హోం మంత్రి చిదంబరం ప్రకటనతో పెట్రేగిన మావోయిస్టులు

దేశానికి నక్సలైట్లే ప్రథమ శత్రువులని సోమవారంనాడు కేంద్ర హోం మంత్రి ప్రకటించిన కొద్ది గంటలకే మావోయిస్టులు విరుచుక పడ్డారు. గత 48 గంటల్లో తమ సత్తా ఏమిటో నిరూపించుకునే దిశలో రెండు భారీ దాడులకు తెగబడ్డారు. మంగళవారం చత్తీస్‌గఢ్‌లో మావోలు జరిపిన దాడిలో ఏకంగా 70 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాత పడ్డారు.
Source: Yahoo! Telugu: News | 6 Apr 2010 | 8:48 am

మిశ్రమ ఫలితాల్లో సెన్సెక్స్, నిఫ్టీల ర్యాలీ

రియాల్టీ, సీజీ, పవర్ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి హెచ్చుతగ్గులతో ర్యాలీని కొనసాగించడంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 24 పాయింట్లు పుంజుకుని, 17,960 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 6 Apr 2010 | 8:46 am

హెడ్లీని విచారించే అవకాశం భారత్‌కు కల్పిస్తాం: ఎఫ్‌బీఐ

ముంబై దాడుల రూపకర్త డేవిడ్ హెడ్లీని విచారించే అవకాశం భారతదేశానికి త్వరలో కల్పిస్తామని చికాగోలోని ఎఫ్‌బీఐ ప్రతినిధి తెలిపారు. భారతదేశానికి చెందిన అధికారులు తమను కలిసి విన్నవించుకున్న నేపథ్యంలో తాము ఆ దేశానికి హెడ్లీని విచారించేందుకు త్వరలో అప్పగిస్తామని ఆయన అన్నారు.
Source: Yahoo! Telugu: News | 6 Apr 2010 | 8:24 am

కర్ఫ్యూ సడలించినా 144 సెక్షన్ అమల్లోవుంటుంది: ఏకే ఖాన్

నగరంలోని పాతబస్తీలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంటోందని, పరిస్థితులు అదుపులోకి వస్తున్నందున మంగళవారం ఉదయం 7 గంటల నుంచి కర్ఫ్యూను సడలిస్తున్నామని పోలీసు కమిషనర్ ఏకే ఖాన్ మీడియా వర్గాలకు తెలిపారు. అయితే తాము విధించిన 144 సెక్షన్ అమల్లో వుంటుందని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 6 Apr 2010 | 7:52 am

ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దుల్లో హై అలెర్ట్: పోలీసులు

దేశంలో మావోయిస్టుల ఏరివేతే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల దాడిలో 70 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందడంతో ఆంధ్రప్రదేశ్-ఒడిషా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు
Source: Yahoo! Telugu: News | 6 Apr 2010 | 7:36 am

మిశ్రమ ఫలితాల్లో కొనసాగుతోన్న సెన్సెక్స్, నిఫ్టీ

మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ మదుపరులను నిరాశపరిచింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే క్షీణించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. ఫలితంగా సెన్సెక్స్ 20 పాయింట్ల లాభపడి, 17,955 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అయితే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం ఆరు పాయింట్లు స్వల్పంగా క్షీణించి, 5,361 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 6 Apr 2010 | 7:18 am

భారత్‌కు యురేనియం సరఫరా నిలిపివేస్తాం: ఆస్ట్రేలియా

భారతదేశానికి యురేనియం సరఫరాను నిలిపివేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆస్ట్ర్లేలియా వాణిజ్య శాఖామంత్రి సైమన్ క్రీన్ క్యాన్‌బెర్రాలో మంగళవారం మీడియాకు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 6 Apr 2010 | 7:16 am

"మరోచరిత్ర" తిరగబడేసరికి నింద నాపై: అనిత

మరోచరిత్రను ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు నిర్మించారు. ఆ చిత్రానికి రవియాదవ్‌ను దర్శకుడిగా పరిచయం చేశారు. ఇటీవలే ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. మా సినిమాలో హీరోయిన్‌గా అనితను తీసుకోవడం రాంగ్ సెలక్షన్. వీసా ప్రాబ్లమ్ వల్ల వేరే అమ్మాయికి బదులు ఈమెను సెలక్ట్ చేశామని, ఇది తప్పిదమేనని అన్నారు. రాజు మాట్లాడేటపుడు స్టేజీపై అనిత కూడా ఉంది. అయితే ఆమెకు తెలుగు సరిగ్గా తెలియదు. మంగళవారం మీడియా సమావేశంలో ఆమె తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టింది. సినిమా విడుదలకు ముందు కథాపరంగా ఎన్నారై హీరోహీరోయిన్లు కావాల్సివచ్చిందనీ, అందుకే తనను సెలెక్ట్ చేశారని చెప్పడమే కాక ఈ సినిమాలో తనకు మంచి పేరు వస్తుందని కూడా అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Apr 2010 | 7:04 am

నందమూరి బాలకృష్ణ "సింహా" ట్రెయిలర్

నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన "సింహా"లో బాలకృష్ణ సరసన నయనతార, స్నేహాఉల్లాల్, నమిత హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో బాలకృష్ణను భిన్న కోణంలో ఆవిష్కరించామని నిర్మాత పరుచూరి కిరీటీ అన్నారు. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరులో సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అభిమానిగా ఎలా ఉండాలో? ఆ విధంగా బాలయ్య సినిమా చేశాను. రెండు పాత్రల్లో నటనతో బాలకృష్ణ ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తాడు. ఇంకా అన్ని వర్గాల వారిని అలరించే చిత్రంగా "సింహా" ఉంటుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం..
Source: Yahoo! Telugu: Entertainment | 6 Apr 2010 | 6:22 am

ఛత్తీస్‌గఢ్‌లో మావోల దొంగ దెబ్బ: 70 మంది జవాన్ల మృతి

ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో మావోలు పోలీసులను దొంగ దెబ్బ తీశారు. ఛత్తీస్‌గఢ్, దంతెవాడ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో 70 మంది జవాన్లు మృతి చెందినట్లు డీజీపీ విశ్వరంజన్ తెలిపారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని డీజీపీ వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 6 Apr 2010 | 6:22 am

బాగా పని చేయండి.. కానీ స్థిరపడకండి: గార్డన్ బ్రౌన్

దేశంలో ఎన్నికల తేదీని ప్రకటించిన బ్రిటన్ ప్రధాని గార్డన్ బ్రౌన్ మంగళవారం మాట్లాడుతూ తమ దేశంలో విదేశస్తులు ఇక్కడే స్థిరపడేందుకు వీలులేదని ఆయన తెలిపారు. తమ దేశంలో వచ్చే నెల ఆరవ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుందని ఆయన పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 6 Apr 2010 | 6:10 am

సుప్రీం ఆదేశాలను ధిక్కరించిన జస్టిస్ పిడి దినకరన్

లంచగొండి, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివున్నాడాని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పిడి దినకరన్(59) సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించారు. సెలవుపై వెళ్ళాలని సుప్రీం ధర్మాసనం గత వారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేసి సోమవారం యధావిధిగా తన విధులను నిర్వర్తించారు
Source: Yahoo! Telugu: News | 6 Apr 2010 | 5:46 am

నగరంలో ఉద్రిక్తతల నడుమ సమైక్యాంధ్ర ర్యాలీ

రాష్ట్ర విభజనకు తాము ఒప్పుకోమని సమైక్యాంధ్ర బలహీన వర్గాల ఐక్యకార్యాచరణ సమితి మంగళవారం రాజధానిలో ర్యాలీ నిర్వహించింది. ఈ నేపథ్యంలో ర్యాలీలో పాల్గొన్న ఐకాస సభ్యులు తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అంటూ ర్యాలీని చేపట్టారు. దీంతో పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 6 Apr 2010 | 4:12 am

హోం మంత్రి చిదంబరం ప్రకటనతో పెట్రేగిన మావోయిస్టులు

దేశానికి నక్సలైట్లే ప్రథమ శత్రువులని సోమవారంనాడు కేంద్ర హోం మంత్రి ప్రకటించిన కొద్ది గంటలకే మావోయిస్టులు విరుచుక పడ్డారు. గత 48 గంటల్లో తమ సత్తా ఏమిటో నిరూపించుకునే దిశలో రెండు భారీ దాడులకు తెగబడ్డారు. మంగళవారం చత్తీస్‌గఢ్‌లో మావోలు జరిపిన దాడిలో ఏకంగా 70 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాత పడ్డారు.
Source: జాతీయ | 6 Apr 2010 | 3:20 am

కర్ఫ్యూ సడలించినా 144 సెక్షన్ అమల్లోవుంటుంది: ఏకే ఖాన్

నగరంలోని పాతబస్తీలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంటోందని, పరిస్థితులు అదుపులోకి వస్తున్నందున మంగళవారం ఉదయం 7 గంటల నుంచి కర్ఫ్యూను సడలిస్తున్నామని పోలీసు కమిషనర్ ఏకే ఖాన్ మీడియా వర్గాలకు తెలిపారు. అయితే తాము విధించిన 144 సెక్షన్ అమల్లో వుంటుందని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 6 Apr 2010 | 2:24 am

ముఖ్యమంత్రి రోశయ్య వర్సెస్ వైఎస్ జగన్ మోహన్

తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణ వార్త విని జీర్ణించుకోలేక తనువు చాలించిన అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీలో కలహాలు తలెత్తుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
Source: ఏపీ న్యూస్ | 6 Apr 2010 | 2:18 am

ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దుల్లో హై అలెర్ట్: పోలీసులు

దేశంలో మావోయిస్టుల ఏరివేతే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల దాడిలో 70 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందడంతో ఆంధ్రప్రదేశ్-ఒడిషా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు
Source: జాతీయ | 6 Apr 2010 | 2:14 am

ఛత్తీస్‌గఢ్‌లో మావోల దొంగ దెబ్బ: 70 మంది జవాన్ల మృతి

ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో మావోలు పోలీసులను దొంగ దెబ్బ తీశారు. ఛత్తీస్‌గఢ్, దంతెవాడ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో 70 మంది జవాన్లు మృతి చెందినట్లు డీజీపీ విశ్వరంజన్ తెలిపారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని డీజీపీ వెల్లడించారు.
Source: జాతీయ | 6 Apr 2010 | 1:57 am

సుప్రీం ఆదేశాలను ధిక్కరించిన జస్టిస్ పిడి దినకరన్

లంచగొండి, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివున్నాడాని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పిడి దినకరన్(59) సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించారు. సెలవుపై వెళ్ళాలని సుప్రీం ధర్మాసనం గత వారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేసి సోమవారం యధావిధిగా తన విధులను నిర్వర్తించారు
Source: జాతీయ | 6 Apr 2010 | 12:19 am

అరె.. జగన్‌కు అంత సీన్ లేదయా: సర్వే సత్యనారాయణ

వైఎస్ జగన్ ఓదార్పు యాత్రకు మీడియా ఎందుకంత ప్రాధాన్యం ఇస్తుందో తనకైతే అర్థం కావడం లేదని కాంగ్రెస్ ఎంపీ సర్వే సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్యతో జగన్‌ను పోల్చి చూడటం కూడా సరైన పద్ధతి కాదని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 6 Apr 2010 | 12:15 am

నోట్ల దండలతో"మాయ": విచారణ చేయలేని యూపీఎ

సన్మానం భారీగా జరుపుకోవాలంటే ఎవరైనా గజమాలలతో సన్మాలను జరుపుకుంటారు. దీనికి బదులు ఏకంగా వేయి రూపాయల నోట్ల దండలను వేయించుకుని సన్మానాన్ని చేయించుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిపై చర్య తీసుకునేందుకు యూపీఎ ప్రభుత్వానికి ధైర్యం చాలడం లేదని భారతీయ జనతా పార్టీ ఎద్దేవా చేసింది.
Source: జాతీయ | 5 Apr 2010 | 11:40 pm

దంతెవాడలో ఎదురు కాల్పులు: ఎస్ఐ, పోలీసు మృతి

ఛత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులకు, మావోలకు మధ్య మంగళవారం ఉదయం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో ఓ సబ్‌ఇన్స్‌పెక్టర్‌తోపాటు హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు.
Source: జాతీయ | 5 Apr 2010 | 10:18 pm

ధరలపై చర్చించేందుకు సీఎంలతో భేటీ కానున్న ప్రధాని

దేశంలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను ధరలను అదుపు చేసే విషయమై చర్చించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈనెల 8వ తేదీన కోర్ గ్రూప్ ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పది మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.
Source: జాతీయ | 5 Apr 2010 | 9:26 pm

కొత్తవారివల్లే ఇండస్ట్రీకి దరిద్రం పట్టుకుంటోంది: తమ్మారెడ్డి

సినీ పరిశ్రమ నలుగురు వ్యక్తుల చేతుల్లో చిక్కుకుపోయి ఉందనీ, దానిని వారి చేతుల నుంచి విముక్తం చేయాల్సిన అవసరం ఉందని దర్శకుడు దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. పనిలోపనిగా మంచి కథ లేకపోతే రాజశేఖర్, చిరంజీవి లాంటి హీరోలు సినిమాలైనా బాక్సాఫీసుల వద్ద తుస్సుమంటాయన్నారు. సినిమా సక్సెస్ సంగతి ప్రక్కనపెడితే... అసలు సినిమా నలుగురు వ్యక్తుల చేతుల్లో ఉందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఆయన మెగాస్టార్ ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే వాదనలు బయలు దేరాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Apr 2010 | 2:43 pm

22 సీసాల్లో కంగనా రనౌత్...

హిందీ చిత్రం ఫ్యాషన్‌కి గాను కంగనా ఉత్తమ సహాయనటిగా జాతీయ అవార్డు పొందింది. ఈ అవార్డు ప్రకటించాక కంగనా గాల్లో తేలిపోయిందట. ఇది చాలా రోజులే అయినా.. 22 వైన్ సీసాల్లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందిట. 22 సీసాలేంటి అని అడిగితే... 22 ఏళ్లని చెప్పింది. తన వయసును వైన్ సీసాల లెక్కతో చెప్పడం అలవాటట. అందుకని అలా చెప్పడమే కాక అలా చేసుకుందని తెలిసింది. తెలుగులో "ఏక్ నిరంజన్"లో హీరోయిన్‌గా చేసినా ఫలితం లేకపోయింది. మరి ఆ తర్వాత ఆమెకు అవకాశాలే లేకుండా పోయాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Apr 2010 | 11:35 am

జీడిమెట్ల సిప్లా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాదులో జీడిమెట్లలోని సిప్లా మందుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రసాయనాలతో కూడిన నిల్వలు లోపల ఉండటంతో మంటలు అత్యంత వేంగంగా విస్తరించాయి. సుమారు 200 మీటర్ల మేర మంటలు వ్యాపించి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం.
Source: ఏపీ న్యూస్ | 5 Apr 2010 | 7:06 am

రామ్ గోపాల్ వర్మ తదుపరి చిత్రం "గాడ్ అండ్ సెక్స్"

ఇహపర సుఖాలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక సాగరాన్ని ఆవిష్కరించాల్సిన గురువులు "సెక్స్.. సెక్స్... సెక్స్.." అంటూ దానివైపు అర్రులు చాస్తూ పరుగెడుతున్నారు. దేశంలోని ప్రముఖ బాబాలలో చాలామంది సెక్స్ ఆరోపణలు ఎదుర్కొనడం నేడు మామూలై పోయింది. ఈ నేపధ్యంలో వీరి గాధలను ఆధారం చేసుకుని సినిమా తీస్తే ఎలా ఉంటుందీ...? అని ఆలోచించిన రామ్ గోపాల్ వర్మ వెంటనే "గాడ్ అండ్ సెక్స్" అనే చిత్రాన్ని తీయబోతున్నట్లు ప్రకటించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Apr 2010 | 6:39 am

మీడియా ముందుకొచ్చిన షోయబ్ - సానియా కపుల్

అయేషా వివాహం విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న షోయబ్ మాలిక్ తొలిసారిగా సానియా మీర్జాతో‌సహా సోమవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చాడు. తాను అయేషా కేసుకు సంబంధించి పోలీసులకు, భారత ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు. తాను ఎక్కడికీ పారిపోననీ, సానియాను పెళ్లి చేసుకున్న తర్వాతే ఎక్కడికైనా వెళతాననీ షోయబ్ మాలిక్ చెప్పుకొచ్చాడు.
Source: ఏపీ న్యూస్ | 5 Apr 2010 | 5:36 am

పూణెలో రోడ్డు ప్రమాదం : 10 మంది మృతి

పూణెలో సోమవారం ఉదయం 4.30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలతో సహా 10 మంది దుర్మరణం చెందగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
Source: జాతీయ | 5 Apr 2010 | 5:26 am

షోయబ్ ఇంటరాగేషన్‌పై సానియా కుటుంబం హ్యాపీ

అన్నీ అనుకున్నట్లు సక్రమంగా జరిగితే మరో 10 రోజుల్లో సానియా - షోయబ్‌ల వివాహం. కానీ వీరిద్దరి పెళ్లి మాట బయటకు వచ్చిన దగ్గర్నుంచీ మొదటి భార్యగా చెప్పుకుంటున్న అయేషా షోయబ్‌పై ఒక్కో బాణాన్ని సంధిస్తూనే ఉన్నది. వాటన్నిటినీ షోయబ్ మాలిక్ తేలికగా కొట్టి పారేస్తున్నప్పటికీ సానియా మీర్జా కుటుంబానికి మాత్రం నిద్ర కరవైంది.
Source: ఏపీ న్యూస్ | 5 Apr 2010 | 4:38 am

షోయబ్‌‍పై బిగుస్తున్న ఉచ్చు: పోలీసుల విచారణ

పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు షోయబ్ మాలిక్‌ చుట్టూ నగర పోలీసుల ఉచ్చు బిగుస్తున్నారు. నగరాన్ని వీడి వెళ్ళేందుకు వీలులేదని హైదరాబాద్‌ నగర పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు ఆంక్షలు విధించారు. ఒకవేళ హైదరాబాద్‌ను వదిలి వెళ్లాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని షోయబ్‌ను పోలీసులు కోరారు.
Source: ఏపీ న్యూస్ | 5 Apr 2010 | 4:12 am

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకాభిప్రాయం కుదరలేదు: ప్రణబ్

వచ్చే లోక్‌‍సభ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం యూపీఏ ప్రభుత్వం ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో మహిళా బిల్లుపై ఏకాభిప్రాయం కొరకు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదని కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ తెలిపారు.
Source: జాతీయ | 5 Apr 2010 | 3:32 am

అయేషా గర్భవతి: షోయబ్ మాలిక్ పాస్‌పోర్ట్ స్వాధీనం

అయేషాను తను ఇంతవరకూ చూడలేదని పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఆదివారం విలేకరుల ఎదుట చెప్పిన కొద్ది గంటల్లోనే అయేషా దానిపై తీవ్రంగా స్పందించింది. షోయబ్‌తో కొంత కాలం గడిపినందుకుగాను తను గర్భవతినయ్యాయనీ ఓ దినపత్రికకు ఇచ్చిన ఫోన్ ఇంటర్య్వూలో తెలిపినట్లు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 5 Apr 2010 | 3:01 am

రాజకీయ నాయకుల పదవీ కాలానికి గ్యారెంటీ లేదు: రోశయ్య

రాజకీయ నాయకుల పదవీ కాలానికి గ్యారెంటీ ఉండదని, కాని ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ పదవీ విరమణకు గ్యారెంటీ ఉంటుందని ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య అన్నారు. సోమవారం ఉదయం ఆయన పదవీ విరమణ ఉద్యోగుల సంఘం రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 5 Apr 2010 | 2:37 am