మలేషియా చిత్రాల్లో కౌగిలింతలు.. కిస్సింగ్ సీన్లు బంద్!

చిత్రాల్లో కనిపించే అసభ్యకర, జుగుస్సాకరమైన సన్నివేశాలపై మలేషియా ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్తగా తీసే సినిమాల్లో కౌగిలింతలు, ముద్దు, ఇతర శృంగార సన్నివేశాలు ఉండేందుకు వీలులేదంటూ ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు నిబంధనలకు కఠినతరం చేయడమే కాకుండా, ఫిల్మ్ సెన్సార్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.
Source: Yahoo! Telugu: News | 31 Mar 2010 | 9:25 am

నా వారసుడిని డీఎంకే అధిష్టానం నిర్ణయిస్తుంది: కరుణ

తన హయామానంతరం ద్రావిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడిగా సమర్థుడైన నేతను పార్టీ అధిష్టానమే ఎంపిక చేస్తుందని ఆ పార్టీ సుప్రీం, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి స్పష్టం చేశారు. పార్టీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా తన వారసుని ఎంపిక చేసే హక్కు, అధికారం తనకు కూడా లేదని ఆయన పునరుద్ఘాటించారు.
Source: Yahoo! Telugu: News | 31 Mar 2010 | 9:06 am

నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల పతనం

బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభ, నష్టాలతో ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 38 పాయింట్లు పతనమైంది. దీంతో సెన్సెక్స్ 17,551 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 16 పాయింట్లు క్షీణించి, 5,246 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 31 Mar 2010 | 8:38 am

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం: సెన్సెక్స్ వృద్ధి

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధి బాటలో కొనసాగుతోంది. అమెరికా, యూరప్ స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేసుకోవడం ద్వారా బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటలకు 41 పాయింట్లు లాభపడింది. దీంతో సెన్సెక్స్ సూచీ 17,631 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం ఆరు పాయింట్ల వృద్ధితో, 5,269 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 31 Mar 2010 | 8:25 am

నాలుగువేల శాతం డివిడెండ్ చెల్లించనున్న హీరోహోండా

భారతదేశంలో తమ సంస్థను స్థాపించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తమ కంపెనీకి చెందిన షేర్ హోల్డర్లకు 4 వేల శాతం డివిడెండును చెల్లించేందుకు నిర్ణయించుకున్నామని హీరో హోండా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) రవి సూద్ బుధవారం తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 31 Mar 2010 | 7:55 am

దేశ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న వీకేసింగ్

దేశ ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెట్ జనరల్ వీకే.సింగ్ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్న దీపక్ కపూర్ బుధవారం పదవీ విరమణ చేశారు. దీంతో ఆయన స్థానంలో వీకేసింగ్‌ను కేంద్ర రక్షణ శాఖ నియమించింది.
Source: Yahoo! Telugu: News | 31 Mar 2010 | 7:39 am

లాభాల్లో కొనసాగుతోన్న బాంబే స్టాక్ మార్కెట్

బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి హెచ్చు తగ్గులతో ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో లాభాలతో 17,605 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 5,265 మార్కు వద్ద లాభాలతో ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 31 Mar 2010 | 7:31 am

దుబాయ్‌లో భారతీయుల ఉరిశిక్ష రద్దుకు చర్యలు!

పాకిస్థాన్ జాతీయుడిని హత్య చేసిన కేసుతో పాటు వివిధ కేసుల్లో ఉరిశిక్ష పడిన 17 మంది భారతీయులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. షార్జా షారియా కోర్టు ఇచ్చిన తుది తీర్పుపై పైకోర్టులో అప్పీలు చేసే ఏర్పాట్లు చేయాల్సిందిగా దుబాయ్‌లోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులకు భారతీయ ప్రవాసీ వ్యవహారాల శాఖామంత్రి వాయిలార్ రవి ఆదేశించారు.
Source: Yahoo! Telugu: News | 31 Mar 2010 | 7:17 am

కొత్త "జాక్వెలిన్" ఒక వింత.. పాత "జెన్నీ" ఒక రోత

రితేష్ దేశ్‌ముఖ్ పేరు వినగానే మనకు చటుక్కున గుర్తుకు వచ్చేది కోనకళ్ల సుందరి జెనీలియా పేరు. ఈ బక్కపలచని భామను రితేష్ దేశ్‌ముఖ్ వివాహమాడబోతున్నాడని ఆ మధ్య బలంగా వార్తలు కూడా వచ్చాయి. కానీ కొత్తొక వింత.. పాతొక రోత అనే సామెతలా రితేష్ మరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది. మరాఠీ సంప్రదాయ పండుగు గుడిపడ్వా రోజునాడు కొత్త గాళ్‌ఫ్రెడ్ జాక్వెలిన్‌తో రితేష్ చాలా క్లోజ్‌గా గడిపాడట. ఇద్దరూ దాదాపు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా సంప్రదాయ దుస్తులు ధరించి ఒకరికొకరు చాలా సన్నిహితంగా మెలిగారట. చూసిన వారంతా ఇద్దరి మధ్య బంధం తారాస్థాయికి చేరుకుందని గుసగుసలాడుకున్నారట.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Mar 2010 | 7:02 am

జులై వరకు సరుకు రవాణాలో సేవా పన్ను ఉండదు: రైల్వే

రైల్వేల ద్వారా రవాణాచేసే సరుకులపై 10 శాతం సేవాపన్ను మరో మూడు నెలలపాటు ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 31 Mar 2010 | 7:00 am

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ వృద్ధి

బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలను చవిచూసిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో 14 పాయింట్లు బలపడి, 17,605 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా ఆరు పాయింట్ల స్వల్ప వృద్ధితో, 5,269 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 31 Mar 2010 | 6:51 am

ఐష్‌కి 25 అడుగుల దూరంలో బాంబు పేల్చిన మణిరత్నం

"రావణ"కోసం ఓ భయంకరమైన రిస్కీ షాట్ చిత్రీకరించాలని మణిరత్నం సంకల్పించారు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్, నెంబర్‌వన్ తమిళ స్టార్ విక్రమ్ ఇద్దరు నటిస్తుండగా వారికి సుమారు 25 అడుగులు దూరంలో గాలిలో బాంబు పేలుతున్నట్లుగా సన్నివేశాన్ని తెరకెక్కించాలని స్టంట్ మాస్టర్ కౌశల్‌కు సూచించారు. మరుసటి రోజు యూనిట్ సభ్యులు అందరిలో ఒకటే టెన్షన్. విక్రమ్, ఐశ్వర్యారాయ్‌లిద్దరితోపాటు మరికొంతమంది నటీనటులు బాంబు పేలుడు సన్నివేశంలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారు. స్టంట్ మాస్టర్ కౌశల్ ఐష్- విక్రమ్‌ల‌పైకి బాంబు విసిరాడు. అది ఖచ్చితంగా వారిద్దరికీ 25 అడుగులు దూరంలో గాలిలో పేలిపోయింది. అతను విసరడంలో ఏమాత్రం తేడా ఉన్నా ఐష్- విక్రమ్‌లిద్దరికీ తీవ్రంగా గాయాలు కావడం ఖాయం.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Mar 2010 | 6:30 am

సిద్దార్థ్ "బావ"లో మరదలిగా ప్రణీత

సిద్దార్థ్ కథానాయకునిగా నటిస్తున్న చిత్రం బావ. డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్ పద్మకుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాంబాబు దర్శకునిగా పరిచయమవుతున్నారు.దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ... ఈ చిత్రంలో మరదలి పాత్రకోసం చాలామందిని అనుకుని, చివరకు బెంగళూరు అమ్మాయి ప్రణీతను ఎంపిక చేశాం. అందమైన పల్లె వాతావరణంలో బావామరదళ్ల మధ్య జరిగే క్యూట్ లవ్ స్టోరీ ఇది. ఇందులో ప్రతి ఫ్రేమూ ఓ పెయింటింగ్‌లా ఉంటుంది అని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Mar 2010 | 5:44 am

నా వారసుడిని డీఎంకే అధిష్టానం నిర్ణయిస్తుంది: కరుణ

తన హయామానంతరం ద్రావిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడిగా సమర్థుడైన నేతను పార్టీ అధిష్టానమే ఎంపిక చేస్తుందని ఆ పార్టీ సుప్రీం, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి స్పష్టం చేశారు. పార్టీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా తన వారసుని ఎంపిక చేసే హక్కు, అధికారం తనకు కూడా లేదని ఆయన పునరుద్ఘాటించారు.
Source: జాతీయ | 31 Mar 2010 | 3:36 am

దేశ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న వీకేసింగ్

దేశ ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెట్ జనరల్ వీకే.సింగ్ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్న దీపక్ కపూర్ బుధవారం పదవీ విరమణ చేశారు. దీంతో ఆయన స్థానంలో వీకేసింగ్‌ను కేంద్ర రక్షణ శాఖ నియమించింది.
Source: జాతీయ | 31 Mar 2010 | 2:12 am

పాతబస్తీలో పరిస్థితి ప్రశాంతం.. 180 అరెస్టు: హోంమంత్రి

గత రెడు రోజులుగా అల్లర్లు చోటు చేసుకున్న పాతబస్తీలోని 25 పోలీసు స్టేషన్ల పరిధిలో పరిస్థితులు కుదుటపడుతున్నాయని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి రోశయ్య బుధవారం ఉదయం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 25 పోలీసు స్టేషన్ల పరిధిలో పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 31 Mar 2010 | 1:20 am

పాతబస్తీ అల్లర్లు: భాజపా ధర్నా - నేతల అరెస్టు!

రాజధాని హైదరాబాద్‌లోని పాతబస్తీలో చోటు చేసుకున్న అల్లర్లకు నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో స్థానిక ట్యాంకుబండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా జరిగింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, బద్ధం బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 31 Mar 2010 | 12:08 am

ఏప్రిల్ 1న జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

దేశ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏప్రిల్ ఒకటో తేదీ గురువారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చారిత్రాత్మక విద్యా హక్కు చట్టం ఒకటో తేదీ నుంచి అమలుకు రానుంది. దీన్ని వల్ల కలిగే లాభనష్టాలను వివరిస్తూ ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఒక చట్టం ప్రాధామ్యాలను గురించి దేశ ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Source: జాతీయ | 31 Mar 2010 | 12:01 am

కర్ఫ్యూ బాధిత ప్రాంతాల్లో పరీక్షలు, పెళ్లిళ్లు వాయిదా!

పాతబస్తీలో చెలరేగిన అల్లర్లను అణిచి వేసేందుకు హైదరాబాద్ నగర పోలీసు యంత్రాంగం పలు ప్రాంతాల్లో కర్ఫ్యూను అమలు చేస్తోంది. ఈ కారణంగా బుధవారం జరగాల్సిన అన్ని రకాల పరీక్షలు, వివాహాది శుభకార్యాలు వాయిదాపడ్డాయి. దీనిపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖామంత్రి డి.మాణిక్య వరప్రసాదరావు మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షల్లో భాగంగా బుధ గురువారాల్లో సైన్స్, నేచురల్ సైన్స్ పరీక్షలు జరగాల్సి ఉందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2010 | 11:42 pm

పాతబస్తీ అల్లర్లు: మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం!

హైదరాబాద్‌ పాతబస్తీ అల్లర్ల పుణ్యమాని రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యంకానుంది. ఈ అల్లర్ల కారణంగా ముఖ్యమంత్రి రోశయ్య తన ఢిల్లీ యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయన ఏప్రిల్ ఒకటి, రెండు తేదీల్లో హస్తినకు వెళ్లి పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు.. ప్రధాని, ఇతర కేంద్రమంత్రులతో భేటీ కావాల్సి ఉంది. ఈ సమయంలో ఆయన మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై అధిష్టానం ఆమోదముద్ర వేసుకుని రావాల్సి ఉంది.
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2010 | 11:19 pm

పాతబస్తీ అల్లర్లకు కిషన్ రెడ్డే కారణం: ఎంపీ లగడపాటి

దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మళ్లీ మతకలహాలు చెలరేగడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డే ప్రధాన కారణమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆరోపించారు. రాష్ట్ర శాఖ పగ్గాలను చేపట్టిన కిషన్ రెడ్డి... పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన చర్యలు చేపట్టారని, ఇందులో భాగంగానే ఈ పాతబస్తీ కల్లోలం సృష్టించారని ఆయన దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2010 | 11:10 pm

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జనాభా లెక్కలు ప్రారంభం

దేశంలో పది సంవత్సరాలకు ఒకసారి చేపట్టే జనాభా లెక్కింపు కార్యక్రమం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు నెలాఖరు లోపు ఈ జనాభా లెక్కల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ దఫా జనాభా లెక్కల సేకరణలో అత్యంత పారదర్శకత పాటించాలని కేంద్రం నిర్ణయించింది.
Source: జాతీయ | 30 Mar 2010 | 10:10 pm

అండమాన్-ఒరిస్సాలలో భూకంపం: విశాఖలోనూ ప్రభావం!

బంగాళాఖాతంలో మంగళవారం రాత్రి 10.24 నిమిషాల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని ప్రభావం కారణంగా అండమాన్ నికోబార్ దీవులతో పాటు ఒరిస్సా, విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)లలో భూమి స్వల్పంగాగ కంపించింది. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ భూకంప ప్రకంపనల తీవ్రత ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్టు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అమెరికా జియోలాజికల్ సర్వే మాత్రం 6.4గా నమోదైనట్టు పేర్కొంది.
Source: జాతీయ | 30 Mar 2010 | 9:56 pm

"వరుడు" కోతిలా ఉండాలి... అవి బన్నీలో ఉన్నాయ్: గుణ

"వరుడు" పెళ్లి ముహూర్తం ముంచుకొచ్చింది. వధూవరులకు రేపే పెళ్లి జరుగనుంది. సానియా - షోయబ్‌ల గురించి అనుకునేరు...? అదేం కాదు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ సినిమా వరుడు చిత్రం విడుదల గురించిన సంగతి. అన్నమాట ప్రకారం మార్చి 31వ తేది వరుడు చిత్రాన్ని దర్శక నిర్మాతలు విడుదల చేస్తున్నారు. అదీ సంగతి. ఇక వివరాలలోకి వెళితే... వరుడు చిత్రం విడుదల సందర్భంగా దర్శకుడు గుణశేఖర్, హీరో అల్లు అర్జున్ మంగళవారం హైదరాబాదులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ... నేను అనుకున్న "వరుడు" సబ్జెక్టుకు కోతిలాంటి అబ్బాయి కావాలి. అటువంటి చేష్టలు నాకు బన్నీలో కనబడ్డాయి. అందుకే ఈ చిత్రంలో వరుడు పాత్రలో అర్జున్ నటిస్తున్నాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Mar 2010 | 2:18 pm

భాగ్యనగరం "పాతబస్తీ"లో ఆగని అల్లర్లు: ఒకరు మృతి

హైదరాబాదులో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గలేదు. పాతబస్తీలో మొదలైన ఘర్షణలు ఇతర ప్రాంతాలకు పాకుతున్నాయి. మంగళవారంనాడు కార్వాన్ హరదర్వాజ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణలో ఒక వ్యక్తి మృతి చెందారు.
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2010 | 9:51 am

బొత్స - అల్లు వియ్యంకులు కాబోతున్నారా..?!!

అల్లు అరవింద్ - మంత్రి బొత్స సత్యనారాయణల మధ్య స్నేహ సంబంధాలు పటిష్టమవుతున్నాయి. ఇరువురూ ఈ స్నేహ బంధాన్ని బంధురికంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు టాలీవుడ్ టాక్. బంధురికమా...? అదెలా...? అని ఆశ్చర్యపోతున్నారా...? మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తెకు అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్‌తో వివాహం చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు ఒక అంగీకారానికి వచ్చినట్లు భోగట్టా.ఇటీవల మెగా ఫ్యామిలీతో బొత్స సన్నిహితంగా మెలగటం వెనుక కారణాలు కూడా ఇవేనని టాలీవుడ్ సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈ విషయం వాస్తవమా... కాదా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంగతి ఇలా ఉంటే.. అల్లు చిన్న కొడుకు శిరీష్ పెళ్లికి వధువును చూశారు... సరే!! మరి పెద్ద కుమారుడు "వరుడు" సంగతేమిటో...?!!
Source: Yahoo! Telugu: Entertainment | 30 Mar 2010 | 9:35 am

ప్రేమ జంట హత్య కేసు: ఐదుగురికి మరణ దండన

ప్రేమ వివాహం చేసుకున్నారనే కోపంతో, కులం పరువు కోసం ఓ ప్రేమజంటను హతమార్చిన సంఘటనలో ఐదుగురికి కర్నాల్ సెషన్స్ కోర్టు మరణశిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది.
Source: జాతీయ | 30 Mar 2010 | 9:20 am

నగరంలోని మరో 8 పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ: ఏకే ఖాన్

రాష్ట్ర రాజధాని హైదారాబాద్ నగరంలో గత మూడు రోజులుగా జరుగుతున్న అల్లర్ల కారణంగా మంగళవారం పరిస్థితి శృతి మించింది. దీంతో నగరంలోని మరో ఎనిమిది పోలీసు స్టేషన్ల్ పరిధిలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు కమీషనర్ ఏకే ఖాన్ మంగళవారం మీడియాకు తెలిపారు. తాజాగా నగరంలో ఎనిమిది పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించడంతో మొత్తం 25 పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగుతుందని ఏకే ఖాన్ వెల్లడించారు. ఈ కర్ఫ్యూ ఏప్రిల్ నెల 5 వరకు ఉంటుందని, అప్పటి వరకు జంట నగరాల్లో 144 సెక్షన్ అమలులోవుంటుందని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2010 | 8:43 am

విమర్శలు నాకు ఉత్తేజాన్నిస్తాయి: అమితాబ్ బచ్చన్

మంగళవారంనాడు పూణెలో జరిగిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్ నిర్వహించిన సమావేశంలో ఎస్పీ బహిష్కృత నేత అమర్ సింగ్, అమితాబ్ ఇద్దరూ ఒకే వేదికపై నుంచి ప్రసంగించారు.ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ... విమర్శ అనేది నాకు చాలా ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు
Source: జాతీయ | 30 Mar 2010 | 7:50 am

"సింహా" తర్వాత తెదేపా కుర్చీలో బాలయ్య..?!!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మరో పవర్‌ఫుల్ చిత్రం సింహా. ఈ చిత్రంతో బాలయ్య సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడని టాలీవుడ్‌లో గుసగుసలు పోతున్నాయి. సింహా చిత్రం తర్వాత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని బాలయ్య అనుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. బాలయ్య బాబుకు తెదేపా పగ్గాలివ్వాలని ఇటీవల లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలను బాలకృష్ణ ఖండించకపోవడం ఈ విషయానికి మరింత ఊతమిస్తోంది. లక్ష్మీ పార్వతితోపాటు నందమూరి హీరోలందరి అభిమతం కూడా బాలకృష్ణకు కుర్చీ అప్పజెప్పాలన్నదేనన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం బాలయ్య బాబు అంశంపై నోరు మెదపడం లేదు. పైగా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద బావ హరికృష్ణను పొగడ్తలతో ఆకాశానికెత్తాశారు. బాబు వ్యూహాలు అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టమే మరి.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Mar 2010 | 7:31 am

పాతబస్తీలో ప్రశాంత వాతావరణం నెలకొనాలి: చంద్రబాబు

రాష్ట్ర రాజధానిలోని పాతబస్తీలో ప్రశాంత వాతావరణం నెలకొనాలని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభిలషించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2010 | 7:23 am

ప్రేమా...? అంటే ఏమిటీ..? సింధు మీనన్ ప్రశ్న

"చందమామ"లో అందంగా కన్పించిన సింధూ మీనన్ తాజాగా "సుభద్ర"తో ముందుకు వస్తుంది. ప్రేమ గురించి అడిగితే ముఖాన్ని ప్రశ్నార్థకంగా పెట్టింది. అసలు ప్రేమంటే ఏమిటి...? అని అమాయకంగా ప్రశ్నిస్తోంది. వెండితెర ప్రేమలు తెలుసు కానీ నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదని ఫోజులు కొడుతోంది. అదిసరే... పెళ్లి గురించి నీ అభిప్రాయం చెప్పవూ అని అడిగితే... ఏదైనా ఇద్దరికీ అతకాలి. ఒదిగి పోవాలి. అయితే ప్రేమ పేరుతో పెద్దవారికి చెప్పకుండా పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే ఇన్నాళ్లు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకే కదా మంచి చెడ్డలు తెలిసేది. అందుకే నేను పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటాను అంటోంది. నమ్మేద్దామా...?
Source: Yahoo! Telugu: Entertainment | 30 Mar 2010 | 6:02 am

పాతబస్తీలో కర్ఫ్యూ: మరికొన్ని ప్రాంతాలకు అల్లర్లు!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో చెలరేగిన అల్లర్లు మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ముషీరాబాద్, బేగంబజార్ ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం అల్లరి మూక విధ్వంసం సృష్టించింది. ఆందోళనకారులు బేగంబజార్‌లో తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన అల్లరి మూక పోలీసులపై రాళ్లతో దాడికి దిగింది. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు గాలిలో కాల్పులు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2010 | 5:19 am

గుజరాత్-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బాల్యవివాహాలు అధికం!

దేశంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా జరిగే బాల్య వివాహాల్లో 40 శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. అలాగే, దేశ రాజధాని న్యూఢిల్లీలో కూడా ఈ తరహా వివాహాలు చోటు చేసుకోవడం సిగ్గుచేటుగా చెప్పుకోవచ్చు.
Source: జాతీయ | 30 Mar 2010 | 5:05 am

మధు యాష్కీ.. ఓ ఉన్మాదిలా మాట్లాడకు: లగడపాటి

నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు మధు యాష్కీ ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆరోపించారు. సీమాంధ్ర నేతలు మతకలహాలు సృష్టించేవారా అంటూ ఆయన ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2010 | 4:52 am

మున్నార్‌, అలెప్పీలో ఆనందాల "హనీమూన్ హోంస్టే"

సూర్యోదయం, సూర్యాస్తమయం వేళల్లో ముగ్ధ మనోహర దృశ్యాలతో శోభిల్లే అందమైన సముద్ర తీరాలు, సెలయేటి గలగలలు, టీ తోటల సుమధుర పరిమళాలు.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ మనసును అబ్బురపరిచేదే. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంటలకు ఇదో ప్రేమ సామ్రాజ్యమంటే అతిశయోక్తి కాదు. ఇక్కడి హోంస్టేలు హనీమూన్ జంటలకు ఓ మన్మధ సామ్రాజ్యాన్ని సృష్టించి బహూకరిస్తుంటాయి.
Source: వినోదం | 30 Mar 2010 | 4:42 am

హైదరాబాద్ పాతబస్తీ అల్లర్లపై ఎన్.సి.ఎం విచారణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పాతబస్తీలో చోటు చేసుకున్న అల్లర్లపై జాతీయ మైనారిటీ కమిషన్ దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇద్దరు సభ్యులతో కూడిన విచారణ బృందాన్ని హైదరాబాద్‌కు పంపనుంది. అలాగే, అల్లర్లకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తోంది.
Source: జాతీయ | 30 Mar 2010 | 3:24 am