అమ్మకాల ఒత్తిడి: నష్టాల్లో స్టాక్ మార్కెట్

గురువారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు పయనించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 36 పాయింట్లు క్షీణించి, 17,414 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం 14 పాయింట్లు పడిపోయి, 5,210 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 25 Mar 2010 | 9:23 am

మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ కె.పి.రఘువంశీ తొలగింపు

మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్ పదవి నుంచి అడిషినల్ డైరక్టర్ జనరల్ కేపీ.రఘువంశీపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. ఇటీవల అరెస్టు చేసిన ఇద్దరు తీవ్రవాదులకు సంబంధించిన పరిశోధనా సమాచారాన్ని మీడియాకు లీక్ చేశారంటూ ఆరోపణలు రావడంతో ఆయనపై చర్య తీసుకుంది. ఆయన స్థానంలో మరో పోలీసు ఉన్నతాధికారి రాకేష్ మారియా నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి.
Source: Yahoo! Telugu: News | 25 Mar 2010 | 8:52 am

విదేశీ మార్కెట్ల ప్రభావం: నష్టాల్లో సెన్సెక్స్

బాంబే స్టాక్ మార్కెట్ గురువారం నష్టాలతో ర్యాలీని కొనసాగిస్తోంది ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాలతో కూరుకుపోయిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 26 పాయింట్లు పతనమై, 17,424 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం 9 పాయింట్ల స్వల్ప నష్టంతో, 5,215 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 25 Mar 2010 | 8:22 am

చిరంజీవీ... విందుకు రండి: బొత్స సత్యనారాయణ

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని విందుకు ఆహ్వానించారు. గురువారం చిరంజీవిని ప్రత్యేకంగా కలిసి ఈ నెల 29న తన స్వగృహంలో ఏర్పాటు చేస్తున్న విందుకు చిరంజీవితోపాటు మిగిలిన శాసనసభ్యులు కూడా రావాలని బొత్స కోరారు.
Source: Yahoo! Telugu: News | 25 Mar 2010 | 8:11 am

దిల్‌రాజు "మరోచరిత్ర": 'ప్చ్'.. లాభంలేదన్న సెన్సార్..!?

కె. బాలచందర్ సృష్టించిన "మరోచరిత్ర" చిత్రాన్ని ఈనాటి ట్రెండ్‌లో అయితే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తున్న దిల్‌రాజుకు తన సినిమాపై ఎంత నమ్మకముందోగానీ, అంతకు ముందుగానే పలురకాల ప్రచారాలు చేస్తున్న ఒరవడి ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పటికే సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి "ప్చ్.. లాభంలేదని.." తేల్చేశారని విశ్వసనీయ సమాచారం. హీరోయిన్ అనిత ప్రధాన మైనస్‌గావడమేకాకుండా దర్శకత్వంపై కూడా విమర్శలు చేశారు. దీంతో దిల్‌రాజు చిత్రంపై నెగటివ్ ఫీలింగ్ ఏర్పడుతుందనే భావనతో ముందుగానే ఈ సినిమా యూనిట్ మరోచరిత్ర విజయయాత్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిన్నటితో రాష్ట్రంలో అన్ని థియేటర్లలో ఈ యాత్ర ముగిసింది. కానీ ఎక్కడా సరైన మరోచరిత్ర యాత్రకు స్పందన కానరాలేదు. దీంతో కొన్ని చోట్ల చిత్రయూనిట్‌తో తిరగాల్సిన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Mar 2010 | 7:44 am

ఆహార ద్రవ్యోల్బణం తగ్గినా ధరలు తగ్గలేదు: వాణిజ్య శాఖ

దేశీయ ఆహార ద్రవ్యోల్బణం మరోమారు స్వల్పంగా తగ్గింది. మార్చి 13తో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గి 16.3 శాతానికి చేరుకుంది. అదే అంతకుమునుపు వారాంతానికి ద్రవ్యోల్బణం రేటు 16.22 శాతంగా ఉండింది. అయినప్పటికీ పండ్లు, కూరగాయలు, కాయ ధాన్యాల ధరలు గత వారంకన్నా ముగిసిన మార్చి 13 నాటికి ధరలు పెరిగినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది
Source: Yahoo! Telugu: News | 25 Mar 2010 | 7:43 am

మమ్మల్ని కూడా గట్టెక్కించండి: చిన్న నిర్మాతలు

పైరసీపై ప్రభుత్వం స్పందించిన తీరు సంతృప్తికరంగా ఉండటంతో ఇప్పుడు తాజాగా చిన్న నిర్మాతలు తమను కూడా గట్టెక్కించాలని అభ్యర్థిస్తున్నారు. ఇందుకుగాను చిన్ననిర్మాతలు, దర్శకులందరూ గురువారంనాడు హైదరాబాదులోని సారథి స్టూడియోలో సమావేశమై ప్రభుత్వానికి నాలుగు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించాలని నిర్ణయించారు.మొదటిదేమంటే... పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్నట్లు ప్రతి థియేటర్లో ఏడాదికి 24 వారాలు చిన్న సినిమాలకు అద్దె కాకుండా పర్సంటేజ్ ఆధారంగా వసూలు చేయాలి.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Mar 2010 | 7:40 am

ప్రరాపా-కాంగ్రెస్ "బంధం" కత్తిరించేందుకే ఏబీఎన్ కథనం!

ఇటీవల ప్రజారాజ్యం పార్టీ గురించి ఏబీఎన్ న్యూస్ ఛానల్ 'బాక్స్ ఖాళీ' అనే కథనాన్ని ప్రసారం చేయడం వెనుక ఉన్న రహస్యం ఏమిటనే విషయంపై రాష్ట్ర రాజకీయ నేతల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల పుణ్యమాని చిరంజీవి కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అందువల్ల భవిష్యత్‌లో జరిగే ప్రధాన ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Source: Yahoo! Telugu: News | 25 Mar 2010 | 6:53 am

పాక్‌ను దారిలో పెట్టండి: అమెరికాకు చిదంబరం వినతి!

దాయాది దేశం పాకిస్థాన్ తమ మాట వినడం లేదని అందువల్ల ఆ దేశంతో సన్నిహిత సంబంధాలు కలిగివుండే అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు పాకిస్థాన్‌ను దారిలో పెట్టేలా కృషి చేయాలని కేంద్ర హోం మంత్రి చిదంబరం అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన అమెరికా, బ్రిటన్‌లకు విజ్ఞప్తి చేశారు.
Source: Yahoo! Telugu: News | 25 Mar 2010 | 6:46 am

స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ

బాంబే స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల్లో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, నిఫ్టీలు గురువారం మధ్యాహ్నం 11.30 గంటల ప్రాంతంలోనూ తిరోగమనం దిశగా ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ఫలితంగా నష్టాలతో సెన్సెక్స్ 17వేల మార్కును తాకగా, నిఫ్టీ ఐదువేల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 25 Mar 2010 | 6:40 am

శునకాల పెంపకంపై ఆసక్తి చూపుతున్న చైనా ప్రజలు!

శనకాల పెంపకంపై చైనా ప్రజలు అమితాసక్తి చూపుతున్నారు. చైనా వాతావరణ పరిస్థితుల్లో కుక్కల పెంపకం ఎంతో క్లిష్టతరమైనప్పటికీ ప్రజలు మాత్రం వీటి పెంపకం పట్ల అధిక శ్రద్ధ చూపుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 25 Mar 2010 | 6:38 am

ఆటోను ఢీకొన్న మంత్రి కాన్వాయ్: నలుగురి మృతి!

తూర్పు గోదావరి జిల్లాలో కేంద్రం రక్షణ శాఖ సహాయ మంత్రి పళ్లం రాజు వాహనశ్రేణి (కాన్వాయ్) ప్రయాణికుల ఆటోను ఢీకొంది. తొండగి మండలం పెరుమాళ్ళపురం వద్ద గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఇందులో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమిక సమాచారం. మరో నలుగు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
Source: Yahoo! Telugu: News | 25 Mar 2010 | 6:30 am

చిరంజీవి కాంప్లిమెంట్‌ కంటే ఇంకేం కావాలి: శేఖర్ కమ్ముల

రామానాయుడు మనవడు రానాతో ఏవీఎం ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన భారీ చిత్రం 'లీడర్‌'. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌ ఫిలింనగర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ, "ఈ సినిమా విజయానికి ఏవీఎం వారే కారణం. నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నాకు మన దేశం అంటే ఇష్టం. ఆ ఆలోచనలోంచే పుట్టింది ఈ సినిమా. ఎందుకు మనదేశం అభివృద్ది చెందలేదు అని చర్చించాను. ఈ సినిమా చూశాక మారకపోయినా మారాలనే భావన వస్తేచాలనే ఈ సినిమా తీశాను. ఇంకా.. ప్రముఖులంతా సినిమా చూశారు. సి.ఎం.గారు త్వరలో చూడబోతున్నారు. రామోజీరావుగారు ఈ సినిమా తీయాలంటే ధైర్యంకావాలి అని చెప్పారు. చిరంజీవిగారైతే నీకు రాజకీయాలపై ఇంత అవగాహన ఉందా? అని అన్నారు. ఇంతకంటే ఇంకే కాంప్లిమెంట్‌ కావాలి. అపరిచితుడు, మల్లన్న చిత్రాల్లా ఇది కూడా ఒక రియాలిటీ సినిమా" అని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Mar 2010 | 6:23 am

"సమంత"కు చికెన్ పాక్స్: బృందావనం షూటింగ్ రద్దు..!?

"ఏ మాయ చేసావె" హిట్‌తో ఆ సినిమా హీరోయిన్ సమంతకు ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా దిల్‌రాజు నిర్మిస్తున్న "బృందావనం"లో సమంత రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే కేరళలో ఈ సినిమా షూటింగ్‌ను కొద్దిరోజుల పాటు జరిపారు. అక్కడ సమంత అనారోగ్యం పాలుకావడంతో ఒక్కరోజు విశ్రాంతి ఇచ్చారు. మరుసటిరోజు చికెన్‌ఫ్యాక్స్ అని తేలడంతో మొత్తం యూనిట్ ప్యాకప్ అయి తిరిగి వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సమంత లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బహూశా వచ్చేనెలలో ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత చిత్ర యూనిట్ కేరళకు వెళ్ళనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. "ఏ మాయ చేసావె" చిత్రం ద్వారా మాస్ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న సమంతకు టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే రామ్‌చరణ్ తేజతో కొత్త చిత్రానికి బుక్ అయిన సమంత, ఎన్టీఆర్ సినిమాలో రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా సమంతను బుక్ చేసుకోవడానికి నిర్మాతలు ఆమె ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Mar 2010 | 5:49 am

మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ కె.పి.రఘువంశీ తొలగింపు

మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్ పదవి నుంచి అడిషినల్ డైరక్టర్ జనరల్ కేపీ.రఘువంశీపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. ఇటీవల అరెస్టు చేసిన ఇద్దరు తీవ్రవాదులకు సంబంధించిన పరిశోధనా సమాచారాన్ని మీడియాకు లీక్ చేశారంటూ ఆరోపణలు రావడంతో ఆయనపై చర్య తీసుకుంది. ఆయన స్థానంలో మరో పోలీసు ఉన్నతాధికారి రాకేష్ మారియా నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి.
Source: జాతీయ | 25 Mar 2010 | 3:22 am

చిరంజీవీ... విందుకు రండి: బొత్స సత్యనారాయణ

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని విందుకు ఆహ్వానించారు. గురువారం చిరంజీవిని ప్రత్యేకంగా కలిసి ఈ నెల 29న తన స్వగృహంలో ఏర్పాటు చేస్తున్న విందుకు చిరంజీవితోపాటు మిగిలిన శాసనసభ్యులు కూడా రావాలని బొత్స కోరారు.
Source: ఏపీ న్యూస్ | 25 Mar 2010 | 2:43 am

పాక్‌ను దారిలో పెట్టండి: అమెరికాకు చిదంబరం వినతి!

దాయాది దేశం పాకిస్థాన్ తమ మాట వినడం లేదని అందువల్ల ఆ దేశంతో సన్నిహిత సంబంధాలు కలిగివుండే అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు పాకిస్థాన్‌ను దారిలో పెట్టేలా కృషి చేయాలని కేంద్ర హోం మంత్రి చిదంబరం అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన అమెరికా, బ్రిటన్‌లకు విజ్ఞప్తి చేశారు.
Source: జాతీయ | 25 Mar 2010 | 1:16 am

ఆటోను ఢీకొన్న మంత్రి కాన్వాయ్: నలుగురి మృతి!

తూర్పు గోదావరి జిల్లాలో కేంద్రం రక్షణ శాఖ సహాయ మంత్రి పళ్లం రాజు వాహనశ్రేణి (కాన్వాయ్) ప్రయాణికుల ఆటోను ఢీకొంది. తొండగి మండలం పెరుమాళ్ళపురం వద్ద గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఇందులో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమిక సమాచారం. మరో నలుగు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Mar 2010 | 1:00 am

మంత్రులూ.. వళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి: బాబు

అధికార పార్టీకి చెందిన మంత్రులు, సభ్యులు వళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. తాను మాట్లాడే సమయంలో అధికార పార్టీ సభ్యులు కావాలనే అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Mar 2010 | 12:48 am

రెండు పూటలా సభను నిర్వహించాలని తెదేపా ధర్నా

అసెంబ్లీ సమావేశాలను రెండు పూటలా నిర్వహించాలని కోరుతూ ప్రధాన ప్రతిపక్షంతో పాటు.. వామపక్ష పార్టీల సభ్యులు గురువారం గన్‌పార్కు వద్ద ధర్నా చేశాయి.
Source: ఏపీ న్యూస్ | 25 Mar 2010 | 12:21 am

అసంబ్లీ వాయిదా తీర్మానాలను తిరస్కరించిన సభాపతి!

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీలు గురువారం ఉదయం ప్రవేశపట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. విద్యార్థుల ఉపకారవేతనాలపై ప్రజారాజ్యం పార్టీ, గీత కార్మికుల సమస్యలపై భారతీయ జనతా పార్టీ, ముస్లిం రిజర్వేషన్లపై మజ్లిస్, కర్నూలు జిల్లాలో భూముల లీజుపై వామపక్ష పార్టీలు వాయిదా తీర్మానాలను ప్రవేశశపెట్టి చర్చకు పట్టుబట్టాయి.
Source: ఏపీ న్యూస్ | 25 Mar 2010 | 12:20 am

నిర్మాణంలోని పోలీసు భవాన్ని పేల్చివేసిన మావోలు

బీహార్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు. ఈ రాష్ట్రంలోని సరన్ జిల్లా, భెల్బీ అనే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న పోలీసు భవనాన్ని డైనమెట్లతో పేల్చి వేశారు. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. సుమారు 50 మంది సాయుధ మావోయిస్టులు బుధవారం ఆర్థరాత్రి భవనం వద్దకు వచ్చి విచక్షారహితంగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత డైనమెట్లతో భవనాన్ని పేల్చి వేసినట్టు జిల్లా పోలీసులు వెల్లడించారు.
Source: జాతీయ | 24 Mar 2010 | 11:37 pm

లక్ష్య సాధనలో విఫలమైన తెలంగాణ ఐకాస: గద్దర్

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ లక్ష్య సాధనలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి పూర్తిగా విఫమైందని ప్రజా గాయకుడు గద్దర్ ఆరోపించారు. అందుకే.. రాష్ట్ర సాధనం కోసం తాను రంగంలోకి దిగి, ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Mar 2010 | 11:29 pm

త్వరలో ప్రజారాజ్యం ఆధ్వర్యంలో కొత్త న్యూస్ ఛానల్...!?

రాష్ట్రంలో మీడియా పోటీ నానాటికీ పెరిగిపోతోంది. తమ సొంత ప్రచారం కోసం అన్ని రాజకీయ పార్టీలు సొంతగా న్యూస్ ఛానల్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. అలాగే, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా త్వరలోనే తెలంగాణ న్యూస్ ఛానల్ పేరిట గురువారం నుంచి టీవీ ప్రసార కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 24 Mar 2010 | 10:57 pm

కోల్‌కతా అగ్నిప్రమాదం కేసు: ఇద్దరి అరెస్టు,, మృతులు 26!

రెండు క్రితం కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌లో ఉన్న 150 యేళ్ళనాటి పురాతన భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం కేసులో ఇద్దరిని నగర పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, మరో ఎనిమిది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 26కు చేరుకుంది. మరో 29 మంది ఆచూకీ తెలియరాలేదు. భవనంలో చెలరేగిన మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్టు నగర పోలీసులు వెల్లడించారు.
Source: జాతీయ | 24 Mar 2010 | 10:22 pm

ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే ఫలితాలపై నమ్మకం లేదు: కరుణానిధి

ఎన్నికలకు ముందు నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలపై తనకు నమ్మకం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కరుణానిధి స్పష్టం చేశారు. ప్రభుత్వ, అభ్యర్థుల పనితీరు ఆధారంగా ఓటర్లు పట్టంకడతారని ఆయన చెప్పుకొచ్చారు.
Source: జాతీయ | 24 Mar 2010 | 10:22 pm

కదిర్ దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా కొత్త చిత్రం!

లోగడ "ప్రేమసందేశం", "హృదయం" వంటి ప్రేక్షకాధారణ పొందిన చిత్రాలకు దర్శకత్వం వహించిన కదిర్ దర్శకత్వంలో యువ హీరో వరుణ్ సందేశ్ కథానాయకుడిగా కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా "సేవకుడు" చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత యం.సుధాకర్ శ్రీమహాగణపతి ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2010 | 2:28 pm

పాటల రికార్డింగ్‌ను పూర్తి చేసుకున్న "మదనుడు"

"మన్మథులు" వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాత సురేష్ చౌదరి సూర్య పవర్‌ఫుల్ మూవీస్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం 'మదనుడు'. వైవిథ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రం డబ్బింగ్, పాటలు, రీ రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తొలికాపీకి సిద్ధమవుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2010 | 2:26 pm

ఏప్రిల్ రెండో వారంలో "ఇష్టపడితే" ఆడియో విడుదల

వరలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై పడాల వెంకటరెడ్డి సమర్పణలో సుభాష్ రాయల్, ఫరాఖాన్ హీరోహీరోయిన్లుగా నిర్మితమైన చిత్రం "ఇష్టపడితే". ఈ చిత్రం ద్వారా ఎం.శ్రీనివాస్ దర్శకుడిగా తెలుగుతెరకు పరియచమవుతున్నారు. శ్రీరామచంద్రారెడ్డి, పొలిశెట్టి చంద్రశేఖర్, ఆర్.సూర్యప్రకాష్, జి.లక్ష్మీనారాయణ రెడ్డిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "ఇష్టపడితే".. 'ప్రేమేనా' అనే ట్యాగ్‌లైన్‌తో నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2010 | 2:24 pm

శ్రీరామునికి పట్టు వస్త్రాలు సమర్పించిన "వరుడు"

శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ రామాలయంలో సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణం జరిపించి "వరుడు" చిత్రాన్ని మార్చి 31న విడుదల చేయడానికి నిర్ణయించినట్లు చెప్పారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా పాత్రికేయులతో అర్జున్, గుణశేఖర్, డి.వి.వి దానయ్య మాట్లాడారు.హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఈ రోజు చాలా మంచి రోజు. సీతారాముల కల్యాణం జరిగే శ్రీరామ నవమి రోజున స్వామి సన్నిధానంలో వరుడు మార్చి 31న విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాం. సీతారామ కల్యాణం ఎంత వైభవంగా జరుగుతుందో అందరికీ తెలుసు. మా వరుడు చిత్రం కథలో కూడా పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంది.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2010 | 10:40 am

నెట్‌లో నిత్యానంద- యువరాణి న్యూడ్ వీడియో హల్ చల్

సెక్స్ స్వామిగా పిలువబడుతున్న నిత్యానందకు- రంజితకు శృంగారపరమైన సంబంధం ఉన్నదనీ, వాళ్లద్దరికి సంబంధించిన నగ్న వీడియోలు లభ్యమయ్యాయనీ కోలీవుడ్ ఇటీవల గోల గోల చేసింది. ఇప్పుడు తాజాగా మరో తమిళ తారతో నిత్యానంద సాగించిన రాసలీలల తాలూకు నగ్న వీడియోలు నెట్‌లో దర్శనమిస్తున్నాయని చెపుతోంది. నిత్యానంద- తమిళనటి యువరాణిలకు సంబంధించిన నగ్న వీడియో ఒకటి నెట్‌లో ప్రత్యక్షమైందని తెలియడంతో నెటిజన్లు ఆయా నెట్ సెంటర్ల వద్ద ఎగబడ్డారట. ఇది ఆ నోటా.. ఈ నోటా.. నేరుగా నటి యువరాణి చెవికి చేరిందట. దాంతో రాణి హుటాహుటిని పోలీసులను ఆశ్రయించి తన పేరును నిత్యానందకు లింక్ చేస్తూ నగ్న వీడియోలను ప్రసారమవడాన్ని తక్షణం అడ్డుకోవాలని అభ్యర్థించిదట. యువరాణి అభ్యర్థన మేరకు ఆ లింకును నెట్ నుంచి తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారట.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2010 | 9:10 am

ఏప్రిల్‌లో మంత్రివర్గ విస్తరణ: జూనియర్లకు ఛాన్స్?

రాష్ట్ర మంత్రివర్గం విస్తరణకు నోచుకోనుంది. ఏప్రిల్‌ నెలలో ఏ క్షణమైన మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నట్టు అధికార కాంగ్రెస్ పార్టీ చెందిన సీనియర్ నేత ఏరాసు ప్రతాపరెడ్డి తెలిపారు. దీనిపై ఆయన బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయన్నారు. ఇందులో జూనియర్లు, పలువురు మాజీలకు చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నట్టు సూచన ప్రాయంగా వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Mar 2010 | 7:38 am

సమంతను "బుక్" చేసుకున్న రామ్ చరణ్ తేజ్!

సమంతా.. ఓ సమంత. టాలీవుడ్ కుర్రకారు హీరోల కలల్లో విహరిస్తున్న కొత్తబామ. నాగార్జున తనయుడు నాగ చైతన్యతో "ఏ మాయ చేశావే" చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం విడుదలైన మంచి ప్రేక్షకాధారణ పొందడమే కాకుండా సమంత మంచి మార్కులు కొట్టేసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2010 | 7:16 am

మహిళా బిల్లులో ఓబీసీ కోటా ఉండదు: మంత్రి మొయిలీ

చట్ట సభల్లో మహిళామణులకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లులో ఓబీసీ కోటా ఉండబోదని కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో ఖచ్చితమైన ఓబీసీ జనాభా లెక్కలు అందుబాటులో లేవన్నారు.
Source: జాతీయ | 24 Mar 2010 | 6:41 am

ఆ ఒక్కటి మినహా ఇతర అంశాలపై మాట్లాడుతా: బాబు

ఒక్క తెలంగాణ అంశం మినహా మిగిలిన అంశాలపై మాట్లాడుతానని, అందువల్ల మీరు (మీడియా) కూడా ఆ అంశానికి సంబంధించిన ప్రశ్నలు కాకుండా ఇతర ప్రశ్నలు వేయవచ్చని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మీకు బాగానే తెలుసన్నారు. అందువల్ల ఆ ఒక్కటి మినహా మిగతా వాటిపై మాట్లాడుతానని చెప్పి మాట్లాడారు.
Source: ఏపీ న్యూస్ | 24 Mar 2010 | 6:25 am

వామ్మో.. తెలంగాణలో ఇంత అభివృద్ధా?: జస్టీస్ శ్రీకృష్ణ..!!!

సంప్రదింపులు ప్రక్రియ ప్రారంభంకాకముందే జస్టీస్ శ్రీకృష్ణ కమిటి నోరెళ్ళబెడుతోంది. రాష్ట్ర స్థితిగతులు, అభివృద్ధి పనులు, నిధుల వ్యయం తదితర అంశాలతో కూడిన నివేదికలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 15 వేలకు పైగా నివేదికలు, వినతిపత్రాలు వచ్చినట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 24 Mar 2010 | 5:24 am

ఆయన స్థానంలో మరొకరా..? అంగీకరించేది లేదు: అళగిరి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కరుణానిధి స్థానంలో మరొకరిని ఊహించుకోలేమని ఆయన పెద్ద కుమారుడు, కేంద్ర ఎరువులు, రసాయన శాఖామంత్రి ఎంకే.అళగిరి అన్నారు. పార్టీ అధినేతగా కలైంజ్ఞర్ మినహా మరొకరిని అంగీకరించబోమని ఆయన ఒక తమిళ వార పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు.
Source: జాతీయ | 24 Mar 2010 | 4:33 am

దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని నవమి శుభాకాంక్షలు

శ్రీ రామనవమి పండుగ సందర్భంగా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లు బుధవారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు
Source: జాతీయ | 24 Mar 2010 | 2:52 am

ఉగ్రవాదులు ప్రత్యేకంగా ఏ వర్గానికీ చెందరు: గడ్కారీ

ప్రపంచంలోని ఉగ్రవాదులకు కులం, మతం, సంప్రదాయంలాంటివి ఉండవని, దేవుడికి భయపడే ఓ హిందువు ఒక అమాయక ముస్లింను చంపడు. అలాగే దేవుడికి భయపడే ముస్లిం కూడా ఒక హిందువును చంపలేడని భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు నితీశ్ గడ్కారీ అన్నారు.
Source: జాతీయ | 24 Mar 2010 | 2:50 am

ములాయం మహిళలకు క్షమాపణలు చెప్పాలి: సుబోధ్

మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ దేశంలోని మహిళలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది.
Source: జాతీయ | 24 Mar 2010 | 2:48 am