్లాస్టిక్ స్క్రాప్ యార్డ్‌లో బుధవారం ఉదయం నాలుగు గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో చుట్టుపక్క ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మూడు రోజుల క్రితం ఇదేప్రాంతంలోని స్క్రాప్ యార్డ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.
Source: జాతీయ | 13 Apr 2010 | 11:53 pm

ప్రభాస్ - కాజల్ అగర్వాల్ "డార్లింగ్" ట్రెయిలర్

ప్రభాస్ కథానాయకుడిగా కరుణాకరన్ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న డార్లింగ్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదలైంది. ఇటీవల ప్రభాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నన్ను చాలా అందంగా చూపించారు. బాడీ లాంగ్వేజ్ కూడా వెరైటీగా ఉంటుందని అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...
Source: Yahoo! Telugu: Entertainment | 13 Apr 2010 | 3:31 pm

తలుపు వెనక నిలబడి "భూ...." అనేవాడిని: వర్మ

డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రామ్ గోపాల్ వర్మకు హారర్ సినిమాలంటే మోజు మరీ పెరిగినట్లు కనబడుతోంది. ఏప్రిల్ 16న "ఆవాహం" పేరుతో వస్తున్న దెయ్యం చిత్రంతో ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు రెడీ అయ్యారు. ఇంతలోనే ఏకంగా దెయ్యాల్ని 3డీలో చూపిస్తానని చెపుతున్నారు.అదేమని అడిగితే... దెయ్యం గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఎవరికి ఉండదూ..? అని ప్రశ్నిస్తున్నారు. అంతెందుకు చిన్నప్పుడు నేను దెయ్యం అని అందర్నీ భయపెట్టేవాడనని చెపుతున్నారు. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తమ ఇంట్లోని తలుపు వెనక నిలబడి ఇంట్లోకి వచ్చేవారిని "భూ..." అని భయపెట్టేవాడినని తన చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అందుకే అసలు దెయ్యమంటే ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నాననీ, అది కూడా 3డీలో మరీ దగ్గరగా చూపించాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Apr 2010 | 10:51 am

ఇంటికి చేరుకున్న సానియా-షోయబ్ దంపతులు!

తాజ్ కృష్ణా హోటల్‌లో సోమవారం నిఖా చేసుకున్న సానియా మీర్జా-షోయబ్ మాలిక్ దంపతులు ఇంటికి చేరుకున్నారు. పలు వివాదాల మధ్య భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సోమవారం మనువాడిన సంగతి తెలిసిందే.
Source: ఏపీ న్యూస్ | 13 Apr 2010 | 9:37 am

ప్రధాని మంత్రి వర్గంలో శశిథరూర్ ఉండటం సిగ్గుచేటు: బీజేపీ

దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రి వర్గం నుంచి కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శశిథరూర్‌ను తక్షణమే తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. శశిథరూర్ వంటి మంత్రి.. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కొనసాగడం సిగ్గు చేటు అని బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించింది.వ్యక్తిగతంగా మూడో పెళ్లి చేసుకుంటున్న శశిథరూర్, ఐపీఎల్ వంటి క్రీడా వ్యవస్థలో అవకతవకలకు పాల్పడటంపై సీబీఐ విచారణ చేపట్టాలని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ డిమాండ్ చేశారు.
Source: జాతీయ | 13 Apr 2010 | 9:34 am

నీ లవ్వూ... నీ ఇష్టం అంటున్న అల్లరి నరేష్ ఫాదర్..?!!

అల్లరి నరేష్ బాలీవుడ్ తార మంజరి ఫండిస్‌తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడట. ఈ సంగతి తన తండ్రి ఇ.వి.వి సత్యనారాయణకు చెబితే, "నీ లవ్వూ నీ ఇష్టం. నీకు నచ్చిన వారెవరో చెపితే పెళ్లి చేస్తాం అని అన్నట్లు టాలీవుడ్ సినీజనం గుసగుసలు పోతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Apr 2010 | 6:19 am

వేసవి కాలంలో ప్రత్యేక రైళ్ళుః దక్షిణ మధ్య రైల్వే

ప్రస్తుతం వేసవికాలంలో ప్రయాణీకుల రద్దీని తట్టుకునేందుకు తమ శాఖ రాష్ట్రంలో ప్రత్యేకంగా రెండు వందల రైళ్ళను ప్రవేశపెడుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది.
Source: ఏపీ న్యూస్ | 13 Apr 2010 | 6:14 am

కోటి మంది జగన్‌లు వచ్చినా తెలంగాణా ఆగదు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి "ఓదార్పు" యాత్ర తెలంగాణా ప్రాంతంలోకి ప్రవేశించిన నేపధ్యంలో తెలంగాణా నాయకులు జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కోటి మంది జగన్‌లు తెలంగాణాకు వచ్చినా ఇక్కడ సమైక్య బీజాలను నాటలేరని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షడు కేసీఆర్ అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 13 Apr 2010 | 6:14 am

అపాచీకి కేటాయించిన భూమిని తిరిగి తీసుకోండిః గాలి

తమిళనాడు సరిహద్దుల్లోనున్న నెల్లూరు జిల్లాలోని తడ ప్రాంతంలో అపాచీ బూట్ల కంపెనీకి కేటాయించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం హైదరాబాద్‌లో డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 13 Apr 2010 | 4:54 am

ఐదో విడత భూ పంపిణీకి రంగం సిద్ధం: మంత్రి ధర్మాన

అర్హులైన నిరుపేదలందరికీ భూమిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మంగళవారం స్పష్టం చేశారు. భూ పంపిణీలో భాగంగా 14వ తేదీ (బుధవారం) లక్షా ఆరువేల భూములను పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి అన్నారు. ఐదో విడత భూ పంపిణీ కార్యక్రమానికి డాక్టర్. అంబేద్కర్ పుట్టిన రోజైన బుధవారం (ఏప్రిల్ 14) ముహూర్తం ఖరారైంది.
Source: ఏపీ న్యూస్ | 13 Apr 2010 | 3:50 am

థానే జిల్లాలోని వంటనూనె కర్మాగారంలో అగ్నిప్రమాదం

థానె జిల్లా, షాపూర్ పట్టణంలోని లిబర్టీ వంటనూనె కర్మాగారంలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. కర్మాగారం నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో అందులోనున్న ఉద్యోగులు, కార్మికులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.
Source: జాతీయ | 13 Apr 2010 | 3:41 am

రాష్ట్రం నిప్పుల కొలిమి: జడుసుకుంటున్న ప్రజ

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇంకా పూర్తిస్థాయిలో వేసవి రాక మునుపే ఎండలు పేలుతుండటంతో సామాన్య మానవుడు బెంబేలెత్తుతున్నాడు. రాష్ట్రంలో ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Source: ఏపీ న్యూస్ | 13 Apr 2010 | 3:36 am