|
భారత్-ఆప్ఘన్-పాక్‌లతో అమెరికా భద్రతా ఒప్పందం!దక్షిణాసియాలో కీలక దేశాలైన భారత్, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ దేశాలతో కలిసి భద్రతా ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భావిస్తున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌథం అధికార ప్రతినిధి రాబర్ట్ గిబ్స్ తెలిపారు. దీనిపై ఆయన వాషింగ్టన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. భారత్, ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఒబామా భావిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 1 Apr 2010 | 9:13 am లాభాల్లో స్టాక్ మార్కెట్: పురోగమనంలో సెన్సెక్స్గురువారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభాలతో ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 121 పాయింట్లు పుంజుకుని, 17,649 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 38 పాయింట్లు బలపడి, 5,287 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 1 Apr 2010 | 9:05 am ఆహ్వానించక పోవడం ఎన్టీఆర్‌ను అవమానించినట్టే: ఎల్పీటాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై ఎన్టీఆర్ తెదేపా అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి మండిపడ్డారు. యువహీరో నిశ్చితార్థానికి తనను ఆహ్వానించక పోవడం జూనియర్ ఎన్టీఆర్ తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్‌ను అవమానించినట్టేనని ఆమె వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: News | 1 Apr 2010 | 8:14 am డీఎంకే అధ్యక్ష పదవికి పోటీ చేస్తా: మంత్రి అళగిరిద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగితే తాను పోటీ చేస్తానని కేంద్ర రసాయన, ఎరువుల శాఖామంత్రి, ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే.అళగిరి ప్రకటించారు. దీంతో డీఎంకేలో అధినాయకత్వ పోరు తీవ్రరూపం దాల్చే అవకాశాలు లేకపోలేదు.Source: Yahoo! Telugu: News | 1 Apr 2010 | 7:59 am అధిక ధరలకు విక్రయించిన వ్యాపారుల అరెస్టు: సబితకర్ఫ్యూ సడలించిన పాతబస్తీ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించిన నలుగురు వ్యాపారులను పోలీసులు అరెస్టు చేసినట్టు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆమె గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పాతబస్తీలో కర్ఫ్యూ సడలింపు ప్రాంతాల్లో 20 ట్రక్కుల్లో కూరగాయలు, 90 వేల లీటర్ల పాలను సరఫరా చేశామన్నారు.Source: Yahoo! Telugu: News | 1 Apr 2010 | 7:48 am హైదరాబాద్ అల్లర్ల వెనుక మైనింగ్ మాఫియా: బాబురాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో చెలరేగిన అల్లర్ల వెనుక మైనింగ్ మాఫియా హస్తముందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అటు కర్ణాటక, ఇటు మన రాష్ట్రంలో యదేచ్ఛగా మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్న గాలి జనార్ధన్ రెడ్డి సోదరుల పాత్ర వీటి వెనుక ఉండివుండవచ్చని ఆయన సందేహం వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 1 Apr 2010 | 7:37 am ఆశాజనకంగా స్టాక్ మార్కెట్: బలపడిన సెన్సెక్స్గురువారం బాంబే స్టాక్ మార్కెట్ ఆశాజనకంగా కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలతో కొనసాగుతోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 118 పాయింట్లు వృద్ధి చెంది, 17,645 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 26 పాయింట్లు బలపడి, 5,275 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 1 Apr 2010 | 7:35 am స్వల్పంగా పెరిగి 16.35 శాతానికి చేరుకున్న ఆహార ద్రవ్యోల్బణంమార్చి 20తో ముగిసిన వారాంతానికి పప్పుదినుసులు, పాల ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 16.35 శాతానికి చేరుకుంది.Source: Yahoo! Telugu: News | 1 Apr 2010 | 7:26 am రోశయ్య సర్కారుకు షాక్ ఇచ్చేందుకే అల్లర్లు: జేసీముఖ్యమంత్రి రోశయ్య సర్కారుకు గట్టి షాక్ ఇచ్చేందుకు పాతబస్తీ అల్లర్లు సృష్టించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనికి బలం చేకూర్చేలా ఇతర ప్రాంతాలకు చెందిన వారిని హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.Source: Yahoo! Telugu: News | 1 Apr 2010 | 7:11 am అబుదాబీలో రోడ్డు ప్రమాదం: మృతులంతా భారతీయులే!అబుదాబీ సమీపంలో రెండు రోజుల క్రితం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు భారతీయులుగా గుర్తించారు. అబుదాబీలోని రువెయిస్ అనే ప్రాంతంలో గత నెల 29వ తేదీన బస్సు, లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇందులో ఆరుగురు దుర్మరణం చెందగా 44 మంది ప్రాణాలు కోల్పోయారు.Source: Yahoo! Telugu: News | 1 Apr 2010 | 6:58 am తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న "ఓం సాయిరాం"షిర్డిసాయి భక్తుల యధార్థ అనుభవాల నేపథ్యంలో శ్రీ మల్లాది వేంకటేశ్వర ఫిలిమ్స్ నిర్మిస్తున్న "ఓం సాయిరాం" సినిమా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శక నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం కోట శ్రీనివాసరావు, రావురమేష్, నూతన్ ప్రసాద్, అశోక్‌కుమార్, రాజ్యలక్ష్మి, సుదీప్ తదితరులపై కీలక సన్నివేశాలను పలు లొకేషన్స్‌లో చిత్రీకరించారు.Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2010 | 5:45 am బాలయ్య, నయనల "సింహా" పాటల విడుదలనందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన "సింహా" సినిమా పాటలు బుధవారం మార్కెట్లోకి వచ్చాయి. నయనతార, స్నేహాఉల్లాల్, నమిత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో బాలకృష్ణను భిన్న కోణంలో ఆవిష్కరించామని నిర్మాత పరుచూరి కిరీటీ అన్నారు. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేశామని నిర్మాత వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ నెలాఖరులో సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 1 Apr 2010 | 5:27 am ఆహ్వానించక పోవడం ఎన్టీఆర్‌ను అవమానించినట్టే: ఎల్పీటాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై ఎన్టీఆర్ తెదేపా అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి మండిపడ్డారు. యువహీరో నిశ్చితార్థానికి తనను ఆహ్వానించక పోవడం జూనియర్ ఎన్టీఆర్ తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్‌ను అవమానించినట్టేనని ఆమె వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 1 Apr 2010 | 2:45 am డీఎంకే అధ్యక్ష పదవికి పోటీ చేస్తా: మంత్రి అళగిరిద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగితే తాను పోటీ చేస్తానని కేంద్ర రసాయన, ఎరువుల శాఖామంత్రి, ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే.అళగిరి ప్రకటించారు. దీంతో డీఎంకేలో అధినాయకత్వ పోరు తీవ్రరూపం దాల్చే అవకాశాలు లేకపోలేదు.Source: జాతీయ | 1 Apr 2010 | 2:29 am అధిక ధరలకు విక్రయించిన వ్యాపారుల అరెస్టు: సబితకర్ఫ్యూ సడలించిన పాతబస్తీ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించిన నలుగురు వ్యాపారులను పోలీసులు అరెస్టు చేసినట్టు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆమె గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పాతబస్తీలో కర్ఫ్యూ సడలింపు ప్రాంతాల్లో 20 ట్రక్కుల్లో కూరగాయలు, 90 వేల లీటర్ల పాలను సరఫరా చేశామన్నారు.Source: ఏపీ న్యూస్ | 1 Apr 2010 | 2:18 am హైదరాబాద్ అల్లర్ల వెనుక మైనింగ్ మాఫియా: బాబురాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో చెలరేగిన అల్లర్ల వెనుక మైనింగ్ మాఫియా హస్తముందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అటు కర్ణాటక, ఇటు మన రాష్ట్రంలో యదేచ్ఛగా మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్న గాలి జనార్ధన్ రెడ్డి సోదరుల పాత్ర వీటి వెనుక ఉండివుండవచ్చని ఆయన సందేహం వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 1 Apr 2010 | 2:08 am రోశయ్య సర్కారుకు షాక్ ఇచ్చేందుకే అల్లర్లు: జేసీముఖ్యమంత్రి రోశయ్య సర్కారుకు గట్టి షాక్ ఇచ్చేందుకు పాతబస్తీ అల్లర్లు సృష్టించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనికి బలం చేకూర్చేలా ఇతర ప్రాంతాలకు చెందిన వారిని హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.Source: ఏపీ న్యూస్ | 1 Apr 2010 | 1:42 am అక్రమార్జన కేసు: లాలూ దంపతులకు సుప్రీం ఊరట!ఆదాయానికి మంచి ఆస్తుల అక్రమార్జన కేసులో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దంపతులకు పెద్ద ఊరట లభించింది. అక్రమార్జన కేసు నుంచి వీరిద్దరిని తప్పించడం చెల్లుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం తీర్పు ఇచ్చింది.Source: జాతీయ | 1 Apr 2010 | 12:58 am తెలుగుదేశం అధికారిక ఛానల్‌గా స్టూడియో "ఎన్"!!రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు సొంతగా టీవీ ఛానల్స్‌ను ప్రారంభించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి "సాక్షి" పత్రిక, టీవీ ఛానల్ ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఇటీవలే "తెలంగాణ" టీవీ ఛానల్‌ను ఏర్పాటు చేసింది. వామపక్ష పార్టీలకు "ప్రజాశక్తి" పత్రిక ఎప్పటి నుంచో ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకంటూ ప్రత్యేకించి వార్తాపత్రిక, టీవీ ఛానల్ లేదు. అయితే, 'ఈనాడు', 'ఆంధ్రజ్యోతి' పత్రికలు, టీవీ ఛానల్స్ అనధికారికంగా తెదేపా ఛానల్స్‌గా వ్యవహరిస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం.Source: ఏపీ న్యూస్ | 1 Apr 2010 | 12:34 am పాతబస్తీలో కర్ఫ్యూ సడలింపు: సరుకుల కోసం బారులు!పాతబస్తీతో పాటు దక్షిణ మండలంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విడతల వారీగా కర్ఫ్యూను సడలించారు. దీంతో పాతబస్తీ వాసులు నిత్యావసర వస్తు సరకుల కోసం దుకాణాల వద్ద బారులు తీరారు. అయితే, నిత్యావసర వస్తువులు కొరత ఏర్పడటంతో పలువురు వ్యాపారులు ఇష్టరాజ్యంగా అధికరేట్లకు విక్రయించారు.Source: ఏపీ న్యూస్ | 31 Mar 2010 | 11:50 pm రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం: 20 మంది దుర్మరణంరాష్ట్రంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది మృత్యువాత పడ్డారు. గుంటూరు జిల్లా మాచర్ల సమీపంలోని వెల్దుర్తి మండలం ఉప్పలపాడు వద్ద సిమెంట్ లారీ ఒకటి బోల్తా పడింది. సిమెంట్ బస్తాలపై కూర్చొని ప్రయాణిస్తున్న 20 మంది బస్తాల కింద చిక్కుకుని దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 31 Mar 2010 | 11:39 pm నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడమే లక్ష్యం: పీఎందేశంలోని ప్రతి చిన్నారికి నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడమే యూపీఏ సర్కారు ఏకైక లక్ష్యమని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. దేశంలో గురువారం నుంచి విద్యా హక్కు చట్టం అమలుకు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలోని ప్రతి చిన్నారికి ప్రాథమిక విద్యను అందించడమే తమ ప్రభుత్వ అంతిమ లక్ష్యమన్నారు.Source: జాతీయ | 31 Mar 2010 | 10:58 pm దేశంలో నేటి నుంచి విద్యా హక్కు చట్టం అమలు!స్వతంత్ర భారతావని చరిత్రలో మరో అపురూపఘట్టం ఆవిష్కృతమైంది. చారిత్రాత్మక విద్యా హక్కు చట్టం నేటి నుంచి అమలుకానుంది. పాఠశాలకు వెళ్ళని కోటి మంది బాలలు తక్షణం ఈ చట్టం వల్ల నేరుగా లబ్ధి పొందుతారు. ప్రస్తుతం పాఠశాలకు వెళ్ళని, పాఠశాల మానివేసిన బాలలు దేశంలో సుమారు 92 లక్షల వరకు ఉంటారని కేంద్రం అంచనావేసింది.Source: జాతీయ | 31 Mar 2010 | 10:12 pm నేటి నుంచి దేశంలో జన గణన కార్యక్రమం ప్రారంభం!దేశ వ్యాప్తంగా గురువారం నుంచి జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభంకానుంది. దేశంలోని 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టే ఈ కార్యక్రమం రెండు దశలుగా జరుగనుంది. తొలిదశలో ఇళ్ళ జాబితాను, రెండో దశలో జనాభా లెక్కలను సేకరించనున్నారు. దేశంలో పదేళ్ళకొకసారి జనాభా లెక్కల సేకరణ జరుగుతున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 31 Mar 2010 | 10:04 pm మే తొమ్మిదో తేదీన జూనియర్ ఎన్టీఆర్-ప్రణతి వివాహం!టాలీవుడ్ కుర్రకారు హీరో జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. స్టూడియో 'ఎన్' అధినేత నార్నే శ్రీనివాస్ ఏకైక కుమార్తె లక్ష్మీప్రణతిని వివాహమాడనున్నారు. వచ్చే నెల తొమ్మిదో తేదీన వీరి వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు.Source: ఏపీ న్యూస్ | 31 Mar 2010 | 9:32 pm ఏప్రిల్ 1న జూనియర్ ఎన్టీఆర్- ప్రణీతల నిశ్చితార్థం..?!!ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్, ప్రణీతల కుటుంబాలు అనుకున్నట్లుగా ఏప్రిల్ 1న ఇద్దరి వివాహ నిశ్చితార్థం జరగనున్నదని పలు టీవీ ఛానళ్లు వార్తా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. అయితే అటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నుంచి కానీ, ఇటు ప్రణీత కుటుంబ సభ్యులు నుంచి కానీ నిశ్చితార్థంపై ఎటువంటి ప్రకటనా రాలేదు. అయితే కొన్ని ఛానళ్లు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెపుతున్నాయి. ఇదే సమయంలో మరికొన్ని ఇప్పుడు కాదంటున్నాయి. ఇదిలావుంటే జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థం నిజమైతే పెద్ద ఎత్తున సందడి చేసేందుకు నందమూరి అభిమానులు సిద్ధమయ్యారు. అయితే నందమూరి కుటుంబం నుంచి ఎటువంటి కబురు రాకపోవడంతో మిన్నకుండి పోయారు.లక్ష్మీ ప్రణీత మేజర్ కాదనీ, మైనర్ బాలిక అయిన అమ్మాయిని జూనియర్ ఎన్టీఆర్ ఎలా వివాహమాడతాడని అప్పట్లో పలువురు విమర్శించారు. ఈ మార్చి నెలతో లక్ష్మీ ప్రణీతకు 18 ఏళ్లు నిండటంతో నిశ్చితార్థానికి ఎటువంటి అడ్డంకులు ఉండబోవని అంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 31 Mar 2010 | 12:35 pm పెళ్లి పీటలపైనే "వధువు"ను చూస్తాననే "వరుడు" ఉంటాడా...?!!అల్లు అర్జున్ వయస్సుకు తగ్గట్లుగా బాడీలో ఎనర్జీ పాళ్లు ఎక్కువే. డాన్స్‌లోనూ, ఫైట్స్‌లోనూ (కొంత గ్రాఫిక్స్ ఎయినా) అది కనపడింది. డైలాగ్ మాడ్యులేషన్ ఎమోషన్‌లో సరిగ్గా సూటుకాలేదు. కానీ వరుడుగా బాడీని కావాల్సినంత ఎక్స్‌ఫోజ్ చేసి ఒక వర్గాన్ని మెప్పిస్తాడు. హీరోయిన్ ఎవరా? అని గోప్యంగా ఉంచి అమృత్‌సర్ అమ్మాయిని చూపించారు. పెళ్లితంతులో ఆభరణాలు, మేకప్‌లో కళ్లకు బాగానే అనిపించింది. కాలేజీ చదివే ఎపిసోడ్‌లో మాత్రం అంత అందం కనబడదు. నార్మల్ గాళ్‌గా ఉంది. ఆమెకు హీరోతో కొద్దిపాటి డైలాగ్స్ మినహా పెద్దగా ప్రాధాన్యత లేదు. దివాకర్ పాత్రలో ఆర్య ఆకట్టుకున్నాడు. అతనిది సైకో పాత్ర. తనకు అడ్డూఅదుపులేకపోతే ఎలా ఉంటాడో చూపాడు. నాటకాలపిచ్చి. కోరింది దక్కకపోతే సహించడు. కామంతో రగిలిపోతుంటాడు. కూష్మాండా అంటూ.. తను నాటకాల్లో వేసిన పాత్రను జ్ఞప్తికి తెచ్చుకుంటూ చెడుపనులు చేస్తుంటాడు. పూర్తిగా ఎమోషనల్ పాత్ర. విలన్‌గా కథాపరంగా సూటయ్యాడు. ఇక సందీప్ తల్లిదండ్రులు, దీప్తి తల్లిదండ్రుల పాత్రలు రొటీన్. తాతగా సింగీతం శ్రీనివాసరావు నటించాడు.Source: Yahoo! Telugu: Entertainment | 31 Mar 2010 | 10:55 am హైదరాబాద్ అల్లర్లలో అసాంఘిక శక్తులు: చిదంబరంహైదరాబాద్ పాతబస్తీ అల్లర్లు దురుదృష్టకరమైనవిగా కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అన్నారు. అయితే ఈ అల్లర్లు తీవ్రరూపం దాల్చకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పినట్లు అల్లర్ల వెనుక కుట్ర ఉందా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోందన్నారు.Source: జాతీయ | 31 Mar 2010 | 7:57 am కొత్త "జాక్వెలిన్" ఒక వింత.. పాత "జెన్నీ" ఒక రోతరితేష్ దేశ్‌ముఖ్ పేరు వినగానే మనకు చటుక్కున గుర్తుకు వచ్చేది కోనకళ్ల సుందరి జెనీలియా పేరు. ఈ బక్కపలచని భామను రితేష్ దేశ్‌ముఖ్ వివాహమాడబోతున్నాడని ఆ మధ్య బలంగా వార్తలు కూడా వచ్చాయి. కానీ కొత్తొక వింత.. పాతొక రోత అనే సామెతలా రితేష్ మరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది. మరాఠీ సంప్రదాయ పండుగు గుడిపడ్వా రోజునాడు కొత్త గాళ్‌ఫ్రెడ్ జాక్వెలిన్‌తో రితేష్ చాలా క్లోజ్‌గా గడిపాడట. ఇద్దరూ దాదాపు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా సంప్రదాయ దుస్తులు ధరించి ఒకరికొకరు చాలా సన్నిహితంగా మెలిగారట. చూసిన వారంతా ఇద్దరి మధ్య బంధం తారాస్థాయికి చేరుకుందని గుసగుసలాడుకున్నారట.Source: Yahoo! Telugu: Entertainment | 31 Mar 2010 | 7:02 am ఐష్‌కి 25 అడుగుల దూరంలో బాంబు పేల్చిన మణిరత్నం"రావణ"కోసం ఓ భయంకరమైన రిస్కీ షాట్ చిత్రీకరించాలని మణిరత్నం సంకల్పించారు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్, నెంబర్‌వన్ తమిళ స్టార్ విక్రమ్ ఇద్దరు నటిస్తుండగా వారికి సుమారు 25 అడుగులు దూరంలో గాలిలో బాంబు పేలుతున్నట్లుగా సన్నివేశాన్ని తెరకెక్కించాలని స్టంట్ మాస్టర్ కౌశల్‌కు సూచించారు. మరుసటి రోజు యూనిట్ సభ్యులు అందరిలో ఒకటే టెన్షన్. విక్రమ్, ఐశ్వర్యారాయ్‌లిద్దరితోపాటు మరికొంతమంది నటీనటులు బాంబు పేలుడు సన్నివేశంలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారు. స్టంట్ మాస్టర్ కౌశల్ ఐష్- విక్రమ్‌లపైకి బాంబు విసిరాడు. అది ఖచ్చితంగా వారిద్దరికీ 25 అడుగులు దూరంలో గాలిలో పేలిపోయింది. అతను విసరడంలో ఏమాత్రం తేడా ఉన్నా ఐష్- విక్రమ్‌లిద్దరికీ తీవ్రంగా గాయాలు కావడం ఖాయం.Source: Yahoo! Telugu: Entertainment | 31 Mar 2010 | 6:30 am పాతబస్తీ అల్లర్లపై 67 కేసుల నమోదు: ఏకే.ఖాన్ వెల్లడిపాతబస్తీలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 67 కేసులను నమోదు చేసినట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఏకే.ఖాన్ తెలిపారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం దక్షిణ మండలంతో పాటు పాతబస్తీ అంతటా ప్రశాంత వాతావరణం నెలకొని ఉందన్నారు.Source: ఏపీ న్యూస్ | 31 Mar 2010 | 5:50 am పెళ్లి పీటలపైనే "వధువు"ను చూస్తాననే "వరుడు" ఉంటాడా...?!!అల్లు అర్జున్ వయస్సుకు తగ్గట్లుగా బాడీలో ఎనర్జీ పాళ్లు ఎక్కువే. డాన్స్‌లోనూ, ఫైట్స్‌లోనూ (కొంత గ్రాఫిక్స్ ఎయినా) అది కనపడింది. డైలాగ్ మాడ్యులేషన్ ఎమోషన్‌లో సరిగ్గా సూటుకాలేదు. కానీ వరుడుగా బాడీని కావాల్సినంత ఎక్స్‌ఫోజ్ చేసి ఒక వర్గాన్ని మెప్పిస్తాడు.Source: వినోదం | 31 Mar 2010 | 5:44 am సిద్దార్థ్ "బావ"లో మరదలిగా ప్రణీతసిద్దార్థ్ కథానాయకునిగా నటిస్తున్న చిత్రం బావ. డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్ పద్మకుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాంబాబు దర్శకునిగా పరిచయమవుతున్నారు.దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ... ఈ చిత్రంలో మరదలి పాత్రకోసం చాలామందిని అనుకుని, చివరకు బెంగళూరు అమ్మాయి ప్రణీతను ఎంపిక చేశాం. అందమైన పల్లె వాతావరణంలో బావామరదళ్ల మధ్య జరిగే క్యూట్ లవ్ స్టోరీ ఇది. ఇందులో ప్రతి ఫ్రేమూ ఓ పెయింటింగ్‌లా ఉంటుంది అని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 31 Mar 2010 | 5:44 am పద్దులపై చర్చ జరిగివుంటే బాగుండేది: స్పీకర్ కిరణ్దాదాపు 45 రోజుల పాటు ప్రశాంతంగా సాగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల పట్ల సభాపతి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, వివిధ శాఖల పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 31 Mar 2010 | 5:42 am సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా "షిమ్లా"పచ్చటి ప్రకృతి పరచుకున్న దారులు, అందమైన కొండలు, ఘాట్ రోడ్లలో పర్వతాలపై దూసుకెళ్లే సొరంగ మార్గాలు, పొడవాటి వంతెనలు.. ఇలా ఒకటేమిటి "షిమ్లా"లో కనిపించే ప్రతి దృశ్యం మనల్ని అలాగే కట్టిపడేస్తుంది. స్థానిక దేవత శ్యామలాదేవి పేరుతో ప్రసిద్ధిగాంచిన ఈ ప్రదేశం భారతదేశంలోని ప్రముఖ పర్యాటక స్థలాలలో ఒకటిగా, వేసవి విడిదిగా పేరుగాంచింది..Source: వినోదం | 31 Mar 2010 | 5:35 am ముగిసిన 26/11 దాడుల కేసు విచారణ: మేలో తీర్పు!ఏడాది పాటు సాగిన ముంబై దాడుల కేసు విచారణ పూర్తయింది. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వర్గాల వాదోపవాదాలు బుధవారంతో ముగిశాయి. వీరి వాదనలు శ్రద్ధగా ఆలకించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తహల్యాని.. తుది తీర్పును మే నెల మూడో తేదీన వెలువరించనున్నారు.Source: జాతీయ | 31 Mar 2010 | 5:20 am నా వారసుడిని డీఎంకే అధిష్టానం నిర్ణయిస్తుంది: కరుణతన హయామానంతరం ద్రావిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడిగా సమర్థుడైన నేతను పార్టీ అధిష్టానమే ఎంపిక చేస్తుందని ఆ పార్టీ సుప్రీం, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి స్పష్టం చేశారు. పార్టీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా తన వారసుని ఎంపిక చేసే హక్కు, అధికారం తనకు కూడా లేదని ఆయన పునరుద్ఘాటించారు.Source: జాతీయ | 31 Mar 2010 | 3:36 am
|