|
సైనిక దుస్తుల్లో వచ్చి 25 మందిని హతమార్చిన దుండగులుఇరాక్లోని దక్షిణ బాగ్దాద్‌లోనున్న ఓ గ్రామంలో సైనికుల దుస్తులు ధరించిన కొందరు దుండుగులు శుక్రవారం రాత్రి ఓ ఇంటిపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 25 మందిని హత్య చేశారు.Source: Yahoo! Telugu: News | 3 Apr 2010 | 9:13 am ప్రయాణీకులను ఇంటివరకు దిగబెడతాం : ఎయిర్ ఇండియాప్రభుత్వ విమానయాన రంగమైన ఎయిర్ ఇండియా సంస్థ ప్రయాణీకుల సంఖ్యను మరింత పెంచుకునేందుకు పలు ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా ఇంటి నుంచి విమానాశ్రయం వరకు, విమానాశ్రయం నుంచి ఇంటి వరకు దిగబెట్టేందుకు రవాణా సదుపాయాలను కల్పించనుంది.Source: Yahoo! Telugu: News | 3 Apr 2010 | 8:47 am సికింద్రాబాద్ ఎమ్మెల్యే పదవికి జయసుధ రాజీనామా..!?సికింద్రాబాద్ ఎమ్మెల్యే పదవికి ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ అభ్యర్థి జయసుధ రాజీనామా చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితోనే జయసుధ తన ఎమ్మెల్యే పదవికి స్వస్తి చెప్పాలని భావిస్తున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ ప్రమేయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జయసుధకు, వైఎస్సార్ హఠాన్మరణంతో తగిన గుర్తింపు లభించలేదు. ఇంకా తనకు మంత్రి పదవి వస్తుందని ఆసక్తితో ఎదురుచూసిన జయసుధకు నిరాశే మిగిలింది. కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన జయసుధ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం ప్రత్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్‌పై విజయం సాధించిన జయసుధ, తాను అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది.Source: Yahoo! Telugu: News | 3 Apr 2010 | 8:42 am సానియా మాతృభూమికి ద్రోహం చేసింది: వీహెచ్పివైరి దేశమైన పాకిస్తాన్‌కు చెందిన పౌరుడు షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకోవాలంటూ సానియా తీసుకున్న నిర్ణయం మాతృదేశానికి తీవ్రమైన ద్రోహం చేసేదిగా ఉందంటూ విశ్వహిందూ పరిషత్ నాయకులు మండిపడ్డారు. షోయబ్ మాలిక్‌తో సానియా వివాహం వెనుక అండర్ వరల్డ్ హస్తం ఉందన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 3 Apr 2010 | 8:36 am ఆర్థిక వృద్ధి 9 శాతానికి చేరుకుంటుంది: ప్రణబ్ ముఖర్జీప్రస్తుత ఆర్థిక సంవత్సరం( 2010-11)లో దేశీయ ఆర్థిక వృద్ధి 9 శాతానికి చేరుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ న్యూ ఢిల్లీలో శనివారం వెల్లడించారు. ప్రస్తుత వార్షిక సాధారణ బడ్జెట్‌లో తాము తెలిపిన విధంగా గత ఆర్థిక సంవత్సరం(2009-10)లో ఆర్థిక వృద్ధి 7.2 శాతానికి చేరుకుంటుదని చెప్పామని, అలాగే జరిగిందన్నారు.Source: Yahoo! Telugu: News | 3 Apr 2010 | 8:05 am "జనగణన" ప్రక్రియకు దేశ ప్రజలు సహకరించాలి: ప్రధానిదేశవ్యాప్తంగా ప్రారంభమైన జనగణన ప్రక్రియకు దేశ ప్రజలంతా పూర్తి సహకారం అందజేయాలని దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పిలుపు నిచ్చారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన జనాభా లెక్కల ప్రక్రియకు దేశ ప్రజల మద్దతు చాలా అవసరమని ప్రధాని పేర్కొన్నారు. 120 కోట్లమంది భారతీయులను లెక్కించే ప్రక్రియ దేశ ప్రథమ మహిళ ప్రతిభా పాటిల్ వివరాల సేకరణతో గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 3 Apr 2010 | 7:52 am మేం బతకాల్న... సావాల్న: పాతబస్తీ ప్రజల ఆవేదనతినేందుకు తిండి దొరకడం లేదు.. వైద్యం చేయించుకునేందుకు వీలు లేకుండా ఉంది.. మేం బతకాల్నా... సావాల్నా...? అంటూ పాతబస్తీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా కర్ఫ్యూ ఎత్తివేయాలని కోరుతున్నారు. తామంతా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి జీవిస్తున్నామనీ, తమ మధ్య ఎటువంటి గొడవలు లేవనీ, కొన్ని స్వార్థపర శక్తులు పనికట్టుకుని ఈ అల్లర్లను సృష్టించారన్నారు.Source: Yahoo! Telugu: News | 3 Apr 2010 | 7:24 am హైజాక్ చేసిన భారతీయ నౌకను విడిచిపెట్టిన పైరేట్లు!సోమాలియా తీరంలో హైజాక్‌కు గురైన భారతీయ నౌకను సముద్రపు దొంగలు విడిచిపెట్టారు. గతవారం సోమాలియా తీరంలో సముద్ర దొంగలచే భారత్‌కు నౌకాదళానికి చెందిన నౌక హైజాక్‌కు గురైంది. ఇందులో 120 మంది భారతీయులు ఉన్నారు. సోమాలియా నుంచి దుబాయ్‌కి 8 పడవల్లో వెళ్తున్న సమయంలో భారత నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు.Source: Yahoo! Telugu: News | 3 Apr 2010 | 7:09 am నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయి: ప్రణబ్ ముఖర్జీరబీ పంటల దిగుబడి తర్వాత దేశంలో నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ షిల్లాంగ్‌లో శనివారం తెలిపారు. దేశంలో నిత్యావసర సరుకుల సరఫరా సరిగా లేకపోవడంతోనే ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుందన్నారు. నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.Source: Yahoo! Telugu: News | 3 Apr 2010 | 6:51 am శ్రేయకు సద్గురు జగ్గీ వాసుదేవ్ యోగా తరగతులు..?!!నిత్యానంద, రంజిత రాసలీలలు బయటకు వచ్చినా పలువురు హీరోయిన్లు మాత్రం తాము నమ్ముకున్న బాబాల భక్తిలో ఓలలాడుతూనే ఉన్నారు. ఢిల్లీ భామ శ్రేయ కూడా కోయంబత్తూర్‌కు వీలుదొరికినపుడల్లా వెళ్లి వస్తోందట. ఏమిటి విషయమని ఆరా తీస్తే... అక్కడ జగ్గీ వాసుదేవ్ ఆశ్రమానికి ఆమె తరచూ వెళుతోందని తెలిసింది. పలుమార్లు తన స్నేహితులతో ఈ విషయాన్ని ప్రస్తావించింది కూడా. తానింత స్లిమ్‌గా ఉండటానికి కారణం సద్గురు యోగా తరగతులే అని సెలవిస్తోందట. ఆయన ఆశ్రమంలో ధ్యానం చేస్తుంటే, మనసు ప్రశాంతంగా అనిపిస్తుందని చెపుతోంది. తాను ఇష్టపడే ప్రదేశాల్లో సద్గురు సన్నిధి ఒకటని చెప్పుకొస్తోంది. అందుకే తన సినిమా విడుదలకు ముందు ఆయన ఆశీర్వాదం తీసుకుంటానని చెపుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 3 Apr 2010 | 6:44 am ఐపీఎల్ ద్వారా వెయ్యి కోట్లు సంపాదించనున్న సెట్మ్యాక్స్ప్రస్తుతం జరుగుతున్న ఐపీఏల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సెట్‌మ్యాక్స్ సంస్థ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను సంపాదించనుంది. ఇది గత రెండు సంవత్సరాలలో ఐపీఎల్ టీ20 క్రికెట్ మ్యాచ్ ద్వారా సంపాదించిన మొత్తానికన్నా ఎక్కువేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.Source: Yahoo! Telugu: News | 3 Apr 2010 | 6:33 am కృష్ణుడి "చేత వెన్నముద్ద" రీ-రికార్డింగ్ పూర్తి!ఆల్తాఫ్, క్రితిక కృష్ణన్ జంటగా రోహిత్.ఎస్. అభ్యుదయ్ దర్శకత్వంలో ఫుల్‌మూన్ పిక్చర్స్ పతాకంపై పి.ఆర్.కుమార్ నిర్మిస్తున్న "చేత వెన్నముద్ద" చిత్రం రీరికార్డింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత భరత్ కుమార్ మాట్లాడుతూ.. పాటలన్నీ చక్కటి సాహిత్యంతో అందరినీ ఆకట్టుకుంటాయి. సున్నితమైన కథాంశంతో హృదయానికి హత్తుకునే సన్నివేశాలుంటాయి. భిన్న భావోద్వేగాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. తప్పకుండా అందరూ మెచ్చే చిత్రమిదవుతుంది. పాటలను వచ్చే నెల రెండో వారంలో విడుదల చేయనున్నాం. ఇమంది రామారావు రాసిన చిగురాకు కదిలినా పాట హృదయానికి హత్తుకునేలా వుంటుంది. ఈ పాట చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అవుతుంది" అని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 3 Apr 2010 | 5:26 am సికింద్రాబాద్ ఎమ్మెల్యే పదవికి జయసుధ రాజీనామా..!?సికింద్రాబాద్ ఎమ్మెల్యే పదవికి ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ అభ్యర్థి జయసుధ రాజీనామా చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితోనే జయసుధ తన ఎమ్మెల్యే పదవికి స్వస్తి చెప్పాలని భావిస్తున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ ప్రమేయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జయసుధకు, వైఎస్సార్ హఠాన్మరణంతో తగిన గుర్తింపు లభించలేదు. ఇంకా తనకు మంత్రి పదవి వస్తుందని ఆసక్తితో ఎదురుచూసిన జయసుధకు నిరాశే మిగిలింది. కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన జయసుధ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం ప్రత్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్‌పై విజయం సాధించిన జయసుధ, తాను అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది.Source: ఏపీ న్యూస్ | 3 Apr 2010 | 3:16 am సానియా మాతృభూమికి ద్రోహం చేసింది: వీహెచ్పివైరి దేశమైన పాకిస్తాన్‌కు చెందిన పౌరుడు షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకోవాలంటూ సానియా తీసుకున్న నిర్ణయం మాతృదేశానికి తీవ్రమైన ద్రోహం చేసేదిగా ఉందంటూ విశ్వహిందూ పరిషత్ నాయకులు మండిపడ్డారు. షోయబ్ మాలిక్‌తో సానియా వివాహం వెనుక అండర్ వరల్డ్ హస్తం ఉందన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు.Source: జాతీయ | 3 Apr 2010 | 3:08 am "జనగణన" ప్రక్రియకు దేశ ప్రజలు సహకరించాలి: ప్రధానిదేశవ్యాప్తంగా ప్రారంభమైన జనగణన ప్రక్రియకు దేశ ప్రజలంతా పూర్తి సహకారం అందజేయాలని దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పిలుపు నిచ్చారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన జనాభా లెక్కల ప్రక్రియకు దేశ ప్రజల మద్దతు చాలా అవసరమని ప్రధాని పేర్కొన్నారు. 120 కోట్లమంది భారతీయులను లెక్కించే ప్రక్రియ దేశ ప్రథమ మహిళ ప్రతిభా పాటిల్ వివరాల సేకరణతో గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 3 Apr 2010 | 2:23 am మేం బతకాల్న... సావాల్న: పాతబస్తీ ప్రజల ఆవేదనతినేందుకు తిండి దొరకడం లేదు.. వైద్యం చేయించుకునేందుకు వీలు లేకుండా ఉంది.. మేం బతకాల్నా... సావాల్నా...? అంటూ పాతబస్తీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా కర్ఫ్యూ ఎత్తివేయాలని కోరుతున్నారు. తామంతా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి జీవిస్తున్నామనీ, తమ మధ్య ఎటువంటి గొడవలు లేవనీ, కొన్ని స్వార్థపర శక్తులు పనికట్టుకుని ఈ అల్లర్లను సృష్టించారన్నారు.Source: ఏపీ న్యూస్ | 3 Apr 2010 | 1:56 am పరిస్థితి కుదుటపడితే కర్ఫ్యూ ఎత్తివేస్తాం: ఏకే ఖాన్పాతబస్తీలో పరిస్థితి కుదుటపడితే కర్ఫ్యూను ఎత్తివేస్తామని నగర పోలీసు కమీషనర్ ఏకే ఖాన్ శనివారం మీడియాకు వెల్లడించారు. ఈరోజు ఉదయం ఆయన పాతబస్తీలోని పరిస్థితిని సమీక్షించారు.Source: ఏపీ న్యూస్ | 3 Apr 2010 | 12:46 am మాయావతి విగ్రహాల భద్రతకు సెక్యూరిటీ గార్డులుఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని విగ్రహాలకు, స్మారక చిహ్నాల భద్రతకు మాయావతి సర్కార్ సెక్యూరిటీ గార్డులను నియమించాలని నిర్ణయం తీసుకుంది. చిత్రం ఏమిటంటే... సెక్యూరిటీ గార్డుల నియామకానికి సంబంధించి రాష్ట్ర గవర్నర్ నుంచి కానీ లేదంటే సీనియర్ ప్రభుత్వాధికారుల నుంచి కానీ ఎటువంటి అనుమతి లేకుండానే "మాయ" సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.Source: జాతీయ | 3 Apr 2010 | 12:40 am జస్టిస్ దినకరన్‌ను సెలవుపై వెళ్ళమన్న సుప్రీం కోర్టుకర్నాటక హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి పిడి దినకరన్‌ను సెలవుపై వెళ్ళమని సుప్రీం కోర్టు కోరింది. జస్టిస్ దినకరన్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివుండటాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. దీంతో అతనిని పదవి నుంచి తప్పించింది.Source: జాతీయ | 3 Apr 2010 | 12:26 am మావోల అణచివేతకు సైన్యం అవసరం లేదు: వీకే సింగ్దేశంలో పెచ్చరిల్లిపోతున్న మావోయిస్టుల అణచివేతకు సైన్యం అవసరం లేదని భారత ఆర్మీ కొత్త చీఫ్ వీకే సింగ్ శనివారం స్పష్టం చేశారు. నక్సలైట్ల వ్యవహారం లా అండ్ ఆర్డర్‌పై ఆధారపడి ఉంటుందని, ఇందులో సైన్యం తలదూర్చడం అనవసరమని వీకే సింగ్ వెల్లడించారు.మావోయిస్టుల అణచివేతకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వీకే సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మావోల అణచివేత వ్యవహారం చట్టానికి ముడిపడి ఉండటంతో ఇందులో సైన్యం జోక్యం చేసుకోవడం తగదని వీకే సింగ్ పేర్కొన్నారు.Source: జాతీయ | 2 Apr 2010 | 11:54 pm జవహర్ భవన్ ట్రస్టీగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేసే జవహర్ భవన్ ట్రస్ట్ బోర్డు(జేబీటీ)లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ట్రస్టీగా నియమితులయ్యారు. భారత తొలిప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పేరుమీద ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు.Source: జాతీయ | 2 Apr 2010 | 10:42 pm గయలోని సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడులకుపాల్పడ్డ మావోలుబీహార్లోని గయలో మావోయిస్టులు పంజావిసిరారు. బుద్ధగయ సమీపంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) క్యాంపును వంద మంది సాయుధులైన మావోయిస్టులు శుక్రవారం రాత్రి కాల్పులు ప్రారంభించారు.Source: జాతీయ | 2 Apr 2010 | 9:57 pm "రోబో"లో నగ్నంగా కనిపించనున్న రజనీకాంత్"టెర్మినేటర్"లో హీరో ఆర్నాల్డ్ నగ్నంగా కనిపిస్తాడు. పై నుంచి భూలోకంలో ఢమాల్‌న పడినప్పుడు ఆ సన్నివేశం కనిపిస్తుంది. దాదాపు అలాంటి తరహాలోనే రజనీకాంత్ నగ్నంగా కన్పించనున్నాడు. "రోబో"లో ఆ దృశ్యం కన్పించనున్నదని విశ్వసనీయ సమాచారం. 125 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ కథానాయిక. ప్రత్యేకమైన టెక్నాలజీతో నగ్న దృశ్యాన్ని తీశారని తెలిసింది. దర్శకుడు, కెమేరామెన్ మాత్రమే సెట్‌లో ఈ దృశ్యాన్ని తీసినట్లు భోగట్టా. మొత్తమ్మీద అన్ని ఫీట్లు చేసిన రజనీకాంత్ చివరికి నగ్నంగా కూడా కనిపించనున్నాడన్నమాట.Source: Yahoo! Telugu: Entertainment | 2 Apr 2010 | 12:18 pm బాలీవుడ్ సినిమాల్లో బీర్ బాత్‌కు రెడీ: సదా"అపరిచితుడు"తో తన స్టార్ తిరిగిందనుకున్న సదా కెరీర్ రివర్స్ గేర్‌లో సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. మొన్నా మధ్య తెలుగులో "అఆ ఇఈ" అన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులు "ఉఊ... ఎఏఐ" అన్నారు. అంతే మరో ఆలోచన చేయకుండా నేరుగా బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళ్లింది. క్లిక్ పేరుతో విడుదలైన తన తొలి బాలీవుడ్ చిత్రం బాక్సాఫీసుల దగ్గర క్లిక్ కాలేదు. ఇంకేం చేస్తుంది...? హాటు రూటుతోనే కుర్రాళ్ల గుండెలలో గిలిగింతలు పెట్టడం ద్వారా తమ దారికి తెచ్చుకోవచ్చన్న యోచనతో బాలీవుడ్ నిర్మాతలకు సందేశాలు పంపింది. దీంతో సదరు నిర్మాతలు అమ్మడిని మహా హాట్‌గా చూపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. వారిలో ఒక నిర్మాత... బీర్ బాత్ చేయడానికి రెడీయేనా అని సదాను ప్రశ్నించినట్లు భోగట్టా. ఈ ప్రశ్నకు సదా సమాధానం ఎలా ఉంటుందోనని ఆసక్తి ఎదురు చూసిన సదరు నిర్మాత, ఆమె సమాధానాన్ని విని సంతోషపడ్డాడట. మొత్తానికి సంప్రదాయాలను పక్కకు నెట్టి హాటు మార్గాన్ని ఎంచుకుంటోందన్నమాట సదా.Source: Yahoo! Telugu: Entertainment | 2 Apr 2010 | 9:40 am "మాయ"కు నిన్న నోట్ల దండలు.. ఇప్పుడు దేవాలయంఅన్నీ అనుకున్నట్లు జరిగితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, దళిత నాయకురాలు అయిన మాయావతి ఆలయం వెలసే అవకాశం ఉంది. మాయావతి తను జీవించి ఉండగానే రాష్ట్రంలో ఎన్నో చోట్ల తన విగ్రహాలను ప్రతిష్టాపన చేసుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఆమెకు గుడి కట్టిస్తానని ఓ వ్యక్తి బయలుదేరాడు.Source: జాతీయ | 2 Apr 2010 | 9:01 am శనివారం 25 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ సడలింపుపాతబస్తీలోని 25 పోలీసు స్టేషన్ల పరిధిలో శనివారంనాడు కర్ఫ్యూ సడలించనున్నట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. దక్షిణ మండలంలోని 17 మండలాల్లో రేపు దశలవారీగా కర్ఫ్యూ సడలిస్తున్నట్లు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 2 Apr 2010 | 8:26 am "రోబో"లో నగ్నంగా కనిపించనున్న రజనీకాంత్"టెర్మినేటర్"లో హీరో ఆర్నాల్డ్ నగ్నంగా కనిపిస్తాడు. పై నుంచి భూలోకంలో ఢమాల్‌న పడినప్పుడు ఆ సన్నివేశం కనిపిస్తుంది. దాదాపు అలాంటి తరహాలోనే రజనీకాంత్ నగ్నంగా కన్పించనున్నాడు. "రోబో"లో ఆ దృశ్యం కన్పించనున్నదని విశ్వసనీయ సమాచారం. 125 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ కథానాయిక.Source: వినోదం | 2 Apr 2010 | 6:49 am షోయబ్ మాలిక్: పెరుగుతున్న ప్రియురాళ్ల సంఖ్యఒకవైపు సానియా - మాలిక్‌ల పెళ్లికి రోజులు దగ్గరపడుతుంటే మరోవైపు రోజురోజుకీ షోయబ్‌కున్న కొత్త ప్రియురాళ్ల సంఖ్య పెరుగుతూ పోతున్నట్లు కనిపిస్తోంది. అయేషా సిద్దికి, సానియా మీర్జాలకంటే ముందు షోయబ్ మాలిక్ మరో అమ్మాయితో ప్రేమాయణం సాగించాడని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రియురాలు ఎవరంటే మాజీ మిస్ ఇండియా సాయాలీ భగత్. ఈ అమ్మడుతో మాలిక్ చాలాకాలం లవ్వాట సాగించాడని వార్తలు వస్తున్నాయి.సాయాలి మాత్రం షోయబ్ మాలిక్ ఎవరో తనకు తెలియదని చెపుతోంది. కానీ ఆమెతో సినిమా తీయాలనుకున్న ఓ డైరెక్టర్ మాత్రం సాయాలీ భగత్- షోయబ్ మాలిక్‌ల లవ్ స్టోరీ నిజమేనని అంటున్నాడు. మాలిక్ మాత్రం సానియా జపం తప్ప మరో మాట మాట్లాడటం లేదు. కదిలిస్తే... తన మనసులో సానియా తప్ప మరెవరకీ స్థానం లేదని చెపుతున్నాడు. మరి సాయాలీ భగత్ సంగతో... అంటే ఏమీ మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోతున్నాడట.Source: Yahoo! Telugu: Entertainment | 2 Apr 2010 | 6:47 am వై.ఎస్. జగన్ చేతులమీదుగా "హాసిని" ఆడియో విడుదలకమలాకర్రెడ్డి హీరోగా బి.వి. రమణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన "హాసిని" చిత్రం ఆడియో హైటెక్ సిటీలోని రాక్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వై.ఎస్. జగన్ ఆడియో సీడీని ఆవిష్కరించిన నితిన్‌కు అందించారు. ఆడియో క్యాసెట్‌ను హీరో శ్రీహరి విడుదల చేసి రమేష్ ప్రసాద్‌కు అందజేశారు. ఆడియో విడుదల సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నేను పాల్గొన్న మొట్టమొదటి సినిమా కార్యక్రం ఇదే. హీరో సోదరుడు శివప్రసాద్ రెడ్డి ఆహ్వానిస్తే రావడం జరిగింది. యూనిట్ అందరికీ శుభాకాంక్షలు. హాసిని చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 2 Apr 2010 | 4:30 am తమిళనాడు-కేరళ సరిహద్దులో ఉద్రిక్తత: వైగో అరెస్టు..!ఎండీఎంకే నేత వైగోను ఉడుమలై పేట వద్ద శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. పంబా నదిపై కేరళ ప్రభుత్వం నిర్మించే ఆనకట్టను పర్యవేక్షించేందుకు వెళ్లిన వైగోను మార్గమధ్యంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా కేరళ సరిహద్దులోకి ప్రవేశించిన వైగోతో పాటు పార్లమెంట్ సభ్యులు గణేష్ మూర్తిలతో కూడిన వందమందిని పోలీసులు అరెస్టు చేశారు.Source: జాతీయ | 2 Apr 2010 | 4:20 am శనివారం విడతల వారీగా కర్ఫ్యూ సడలింపు: ఏకే ఖాన్పాతబస్తీలో శనివారం వేర్వేరు సమయాల్లో విడతల వారీగా కర్ఫ్యూను సడలించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ తెలిపారు. అయితే కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేసేది లేదని, కానీ కర్ఫ్యూ సడలింపు సమయాన్ని మాత్రం పెంచుతామన్నారు. శుక్రవారం భోలక్‌పూర్, ముషీరాబాద్‌లలో ఏకేఖాన్ పరిస్థితిని సమీక్షించారు.Source: ఏపీ న్యూస్ | 2 Apr 2010 | 4:13 am ఢిల్లీ ఆదాయ పన్ను కార్యాలయంలో అగ్ని ప్రమాదందేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని ఆదాయ పన్ను కార్యాలయంలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులకు గాయాలైనట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని ఆదాయ పన్ను కార్యాలయం నాలుగో అంతస్థులో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు.Source: జాతీయ | 2 Apr 2010 | 3:54 am ఏడో తేదీన పీసీసీ సమన్వయ కమిటీ భేటీ: డీఎస్ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమన్వయ సమావేశం ఈ నెల ఏడో తేదీన జరుగనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం డీఎస్ గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. పీసీసీ సమన్వయ కమిటీలో కీలక అంశాలపై చర్చలు జరుపుతామని చెప్పారు. అయితే ఈ నెల ఐదో తేదీన ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతలతో ఎటువంటి సమావేశం జరుపడం లేదని డీఎస్ స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 2 Apr 2010 | 3:23 am హైదరాబాద్ పాతబస్తీలో కర్ఫ్యూ: జనజీవనం అస్తవ్యస్తంగత ఐదు రోజులుగా పాతబస్తీలోని ప్రజలు కర్ఫ్యూ విధింపుతో అల్లాడిపోతున్నారు. నిత్యావసర వస్తువులు లభించక నానా ఇక్కట్లు పడుతున్నారు. గురువారం రెండు గంటలు కర్ఫ్యూ సడలించటంతో ప్రజలు వస్తువులకోసం ఎగబడ్డారు. మరోవైపు వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో సరుకులు కొనుగోలు చేయలేకపోయారు.Source: ఏపీ న్యూస్ | 2 Apr 2010 | 3:02 am పాతబస్తీలో రాజ్యమేలుతున్న రౌడీలు: చంద్రబాబుఅల్లర్లతో కర్ఫ్యూ విధింపుకు గురైన పాతబస్తీలో రౌడీలు రాజ్యమేలుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నగరం వదిలి పారిపోయిన రౌడీలంతా ఇప్పుడు పాతబస్తీలో రాజ్యమేలుతున్నారని ఆయన విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 2 Apr 2010 | 3:02 am
|