సానియా-సోహ్రాబ్‌ల "బంధం"లో షోయబ్ ప్రేమ చిచ్చు!

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పెళ్లి వ్యవహారం అంతర్జాతీయ మీడియాలో మరోమారు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత యేడాది జులై నెలలో తన చిరకాల స్నేహితుడు 24 సంవత్సరాల సోహ్రాబ్ మీర్జాతో నిఖా పక్కా చేసుకుంది. వీరిద్దరు కొన్ని రోజుల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తిరిగిన తర్వాత గానీ.. సానియాకు తెలియరాలేదు.. తమ ఈడుజోడు సరిగా లేదనే విషయం.
Source: Yahoo! Telugu: News | 30 Mar 2010 | 9:37 am

బొత్స - అల్లు వియ్యంకులు కాబోతున్నారా..?!!

అల్లు అరవింద్ - మంత్రి బొత్స సత్యనారాయణల మధ్య స్నేహ సంబంధాలు పటిష్టమవుతున్నాయి. ఇరువురూ ఈ స్నేహ బంధాన్ని బంధురికంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు టాలీవుడ్ టాక్. బంధురికమా...? అదెలా...? అని ఆశ్చర్యపోతున్నారా...? మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తెకు అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్‌తో వివాహం చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు ఒక అంగీకారానికి వచ్చినట్లు భోగట్టా.ఇటీవల మెగా ఫ్యామిలీతో బొత్స సన్నిహితంగా మెలగటం వెనుక కారణాలు కూడా ఇవేనని టాలీవుడ్ సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈ విషయం వాస్తవమా... కాదా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంగతి ఇలా ఉంటే.. అల్లు చిన్న కొడుకు శిరీష్ పెళ్లికి వధువును చూశారు... సరే!! మరి పెద్ద కుమారుడు "వరుడు" సంగతేమిటో...?!!
Source: Yahoo! Telugu: Entertainment | 30 Mar 2010 | 9:35 am

దేశంలో రెండవ కర్మాగారాన్ని ప్రారంభించనున్న బ్రిడ్జ్‌స్టోన్

భారతదేశంలో తమ సంస్థకు చెందిన రెండవ కర్మాగారాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని జపాన్‌కు చెందిన బ్రిడ్జ్‌స్టోన్ కార్ప్ మంగళవారం టోక్యోలో ప్రకటించింది. తమ ప్రణాళికల్లో భాగంగా భారతదేశంలో 50 బిలియన్ యేన్ల(5540.4 మిలియన్ డాలర్లు)ను పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 30 Mar 2010 | 9:16 am

ట్రేడింగ్ క్షీణత: స్వల్ప నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్

సోమవారం రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్న బాంబే స్టాక్ మార్కెట్, మంగళవారం మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 22 పాయింట్లు క్షీణించి, 17,688 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 16 పాయింట్లు పడిపోయి, 5,286 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 30 Mar 2010 | 8:57 am

హైదరాబాద్ పాతబస్తీ అల్లర్లపై ఎన్.సి.ఎం విచారణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పాతబస్తీలో చోటు చేసుకున్న అల్లర్లపై జాతీయ మైనారిటీ కమిషన్ దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇద్దరు సభ్యులతో కూడిన విచారణ బృందాన్ని హైదరాబాద్‌కు పంపనుంది. అలాగే, అల్లర్లకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తోంది.
Source: Yahoo! Telugu: News | 30 Mar 2010 | 8:54 am

హెడ్లీ క్రెడిట్ కార్డు చెల్లింపులపై ఆరా తీయనున్న భారత్!

లష్కర్ తోయిబా తీవ్రవాది డెవిడ్ హెడ్లీ ఉపయోగించిన క్రెడిట్ కార్డులకు సంబంధించిన చెల్లింపులపై ఆరా తీయాలని భారత్ నిర్ణయించింది. ఇందుకోసం అమెరికా బ్యాంకులతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. ముంబై దాడుల సూత్రధారుల్లో ఒకరైన అమెరికా తీవ్రవాది డేవిడ్ హెడ్లీ పలు దేశాలకు చెందిన అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను వినియోగించిన విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 30 Mar 2010 | 8:37 am

మంత్రివర్గ విస్తరణ: పది మంది మంత్రులపై వేటు!?

ముఖ్యమంత్రి కె.రోశయ్య చేపట్టే మంత్రివర్గ విస్తరణలో పదిమంది మంత్రులపై వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడిస్తున్నాయి. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో తన మాట పెడచెవిన పెట్టిన మంత్రులకు తగిన గుణపాఠం నేర్పేందుకు ఇదే సరైన తరుణంగా ఆయన భావిస్తున్నారు. అందుకే పది మంది మంత్రులపై వేటు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
Source: Yahoo! Telugu: News | 30 Mar 2010 | 8:30 am

అలా వ్యాఖ్యానించడం తొందరపాటు చర్యే: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌లోని పాతబస్తీలో చెలరేగిన అల్లర్ల వెనుక కొందరి హస్తమున్నట్టు వచ్చిన వార్తలను ముఖ్యమంత్రి రోశయ్య తోసిపుచ్చారు. కొందరు నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తొదరపాటు చర్యకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 30 Mar 2010 | 8:19 am

ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతుంది: క్యాబినెట్ కార్యదర్శి

దేశంలో చక్కెర, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతుండటంతో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి కే.ఎమ్.చంద్రశేఖర్ మంగళవారం న్యూ ఢిల్లీలో మీడియాకు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 30 Mar 2010 | 8:13 am

"సింహా" తర్వాత తెదేపా కుర్చీలో బాలయ్య..?!!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మరో పవర్‌ఫుల్ చిత్రం సింహా. ఈ చిత్రంతో బాలయ్య సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడని టాలీవుడ్‌లో గుసగుసలు పోతున్నాయి. సింహా చిత్రం తర్వాత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని బాలయ్య అనుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. బాలయ్య బాబుకు తెదేపా పగ్గాలివ్వాలని ఇటీవల లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలను బాలకృష్ణ ఖండించకపోవడం ఈ విషయానికి మరింత ఊతమిస్తోంది. లక్ష్మీ పార్వతితోపాటు నందమూరి హీరోలందరి అభిమతం కూడా బాలకృష్ణకు కుర్చీ అప్పజెప్పాలన్నదేనన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం బాలయ్య బాబు అంశంపై నోరు మెదపడం లేదు. పైగా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద బావ హరికృష్ణను పొగడ్తలతో ఆకాశానికెత్తాశారు. బాబు వ్యూహాలు అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టమే మరి.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Mar 2010 | 7:31 am

లాభాల్లో స్టాక్ మార్కెట్: స్వల్ప వృద్ధిలో సెన్సెక్స్

మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఆశాజకనకంగా కొనసాగుతోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో స్వల్ప లాభలను ఆర్జిస్తోంది. ఫలితంగా సెన్సెక్స్ 37 పాయింట్లు లాభపడి, 17,748 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం రెండు పాయింట్ల స్వల్ప లాభంతో, 5,305 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 30 Mar 2010 | 7:27 am

గుజరాత్ సెజ్‌‌లో పెట్టుబడులు పెట్టనున్న యూకే సంస్థ

గుజరాత్‌లోని దహేజ్ ఎస్ఈజెడ్‌లో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు తమ సంస్థ ముందుకు వచ్చిందని ఐఎన్ఈఓఎస్ అధికారులు మంగళవారం తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 30 Mar 2010 | 7:04 am

ప్రేమా...? అంటే ఏమిటీ..? సింధు మీనన్ ప్రశ్న

"చందమామ"లో అందంగా కన్పించిన సింధూ మీనన్ తాజాగా "సుభద్ర"తో ముందుకు వస్తుంది. ప్రేమ గురించి అడిగితే ముఖాన్ని ప్రశ్నార్థకంగా పెట్టింది. అసలు ప్రేమంటే ఏమిటి...? అని అమాయకంగా ప్రశ్నిస్తోంది. వెండితెర ప్రేమలు తెలుసు కానీ నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదని ఫోజులు కొడుతోంది. అదిసరే... పెళ్లి గురించి నీ అభిప్రాయం చెప్పవూ అని అడిగితే... ఏదైనా ఇద్దరికీ అతకాలి. ఒదిగి పోవాలి. అయితే ప్రేమ పేరుతో పెద్దవారికి చెప్పకుండా పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే ఇన్నాళ్లు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకే కదా మంచి చెడ్డలు తెలిసేది. అందుకే నేను పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటాను అంటోంది. నమ్మేద్దామా...?
Source: Yahoo! Telugu: Entertainment | 30 Mar 2010 | 6:02 am

హైదరాబాద్ పాతబస్తీ అల్లర్లపై ఎన్.సి.ఎం విచారణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పాతబస్తీలో చోటు చేసుకున్న అల్లర్లపై జాతీయ మైనారిటీ కమిషన్ దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇద్దరు సభ్యులతో కూడిన విచారణ బృందాన్ని హైదరాబాద్‌కు పంపనుంది. అలాగే, అల్లర్లకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తోంది.
Source: జాతీయ | 30 Mar 2010 | 3:24 am

అలా వ్యాఖ్యానించడం తొందరపాటు చర్యే: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌లోని పాతబస్తీలో చెలరేగిన అల్లర్ల వెనుక కొందరి హస్తమున్నట్టు వచ్చిన వార్తలను ముఖ్యమంత్రి రోశయ్య తోసిపుచ్చారు. కొందరు నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తొదరపాటు చర్యకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2010 | 2:52 am

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యుల రాష్ట్ర పర్యటన వాయిదా!

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పాతబస్తీలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో పర్యటనను వాయిదా వేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనను కమిటీ అంగీకరించింది. దీంతో ఈనెల 31వ తేదీన హైదరాబాద్‌కు రావాల్సిన కమిటీ సభ్యులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. రాజధానిలో పరిస్థితి చక్కబడితే వీరు రాష్ట్రానికి వస్తారు.
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2010 | 1:28 am

రోశయ్య సర్కారును కూల్చేందుకే ఈ అల్లర్లు: యాష్కీ

సజావుగా సాగిపోతున్న రోశయ్య సర్కారును కూల్చేందుకే ఓ అదృశ్యశక్తి పాతబస్తీలో ఈ కల్లోలం సృష్టించిందని నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు (కాంగ్రెస్) మధుయాష్కీ ఆరోపించారు. పనిలో పనిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు వారు కుట్ర పన్నారని విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2010 | 1:06 am

పాతబస్తీలో అల్లరిమూకలపై కఠిన చర్యలు: డీజీపీ

పాతబస్తీలో అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేనట్టు రాష్ట్ర డీజీపీ గిరీష్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం దక్షిణ మండలంలో మినహా పాతబస్తీలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 30 Mar 2010 | 12:40 am

మహిళా బిల్లు వల్ల బీసీలకు ప్రయోజనం శూన్యం: సల్మా

కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల బీసీ వర్గానికి చెందిన మహిళలకు కలిగే ప్రయోజనం నామమాత్రంగానే ఉంటుందని ఉపరాష్ట్రపతి సతీమణి సల్మా అన్సారీ అభిప్రాయపడ్డారు. ఆగ్రాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొని మీడియాతో మాట్లాడారు.
Source: జాతీయ | 30 Mar 2010 | 12:26 am

బీపీఎల్ కింద ఉండే పేదలకు 25 కేజీల బియ్యం: పీసీ

దారిద్ర్యరేఖకు దిగువున జీవించే పేదలకు నెలకు 25 కేజీల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు కేంద్ర హోంశాఖామంత్రి పి.చిదంబరం (పీసీ) తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన శివగంగై (తమిళనాడు)లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో బీపీఎల్ దిగువున నివశించే పేదలకు 25 కేజీల బియ్యాన్ని కేంద్రం పంపిణీ చేస్తుందన్నారు.
Source: జాతీయ | 29 Mar 2010 | 11:48 pm

నేటితో ముగియనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు!

దాదాపు 45 రోజుల పాటు సాగిన రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. సమావేశాల ఆఖరు రోజైన మంగళవారం ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదముద్ర వేయనుంది. ఇందుకు వీలుగా చివరి రోజున ప్రశ్నోత్తరాల సమయాన్ని స్పీకర్ రద్దు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 29 Mar 2010 | 11:15 pm

కర్ఫ్యూ ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తే కాల్చివేత: ఏకే.ఖాన్

పాతబస్తీలో కర్ఫ్యూ అమలవుతున్న ప్రాంతాల్లో అల్లర్లకు పాల్పడే మూకను కనిపిస్తే కాల్చివేసే ఉత్తర్వులు జారీచేసినట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఏకే.ఖాన్ తెలిపారు. పాతబస్తీలో ప్రశాంతంగా ఉందన్నారు. అయితే, దక్షిణ మండలంలోని 17 పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతోదని ఆయన స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 29 Mar 2010 | 11:06 pm

ఆ పర్యటన సరిహద్దు చర్చలకు కాదు: ఎస్ఎం.కృష్ణ

తాను త్వరలో చేపట్టే చైనా పర్యటన సరిహద్దు సమస్య పరిష్కారం కోసం కాదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య నెలకొనివున్న భౌగోళిక సరిహద్దు అంశాల ప్రస్తావనకే తావు లేదని ఆయన పునరుద్ఘాటించారు.
Source: జాతీయ | 29 Mar 2010 | 10:12 pm

జాతీయ సలహా మండలి ఛైర్‌పర్సన్‌గా సోనియా!

జాతీయ సలహా మండలి ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ మళ్లీ నియమితులయ్యారు. ఒకే వ్యక్తి జోడు పదవుల్లో ఉండరాదనే వాదన తెరపైకి రావడంతో ఆమె ఎన్ఏసీ పదవికి గతంలో రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇదే అంశంపై పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయడంతో ఆమె మళ్లీ ఎన్ఏసీ పదవి చేపట్టే అవకాశం లభించింది.
Source: జాతీయ | 29 Mar 2010 | 10:04 pm

"మారో" అంటోన్న యువ హీరో నితిన్

నితిన్ హీరోగా మీరాచోప్రా హీరోయిన్‌గా నటించిన "మారో" చిత్రానికి మలయాళ దర్శకుడు సిద్ధిక్ దర్శకత్వం వహించారు. నాలుగేళ్లుగా షూటింగ్ చేసి ల్యాబ్‌లో మగ్గిపోయిన ఈ చిత్రాన్ని మామిడాల శ్రీనివాస్ బయటకు తెచ్చారు. గతంలో ఈయన "అపరిచితుడు" నైజాం డిస్ట్రిబ్యూటర్.మీరాచోప్రా, నితిన్ నటించిన ఈ చిత్రం అసలు పేరు "సత్యం శివం సుందరం". ఇప్పుడు పేరు మార్చి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి అష్టకష్టాలు పడి విడుదలకు సాహసం చేస్తున్న నిర్మాతకు గత నిర్మాత ఇవ్వాల్సిన పైకం పూర్తిగా ఇవ్వలేదని నిర్మాతను నితిన్ అడగటం, అందుకు కొంత సమయం ఇవ్వమనడంతో నితిన్ మీడియా ముందుకు రాలేదు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Mar 2010 | 2:25 pm

టాలెంట్ ఉన్నవారికి కాస్త తిక్క ఉంటుంది: నాగ్

టాలెంట్ ఉన్నవారికి కొద్దిగా తిక్క కూడా ఉంటుందనీ, లేకపోతే టాలెంట్ బయటకు రాదని అక్కినేని నాగార్జున అన్నారు. పాప్ ఆల్బమ్ స్మితను ఉద్దేశించి ఆయన ఈ మాటలన్నారు. స్మిత మ్యాడ్ (ఎం.ఎ.డి) అనే డాన్స్ స్కూల్‌ను స్థాపించింది. జూబ్లి హిల్స్‌లోని పెద్దమ్మ గుడి సమీపాన గల పాఠశాలను అక్కినేని నాగార్జున, సంగీత దర్శకుడు కీరవాణి ప్రారంభించారు. మ్యాడ్ అనేది ఏమిటి..? అనేది చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది. ఎం అంటే మ్యూజిక్, ఎ అంటే ఆర్ట్స్, డి అంటే డాన్స్ అంటూ స్మిత వివరించారు. కూచిపూడి, కథక్, ఒడిస్సీ, కర్నాటక, హిందూస్థానీ మొదలైన నృత్యాలన్నీ ఒకే పాఠశాలలో నేర్పుతున్నామన్నారు. ఇందుకు అనుభవజ్ఞులైన గురువులు తర్ఫీదు ఇస్తారనీ, జీవితంలో ఉన్నత స్థితికి చేరాలంటే చేసే వృత్తిని పిచ్చిపిచ్చిగా ప్రేమించేయాలని, అప్పుడే అనుకున్న గోల్ చేరుకుంటామని పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Mar 2010 | 10:02 am

పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తున్నా: అనుష్క

అనుష్క "అరుంధతి" తర్వాత నటిస్తోన్న పంచాక్షరి చిత్రం షూటింగ్ పూర్తయింది. సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై బొమ్మదేవర రామచంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి. సముద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... పంచాక్షరి పేరులోనే పవిత్రత ఉంది. ఇది పవర్ ఫుల్ సినిమా. ఇలాంటి సబ్జెక్ట్ ఇంతవరకూ రాలేదు. అరుంధతి తర్వాత అనుష్క చేస్తున్న చిత్రం ఆమె కెరీర్‌కు మరో మైలు రాయిలా నిలుస్తుంది అని చెప్పారు. నిర్మాత బొమ్మదేవర రామచంద్రరావు మాట్లాడుతూ... షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమంలో భాగంగా డబ్బింగ్ జరుగుతుంది. ఏప్రిల్ మొదటివారంలో ఆడియోను, నెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Mar 2010 | 9:35 am

పాతబస్తీ మత ఘర్షణలు: 17 కంపెనీల కేంద్ర బలగాలు

హైదరాబాద్ పాతబస్తీ మత సంఘర్షణలను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. గతంలో ఇటువంటి సంఘటనలు చిన్నవిగా మొదలై ఆ తర్వాత ఉగ్రరూపం దాల్చిన దాఖలాలున్న నేపధ్యంలో 17 కంపెనీల కేంద్ర బలగాలను పాతబస్తీకి పంపాలని నిర్ణయించింది.
Source: జాతీయ | 29 Mar 2010 | 9:12 am

హైదరాబాద్ దక్షిణ మండలంలో కర్ఫ్యూ: ఏకే ఖాన్

హైదరాబాద్ దక్షిణ మండలంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సోమవారం రాత్రి 7 గంటల నుంచి నిరవధిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు నగర పోలీసు కమీషనర్ ఏకే ఖాన్ మీడియాకు వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 29 Mar 2010 | 8:38 am

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ "వరుడు" ట్రెయిలర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం వరుడు ఆడియో మార్చి 7న రిలీజ్ అయింది. ఈ చిత్రం గురించి నిర్మాత దానయ్య మాట్లాడుతూ... అల్లు అర్జున్ పెర్‌ఫార్మెన్స్ హైలెట్‌గా గుణశేఖర్‌గారి ఎక్స్‌లెంట్ టేకింగ్‌తో వరుడు చిత్రం అద్భుతంగా రూపొందింది. ఈ చిత్రానికి మణిశర్మ సూపర్ పాటలు అందించారు. చిత్రాన్ని ఈ నెలాఖరికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ"న్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన కొత్త హీరోయిన్ నటిస్తుండగా ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య విలన్‌గా నటించడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించి ట్రెయిలర్ మీకోసం..
Source: Yahoo! Telugu: Entertainment | 29 Mar 2010 | 7:54 am

పాతబస్తీలో మళ్లీ ఉద్రిక్తత: కర్ఫ్యూ విధింపు

పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో సోమవారం మళ్లీ ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఆదివారం రాత్రి నుంచి మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించింది. అయితే, ఆందోళనకారులు మధ్యాహ్నం తర్వాత ఒక్కసారి రెచ్చిపోయారు. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకవచ్చేందుకు గాను ఈ సాయంత్రం 7 గంటల నుంచి పాతబస్తీలో కర్ఫ్యూ విధించారు.
Source: ఏపీ న్యూస్ | 29 Mar 2010 | 7:30 am

అమితాబ్... గోద్రా అల్లర్ల అంశంలో మోడీని సమర్థిస్తావా..?

అమితాబ్‌ను అవమానించేవారు తాలిబాన్లతో సమానమని సోమవారం నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. 2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న గోద్రా అల్లర్ల విషాద ఘటనలో మోడీ పాత్రను నువ్వు సమర్థిస్తావా...? ఖండిస్తావా..? అని అమితాబ్ బచ్చన్‌ను సూటిగా ప్రశ్నించాయి.
Source: జాతీయ | 29 Mar 2010 | 6:51 am

"కొమరం పులి" డేటింగ్ ప్రేమ... నచ్చితే ఉండు లేకపోతే ఫో..!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా "ఆంజనేయులు" చిత్ర నిర్మాత గణేష్ ఓ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ హాజరు కావడం ఒక ఎత్తయితే దాసరి నారాయణరావు మొదటి షాట్‌కు దర్శకత్వం వహించారు. మొత్తమ్మీద కార్యక్రమం "అదిరిందయ్యా పులీ" అన్న రేంజ్‌లో జరిగింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌ను కదిలించి మాట్లాడేందుకు మీడియా వారు ఎగబడ్డారు. కానీ "కొమరం పులి" సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదలా ఉంచితే ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనవారు మాత్రం పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, జయంత్ గురించి సెటైరికల్‌గా మాట్లాడుకోవడం కన్పించింది. జయంత్ సినిమా 'లవ్ ఫర్ ఎవర్' ఇంకా పూర్తి కాలేదు.. అదే విధంగా పవన్ కల్యాణ్ నటిస్తున్న 'కొమరం పులి' సైతం ఇంకా సాగుతూనే ఉంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం కూడా ఇదే దశలో ఉంది.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Mar 2010 | 6:00 am

ప్రభాకరన్ మరణ ధృవీకరణ పత్రాన్ని అందుకోని సీబీఐ!

ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ హతమై ఎనిమిది నెలలు కావస్తున్నా ఆయన మరణ ధృవీకరణ పత్రం మాత్రం కేంద్ర నేర పరిశోధక బృందానికి (సీబీఐ) ఇంకా అందలేదు. మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకరన్ మరణించడంతో ఈ కేసును కూడా మూసివేసే పరిస్థితి వచ్చింది. ఇందుకు ప్రభాకరన్ డెత్ సర్టిఫికేట్‌ను శ్రీలంక ప్రభుత్వం నుంచి సీబీఐ అందుకోవాల్సి వుంది. అయితే, ఈ సర్టిఫికేట్‌ను సీబీఐ ఇంకా అందుకోలేదని సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన పిటీషన్‌దారుని ద్వారా వెల్లడైంది.
Source: జాతీయ | 29 Mar 2010 | 5:24 am

ఛాన్సే కానీ ఛాయిస్ లేదు: శ్రద్దా దాస్

సినిమా పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టే వాళ్లకు ఛాన్స్ ఉంటుంది. కానీ ఛాయిస్ ఉండదని శ్రద్దాదాస్ అనుభవ పూర్వకంగా చెపుతోంది. "నేనేమీ సినిమా కుటుంబానికి చెందిన దాన్ని కాదు. మా ఇంట్లో సినిమా వాళ్లెవరూ లేరు. అందుకే నిలదొక్కుకోవడానికి ఏ అవకాశం వచ్చినా కాదనకుండా చేస్తున్నాను. ఈ దశలో ఇష్టం లేకపోయినా కొన్ని పాత్రలు చేయాల్సిందే" అంటూ చెపుతోంది. ఇక ఎక్స్‌పోజింగ్ గురించి చెపుతూ... బాలీవుడ్‌లో ఎలా కనిపించినా స్వీకరిస్తారు. తెలుగులో అలా కాదు. కాస్త పరిధి దాటితే అతి చేసిందంటారు. అందుకే పాత్రలను నిశితంగా గమనించిన మీదటే అంగీకరిస్తున్నాను అని చెప్పుకొచ్చింది శ్రద్ధా.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Mar 2010 | 5:24 am

పాతబస్తీ అల్లర్లను ప్రోత్సహిస్తున్న ఎంఐఎం: కిషన్ రెడ్డి

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పాతబస్తీలో అల్లర్లను మజ్లీస్ పార్టీ ప్రోత్సహిస్తోందని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. గత శనివారం రాత్రి నుంచి పథకం ప్రకారం పాతబస్తీలో ఎంఐఎం పార్టీ అల్లర్లకు పాల్పడిందని ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 29 Mar 2010 | 3:50 am

రాజీవ్ కేసు: నళినిని ముందస్తుగా విడుదల చేయం!

మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న ముద్దాయి నళినిని ముందుస్తుగా విడుదల చేయలేమని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హైకోర్టుకు తేల్చి చెప్పింది. దీంతో ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ కోర్టులో నళిని దాఖలు చేసుకున్న పిటీషన్‌ను హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది.
Source: జాతీయ | 29 Mar 2010 | 3:41 am