మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకాభిప్రాయం కుదరలేదు: ప్రణబ్

వచ్చే లోక్‌‍సభ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం యూపీఏ ప్రభుత్వం ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో మహిళా బిల్లుపై ఏకాభిప్రాయం కొరకు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదని కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 5 Apr 2010 | 9:01 am

అయ్యెయ్యో అయేషా...!!: పాకిస్తాన్ ప్రజలు

పాకిస్తాన్ సెలబ్రిటీ షోయబ్ ప్రేమలో ఇరుక్కుపోయి, ఆనక అతడిని వివాహమాడి నిరాదరణకు గురైన అయేషాపట్ల పాకిస్తాన్ ప్రజల నుంచి పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమవుతోంది. పాకిస్తాన్‌లోని జియో టెలివిజన్ ఛానల్ చేపట్టిన సర్వేలో అయేషాకు అనుకూలంగా 68 శాతం ప్రజలు ఓట్ చేస్తే, మాలిక్‌కు అనుకూలంగా 32 శాతం ప్రజలే నిలిచారు.
Source: Yahoo! Telugu: News | 5 Apr 2010 | 8:52 am

గ్రామీణ మార్కెట్లపై సేవాపన్ను విధించకండి: స్వాతి పిరమల్

గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపార మార్కెట్లపై సేవాపన్ను విధించకూడదని అస్సోచెమ్ అధ్యక్షురాలు స్వాతి పిరమల్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను సోమవారం న్యూ ఢిల్లీలో కోరారు. దీంతో కంపెనీల నుంచి ఉత్పత్తయ్యే వస్తువులు తక్కువ ధరలకే లభిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 5 Apr 2010 | 8:47 am

ఊపందుకున్న కొనుగోళ్లు: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి

దేశీయ వాటాల కొనుగోళ్లు పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలతో ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 159 పాయింట్లు వృద్ధి చెందింది. దీంతో సెన్సెక్స్ మార్కు 17,852 పాయింట్లను తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 50 పాయింట్లు బలపడి, 5,341 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 5 Apr 2010 | 8:31 am

పెషావర్‌లో ఆత్మాహుతి దాడులు: 25 మంది మృతి

పెషావర్ ఆత్మాహుతి బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ బాంబు పేలుళ్ల సంఘటనలో 25 మంది దారుణంగా మరణించారు. అమెరికా ఎంబసీ కేంద్రం లక్ష్యంగా వరుస ఆత్మాహుతి బాంబు పేలుళ్లు జరిగాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 5 Apr 2010 | 8:24 am

రాజకీయ నాయకుల పదవీ కాలానికి గ్యారెంటీ లేదు: రోశయ్య

రాజకీయ నాయకుల పదవీ కాలానికి గ్యారెంటీ ఉండదని, కాని ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ పదవీ విరమణకు గ్యారెంటీ ఉంటుందని ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య అన్నారు. సోమవారం ఉదయం ఆయన పదవీ విరమణ ఉద్యోగుల సంఘం రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
Source: Yahoo! Telugu: News | 5 Apr 2010 | 8:05 am

షోయబ్ మాలిక్ కేసు: భారత్‌తో టచ్‌లో ఉన్న పాక్

అయేషాతో వివాహం అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న షోయబ్ మాలిక్‌‌కు సంబంధించి భారత ప్రభుత్వానికి అవసరమైన సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. అయేషా సిద్ధిఖీ షోయబ్‌పై నమోదు చేసిన కేసులేమిటన్న దానిపై పాక్ ఆరా తీసింది.
Source: Yahoo! Telugu: News | 5 Apr 2010 | 7:50 am

రష్యాలో ఆత్మాహుతి దాడి: మృతి చెందిన పోలీసు

రష్యాలోని ఉత్తర కాకేసస్ ప్రాంతంలోనున్న ఇంగుశేటియాలోని పోలీసు హెడ్‌క్వార్టర్ వద్ద ఆత్మాహుతి దాడి జరగడంతో ఒక పోలీసు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైనట్లు రష్యా స్థానిక అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సోమవారం వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 5 Apr 2010 | 7:45 am

భారీ లాభాల దిశగా సెన్సెక్స్, నిఫ్టీల పయనం

సోమవారం బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాల దిశగా కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాల దిశగా కొనసాగుతోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, 146 పాయింట్లు బలపడి, 17,838 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 40 పాయింట్లు పుంజుకుని, 5,330 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 5 Apr 2010 | 7:29 am

చైనా రసాయన కర్మాగారంలో భారీ విస్ఫోటనం: ఇద్దరి మృతి

ఉత్తర చైనాలోని షేఫింగ్ నగరంలోనున్న ఓ రసాయన కర్మాగారంలో భారీ విస్ఫోటనం సంభవించడంతో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక మీడియా తెలిపింది. విస్ఫోటనం జరగడంతో పరిసర ప్రాంతాలలోనున్న 700 మందిని అక్కడి నుంచి తరలించినట్లు పోలీసు అధికార వర్గాలు పేర్కొన్నాయి
Source: Yahoo! Telugu: News | 5 Apr 2010 | 7:12 am

రామ్ గోపాల్ వర్మ తదుపరి చిత్రం "గాడ్ అండ్ సెక్స్"

ఇహపర సుఖాలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక సాగరాన్ని ఆవిష్కరించాల్సిన గురువులు "సెక్స్.. సెక్స్... సెక్స్.." అంటూ దానివైపు అర్రులు చాస్తూ పరుగెడుతున్నారు. దేశంలోని ప్రముఖ బాబాలలో చాలామంది సెక్స్ ఆరోపణలు ఎదుర్కొనడం నేడు మామూలై పోయింది. ఈ నేపధ్యంలో వీరి గాధలను ఆధారం చేసుకుని సినిమా తీస్తే ఎలా ఉంటుందీ...? అని ఆలోచించిన రామ్ గోపాల్ వర్మ వెంటనే "గాడ్ అండ్ సెక్స్" అనే చిత్రాన్ని తీయబోతున్నట్లు ప్రకటించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Apr 2010 | 6:39 am

షోయబ్‌‍పై బిగుస్తున్న ఉచ్చు: పోలీసుల విచారణ

పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు షోయబ్ మాలిక్‌ చుట్టూ నగర పోలీసుల ఉచ్చు బిగుస్తున్నారు. నగరాన్ని వీడి వెళ్ళేందుకు వీలులేదని హైదరాబాద్‌ నగర పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు ఆంక్షలు విధించారు. ఒకవేళ హైదరాబాద్‌ను వదిలి వెళ్లాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని షోయబ్‌ను పోలీసులు కోరారు.
Source: ఏపీ న్యూస్ | 5 Apr 2010 | 4:12 am

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకాభిప్రాయం కుదరలేదు: ప్రణబ్

వచ్చే లోక్‌‍సభ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం యూపీఏ ప్రభుత్వం ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో మహిళా బిల్లుపై ఏకాభిప్రాయం కొరకు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదని కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ తెలిపారు.
Source: జాతీయ | 5 Apr 2010 | 3:32 am

అయేషా గర్భవతి: షోయబ్ మాలిక్ పాస్‌పోర్ట్ స్వాధీనం

అయేషాను తను ఇంతవరకూ చూడలేదని పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఆదివారం విలేకరుల ఎదుట చెప్పిన కొద్ది గంటల్లోనే అయేషా దానిపై తీవ్రంగా స్పందించింది. షోయబ్‌తో కొంత కాలం గడిపినందుకుగాను తను గర్భవతినయ్యాయనీ ఓ దినపత్రికకు ఇచ్చిన ఫోన్ ఇంటర్య్వూలో తెలిపినట్లు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 5 Apr 2010 | 3:01 am

రాజకీయ నాయకుల పదవీ కాలానికి గ్యారెంటీ లేదు: రోశయ్య

రాజకీయ నాయకుల పదవీ కాలానికి గ్యారెంటీ ఉండదని, కాని ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ పదవీ విరమణకు గ్యారెంటీ ఉంటుందని ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య అన్నారు. సోమవారం ఉదయం ఆయన పదవీ విరమణ ఉద్యోగుల సంఘం రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 5 Apr 2010 | 2:37 am

మహిళా బిల్లును వ్యతిరేకించి తీరుతాం: యాదవ్ ద్వయం

నేడు జరగనున్న అఖిలపక్ష సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును తాము వ్యతిరేకిస్తామని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పి), రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)లు సోమవారం న్యూ ఢిల్లీలో ప్రకటించాయి.
Source: జాతీయ | 5 Apr 2010 | 2:07 am

నక్సలిజమే దేశానికి ప్రథమ శత్రువు: హోం మంత్రి చిదంబరం

నక్సలిజమే భారతదేశానికి ప్రథమ శత్రువని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం వెల్లడించారు. మరో రెండు మూడు సంవత్సరాలలో దీనిని కూకటి వేళ్లతో పెరికి వేస్తామని అన్నారు. భారీ విధ్వంసాలకు పాల్పడేందుకు వారు చేపట్టిన కుట్రలన్నిటినీ ప్రభుత్వం సమర్థవంతంగా ఛేదిస్తూ వస్తోందన్నారు.
Source: జాతీయ | 5 Apr 2010 | 1:36 am

నేటి నుండి నగరంలో పగటి పూట కర్ఫ్యూ సడలింపు: ఏకే ఖాన్

పాతబస్తీలో నేటి నుండి పగటిపూట కర్ఫ్యూ సడలించారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కర్ఫ్యూ సడలించినట్లు నగర పోలీసు కమీషనర్‌ ఏకే ఖాన్‌ సోమవారం మీడియాకు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 4 Apr 2010 | 11:43 pm

అమెరికాలో ప్రారంభమయ్యే అణు సదస్సుకు ప్రధాని

ఉగ్రవాదుల చేతుల్లోకి అణ్వాయుధాలు చేరుతున్నాయనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికాలో జరగనున్న అణు సదస్సుకు ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ హాజరుకానున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి నిరుపమా రావు మీడియాకు తెలిపారు.
Source: జాతీయ | 4 Apr 2010 | 10:23 pm

మహిళా బిల్లుపై ప్రతిపక్ష నేతలతో చర్చించనున్న ప్రణబ్‌

లోక్‌సభ రెండోవిడత బడ్జెట్‌ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగానే కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా జాతీయ, ప్రాంతీయ ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ప్రతిపక్ష నాయకులతో కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్‌ ముఖర్జీ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు.
Source: జాతీయ | 4 Apr 2010 | 10:18 pm

పాతబస్తీ అల్లర్లపై నివేదిక కోరిన మానవహక్కుల కమీషన్

పాతబస్తీలో గత వారం జరిగిన అల్లర్లపై ఈ నెల 7వ తేదీలోగా ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ఛైర్మెన్ నగర పోలీసు కమీషనర్‌కు ఆదేశాలిచ్చారు. పాతబస్తీలో జరిగిన అల్లర్లలో అనుమానితుల పేరిట పోలీసులు అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎంబీటీ నేత అమ్జాదుల్లా ఖాన్ ఈ నెల 1న రాష్ట్ర మానవహక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 4 Apr 2010 | 6:47 am

16న ప్రేక్షకుల ముందుకు శర్వానంద్ "ప్రస్థానం"!

శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "ప్రస్థానం". దేవకట్టా దర్శకత్వంలో, రవి వల్లభనేని నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు శర్వానంద్ తెలిపారు. రెండు సంవత్సరాలుగా ఈ కథను చాలా శ్రద్ధతో తయారు చేసుకున్నామని, సాంకేతికంగా మరింత బాగా చేయాలనే క్రమంలో ఈ సినిమా విడుదల జాప్యం జరిగిందని చెప్పారు.దర్శకుడు మాట్లాడుతూ.. "వెన్నెల" చిత్రం తర్వాత తాను చేస్తున్న చిత్రమిదన్నారు. ఈ చిత్రం రాజకీయ చిత్రం కాదని, అలా అని రాజకీయం లేకపోలేదని చెప్పుకొచ్చారు. ఇంకా అన్ని అంశాలు సంపూర్ణంగా ఉన్న చిత్రమిదని, ప్రధానంగా మూడు పాత్ర మధ్య కథ నడుస్తుందని అన్నారు. శర్వానంద్, సాయికుమార్, సందీప్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో చక్కటి సందేశం కూడా ఇమిడి ఉందని తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Apr 2010 | 6:15 am

ఆకాష్ "ఆయుధ పోరాటం" షూటింగ్ పూర్తి

ఆకాష్, సాయికిరణ్, అతిథ్ శ్రీనివాస్, ప్రీతి మినాల్, అనితారెడ్డి ప్రధాన తారాగణంగా "ఆయుధ పోరాటం" అనే చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శనివారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో దర్శకుడు ఆకాష్ మాట్లాడుతూ.. "దేశంలో ఏడు రాష్ట్రాలకు చెందిన వారు ఒక్కటి కలిసి ఒక టీమ్‌గా ఏర్పడి ఒక సమస్యను పరిష్కరిస్తారు. అది ఏమిటి? అనేది సినిమా. త్వరలో ఆడియోను, సినిమాను విడుదల చేయనున్నాం" అని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Apr 2010 | 6:12 am

తెలంగాణపై "ఓరి దేవుడా..! కాలం మారెలా..!" చిత్రం ప్రారంభం!

న్యూవే క్రియేషన్స్ అనే బేనర్‌పై తెలంగాణా నేపథ్యంలో అంతా తెలంగాణావారితో "ఓరి దేవుడా! కాలం మారెలా!" అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం పాటల రికార్డింగ్ ప్రారంభించారు. అందరూ కొత్తవారితో "ఓరి దేవుడా! కాలం మారెలా!" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దర్శకుడు రవి ములకలపల్లి తెలియజేస్తున్నారు.శనివారం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో పాటల రికార్డింగ్ ప్రారంభించారు. దీనికి తెలంగాణాకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పెద్దపాకరరమేష్ మాట్లాడుతూ.. ఇది ఫక్తు తెలంగాణా సినిమా అని, ఇందులో అందరూ తెలంగాణా జిల్లాల్లోని ఆర్టిస్టులకూ అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Apr 2010 | 6:06 am

మావోల అణచివేతకు సైన్యాన్ని ఉపయోగించం: హోం మంత్రి

మావోయిస్టుల అణచివేతకు సైన్యాన్ని ఉపయోగించే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం కేంద్ర హోం మంత్రి పశ్చిమ బెంగాల్‌‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన లాల్గర్‌‌లో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. మావోయిస్టుల దుశ్చర్యలను తుదిముట్టించేందుకుగాను సైనిక చర్యలు చేపట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే పోలీసులు, పారామిలటరీ సహాయంతో మావోయిస్టుల భరతం పడుతామని మంత్రి ఉద్ఘాటించారు.
Source: జాతీయ | 4 Apr 2010 | 4:35 am

సానియానే నా మొదటి భార్య: షోయబ్ మాలిక్

గత కొద్ది రోజులుగా భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా, పాక్ క్రికెట్ ఆటగాడు షోయబ్ మాలిక్‌ల విషయం రాష్ట్రంలోనే కాక ఇరు దేశాల్లోను సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం షోయబ్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తాను సోనియాను వివాహమాడేందుకే హైదరాబాద్ వచ్చానని, సానియానే తన మొదటి భార్య అని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 15న తమ వివాహం హైదరాబాద్‌లోనే జరుగుతుందని, దుబాయ్‌లో కాదని ఆయన మీడియాకు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 4 Apr 2010 | 4:33 am

పాతబస్తీలో కర్ఫ్యూను మరింత సడలిస్తాం: రోశయ్య

పాతబస్తీలోని పరిస్థితి ప్రస్తుతం కుదుటపడుతోందని ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనున్న శ్రీ వేంకటేశ్వరుని కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం విశాఖపట్టణం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతబస్తీలోని పరిస్థితులు సర్దుకుంటున్నాయన్నారు. సోమవారం అక్కడ మరింత కర్ఫ్యూ సడలించమని తాము పోలీసులకు ఆదేశాలిచ్చామన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Apr 2010 | 3:05 am

ఒడిషాలో మందుపాతరకు బలైన ఆరుగురు జవాన్లు

ఒడిషాలోని కొరాపుట్ జిల్లాలోని బాయ్‌పారిగూడ సమీపంలో మావోయిస్టుల మందుపాతరకు ఆరుగురు జవాన్లు బలయ్యారు. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మందుపాతర పేలుడు ధాటికి జవాన్లను తీసుకెళుతున్న వాహనం ఒక్కసారిగా ఎగిరిపడిందని దీంతో జవాన్లు సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Source: జాతీయ | 4 Apr 2010 | 2:47 am