|
నిరుడు అమ్ముడైన మొబైల్ ఫోన్లు సంఖ్య 101.54 మిలియన్లునిరుడు భారతదేశంలో మొబైల్ ఫోన్ల అమ్మకాల్లో తగ్గుదల నమోదై కేవలం 101.54 మిలియన్ల సెల్‌ఫోన్లు అమ్ముడైనట్లు ఐడీసీ ఇండియా సంస్థ శుక్రవారం న్యూ ఢిల్లీలో తెలిపింది. మొబైల్ ఫోన్ల అమ్మకాల్లో తగ్గుదలకు ప్రధాన కారణం నిరుడు ప్రథమార్థంలో జరిగిన అమ్మకాలు భారీగా పడిపోయాయని ఆ సంస్థ పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 2 Apr 2010 | 9:36 am ఢిల్లీ ఆదాయ పన్ను కార్యాలయంలో అగ్ని ప్రమాదందేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని ఆదాయ పన్ను కార్యాలయంలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులకు గాయాలైనట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని ఆదాయ పన్ను కార్యాలయం నాలుగో అంతస్థులో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 2 Apr 2010 | 9:24 am మరిన్ని నష్టాలనెదుర్కోనున్న ఐఓసీ, బీపీసీ, హెచ్పీసీప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం(2010-11)లో చమురు అమ్మకాల్లో వృద్ధి చెంది రూ. 79,670 కోట్ల మేరకు నష్టాలను చవిచూడనున్నట్లు శుక్రవారం అధికార వర్గాలు మీడియాకు తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 2 Apr 2010 | 9:21 am టోకు మార్కెట్లో పెరిగిన పప్పు దినుసుల ధరలుచెన్నైలోని ఆహార ధాన్యాల టోకు ధరల మార్కెట్లో పెసలపప్పు, ఉద్దిపప్పు ధరలు అధికంగా పెరిగాయి. అదే శెనగపప్పు ధరలు స్వల్పంగా పెరిగాయి. మిగిలిన నిత్యావసర సరుకుల ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదని టోకు వర్తకుల సంఘం శుక్రవారం తెలిపింది.Source: Yahoo! Telugu: News | 2 Apr 2010 | 9:02 am ఏడో తేదీన పీసీసీ సమన్వయ కమిటీ భేటీ: డీఎస్ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమన్వయ సమావేశం ఈ నెల ఏడో తేదీన జరుగనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం డీఎస్ గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. పీసీసీ సమన్వయ కమిటీలో కీలక అంశాలపై చర్చలు జరుపుతామని చెప్పారు. అయితే ఈ నెల ఐదో తేదీన ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతలతో ఎటువంటి సమావేశం జరుపడం లేదని డీఎస్ స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 2 Apr 2010 | 8:52 am జర్దారీ అధికారాల్లో కోత: పాక్ ప్రభుత్వ నిర్ణయంపాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అధికారాల్లో కోత విధించేందుకు పాక్ పార్లమెంట్ నిర్ణయించింది. దీనిపై శుక్రవారం 18వ చట్టపరమైన బిల్లును సవరించనుంది. ఇందులో భాగంగా పార్లమెంటును రద్దుచేసి ఆర్మీ చీఫ్‌ను నియమించే అధికారం అధ్యక్షునికి ఉంది. ఈ అధికారాన్ని పాక్ ప్రభుత్వం తొలగించేందుకు ప్రయత్నిస్తోంది.Source: Yahoo! Telugu: News | 2 Apr 2010 | 8:48 am పాతబస్తీలో రాజ్యమేలుతున్న రౌడీలు: చంద్రబాబుఅల్లర్లతో కర్ఫ్యూ విధింపుకు గురైన పాతబస్తీలో రౌడీలు రాజ్యమేలుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నగరం వదిలి పారిపోయిన రౌడీలంతా ఇప్పుడు పాతబస్తీలో రాజ్యమేలుతున్నారని ఆయన విమర్శించారు.Source: Yahoo! Telugu: News | 2 Apr 2010 | 7:46 am అమ్మకాల్లో రెండంకెల వృద్ధి సాధించిన సిమెంటు కంపెనీలుగత ఆర్థిక సంవత్సరంలో మౌలిక రంగాలు, రియల్ ఎస్టేట్ రంగాలలో సిమెంటుకు మంచి డిమాండ్ లభించడంతో అమ్మకాల్లో 12 శాతం వృద్ధి చెంది 1,436.7 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడైనట్లు సిమెంట్ నిర్మాణ రంగాల అసోసియేషన్ తెలిపింది. అదే 2008-09 ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 1,277.9 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడైనట్లు అసోసియేషన్ పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 2 Apr 2010 | 7:15 am ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందాలు వద్దు..!: అమెరికా సూచనఇరాన్ దేశంతో గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టు వంటి ఒప్పందాలను భారత్-పాకిస్థాన్ దేశాలు కుదుర్చుకోవద్దని ఒబామా నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం సూచించింది. ఇరాన్ దేశంతో ఇరుదేశాలు ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్ధం కావద్దని అమెరికా పేర్కొంది.ఇరాన్ నుంచి పాకిస్థాన్ మార్గం ద్వారా కుళాయ్ గ్యాస్ సరఫరా చేసే దిశగా, గ్యాస్ లైన్ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ చర్చలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 2 Apr 2010 | 7:15 am భారత్-పాక్ జలవివాదంలో తలదూర్చం: అమెరికాగతంలో భారత్-పాక్ దేశాలమధ్య నెలకొన్న జలవివాదంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్థాన్ అమెరికాను కోరింది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ జలవివాదంలో తాము ఎట్టి పరిస్థితుల్లోను తలదూర్చేది లేదని అమెరికా స్పష్టం చేసింది.Source: Yahoo! Telugu: News | 2 Apr 2010 | 6:57 am షోయబ్ మాలిక్: పెరుగుతున్న ప్రియురాళ్ల సంఖ్యఒకవైపు సానియా - మాలిక్‌ల పెళ్లికి రోజులు దగ్గరపడుతుంటే మరోవైపు రోజురోజుకీ షోయబ్‌కున్న కొత్త ప్రియురాళ్ల సంఖ్య పెరుగుతూ పోతున్నట్లు కనిపిస్తోంది. అయేషా సిద్దికి, సానియా మీర్జాలకంటే ముందు షోయబ్ మాలిక్ మరో అమ్మాయితో ప్రేమాయణం సాగించాడని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రియురాలు ఎవరంటే మాజీ మిస్ ఇండియా సాయాలీ భగత్. ఈ అమ్మడుతో మాలిక్ చాలాకాలం లవ్వాట సాగించాడని వార్తలు వస్తున్నాయి.సాయాలి మాత్రం షోయబ్ మాలిక్ ఎవరో తనకు తెలియదని చెపుతోంది. కానీ ఆమెతో సినిమా తీయాలనుకున్న ఓ డైరెక్టర్ మాత్రం సాయాలీ భగత్- షోయబ్ మాలిక్‌ల లవ్ స్టోరీ నిజమేనని అంటున్నాడు. మాలిక్ మాత్రం సానియా జపం తప్ప మరో మాట మాట్లాడటం లేదు. కదిలిస్తే... తన మనసులో సానియా తప్ప మరెవరకీ స్థానం లేదని చెపుతున్నాడు. మరి సాయాలీ భగత్ సంగతో... అంటే ఏమీ మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోతున్నాడట.Source: Yahoo! Telugu: Entertainment | 2 Apr 2010 | 6:47 am వై.ఎస్. జగన్ చేతులమీదుగా "హాసిని" ఆడియో విడుదలకమలాకర్రెడ్డి హీరోగా బి.వి. రమణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన "హాసిని" చిత్రం ఆడియో హైటెక్ సిటీలోని రాక్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వై.ఎస్. జగన్ ఆడియో సీడీని ఆవిష్కరించిన నితిన్‌కు అందించారు. ఆడియో క్యాసెట్‌ను హీరో శ్రీహరి విడుదల చేసి రమేష్ ప్రసాద్‌కు అందజేశారు. ఆడియో విడుదల సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నేను పాల్గొన్న మొట్టమొదటి సినిమా కార్యక్రం ఇదే. హీరో సోదరుడు శివప్రసాద్ రెడ్డి ఆహ్వానిస్తే రావడం జరిగింది. యూనిట్ అందరికీ శుభాకాంక్షలు. హాసిని చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 2 Apr 2010 | 4:30 am ఢిల్లీ ఆదాయ పన్ను కార్యాలయంలో అగ్ని ప్రమాదందేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని ఆదాయ పన్ను కార్యాలయంలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులకు గాయాలైనట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని ఆదాయ పన్ను కార్యాలయం నాలుగో అంతస్థులో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు.Source: జాతీయ | 2 Apr 2010 | 3:54 am ఏడో తేదీన పీసీసీ సమన్వయ కమిటీ భేటీ: డీఎస్ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమన్వయ సమావేశం ఈ నెల ఏడో తేదీన జరుగనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం డీఎస్ గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. పీసీసీ సమన్వయ కమిటీలో కీలక అంశాలపై చర్చలు జరుపుతామని చెప్పారు. అయితే ఈ నెల ఐదో తేదీన ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతలతో ఎటువంటి సమావేశం జరుపడం లేదని డీఎస్ స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 2 Apr 2010 | 3:23 am హైదరాబాద్ పాతబస్తీలో కర్ఫ్యూ: జనజీవనం అస్తవ్యస్తంగత ఐదు రోజులుగా పాతబస్తీలోని ప్రజలు కర్ఫ్యూ విధింపుతో అల్లాడిపోతున్నారు. నిత్యావసర వస్తువులు లభించక నానా ఇక్కట్లు పడుతున్నారు. గురువారం రెండు గంటలు కర్ఫ్యూ సడలించటంతో ప్రజలు వస్తువులకోసం ఎగబడ్డారు. మరోవైపు వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో సరుకులు కొనుగోలు చేయలేకపోయారు.Source: ఏపీ న్యూస్ | 2 Apr 2010 | 3:02 am పాతబస్తీలో రాజ్యమేలుతున్న రౌడీలు: చంద్రబాబుఅల్లర్లతో కర్ఫ్యూ విధింపుకు గురైన పాతబస్తీలో రౌడీలు రాజ్యమేలుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నగరం వదిలి పారిపోయిన రౌడీలంతా ఇప్పుడు పాతబస్తీలో రాజ్యమేలుతున్నారని ఆయన విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 2 Apr 2010 | 3:02 am తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కొత్త ఉద్యోగాలు ఫట్: లగడపాటిప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీకి లగడపాటి శుక్రవారం ఆరవ నివేదికను అందజేశారు. ఈ నివేదికలో ఏ తెలంగాణ నాయకుడు కానీ, వారి కుటంబ సభ్యులు కానీ ఆత్మహత్యలకు పాల్పడలేదని ఎత్తిచూపారు. ఇంకా వేర్పాటువాదుల విష ప్రచారానికి ఎంతోమంది అమాయక యువత, విద్యార్థులు ఆత్మహత్యలతో బలైపోయారని లగడపాటి అన్నారు.Source: ఏపీ న్యూస్ | 2 Apr 2010 | 1:02 am తమిళనాడు-కేరళ సరిహద్దులో ఉద్రిక్తత: వైగో అరెస్టు..!ఎండీఎంకే నేత వైగోను ఉడుమలై పేట వద్ద శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. పంబా నదిపై కేరళ ప్రభుత్వం నిర్మించే ఆనకట్టను పర్యవేక్షించేందుకు వెళ్లిన వైగోను మార్గమధ్యంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా కేరళ సరిహద్దులోకి ప్రవేశించిన వైగోతో పాటు పార్లమెంట్ సభ్యులు గణేష్ మూర్తిలతో కూడిన వందమందిని పోలీసు అరెస్టు చేశారు.Source: జాతీయ | 2 Apr 2010 | 12:41 am సానియా గుండె "పాక్..పాక్" అంటోంది: బాల్థాకరేభారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో వివాహమాడతానని ప్రకటించడంపై శివసేన అధినేత బాల్‌థాకరే(84) మండిపడ్డారు. సానియా మీర్జా హృదయం భారతదేశానిదే అయినా, అది పాకిస్థాన్ దేశానిదని ఆయన దుయ్యబట్టారు.Source: జాతీయ | 2 Apr 2010 | 12:29 am కోయంబత్తూరు హోటల్‌ను ధ్వంసం చేస్తాం: అల్ఖైదాకోయంబత్తూరులోని ఓ హోటల్‌ను బాంబు పేలుడుతో ధ్వంసం చేస్తామని ప్రముఖ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా హెచ్చరించింది. కోయంబత్తూరులో జూన్ 23వ తేదీ నుంచి ప్రాచీన తమిళ భాషపై అంతర్జాతీయ సదస్సు జరుగనుండటంతో.. కోవైలోని ఓ ప్రసిద్ధ హోటల్‌ను పేల్చి వేస్తామని అల్‌ఖైదా ఇ-మెయిల్ ద్వారా బెదిరించింది.Source: జాతీయ | 1 Apr 2010 | 11:19 pm శుక్రవారం సామూహిక ప్రార్థనలు ఇళ్ళల్లో చేసుకోండి: ఫత్వాపాతబస్తీలోని ముస్లింలు శుక్రవారం ప్రత్యేక సామూహిక ప్రార్థనలు తమ తమ ఇళ్ళల్లోనే చేసుకోవాలని ముస్లిం మతపెద్దలు ఈరోజు ఫత్వా జారీ చేశారు.Source: ఏపీ న్యూస్ | 1 Apr 2010 | 11:05 pm కాశ్మీర్‌లో రైలుపట్టాలను పేల్చేసిన ఉగ్రవాదులుజమ్మూ- కాశ్మీర్‌లోని కాక్‌పురా ప్రాంతంలో గురువారం రాత్రి పదిగంటల ప్రాంతంలో కాజీగుండ్-బారాముల్లా మధ్యనున్న రైలు మార్గంలోని రైలుపట్టాలను ఉగ్రవాదులు పేల్చేశారు. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలుకాలేదు. కాని పేలుళ్ళతో రైలుపట్టాలు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.Source: జాతీయ | 1 Apr 2010 | 10:34 pm ముంబై పర్యటనలో యడ్యూరప్పకు ఎదురుదెబ్బకర్నాటక ప్రాంతంలోని మరాఠీ ప్రాబల్యం ఎక్కువగానున్న బెల్గాం నగర మేయర్ పీఠాన్ని కన్నడిగునికి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ యడ్యూరప్ప ముంబై పర్యటనలో వంద మందికి పైగా శివసేన కార్యకర్తలు నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. చరిత్రాత్మక గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలోని తాజ్ హోటల్‌లో జరిగిన ఓ వాణిజ్య కార్యక్రమంలో యడ్యూరప్ప పాల్గొన్నారు.Source: జాతీయ | 1 Apr 2010 | 10:01 pm మే 9న ఎన్టీఆర్- ప్రణతిల వివాహం: నారా రామ్మూర్తినందమూరి హరికృష్ణ తనయుడు ఎన్టీఆర్ వివాహం మే 9న జరుపనున్నట్లు అనుకుంటున్నారని, అది కచ్చితమైన తేదీనా? కాదా? అనే విషయాన్ని మళ్లీ తెలియజేస్తామని నారా రామ్మూర్తి నాయుడు జూబ్లీహిల్స్‌లోని నార్నే శ్రీనివాస్ ఇంటిముందు మీడియాతో చెప్పారు. స్వర్గీయ గుమ్మడి ఇంటి పక్క ఇళ్లే నార్నే వారిది. బుధవారం ఉదయం నుంచే ఆ ఇంటికి డెకరేషన్ చేశారు. గురువారం పలు మీడియావారు లైవ్‌షోలు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. ఇంటికి వచ్చే కార్లను నేరుగా లోపలికి పోనిచ్చిన తర్వాత గేట్లు మూసుకుపోతాయి. లోపల అతిథులను దింపిన తర్వాత కారుడ్రైవర్లు కార్లు తీసుకుని బయటకు వస్తారు.పలు ఎలక్ట్రానికి మీడియాలు కారు డ్రైవర్లతో మాట్లాడాలని ప్రయత్నించినా ఫలించలేదు. తెల్లవారుజామున బ్రాహ్మీముహూర్తంలో 4 నుంచి 4.30 గంటల మధ్యలోనే ఎన్టీఆర్ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. నారా కుటుంబం, నందమూరి కుటుంబం మినహా ఎవరినీ పిలిపించలేదు. నిశ్చితార్థం ఫోటోలు మాత్రం తామే రాత్రి మీడియాకు విడుదల చేస్తామని నార్నే కుటుంబం వెల్లడించింది.Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2010 | 12:13 pm వారిని ఆ లుక్‌తో చూస్తేనే బాగుంటుంది: దాసరి నారాయణతన స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న "యంగ్ ఇండియా" చిత్రంలోని 81 మంది కొత్త హీరోహీరోయిన్లను చూడాలంటే రిలీజ్‌రోజు వరకు వేచి చూడాల్సిందేనని డాక్టర్. దాసరి నారాయణరావు అన్నారు. తెరపైన వారిని ఆ లుక్‌తో చూస్తేనే బాగుంటుందని దాసరి చెప్పారు. తాను యంగ్ ఇండియా ద్వారా పరిచయం చేస్తున్న కొత్త హీరోహీరోయిన్లు తెరపై వారి పాత్రల ద్వారా పరిచయం అవడమే బాగుంటుందని దాసరి వెల్లడించారు. ఇలా చూపిస్తేనే బాగుంటుందనే తన ఐడియాను.. కొంతమంది ముందుగా కాపీచేసేసి వారి సినిమాల్లో గోప్యంగా ఉంచుతున్నారని దాసరి చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2010 | 11:34 am బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా "వారెవా" ప్రారంభంప్రముఖ హాస్యనటులు పద్మశ్రీ డా. బ్రహ్మానందం అబ్బాయి గౌతమ్ హీరోగా, నూతననటి శాంభవి హీరోయిన్‌గా మహేశ్వరరావు నిర్మాతగా మూవి మిరాకిల్స్ సంస్థ నిర్మిస్తున్న "వారెవా.." చిత్రం ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది. దేవుని పటాలపై తీసిన తొలి షాట్‌కు దర్శకరత్న డా. దాసరి నారాయణ రావు క్లాప్ కొట్టగా, శ్రీమతి తులసి కెమేరా స్విచ్ఛాన్ చేశారు. బ్రహ్మానందం పూజా కార్యక్రమాలు నిర్వహించగా బేబి గీతాంజలి స్క్రిప్ట్‌ని దర్శకునికి అందించారు.Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2010 | 11:21 am ప్రభాస్ "డార్లింగ్"లో శ్రద్ధాఆర్య ఐటమ్ సాంగ్ వరకేనా...!?బిల్లా హీరో ప్రభాస్, మగధీర హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ "డార్లింగ్" చిత్రంలో.. కత్తిలాంటి అమ్మాయి శ్రద్ధాదాస్ గ్లామర్ పాత్రను పోషిస్తోందని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ఆర్య-2, మరో చరిత్ర చిత్రాల్లో రెండో హీరోయిన్ తరహా పాత్రల్లో కనిపించిన శ్రద్ధాదాస్... అలాంటి పాత్రలకే అధిక ప్రాధాన్యత ఇస్తోందని సమాచారం. ఆర్య-2, మరోచరిత్ర చిత్రాల్లో పోషించిన కీలక పాత్రల ద్వారా శ్రద్ధాదాస్‌కు మంచి గుర్తింపు వచ్చిందని... అందుకే అమ్మడు హీరోయిన్ రోల్స్‌పై దృష్టి పెట్టనంటోందని సినీ జనం అంటున్నారు. కాగా.. త్వరలో విడుదల కానున్న ప్రభాస్ డార్లింగ్‌లోనూ శ్రద్ధాదాస్ గ్లామర్ రోల్ చేస్తుందని వినికిడి. అయితే శ్రద్ధాదాస్‌కు డార్లింగ్‌లో రెండో కథానాయిక పాత్రను ఇవ్వకుండా.. ఐటమ్‌సాంగ్‌కు మాత్రమే కనిపించనుందని సమాచారం. ఈ ఐటమ్‌సాంగ్‌లో అందాలు ఉట్టిపడే గ్లామర్ డ్యాన్స్‌తో మాస్‌ను కట్టిపడేస్తుందని సినీ వర్గాల్లో టాక్. మరి "డార్లింగ్"లో శ్రద్ధాదాస్ ఒక్క ఐటమ్‌సాంగ్‌కే పరిమితమవుతుందో..? లేదా స్క్రిప్ట్ ప్రకారం కీలక పాత్ర పోషిస్తుందో..? సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2010 | 9:54 am శుక్రవారం కర్ఫ్యూ సడలించేది లేదుః మంత్రి సబితరాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో కర్ఫ్యూ విధించిన విషయం విదితమే. శుక్రవారం నగరంలో కర్ఫ్యూ ఉన్న ప్రాంతాల్లో కర్ఫ్యూను సడలించేంది లేదని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం మీడియాకు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 1 Apr 2010 | 7:47 am అవసరమైతే మోడీకి సమన్లు జారీ: నానావతి కమిషన్ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చుట్టూ గుజరాత్ అల్లర్ల ఉచ్చు బిగిస్తోంది. ఈ అల్లర్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట మోడీ హాజరై తన వాదనను వినిపించారు. తాజాగా, గుజరాత్ అల్లర్లపై దర్యాప్తు జరిపేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేసిన నానావతి కమిషన్ కూడా మోడీని విచారించేందుకు సిద్ధమవుతోంది. అవసరమైతే మోడీకి సమన్లు జారీ చేస్తామని హైకోర్టుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.Source: జాతీయ | 1 Apr 2010 | 7:01 am మే 9న ఎన్టీఆర్- ప్రణతిల వివాహం: నారా రామ్మూర్తినందమూరి హరికృష్ణ తనయుడు ఎన్టీఆర్ వివాహం మే 9న జరుపనున్నట్లు అనుకుంటున్నారని, అది కచ్చితమైన తేదీనా? కాదా? అనే విషయాన్ని మళ్లీ తెలియజేస్తామని నారా రామ్మూర్తి నాయుడు జూబ్లీహిల్స్‌లోని నార్నే శ్రీనివాస్ ఇంటిముందు మీడియాతో చెప్పారు. స్వర్గీయ గుమ్మడి ఇంటి పక్క ఇళ్లే నార్నే వారిది.Source: వినోదం | 1 Apr 2010 | 6:44 am వారిని ఆ లుక్‌తో చూస్తేనే బాగుంటుంది: దాసరి నారాయణతన స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న "యంగ్ ఇండియా" చిత్రంలోని 81 మంది కొత్త హీరోహీరోయిన్లను చూడాలంటే రిలీజ్‌రోజు వరకు వేచి చూడాల్సిందేనని డాక్టర్. దాసరి నారాయణరావు అన్నారు. తెరపైన వారిని ఆ లుక్‌తో చూస్తేనే బాగుంటుందని దాసరి చెప్పారు. తాను యంగ్ ఇండియా ద్వారా పరిచయం చేస్తున్న కొత్త హీరోహీరోయిన్లు తెరపై వారి పాత్రల ద్వారా పరిచయం అవడమే బాగుంటుందని దాసరి వెల్లడించారు. ఇలా చూపిస్తేనే బాగుంటుందనే తన ఐడియాను.. కొంతమంది ముందుగా కాపీచేసేసి వారి సినిమాల్లో గోప్యంగా ఉంచుతున్నారని దాసరి చెప్పారు.Source: వినోదం | 1 Apr 2010 | 6:06 am బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా "వారెవా" ప్రారంభంప్రముఖ హాస్యనటులు పద్మశ్రీ డా. బ్రహ్మానందం అబ్బాయి గౌతమ్ హీరోగా, నూతననటి శాంభవి హీరోయిన్‌గా మహేశ్వరరావు నిర్మాతగా మూవి మిరాకిల్స్ సంస్థ నిర్మిస్తున్న "వారెవా.." చిత్రం ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది. దేవుని పటాలపై తీసిన తొలి షాట్‌కు దర్శకరత్న డా. దాసరి నారాయణ రావు క్లాప్ కొట్టగా, శ్రీమతి తులసి కెమేరా స్విచ్ఛాన్ చేశారు. బ్రహ్మానందం పూజా కార్యక్రమాలు నిర్వహించగా బేబి గీతాంజలి స్క్రిప్ట్‌ని దర్శకునికి అందించారు.Source: వినోదం | 1 Apr 2010 | 5:52 am తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న "ఓం సాయిరాం"షిర్డిసాయి భక్తుల యధార్థ అనుభవాల నేపథ్యంలో శ్రీ మల్లాది వేంకటేశ్వర ఫిలిమ్స్ నిర్మిస్తున్న "ఓం సాయిరాం" సినిమా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శక నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం కోట శ్రీనివాసరావు, రావురమేష్, నూతన్ ప్రసాద్, అశోక్‌కుమార్, రాజ్యలక్ష్మి, సుదీప్ తదితరులపై కీలక సన్నివేశాలను పలు లొకేషన్స్‌లో చిత్రీకరించారు.Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2010 | 5:45 am బాలయ్య, నయనల "సింహా" పాటల విడుదలనందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన "సింహా" సినిమా పాటలు బుధవారం మార్కెట్లోకి వచ్చాయి. నయనతార, స్నేహాఉల్లాల్, నమిత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో బాలకృష్ణను భిన్న కోణంలో ఆవిష్కరించామని నిర్మాత పరుచూరి కిరీటీ అన్నారు. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేశామని నిర్మాత వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ నెలాఖరులో సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2010 | 5:27 am ప్రభాస్ "డార్లింగ్"లో శ్రద్ధాఆర్య ఐటమ్ సాంగ్ వరకేనా...!?బిల్లా హీరో ప్రభాస్, మగధీర హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ "డార్లింగ్" చిత్రంలో.. కత్తిలాంటి అమ్మాయి శ్రద్ధాదాస్ గ్లామర్ పాత్రను పోషిస్తోందని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ఆర్య-2, మరో చరిత్ర చిత్రాల్లో రెండో హీరోయిన్ తరహా పాత్రల్లో కనిపించిన శ్రద్ధాదాస్... అలాంటి పాత్రలకే అధిక ప్రాధాన్యత ఇస్తోందని సమాచారం. ఆర్య-2, మరోచరిత్ర చిత్రాల్లో పోషించిన కీలక పాత్రల ద్వారా శ్రద్ధాదాస్‌కు మంచి గుర్తింపు వచ్చిందని... అందుకే అమ్మడు హీరోయిన్ రోల్స్‌పై దృష్టి పెట్టనంటోందని సినీ జనం అంటున్నారు. కాగా.. త్వరలో విడుదల కానున్న ప్రభాస్ డార్లింగ్‌లోనూ శ్రద్ధాదాస్ గ్లామర్ రోల్ చేస్తుందని వినికిడి. అయితే శ్రద్ధాదాస్‌కు డార్లింగ్‌లో రెండో కథానాయిక పాత్రను ఇవ్వకుండా.. ఐటమ్‌సాంగ్‌కు మాత్రమే కనిపించనుందని సమాచారం. ఈ ఐటమ్‌సాంగ్‌లో అందాలు ఉట్టిపడే గ్లామర్ డ్యాన్స్‌తో మాస్‌ను కట్టిపడేస్తుందని సినీ వర్గాల్లో టాక్. మరి "డార్లింగ్"లో శ్రద్ధాదాస్ ఒక్క ఐటమ్‌సాంగ్‌కే పరిమితమవుతుందో..? లేదా స్క్రిప్ట్ ప్రకారం కీలక పాత్ర పోషిస్తుందో..? సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.Source: వినోదం | 1 Apr 2010 | 4:26 am ఆహ్వానించక పోవడం ఎన్టీఆర్‌ను అవమానించినట్టే: ఎల్పీటాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై ఎన్టీఆర్ తెదేపా అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి మండిపడ్డారు. యువహీరో నిశ్చితార్థానికి తనను ఆహ్వానించక పోవడం జూనియర్ ఎన్టీఆర్ తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్‌ను అవమానించినట్టేనని ఆమె వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 1 Apr 2010 | 2:45 am డీఎంకే అధ్యక్ష పదవికి పోటీ చేస్తా: మంత్రి అళగిరిద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగితే తాను పోటీ చేస్తానని కేంద్ర రసాయన, ఎరువుల శాఖామంత్రి, ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే.అళగిరి ప్రకటించారు. దీంతో డీఎంకేలో అధినాయకత్వ పోరు తీవ్రరూపం దాల్చే అవకాశాలు లేకపోలేదు.Source: జాతీయ | 1 Apr 2010 | 2:29 am
|