నెట్‌లో నిత్యానంద- యువరాణి న్యూడ్ వీడియో హల్ చల్

సెక్స్ స్వామిగా పిలువబడుతున్న నిత్యానందకు- రంజితకు శృంగారపరమైన సంబంధం ఉన్నదనీ, వాళ్లద్దరికి సంబంధించిన నగ్న వీడియోలు లభ్యమయ్యాయనీ కోలీవుడ్ ఇటీవల గోల గోల చేసింది. ఇప్పుడు తాజాగా మరో తమిళ తారతో నిత్యానంద సాగించిన రాసలీలల తాలూకు నగ్న వీడియోలు నెట్‌లో దర్శనమిస్తున్నాయని చెపుతోంది. నిత్యానంద- తమిళనటి యువరాణిలకు సంబంధించిన నగ్న వీడియో ఒకటి నెట్‌లో ప్రత్యక్షమైందని తెలియడంతో నెటిజన్లు ఆయా నెట్ సెంటర్ల వద్ద ఎగబడ్డారట. ఇది ఆ నోటా.. ఈ నోటా.. నేరుగా నటి యువరాణి చెవికి చేరిందట. దాంతో రాణి హుటాహుటిని పోలీసులను ఆశ్రయించి తన పేరును నిత్యానందకు లింక్ చేస్తూ నగ్న వీడియోలను ప్రసారమవడాన్ని తక్షణం అడ్డుకోవాలని అభ్యర్థించిదట. యువరాణి అభ్యర్థన మేరకు ఆ లింకును నెట్ నుంచి తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారట.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2010 | 9:10 am

జనవరి-మార్చిలో ఆర్థిక వృద్ధి 8.5 శాతం: కౌశిక్ బసు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం (జనవరి-మార్చి)లో దేశీయ ఆర్థిక వృద్ధి 8.5 శాతానికి చేరుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారులు కౌశిక్ బసు అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 24 Mar 2010 | 9:08 am

కొత్తగా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుల నియామకం!

రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలకు కొత్తగా యువజన కాంగ్రెస్ అధ్యక్షులను నియమించారు. యువజన కాంగ్రెస్ అనుబంధ కమిటీలను ఆ పార్టీ రద్దు చేసింది. మిగిలిన జిల్లాలకు త్వరలోనే నియామకం చేపడుతామని పీసీసీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా నియమించిన అధ్యక్షుల వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొత్స రవికుమార్ నియమితులయ్యారు.
Source: Yahoo! Telugu: News | 24 Mar 2010 | 8:44 am

8000 పౌండ్లకు అమ్ముడు పోయిన హిట్లర్ లేఖ!

బ్రిటన్-జర్మన్ సంబంధాలపై అడాల్ఫ్ హిట్లర్ స్వదస్తూరితో రాసిన లేఖ ఎనిమిది వేల పౌండ్లకు అమ్ముడు పోయింది. ఇందుకోసం నిర్వహించిన వేలం పాటల్లో ఈ లేఖను సొంతం చేసుకునేందుకు అనేక మంది పోటీ పడినప్పటికీ.. అమెరికాకు చెందిన కెన్నెత్ రెండెల్ అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 24 Mar 2010 | 8:23 am

పెళ్లికి ముందు సహజీవనంపై మేం వ్యతిరేకం: వెంకయ్య

వివానికి ముందు సహజీవనంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు తాము వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ పెళ్ళికి ముందు యువతీయువకుల సహజీనం చేయడంలో తప్పులేదని సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
Source: Yahoo! Telugu: News | 24 Mar 2010 | 8:03 am

పెట్రో ధరలు మరింతగా పెరగనున్నాయి: సుందరేశన్

దేశవ్యాప్తంగా ఇటీవల పెరిగిన పెట్రో ధరలతో ప్రజలు సతమతమౌతుంటే మరోమారు వీటి ధరలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. పెట్రో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి సుందరేశన్ బుధవారం పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 24 Mar 2010 | 8:00 am

చిరంజీవి విన్నపాన్ని తోసిపుచ్చలేం: మంత్రి గీతారెడ్డి

సినీ నటుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చేసే సూచనలు, సలహాలను విస్మరించజాలమని రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి జె.గీతారెడ్డి స్పష్టం చేశారు. చిత్రపరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ భూతాన్ని అరికడతామని ఆమె హమీ ఇచ్చారు.
Source: Yahoo! Telugu: News | 24 Mar 2010 | 7:49 am

అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల కళ్యాణం

రాష్ట్రంలోని భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ లగ్నాన సీతారాముల వారి శిరస్సు పై అర్చకులు జీలకర్ర, బెల్లం ఉంచారు. అనంతరం రామదాసు చేయించిన తాళి బొట్టుతో కూడిన మంగళ సూత్రాన్ని రాముని తరపున అర్చకులు సీతమ్మకు అలంకరించారు.
Source: Yahoo! Telugu: News | 24 Mar 2010 | 7:34 am

సమంతను "బుక్" చేసుకున్న రామ్ చరణ్ తేజ్!

సమంతా.. ఓ సమంత. టాలీవుడ్ కుర్రకారు హీరోల కలల్లో విహరిస్తున్న కొత్తబామ. నాగార్జున తనయుడు నాగ చైతన్యతో "ఏ మాయ చేశావే" చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం విడుదలైన మంచి ప్రేక్షకాధారణ పొందడమే కాకుండా సమంత మంచి మార్కులు కొట్టేసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Mar 2010 | 7:16 am

ఏప్రిల్ 20 వరకు వడ్డీ రేట్లను పెంచేది లేదు: ఎస్‌‍బీఐ

తమ బ్యాంకు ఏప్రిల్ నెల 20వ తేదీ వరకు వడ్డీ రేట్లను పెంచేది లేదని భారతీయ స్టేట్ బ్యాంక్ ఛైర్మెన్ ఓపీ భట్ట్ బుధవారం న్యూ ఢిల్లీలో తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 24 Mar 2010 | 7:14 am

కోలకతా అగ్నిప్రమాదంలో 24కు చేరిన మృతుల సంఖ్య

పార్క్ స్ట్రీట్‌లోని స్టీఫెన్ కోర్టు భవనంలో మంగళవారం జరిగన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 24కు చేరుకుందని, అధిక శాతం మృతులు 5వ, 6వ అంతస్తుల్లోనే ఉన్నట్లు స్థానిక అగ్నిమాపక శాఖాధికారులు బుధవారం వెల్లడించారు
Source: Yahoo! Telugu: News | 24 Mar 2010 | 6:46 am

27న సిట్ ఎదుట హాజరుకానున్న నరేంద్ర మోడీ!

2002 సంవత్సరంలో చోటు చేసుకున్న గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ఎదుట ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 27వ తేదీన హాజరుకానున్నారు. సిట్ విచారణను ఎదుర్కొనేందుకు ఆయన సన్నద్ధమవుతున్నట్టు ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 24 Mar 2010 | 6:44 am

కొత్తగా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుల నియామకం!

రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలకు కొత్తగా యువజన కాంగ్రెస్ అధ్యక్షులను నియమించారు. యువజన కాంగ్రెస్ అనుబంధ కమిటీలను ఆ పార్టీ రద్దు చేసింది. మిగిలిన జిల్లాలకు త్వరలోనే నియామకం చేపడుతామని పీసీసీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా నియమించిన అధ్యక్షుల వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొత్స రవికుమార్ నియమితులయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 24 Mar 2010 | 3:15 am

దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని నవమి శుభాకాంక్షలు

శ్రీ రామనవమి పండుగ సందర్భంగా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లు బుధవారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు
Source: జాతీయ | 24 Mar 2010 | 2:52 am

ఉగ్రవాదులు ప్రత్యేకంగా ఏ వర్గానికీ చెందరు: గడ్కారీ

ప్రపంచంలోని ఉగ్రవాదులకు కులం, మతం, సంప్రదాయంలాంటివి ఉండవని, దేవుడికి భయపడే ఓ హిందువు ఒక అమాయక ముస్లింను చంపడు. అలాగే దేవుడికి భయపడే ముస్లిం కూడా ఒక హిందువును చంపలేడని భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు నితీశ్ గడ్కారీ అన్నారు.
Source: జాతీయ | 24 Mar 2010 | 2:50 am

ములాయం మహిళలకు క్షమాపణలు చెప్పాలి: సుబోధ్

మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ దేశంలోని మహిళలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది.
Source: జాతీయ | 24 Mar 2010 | 2:48 am

పెళ్లికి ముందు సహజీవనంపై మేం వ్యతిరేకం: వెంకయ్య

వివానికి ముందు సహజీవనంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు తాము వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ పెళ్ళికి ముందు యువతీయువకుల సహజీనం చేయడంలో తప్పులేదని సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 Mar 2010 | 2:33 am

అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల కళ్యాణం

రాష్ట్రంలోని భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ లగ్నాన సీతారాముల వారి శిరస్సు పై అర్చకులు జీలకర్ర, బెల్లం ఉంచారు. అనంతరం రామదాసు చేయించిన తాళి బొట్టుతో కూడిన మంగళ సూత్రాన్ని రాముని తరపున అర్చకులు సీతమ్మకు అలంకరించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Mar 2010 | 2:27 am

చిరంజీవి విన్నపాన్ని తోసిపుచ్చలేం: మంత్రి గీతారెడ్డి

సినీ నటుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చేసే సూచనలు, సలహాలను విస్మరించజాలమని రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి జె.గీతారెడ్డి స్పష్టం చేశారు. చిత్రపరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ భూతాన్ని అరికడతామని ఆమె హమీ ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 24 Mar 2010 | 2:19 am

కోలకతా అగ్నిప్రమాదంలో 24కు చేరిన మృతుల సంఖ్య

పార్క్ స్ట్రీట్‌లోని స్టీఫెన్ కోర్టు భవనంలో మంగళవారం జరిగన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 24కు చేరుకుందని, అధిక శాతం మృతులు 5వ, 6వ అంతస్తుల్లోనే ఉన్నట్లు స్థానిక అగ్నిమాపక శాఖాధికారులు బుధవారం వెల్లడించారు
Source: జాతీయ | 24 Mar 2010 | 1:17 am

27న సిట్ ఎదుట హాజరుకానున్న నరేంద్ర మోడీ!

2002 సంవత్సరంలో చోటు చేసుకున్న గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ఎదుట ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 27వ తేదీన హాజరుకానున్నారు. సిట్ విచారణను ఎదుర్కొనేందుకు ఆయన సన్నద్ధమవుతున్నట్టు ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు.
Source: జాతీయ | 24 Mar 2010 | 1:15 am

హైదరాబాద్‌పై మైనింగ్ మాఫియా కన్ను: వీహెచ్ జోస్యం!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌పై మైనింగ్ మాఫియా కన్ను పడిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు జోస్యం చెప్పారు. అందువల్ల ముఖ్యమంత్రి రోశయ్య నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేదంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మరో కర్ణాటకలా మారుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 24 Mar 2010 | 12:24 am

శత్రువుకు శత్రువు నా మిత్రుడు: రాములమ్మ పాలసీ!

ఆంగ్లంలో ఒక సామెత ఉంది. 'యన్ ఎనిమీస్ ఎనిమీ ఈజ్ మై ఫ్రెండ్" (శత్రువుకు శత్రువు నా మిత్రుడు). ఈ సిద్ధాంతాన్ని మెదక్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా నేత విజయశాంతి బాగా ఒంటబట్టించుకున్నట్టు తెలుస్తోంది. నిన్నమొన్నటి వరకు అన్ని తెలుగు వార్తా పత్రికలు, టీవీ ఛానల్స్‌ వ్యవహార శైలిని ఎండగట్టారు. ఇందులో ఏబీఎన్ ఛానల్ కూడా ఉంది.
Source: ఏపీ న్యూస్ | 24 Mar 2010 | 12:14 am

ఫ్రీజోన్ వ్యవహారం: హరీష్ సవాల్‌కు "మెగా"స్పందన

ఫ్రీజోన్ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర సమితి నేత హరీష్ రావు చేసిన సవాల్‌కు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి సానుకూలంగా స్పందించారు. ఈనెల 30వ తేదీన కరీంనగర్ నడిబొడ్డున జరిగే బహిరంగ చర్చకు తాను సిద్ధమని చిరంజీవి ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Mar 2010 | 12:00 am

గోపీచంద్‌కోసం బంజారాలో అనుష్క కొత్త ఇల్లు..?!!

నటుడు గోపీచంద్, అనుష్కల మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం నడుస్తోందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వాళ్లిద్దరి వ్యవహారాన్ని చూస్తే సమీప భవిష్యత్తులో పెళ్లి చేసుకోవడం ఖాయమని అంటున్నారు. ఇది నిజమో కాదో కానీ, ప్రస్తుతం అనుష్క, గోపీచంద్‌లు చేస్తున్న పనులను చూస్తుంటే కొద్దో గొప్పో నిజమేనని అనుకోవలసి వస్తుందంటున్నారు టాలీవుడ్ సినీ జనం. గోపీచంద్‌ను తరచుగా కలుసుకునేందుకు వీలుగా అనుష్క బంజారా హిల్స్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అనుష్క సంగతి ఇలా ఉంటే, గోపీచంద్ కూడా ఫిలిమ్ నగర్‌లో ఓ కొత్త ఇంటిని కొనేందుకు వెతుకుతున్నట్లు వినికిడి. అనుకున్నట్లుగానే ఇళ్లు కుదిరితే త్వరలోనే ఇద్దరూ ఒకింటి వారయ్యే రోజు ఎంతో దూరంలో లేదని టాలీవుడ్ అంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Mar 2010 | 10:27 am

పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదు: సుప్రీం కోర్టు

పెళ్లికి ముందు శృంగారం తప్పేమీ కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పింది. పెళ్లికి ముందు ఇద్దరు కలిసి సహజీవనం చేయడం కూడా తప్పేమీ కాదనీ, ఇష్టం ఉంటే కలిసి ఉండవచ్చని తెలిపింది. అంతేకాదు వివాహానికి ముందు శృంగారం తప్పు కాదని గతంలో తమిళ నటి ఖుష్భూ చేసిన వ్యాఖ్యలను సమర్థించింది.
Source: జాతీయ | 23 Mar 2010 | 9:54 am

ఫారిన్ తెల్ల పాపలు "లాలిపప్"లు: రాఖీ సావంత్

విదేశాల నుంచి బాలీవుడ్‌లో ఐటమ్ గాళ్స్‌గా దిగుమతి అవుతున్న తెల్ల అమ్మాయిలందరూ లాలీ‌పప్‌ల్లాంటివారని బాలీవుడ్ హాట్ ఐటమ్ గాళ్ రాఖీ సావంత్ ఎద్దేవా చేస్తోంది. తెల్లతోలుతో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న ఈ అమ్మాయిలు తమ ఛాన్సులు ఎగరేసుకుపోతున్నారనీ అక్కసు వ్యక్తం చేసింది. ఈ అమ్మాయిలను బాలీవుడ్‌లో అడుగుపెట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.అదలా ఉంచితే... రాఖీ ఇటీవల విడుదల చేసిన కొన్ని ఆల్బమ్స్ విదేశీ తెల్ల అమ్మాయిలు కంపోజ్ చేసినవి కావడం గమనార్హం. అంతేకాదు ఆమె మెయిన్ ఐటమ్ గాళ్‌గా రూపొందించిన పలు వీడియో ఆల్బమ్స్‌లో ఆమె సరసన గ్రూపుగా నర్తించినవారిలో తెల్ల ఐటమ్ గాళ్స్‌ కోకొల్లలుగా ఉన్నారు. ఇదే విషయాన్ని రాఖీని అడిగితే... ఎవరా చూసింది...? నా ప్రక్కనున్న తెల్ల అమ్మాయిలు బాలీవుడ్‌కు చెందినవారేనని బుకాయిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Mar 2010 | 9:32 am

సభలో మంత్రుల గైర్హాజరుపై గుర్రుమన్న ముఖ్యమంత్రి

శాసనసభలో జరిగే సమావేశాలకు హాజరయ్యే మంత్రుల శాతం ఎమ్మెల్యేలతో పోలిస్గే తక్కువగా ఉంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సభకు కేవలం 22 మంది మంత్రులే హజరయ్యారని ఆయన తెలిపారు. ప్రతి రోజూ మంత్రులందరూ సభకు హాజరుకావాలని ఈ సందర్భంగా ఆయన మంత్రులను ఆదేశించారు.
Source: ఏపీ న్యూస్ | 23 Mar 2010 | 8:38 am

శివకాశిలో బాణా సంచా కేంద్రం వద్ద పేలుళ్ళు: ఒకరి మృతి

శివకాశిలోని టపాకాయల కర్మాగారం వద్ద పేలుడు పదార్థాల తయారీకి వినియోగించే రసాయనాల లోడును దింపుకుంటుండటంతో ప్రమాదవశాత్తు పేలుళ్ళు సంభవించాయి. దీంతో కరుప్పు స్వామి(35) అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు
Source: జాతీయ | 23 Mar 2010 | 8:10 am

రామ్‌దేవ్ రాజకీయ పార్టీ పెట్టొద్దు: భాజపా అధ్యక్షుడు

రాజకీయ పార్టీ పెట్టి దేశాన్ని బాగుచేస్తానని ఇటీవల యోగా గురువు, ఆధ్యాత్మిక వేత్త అయిన రామ్‌దేవ్ బాబా అన్నారు. దీనిపై భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు గట్కారీ స్పందిస్తూ రామ్‌‍దేవ్ బాబాకు రాజకీయాలు వద్దని సూచించారు.
Source: జాతీయ | 23 Mar 2010 | 7:30 am

ఏబీఎన్ కథనంతో ప్రజారాజ్యం పార్టీకి నిధుల వరద!

ప్రజారాజ్యం పార్టీకి వ్యతిరేకంగా ఏబీఎన్ టీవీ న్యూస్ ఛానల్ చేసిన ప్రచారం మరోకోణంలో మంచి చేసింది. నిధుల లేమితో సతమతమవుతున్న ప్రరాపాను ఆదుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమానులు ముందుకు వస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 23 Mar 2010 | 6:44 am

"ఆవాహం"లో దెయ్యాన్ని చూసి జడుసుకున్నా: వర్మ

దెయ్యాలు, భూతాలు, చేతబడులు అంటూ రకరకాల కథలతో జనాల్ని భయపెట్టే రామ్ గోపాల్ వర్మ తాజాగా హిందీ "పూంఖ్-2" చిత్రాన్ని తెలుగులో ఆవాహం పేరుతో విడుదల చేస్తున్నారు. జెడ్ 3 పిక్చర్స్ ప్రొడక్షన్స్‌పై రామ్ గోపాల్ వర్మ సమర్పించిన ఈ చిత్రానికి మిలింద్ గదగ్‌కర్ దర్శకుడు. ప్రశాంత్ బుర్ర, పి. చంద్రశేఖర్ నిర్మాతలు. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా సోమవారం రాత్రి హైదరాబాదులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ... పూంఖ్ -2 చిత్రానికీ దీనికీ సంబంధమే లేదు. ఆ సినిమా చూడకపోయినా ప్రేక్షకులకు ఈ సినిమా అర్థమవుతుంది. భయమనేది యూనివర్సల్ పాయింట్. అందుకే ఇక్కడ కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. చచ్చిపోయిన వాళ్లు దెయ్యాలు అవుతారా..? లేకపోతే కక్ష ఉన్నవాళ్లు మాత్రమే దెయ్యాలుగా మారతారా...? అనేది ఈ చిత్రంలో పాయింట్. ఒక స్త్రీ దెయ్యమై ఓ కుటుంబంపై కక్ష కడుతుంది. ఆ కుటుంబాన్ని చిత్ర హింసలు పెడుతుంది. ఆవాహం లైన్ ఇదే. థియేటర్ల నుంచి ఇంటికి వెళ్లాక కూడా భయం మనల్ని వెంటాడుతుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Mar 2010 | 6:39 am

వైఎస్.రాజశేఖరుని పాలన భేష్: చంద్రబాబు కితాబు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పరిపాలన భేషుగ్గా ఉన్నదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఇప్పటి ముఖ్యమంత్రి రోశయ్యతో పాటు.. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిలు శాసనసభను నడపడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 23 Mar 2010 | 6:28 am

కోల్‌కతా భారీ అగ్నిప్రమాదం: ఇద్దరి మృత్యువాత

పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరికొంతమంది గాయపడ్డారు. స్థానిక పార్క్ స్ట్రీట్‌లో ఉన్న ఏడు అంతస్తుల స్టీఫెన్ కోర్టు భవన సముదాయం ఉంది. ఈ భవనం కింది భాగంలో వాణిజ్య దుకాణాలు ఉన్నాయి.
Source: జాతీయ | 23 Mar 2010 | 6:20 am

ఏప్రిల్ 30న విడుదల కానున్న ఇ.వి.వి "బురిడి"

ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో 23మంది కమెడియన్స్‌తో చేస్తున్న సినిమా బురిడి షూటింగ్ పూర్తయింది. ఇటీవలే బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా సోమవారం రాత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇ.వి.వి మాట్లాడుతూ... షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ ప్రారంభమయింది. ఏప్రిల్ 10 నుంచి రీరికార్డింగ్ కూడా జరుగుతుంది. మొదటివారంలోనే ఆడియోను విడుదల చేస్తాం. ఏప్రిల్ 30న సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Mar 2010 | 6:16 am

"హాసిని" షూటింగ్ పూర్తి... మార్చి 31న ఆడియో

అభి ఫేమ్ కమలాకర్. ప్రేమిస్తే ఫేమ్ సంధ్య కలయికలో రూపొందుతున్న చిత్రం హాసిని. బీవీ రమణారెడ్డి దర్శకత్వంలో కమల్ పిక్చర్స్ పతాకంపై కమలాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.చిత్ర సమర్పకురాలు బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ... ఇటీవలే థాయ్‌లాండ్‌లో రెండు పాటలను చిత్రీకరించాం. కమలాకర్, సంధ్య, ఆఫియాపై కృష్ణారెడ్డి నృత్యదర్శకత్వంలో థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, పట్టాయా, పుకెట్‌ల్లో ఈ పాటలను తీశాం. ఇప్పటికే ఎడిటింగ్, డబ్బింగ్ పూర్తయింది. రీరికార్డింగ్, ఇతర కార్యక్రమాలను పూర్తి చేసి, ఏప్రిల్ ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Mar 2010 | 5:59 am

పాటల రికార్డింగ్‌లో సాంబశివుడు

ఉమా క్రియేషన్స్ పతాకంపై కె. మురళి దర్శకనిర్మాతగా సాంబశివుడు అనే చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాదులో జరిగింది. డాడీ శ్రీనివాస్, రమేష్, పైడిశెట్టి రామ్ సాహిత్యాన్ని అందించారు. రమణ, శ్రీకాంత్, లలితా సాగరి, టీనా, సుధ ఆలపించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Mar 2010 | 5:52 am

నక్సల్ బరి ఉద్యమ నిర్మాత కానూ సన్యాల్ ఆత్మహత్య

నక్సల్ బరి ఉద్యమ నిర్మాత కానూ సన్యాల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన మంగళవారం సిలిగురి జిల్లా హతిఘిసాలోని తన నివాసంలోని ఉరివేసుకుని ఈ దురాగతానికి పాల్పడినట్టు సమాచారం.
Source: జాతీయ | 23 Mar 2010 | 4:47 am

ఉత్తమ నటుడు రామ్‌చరణ్: బెస్ట్ మూవీ 'మగధీర'?

2009 సంవత్సరానికి నంది ఉత్తమ నటీనటుల వెల్లడి కావాల్సి ఉంది. ఈ యేడాదికి కాను బెస్ట్ యాక్టర్‌గా చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్‌ ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు ఫిల్మ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Mar 2010 | 4:29 am