|
రెండు మూడు నెలల్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం: మాంటెక్దేశంలో ఆహార ద్రవ్యోల్బణం వచ్చే రెండు మూడు నెలల్లో సాధారణ స్థాయికి చేరుకోవచ్చని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం ఢిల్లీలో మాట్లాడుతూ.. ఆహారేతర వస్తువులకు కూడా ఆహార ద్రవ్యోల్బణం వ్యాపిస్తుందన్న వార్తలను ఆయన తోపిపుచ్చారు.Source: Yahoo! Telugu: News | 28 Mar 2010 | 9:23 am విశాఖ స్టీల్ ప్లాంట్‌కు త్వరలోనే నవరత్న హోదా?విశాఖపట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రతిష్టాత్మకమైన నవరత్న హోదా త్వరలోనే లభించనుంది. కేంద్ర ప్రణాళికా కమిషన్ ఎపెక్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ప్రత్యేక నివేదికలో ఈ మేరకు సిఫార్సు చేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నవరత్న హోదా కల్పించ వచ్చునని అందులో పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 28 Mar 2010 | 9:11 am దళిత మహానేత కోనేరు రంగారావు: వైఎస్ జగన్సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన దళిత మహానేత కోనేరు రంగారావు అని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లాలోని గూడవల్లిలో కోనేరు రంగారావు సంస్మరణ సభ ఆదివారం జరిగింది.Source: Yahoo! Telugu: News | 28 Mar 2010 | 8:07 am మే నెలలో కొత్తగా ఐదు లక్షల రేషన్ కార్డులు: జూపల్లిరాష్ట్రంలో అర్హులైన వారికి వచ్చే మే నెలలో ఐదు లక్షల రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆయన ఆదివారం కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన బోగస్ కార్డుల ఏరివేత కార్యక్రమం ఈనెలాఖరు నాటికి పూర్తవుతుందన్నారు.Source: Yahoo! Telugu: News | 28 Mar 2010 | 8:00 am సిఫార్సులకు చెల్లుచీటి: భక్తులకు మాత్రమే ప్రసాదం!సిఫార్సు లేఖలతో వచ్చే వారికి శ్రీవారి ప్రసాదమైన లడ్డూలను అందజేయకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్న తిరగి వెళ్లే భక్తులకు మాత్రమే లడ్డూలను అందచేయనున్నట్టు ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 28 Mar 2010 | 7:45 am గ్లైడర్ ప్రమాదంలో యూఏఈ కీలక నేత మృతి!మొరాకాలో జరిగిన గ్లైడర్ విమాన ప్రమాదంలో అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ బిన్ సయీద్ సోదరుడు మృత్యువాత పడినట్టు వార్తలు వస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు అధ్యక్షుడు సోదరుడైన షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ నకాయన్ అబుదాబీ పెట్టుబడుల కమిషన్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన ఇటీవల మొరాకో పర్యటనకు వెళ్లారు.Source: Yahoo! Telugu: News | 28 Mar 2010 | 7:31 am ఖాకీలకు వ్యతిరేకంగా 60 శాతం కేసులు: ఎన్సిఆర్బిదేశ వ్యాప్తంగా ప్రతి యేడాది పోలీసులకు వ్యతిరేకంగా 60 శాతం కేసులు నమోదు అవుతున్నట్టు నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో పేర్కొంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు.. దేశ రాజధాని న్యూఢిల్లీలో నమోదైన 48,939 కేసుల్లో యాభై శాతం కేసులు పోలీసులకు వ్యతిరేకంగా నమోదైన కేసులేనని ఎన్.సి.ఆర్.బి స్పష్టం చేసింది.Source: Yahoo! Telugu: News | 28 Mar 2010 | 7:05 am బాగ్దాద్‌లో వరుస పేలుళ్లు: 57 మంది దుర్మరణంఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఆదివారం జరిగిన జంట పేలుళ్లలో 57 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 70 మందికిపైగా గాయపడ్డారు. ఇరాక్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో.. ఈ పేలుళ్లు చోటు చేసుకోవడం గమనార్హం.Source: Yahoo! Telugu: News | 28 Mar 2010 | 6:53 am 1996 ఢిల్లీ పేలుళ్లు: మార్చి 30న తుది తీర్పు!దేశ రాజధాని న్యూఢిల్లీలో 1996లో జరిగిన బాంబు పేలుళ్ళ కేసు తుది తీర్పు ఈనెల 30వ తేదీన వెలువడే అవకాశం ఉంది. 14 సంత్సరాల క్రితం ఢిల్లీలోని పోష్ మార్కెట్‌లో జరిగిన పేలుళ్ళలో 13 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఒక మహిళతో పాటు పది మంది కాశ్మీరీ మిలిటెంట్లు నిందితులుగా ఉన్నారు.Source: Yahoo! Telugu: News | 28 Mar 2010 | 6:38 am ఆప్ఘన్‌పై తాలిబాన్ల పట్టును వ్యతిరేకిస్తాం: పాకిస్థాన్ఆప్ఘనిస్థాన్ను తాలిబాన్ తీవ్రవాదులు హస్తగతం చేసుకోవాడాన్ని పాకిస్థాన్ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోదని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మొహ్మద్ ఖురేషీ స్పష్టం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ గతంలో ఆప్ఘనిస్థాన్ తాలిబాన్ తీవ్రవాదుల ఆధీనంలో ఉండేదన్నారు. ఆ సమయంలో ఆప్ఘనిస్థాన్-పాకిస్థాన్ దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నారు.Source: Yahoo! Telugu: News | 28 Mar 2010 | 6:02 am అక్రమాలులేవని రుజువు చేస్తే రాజకీయ సన్యాసం: నాగంజాతీయ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు చోటు చేసుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం నిరూపిస్తే రాజకీయ సన్యాసం స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. దీనిపై ఆయన శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఎక్కడైనా, ఏ గ్రామంలోనైనా ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలు జరగలేదని కాంగ్రెస్ నిరూపించాలని సవాల్ విసిరారు.Source: ఏపీ న్యూస్ | 28 Mar 2010 | 2:39 am దళిత మహానేత కోనేరు రంగారావు: వైఎస్ జగన్సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన దళిత మహానేత కోనేరు రంగారావు అని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లాలోని గూడవల్లిలో కోనేరు రంగారావు సంస్మరణ సభ ఆదివారం జరిగింది.Source: ఏపీ న్యూస్ | 28 Mar 2010 | 2:37 am మే నెలలో కొత్తగా ఐదు లక్షల రేషన్ కార్డులు: జూపల్లిరాష్ట్రంలో అర్హులైన వారికి వచ్చే మే నెలలో ఐదు లక్షల రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆయన ఆదివారం కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన బోగస్ కార్డుల ఏరివేత కార్యక్రమం ఈనెలాఖరు నాటికి పూర్తవుతుందన్నారు.Source: ఏపీ న్యూస్ | 28 Mar 2010 | 2:30 am సిఫార్సులకు చెల్లుచీటి: భక్తులకు మాత్రమే ప్రసాదం!సిఫార్సు లేఖలతో వచ్చే వారికి శ్రీవారి ప్రసాదమైన లడ్డూలను అందజేయకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్న తిరగి వెళ్లే భక్తులకు మాత్రమే లడ్డూలను అందచేయనున్నట్టు ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 28 Mar 2010 | 2:15 am ఖాకీలకు వ్యతిరేకంగా 60 శాతం కేసులు: ఎన్సిఆర్బిదేశ వ్యాప్తంగా ప్రతి యేడాది పోలీసులకు వ్యతిరేకంగా 60 శాతం కేసులు నమోదు అవుతున్నట్టు నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో పేర్కొంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు.. దేశ రాజధాని న్యూఢిల్లీలో నమోదైన 48,939 కేసుల్లో యాభై శాతం కేసులు పోలీసులకు వ్యతిరేకంగా నమోదైన కేసులేనని ఎన్.సి.ఆర్.బి స్పష్టం చేసింది.Source: జాతీయ | 28 Mar 2010 | 1:36 am 1996 ఢిల్లీ పేలుళ్లు: మార్చి 30న తుది తీర్పు!దేశ రాజధాని న్యూఢిల్లీలో 1996లో జరిగిన బాంబు పేలుళ్ళ కేసు తుది తీర్పు ఈనెల 30వ తేదీన వెలువడే అవకాశం ఉంది. 14 సంత్సరాల క్రితం ఢిల్లీలోని పోష్ మార్కెట్‌లో జరిగిన పేలుళ్ళలో 13 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఒక మహిళతో పాటు పది మంది కాశ్మీరీ మిలిటెంట్లు నిందితులుగా ఉన్నారు.Source: జాతీయ | 28 Mar 2010 | 1:08 am ఒకే వేదికను పంచుకున్న కేజీబాలకృష్ణన్ - మోడీ!అపెక్స్ కోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ.బాలకృష్ణన్‌లు ఒకే వేదికను పంచుకున్నారు. తొమ్మిది గంటల సుదీర్ఘ విచారణ అనంతరం వీరిద్దరు ఒకే వేదికను పంచుకోవడంపై గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.Source: జాతీయ | 28 Mar 2010 | 12:17 am 24 గంటల్లో 9 మంది విదర్భ రైతుల ఆత్మహత్య!మహారాష్ట్రలోని విదర్భ రీజియన్‌లో అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో తొమ్మిది మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఖ్యతో గత వారంలో బలవన్మరణానికి గురైన వారి సంఖ్య 19కు చేరగా, ఈ యేడాదిలో ఇప్పటి వరకు 194 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని విదర్భ జన ఆందోళన్ సమితి వెల్లడించింది. ఈ ప్రాంతంలో గత 1997 నుంచి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఈ ఎన్జీవో సంస్థ వెల్లడించింది.Source: జాతీయ | 27 Mar 2010 | 11:20 pm కోనేరు రంగారావు సంస్మరణ సభలో జగన్మోహనరెడ్డి!దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి కుమారుడు, కడప ఎంపీ వై.ఎస్ జగన్మోహన రెడ్డి ఆదివారం విజయవాడలో చేరుకున్నారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు సంస్మరణ సభలో పాల్గొనేందుకుగాను జగన్ విజయవాడకు చేరుకున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి.Source: ఏపీ న్యూస్ | 27 Mar 2010 | 10:01 pm వధువు దుస్తుల్లో.. ఉహు..హు.. నాకు సిగ్గేస్తోంది బాబూ: నేహాదుస్తులను అత్యంత తక్కువగా వాడుతూ పొదుపు పాటించే అర్థనగ్న సుందరి నేహాధూపియా శుక్రవారం న్యూ ఢిల్లీలో జరిగిన విల్స్ ఇండియా ఫ్యాషన్ షోలో పాల్గొంది. ధూపియా పాల్గొంటే ఏమిటటా..? అని మీరనుకోవచ్చు. కానీ షోలో నేహా ధూపియా అర్థనగ్నానికి బదులు మరో రకంగా కనబడింది. శరీరాన్నంతా నిండుగా కప్పి ఉంచే పెళ్లి కూతురు దుస్తులను ధరించి ఫ్యాషన్ షోలో కనిపించింది. షోను తిలకించేందుకు వచ్చినవారు తొలుత ధూపియాను గుర్తుపట్టలేదు. ఆ తర్వాత నేహాను గుర్తుపట్టిన కొందరు ఆమె వద్దకెళ్లి డ్రెస్ బావుందని కితాబిచ్చారు.ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జయా రాథోర్ రూపొందించిన ఈ దుస్తులను వేసుకున్న నేహా తను నిజంగానే వధువుగా మారిపోయినట్టుగానే తెగ సిగ్గు పడిపోయింది.Source: Yahoo! Telugu: Entertainment | 27 Mar 2010 | 10:18 am అమితాబ్ అక్కడికీ వస్తున్నారా...?: "మహా" సీఎం ప్రశ్నబాంద్రా - వర్లి సీ లింక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమితాబ్ రావడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి కారాలు మిరియాలు నూరుతుండగానే మరో కార్యక్రమం ఆయనకు ఆహ్వానం పలికింది. అయితే ఈ కార్యక్రమానికి కూడా సదరు నిర్వహకులు అమితాబ్ బచ్చన్‌ను ఆహ్వానించడంతో "మహా" సీఎం అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. "నేను రాను పొమ్మ"ని సందేశం పంపారు.Source: జాతీయ | 27 Mar 2010 | 7:44 am అడగాల్సిన ప్రశ్నలన్నీ ఇవాళే అడిగేయండి: మోడీగోద్రా అల్లర్లుకు సంబంధించి శనివారం ఉదయం సిట్ ఎదుట హాజరై వారడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాననీ, తిరిగి రాత్రి 9 గంటలకు వస్తానని సిట్‌కు చెప్పినట్లు మోడీ వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... అడగాల్సి ప్రశ్నలన్నిటినీ శనివారంనాడే అడిగేయాలని చెప్పానన్నారు.Source: జాతీయ | 27 Mar 2010 | 7:43 am పయ్యెద "పట్టు"కోసం బొద్దందాల నమిత మహాపట్టుఎద సంపద తక్కువగా ఉందని ఒక పక్క ఇలియానా వంటి తారలు బాధపడుతుంటే, ఎక్కువైన ఎద భారంతో నమిత బాధపడిపోతోందట. పట్టు సడలిపోతున్న అందాల బిగువుకోసం ఏం చేయాలా...? అనే విషయంపై పట్లు పడుతోంది. తన బాధను సన్నిహితుల వద్ద వెళ్లగక్కితే, వారు సిలికాన్ ట్రీట్‌మెంట్ తీసుకోమని చెప్పారట.భారంగా తోస్తున్న ఎద బరువులను కావలసిన మోతాదుకు తగ్గించి అందంగా తీర్చి దిద్దడంలో సిలికాన్ చికిత్స చాలా ఉపయోగపడుతుందని నమితకు చెప్పారట. దీంతో ఎద సౌష్టవాలు పుష్కలంగా కలిగిన నమిత ప్రస్తుతం ఈ చికిత్సను తీసుకుంటే ఎలా ఉంటుందోనని వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భోగట్టా.ఒకవేళ ఎద సంపదను తగ్గించుకోవాలని నిర్ణయించుకుంటే మాత్రం అభిమానులను నిరుత్సాహ పరచని రీతిలోనే ఆ ట్రీట్‌మెంట్ తీసుకుంటానని చెపుతోందట ఈ బొద్దందాల ముద్దుగుమ్మ. అందాలు ఎక్కువైతే ఒక బాధ... తక్కువైతో మరొక బాధ. ఏమి "ఎద" బాధరా బాబూ...Source: Yahoo! Telugu: Entertainment | 27 Mar 2010 | 7:34 am అధికారి సత్యేంద్ర హత్య కేసులో ముగ్గురికి జీవితఖైదునేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ)కు చెందిన అధికారి సత్యేంద్ర కుమార్ దుబే హత్య కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులకు శనివారం శిక్షను ఖారరు చేసింది. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురిలో ముగ్గురికి జీవితకాల జైలుశిక్ష విధించింది.Source: జాతీయ | 27 Mar 2010 | 5:13 am మహిళపై గ్యాంగ్ రేప్ కేసులో ప్రముఖ పత్రిక రిపోర్టర్!రాష్ట్రంలో సెక్స్ కుంభకోణ వార్తలను ప్రసారం చేస్తూ సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ దినపత్రిక, న్యూస్ ఛానల్‌కు చెందిన రిపోర్టర్ ఒకరు ఓ మహిళపై జరిగిన గ్యాంగ్ రేప్‌లో పాల్గొన్నాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ అతడిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక వికారాబాద్ పోలీసులు ఆ విలేఖరిని అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.Source: ఏపీ న్యూస్ | 27 Mar 2010 | 5:12 am హేపీ బర్త్ డే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజవెండితెరపై "చిరు"త ప్రాయంలోనే మెగా పవర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న "మగధీర" రామ్ చరణ్ తేజ పుట్టిన రోజు నేడు. నట వారసులు వెండితెరపై రంగప్రవేశం చేయడం కొత్తేమీ కాదు. అందరిలాగే రామ్ చరణ్ తేజ కూడా "చిరుత" చిత్రం ద్వారా వెండితెరపై అరంగేట్రం చేశాడు. టాలీవుడ్ చిరుతే కదా అనుకునే లోపు "మగధీర"నని నిరూపించుకున్నాడు. తాజాగా ప్రేక్షకులకు "ఆరెంజ్" జ్యూస్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కేవలం రెండంటే రెండు సినిమాలో వయసుతోనే టాలీవుడ్ రికార్డులను షేక్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. రామ్ చరణ్ తేజ తన రెండో చిత్రం మగధీర ద్వారా ఏకంగా 90 కోట్ల రూపాయల కలెక్షన్లను కురిపించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించాడు. బహుశా... ఈ రికార్డును అధిగమించాలంటే ఇపుడున్న కుర్ర హీరోలు చాలా కష్ట పడాల్సిందే.Source: Yahoo! Telugu: Entertainment | 27 Mar 2010 | 5:09 am అమితాబ్ బచ్చన్ బందిపోటు కాదు: బాల్ థాకరేముంబయిలోని బాంద్రా- వర్లి సీ లింక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అబితాబ్ బచ్చన్ హాజరవడం తప్పేమీ కాదనీ శివసేన చీఫ్ బాల్ థాకరే అన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని అంతగా భూతద్దంలో పెట్టి ఎందుకు చూస్తుందో తనకు అర్థం కావడం లేదని సేన పత్రిక సామ్నాలో పేర్కొన్నారు.Source: జాతీయ | 27 Mar 2010 | 3:50 am ధనుష్ క్షిపణి ప్రయోగం విజయవంతం: రక్షణ శాఖఒరిస్సా తీరంలో శనివారం తెల్లవారుజామున నిర్వహించిన ధనుష్, పృథ్వీ 2 క్షిపణుల ప్రయోగం విజయవంతమైంది. అణు సామర్థ్యం కలిగిన ఈ క్షిపణులను ఒరిస్సా తీరంలోని బాలాసోర్ జిల్లా చాందీపూర్ ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ కేంద్రం నుంచి ప్రయోగించినట్టు ఐటీఆర్ డైరక్టర్ ఎస్పీ.దాష్ తెలిపారు.Source: జాతీయ | 27 Mar 2010 | 2:36 am
|