చక్కెర దిగుమతి మూడు మిలియన్ టన్నులు: ప్రభుత్వం

ప్రపంచంలోనే అత్యధికంగా చక్కెర వినియోగించే దేశం మనది. దీనికిగాను 2009-10 సెప్టెంబరుతో ముగిసే చక్కెర ఉత్పత్తి సంవత్సరం ప్రథమార్థంలో మూడు మిలియన్ టన్నుల పంచదారను దిగుమతి చేసుకున్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 4 Apr 2010 | 9:01 am

పాతబస్తీలో కర్ఫ్యూను మరింత సడలిస్తాం: రోశయ్య

పాతబస్తీలోని పరిస్థితి ప్రస్తుతం కుదుటపడుతోందని ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనున్న శ్రీ వేంకటేశ్వరుని కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం విశాఖపట్టణం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతబస్తీలోని పరిస్థితులు సర్దుకుంటున్నాయన్నారు. సోమవారం అక్కడ మరింత కర్ఫ్యూ సడలించమని తాము పోలీసులకు ఆదేశాలిచ్చామన్నారు.
Source: Yahoo! Telugu: News | 4 Apr 2010 | 8:34 am

మావోల అణచివేతకు సైన్యాన్ని ఉపయోగించం: హోం మంత్రి

మావోయిస్టుల అణచివేతకు సైన్యాన్ని ఉపయోగించే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం కేంద్ర హోం మంత్రి పశ్చిమ బెంగాల్‌‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన లాల్గర్‌‌లో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. మావోయిస్టుల దుశ్చర్యలను తుదిముట్టించేందుకుగాను సైనిక చర్యలు చేపట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే పోలీసులు, పారామిలటరీ సహాయంతో మావోయిస్టుల భరతం పడుతామని మంత్రి ఉద్ఘాటించారు.
Source: Yahoo! Telugu: News | 4 Apr 2010 | 8:26 am

ఒడిషాలో మందుపాతరకు బలైన ఆరుగురు జవాన్లు

ఒడిషాలోని కొరాపుట్ జిల్లాలోని బాయ్‌పారిగూడ సమీపంలో మావోయిస్టుల మందుపాతరకు ఆరుగురు జవాన్లు బలయ్యారు. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మందుపాతర పేలుడు ధాటికి జవాన్లను తీసుకెళుతున్న వాహనం ఒక్కసారిగా ఎగిరిపడిందని దీంతో జవాన్లు సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 4 Apr 2010 | 8:17 am

విద్యా హక్కు చట్టం అమలుకు నిధుల్లేవు: మాయావతి

గురువారం అమలులోకి వచ్చిన విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు కూడా నిధుల్లేవని మాయావతి పాడిన పాటే పాడుతున్నారు. ఇంకా దేశంలోని ప్రతి చిన్నారికి నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడమే లక్ష్యంగా యూపీఏ సర్కారు అమలు చేసిన విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని దేశ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మాయావతి ఓ లేఖ రాశారు.
Source: Yahoo! Telugu: News | 4 Apr 2010 | 7:33 am

హైతీలో కొనసాగుతున్న పునర్నిర్మాణాలు

హైతీలో జనవరి 12న జరిగిన భారీ భూకంపంలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. కూలిపోయిన పలు భవన సముదాయాలను తిరిగి పునర్నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భవంతుల వ్యర్థ పదార్థాలను తిరిగి వినియోగించుకునేందుకు వీలుగా వాటిని రీసైక్లింగ్ చేస్తున్నామని స్థానిక అధికారులు ఆదివారం వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 4 Apr 2010 | 7:07 am

ప్రజలకు, నాయకులకు ఒకే చట్టం ఉండాలి : ఫాతిమా భుట్టో

పాకిస్థాన్‌లో అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అధికారాలను తగ్గించేందుకు ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సముచితమైందేనని, అందిరికీ సమాన చట్టం ఉండాలని పాక్ మాజీ ప్రధాని, దివంగత బేనజీర్ భుట్టో కోడలు ఫాతిమా భుట్టో అభిప్రాయపడ్డారు
Source: Yahoo! Telugu: News | 4 Apr 2010 | 6:45 am

పాతబస్తీ అల్లర్లపై నివేదిక కోరిన మానవహక్కుల కమీషన్

పాతబస్తీలో గత వారం జరిగిన అల్లర్లపై ఈ నెల 7వ తేదీలోగా ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ఛైర్మెన్ నగర పోలీసు కమీషనర్‌కు ఆదేశాలిచ్చారు. పాతబస్తీలో జరిగిన అల్లర్లలో అనుమానితుల పేరిట పోలీసులు అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎంబీటీ నేత అమ్జాదుల్లా ఖాన్ ఈ నెల 1న రాష్ట్ర మానవహక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు.
Source: Yahoo! Telugu: News | 4 Apr 2010 | 6:25 am

16న ప్రేక్షకుల ముందుకు శర్వానంద్ "ప్రస్థానం"!

శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "ప్రస్థానం". దేవకట్టా దర్శకత్వంలో, రవి వల్లభనేని నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు శర్వానంద్ తెలిపారు. రెండు సంవత్సరాలుగా ఈ కథను చాలా శ్రద్ధతో తయారు చేసుకున్నామని, సాంకేతికంగా మరింత బాగా చేయాలనే క్రమంలో ఈ సినిమా విడుదల జాప్యం జరిగిందని చెప్పారు.దర్శకుడు మాట్లాడుతూ.. "వెన్నెల" చిత్రం తర్వాత తాను చేస్తున్న చిత్రమిదన్నారు. ఈ చిత్రం రాజకీయ చిత్రం కాదని, అలా అని రాజకీయం లేకపోలేదని చెప్పుకొచ్చారు. ఇంకా అన్ని అంశాలు సంపూర్ణంగా ఉన్న చిత్రమిదని, ప్రధానంగా మూడు పాత్ర మధ్య కథ నడుస్తుందని అన్నారు. శర్వానంద్, సాయికుమార్, సందీప్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో చక్కటి సందేశం కూడా ఇమిడి ఉందని తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Apr 2010 | 6:15 am

ఆకాష్ "ఆయుధ పోరాటం" షూటింగ్ పూర్తి

ఆకాష్, సాయికిరణ్, అతిథ్ శ్రీనివాస్, ప్రీతి మినాల్, అనితారెడ్డి ప్రధాన తారాగణంగా "ఆయుధ పోరాటం" అనే చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శనివారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో దర్శకుడు ఆకాష్ మాట్లాడుతూ.. "దేశంలో ఏడు రాష్ట్రాలకు చెందిన వారు ఒక్కటి కలిసి ఒక టీమ్‌గా ఏర్పడి ఒక సమస్యను పరిష్కరిస్తారు. అది ఏమిటి? అనేది సినిమా. త్వరలో ఆడియోను, సినిమాను విడుదల చేయనున్నాం" అని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Apr 2010 | 6:12 am

తెలంగాణపై "ఓరి దేవుడా..! కాలం మారెలా..!" చిత్రం ప్రారంభం!

న్యూవే క్రియేషన్స్ అనే బేనర్‌పై తెలంగాణా నేపథ్యంలో అంతా తెలంగాణావారితో "ఓరి దేవుడా! కాలం మారెలా!" అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం పాటల రికార్డింగ్ ప్రారంభించారు. అందరూ కొత్తవారితో "ఓరి దేవుడా! కాలం మారెలా!" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దర్శకుడు రవి ములకలపల్లి తెలియజేస్తున్నారు.శనివారం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో పాటల రికార్డింగ్ ప్రారంభించారు. దీనికి తెలంగాణాకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పెద్దపాకరరమేష్ మాట్లాడుతూ.. ఇది ఫక్తు తెలంగాణా సినిమా అని, ఇందులో అందరూ తెలంగాణా జిల్లాల్లోని ఆర్టిస్టులకూ అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Apr 2010 | 6:06 am

నవాజ్‌‌తో స్నేహం చేయనున్న జర్దారీ

తన అధ్యక్ష పదవిలో అధికారాల్లో పాక్ ప్రభుత్వం కోత విధించడంతో పాకిస్థాన్ ప్రతిపక్ష పార్టీ అయిన ముస్లిం లీగ్-నవాజ్(పీఎమ్ఎల్-ఎన్) అధినేత నవాజ్ షరీఫ్‌తో స్నేహం పెంచుకునేందుకు సిద్ధంగానున్నట్లు పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ మీడియాకు తెలిపారు
Source: Yahoo! Telugu: News | 4 Apr 2010 | 5:58 am

కొత్త పార్టీని ప్రకటించనున్న ఎస్‌పీ మాజీ నేత అమర్‌ సింగ్

సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ త్వరలో పార్టీ పెట్టనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దేవరియాలో ఈ నెల 15 న రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సన్నాహాలు ప్రారంభమైనట్లు అమర్ సింగ్ మోరటా గ్రామంలో తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 4 Apr 2010 | 5:42 am

పాతబస్తీలో కర్ఫ్యూను మరింత సడలిస్తాం: రోశయ్య

పాతబస్తీలోని పరిస్థితి ప్రస్తుతం కుదుటపడుతోందని ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనున్న శ్రీ వేంకటేశ్వరుని కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం విశాఖపట్టణం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతబస్తీలోని పరిస్థితులు సర్దుకుంటున్నాయన్నారు. సోమవారం అక్కడ మరింత కర్ఫ్యూ సడలించమని తాము పోలీసులకు ఆదేశాలిచ్చామన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Apr 2010 | 3:05 am

మావోల అణచివేతకు సైన్యాన్ని ఉపయోగించం: హోం మంత్రి

మావోయిస్టుల అణచివేతకు సైన్యాన్ని ఉపయోగించే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం కేంద్ర హోం మంత్రి పశ్చిమ బెంగాల్‌‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన లాల్గర్‌‌లో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. మావోయిస్టుల దుశ్చర్యలను తుదిముట్టించేందుకుగాను సైనిక చర్యలు చేపట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే పోలీసులు, పారామిలటరీ సహాయంతో మావోయిస్టుల భరతం పడుతామని మంత్రి ఉద్ఘాటించారు.
Source: జాతీయ | 4 Apr 2010 | 2:56 am

ఒడిషాలో మందుపాతరకు బలైన ఆరుగురు జవాన్లు

ఒడిషాలోని కొరాపుట్ జిల్లాలోని బాయ్‌పారిగూడ సమీపంలో మావోయిస్టుల మందుపాతరకు ఆరుగురు జవాన్లు బలయ్యారు. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మందుపాతర పేలుడు ధాటికి జవాన్లను తీసుకెళుతున్న వాహనం ఒక్కసారిగా ఎగిరిపడిందని దీంతో జవాన్లు సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Source: జాతీయ | 4 Apr 2010 | 2:47 am

పాతబస్తీలో కర్ఫ్యూ సడలించిన ప్రభుత్వం

పాతబస్తీలో గత కొద్ది రోజులుగా అమల్లో ఉన్న కర్ఫ్యూను ఆదివారం మూడు గంటల పాటు సడలించారు. ఆయా ప్రాంతాల్లో రెండు విడతల్లో ఈ సడలింపు అమలు చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Apr 2010 | 2:08 am

విద్యా హక్కు చట్టం అమలుకు నిధుల్లేవు: మాయావతి

గురువారం అమలులోకి వచ్చిన విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు కూడా నిధుల్లేవని మాయావతి పాడిన పాటే పాడుతున్నారు. ఇంకా దేశంలోని ప్రతి చిన్నారికి నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడమే లక్ష్యంగా యూపీఏ సర్కారు అమలు చేసిన విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని దేశ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మాయావతి ఓ లేఖ రాశారు.
Source: జాతీయ | 4 Apr 2010 | 2:03 am

ప్రజలకు, నాయకులకు ఒకే చట్టం ఉండాలి : ఫాతిమా భుట్టో

పాకిస్థాన్‌లో అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అధికారాలను తగ్గించేందుకు ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సముచితమైందేనని, అందిరికీ సమాన చట్టం ఉండాలని పాక్ మాజీ ప్రధాని, దివంగత బేనజీర్ భుట్టో కోడలు ఫాతిమా భుట్టో అభిప్రాయపడ్డారు
Source: జాతీయ | 4 Apr 2010 | 1:16 am

పాతబస్తీ అల్లర్లపై నివేదిక కోరిన మానవహక్కుల కమీషన్

పాతబస్తీలో గత వారం జరిగిన అల్లర్లపై ఈ నెల 7వ తేదీలోగా ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ఛైర్మెన్ నగర పోలీసు కమీషనర్‌కు ఆదేశాలిచ్చారు. పాతబస్తీలో జరిగిన అల్లర్లలో అనుమానితుల పేరిట పోలీసులు అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎంబీటీ నేత అమ్జాదుల్లా ఖాన్ ఈ నెల 1న రాష్ట్ర మానవహక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 4 Apr 2010 | 12:55 am

కొత్త పార్టీని ప్రకటించనున్న ఎస్‌పీ మాజీ నేత అమర్‌ సింగ్

సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ త్వరలో పార్టీ పెట్టనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దేవరియాలో ఈ నెల 15 న రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సన్నాహాలు ప్రారంభమైనట్లు అమర్ సింగ్ మోరటా గ్రామంలో తెలిపారు.
Source: జాతీయ | 4 Apr 2010 | 12:34 am

తెలంగాణ జేఏసీ ఛైర్మెన్ కోదండరాంకు స్వల్పగాయాలు

ఘట్‌కేసర్‌ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఛైర్మెన్‌ ప్రొఫెసర్ కోదండరాంకు స్పల్పగాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
Source: ఏపీ న్యూస్ | 3 Apr 2010 | 11:13 pm

మావోల అణచివేత చర్యలపై కేంద్ర హోం మంత్రి సమీక్ష!

దేశంలో పెచ్చరిల్లిపోతున్న మావోయిస్టుల దుశ్చర్యలను అరికట్టే దిశగా కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం సమీక్ష నిర్వహించనున్నారు. నక్సలైట్ల ప్రభావిత ప్రాంతమైన పశ్చిమ బెంగాల్‌‌లో పర్యటించేందుకుగాను ఆదివారం మిడ్నాపూర్‌లోని లాల్గర్ ప్రాంతానికి హోం మంత్రి చేరుకున్నారు. మావోయిస్టులు విధ్వంసం సృష్టించే ప్రదేశాలైన లాల్గర్, మిడ్నాపూర్‌లో పి. చిదంబరం స్వయంగా పర్యవేక్షిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రదేశాలను పర్యవేక్షించిన అనంతరం కేంద్ర హోం మంత్రి చిదంబరం మావోయిస్టుల అణచివేత చర్యలపై దేశ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సమావేశమవుతారని తెలిసింది.
Source: జాతీయ | 3 Apr 2010 | 10:11 pm

లక్షలు పలికిన జూనియర్ ఎన్టీఆర్ కోటు, హ్యాటూ

"అదుర్స్" చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఉపయోగించిన కోటు, టోపీని వేలం వేయగా లక్షల రూపాయలు వచ్చాయి. ఆ మొత్తాన్ని పేద కళాకారుల సహాయార్థం ఉపయోగిస్తామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ తెలిపారు. శనివారం సాయంత్రం 4.30 గంటలకు ఫిలిమ్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ... నా అభిమానులు ఇటువంటి మంచి పనికోసం ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. "మా" అసోసియేషన్‌కు ఎటువంటి అవసరమున్నా నేను ముందుంటాను. "మా" వెబ్‌సైట్ ఈ వేలంపాటను వేసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Apr 2010 | 11:41 am

'బ్రహ్మలోకం టు యమలోకం' (వయా భూలోకం) షూటింగ్ పూర్తి!

డాక్టర్. రాజేంద్రప్రసాద్, శివాజీ కాంబినేషనల్‌లో రూపొందుతున్న చిత్రం "బ్రహ్మలోకం టు యమలోకం (వయా భూలోకం)". లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ (గోపీ), రూపేష్ డి. గోహిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, గోళ్లపాటి నాగేశ్వరరావు దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. "అందమైన ఫాంటసీ మిళితమైన చిత్రమిది. డాక్టర్ రాజేంద్రప్రసాద్ బ్రహ్మదేవునిగాను, కళ్యాణి సరస్వతిదేవిగాను, ఆర్తీ అగర్వాల్ రంభగానూ, జయప్రకాశ్ రెడ్డి యమధర్మరాజుగాను ఇందులో కనిపిస్తారు. బ్రహ్మగా రాజేంద్రప్రసాద్‌ను వెండితెరపై అద్భుతంగా చూపిస్తారు. శివాజీ పాత్ర చిత్రణ కనువిందు చేస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి" అని తెలిపారు
Source: Yahoo! Telugu: Entertainment | 3 Apr 2010 | 11:28 am

23న వస్తోన్న ప్రభాస్, కాజల్‌ అగర్వాల్‌ల "డార్లింగ్"

యంగ్‌ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై "తొలిప్రేమ" కరుణాకరన్ దర్శకత్వంలో "ఛత్రపతి" ప్రసాద్ నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఫిలిమ్ "డార్లింగ్" షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా.. నిర్మాత ఛత్రపతి ప్రసాద్ మాట్లాడుతూ.. "డార్లింగ్" కరుణాకరన్ స్టైల్‌లో మంచి ఫీల్ వున్న సినిమా. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. లవ్‌స్టోరీ అయినా కూడా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్ అద్భుతంగా చేశాడు. కరుణాకరన్ ఎక్స్‌ట్రార్డనరీగా తీశాడు. టేకింగ్ సైడ్‌గానీ, మేకింగ్ సైడ్‌గానీ రిచ్‌గా ఉంటుంది. లవ్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ ఉండడం వలన యూనివర్శల్ అప్రోచ్ వస్తుంది. ఒక పాట మినహా చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. డీటీఎస్ మిక్సింగ్ జరుగుతోంది. ఏప్రిల్ తొలివారంలోనే ఆడియోను విడుదల చేసి, ఏప్రిల్ 23న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Apr 2010 | 11:12 am

సానియా పెళ్లి ఆమె వ్యక్తిగత విషయం: జైపాల్ రెడ్డి

పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా వివాహం చేసుకోవడంపై శివసేన చీఫ్ బాల్ థాకరే చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఖండించారు. ప్రతి విషయానికి మత రంగు పులమడమే బాల్ థాకరే నైజమని దుయ్యబట్టారు.
Source: జాతీయ | 3 Apr 2010 | 8:55 am

పాఠశాల విద్యార్థులకు మావోలు క్షమాపణలు

బీహార్‌లోని పాఠశాలలపై దాడులు జరిపినందుకుగాను మావోయిస్టులు పాఠశాల విద్యార్థులకు క్షమాపణలు చెప్పుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పాఠశాల విద్యార్థులకు బిట్ నోటీసులను మావోయిస్టులు పంపిణీ చేశారు. ఇందులో పాఠశాల భవనాలపై బాంబులతో విధ్వంసం జరిపినందుకు తమను క్షమించాల్సిందిగా మావోయిస్టులు క్షమాపణలు కోరినట్లు ఉంది.
Source: జాతీయ | 3 Apr 2010 | 8:54 am

"జనగణన" ప్రక్రియకు ప్రజలు సహకరించాలి: ప్రధాని

దేశవ్యాప్తంగా ప్రారంభమైన జనగణన ప్రక్రియకు దేశ ప్రజలంతా పూర్తి సహకారం అందజేయాలని దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పిలుపు నిచ్చారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన జనాభా లెక్కల ప్రక్రియకు దేశ ప్రజల మద్దతు చాలా అవసరమని ప్రధాని పేర్కొన్నారు. 120 కోట్లమంది భారతీయులను లెక్కించే ప్రక్రియ దేశ ప్రథమ మహిళ ప్రతిభా పాటిల్ వివరాల సేకరణతో గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 3 Apr 2010 | 8:54 am

సానియా ఇంట్లో షోయబ్ పాగా: అయేషాతో రాజీకి యత్నం

శుక్రవారం అర్థరాత్రి దుబాయ్ నుంచి నేరుగా సానియా ఇంటికి వచ్చిన షోయబ్ మాలిక్ సానియా ఇంట్లో పాగా వేశాడు. ఉదయంవేళ పొరపాటున కెమేరా కంటికి చిక్కిన తర్వాత ఇంతవరకూ బయటకు రాలేదు. కాగా బయట నుంచి మీర్జా కుటుంబ స్నేహితులు లోపలికి వెళుతున్నారు. సమస్యను ఎలా పరిష్కరించుకోవాలన్న దానిపై సానియా మీర్జా కుటుంబం తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 3 Apr 2010 | 8:24 am

శ్రేయకు సద్గురు జగ్గీ వాసుదేవ్ యోగా తరగతులు..?!!

నిత్యానంద, రంజిత రాసలీలలు బయటకు వచ్చినా పలువురు హీరోయిన్లు మాత్రం తాము నమ్ముకున్న బాబాల భక్తిలో ఓలలాడుతూనే ఉన్నారు. ఢిల్లీ భామ శ్రేయ కూడా కోయంబత్తూర్‌కు వీలుదొరికినపుడల్లా వెళ్లి వస్తోందట. ఏమిటి విషయమని ఆరా తీస్తే... అక్కడ జగ్గీ వాసుదేవ్ ఆశ్రమానికి ఆమె తరచూ వెళుతోందని తెలిసింది. పలుమార్లు తన స్నేహితులతో ఈ విషయాన్ని ప్రస్తావించింది కూడా. తానింత స్లిమ్‌గా ఉండటానికి కారణం సద్గురు యోగా తరగతులే అని సెలవిస్తోందట. ఆయన ఆశ్రమంలో ధ్యానం చేస్తుంటే, మనసు ప్రశాంతంగా అనిపిస్తుందని చెపుతోంది. తాను ఇష్టపడే ప్రదేశాల్లో సద్గురు సన్నిధి ఒకటని చెప్పుకొస్తోంది. అందుకే తన సినిమా విడుదలకు ముందు ఆయన ఆశీర్వాదం తీసుకుంటానని చెపుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Apr 2010 | 6:44 am

కేసీఆరూ.. చర్చలకు డేట్ ఫిక్స్ చేసుకో..!: లగడపాటి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కొత్త ఉద్యోగాలు లభించవనే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలపై దుమారం రేగింది. లగడపాటి అసత్యపు వ్యాఖ్యలు చేస్తున్నారని, కాబట్టి ఆయనకు అబద్ధపు పద్మశీ అవార్డు ఇవ్వాలని తెరాస నేతలు దుయ్యబట్టారు. తెరాస విమర్శలపై స్పందించిన లగడపాటి రాజగోపాల్ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావుకు ప్రతి సవాలు విసిరారు. ఈ సందర్భంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడిన లగడపాటి రాజగోపాల్.. తెలంగాణపై తాను ఎలాంటి చర్చకైనా సిద్ధమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణపై చర్చకు తెరాస అధినేతను తేదీని నిర్ణయించుకోవాల్సిందిగా సవాలు విసిరారు
Source: ఏపీ న్యూస్ | 3 Apr 2010 | 6:24 am

అంతర్రాష్ట్ర జల వివాదం: చంద్రుడిపై మండిపడ్డ లక్ష్మణుడు

రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. అంతర్రాష్ట్ర జలవివాదంపై చంద్రబాబు వ్యాఖ్యలు కుటిల రాజకీయమని ఆయన ధ్వజమెత్తారు.
Source: ఏపీ న్యూస్ | 3 Apr 2010 | 6:19 am

లక్షలు పలికిన జూనియర్ ఎన్టీఆర్ కోటు, హ్యాటూ

"అదుర్స్" చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఉపయోగించిన కోటు, టోపీని వేలం వేయగా లక్షల రూపాయలు వచ్చాయి. ఆ మొత్తాన్ని పేద కళాకారుల సహాయార్థం ఉపయోగిస్తామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ తెలిపారు. శనివారం సాయంత్రం 4.30 గంటలకు ఫిలిమ్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Source: వినోదం | 3 Apr 2010 | 6:12 am

'బ్రహ్మలోకం టు యమలోకం' (వయా భూలోకం) షూటింగ్ పూర్తి!

డాక్టర్. రాజేంద్రప్రసాద్, శివాజీ కాంబినేషనల్‌లో రూపొందుతున్న చిత్రం "బ్రహ్మలోకం టు యమలోకం (వయా భూలోకం)". లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ (గోపీ), రూపేష్ డి. గోహిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, గోళ్లపాటి నాగేశ్వరరావు దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. "అందమైన ఫాంటసీ మిళితమైన చిత్రమిది. డాక్టర్ రాజేంద్రప్రసాద్ బ్రహ్మదేవునిగాను, కళ్యాణి సరస్వతిదేవిగాను, ఆర్తీ అగర్వాల్ రంభగానూ, జయప్రకాశ్ రెడ్డి యమధర్మరాజుగాను ఇందులో కనిపిస్తారు. బ్రహ్మగా రాజేంద్రప్రసాద్‌ను వెండితెరపై అద్భుతంగా చూపిస్తారు. శివాజీ పాత్ర చిత్రణ కనువిందు చేస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి" అని తెలిపారు
Source: వినోదం | 3 Apr 2010 | 6:03 am

23న వస్తోన్న ప్రభాస్, కాజల్‌ అగర్వాల్‌ల "డార్లింగ్"

యంగ్‌ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై "తొలిప్రేమ" కరుణాకరన్ దర్శకత్వంలో "ఛత్రపతి" ప్రసాద్ నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఫిలిమ్ "డార్లింగ్" షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా.. నిర్మాత ఛత్రపతి ప్రసాద్ మాట్లాడుతూ.. "డార్లింగ్" కరుణాకరన్ స్టైల్‌లో మంచి ఫీల్ వున్న సినిమా. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. లవ్‌స్టోరీ అయినా కూడా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్ అద్భుతంగా చేశాడు. కరుణాకరన్ ఎక్స్‌ట్రార్డనరీగా తీశాడు. టేకింగ్ సైడ్‌గానీ, మేకింగ్ సైడ్‌గానీ రిచ్‌గా ఉంటుంది. లవ్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ ఉండడం వలన యూనివర్శల్ అప్రోచ్ వస్తుంది. ఒక పాట మినహా చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. డీటీఎస్ మిక్సింగ్ జరుగుతోంది. ఏప్రిల్ తొలివారంలోనే ఆడియోను విడుదల చేసి, ఏప్రిల్ 23న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.
Source: వినోదం | 3 Apr 2010 | 6:02 am

కృష్ణుడి "చేత వెన్నముద్ద" రీ-రికార్డింగ్ పూర్తి!

ఆల్తాఫ్, క్రితిక కృష్ణన్ జంటగా రోహిత్.ఎస్. అభ్యుదయ్ దర్శకత్వంలో ఫుల్‌మూన్ పిక్చర్స్ పతాకంపై పి.ఆర్.కుమార్ నిర్మిస్తున్న "చేత వెన్నముద్ద" చిత్రం రీరికార్డింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత భరత్ కుమార్ మాట్లాడుతూ.. పాటలన్నీ చక్కటి సాహిత్యంతో అందరినీ ఆకట్టుకుంటాయి. సున్నితమైన కథాంశంతో హృదయానికి హత్తుకునే సన్నివేశాలుంటాయి. భిన్న భావోద్వేగాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. తప్పకుండా అందరూ మెచ్చే చిత్రమిదవుతుంది. పాటలను వచ్చే నెల రెండో వారంలో విడుదల చేయనున్నాం. ఇమంది రామారావు రాసిన చిగురాకు కదిలినా పాట హృదయానికి హత్తుకునేలా వుంటుంది. ఈ పాట చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అవుతుంది" అని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Apr 2010 | 5:26 am

త్వరలో రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తా..!: జయప్రద

రాష్ట్రంలో రోజురోజుకి రాజకీయ పరిణామాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మహిళా కోటాలో తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో నటీమణి, కాంగ్రెస్ అభ్యర్థి జయసుధ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారని శనివారం వార్తలు గుప్పుమన్నాయి. ఇదిలావుంటే ప్రముఖ నటీమణి, సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నాయకురాలు జయప్రద తాజాగా రాష్ట్ర రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్నట్లు స్వయంగా తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 3 Apr 2010 | 5:08 am

సికింద్రాబాద్ ఎమ్మెల్యే పదవికి జయసుధ రాజీనామా..!?

సికింద్రాబాద్ ఎమ్మెల్యే పదవికి ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ అభ్యర్థి జయసుధ రాజీనామా చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితోనే జయసుధ తన ఎమ్మెల్యే పదవికి స్వస్తి చెప్పాలని భావిస్తున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ ప్రమేయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జయసుధకు, వైఎస్సార్ హఠాన్మరణంతో తగిన గుర్తింపు లభించలేదు. ఇంకా తనకు మంత్రి పదవి వస్తుందని ఆసక్తితో ఎదురుచూసిన జయసుధకు నిరాశే మిగిలింది. కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన జయసుధ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం ప్రత్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్‌పై విజయం సాధించిన జయసుధ, తాను అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
Source: ఏపీ న్యూస్ | 3 Apr 2010 | 3:16 am

సానియా మాతృభూమికి ద్రోహం చేసింది: వీహెచ్‌పి

వైరి దేశమైన పాకిస్తాన్‌కు చెందిన పౌరుడు షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకోవాలంటూ సానియా తీసుకున్న నిర్ణయం మాతృదేశానికి తీవ్రమైన ద్రోహం చేసేదిగా ఉందంటూ విశ్వహిందూ పరిషత్ నాయకులు మండిపడ్డారు. షోయబ్ మాలిక్‌తో సానియా వివాహం వెనుక అండర్ వరల్డ్ హస్తం ఉందన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 3 Apr 2010 | 3:08 am