స్వల్ప లాభాల్లో బాంబే స్టాక్ మార్కెట్

బుధవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ రెండేళ్ల తర్వాత 18వేల మార్కును తాకిన సంగతి తెలిసిందే. ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల దిశగా ర్యాలీని కొనసాగించింది.కానీ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 17 పాయింట్ల స్వల్ప లాభాన్ని నమోదు చేసుకుంది. దీంతో సెన్సెక్స్ 17,958 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం ఐదు పాయింట్ల వృద్ధితో 5,371 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 7 Apr 2010 | 9:34 am

ముందే హెచ్చరించిన ఆంధ్ర: పట్టించుకోని ఛత్తీస్‌గఢ్

దేశ చరిత్రలో అత్యంత మావోయిస్టులు చేసిన అత్యంత పాశవికమైనది ఛత్తీస్‌గఢ్ దాడి. ఈ మారణకాండలో ఇప్పటివరకూ 83 మంది జవాన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల ఏరివేతలో అత్యంత నైపుణ్యం ప్రదర్శిస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఛత్తీస్ గఢ్ లో భారీ దాడి జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారాన్ని ఆ రాష్ట్రానికి చెప్పినట్లు సమాచారం.
Source: Yahoo! Telugu: News | 7 Apr 2010 | 9:25 am

ఈ నెల 21 నుంచి శ్రీ కృష్ణ కమిటీ రాష్ట్ర పర్యటన

రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 21 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. వారం రోజుల క్రితం కమిటీ రాష్ట్రంలో పర్యటించాల్సివుంది. కాని నగరంలోని పాతబస్తీలో ఒక్కసారిగా అల్లర్లు జరగడంతో కర్ఫ్యూను విధించాల్సి వచ్చిన విషయం విదితమే.
Source: Yahoo! Telugu: News | 7 Apr 2010 | 8:32 am

పర్యాటక అభివృద్ధికి రూ. 400 కోట్ల పెట్టుబడి: కేరళ మంత్రి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి రూ. 400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కేరళ రాష్ట్ర హోం, పర్యాటక శాఖామంత్రి కొడియేరీ బాలకృష్ణన్ కొట్టాయంలో బుధవారం వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 7 Apr 2010 | 7:53 am

కూంబింగ్‌తో దంతెవాడలో యుద్ధ వాతావరణం

సుమారు 83 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని పొట్టనబెట్టుకున్న మావోయిస్టుల ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ హంట్‌ను మరింత ఉధృతం చేసింది. ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలను పూర్తిగా దిగ్భందించింది.
Source: Yahoo! Telugu: News | 7 Apr 2010 | 7:35 am

రామ్ చరణ్ కోసం బికినీ వేయమంటే వేస్తా: జెన్నీ

ఇవాల్టి రోజుల్లో ప్రతీ హీరోయిన్ టూ పీస్ దుస్తులను ధరించి నటించడం మామూలై పోయిందని సెక్సీ నటి జెనీలియా అంటోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో "మగధీర" రామ్ చరణ్‌తో నటిస్తున్న ఈ "ఆరెంజ్" సుందరి దర్శకనిర్మాతలు కోరితే తాను కూడా బికినీ వేసేందుకు అభ్యంతరం పెట్టనని అంటోంది. ముఖ్యంగా రామ్ చరణ్ తేజ సరసన నటిస్తున్న "ఆరెంజ్" చిత్రంలో అటువంటి సన్నివేశాలు ఉన్నట్లయితే, బికినీతో కనిపించేందుకు తనకు ఎలాంటి సంకోచం లేదని తన మనసులో మాటను చెప్పేస్తోంది జెనీలియా. అయితే ఆ సన్నివేశం బికినీ వేసుకుని కనిపించేందుకు అన్నట్లు కాకుండా సందర్భోచితంగా ఉండాలంటోంది. రామ్ చరణ్ తేజ "ఆరెంజ్" చిత్రంలో మషాలా దట్టింపులున్న సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నట్లు వినికిడి. ఎలాగూ బికినీ సన్నివేశాలుంటాయి కనుక జెనీలియా ముందుగానే ఇలా వార్మప్ చేస్తోందా...? చూద్దాం... ఆరెంజ్ వస్తే తెలుస్తుంది కదా...!!
Source: Yahoo! Telugu: Entertainment | 7 Apr 2010 | 7:03 am

భారత్‌‌లో మరిన్ని పెట్టుబడులు: హయాత్ హోటల్స్

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తమ సంస్థ రానున్న రోజుల్లో భారతదేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని హయాత్ హోటల్స్ కార్పోరేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యనిర్వహణాధికారి మార్క్ హోప్లామాజియాన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు
Source: Yahoo! Telugu: News | 7 Apr 2010 | 7:02 am

మే 6న బ్రిటన్‌ సాధారణ ఎన్నికలు: బ్రిటీష్ ప్రభుత్వం

బ్రిటన్‌లో వచ్చే నెల మే ఆరో తేదీన సాధారణ ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ ఎన్నికల విషయమై బ్రిటన్ ప్రధాని గార్డన్ బ్రౌన్.. రాణి ఎలిజిబెత్‌తో చర్చలు జరిపినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ చర్చలకు అనంతరం గార్డన్ బ్రౌన్ మాట్లాడుతూ.. వచ్చే నెల మే ఆరో తేదీన సాధారణ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఈ ఎన్నికలకు ప్రజలు పూర్తి సహకారం అందిచాల్సిందిగా గార్డన్ బ్రౌన్ పిలుపునిచ్చారు.
Source: Yahoo! Telugu: News | 7 Apr 2010 | 7:01 am

పుంజుకున్న ట్రేడింగ్: 18,031 మార్కు వద్ద సెన్సెక్స్

దేశీయ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జించింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే 18వేల మార్కును తాకిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 90 పాయింట్ల మేర లాభపడింది. దీంతో సెన్సెక్స్ సూచీ 18,031 మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 21 పాయింట్లు లాభపడి, 5,387 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 7 Apr 2010 | 6:33 am

మొయిలీ అధ్యక్షతన కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ

రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సమన్వయ కమిటీ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో జరగింది. ఈ భేటీకి కేంద్ర న్యాయశాఖామంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్పమొయిలీ అధ్యక్షత వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా దాదాపు రెండున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్న మొయిలీ సమన్వయ కమిటీ ఛైర్మెన్ హోదాలో తొలిసారిగా పాల్గొనడం విశేషం
Source: Yahoo! Telugu: News | 7 Apr 2010 | 6:23 am

పోలీసులు సామర్థ్యాన్ని పెంచుకోవాలి: చిదంబరం

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం నివాళులు అర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ... మావోయిస్టులు దేశ భద్రతకు పెనుముప్పుగా పరణమించారనీ, వారిని ఏరివేసే వరకూ విశ్రమించేది లేదని చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 7 Apr 2010 | 6:19 am

ముందే హెచ్చరించిన ఆంధ్ర: పట్టించుకోని ఛత్తీస్‌గఢ్

దేశ చరిత్రలో అత్యంత మావోయిస్టులు చేసిన అత్యంత పాశవికమైనది ఛత్తీస్‌గఢ్ దాడి. ఈ మారణకాండలో ఇప్పటివరకూ 83 మంది జవాన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల ఏరివేతలో అత్యంత నైపుణ్యం ప్రదర్శిస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఛత్తీస్ గఢ్ లో భారీ దాడి జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారాన్ని ఆ రాష్ట్రానికి చెప్పినట్లు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 7 Apr 2010 | 3:56 am

ఈ నెల 21 నుంచి శ్రీ కృష్ణ కమిటీ రాష్ట్ర పర్యటన

రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 21 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. వారం రోజుల క్రితం కమిటీ రాష్ట్రంలో పర్యటించాల్సివుంది. కాని నగరంలోని పాతబస్తీలో ఒక్కసారిగా అల్లర్లు జరగడంతో కర్ఫ్యూను విధించాల్సి వచ్చిన విషయం విదితమే.
Source: ఏపీ న్యూస్ | 7 Apr 2010 | 3:14 am

పర్యాటక అభివృద్ధికి రూ. 400 కోట్ల పెట్టుబడి: కేరళ మంత్రి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి రూ. 400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కేరళ రాష్ట్ర హోం, పర్యాటక శాఖామంత్రి కొడియేరీ బాలకృష్ణన్ కొట్టాయంలో బుధవారం వెల్లడించారు.
Source: జాతీయ | 7 Apr 2010 | 2:23 am

కూంబింగ్‌తో దంతెవాడలో యుద్ధ వాతావరణం

సుమారు 83 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని పొట్టనబెట్టుకున్న మావోయిస్టుల ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ హంట్‌ను మరింత ఉధృతం చేసింది. ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలను పూర్తిగా దిగ్భందించింది.
Source: జాతీయ | 7 Apr 2010 | 2:08 am

ఛండీగఢ్‌లో 11 మంది మావోయిస్టుల అరెస్టు

ఛండీఘడ్‌లో 11 మంది మావోయిస్టులను బీఎస్‌ఎఫ్ దళ అధికారులు అరెస్టు చేశారు. కన్‌ఖెర్ జిల్లాలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. వీరి నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.ఛండీఘడ్‌లో 70 మంది జవాన్లను మంగళవారం మావోయిస్టులు పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 7 Apr 2010 | 1:13 am

ఛత్తీస్‌గఢ్ చేరుకున్న కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం

ఛత్తీస్‌గఢ్‌లోమంగళవారంనాడు సీఆర్పీఎఫ్ దళాలపై మెరుపు దాడులకు పాల్పడ్డ పరిస్థితిని సమీక్షించేందుకు బుధవారం కేంద్ర హోంశాఖామంత్రి ఛత్తీస్‌గఢ్ చేరుకున్నారు
Source: జాతీయ | 7 Apr 2010 | 1:12 am

ఒబామాతో భేటీ కానున్న ప్రధాని మన్మోహన్ సింగ్!

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో దేశ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ భేటీ కానున్నారు. అమెరికాలో వచ్చే వారంలో ప్రారంభం కానున్న అణు సదస్సులో మన్మోహన్ సింగ్ పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ఒబామాతో ప్రధాని సమావేశమవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో భాగంగా.. భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసే దిశగా చర్చలు జరుగుతాయని సమాచారం. ఇంకా అణుశక్తి ఒప్పందంపై ఒబామా-మన్మోహన్ సింగ్‌లు కీలక చర్చలు జరుపుతారని తెలిసింది.
Source: జాతీయ | 7 Apr 2010 | 1:07 am

నళిని క్షమాభిక్షకు అర్హురాలు కాదుః మద్రాసు హైకోర్టు

రాజీవ్ గాంధీ హత్యకేసులో గత 19 సంవత్సరాలుగా జైలుశిక్ష అనుభవిస్తున్న నళినికి క్షమాభిక్ష అవకాశాలు లేదని మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పింది.
Source: జాతీయ | 7 Apr 2010 | 1:06 am

మా అగ్రనేత కిషన్‌జీ బతికే ఉన్నాడు: మావోయిస్టులు

దంతెవాడలో జరిగిన మావోయిస్టు దాడిలో 73 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన కొద్ది గంటలలోనే మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ అలియాస్ కోటేశ్వరరాపు బతికే ఉన్నాడని మొదటిసారిగా మావోయిస్టులు వెల్లడించారు.
Source: జాతీయ | 7 Apr 2010 | 1:05 am

మొయిలీ అధ్యక్షతన కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ

రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సమన్వయ కమిటీ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో జరగింది. ఈ భేటీకి కేంద్ర న్యాయశాఖామంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్పమొయిలీ అధ్యక్షత వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా దాదాపు రెండున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్న మొయిలీ సమన్వయ కమిటీ ఛైర్మెన్ హోదాలో తొలిసారిగా పాల్గొనడం విశేషం
Source: ఏపీ న్యూస్ | 7 Apr 2010 | 1:00 am

పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌తో జగన్మోహన్ రెడ్డి భేటీ

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీపీసీసీ) అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌తో కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం సమావేశమయ్యారు. డీఎస్ నివాసంలో జరిగిన ఈ భేటీలో దాదాపు గంటసేపు వారిరువురు చర్చించుకున్నట్లు సమచారం.
Source: ఏపీ న్యూస్ | 7 Apr 2010 | 1:00 am

పోలీసులు సామర్థ్యాన్ని పెంచుకోవాలి: చిదంబరం

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం నివాళులు అర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ... మావోయిస్టులు దేశ భద్రతకు పెనుముప్పుగా పరణమించారనీ, వారిని ఏరివేసే వరకూ విశ్రమించేది లేదని చెప్పారు.
Source: జాతీయ | 7 Apr 2010 | 12:50 am

ఎన్టీఆర్ "శక్తి" నిరూపించేందుకు 4 యత్నాలు

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం "శక్తి". దీన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు నలుగురు రచయితలు రచనా సహకారం అందిస్తున్నారు. ఈ నలుగురిలో ముగ్గురు దర్శకులు కావడం విశేషం. జె.కె.భారవి, యండమూరి వీరేంద్రనాథ్, డీఎస్ కన్నన్‌లు గతంలో దర్శకత్వం వహించినవారే. ఇక మరొకరు సత్యానంద్. ఈయన రామానాయుడు సినిమాలకు కథారచయిత. ఈ నలుగురు కలిసి "శక్తి" సినిమాకు రచనలో సహకరిస్తున్నారు. ఎన్టీఆర్ నిశ్చితార్థం జరగడం... ఆ తర్వాత తయారవుతున్న ఈ చిత్రాన్ని నందమూరి వంశంలో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నలుగురు రచయితలు తమ శక్తులు ఒడ్డుతున్నారు. ఏమవుతుందో చూడాలి.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Apr 2010 | 2:32 pm

నేపాలీ పౌరుడినే చేసుకుంటా: మనీషా కొయిరాలా

ఒకవైపు సానియా మీర్జా విదేశీ వరుడ్ని కోరుకుని వివాహమాడేందుకు సిద్ధపడుతుంటే, "1942 ఎ లవ్ స్టోరీ" భామ మనీషా కొయిరాలా నేపాలీ వ్యాపారస్తుడ్ని వివాహమాడుతున్నట్లు చెప్పింది. గత వారం రోజులుగా వివాహానికి సంబంధించిన సంప్రదింపులు జరుగుతున్నాయనీ, ఎట్టకేలకు తనకూ నేపాలీ వ్యాపారస్తుడైన సమ్రత్ దహాల్ భావాలు కలిశాయనీ మనీషా తెగ సిగ్గు పడిపోతూ చెప్పింది.ప్రస్తుతం మనీషా కొయిరాలా కేరళలో షూటింగ్ జరుపుకుంటున్న ఓ తెలుగు చిత్రంలో నటిస్తోంది. శుక్రవారం ఖాట్మాండుకు వెళ్లిన తర్వాత వధూవరులిద్దరు ముఖాముఖి మాట్లాడుకుంటారని ప్రముఖ నేపాల్ ఫిలిమ్ డైరెక్టర్ ఖనాల్ తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Apr 2010 | 10:56 am

ఈతరం ఫిలిమ్స్ "ఏం పిల్లో.. ఏం పిల్లడో"

ఈతరం ఫిలిమ్స్ పతాకంపై తనీష్ హీరోగా, బెంగళూరుకు చెందిన ప్రణీత హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రానికి "ఏం పిల్లో... ఏం పిల్లడో" పేరును నిర్ణయించారు. ఈ విషయాన్ని నిర్మాత పోకూరి బాబూరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మా బ్యానర్లో ఇది 15వ సినిమా. ఎంటర్‌టైన్మెంట్‌తో సాగుతుంది. ఈ చిత్రంలో ఉండాల్సిన ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. జనవరి 1న షూటింగ్ ప్రారంభించాం. దాదాపు పూర్తయింది. మూడు పాటలు పూర్తి చేస్తే షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ సినిమాను వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Apr 2010 | 10:15 am

ముఖ్యమంత్రి రోశయ్య వర్సెస్ వైఎస్ జగన్ మోహన్

తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణ వార్త విని జీర్ణించుకోలేక తనువు చాలించిన అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీలో కలహాలు తలెత్తుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
Source: ఏపీ న్యూస్ | 6 Apr 2010 | 10:08 am

మీరు విచారణ చేసుకోండి.. నేను "నిఖా" చేసుకుంటా

అయేషా సిద్ధిఖీ పోలీసులకు పూటకో ఆధారాన్ని సమర్పిస్తూ కేసును మరింత పటిష్టం చేస్తుంటే షోయబ్ మాలిక్ మాత్రం వాటిని ఎంతమాత్రం ఖాతరు చేయడం లేదు. షోయబ్ సంగతి ఎలా ఉన్నా అసలు సానియా మీర్జా, అయేషా వివాదాన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేసినట్లు కనబడుతోంది.
Source: ఏపీ న్యూస్ | 6 Apr 2010 | 8:00 am

"మరోచరిత్ర" తిరగబడేసరికి నింద నాపై: అనిత

మరోచరిత్రను ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు నిర్మించారు. ఆ చిత్రానికి రవియాదవ్‌ను దర్శకుడిగా పరిచయం చేశారు. ఇటీవలే ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. మా సినిమాలో హీరోయిన్‌గా అనితను తీసుకోవడం రాంగ్ సెలక్షన్. వీసా ప్రాబ్లమ్ వల్ల వేరే అమ్మాయికి బదులు ఈమెను సెలక్ట్ చేశామని, ఇది తప్పిదమేనని అన్నారు. రాజు మాట్లాడేటపుడు స్టేజీపై అనిత కూడా ఉంది. అయితే ఆమెకు తెలుగు సరిగ్గా తెలియదు. మంగళవారం మీడియా సమావేశంలో ఆమె తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టింది. సినిమా విడుదలకు ముందు కథాపరంగా ఎన్నారై హీరోహీరోయిన్లు కావాల్సివచ్చిందనీ, అందుకే తనను సెలెక్ట్ చేశారని చెప్పడమే కాక ఈ సినిమాలో తనకు మంచి పేరు వస్తుందని కూడా అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Apr 2010 | 7:04 am

నందమూరి బాలకృష్ణ "సింహా" ట్రెయిలర్

నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన "సింహా"లో బాలకృష్ణ సరసన నయనతార, స్నేహాఉల్లాల్, నమిత హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో బాలకృష్ణను భిన్న కోణంలో ఆవిష్కరించామని నిర్మాత పరుచూరి కిరీటీ అన్నారు. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరులో సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అభిమానిగా ఎలా ఉండాలో? ఆ విధంగా బాలయ్య సినిమా చేశాను. రెండు పాత్రల్లో నటనతో బాలకృష్ణ ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తాడు. ఇంకా అన్ని వర్గాల వారిని అలరించే చిత్రంగా "సింహా" ఉంటుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం..
Source: Yahoo! Telugu: Entertainment | 6 Apr 2010 | 6:22 am

75 మంది జవాన్లు మృతి: "హంట్" ఆగదన్న కేంద్రం

దేశంలోనే అత్యంత పెద్దదైన మావోయిస్టు దాడిగా అభివర్ణించబడుతున్న దంతెవాడ ఎన్‌కౌంటర్లో ఇప్పటివరకూ 75మంది జవాన్లు మృత దేహాలు లభ్యమయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసు అధికారులు చెపుతున్నారు.
Source: జాతీయ | 6 Apr 2010 | 5:58 am

భాగ్యనగరంలో ఉద్రిక్తతల నడుమ సమైక్యాంధ్ర ర్యాలీ

రాష్ట్ర విభజనకు తాము ఒప్పుకోమని సమైక్యాంధ్ర బలహీన వర్గాల ఐక్యకార్యాచరణ సమితి మంగళవారం రాజధానిలో ర్యాలీ నిర్వహించింది. ఈ నేపథ్యంలో ర్యాలీలో పాల్గొన్న ఐకాస సభ్యులు తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అంటూ ర్యాలీని చేపట్టారు. దీంతో పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 6 Apr 2010 | 4:53 am

హోం మంత్రి చిదంబరం ప్రకటనతో పేట్రేగిన మావోయిస్టులు

దేశానికి నక్సలైట్లే ప్రథమ శత్రువులని సోమవారంనాడు కేంద్ర హోం మంత్రి ప్రకటించిన కొద్ది గంటలకే మావోయిస్టులు విరుచుక పడ్డారు. గత 48 గంటల్లో తమ సత్తా ఏమిటో నిరూపించుకునే దిశలో రెండు భారీ దాడులకు తెగబడ్డారు. మంగళవారం చత్తీస్‌గఢ్‌లో మావోలు జరిపిన దాడిలో ఏకంగా 70 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాత పడ్డారు.
Source: జాతీయ | 6 Apr 2010 | 4:33 am

కర్ఫ్యూ సడలించినా 144 సెక్షన్ అమల్లో వుంటుంది: ఖాన్

నగరంలోని పాతబస్తీలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంటోందని, పరిస్థితులు అదుపులోకి వస్తున్నందున మంగళవారం ఉదయం 7 గంటల నుంచి కర్ఫ్యూను సడలిస్తున్నామని పోలీసు కమిషనర్ ఏకే ఖాన్ మీడియా వర్గాలకు తెలిపారు. అయితే తాము విధించిన 144 సెక్షన్ అమల్లో వుంటుందని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 6 Apr 2010 | 4:32 am

సానియా... కసాయినెలా నమ్ముతున్నావ్...?: ఎఫ్బీ ప్రశ్న

హైదరాబాదుకు చెందిన ఓ అమ్మాయిని నమ్మించి గొంతు కోసిన మోసగాడిని సానియా మీర్జా వివాహమాడుతానని చెప్పడం దారుణమని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ విమర్శించింది. సానియా మీర్జా తక్షణమే షోయబ్‌తో తన వివాహ ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 6 Apr 2010 | 4:17 am