|
హుస్సేన్‌పై కేసులు ఎత్తివేతకు పిటిషన్: తిరస్కరించిన సుప్రీంప్రముఖ చిత్రకారుడు ఎమ్ఎఫ్ హుస్సేన్‌ను గల్ఫ్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చేందుకు మార్గం సుగమం చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆయనపై నమోదు చేసిన కేసులన్నిటినీ ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి సూచించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది.Source: Yahoo! Telugu: News | 26 Mar 2010 | 9:13 am ప్రాణహిత-చేవెళ్ళను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి: చిరంజీవిరాష్ట్రంలోనున్న ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి శుక్రవారం ముఖ్యమంత్రి రోశయ్యకు ఓ లేఖ రాశారు.Source: Yahoo! Telugu: News | 26 Mar 2010 | 8:54 am పురోగమనం దిశగా సెన్సెక్స్, నిఫ్టీల ర్యాలీవారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ పురోగమనం దిశగా ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభాలతో కొనసాగుతోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.45 గంటలకు 108 పాయింట్ల మేర పుంజుకుని, 17,667 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 20 పాయింట్లు బలపడి, 5,280 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 26 Mar 2010 | 8:16 am బాబ్రీ కూల్చివేతకు అద్వానీ దోహదపడ్డారు: అంజూ గుప్తా1992 బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వాని పాత్ర ఉన్నదని సీనియర్ ఐపీఎస్ అధికారిణి అంజూ గుప్తా సాక్ష్యం చెప్పారు. శుక్రవారం రాయ్‌బరేలిలోని సీబీఐ కోర్టులో జరిగిన విచారణలో ఆమె సాక్ష్యం చెపుతూ... డిసెంబరు 6, 1992న అద్వానీతోపాటు సంఘ్ పరివార్‌కు చెందిన పలువురు నాయకులు కరసేవకుల ఎదుట ఉద్రేకపూరితమైన ప్రసంగాలు చేసి వారిని రెచ్చగొట్టారని వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 26 Mar 2010 | 8:06 am శ్రీలంకలో ఐఫా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంఅంతర్జాతీయ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శ్రీలంకలో జరుపనున్నట్లు నిర్వాహకులు కొలంబోలో శుక్రవారం వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 26 Mar 2010 | 8:06 am కోలకతా ఆర్మీ క్యాంపు కార్యాలయంలో అగ్ని ప్రమాదంపశ్చిమబెంగాల్లోని బుర్ద్వాన్ జిల్లా పనాగఢ్ వద్దనున్న ఆర్మీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయాత్పూర్వం అగ్నిప్రమాదం సంభవించింది. ఆర్మీ క్యాంపు కార్యాలయంలోని ఆయుధాగారంలోనున్న 16వ డిపోలో అగ్నిప్రమాదం సంభవించిందని వింగ్ కమాండర్ ఎమ్ ఉపాసనీ మీడియాకు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 26 Mar 2010 | 7:44 am అమేథీలో రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ పర్యటనకాంగ్రెస్ యువరాజు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు తన సొంత పార్లమెంట్ నియోజకవర్గమైన అమేథీలో పర్యటించనున్నారు. దీనికోసం శుక్రవారం ఉదయం రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాహుల్ గాంధీ సమావేశమవుతారు. ఇంకా రాహుల్ పర్యటనలో భాగంగా.. అమేథీ నియోజకవర్గానికి చెందిన జిల్లా కమిటీలతో గ్రామీణాభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారని పార్టీ శ్రేణులు తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 26 Mar 2010 | 7:36 am పన్నెండు శాతం పెరగనున్న భారతీయుల వేతనంఉద్యోగార్థుల పనితీరును దృష్టిలో పెట్టుకుని దేశంలోని పలు కంపెనీలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీతభత్యాలను పెంచనున్నాయి. ఇందులో భాగంగా 9 నుంచి 12 శాతం మేరకు జీతాలను పెంచనున్నట్లు ఇన్సర్ట్ అండ్ యంగ్ సంస్థ జాతీయ అధ్యక్షుడు ఎన్ఎస్ రాజన్ తెలిపారుSource: Yahoo! Telugu: News | 26 Mar 2010 | 7:01 am లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ వృద్ధివారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాల్లో ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం దిశగా కొనసాగుతున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 76 పాయింట్లు పుంజుకుని, 17,635 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 18 పాయింట్లు వృద్ధి చెంది, 5,278 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 26 Mar 2010 | 6:54 am ఐపీఎల్ పబ్లిక్ ఇష్యూకు రాదు: లలిత్ మోడీడబ్బును సమకూర్చుకునేందుకు తమ సంస్థ పబ్లిక్ ఇష్యూకు వచ్చేది లేదని, తమ సంస్థకు చెందిన షేర్లను మార్కెట్లో ప్రవేశపెట్టే ఆలోచనేదీ లేదని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛైర్మెన్ లలిత్ మోడీ న్యూ ఢిల్లీలో మీడియాకు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 26 Mar 2010 | 6:47 am ఎద సంపదకోసం ఇలియానా ఆరాటంటాలీవుడ్ హాట్ అండ్ బ్యూటీఫుల్ బేబీ ఇలియానా "దేవదాసు", "పోకిరి" చిత్రాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత కూడా తనదైన స్టైల్‌లో సినిమాల్లో బక్క నడుము, నాభీ అందాలను ప్రదర్శిస్తూ రాణించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఇటీవల టాలీవుడ్‌లోకి నూతన తారల రాకతో అమ్మడి అవకాశాలకు కాస్త బ్రేక్ పడింది. మరోవైపు కొత్త తారలకున్నంత ఎద సంపద ఇలియానాకు కొరవడినట్లు కొందరు బహిరంగంగానే చెపుతున్నట్లు సమాచారం. అంతే... ఆ మాట తెలిసిన దగ్గర్నుంచీ ఇలియానా నిద్రపోవడం లేదట. ఎలాగైనా తన వ్యక్తిగత ప్రదేశాలను మరింత పెంచుకోవాలని తహతహలాడుతోందట. అందుకు మార్గం ఏమిటని తన సన్నిహితులను అడిగితే, సిలికాన్ ట్రీట్‌మెంటే అని చెప్పారట.Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2010 | 6:39 am విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు!జాతీయ ఉత్తమనటుడిగా పేరుగాంచిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటోన్న ప్రకాష్ రాజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా చెప్పనక్కరలేదు. కన్నడం, తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న ప్రకాష్ రాజ్, 2009 సంవత్సరానికిగాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డును (కాంచీవరం చిత్రానికి) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమైన ప్రకాష్ రాజ్‌కు నేడు (26-03-2010) పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రకాష్ పర్సనల్ టచ్ మీ కోసం..అసలు పేరు: ప్రకాష్ రాజ్ జన్మస్థలం: కర్ణాటక.పుట్టినతేదీ: 26-03-1965.జాతీయ అవార్డులు: మూడుతెలిసిన భాషలు: కన్నడం, తుళు, ఆంగ్లం, తమిళం, మలయాళం, తెలుగు.నటించిన సినిమాలు: వందకుపైగా.Source: Yahoo! Telugu: Entertainment | 26 Mar 2010 | 5:11 am హుస్సేన్‌పై కేసులు ఎత్తివేతకు పిటిషన్: తిరస్కరించిన సుప్రీంప్రముఖ చిత్రకారుడు ఎమ్ఎఫ్ హుస్సేన్‌ను గల్ఫ్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చేందుకు మార్గం సుగమం చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆయనపై నమోదు చేసిన కేసులన్నిటినీ ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి సూచించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది.Source: జాతీయ | 26 Mar 2010 | 3:43 am ప్రాణహిత-చేవెళ్ళను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి: చిరంజీవిరాష్ట్రంలోనున్న ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి శుక్రవారం ముఖ్యమంత్రి రోశయ్యకు ఓ లేఖ రాశారు.Source: ఏపీ న్యూస్ | 26 Mar 2010 | 3:25 am బాబ్రీ కూల్చివేతకు అద్వానీ దోహదపడ్డారు: అంజూ గుప్తా1992 బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వాని పాత్ర ఉన్నదని సీనియర్ ఐపీఎస్ అధికారిణి అంజూ గుప్తా సాక్ష్యం చెప్పారు. శుక్రవారం రాయ్‌బరేలిలోని సీబీఐ కోర్టులో జరిగిన విచారణలో ఆమె సాక్ష్యం చెపుతూ... డిసెంబరు 6, 1992న అద్వానీతోపాటు సంఘ్ పరివార్‌కు చెందిన పలువురు నాయకులు కరసేవకుల ఎదుట ఉద్రేకపూరితమైన ప్రసంగాలు చేసి వారిని రెచ్చగొట్టారని వెల్లడించారు.Source: జాతీయ | 26 Mar 2010 | 2:41 am కోలకతా ఆర్మీ క్యాంపు కార్యాలయంలో అగ్ని ప్రమాదంపశ్చిమబెంగాల్లోని బుర్ద్వాన్ జిల్లా పనాగఢ్ వద్దనున్న ఆర్మీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయాత్పూర్వం అగ్నిప్రమాదం సంభవించింది. ఆర్మీ క్యాంపు కార్యాలయంలోని ఆయుధాగారంలోనున్న 16వ డిపోలో అగ్నిప్రమాదం సంభవించిందని వింగ్ కమాండర్ ఎమ్ ఉపాసనీ మీడియాకు తెలిపారు.Source: జాతీయ | 26 Mar 2010 | 2:15 am అమేథీలో రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ పర్యటనకాంగ్రెస్ యువరాజు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు తన సొంత పార్లమెంట్ నియోజకవర్గమైన అమేథీలో పర్యటించనున్నారు. దీనికోసం శుక్రవారం ఉదయం రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాహుల్ గాంధీ సమావేశమవుతారు. ఇంకా రాహుల్ పర్యటనలో భాగంగా.. అమేథీ నియోజకవర్గానికి చెందిన జిల్లా కమిటీలతో గ్రామీణాభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారని పార్టీ శ్రేణులు తెలిపాయి.Source: జాతీయ | 26 Mar 2010 | 2:06 am రేషన్ కార్డులను తగ్గించేది లేదు: మంత్రి జూపల్లి కృష్ణారావుశాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పౌర సరఫరాల శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు గతంలో ఇచ్చిన రేషన్ కార్డులను తగ్గిస్తారని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. తమ ప్రభుత్వం గతంలో ఇచ్చిన రేషన్ కార్డులను తగ్గించేది లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారుSource: ఏపీ న్యూస్ | 26 Mar 2010 | 12:57 am సీఎం నివాసం వద్ద ఆందోళనకు దిగిన డీఎస్సీ2008 అభ్యర్థులుతమకు వెంటనే ఉద్యోగ నియమాకాలు కల్పించాలని డీఎస్సీ 2008 అభ్యర్థులు శుక్రవారం ఉదయం ముఖ్యంమంత్రి నివాసం వద్ద ఆందోళనకు దిగారు.Source: ఏపీ న్యూస్ | 26 Mar 2010 | 12:57 am బాబ్రీ కూల్చివేత కేసు: అద్వానీకి వ్యతిరేకంగా సాక్ష్యంగతంలో బాబ్రీ మసీదును విధ్వంసం సృష్టించడంలో భారతీయ జనతాపార్టీ అగ్రనేత అద్వానీయే ప్రధాన కారణమని శుక్రవారం ఓ మహిళ రాయబరేలీ కోర్టులో సాక్ష్యం చెప్పనుంది.Source: జాతీయ | 26 Mar 2010 | 12:35 am శాంతి భద్రతల రక్షణ కోసం 35వేల మంది పోలీసులు: మంత్రిరాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం మూడు దఫాలుగా 35వేల మంది పోలీసులను నియమించామని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం తెలియజేశారు. శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై విపక్షాలు అడిగిన ప్రశ్నకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానమిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 26 Mar 2010 | 12:34 am భారతీయ జనశక్తికి గుడ్ బై చెప్పిన ఉమా భారతిభారతీయ జనతాపార్టీలో ఫైర్ బ్రాండ్‌గా చెలామణి అయిన ఉమాభారతి మరోసారి తన సొంతపార్టీ అయిన భారతీయ జనశక్తికి గురువారం రాజీనామా చేశారు.Source: జాతీయ | 26 Mar 2010 | 12:33 am ఒడిస్సాలో రోడ్డు ప్రమాదం: తొమ్మిది మంది మృతిఒడిస్సాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢంకెనాల్ జిల్లా బలోదియాబంద్ వద్ద జరిగిన దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.Source: జాతీయ | 26 Mar 2010 | 12:32 am నీకో పీఠం రాసిస్తా... స్టేట్మెంట్ వెనక్కి తీసుకో: స్వామివీడియో సాక్ష్యాలు బలంగా ఉండటంతో నిత్యానంద పని బోనులో పడ్డ ఎలుకలా మారిపోయింది. దీంతో ఎటూ పాలుపోని నిత్యానంద నేరుగా ఆయన బండారాన్ని బయటపెట్టిన డ్రైవర్‌కు ఫోను చేసి మాట్లాడినట్లు తమిళనాడు వార్తా పత్రికలు వెల్లడించాయి.Source: జాతీయ | 26 Mar 2010 | 12:29 am కాశ్మీర్ ప్రజలకు సాయం చేస్తే అంతేసంగతులు..!: లష్కరేకాశ్మీర్ ప్రజలకు తీవ్రవాదుల దుశ్చర్యల నుంచి విముక్తి లభించేలా లేదు. కాశ్మీర్ ప్రజలకు పోలీసులు ఎలాంటి సాయం చేసినా వారిని హత్య చేస్తామని ప్రముఖ తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరించింది.గత జనవరి నెలలో లష్కరే తోయిబాకు చెందిన ఎనిమిది మంది ఉన్నత నాయకులు హత్యకు గురైన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 26 Mar 2010 | 12:18 am అది పడితే బాడీ అంతా కూల్ అయిపోతుంది: నాగార్జునషూటింగ్ ఉంటే తనకు తలనొప్పి రాదని... అది చాలా ఎంజాయ్‌మెంట్‌గా చేసే పనని అక్కినేని నాగార్జున అంటున్నారు. అప్పుడప్పుడు స్ట్రెస్‌కు గురవుతాననీ, అప్పుడు మాత్రమే తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పారు. మారికో బ్రాండ్ అయిన పారాచూట్ అడ్వాన్స్‌డ్ కూలింగ్ ఆయిల్ ఉత్పత్తిని ఆయన గురువారం మార్కెట్లో ప్రారంభించారు. ఆయనతోపాటు నటి భూమికా చావ్లా కూడా పాల్గొంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, "పారాచూట్ మూత తీయగానే చమక్కుమనే సువాసన వస్తుంది. దాన్ని తల మీద పోసుకోగానే చాలా కూల్‌గా ఉంటుంది.Source: Yahoo! Telugu: Entertainment | 25 Mar 2010 | 11:57 am రాష్ట్రంలో పర్యటించనున్న జస్టిస్ శ్రీకృష్ణ కమిటీరాష్ట్రంలోని పరిస్థితులను అధ్యయనం చేసేందుకుగాను జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి చెందిన సభ్యులు మార్చి నెల 31 నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో పర్యటించనున్నట్లు ప్రాథమిక సమాచారం.Source: ఏపీ న్యూస్ | 25 Mar 2010 | 9:19 am అమితాబ్ రంగ ప్రవేశం: కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య చిచ్చు!మహారాష్ట్రలో అధికార కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల మధ్య "బిగ్ బి" అమితాబ్ బచ్చన్ రూపంలో చిచ్చురేగింది. బాంద్రా-వర్లీ సీలింక్ రెండో దశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా సీలింక్ ప్రారంభోత్సవం జరిగింది. ప్రజాప్రనుల శాఖను నిర్వహిస్తున్న ఎన్సీపీ కాంగ్రెస్‌కు తెలియకుండా అమితాబ్‌ను ఆహ్వానించారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణుల్లోని ఒక వర్గం ఆగ్రహంతో రగిలి పోయారు.Source: జాతీయ | 25 Mar 2010 | 8:25 am పర్యావరణ పరిరక్షణకు "ఎర్త్ అవర్" పాటించండి: అమలపర్యావరణ పరిరక్షణ కొరకు ఎర్త్ అవర్ పాటించాలని బ్లూ క్రాస్ సంస్థ వ్యవస్థాపకురాలు, ప్రముఖ నటీమణి అక్కినేని అమల గురువారం హైదరాబాద్‌లో మీడియాకు తెలిపారు. ఈ నెల 27న రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు అంటే ఓ గంటపాటు ఎర్త్ అవర్ పాటించేందుకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, ఆ సమయంలో స్వచ్ఛందంగా విద్యుత్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని అమల కోరారు.Source: ఏపీ న్యూస్ | 25 Mar 2010 | 8:18 am దిల్‌రాజు "మరోచరిత్ర": 'ప్చ్'.. లాభంలేదన్న సెన్సార్..!?కె. బాలచందర్ సృష్టించిన "మరోచరిత్ర" చిత్రాన్ని ఈనాటి ట్రెండ్‌లో అయితే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తున్న దిల్‌రాజుకు తన సినిమాపై ఎంత నమ్మకముందోగానీ, అంతకు ముందుగానే పలురకాల ప్రచారాలు చేస్తున్న ఒరవడి ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పటికే సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి "ప్చ్.. లాభంలేదని.." తేల్చేశారని విశ్వసనీయ సమాచారం. హీరోయిన్ అనిత ప్రధాన మైనస్‌గావడమేకాకుండా దర్శకత్వంపై కూడా విమర్శలు చేశారు. దీంతో దిల్‌రాజు చిత్రంపై నెగటివ్ ఫీలింగ్ ఏర్పడుతుందనే భావనతో ముందుగానే ఈ సినిమా యూనిట్ మరోచరిత్ర విజయయాత్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిన్నటితో రాష్ట్రంలో అన్ని థియేటర్లలో ఈ యాత్ర ముగిసింది. కానీ ఎక్కడా సరైన మరోచరిత్ర యాత్రకు స్పందన కానరాలేదు. దీంతో కొన్ని చోట్ల చిత్రయూనిట్‌తో తిరగాల్సిన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 25 Mar 2010 | 7:44 am మమ్మల్ని కూడా గట్టెక్కించండి: చిన్న నిర్మాతలుపైరసీపై ప్రభుత్వం స్పందించిన తీరు సంతృప్తికరంగా ఉండటంతో ఇప్పుడు తాజాగా చిన్న నిర్మాతలు తమను కూడా గట్టెక్కించాలని అభ్యర్థిస్తున్నారు. ఇందుకుగాను చిన్ననిర్మాతలు, దర్శకులందరూ గురువారంనాడు హైదరాబాదులోని సారథి స్టూడియోలో సమావేశమై ప్రభుత్వానికి నాలుగు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించాలని నిర్ణయించారు.మొదటిదేమంటే... పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్నట్లు ప్రతి థియేటర్లో ఏడాదికి 24 వారాలు చిన్న సినిమాలకు అద్దె కాకుండా పర్సంటేజ్ ఆధారంగా వసూలు చేయాలి.Source: Yahoo! Telugu: Entertainment | 25 Mar 2010 | 7:40 am అది పడితే బాడీ అంతా కూల్ అయిపోతుంది: నాగార్జునషూటింగ్ ఉంటే తనకు తలనొప్పి రాదని... అది చాలా ఎంజాయ్‌మెంట్‌గా చేసే పనని అక్కినేని నాగార్జున అంటున్నారు. అప్పుడప్పుడు స్ట్రెస్‌కు గురవుతాననీ, అప్పుడు మాత్రమే తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పారు. మారికో బ్రాండ్ అయిన పారాచూట్ అడ్వాన్స్‌డ్ కూలింగ్ ఆయిల్ ఉత్పత్తిని ఆయన గురువారం మార్కెట్లో ప్రారంభించారు. ఆయనతోపాటు నటి భూమికా చావ్లా కూడా పాల్గొంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, "పారాచూట్ మూత తీయగానే చమక్కుమనే సువాసన వస్తుంది. దాన్ని తల మీద పోసుకోగానే చాలా కూల్‌గా ఉంటుంది.Source: వినోదం | 25 Mar 2010 | 6:42 am చిరంజీవి కాంప్లిమెంట్ కంటే ఇంకేం కావాలి: శేఖర్ కమ్ములరామానాయుడు మనవడు రానాతో ఏవీఎం ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన భారీ చిత్రం 'లీడర్'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్‌మీట్ ఫిలింనగర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, "ఈ సినిమా విజయానికి ఏవీఎం వారే కారణం. నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నాకు మన దేశం అంటే ఇష్టం. ఆ ఆలోచనలోంచే పుట్టింది ఈ సినిమా. ఎందుకు మనదేశం అభివృద్ది చెందలేదు అని చర్చించాను. ఈ సినిమా చూశాక మారకపోయినా మారాలనే భావన వస్తేచాలనే ఈ సినిమా తీశాను. ఇంకా.. ప్రముఖులంతా సినిమా చూశారు. సి.ఎం.గారు త్వరలో చూడబోతున్నారు. రామోజీరావుగారు ఈ సినిమా తీయాలంటే ధైర్యంకావాలి అని చెప్పారు. చిరంజీవిగారైతే నీకు రాజకీయాలపై ఇంత అవగాహన ఉందా? అని అన్నారు. ఇంతకంటే ఇంకే కాంప్లిమెంట్ కావాలి. అపరిచితుడు, మల్లన్న చిత్రాల్లా ఇది కూడా ఒక రియాలిటీ సినిమా" అని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 25 Mar 2010 | 6:23 am మంత్రివర్గ విస్తరణలో వైఎస్ సతీమణికి మంత్రిపదవి!ముఖ్యమంత్రి కె.రోశయ్య వచ్చే నెలలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్.విజయలక్ష్మికి మంత్రి బాధ్యతలను అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆమెతో పాటు మరికొంతమంది యువ సభ్యులకు మంత్రి పదవులు దక్కవచ్చని సీఎం పేషీ వర్గాలు పేర్కొంటున్నాయి.Source: ఏపీ న్యూస్ | 25 Mar 2010 | 6:08 am సబితమ్మా నిద్రమత్తును వీడండి: మహిళా సంఘాలురాష్ట్ర హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సబితా ఇంద్రారెడ్డిపై రాష్ట్ర మహిళా సంఘాల (ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్స్) ప్రతినిధులు మూకుమ్మడిగా దండెత్తారు. నిద్రమత్తులో జోగుతున్న హోం మంత్రి ఇప్పటికైనా మేల్కోని, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రతినిధులు ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 25 Mar 2010 | 6:05 am "సమంత"కు చికెన్ పాక్స్: బృందావనం షూటింగ్ రద్దు..!?"ఏ మాయ చేసావె" హిట్‌తో ఆ సినిమా హీరోయిన్ సమంతకు ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా దిల్‌రాజు నిర్మిస్తున్న "బృందావనం"లో సమంత రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే కేరళలో ఈ సినిమా షూటింగ్‌ను కొద్దిరోజుల పాటు జరిపారు. అక్కడ సమంత అనారోగ్యం పాలుకావడంతో ఒక్కరోజు విశ్రాంతి ఇచ్చారు. మరుసటిరోజు చికెన్‌ఫ్యాక్స్ అని తేలడంతో మొత్తం యూనిట్ ప్యాకప్ అయి తిరిగి వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సమంత లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బహూశా వచ్చేనెలలో ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత చిత్ర యూనిట్ కేరళకు వెళ్ళనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. "ఏ మాయ చేసావె" చిత్రం ద్వారా మాస్ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న సమంతకు టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే రామ్‌చరణ్ తేజతో కొత్త చిత్రానికి బుక్ అయిన సమంత, ఎన్టీఆర్ సినిమాలో రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా సమంతను బుక్ చేసుకోవడానికి నిర్మాతలు ఆమె ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 25 Mar 2010 | 5:49 am జగన్ యాత్రకు పార్టీకి సంబంధం లేదు: పీసీసీ చీఫ్కడప పార్లమెంట్ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టే రాష్ట్ర యాత్రకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తమ పార్టీలో నిత్యం ప్రజాస్వామ్యం పరఢవిల్లుతుందని, ప్రతి ఒక్కరూ పార్టీ నియనిబంధనలకు కంకణబద్ధులై ఉంటారని ఆయన గుర్తు చేశారు.Source: ఏపీ న్యూస్ | 25 Mar 2010 | 5:42 am మంత్రి పదవుల కోసం పైరవీలు: జోరుగా లాబీయింగ్!వచ్చే నెలలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకునేందుకు ఔత్సాహిక ఎమ్మెల్యేలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. తమ పనిని గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేసేందుకు భారీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 25 Mar 2010 | 4:46 am
|