జలయజ్ఞం కాదు..! ధన యజ్ఞం కాదు.!: చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక జలయజ్ఞంపై ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞంలో అవినీతి చోటు చేసుకుంటుందని చంద్రబాబు ఆరోపించారు. అవినీతితో కూరుకుపోయిన ఈ పథకం "జలయజ్ఞం" కాదని "ధన యజ్ఞ"మని చంద్రబాబు విమర్శించారు.
Source: Yahoo! Telugu: News | 9 Apr 2010 | 9:12 am

కఠిన నిర్ణయాలు తీసుకోనున్న ఆర్‌బీఐః రంగరాజన్

దేశంలో నానాటికీ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల కారణంగా భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) కఠిన నిర్ణయాలను తీసుకోవచ్చని ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి ఛైర్మెన్ సీ. రంగరాజన్ శుక్రవారం చెన్నైలో తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 9 Apr 2010 | 9:08 am

అయేషా దెబ్బకు షోయబ్ "ఫూల్" అయ్యాడు: సౌదీ అబ్బాయిలు

అయేషా సిద్దిఖీ తన తీయనైన కంఠస్వరంతో అబ్బాయిల్ని బుట్టలో వేసుకునే నెరజాణ అని సౌదీకి చెందిన ఇద్దరు వ్యక్తులు తెలిపారు. 1998 ప్రాంతంలో అయేషా సిద్ధిఖీ తమను ఫోను ద్వారా కవ్వించి తన బుట్టలో వేసుకుందని వారు చెపుతున్నారు. ఆమె వాయిస్ విని ఎంతో అందగత్తె అని భ్రమించి బోల్తా కొట్టామని చెప్పుకొచ్చారు.
Source: Yahoo! Telugu: News | 9 Apr 2010 | 8:52 am

లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి

దేశీయ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఊపందుకున్న బాంబే స్టాక్ మార్కెట్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 224 పాయింట్ల మేర లాభపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 67 పాయింట్లు బలపడి, 5,371 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 9 Apr 2010 | 8:34 am

పెద్దమనుషుల ఒప్పందం: అయేషాకు రూ.15 కోట్లు..?!!

"గాడ్ మేక్ ఏ మ్యాన్.. మ్యాన్ మేక్ మనీ... మనీ మేక్ ఎవ్రీథింగ్" ఇది ఆంగ్ల సామెత. సువిశాలమైన భూగోళంలో "డబ్బు" చేయలేని పనంటూ ఏదీ లేదని మరోమారు నిరూపితమైంది. ఇందుకు తాజా ఉదాహరణే.. వివాదాస్పద సానియా మీర్జా-షోయబ్ మాలిక్ వివాహ వ్యవహారం.
Source: Yahoo! Telugu: News | 9 Apr 2010 | 8:16 am

బాంబే స్టాక్ మార్కెట్: 240 పాయింట్ల సెన్సెక్స్ వృద్ధి!

శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్‌కు అన్ని విధాలా కలిసొచ్చింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలతో ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 240 పాయింట్లు వృద్ధి చెందింది. దీంతో సెన్సెక్స్ సూచీ 17,954 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 67 పాయింట్లు బలపడి, 5,372 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 9 Apr 2010 | 8:09 am

బీహార్‌లో ఇద్దరిని హతమార్చిన మావోయిస్టులు

బీహార్‌ రాష్ట్రంలోని రోహతమ్ జిల్లాలోనున్న కోనార్‌ఖుర్ద్‌లో రైతు దాదన్ సింగ్‌తోపాటు అతని కుమారుడైన బిషంభర్ సింగ్‌లను మావోయిస్టులు గురువారం రాత్రి హతమార్చినట్లు పోలీసు ఉన్నతాధికారి ఆర్‌కే మల్ శుక్రవారం తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 9 Apr 2010 | 8:03 am

మరో 4 ఆసుపత్రులను ప్రారంభించనున్న మ్యాక్స్

వచ్చే ఆర్థిక సంవత్సరం జూన్-సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో తమ సంస్థ మరో నాలుగు ఆరోగ్య సేవలను అందించేందుకు హెల్త్ కేర్ ఆసుపత్రులను ప్రారంభించనుందని హెల్త్‌కేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పర్వేజ్ అహ్మద్ శుక్రవారం న్యూ ఢిల్లీలో తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 9 Apr 2010 | 7:39 am

గోల చేయడానికి ఎవరో ఒకరు తీరిగ్గా ఉండాలిగా..!!

హైదరాబాద్‌లో పుట్టి, అమెరికాలో పెరిగి, చెన్నైలో మోడలింగ్ చేసి తిరిగి హైదరాబాద్‌లో హీరోయిన్‌గా మారిన అమ్మాయి ప్రియా ఆనంద్. లీడర్ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. జర్నలిస్టుగా పాత్ర వేసి శభాష్ అనిపించుకుంది. తొలి చిత్రమైనప్పటికీ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది. లీడర్ రిలీజ్ కాక ముందే మరో రెండు చిత్రాల్లో నటించే అవకాశాలు రావడం ప్రియకే సాధ్యమైంది. ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం...లీడర్‌లో అవకాశమెలా వచ్చింది...?మా నాన్నగారిది హైదరాబాద్. అమ్మగారిది చెన్నై. పెరిగింది.. చదివింది మాత్రం అమెరికాలో. అనంతరం చెన్నై వచ్చి మోడలింగ్ చేశాను. అప్పుడే "వామనన్" అనే తమిళ చిత్రంలో జై సరసన నటించే అవకాశం వచ్చింది. నా ఫోటోలను ఇంటర్నెట్‌లో చూసి లీడర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు శేఖర్ కమ్ములకు చూపించారు. రత్నప్రభ అనే పాత్రకు నేనైతే సరిపోతానని అన్నారట.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2010 | 7:30 am

వృద్ధి సాధించనున్న వాహన అమ్మకాలుః ఎస్ఐఏఎమ్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ వాహన అమ్మకాల్లో 10-15 శాతం వృద్ధి చెందనుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(ఎస్ఐఏఎమ్) శుక్రవారం న్యూ ఢిల్లీలో ఓ ప్రకటన విడుదల చేసింది.
Source: Yahoo! Telugu: News | 9 Apr 2010 | 7:14 am

మదర్‌థెరిస్సా పురస్కారాన్ని అందుకోనున్న బీహార్ గవర్నర్

మదర్‌థెరిస్సా పురస్కారాన్ని బీహార్ గవర్నర్ శనివారం కోలకతాలో అందుకోనున్నారు. సంఘసేవకురాలు మదర్‌థెరిస్సా జీవితకాల సాఫల్య పురస్కారానికి బీహార్ గవర్నర్ ఎంపికైనట్లు బీహార్ రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 9 Apr 2010 | 7:05 am

"రంగా ది దొంగా" షూటింగ్‌‌లో గాయపడ్డ హీరో శ్రీకాంత్

ప్రముఖ సినీ నటుడు హీరో శ్రీకాంత్ శుక్రవారం ఉదయం షూటింగ్‌లో గాయపడ్డాడు. "రంగా ది దొంగ" సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో పాల్గొన్న హీరో శ్రీకాంత్ బైక్‌‍పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో ఆయన కాళ్ళకు, చేతులకు గాయాలైనాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2010 | 4:27 am

జలయజ్ఞం కాదు..! ధన యజ్ఞం కాదు.!: చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక జలయజ్ఞంపై ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞంలో అవినీతి చోటు చేసుకుంటుందని చంద్రబాబు ఆరోపించారు. అవినీతితో కూరుకుపోయిన ఈ పథకం "జలయజ్ఞం" కాదని "ధన యజ్ఞ"మని చంద్రబాబు విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 9 Apr 2010 | 3:43 am

పెద్దమనుషుల ఒప్పందం: అయేషాకు రూ.15 కోట్లు..?!!

"గాడ్ మేక్ ఏ మ్యాన్.. మ్యాన్ మేక్ మనీ... మనీ మేక్ ఎవ్రీథింగ్" ఇది ఆంగ్ల సామెత. సువిశాలమైన భూగోళంలో "డబ్బు" చేయలేని పనంటూ ఏదీ లేదని మరోమారు నిరూపితమైంది. ఇందుకు తాజా ఉదాహరణే.. వివాదాస్పద సానియా మీర్జా-షోయబ్ మాలిక్ వివాహ వ్యవహారం.
Source: ఏపీ న్యూస్ | 9 Apr 2010 | 2:50 am

బీహార్‌లో ఇద్దరిని హతమార్చిన మావోయిస్టులు

బీహార్‌ రాష్ట్రంలోని రోహతమ్ జిల్లాలోనున్న కోనార్‌ఖుర్ద్‌లో రైతు దాదన్ సింగ్‌తోపాటు అతని కుమారుడైన బిషంభర్ సింగ్‌లను మావోయిస్టులు గురువారం రాత్రి హతమార్చినట్లు పోలీసు ఉన్నతాధికారి ఆర్‌కే మల్ శుక్రవారం తెలిపారు.
Source: జాతీయ | 9 Apr 2010 | 2:36 am

దంతెవాడ దాడులకు బాధ్యత వహిస్తూ చిదంబరం రాజీనామా..?!

దంతెవాడలో ఇటీవల జరిగిన దాడులకు తానే బాధ్యుడినని కేంద్ర హోం శాఖామంత్రి పి. చిదంబరం అన్నారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం. తన అభిప్రాయాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలకు తెలిపినట్లు సమాచారం.
Source: జాతీయ | 9 Apr 2010 | 2:36 am

పాస్‌పోర్ట్ కాపీ లేకుండా సానియా వివాహం కుదరదు..!

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్-భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాల వివాహానికి కొత్త చిక్కొచ్చి పడింది. షోయబ్ మాలిక్ పాస్‌పోర్ట్ కాపీ లేకుండా సానియాతో అతని వివాహం కుదరని ఖాజీ నజ్రూల్ ఇస్లామ్ (ఖాజీ) స్పష్టం చేసింది. ఇంకా ఇతర దేశానికి చెందిన పౌరుడు వేరే స్వదేశానికి చెందిన అమ్మాయిని నిఖా చేసుకోవాలంటే పాస్‌పోర్ట్ కాపీ తప్పకుండా ఉండాల్సిందేనని ఖాజీ ఎత్తి చూపింది.
Source: ఏపీ న్యూస్ | 9 Apr 2010 | 1:46 am

మదర్‌థెరిస్సా పురస్కారాన్ని అందుకోనున్న బీహార్ గవర్నర్

మదర్‌థెరిస్సా పురస్కారాన్ని బీహార్ గవర్నర్ శనివారం కోలకతాలో అందుకోనున్నారు. సంఘసేవకురాలు మదర్‌థెరిస్సా జీవితకాల సాఫల్య పురస్కారానికి బీహార్ గవర్నర్ ఎంపికైనట్లు బీహార్ రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 9 Apr 2010 | 1:36 am

పాతబస్తీలో కర్ఫ్యూ ఎత్తివేసే యోచనలో పోలీసులు!

కర్ఫ్యూ నీడలో ఉన్న పాతబస్తీలో అల్లర్లు అదుపులోకి వచ్చాయి. దీంతో శుక్రవారం ప్రార్థనల తర్వాత పాతబస్తీలో కర్ఫ్యూను ఎత్తివేసే యోచనలో పోలీసులు ఉన్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. శుక్రవారం పాతబస్తీలోని మసీదుల్లో జరిగే ప్రత్యేక ప్రార్ధనలకు పోలీసులు అప్రమత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మసీదుల వద్ద పోలీసుల బలగాలను మోహరించారు.
Source: ఏపీ న్యూస్ | 9 Apr 2010 | 1:00 am

మార్కెట్ యార్డ్‌లో అగ్నిప్రమాదం: బూడిదైన పత్తి!

కరీంనగర్ జిల్లా చొప్పదండి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నిల్వవుంచిన క్వింటాళ్ళకొద్ది పత్తి అగ్నికి ఆహుతైనట్లు అధికారులు తెలిపారు. దీంతో దాదాపు 75 లక్షల రూపాయల విలువ కలిగిన పత్తి దగ్దమైందని వారు పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Apr 2010 | 12:55 am

ధరలను అదుపు చేసేందుకు మూడు కమిటీలుః ప్రధాని

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేసేందుకు మూడు వర్కింగ్‌ కమిటీలను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ గురువారం ఏర్పాటు చేశారు. ఈ మూడు కమిటీలో వచ్చే రెండు నెలల్లో సూచనలు చేయాల్సివుంటుంది.
Source: జాతీయ | 8 Apr 2010 | 10:18 pm

మావోలను ఎదుర్కొనేందుకు మానవ రహిత విమానాలు

మావోయిస్టులను ఎదుర్కొనేందుకు మానవ రహిత విమానాలను (యూఏవీ) ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. మావోల సమాచారాన్ని సేకరించడం కోసం యూఏవీలను ఉపయోగించాలన్న ప్రతిపాదన చాలా కాలంగానే ఉందని అధికారులు తెలిపారు.
Source: జాతీయ | 8 Apr 2010 | 9:58 pm

కత్రినా బ్యాగులో సల్మాన్ ఖాన్ ఫోటో దర్శనం

ఇపుడంతా లవ్ స్టోరీలు సుఖాంతమయ్యే కాలం నడుస్తున్నట్లుగా కనబడుతోంది. ప్రేమ పేరుతో పెనవేసుకున్న జంటలు పెళ్లితో ఒకటయ్యే రోజులు ఈ 2010లోనే ఉన్నట్లు కనబడుతోంది. అసలు సంగతి చెప్పకుండా ఏంటీ డొంక తిరుగుడు అంటారా...? మరేం లేదండీ, సల్మాన్ ఖాన్ పేరు చెబితేనే తప్పించుక తిరిగే కత్రినా కైఫ్ తన బ్యాగులో అతని ఫోటో పెట్టుక తిరుగుతోందట. ఆ విషయాన్ని గమనించిన ఓ తుంటరి విలేకరి... సల్మాన్‌ను మీరు మరిచిపోయినట్లు లేరే...? అనడిగితే, డొంక తిరుగుడు సమాధానం చెప్పిందట. "మీకిష్టమైన నటీనటులు ఫోటోలు మీరు పెట్టుకోరూ... మీరు బాగా ఇష్టపడే ఎవరైనా హీరోయిన్ ఫోటోను మీ పర్సులో పెట్టుకుని తిరుగుతుంటే, దాన్ని ఏమనాలి..? ఇష్టమైనవారి ఫోటోలు బ్యాగుల్లోనే కాదు, గదుల్లో కూడా ఉంటాయ"ని షాకింగ్ న్యూస్ చెప్పిందట.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Apr 2010 | 1:02 pm

ఐష్‌తో పోలికలు ఇబ్బందిగా ఉంది: స్నేహా ఉల్లాల్

ఐశ్వర్యారాయ్ పోలికలు కలిగి ఉన్న సెక్సీ భామ స్నేహా ఉల్లాల్. "ఉల్లాసంగా.. ఉత్సాహంగా..", నేను మీకు తెలుసా..?, "కరెంట్"తోపాటు "సింహా"లోనూ నటించింది. "వరుడు" ఓపెనింగ్ షాట్ ఆమెపైనే తీశారు. సినీ కెరీర్ ఎలా ఉందని ప్రశ్నిస్తే.. ఇలా చెప్పుకొచ్చింది. "నాకు సినిమా విజయాలే ముఖ్యం. పారితోషికం ప్రధానం కాదు. వరుడు నేను పోషించిన పాత్రను చూస్తే మీకది అర్థమవుతుంది" అంది. బాలీవుడ్‌లో తనకు సరైన గైడెన్స్ లేదనీ, ఐష్‌తో పోలికలు తీసుకురావడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెబుతోంది. తెలుగులోనే మంచివారున్నారనీ, ఇక్కడే తనకు చాలా బావుందని చెపుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Apr 2010 | 10:26 am

పెళ్లి వాయిదా వేసుకోమన్న సానియా మీర్జా తల్లి..?!!

అయేషా సిద్ధిఖీ రంగప్రవేశంతో సానియా - షోయబ్‌ల పెళ్లి వ్యవహారం సంచలనం సృష్టించింది. అయేషాను ఎలాగైనా వదిలించుకోవాలని షోయబ్ మాలిక్ గంటకో అబద్ధం ఆడాడు. కానీ చివరికి నిజం విజయం సాధించింది. ఈ నిజాన్ని తెలుసుకున్న సానియా కుటుంబం ఖిన్నులైనట్లు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 8 Apr 2010 | 9:35 am

తెరాస నివేదిక చూస్తే "శ్రీకృష్ణ" విస్తు పోతుంది: లగడపాటి

ప్రత్యేక తెలంగాణాను ఆకాంక్షిస్తూ తెలంగాణా రాష్ట్ర సమితి శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన నివేదిక అబద్ధాల పుట్ట అని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విమర్శించారు. 1956 నవంబరు 1కి ముందు రాష్ట్రం ఎలా ఉందో... అలాంటి రాష్ట్రం తమకు కావాలని నివేదికలో కోరడాన్ని చూస్తుంటే తెరాస ఎంత తెలివితక్కువ ఆలోచన చేస్తుందో అర్థమవుతుందన్నారు
Source: ఏపీ న్యూస్ | 8 Apr 2010 | 8:53 am

మండుతున్న ఎండలు.. విద్యుత్‌కోతతో ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి

ప్రస్తుతం దేశం మొత్తంమీద ఎండాకాలం కావడంతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన ఎండలు మండిపోతున్నాయి. పైగా అప్రకటితంగా విద్యుత్ కోత కొనసాగుతుండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
Source: జాతీయ | 8 Apr 2010 | 8:01 am

ఆయుధాలు ఎక్కడ లభిస్తున్నాయో తెలుసా!: చిదంబరం

మావోయిస్టులకు విలువైన ఆయుధాలు దేశ తూర్పు సరిహద్దుల్లో లభిస్తున్నాయని కేంద్ర హోం శాఖామంత్రి పి. చిదంబరం న్యూ ఢిల్లీలో గురువారం మీడియాకు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం సీఆర్పీఎఫ్ దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకరపోరు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Source: జాతీయ | 8 Apr 2010 | 6:43 am

రెండు ప్రాంతాలూ రెండు కళ్లంటే... రెండు రాష్ట్రాలనా అర్థం..?!!

ఇదే అనుమానం కలుగుతోంది తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే. శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణా ప్రాంత తెలుగుదేశం నాయకుల తరపున 15 అధ్యాయాలతో 234 పేజీలతో కూడుకున్న నివేదిక సమర్పించిన అనంతరం నాగం మీడియాతో మాట్లాడారు.
Source: ఏపీ న్యూస్ | 8 Apr 2010 | 5:41 am

పూణే పేలుళ్లు: కీలక సూత్రధారిని గుర్తించిన ఏటీఎస్!

పూణేలో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిని మహారాష్ట్ర పోలీసు శాఖ తీవ్రవాద విభాగం ఏటీఎస్ గుర్తించింది. ఇండియన్ ముజాహిద్ధీన్ తీవ్రవాద సంస్థకు చెందిన యాసిన్.. పూణే పేలుళ్లలో ప్రధాన సూత్రధారి అని లభించిన ఆధారాలకు అనుగుణంగా కనుగొన్నట్లు ఏటీఎస్ తెలిపింది.
Source: జాతీయ | 8 Apr 2010 | 5:23 am

"వరుడు"కి పుట్టినరోజు శుభాకాంక్షలు!

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, మెగాస్టార్, పీఆర్పీ అధినేత చిరంజీవి మేనల్లుడు "వరుడు" (అల్లు అర్జున్)‌కి నేడు (ఏప్రిల్ 8) పుట్టినరోజు. తెలుగు సినీరంగంలో యూత్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో కట్టిపడేసే అల్లు అర్జున్..‌ "గంగోత్రి" చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం అల్లుఅర్జున్ వేదం, బద్రీనాథ్ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటున్నాయి. బన్ని పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ పర్సనల్ టచ్ మీకోసం.. అసలు పేరు: అల్లు అర్జున్ పుట్టిన తేదీ: ఏప్రిల్ 8, 1983, జన్మస్థలం: చెన్నై,తొలి సినిమా: ఆర్య,అవార్డులు: సంతోషం రెండు, నంది ఒకటి.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Apr 2010 | 5:22 am

ఒరిస్సా ముఖ్యమంత్రికి మావోయిస్టుల హెచ్చరిక!

ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు మావోయిస్టులు ఇ - మెయిల్ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిపిన దాడుల తరహాలో ఒరిస్సాలోనూ విధ్వంసం సృష్టిస్తామని మావోయిస్టులు ఈ ఇ-మెయిల్‌లో హెచ్చరించినట్లు సమాచారం.
Source: జాతీయ | 8 Apr 2010 | 5:17 am

ఐష్‌తో పోలికలు ఇబ్బందిగా ఉంది: స్నేహా ఉల్లాల్

ఐశ్వర్యారాయ్ పోలికలు కలిగి ఉన్న సెక్సీ భామ స్నేహా ఉల్లాల్. "ఉల్లాసంగా.. ఉత్సాహంగా..", నేను మీకు తెలుసా..?, "కరెంట్"తోపాటు "సింహా"లోనూ నటించింది. "వరుడు" ఓపెనింగ్ షాట్ ఆమెపైనే తీశారు. సినీ కెరీర్ ఎలా ఉందని ప్రశ్నిస్తే.. ఇలా చెప్పుకొచ్చింది. "నాకు సినిమా విజయాలే ముఖ్యం. పారితోషికం ప్రధానం కాదు. వరుడు నేను పోషించిన పాత్రను చూస్తే మీకది అర్థమవుతుంది" అంది.
Source: వినోదం | 8 Apr 2010 | 4:57 am

మాకు 60 వేల నివేదికలు అందాయి: వీకే దుగ్గల్

తమ కమిటీకి ఇప్పటి వరకు దాదాపు అరవై వేల నివేదికలు అందాయని జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ కార్యదర్శి వీకే దుగ్గల్ గురువారం న్యూ ఢిల్లీలో మీడియాకు తెలిపారు.
Source: జాతీయ | 8 Apr 2010 | 4:44 am

హోంమంత్రి చిదంబరం అసమర్థుడుః గాలి ముద్దుకృష్ణమ

కేంద్ర హోం శాఖామంత్రి చిదంబరం ఓ అవినీతిపరుడు, అసమర్ధుడని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు గురువారం హైదరాబాద్‌‍లో మీడియాతో అన్నారు. అవినీతి, అసమర్థత కలిగిన వ్యక్తి దేశానికి హోం మంత్రిగా వ్యవహరించడం అసమంజసమని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 8 Apr 2010 | 4:19 am