ఒసామాబిన్ లాడెన్ పాక్‌లో లేడుః యూసుఫ్ రజా గిలానీ

అమెరికా గూఢచర్య సంస్థలు చెప్పిన విధంగా ప్రపంచ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది ఒసామాబిన్ లాడెన్ పాకిస్థాన్‌లో లేడని పాక్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ వాషింగ్టన్‌లో స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 13 Apr 2010 | 9:22 am

ఐదో విడత భూ పంపిణీకి రంగం సిద్ధం: మంత్రి ధర్మాన

అర్హులైన నిరుపేదలందరికీ భూమిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మంగళవారం స్పష్టం చేశారు. భూ పంపిణీలో భాగంగా 14వ తేదీ (బుధవారం) లక్షా ఆరువేల భూములను పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి అన్నారు. ఐదో విడత భూ పంపిణీ కార్యక్రమానికి డాక్టర్. అంబేద్కర్ పుట్టిన రోజైన బుధవారం (ఏప్రిల్ 14) ముహూర్తం ఖరారైంది.
Source: Yahoo! Telugu: News | 13 Apr 2010 | 9:18 am

రాష్ట్రం నిప్పుల కొలిమి: జడుసుకుంటున్న ప్రజ

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇంకా పూర్తిస్థాయిలో వేసవి రాక మునుపే ఎండలు పేలుతుండటంతో సామాన్య మానవుడు బెంబేలెత్తుతున్నాడు. రాష్ట్రంలో ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Source: Yahoo! Telugu: News | 13 Apr 2010 | 9:04 am

యాసిడ్‌ దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలుః సబిత

మహిళలు, యువతులపై యాసిడ్‌ దాడులకు పాల్పడే దుర్మార్గులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హోంశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి చట్ట సవరణ చేయాలని కేంద్రంపై ముఖ్యమంత్రి రోశయ్య ఒత్తిడి తీసుకువస్తారన్నారు.
Source: Yahoo! Telugu: News | 13 Apr 2010 | 8:59 am

థానే జిల్లాలోని వంటనూనె కర్మాగారంలో అగ్నిప్రమాదం

థానె జిల్లా, షాపూర్ పట్టణంలోని లిబర్టీ వంటనూనె కర్మాగారంలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. కర్మాగారం నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో అందులోనున్న ఉద్యోగులు, కార్మికులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.
Source: Yahoo! Telugu: News | 13 Apr 2010 | 8:45 am

ట్రేడింగ్ క్షీణత: నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్

క్షీణించడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి తిరోగమనం దిశగా పయనిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 53 పాయింట్లు క్షీణించి, 17,799 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 20 పాయింట్లు పడిపోయి, 5,319 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 13 Apr 2010 | 8:43 am

దేశీయ ఆర్థిక వృద్ధి 8.5 శాతానికి చేరుకోవచ్చుః కౌశిక్ బసు

గత ఆర్థిక సంవత్సరం(2009-10) నాల్గవ త్రైమాసికాంతంలో దేశీయ ఆర్థిక వృద్ధి 8.5 శాతానికి చేరుకుంటుందని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు న్యూ ఢిల్లీలో మంగళవారం తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 13 Apr 2010 | 7:40 am

స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్

మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం దిశగా ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 29 పాయింట్ల స్వల్ప నష్టంతో, 17,823 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 13 పాయింట్లు క్షీణించి, 5,326 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 13 Apr 2010 | 7:39 am

అల్ ఖైదా అణ్వాయుధాలకోసం యత్నిస్తోంది: ఒబామా

అల్ ఖైదా వంటి కరడుగట్టిన తీవ్రవాద సంస్థలు అణ్వాయుధాలను పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. తీవ్రవాదుల చేతుల్లోకి అణ్వాయుధాలు వెళితే అంతర్జాతీయ సమాజానికి ముప్పు వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 13 Apr 2010 | 7:38 am

శ్రీ కృష్ణ కమిటీకి నివేదిక సమర్పించిన సీపీఎం

జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీకి సీపీఎం పార్టీ మంగళవారం తన నివేదికను సమర్పించింది. కమిటీకి నివేదికలు సమర్పించాల్సిన సమయం ఈ నెల 10వ తేదీతోనే ముగిసినా జాతీయ పార్టీ అయిన సీపీఎం కొంత ఆలస్యంగా నివేదిక ఇచ్చినా తాము స్వీకరించేందుకు సిద్ధంగానున్నామని కమిటీ సభ్యులు తెలపడంతో వారు ఈ రోజు న్యూ ఢిల్లీలో కమిటీకి తమ నివేదిక సమర్పించారు.
Source: Yahoo! Telugu: News | 13 Apr 2010 | 7:24 am

నీ లవ్వూ... నీ ఇష్టం అంటున్న అల్లరి నరేష్ ఫాదర్..?!!

అల్లరి నరేష్ బాలీవుడ్ తార మంజరి ఫండిస్‌తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడట. ఈ సంగతి తన తండ్రి ఇ.వి.వి సత్యనారాయణకు చెబితే, "నీ లవ్వూ నీ ఇష్టం. నీకు నచ్చిన వారెవరో చెపితే పెళ్లి చేస్తాం అని అన్నట్లు టాలీవుడ్ సినీజనం గుసగుసలు పోతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Apr 2010 | 6:19 am

ఐదో విడత భూ పంపిణీకి రంగం సిద్ధం: మంత్రి ధర్మాన

అర్హులైన నిరుపేదలందరికీ భూమిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మంగళవారం స్పష్టం చేశారు. భూ పంపిణీలో భాగంగా 14వ తేదీ (బుధవారం) లక్షా ఆరువేల భూములను పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి అన్నారు. ఐదో విడత భూ పంపిణీ కార్యక్రమానికి డాక్టర్. అంబేద్కర్ పుట్టిన రోజైన బుధవారం (ఏప్రిల్ 14) ముహూర్తం ఖరారైంది.
Source: ఏపీ న్యూస్ | 13 Apr 2010 | 3:50 am

థానే జిల్లాలోని వంటనూనె కర్మాగారంలో అగ్నిప్రమాదం

థానె జిల్లా, షాపూర్ పట్టణంలోని లిబర్టీ వంటనూనె కర్మాగారంలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. కర్మాగారం నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో అందులోనున్న ఉద్యోగులు, కార్మికులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.
Source: జాతీయ | 13 Apr 2010 | 3:41 am

రాష్ట్రం నిప్పుల కొలిమి: జడుసుకుంటున్న ప్రజ

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇంకా పూర్తిస్థాయిలో వేసవి రాక మునుపే ఎండలు పేలుతుండటంతో సామాన్య మానవుడు బెంబేలెత్తుతున్నాడు. రాష్ట్రంలో ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Source: ఏపీ న్యూస్ | 13 Apr 2010 | 3:36 am

యాసిడ్‌ దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలుః సబిత

మహిళలు, యువతులపై యాసిడ్‌ దాడులకు పాల్పడే దుర్మార్గులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హోంశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి చట్ట సవరణ చేయాలని కేంద్రంపై ముఖ్యమంత్రి రోశయ్య ఒత్తిడి తీసుకువస్తారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 13 Apr 2010 | 3:35 am

శ్రీ కృష్ణ కమిటీకి నివేదిక సమర్పించిన సీపీఎం

జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీకి సీపీఎం పార్టీ మంగళవారం తన నివేదికను సమర్పించింది. కమిటీకి నివేదికలు సమర్పించాల్సిన సమయం ఈ నెల 10వ తేదీతోనే ముగిసినా జాతీయ పార్టీ అయిన సీపీఎం కొంత ఆలస్యంగా నివేదిక ఇచ్చినా తాము స్వీకరించేందుకు సిద్ధంగానున్నామని కమిటీ సభ్యులు తెలపడంతో వారు ఈ రోజు న్యూ ఢిల్లీలో కమిటీకి తమ నివేదిక సమర్పించారు.
Source: జాతీయ | 13 Apr 2010 | 2:13 am

రేపు హస్తిన వెళ్ళనున్న ముఖ్యమంత్రి రోశయ్య

రాష్ట్ర ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య మూడు రోజులపాటు హస్తిన పర్యటన నిమిత్తం రేపు బయలుదేరి వెళ్ళనున్నారు. గత కొద్దికాలంగా మంత్రివర్గ విస్తరణపై వస్తున్న ఊహాగానాలకు ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 13 Apr 2010 | 1:41 am

"జగన్... గో బ్యాక్": తెలంగాణా వాదుల నినాదాలు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు ఖమ్మం జిల్లాలో అనూహ్యంగా ఎదురు గాలులు వీచాయి. స్వపక్షంలోనే రెండు గ్రూపులు ఏర్పడి యాత్రలో నానా హంగామా సృష్టించాయి. కాంగ్రెస్ బహిష్కృత నేత జలగం వెంకట్రావు వైఎస్ జగన్ ప్రసంగిస్తున్న వేదికపైకి వెళ్లడమే ఈ వివాదానికి కారణమైంది.
Source: ఏపీ న్యూస్ | 13 Apr 2010 | 1:17 am

మావోయిస్టులను హతమార్చేందుకు ప్రత్యేక "ఆపరేషన్"

దేశంలో పెట్రేగిపోతున్న మావోయిస్టులను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక "ఆపరేషన్" కార్యక్రమం నిర్విహంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుందని కేంద్ర హోం శాఖ వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 13 Apr 2010 | 12:30 am

27న భారత్ బంద్‌ : బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీలు

కేంద్రంలోని యూపీఏ సర్కారుపై ఉమ్మడి పోరు సలిపేందుకు దేశవ్యాప్తంగానున్న బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీలు ఏకమైనాయి. దీంతోపాటు ఈ నెల 27న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి
Source: జాతీయ | 12 Apr 2010 | 10:42 pm

తమిళనాడు ప్రభుత్వంపై హైకోర్టుకెళ్ళిన నళిని

భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్న నళిని క్షమాభిక్ష ప్రసాదించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని గతంలో కోరింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఓ జీవోను సవాలు చేస్తూ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.
Source: జాతీయ | 12 Apr 2010 | 10:13 pm

ఏప్రిల్ 18 నుంచి స్టెప్పులేయనున్న "కొమురం పులి"

పవన్ కల్యాణ్, నిఖిషా పటేల్ జంటగా రూపొందుతోన్న చిత్రం కొమురం పులి. ఎస్.జె.సూర్య దర్శకుడు. సింగమల రమేష్ నిర్మాత. షూటింగ్ టాకీ పూర్తయింది. ఈనెల 18 నుంచి పాటల చిత్రీకరణ జరుగనున్నది. హైదరాబాదులో వేసిన రకరకాల సెట్లో వీటిని తెరకెక్కించనున్నారు. మరోవైపు డబ్బంగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ పాత్ర విషయంలో భిన్న షేడ్స్ ఉన్న దృష్ట్యా డబ్బింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు దర్శకుడు చెపుతున్నారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. మే 14న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Apr 2010 | 10:52 am

ఏప్రిల్ 23న ఆర్య- త్రిషల "సర్వం"

తమిళ నటుడు ఆర్యతో చిత్రాలు తీసే దర్శుకుడు విష్ణువర్థన్ తాజాగా రూపొందించిన "సర్వం" చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సింహపురి టాకీస్‌పై ఎం.రఘునాథ్, ఎం.నరేంద్రలు నిర్మించారు. నరేంద్ర మాట్లాడుతూ... విష్ణువర్థన్ ఈ చిత్రాన్ని చక్కగా తీశాడు. ఆయనతో స్ట్రెయిట్ తెలుగు సినిమా తీయాలనే ఆలోచన ఉంది. సర్వం చిత్రం బాగా వచ్చింది. దేవుడు సర్వాంతర్యామి. అన్నీ తెలిసిన వాడిని సర్వాంతర్యామి అని అంటారు. మా చిత్రంలో కథ ఆ నేపధ్యంలో ఉంటుంది. జేడీ చక్రవర్తి బాగా చేశాడు. అన్ని విధాలుగా ఉన్నత విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించాం అని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Apr 2010 | 10:42 am

ఉందిలే మంచికాలం ముందూ.. ముందూన..: చిరంజీవి

'ఉందిలే మంచి కాలం ముందు.. ముందూ' అనేది పాత చిత్రంలోని మధురమైన పాట. ఈ పాటను ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి ఇపుడు పాడుతున్నారు. తమ పార్టీకి మంచి కాలం మున్ముందు ఉందని ఆయన జోస్యం చెపుతున్నారు. తనకున్న ప్రజాధారణతో ఎన్నికల్లో గెలుపొంది రాజకీయ పదవులు చేపట్టాలని వచ్చిన వారే పార్టీకి దూరమయ్యారన్నారు. అలాంటి వారు ఉన్నా పోయినా ఒకటేనన్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Apr 2010 | 10:32 am

ఏప్రిల్ 16న "సింహా" ఆడియో విజయోత్సవం

యువరత్న బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న సింహా ఆడియో ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ నేపధ్యంలో ఏప్రిల్ 16న ఆడియో విజయోత్సవం జరుపనున్నారు. ఈ ఆడియో విజయోత్సవ వివరాలను నిర్మాత పరుచూరి కిరీటి తెలియజేస్తూ.. చక్రి సంగీత సారధ్యంలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇటీవల విడుదలైన సింహా ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. ఆడియో సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ నెల 16న హైదరాబాదులోని రాక్ గార్డెన్స్‌లో సాయంత్రం 6 గంటలకు ఆడియో విజయోత్సవాన్ని జరుపనున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Apr 2010 | 10:28 am

రాష్ట్ర సాధనలో విఫలమైన రాజకీయ జేఏసీ: గద్దర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే అంతిమలక్ష్యంగా ఏర్పాటైన రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస)పై ప్రజా గాయకుడు గద్దర్ నిప్పులు చెరిగారు. లక్ష్య సాధనంలో ఇది పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన మాట వాస్తవేమన్నారు. తదనంతరం ఏర్పాటైన రాజకీయ జేఏసీ వల్ల అసలు ఉద్యమం నీరు గారిపోయిందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Apr 2010 | 10:25 am

ఇండస్ట్రీలో స్నేహితులెవరో చెప్పడం కష్ట: శంకర్

సినిమా ఇండస్ట్రీలో మిత్రులు ఎవరు..? శత్రువులు ఎవరు..? అనేది చెప్పడం చాలా కష్టమని ప్రముఖ దర్శకుడు శంకర్ అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న రోబోకు సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీలో ఇటీవల జరిగింది. ఈ సందర్భంలో మీడియాతో ఆయన పిచ్చాపాటీ మాట్లాడారు. ఇండస్ట్రీ తనకు ఎంతో అనుభవం నేర్పిందంటూ... ఇక్కడ స్నేహితులెవరో...శత్రువులెవరో చెప్పడం చాలా కష్టమన్నారు. శత్రువులున్నప్పటికీ వారెరవరూ తమ శత్రుత్వాన్ని ప్రకటించారని చెప్పారు. అదేవిధంగా కళ్లలో నవ్వు కూడా చెదరదనీ ఇండస్ట్రీ గురించి వివరించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Apr 2010 | 8:42 am

దిమ్మతిరిగి "కాజల్ అగర్వాల్" బొమ్మలాడుతాయి

టాలీవుడ్‌లో తనకు ఎదురెవరూ లేరని నిరూపించుకునేందుకు టాలీవుడ్ "మగధీర" రాణి కాజల్ అగర్వాల్ సౌత్‌స్కోప్ పత్రికకు మహా వేడి ఫోజులిచ్చింది. ఈ ఫోజులను చూస్తే కుర్రకారు దిమ్మతిరగి పోవడమే కాక వారి మనసుల్లో "కాజల్" బొమ్మలాడుతాయంటున్నారు సినీజనం.కాజల్ గ్లామర్ అప్పీల్‌ను చూసిన ఇలియానా, అనుష్క వంటి బక్కపలచని భామలు తమ తమ గ్లామర్లకు పదును పెట్టుకునే పనిలో పడ్డట్లు భోగట్టా. మొత్తమ్మీద కాజల్ అగర్వాల్ టాలీవుడ్ హీరోయిన్ల మధ్య నెంబర్‌వన్ స్థానానికి ఎదిగిపోయిందని సినీజనం అంటున్నారు. హాటుకు హాటు.... గ్లామర్‌కు గ్లామర్ ఉన్న కాజల్ ఉన్న గ్లామర్‌లో 90 శాతాన్ని చూపిస్తానంటే రేసులో ముందు ఉండక వెనక ఉంటుందా ఏమిటి..?!!
Source: Yahoo! Telugu: Entertainment | 12 Apr 2010 | 5:52 am

ప్రభుత్వ సిబ్బందికి జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ అల్టిమేటం!

తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత పది రోజులుగా విధులకు దూరంగా ఉంటూ ఆందోళన సాగిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై కొరఢా ఝుళిపించాలని జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆందోళనలో ఉన్న సిబ్బంది తక్షణం విధుల్లో చేరకుంటే సర్వీసు నుంచి తొలగిస్తామని హెచ్చరించింది.
Source: జాతీయ | 12 Apr 2010 | 5:05 am

సకాలంలోనే వైఎస్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: రోశయ్య

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులతో పాటు.. ఇతర అభివృద్ధి పనులను సకాలంలోనే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కె.రోశయ్య స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం రాజమండ్రిలోని ఆర్టీసీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Source: ఏపీ న్యూస్ | 12 Apr 2010 | 4:47 am

బీహార్‌లో గత నాలుగేళ్ళలో వంద మందికి ఉరిశిక్షలు!

గత నాలుగు సంవత్సరాల్లో బీహార్‌ రాష్ట్రంలో వంద మందికి ఉరిశిక్షలు పడ్డాయి. మరో 8143 మందికి జీవితకారాగార శిక్షలు, అలాగే, వివిధ కేసుల్లో 45467 మందిని దోషులుగా నిరూపితమయ్యారు. జైలుశిక్ష పడిన వారిలో 2661 దోషులకు పదేళ్ళకు మించి శిక్ష పడినట్టు ఆ రాష్ట్ర అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Source: జాతీయ | 12 Apr 2010 | 3:50 am