వేగంగా పెరిగి 17.7 శాతానికి చేరుకున్న ఆహార ద్రవ్యోల్బణం

మార్చి 27తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం వేగంగా పెరిగి 17.70 శాతానికి చేరుకుంది. దేశంలో పాలు, పండ్లు, పప్పుదినుసుల ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం వేగంగా పెరిగిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది
Source: Yahoo! Telugu: News | 8 Apr 2010 | 9:22 am

స్టాక్ మార్కెట్: 205 పాయింట్ల సెన్సెక్స్ పతనం

గురువారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 205 పాయింట్లు క్షీణించింది. దీంతో బుధవారం 18వేల మార్కును తాకిన సెన్సెక్స్ సూచీ, 17,764 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 56 పాయింట్లు పడిపోయి, 5,317 పాయింట్ల మార్కును తాకింది.
Source: Yahoo! Telugu: News | 8 Apr 2010 | 9:15 am

పూణే పేలుళ్లు: కీలక సూత్రధారిని గుర్తించిన ఏటీఎస్!

పూణేలో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిని మహారాష్ట్ర పోలీసు శాఖ తీవ్రవాద విభాగం ఏటీఎస్ గుర్తించింది. ఇండియన్ ముజాహిద్ధీన్ తీవ్రవాద సంస్థకు చెందిన యాసిన్.. పూణే పేలుళ్లలో ప్రధాన సూత్రధారి అని లభించిన ఆధారాలకు అనుగుణంగా కనుగొన్నట్లు ఏటీఎస్ తెలిపింది. ఇంకా ఇండియన్ ముజూహిద్ధీన్ తీవ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు రియాజ్ భట్కల్‌కు యాసిన్ దగ్గరి బంధువని ఏటీఎస్ వర్గాల సమాచారం.
Source: Yahoo! Telugu: News | 8 Apr 2010 | 8:46 am

నష్టాల్లోనే స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల పతనం

గురువారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం దిశగా ర్యాలీని కొనసాగిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, 149 పాయింట్లు క్షీణించి, 17,820 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 44 పాయింట్లు పడిపోయి, 5,330 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 8 Apr 2010 | 8:19 am

సానియాకిచ్చిన భూమిని వాపసు తీసుకుంటాం: కోమటిరెడ్డి

వివాదాల పుట్టలో కూరుకుపోతున్న భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియాకు మరో ఎదురు దెబ్బ తగలనుంది. పాక్ జాతీయుడిని పెళ్ళాడి ఏ పాకిస్థానో, దుబాయో వెళ్ళిపోతే ఆమెకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూమిని తిరిగి వాపసు తీసుకుంటామని రాష్ట్ర క్రీడల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
Source: Yahoo! Telugu: News | 8 Apr 2010 | 8:06 am

సానియా "బోర్న్‌వీటా" బ్రాండ్ అంబాసిడర్ చల్‌గయా

సంచలనాలకు మారుపేరైన భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పాకిస్థాన్ వివాదాస్పద క్రికెట్ ఆటగాడు షోయబ్‌తో వివాహం చేసుకుంటుండగా బోర్న్‌వీటా కంపెనీ సానియాతో యాడ్ పునరుద్ధరణకు ససేమిరా అంటోంది.
Source: Yahoo! Telugu: News | 8 Apr 2010 | 7:44 am

భారీ నష్టాల వైపు బాంబే స్టాక్ మార్కెట్ పయనం

గురువారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం దిశగా ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 114 పాయింట్లు క్షీణించింది. దీంతో సెన్సెక్స్ సూచీ 17,855 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. ఇదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 32 పాయింట్లు పడిపోయి, 5,341 పాయింట్ల మార్కును తాకింది.
Source: Yahoo! Telugu: News | 8 Apr 2010 | 7:15 am

డిజిటల్ టీవీ రికార్డరును విడుదల చేసిన ఎయిర్‌టెల్

తాము మార్కెట్లో విడుదల చేసిన డిజిటల్ టీవీ రికార్డరుతో టీవీల్లో వచ్చే పలు షోలను రికార్డు చేసుకునే సౌకర్యం కలుగుతుందని, వీటిని వినియోగదారులు తమ మొబైల్‌ఫోన్ల ద్వారా కూడా రికార్డు చేసుకోవచ్చని భారతీ ఎయిర్‌టెల్, డీటీహెచ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్‌పురీ మీడియాకు తెలిపారు
Source: Yahoo! Telugu: News | 8 Apr 2010 | 7:07 am

రాజు ఆరోగ్యంపై 2 వారాల్లో నివేదిక ఇవ్వండి: నాంపల్లి కోర్టు

సత్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, ఆ కంపెనీ మాజీ ఛైర్మన్ రామలింగరాజు ఆరోగ్య పరిస్థితిపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రామలింగరాజుకు చికిత్స ఇస్తున్న నిమ్స్ వైద్యులు ఇంకా రెండు వారాల్లో ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నివేదిక ద్వారా సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
Source: Yahoo! Telugu: News | 8 Apr 2010 | 7:04 am

మద్యం విక్రయాల్లో రికార్డు సృష్టించిన విజయ్‌మాల్యా

దేశీయ మద్యం వ్యాపారంలో అగ్రగామిగానున్న విజయ్‌మాల్యాకు చెందిన యూఎస్ఎల్ మద్యం కంపెనీ కేవలం 12 నెలల్లోనే పది కోట్ల మద్యం బాక్సులను అమ్మి ప్రపంచంలోనే రికార్డు సృష్టించి రెండవ స్థానానికి చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 8 Apr 2010 | 6:52 am

"వరుడు"కి పుట్టినరోజు శుభాకాంక్షలు!

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, మెగాస్టార్, పీఆర్పీ అధినేత చిరంజీవి మేనల్లుడు "వరుడు" (అల్లు అర్జున్)‌కి నేడు (ఏప్రిల్ 8) పుట్టినరోజు. తెలుగు సినీరంగంలో యూత్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో కట్టిపడేసే అల్లు అర్జున్..‌ "గంగోత్రి" చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం అల్లుఅర్జున్ వేదం, బద్రీనాథ్ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటున్నాయి. బన్ని పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ పర్సనల్ టచ్ మీకోసం.. అసలు పేరు: అల్లు అర్జున్ పుట్టిన తేదీ: ఏప్రిల్ 8, 1983, జన్మస్థలం: చెన్నై,తొలి సినిమా: ఆర్య,అవార్డులు: సంతోషం రెండు, నంది ఒకటి.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Apr 2010 | 5:22 am

పూణే పేలుళ్లు: కీలక సూత్రధారిని గుర్తించిన ఏటీఎస్!

పూణేలో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిని మహారాష్ట్ర పోలీసు శాఖ తీవ్రవాద విభాగం ఏటీఎస్ గుర్తించింది. ఇండియన్ ముజాహిద్ధీన్ తీవ్రవాద సంస్థకు చెందిన యాసిన్.. పూణే పేలుళ్లలో ప్రధాన సూత్రధారి అని లభించిన ఆధారాలకు అనుగుణంగా కనుగొన్నట్లు ఏటీఎస్ తెలిపింది. ఇంకా ఇండియన్ ముజూహిద్ధీన్ తీవ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు రియాజ్ భట్కల్‌కు యాసిన్ దగ్గరి బంధువని ఏటీఎస్ వర్గాల సమాచారం.
Source: జాతీయ | 8 Apr 2010 | 3:16 am

సానియాకిచ్చిన భూమిని వాపసు తీసుకుంటాం: కోమటిరెడ్డి

వివాదాల పుట్టలో కూరుకుపోతున్న భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియాకు మరో ఎదురు దెబ్బ తగలనుంది. పాక్ జాతీయుడిని పెళ్ళాడి ఏ పాకిస్థానో, దుబాయో వెళ్ళిపోతే ఆమెకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూమిని తిరిగి వాపసు తీసుకుంటామని రాష్ట్ర క్రీడల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Apr 2010 | 2:38 am

రాజు ఆరోగ్యంపై 2 వారాల్లో నివేదిక ఇవ్వండి: నాంపల్లి కోర్టు

సత్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, ఆ కంపెనీ మాజీ ఛైర్మన్ రామలింగరాజు ఆరోగ్య పరిస్థితిపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రామలింగరాజుకు చికిత్స ఇస్తున్న నిమ్స్ వైద్యులు ఇంకా రెండు వారాల్లో ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నివేదిక ద్వారా సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
Source: ఏపీ న్యూస్ | 8 Apr 2010 | 1:38 am

ఒరిస్సా ముఖ్యమంత్రికి మావోయిస్టుల హెచ్చరిక!

ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో మావోయిస్టుల దుశ్చర్యలు రోజు రోజుకి పెచ్చరిల్లిపోతున్న సంగతి తెలిసిందే. మంగళవారం దంతెవాడలో జరిగిన ఎదురుకాల్పుల్లో 70కి పైగా జవాన్లు మృతి చెందిన సంగతి విదితమే. కాగా.. మావోయిస్టుల ఆగడాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.
Source: జాతీయ | 8 Apr 2010 | 1:17 am

ఢిల్లీలో మండుతున్న ఎండలు పైగా విద్యుత్‌కోత

ప్రస్తుతం దేశం మొత్తంమీద ఎండాకాలం కావడంతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన ఎండలు మండిపోతున్నాయి. పైగా అప్రకటితంగా విద్యుత్ కోత కొనసాగుతుండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
Source: జాతీయ | 8 Apr 2010 | 12:36 am

నేడు కొన్ని ప్రాంతాల్లోనే కర్ఫ్యూ కొనసాగుతుంది: ఏకే ఖాన్

పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లోనే గురువారం కర్ఫూ కొనసాగుతుందని నగర పోలీసు కమీషనరు ఏకే ఖాన్ ఈ రోజు మీడియాకు వెల్లడించారు. పాతబస్తీలో మతకలహాలు జరిగిన ప్రాంతాల్లోని మొఘల్‌పూర్, చాంద్రాయణగుట్ట, శాలిబండ, ఛత్రీనాక పోలీసు స్టేషన్ల పరిధిలో మాత్రమే కర్ఫ్యూ కొనసాగుతుందని ఆయన అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Apr 2010 | 10:51 pm

నేడు ధరల నియంత్రణపై సీఎంలతో సమీక్షించనున్న ప్రధాని

దేశంలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరల నియంత్రణపై సమీక్షించేందుకు గురువారం పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
Source: జాతీయ | 7 Apr 2010 | 9:46 pm

సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌పై మరోసారి దాడులకు పాల్పడ్డ నక్సల్స్

చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో మరోసారి మావోయిస్టులు బుధవారం రాత్రి మెరుపుదాడికి పాల్పడ్డారు. పోలంపల్లి సీఆర్పీఎఫ్‌ బేస్‌ క్యాంప్‌పై విరుచుకు పడినట్లు తెలిసింది. దానికి ధీటుగా సీఆర్పీఎఫ్‌ దళాలు ఎదురుకాల్పులకు దిగినట్లు సమాచారం.
Source: జాతీయ | 7 Apr 2010 | 9:36 pm

తిరుపతిలో రంభ - ఇంద్రుల వివాహ మహోత్సవం

దక్షిణాది వెండితెరపై గ్లామర్ పంట పండించిన తార రంభ. ఈ నటీమణి వివాహం గురువారం... అంటే ఏప్రిల్ 8న తిరుపతిలో జరుగనుంది. కెనడా వ్యాపారవేత్త ఇందిరన్‌తో వివాహ నిశ్చితార్థం జనవరి 27న జరిగిన సంగతి విదితమే. ఈ వివాహానికి రంభ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని తెలిసింది. ఇక సినిమా స్నేహితులతోపాటు ఇతర ప్రముఖులు ఏప్రిల్ 11న చెన్నైలో జరిగే రిసెప్షన్ కార్యక్రామానికి ఆహ్వానించాలని రంభ నిర్ణయించుకున్నట్లు సమాచారం. వివాహమైన తర్వాత కూడా సినిమాల్లో నటించాలని రంభ అనుకుంటోంది. అయితే అర్థవంతమైన పాత్రలను మాత్రమే అంగీకరిస్తానని చెపుతోంది. సినిమాల్లో నటించడం బోర్ ఫీలైనప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పేసి భర్త చేస్తున్న వ్యాపారంలో పాలుపంచుకుంటానంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2010 | 2:17 pm

నగ్నంగా డ్యాన్స్ చేశానా.. హ..హ్హ...హ్హ: షారుక్

ఐపీఎల్ మ్యాచ్‌లో తన జట్టు పంజాబ్ జట్టుపై విజయం సాధిస్తే తాను నగ్నంగా డ్యాన్స్ చేస్తానని చెప్పినట్లు ఓ పత్రిక రాయడాన్ని షారుక్ ఖాన్ జోక్‌గా తీసుకున్నాడు. ఇటువంటి పిచ్చి రాతలను చూసినప్పుడు పగలబడి నవ్వుకుంటానని చెప్పాడు. అయినా ఇటువంటి రాతలు రాసేవారికి ఆ వార్త వల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరుతుందో తనకైతే తెలియదని అన్నాడు. కనీసం ఇకముందైనా ఇలాంటి చెత్త రాతలు రాయకుండా ఉండేందుకు వారు ప్రయత్నించాలన్నాడు. ఒకవేళ హాస్యానికి ఏదైనా ఒక మాటంటే దానికి చిలవలు పలవులు సృష్టించి ఏదేదో రాసేయడం నేడు అలవాటుగా మారిపోయిందని అన్నాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2010 | 1:10 pm

నాకు తమిళమంటేనే ఇష్టం: రామనారాయణ

ఎవరైనా ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంతం గురించి ఇష్టమున్నా లేకపోయినా గొప్పగా చెపుతారు.. చెప్పాలి కూడా... అది రూలు!! కానీ తమిళ నిర్మాత రామనారాయణ అందుకు విరుద్ధంగా వ్యాఖ్యానించడంతో కాస్త గందరగోళమైంది. తాను తమిళంలో నిర్మించిన ఓ చిత్రాన్ని తెలుగులో "కారా మజాకా" పేరుతో అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం హైదరాబాద్ వచ్చారు. "దేశంలో దాదాపు అన్ని భాషల్లోనూ కలిసి 120 సినిమాలు చేశాను. తెలుగులో చిరంజీవి నటించిన పున్నమినాగు సినిమా కథ నేనే ఇచ్చాను. అలాగే నాగబాల సినిమా కూడా తీశాను. ఎన్ని భాషల్లో తీసినా తమిళమంటే నాకు ఇష్టమ"ని దర్శక నిర్మాత రామనారాయణ అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2010 | 11:37 am

హైస్కూల్ అయిపోయింది.. ఇప్పుడు నైన్త్ క్లాస్ మొదలైంది

టీనేజ్‌లో అడుగిడిన విద్యార్థుల ఆలోచనా సరళి ఏవిధంగా ఉంటుంది. పరస్పరం ఏవిధంగా ఆకర్షితులవుతారు అనే కాన్సెప్ట్‌తో మానస ఆర్ట్ మూవీస్ ద్వితీయ చిత్రాన్ని నైన్త్ క్లాస్ కేరాఫ్ ఏలేశ్వరం పేరుతో నిర్మిస్తోంది. ప్రణయ్, మనీషా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. గత ఏడాది తొమ్మిదవ తేదీన ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. తొలి షెడ్యూల్ వైజాగ్, గాజువాక, సబ్బవరంలో జరిపామనీ, దాదాపు 30 శాతం టాకీ పూర్తి చేశామని దర్శకుడు, నిర్మాత యం. రాజ్‌కుమార్ చెప్పారు. ఇటీవలే ఆరు పాటలను రికార్డ్ చేసినట్లు తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2010 | 10:30 am

ముందే హెచ్చరించిన ఆంధ్ర: పట్టించుకోని ఛత్తీస్‌గఢ్

దేశ చరిత్రలో మావోయిస్టులు జరిపిన అత్యంత పాశవికమైన దాడిగా ఛత్తీస్‌గఢ్ దాడిని అభివర్ణిస్తున్నారు. ఈ మారణకాండలో ఇప్పటివరకూ 83 మంది జవాన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల ఏరివేతలో అత్యంత నైపుణ్యం ప్రదర్శిస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఛత్తీస్‌గఢ్‌లో భారీ దాడి జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారాన్ని ఆ రాష్ట్రానికి చెప్పినట్లు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 7 Apr 2010 | 9:29 am

పర్యాటకానికి రూ. 400 కోట్ల పెట్టుబడి: కేరళ మంత్రి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి రూ. 400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కేరళ రాష్ట్ర హోం, పర్యాటక శాఖామంత్రి కొడియేరీ బాలకృష్ణన్ కొట్టాయంలో బుధవారం వెల్లడించారు.
Source: జాతీయ | 7 Apr 2010 | 7:12 am

శ్రీ కృష్ణ కమిటీకీ నివేదిక సమర్పించిన తెరాస

జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీకి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)పార్టీకి చెందిన పలువురు ఎంపీలు బుధవారం న్యూ ఢిల్లీలో తమ నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా తెరాస ఎంపీ వినోద్ మాట్లాడుతూ తాము కమిటీకి సమర్పించిన నివేదికను నాలుగు వాల్యూమ్‌లుగా ఉన్నాయన్నారు. ఇందులో దాదాపు 600 పైచిలుకు పేజీలలో తమ తెలంగాణ ప్రాంత అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాల గురించిన పలు అంశాలను అందులో పొందుపరచడం జరిగిందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Apr 2010 | 7:12 am

రామ్ చరణ్ కోసం బికినీ వేయమంటే వేస్తా: జెన్నీ

ఇవాల్టి రోజుల్లో ప్రతీ హీరోయిన్ టూ పీస్ దుస్తులను ధరించి నటించడం మామూలై పోయిందని సెక్సీ నటి జెనీలియా అంటోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో "మగధీర" రామ్ చరణ్‌తో నటిస్తున్న ఈ "ఆరెంజ్" సుందరి దర్శకనిర్మాతలు కోరితే తాను కూడా బికినీ వేసేందుకు అభ్యంతరం పెట్టనని అంటోంది. ముఖ్యంగా రామ్ చరణ్ తేజ సరసన నటిస్తున్న "ఆరెంజ్" చిత్రంలో అటువంటి సన్నివేశాలు ఉన్నట్లయితే, బికినీతో కనిపించేందుకు తనకు ఎలాంటి సంకోచం లేదని తన మనసులో మాటను చెప్పేస్తోంది జెనీలియా. అయితే ఆ సన్నివేశం బికినీ వేసుకుని కనిపించేందుకు అన్నట్లు కాకుండా సందర్భోచితంగా ఉండాలంటోంది. రామ్ చరణ్ తేజ "ఆరెంజ్" చిత్రంలో మషాలా దట్టింపులున్న సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నట్లు వినికిడి. ఎలాగూ బికినీ సన్నివేశాలుంటాయి కనుక జెనీలియా ముందుగానే ఇలా వార్మప్ చేస్తోందా...? చూద్దాం... ఆరెంజ్ వస్తే తెలుస్తుంది కదా...!!
Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2010 | 7:03 am

సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా మాట్లాడండి: మొయిలీ

నగరంలో ఇటీవల తలెత్తిన అల్లర్ల కారణంగా ఇతర పార్టీలకు చెందిన నాయకులు విమర్శించడాన్ని ఆయన తిప్పికొట్టారు. కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో ఇటీవల జరిగిన అల్లర్లపై ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకులకు చురక అంటించారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై నేతలు తగు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Apr 2010 | 4:37 am

ఈ నెల 21 నుంచి శ్రీ కృష్ణ కమిటీ రాష్ట్ర పర్యటన

రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 21 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. వారం రోజుల క్రితం కమిటీ రాష్ట్రంలో పర్యటించాల్సివుంది. కాని నగరంలోని పాతబస్తీలో ఒక్కసారిగా అల్లర్లు జరగడంతో కర్ఫ్యూను విధించాల్సి వచ్చిన విషయం విదితమే.
Source: ఏపీ న్యూస్ | 7 Apr 2010 | 3:14 am