అమితాబ్ బచ్చన్ బందిపోటు కాదు: బాల్ థాకరే

ముంబయిలోని బాంద్రా- వర్లి సీ లింక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అబితాబ్ బచ్చన్ హాజరవడం తప్పేమీ కాదనీ శివసేన చీఫ్ బాల్ థాకరే అన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని అంతగా భూతద్దంలో పెట్టి ఎందుకు చూస్తుందో తనకు అర్థం కావడం లేదని సేన పత్రిక సామ్నాలో పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 27 Mar 2010 | 9:19 am

జీతాలను ఆలస్యంగా చెల్లించనున్న ఎయిర్ ఇండియా

విమానయాన రంగంలో అగ్రగామిగానున్న ఎయిర్ ఇండియా సంస్థ రోజురోజుకు నష్టాల్లో కూరుకుపోతోంది. దీంతో మార్చి నెల జీతాలను ఏప్రిల్ నెల 7న చెల్లించేందుకు సిద్ధమైందని ఆ సంస్థ అధికార వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 27 Mar 2010 | 8:22 am

ఆరోగ్యంగా అల్‌ఖైదా చీఫ్: హుజీ తీవ్రవాది వెల్లడి

అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ఆరోగ్యవంతంగా ఉన్నారని హుజీ తీవ్రవాద సంస్థకు చెందిన సభ్యుడు, పాకిస్థాన్‌ పుట్టిన టాక్సీడ్రైవర్ లాజా లహాసిబ్ ఖాన్ వెల్లడించారు. అలాగే, దాడులు చేయాల్సిన లక్ష్యాలపై లాడెన్ ఆదేశాలు ఇస్తున్నట్టు చెప్పాడు.
Source: Yahoo! Telugu: News | 27 Mar 2010 | 8:00 am

సిట్ ఎదుట హాజరైన తొలి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ!

గోద్రా అల్లర్లకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శనివారం హాజరయ్యారు. ఇలాంటి దర్యాప్తు బృందం ఎదుట ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకావడం దేశంలో ఇదేతొలిసారి. కాగా, ఈ కేసు విచారణకు తనతో పాటు.. తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని ఈ సందర్భంగా సిట్‌కు మోడీ వెల్లడించారు. ఈ విషయాన్ని గుజరాత్ రాష్ట్ర అధికార ప్రతినిధి జయనారాయణ్ వ్యాస్ వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 27 Mar 2010 | 7:48 am

పయ్యెద "పట్టు"కోసం బొద్దందాల నమిత మహాపట్టు

ఎద సంపద తక్కువగా ఉందని ఒక పక్క ఇలియానా వంటి తారలు బాధపడుతుంటే, ఎక్కువైన ఎద భారంతో నమిత బాధపడిపోతోందట. పట్టు సడలిపోతున్న అందాల బిగువుకోసం ఏం చేయాలా...? అనే విషయంపై పట్లు పడుతోంది. తన బాధను సన్నిహితుల వద్ద వెళ్లగక్కితే, వారు సిలికాన్ ట్రీట్‌మెంట్ తీసుకోమని చెప్పారట.భారంగా తోస్తున్న ఎద బరువులను కావలసిన మోతాదుకు తగ్గించి అందంగా తీర్చి దిద్దడంలో సిలికాన్ చికిత్స చాలా ఉపయోగపడుతుందని నమితకు చెప్పారట. దీంతో ఎద సౌష్టవాలు పుష్కలంగా కలిగిన నమిత ప్రస్తుతం ఈ చికిత్సను తీసుకుంటే ఎలా ఉంటుందోనని వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భోగట్టా.ఒకవేళ ఎద సంపదను తగ్గించుకోవాలని నిర్ణయించుకుంటే మాత్రం అభిమానులను నిరుత్సాహ పరచని రీతిలోనే ఆ ట్రీట్‌మెంట్ తీసుకుంటానని చెపుతోందట ఈ బొద్దందాల ముద్దుగుమ్మ. అందాలు ఎక్కువైతే ఒక బాధ... తక్కువైతో మరొక బాధ. ఏమి "ఎద" బాధరా బాబూ...
Source: Yahoo! Telugu: Entertainment | 27 Mar 2010 | 7:34 am

మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది: రోశయ్య

రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య శనివారం అసెంబ్లీలో తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 27 Mar 2010 | 7:34 am

ఏపీపీఎస్సీ ఛైర్మన్ వ్యవహారశైలిపై దద్ధరిల్లిన అసెంబ్లీ!

తన వర్గం వారిని అందలమెక్కించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఛైర్మన్ వై.వెంకట్రామిరెడ్డి కృషి చేస్తున్నారంటూ కొన్ని మీడియాలో వచ్చిన వార్తలపై ఇటు రాష్ట్ర శాసనసభతో పాటు అటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలు అట్టుడికి పోయాయి. ఏపీపీపీఎస్ ఛైర్మన్ గిరి నుంచి తక్షణం ఆయనను తొలగించాలని ప్రధాన ప్రతిపక్షం సభలో పట్టుబట్టింది. అలాగే, ఉస్మానియా క్యాంపస్‌లో వెంకట్రామిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Source: Yahoo! Telugu: News | 27 Mar 2010 | 7:29 am

బాబు - రోశయ్యల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: కిషన్ రెడ్డి

ముఖ్యమంత్రి కె.రోశయ్య, ప్రధాన ప్రతిపక్షం నేత నారా చంద్రబాబు నాయుడుల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్.కిషన్ రెడ్డి ఆరోపించారు. శాసనసభలో ప్రజా సమస్యలు చర్చించలేక పోయినందుకు తలదించుకుంటూ.. ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెపుతున్నట్టు ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 27 Mar 2010 | 7:16 am

విశ్వవిద్యాలయాల అనుసంధానానికి ఆన్‌లైన్‌: రాజా

దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఆన్‌లైన్‌తో అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర కమ్యునికేషన్ల వ్యవహారాల శాఖామంత్రి ఏ రాజా శుక్రవారం రాత్రి చెన్నైలో తెలిపారు
Source: Yahoo! Telugu: News | 27 Mar 2010 | 7:15 am

నలుగురు సభ్యులతో సీమాంధ్ర తెదేపా కమిటీ

రాష్ట్రంలోని పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో ఒకటి తెలంగాణ ప్రాంతానికి, మరొకటి సీమాంధ్ర ప్రాంతానికి ఏర్పాటు చేసింది. సీమాంధ్ర ప్రాంత కమిటీని నలుగురు సభ్యులతో ఏర్పాటు చేసింది.
Source: Yahoo! Telugu: News | 27 Mar 2010 | 6:56 am

వృద్ధి సాధించిన మౌలిక సదుపాయాలు: ప్రభుత్వ నివేదిక

దేశంలో మౌలిక సదుపాయాల కల్పన నిరుడు ఇదే నెలతో పోలిస్తే ఫిబ్రవరి నెలలో 4.5 శాతం మేరకు వృద్ధి సాధించింది. జనవరి నాటికి వార్షిక వృద్ధి 9.5 శాతానికి చేరుకుందని ప్రభుత్వం ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 27 Mar 2010 | 6:48 am

హేపీ బర్త్ డే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ

వెండితెరపై "చిరు"త ప్రాయంలోనే మెగా పవర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న "మగధీర" రామ్ చరణ్ తేజ పుట్టిన రోజు నేడు. నట వారసులు వెండితెరపై రంగప్రవేశం చేయడం కొత్తేమీ కాదు. అందరిలాగే రామ్ చరణ్ తేజ కూడా "చిరుత" చిత్రం ద్వారా వెండితెరపై అరంగేట్రం చేశాడు. టాలీవుడ్ చిరుతే కదా అనుకునే లోపు "మగధీర"నని నిరూపించుకున్నాడు. తాజాగా ప్రేక్షకులకు "ఆరెంజ్" జ్యూస్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కేవలం రెండంటే రెండు సినిమాలో వయసుతోనే టాలీవుడ్ రికార్డులను షేక్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. రామ్ చరణ్ తేజ తన రెండో చిత్రం మగధీర ద్వారా ఏకంగా 90 కోట్ల రూపాయల కలెక్షన్లను కురిపించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించాడు. బహుశా... ఈ రికార్డును అధిగమించాలంటే ఇపుడున్న కుర్ర హీరోలు చాలా కష్ట పడాల్సిందే.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Mar 2010 | 5:09 am

అమితాబ్ బచ్చన్ బందిపోటు కాదు: బాల్ థాకరే

ముంబయిలోని బాంద్రా- వర్లి సీ లింక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అబితాబ్ బచ్చన్ హాజరవడం తప్పేమీ కాదనీ శివసేన చీఫ్ బాల్ థాకరే అన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని అంతగా భూతద్దంలో పెట్టి ఎందుకు చూస్తుందో తనకు అర్థం కావడం లేదని సేన పత్రిక సామ్నాలో పేర్కొన్నారు.
Source: జాతీయ | 27 Mar 2010 | 3:50 am

ధనుష్ క్షిపణి ప్రయోగం విజయవంతం: రక్షణ శాఖ

ఒరిస్సా తీరంలో శనివారం తెల్లవారుజామున నిర్వహించిన ధనుష్, పృథ్వీ 2 క్షిపణుల ప్రయోగం విజయవంతమైంది. అణు సామర్థ్యం కలిగిన ఈ క్షిపణులను ఒరిస్సా తీరంలోని బాలాసోర్ జిల్లా చాందీపూర్ ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ కేంద్రం నుంచి ప్రయోగించినట్టు ఐటీఆర్ డైరక్టర్ ఎస్పీ.దాష్ తెలిపారు.
Source: జాతీయ | 27 Mar 2010 | 2:36 am

సిట్ ఎదుట హాజరైన తొలి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ!

గోద్రా అల్లర్లకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శనివారం హాజరయ్యారు. ఇలాంటి దర్యాప్తు బృందం ఎదుట ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకావడం దేశంలో ఇదేతొలిసారి. కాగా, ఈ కేసు విచారణకు తనతో పాటు.. తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని ఈ సందర్భంగా సిట్‌కు మోడీ వెల్లడించారు. ఈ విషయాన్ని గుజరాత్ రాష్ట్ర అధికార ప్రతినిధి జయనారాయణ్ వ్యాస్ వెల్లడించారు.
Source: జాతీయ | 27 Mar 2010 | 2:18 am

మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది: రోశయ్య

రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య శనివారం అసెంబ్లీలో తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 27 Mar 2010 | 2:06 am

ఏపీపీఎస్సీ ఛైర్మన్ వ్యవహారశైలిపై దద్ధరిల్లిన అసెంబ్లీ!

తన వర్గం వారిని అందలమెక్కించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఛైర్మన్ వై.వెంకట్రామిరెడ్డి కృషి చేస్తున్నారంటూ కొన్ని మీడియాలో వచ్చిన వార్తలపై ఇటు రాష్ట్ర శాసనసభతో పాటు అటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలు అట్టుడికి పోయాయి. ఏపీపీపీఎస్ ఛైర్మన్ గిరి నుంచి తక్షణం ఆయనను తొలగించాలని ప్రధాన ప్రతిపక్షం సభలో పట్టుబట్టింది. అలాగే, ఉస్మానియా క్యాంపస్‌లో వెంకట్రామిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 27 Mar 2010 | 2:00 am

బాబు - రోశయ్యల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: కిషన్ రెడ్డి

ముఖ్యమంత్రి కె.రోశయ్య, ప్రధాన ప్రతిపక్షం నేత నారా చంద్రబాబు నాయుడుల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్.కిషన్ రెడ్డి ఆరోపించారు. శాసనసభలో ప్రజా సమస్యలు చర్చించలేక పోయినందుకు తలదించుకుంటూ.. ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెపుతున్నట్టు ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 27 Mar 2010 | 1:47 am

నలుగురు సభ్యులతో సీమాంధ్ర తెదేపా కమిటీ

రాష్ట్రంలోని పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో ఒకటి తెలంగాణ ప్రాంతానికి, మరొకటి సీమాంధ్ర ప్రాంతానికి ఏర్పాటు చేసింది. సీమాంధ్ర ప్రాంత కమిటీని నలుగురు సభ్యులతో ఏర్పాటు చేసింది.
Source: ఏపీ న్యూస్ | 27 Mar 2010 | 1:27 am

అసెంబ్లీ ఇన్నర్ హాల్‌లో కాంగ్రెస్ సభ్యుల ఘర్షణ!

అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలు చిచ్చు రేపాయి. తొలి సారి ఎన్నికైన సభ్యులకు మంత్రి పదవులు కట్టబెట్టాలని ఇప్పటికే 74 మంది యువ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అంతేకాకుండా సంతకాల సేకరణ కూడా చేపట్టారు.
Source: ఏపీ న్యూస్ | 27 Mar 2010 | 1:19 am

దేశంలో అత్యంత సంపన్న రాజకీయ పార్టీ కాంగ్రెస్!

అధికారంలో తమ చేతుల్లో ఉంటే.. ఎలా కోట్లకు పడగలెత్తవచ్చో అధికార కాంగ్రెస్ పార్టీ నిరూపించింది. అధికారంలో లేని సమయంలో ఈ పార్టీ అస్తుల విలువ కేవలం 65 కోట్లు మాత్రమే. కానీ, ఇపుడు ఆస్తుల లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి.
Source: జాతీయ | 27 Mar 2010 | 12:39 am

కేసీఆర్ ఆస్తి రూ.600 కోట్లు: తెలంగాణ ప్రజా జేఏసీ

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆస్తుల విలువ 600 కోట్ల రూపాయలుగా ఉన్నాయని తెలంగాణ ప్రజల జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపించింది. ఈ ఆస్తులతో పాటు.. తెలంగాణ ఉద్యమ చిత్తశుద్ధిపై బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా అంటూ కొత్త జేఏసీ నేతలు ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 27 Mar 2010 | 12:05 am

మీ ముఖారవిందం చూసేందుకు వచ్చాంలే: రోశయ్య

ప్రధాన ప్రతిపక్షం పార్టీ సభ్యులు చేస్తున్న వెకిలి చేష్టలు ముఖ్యమంత్రి రోశయ్యకు పరమ చికాకు తెప్పిస్తోంది. వయస్సులో అందరికంటే పెద్దవాడైన రోశయ్యకు ఓర్పు, సహనం ఎంతో ఎక్కువ. అయితే, ప్రతిపక్ష సభ్యులు చేస్తున్న వింత చేష్టలతో ఆయన విసిగి వేసారి పోతున్నారు. ఒకవైపు సొంత పార్టీ నేతలు వివిధ రకాలుగా చేస్తున్న కామెంట్లతో పాటు.. అసెంబ్లీ సభా సమావేశ మందిరంలో తెదేపా సభ్యుల కామెంట్లు ఆయనకు బీపీ తెప్పిస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 27 Mar 2010 | 12:04 am

కోనేరు సంతాప సభలో పాల్గొననున్న వైఎస్.జగన్!

మాజీ మంత్రి, దళితనేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోనేరు రంగారావు సంతాప సభ ఆదివారం జరుగనుంది. కృష్ణా జిల్లాలోని గూడవల్లి గ్రామంలో ఈ సభ జరుగుతుంది. ఇందులో కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాల్గొనున్నారు. ఇందుకోసం ఆయన శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడకు నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో చేరుకుంటారు.
Source: ఏపీ న్యూస్ | 26 Mar 2010 | 11:16 pm

నేడు సిట్ ఎదుట హాజరుకానున్న నరేంద్ర మోడీ!

గుజరాత్ అల్లర్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ సంస్థ (సిట్) ఎదుట ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి శనివారం విచ్చేయనున్నారు. ఆ సమయంలో గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి సిట్ డైరక్టర్ ఆర్కే.రాఘవన్ నేతృత్వంలోని సభ్యులు మోడీ వద్దు విచారణ జరుపుతారు.
Source: జాతీయ | 26 Mar 2010 | 10:13 pm

పంజాబ్‌లో ఆరుగురు బాబర్ ఖల్సా తీవ్రవాదుల అరెస్టు!

పంజాబ్‌లో బాబర్ ఖల్సా సంస్థకు చెందిన ఆరుగురు తీవ్రవాదులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. పాటియాలా జిల్లాలోని రాజ్‌పురా అనే ప్రాంతంలో ఈ తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్టు వారు వెల్లడించారు. వీరిలో ఒకరు హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని నలగర్ పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
Source: జాతీయ | 26 Mar 2010 | 10:01 pm

ప్రకాష్ రాజ్ ఇంత తెలివి తక్కువ వాడా...?!!: బెల్లంకొండ

ప్రకాష్ రాజ్‌పై నిర్మాత బెల్లంకొండ విరుచుకపడ్డారు. ఇటీవల ప్రకాష్ రాజ్ తనకు జాతీయ స్థాయి అవార్డును ఢిల్లీలో అందుకున్న సందర్భంలో ఓ జ్యూరీ సభ్యుడు "జాతీయ స్థాయిలో తెలుగు సినిమా" ఒక్కటి కూడా రాకపోవడం శోచనీయమని తనతో చెప్పారని ప్రకాష్ రాజ్ మీడియాతో అన్నారు.ఇదే విషయాన్ని మళ్లీ ప్రకాష్ రాజ్ గుర్తు చేస్తూ తెలుగులో మంచి చిత్రాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై బెల్లంకొండ సురేష్ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. తెలుగులో "1940లో ఒక గ్రామం" చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా ఎంపిక చేశారు. అదే స్టేజిపై ప్రకాష్ రాజ్ తర్వాతే ఆ చిత్ర దర్శకుడు నరసింహా "నంది" అవార్డును అందుకున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2010 | 3:14 pm

ఈ "మరోచరిత్ర" అలనాటి "మరోచరిత్ర" కాదు

ఈ మరోచరిత్ర సినిమా గురించి చెప్పుకోవాలంటే... గతంలో కె. బాలచందర్ తీసిన "మరోచరిత్ర" ప్రస్తావనను తీసుకరావాల్సిందే. కమల్ హాసన్, సరిత కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రాన్ని యథాతధంగా ఇప్పటి జనరేషన్‌కు అన్వయించి దిల్ రాజు తన స్నేహితులతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ముందుగానే... ఎందుకైనా మంచిదనీ... అలనాటి "మరోరిత్ర"తో పోల్చుకోకండి. జస్ట్ ఫీల్‌ను మాత్రమే చేయండి అని స్లైడ్ వేశారు.కథగా చెప్పాలంటే... అమెరికాలో నివశించే కృష్ణమాచారి (ప్రతాప్ పోతన్)కు బాలు (వరుణ్ సందేశ్) ఒక్కగానొక్క కొడుకు. బాలు తను చదువుతున్న కోర్సును మధ్యలోనే ఆపేసి ఇంటికి వస్తాడు. పక్క ఇంట్లో ఉండే అమెరికా దుర్గ(ఊర్వశి) కుమార్తె స్వప్న(అనిత)ను మొదటి చూపులోనే ప్రేమించేస్తాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2010 | 12:17 pm

రవితేజ- రిచా గంగోపాధ్యయల "మిరపకాయ్"

రవితేజ, రిచా గంగోపాధ్యాయ (లీడర్ ఫేమ్), దీక్ష కాంబినేషన్లో "మిరపకాయ్" చిత్రం ప్రారంభమైంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు. శుక్రవారంనాడు రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి విక్టరీ వెంకటేష్ క్లాప్ కొట్టగా, ప్రభాస్ స్విచాన్ చేశారు. వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు
Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2010 | 10:30 am

"గాదె" మాటను పట్టించుకోని "ఆది": ఏప్రిల్ 14 ముహూర్తం

తిరుమల తిరుపతి శ్రీవారి ఆనంద నిలయాన్ని స్వర్ణమయం చేసి తీరుతానని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ ఆది కేశవుల నాయుడు పునరుద్ఘాటించారు. స్వయంగా రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి గాదె వెంకటరెడ్డి స్వర్ణ తాపడాల వ్యవహారం కోర్టులో ఉంది కనుక పనులు ప్రస్తుతానికి జరగవని చెప్పినా "ఆది" మాత్రం ఏప్రిల్ 14న స్వర్ణమయానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 26 Mar 2010 | 9:06 am

బాబ్రీ కూల్చివేత కేసు: అద్వానీకి వ్యతిరేకంగా సాక్ష్యం

గతంలో బాబ్రీ మసీదును విధ్వంసం సృష్టించడంలో భారతీయ జనతాపార్టీ అగ్రనేత అద్వానీయే ప్రధాన కారణమని శుక్రవారం ఓ మహిళ రాయబరేలీ కోర్టులో సాక్ష్యం చెప్పనుంది.
Source: జాతీయ | 26 Mar 2010 | 8:24 am

కృష్ణుడి "అమాయకుడు" ఆడియో విడుదల

కృష్ణుడు, అనన్య, పూనమ్ సింగార్, గీతాసింగ్ కాంబినేషన్‌‍లో రూపొందుతోన్న "అమాయకుడు" చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ముఖ్య అతిథి హీరో శ్రీహరి ఆడియో సీడీని విడుదల చేసి దర్శకుల సంఘం అధ్యక్షుడు సాగర్‌కు అందజేశారు.ఆడియో విడుదల సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్న చిత్రాల విజయంతో పరిశ్రమ కళకళలాడుతుందన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2010 | 7:07 am

ఎద సంపదకోసం ఇలియానా ఆరాటం

టాలీవుడ్ హాట్ అండ్ బ్యూటీఫుల్ బేబీ ఇలియానా "దేవదాసు", "పోకిరి" చిత్రాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత కూడా తనదైన స్టైల్‌లో సినిమాల్లో బక్క నడుము, నాభీ అందాలను ప్రదర్శిస్తూ రాణించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఇటీవల టాలీవుడ్‌లోకి నూతన తారల రాకతో అమ్మడి అవకాశాలకు కాస్త బ్రేక్ పడింది. మరోవైపు కొత్త తారలకున్నంత ఎద సంపద ఇలియానాకు కొరవడినట్లు కొందరు బహిరంగంగానే చెపుతున్నట్లు సమాచారం. అంతే... ఆ మాట తెలిసిన దగ్గర్నుంచీ ఇలియానా నిద్రపోవడం లేదట. ఎలాగైనా తన వ్యక్తిగత ప్రదేశాలను మరింత పెంచుకోవాలని తహతహలాడుతోందట. అందుకు మార్గం ఏమిటని తన సన్నిహితులను అడిగితే, సిలికాన్ ట్రీట్‌మెంటే అని చెప్పారట.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2010 | 6:39 am

ఈ ప్రభుత్వం పేదల రక్తాన్ని పీల్చుతోంది: చంద్రబాబు

ప్రస్తుతం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వానికి సరైన నాయకత్వం లేకపోవడంతో ఆ పార్టీలోని నాయకులు పేదల సొమ్మును కొల్లుగొట్టుక తింటున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలకు అండగా నిలబడతామని సన్నాయి నొక్కులు నొక్కిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల కష్టాల్ని గాలికొదిలేసిందని దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 26 Mar 2010 | 5:57 am

రిజర్వేషన్ అమలుకాకపోతే..మళ్లీ పోరాటం చేస్తాం..!: గుజ్జర్లు

రాజస్థాన్‌లో నివసించే గుజర్లు తమను గిరిజన తెగలుగా గుర్తించకపోతే మళ్లీ పోరాటాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. గతంలో తమను గిరిజన తెగలుగా గుర్తించాలంటూ, రిజర్వేషన్ కోసం డిమాండ్ చేస్తూ పెద్ద పోరాటం చేసిన గుజ్జర్లు మళ్లీ నిరసనలు వ్యక్తం చేస్తామంటున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం గతంలో ఆమోదించిన రిజర్వేషన్ బిల్లు ఇంకా అమలు కాలేదని, ఆ బిల్లు అమలు కానీ పక్షంలో గుజ్జర్ల పోరాటం తిరిగి కొనసాగుతుందని వారు శుక్రవారం హెచ్చరించారు.
Source: జాతీయ | 26 Mar 2010 | 5:33 am

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు!

జాతీయ ఉత్తమనటుడిగా పేరుగాంచిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటోన్న ప్రకాష్‌ రాజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా చెప్పనక్కరలేదు. కన్నడం, తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న ప్రకాష్ రాజ్, 2009 సంవత్సరానికిగాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డును (కాంచీవరం చిత్రానికి) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమైన ప్రకాష్ రాజ్‌కు నేడు (26-03-2010) పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రకాష్ పర్సనల్ టచ్ మీ కోసం..అసలు పేరు: ప్రకాష్ రాజ్ జన్మస్థలం: కర్ణాటక.పుట్టినతేదీ: 26-03-1965.జాతీయ అవార్డులు: మూడుతెలిసిన భాషలు: కన్నడం, తుళు, ఆంగ్లం, తమిళం, మలయాళం, తెలుగు.నటించిన సినిమాలు: వందకుపైగా.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2010 | 5:11 am

రవితేజ- రిచా గంగోపాధ్యయల "మిరపకాయ్"

రవితేజ, రిచా గంగోపాధ్యాయ (లీడర్ ఫేమ్), దీక్ష కాంబినేషన్లో "మిరపకాయ్" చిత్రం ప్రారంభమైంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు. శుక్రవారంనాడు రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి విక్టరీ వెంకటేష్ క్లాప్ కొట్టగా, ప్రభాస్ స్విచాన్ చేశారు. వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు
Source: వినోదం | 26 Mar 2010 | 5:01 am

కృష్ణుడి "అమాయకుడు" ఆడియో విడుదల

కృష్ణుడు, అనన్య, పూనమ్ సింగార్, గీతాసింగ్ కాంబినేషన్‌‍లో రూపొందుతోన్న "అమాయకుడు" చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ముఖ్య అతిథి హీరో శ్రీహరి ఆడియో సీడీని విడుదల చేసి దర్శకుల సంఘం అధ్యక్షుడు సాగర్‌కు అందజేశారు.ఆడియో విడుదల సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్న చిత్రాల విజయంతో పరిశ్రమ కళకళలాడుతుందన్నారు.
Source: వినోదం | 26 Mar 2010 | 4:29 am

హుస్సేన్‌పై కేసులు ఎత్తివేతకు పిటిషన్: సుప్రీం తిరస్కారం

ప్రముఖ చిత్రకారుడు ఎమ్ఎఫ్ హుస్సేన్‌ను గల్ఫ్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చేందుకు మార్గం సుగమం చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆయనపై నమోదు చేసిన కేసులన్నిటినీ ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి సూచించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది.
Source: జాతీయ | 26 Mar 2010 | 4:25 am

బాబ్రీ కూల్చివేతకు అద్వానీ దోహదపడ్డారు: అంజూ గుప్తా

1992 బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వాని పాత్ర ఉన్నదని సీనియర్ ఐపీఎస్ అధికారిణి అంజూ గుప్తా సాక్ష్యం చెప్పారు. శుక్రవారం రాయ్‌బరేలిలోని సీబీఐ కోర్టులో జరిగిన విచారణలో ఆమె సాక్ష్యం చెపుతూ... డిసెంబరు 6, 1992న అద్వానీతోపాటు సంఘ్ పరివార్‌కు చెందిన పలువురు నాయకులు కరసేవకుల ఎదుట ఉద్రేకపూరితమైన ప్రసంగాలు చేసి వారిని రెచ్చగొట్టారని వెల్లడించారు.
Source: జాతీయ | 26 Mar 2010 | 2:41 am