వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 8.5 శాతం: ప్రధాని

కేంద్ర ప్రణాళికా సంఘం న్యూ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రణాళికా సంఘం ఛైర్మెన్ హోదాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఆర్థిక వృద్ధి 8.5 శాతానికి చేరుకుంటుందని అన్నారు
Source: Yahoo! Telugu: News | 23 Mar 2010 | 6:07 am

మోస్ట్ పొల్యూటెడ్ స్టేట్స్: మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్

దేశంలోని రాష్ట్రాల్లో అధిక కాలుష్య బాధిత రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో మన రాష్ట్రానికి మూడో స్థానం దక్కగా, గుజరాత్, మహారాష్ట్రలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో జనాభా ఉత్తరప్రదేశ్‌తో పోల్చితే తక్కువగా ఉన్నప్పటికీ.. మోస్ట్ పొల్యూటెడ్ రాష్ట్రాలుగా గుర్తింపు పొందడం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేసే అంశం.
Source: Yahoo! Telugu: News | 23 Mar 2010 | 6:00 am

"హాసిని" షూటింగ్ పూర్తి... మార్చి 31న ఆడియో

అభి ఫేమ్ కమలాకర్. ప్రేమిస్తే ఫేమ్ సంధ్య కలయికలో రూపొందుతున్న చిత్రం హాసిని. బీవీ రమణారెడ్డి దర్శకత్వంలో కమల్ పిక్చర్స్ పతాకంపై కమలాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.చిత్ర సమర్పకురాలు బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ... ఇటీవలే థాయ్‌లాండ్‌లో రెండు పాటలను చిత్రీకరించాం. కమలాకర్, సంధ్య, ఆఫియాపై కృష్ణారెడ్డి నృత్యదర్శకత్వంలో థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, పట్టాయా, పుకెట్‌ల్లో ఈ పాటలను తీశాం. ఇప్పటికే ఎడిటింగ్, డబ్బింగ్ పూర్తయింది. రీరికార్డింగ్, ఇతర కార్యక్రమాలను పూర్తి చేసి, ఏప్రిల్ ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Mar 2010 | 5:59 am

పాటల రికార్డింగ్‌లో సాంబశివుడు

ఉమా క్రియేషన్స్ పతాకంపై కె. మురళి దర్శకనిర్మాతగా సాంబశివుడు అనే చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాదులో జరిగింది. డాడీ శ్రీనివాస్, రమేష్, పైడిశెట్టి రామ్ సాహిత్యాన్ని అందించారు. రమణ, శ్రీకాంత్, లలితా సాగరి, టీనా, సుధ ఆలపించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Mar 2010 | 5:52 am

భారత్‌పై అధిక ఆసక్తి చూపుతున్న సౌదీ విద్యార్థులు!

ఉన్నత విద్యను అభ్యశించాలని భావిస్తున్న సౌదీ అరేబియా దేశానికి చెందిన విద్యార్థులు ఎక్కువగా భారత్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయాన్ని ఆ దేశంలోని భారత రాయబారి సయ్యద్ అహ్మద్ బాబా మంగళవారం దుబాయ్‌లో వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 23 Mar 2010 | 5:46 am

పెరగనున్న పెట్రోలు, డీజిల్ ధరలు: సుందరేశన్

దేశంలో సహజవాయువును ఉత్పత్తి చేస్తున్న ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా సంస్థల ధరను కేంద్ర ప్రభుత్వం త్వరలో 30 శాతం మేరకు పెంచే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి ఎస్‌.సుందరేశన్‌ తెలిపారు. దీంతో వచ్చే ఏప్రిల్ నెల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరగనున్నాయి. ప్రతి లీటరుకు నలభై పైసలు చొప్పున అధికంగా చెల్లించాల్సివుంటుందని ఆయన అన్నారు.
Source: Yahoo! Telugu: News | 23 Mar 2010 | 5:38 am

అమెరికాలో హైదరాబాద్ యువకుని దారుణ హత్య!

అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక సంతోష్ నగర్‌కు చెందిన ప్రశాంత్ గోయినాక అనే యువకుడిని అమెరికాలోని ఓక్లహామా నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపినట్టు ఆ దేశ పోలీసులు వెల్లడించారు. డబ్బు కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.
Source: Yahoo! Telugu: News | 23 Mar 2010 | 5:30 am

సభలో రౌడీలా ప్రవర్తించవద్దు: మండలి డిప్యూటీ ఛైర్మన్!

సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నేతలు చట్ట సభల్లో రాజకీయ రౌడీలుగా ప్రవర్తించరాదని రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ మహ్మద్ జానీ హితవు పలికారు. దీనిపై తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యుడు మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్ మాటలు తనను ఉద్దేశించిన అన్నవేనని ఆయన ఆగ్రహం చెందారు. అంతేకాకుండా, తనకు జానీ క్షమాపణ చెప్పాలని సభలో పట్టుబట్టారు.
Source: Yahoo! Telugu: News | 23 Mar 2010 | 5:23 am

లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ వృద్ధి

మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, ఉదయం 10.30 గంటల ప్రాంతంలో 88 పాయింట్లు బలపడి, 17,499 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 27 పాయింట్లు పుంజుకుని, 5,232 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.
Source: Yahoo! Telugu: News | 23 Mar 2010 | 5:15 am

ఏబీఎన్ కథనంతో ప్రజారాజ్యం పార్టీకి నిధుల వరద!

ప్రజారాజ్యం పార్టీకి వ్యతిరేకంగా ఏబీఎన్ టీవీ న్యూస్ ఛానల్ చేసిన ప్రచారం మరోకోణంలో మంచి చేసింది. నిధుల లేమితో సతమతమవుతున్న ప్రరాపాను ఆదుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమానులు ముందుకు వస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 23 Mar 2010 | 4:56 am

ఒరిస్సాలో కర్మాగారాన్ని ప్రారంభించనున్న జేఎస్‌పీఎల్

తమ సంస్థకు చెందిన మరో ఉత్పత్తి కేంద్రాన్ని తాము ఒరిస్సాలో ప్రారంభించాలనుకున్నట్లు జేఎస్‌పీఎల్ కంపెనీ వైస్ ఛైర్మెన్, ఎమ్‌డీ నవీన్ జిందాల్ తెలిపారు. ఈ విషయమై ఆయన సోమవారం సాయంత్రం ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌‍తో కలిసి సంప్రదింపులు జరిపినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 23 Mar 2010 | 4:39 am

ఉత్తమ నటుడు రామ్‌చరణ్: బెస్ట్ మూవీ 'మగధీర'?

2009 సంవత్సరానికి నంది ఉత్తమ నటీనటుల వెల్లడి కావాల్సి ఉంది. ఈ యేడాదికి కాను బెస్ట్ యాక్టర్‌గా చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్‌ ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు ఫిల్మ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Mar 2010 | 4:29 am

నిన్న నకిలీ నోట్ల దండలు.. ఇకపై బంగారు కానుకలు!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె మాత్రం తన వ్యవహార శైలి మారడంలేదు. అలాగే, ఆ పార్టీనేతలు, కార్యకర్తలు కూడా తమ తీరును మార్చుకునేందుకు ససేమిరా అంటున్నారు. పార్టీ అధినేత్రిని ప్రసన్నం చేసుకునేందుకు కొత్తకొత్త కానుకలు బహుకరించేందుకు సిద్ధమవుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 23 Mar 2010 | 4:07 am

మోస్ట్ పొల్యూటెడ్ స్టేట్స్: మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్

దేశంలోని రాష్ట్రాల్లో అధిక కాలుష్య బాధిత రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో మన రాష్ట్రానికి మూడో స్థానం దక్కగా, గుజరాత్, మహారాష్ట్రలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో జనాభా ఉత్తరప్రదేశ్‌తో పోల్చితే తక్కువగా ఉన్నప్పటికీ.. మోస్ట్ పొల్యూటెడ్ రాష్ట్రాలుగా గుర్తింపు పొందడం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేసే అంశం.
Source: జాతీయ | 23 Mar 2010 | 12:30 am

అమెరికాలో హైదరాబాద్ యువకుని దారుణ హత్య!

అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక సంతోష్ నగర్‌కు చెందిన ప్రశాంత్ గోయినాక అనే యువకుడిని అమెరికాలోని ఓక్లహామా నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపినట్టు ఆ దేశ పోలీసులు వెల్లడించారు. డబ్బు కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 23 Mar 2010 | 12:01 am

సభలో రౌడీలా ప్రవర్తించవద్దు: మండలి డిప్యూటీ ఛైర్మన్!

సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నేతలు చట్ట సభల్లో రాజకీయ రౌడీలుగా ప్రవర్తించరాదని రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ మహ్మద్ జానీ హితవు పలికారు. దీనిపై తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యుడు మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్ మాటలు తనను ఉద్దేశించిన అన్నవేనని ఆయన ఆగ్రహం చెందారు. అంతేకాకుండా, తనకు జానీ క్షమాపణ చెప్పాలని సభలో పట్టుబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 22 Mar 2010 | 11:54 pm

ఏబీఎన్ కథనంతో ప్రజారాజ్యం పార్టీకి నిధుల వరద!

ప్రజారాజ్యం పార్టీకి వ్యతిరేకంగా ఏబీఎన్ టీవీ న్యూస్ ఛానల్ చేసిన ప్రచారం మరోకోణంలో మంచి చేసింది. నిధుల లేమితో సతమతమవుతున్న ప్రరాపాను ఆదుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమానులు ముందుకు వస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 22 Mar 2010 | 11:27 pm

నిన్న నకిలీ నోట్ల దండలు.. ఇకపై బంగారు కానుకలు!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె మాత్రం తన వ్యవహార శైలి మారడంలేదు. అలాగే, ఆ పార్టీనేతలు, కార్యకర్తలు కూడా తమ తీరును మార్చుకునేందుకు ససేమిరా అంటున్నారు. పార్టీ అధినేత్రిని ప్రసన్నం చేసుకునేందుకు కొత్తకొత్త కానుకలు బహుకరించేందుకు సిద్ధమవుతున్నారు.
Source: జాతీయ | 22 Mar 2010 | 10:38 pm

ట్రాక్‌ను పేల్చివేసిన మావోలు: పట్టాలు తప్పిన రాజధాని!

మావోయిస్టులు మరోమారు విధ్వంసం సృష్టించారు. తాము ఇచ్చిన బంద్‌‍కు సానుకూల స్పందన లేకపోవడంతో ఆస్తుల విధ్వంసాలకు పాల్పడుతున్నారు. మంగళవారం బీహార్ రాష్ట్రంలోని గయాకు సమీపంలో ట్రాక్‌ను పేల్చి వేశారు. దీంతో భువనేశ్వర్-న్యూఢిల్లీల మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఇంజన్‌తో సహా మొత్తం పది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడటం లేదా మృతి చెందడం జరగలేదు.
Source: జాతీయ | 22 Mar 2010 | 9:48 pm

"మంగళ"గా భయపెట్టేందుకు వస్తున్న ఛార్మి

ఛార్మి "మంగళ"గా మారింది. "మంత్ర" కంటే అద్భుతమైన కథతో ఈ చిత్రం రూపొందుతోందని ఛార్మి తెలిపింది. సోమవారం మంగళ చిత్ర ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడింది. మంత్ర సినిమాను తీసిన దర్శకుడు తులసీరామ్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఛార్మి మాట్లాడుతూ... "ఈ చిత్రానికి పనిచేసిన చాలామంది ఇందులో పనిచేస్తున్నారు. ఇదొక థ్రిల్లర్ మూవీ. అందులో ఎంత భయపెట్టించానో కానీ ఈ చిత్రంలో మాత్రం అందరినీ భయపెడతాను. కథ విన్నప్పుడే నాకు భయమేసింది. దానికంటే డబుల్ హిట్ అవుతుందని నమ్మకముంది" అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2010 | 3:15 pm

మళ్లీ "రెడీ" జంటతో స్రవంతి మూవీస్

రామ్, జెనీలియా అనగానే రెడీ చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ కాంబినేషన్లో మళ్లీ స్రవంతి మూవీస్ నూతన చిత్రాన్ని నిర్మిస్తోంది. సోమవారం రామానాయుడు స్టూడియోలో రామ్‌పై తీసిన ముహూర్తపు షాట్‌తో షూటింగ్ ఆరంభించారు. రెగ్యులర్ షూటింగ్ మే నెల నుంచి మొదలై సినిమా పూర్తయ్యే వరకూ కొనసాగుతుందని నిర్మాత స్రవంతి రవికిషోర్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చక్కని జంటగా ప్రేక్షకుల్లో పేరు సంపాదించిన జంట ఇది. మా బ్యానర్లో మూడవ సినిమా ఇది. ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాం. తొలిసారిగా చక్రి సంగీతం అందిస్తున్నారని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2010 | 3:04 pm

యువరాజ్ నా తమ్ముడులాంటి వాడు: ప్రీతి జింతా

అయ్యో.. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదంటే వినరేం... అంటూ బాలీవుడ్ నటి ప్రీతి జింతా తల బద్దలు కొట్టుకుంటోంది. తనతో నటించే యువ నటులతో తనకు లింకులు పెడుతూ వార్తలు రాయడంపై ప్రీతి మండి పడుతోంది. అంతేకాదు తన కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు మాజీ కెప్టెన్ యువరాజ్ సింగ్‌తోనూ కొందరు సంబంధం ఉందంటూ రాయడాన్ని ప్రీతి కొట్టి పారేసింది. యువరాజ్ సింగ్ తనకు తమ్ముడులాంటి వాడనీ, తన గుండెల్లో అతడిపై ప్రేమాభిమానాలు ఇంకా దాగున్నాయని చెప్పుకొచ్చింది. మరైతే సోదరునితో మసలుకునే విధానంలో తేడా ఉందనీ, మరీ రాసుకుపూసుకు తిరగడమే కాక ఏకంగా వాటేసుకోవడమేమిటని కొందరు విలేకరులు ప్రీతిని నిలదీశారు. అంతే... వారిని కొరకొరా చూస్తూ, " ఆనందం వచ్చినప్పుడు దాన్ని అలా షేర్ చేసుకున్నా. పట్టలేని సంతోషం వచ్చినప్పుడు ఇలా ప్రవర్తించాలని ఎవరూ గిరి గీసుకుని ప్రవర్తించరు. నా టీమ్ సభ్యులందరూ నాకు కుటుంబ సభ్యులు లాంటి వారే. యువరాజ్ చిన్న తమ్ముడు లాంటివాడు" అని చెప్పింది.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2010 | 11:24 am

మీ కళ్లు గుడ్డా.. గ్లోబెల్ ప్రచారం వద్దు: ప్రరాపా

ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌పై ప్రజారాజ్యం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పత్రికా యాజమాన్యానికి కళ్ళు లేవా అని ప్రశ్నించింది. ఒక పార్టీకి కొమ్ముకాసే గ్లోబెల్ ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలని ఆ పార్టీ నేతలు హితవు పలికారు.
Source: ఏపీ న్యూస్ | 22 Mar 2010 | 9:50 am

తెలంగాణ వ్యతిరేక పదాలు చూడలేదు: సీఎం.రోశయ్య

తాను ఆవిష్కరించిన స్పందన పుస్తకాన్ని పూర్తిగా చదవలేదని ముఖ్యమంత్రి కె.రోశయ్య స్పష్టం చేశారు. అందులో రచయిత పేర్కొన్న తెలంగాణ వ్యతిరేక వార్తలను తాను చూడలేదన్నారు. అలాంటి వార్తలు ఏవైనా ఉంటే అవి పూర్తిగా రచయితకు సంబంధించిన విషయమన్నారు.
Source: ఏపీ న్యూస్ | 22 Mar 2010 | 8:38 am

సమన్లలో హాజరయ్యే తేదీని పేర్కొనలేదు: నరేంద్ర మోడీ

2002లో చెలరేగిన గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తనకు పంపిన సమన్లలో విచారణకు హాజరుకావాల్సిన తేదీని స్పష్టంగా పేర్కొనలేదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఆయన సోమవారం తొలిసారి మీడియాకు బహిరంగ లేఖ రాశారు.
Source: జాతీయ | 22 Mar 2010 | 8:22 am

ఈ రోజుల్లో అంతా విప్పేసి చూపిస్తున్నారు: అక్కినేని

"సినిమా రంగానికి వచ్చి స్థిరపడినవారంతా ఈ రంగాన్ని "మదర్ ఇండస్ట్రీ" అంటారు. ఇక్కడ మదర్ అంటే మీకు తెలుసో తెలియదో కానీ.. అన్నివేళలా కంటికి రెప్పలా కాపాడే అమ్మ. అది సినీ ఇండస్ట్రీలో నిర్మాతే. నిర్మాతలే లేకపోతే సినిమాలు లేవు. అవి లేకపోతే మీ ముందు ఇలా ఏ హీరో నిలబడి మాట్లాడలేడు. దర్శకులు ఎవరైనా కావచ్చు. డబ్బులు పెట్టి తీసేవాడే మదర్" అంటూ.. మదర్ ఇండస్ట్రీ గురించి అక్కినేని నాగేశ్వరరావు సెలవిచ్చారు. మాయాబజార్ కలర్ సినిమా 50 రోజుల వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. "మాయాబజార్‌లో హీరో ఎవరు..? అనే ప్రశ్న చాలామంది నన్ను అడిగారు. ఎవరని చెప్పాలి. నా దృష్టిలో సావిత్ర అని చెప్పగలను. ఘటోత్కచునిగా ఆయన హావభావాలు పలికించడమే కాకుండా... స్త్రీగా ఆమె నటించిన హావభావాలు ఆ చిత్రానికి వన్నె తెచ్చాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2010 | 6:42 am

సుప్రీమ్ ద్వారా బాలకృష్ణ "సింహా" ఓవర్సీస్

నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'సింహా'ని ఓవర్సీస్‌లో సుప్రీమ్ రాజు విడుదల చేస్తున్నారు. 25 సెంటర్లలో 1000 షోలతో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు సుప్రీమ్ రాజు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడుతూ... గతంలో మగధీర ఓవర్సీస్ చేశాను. ఆ తర్వాత ఆర్య-2 చేశాను. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ చిత్రాన్ని అమెరికాలో విడుదల చేస్తున్నాం. ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2010 | 6:20 am

శ్రీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫిలిమ్ "రంగ ది దొంగ"

శ్రీకాంత్ హీరోగా సుధాకర్ నాయుడు దర్శత్వంలో గోల్డెన్ లయన్ ఫిలిమ్స్, గాడ్ ఫాదర్ ఫిలిమ్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం 'రంగ ది దొంగ'. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... దొంగ అనేది బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ ఫార్ములా. అందరు అగ్రతారలు దొంగగా నటించి విజయాలను కైవసం చేసుకున్నారు. ఆ పాత్రలతో పోలిస్తే శ్రీకాంత్ పోషించే దొంగ పాత్ర పూర్తి వైవిధ్యంగా ఉంటుంది. కథానాయిక విమలారామన్ ఇందులో పోలీస్ అధికారిణిగా నటిస్తోంది. ఆ పాత్ర తీరు తెన్నులు వినోదాత్మకంగా ఉంటుంది అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2010 | 6:07 am

యువరాజ్ నా తమ్ముడులాంటి వాడు: ప్రీతి జింతా

అయ్యో.. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదంటే వినరేం... అంటూ బాలీవుడ్ నటి ప్రీతి జింతా తల బద్దలు కొట్టుకుంటోంది. తనతో నటించే యువ నటులతో తనకు లింకులు పెడుతూ వార్తలు రాయడంపై ప్రీతి మండి పడుతోంది. అంతేకాదు తన కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు మాజీ కెప్టెన్ యువరాజ్ సింగ్‌తోనూ కొందరు సంబంధం ఉందంటూ రాయడాన్ని...
Source: వినోదం | 22 Mar 2010 | 5:56 am

"అణు" ప్రమాద పరిహార బిల్లును వ్యతిరేకిస్తాం: సుష్మా!

అణు ప్రమాద పరిహార బిల్లును తప్పకుండా వ్యతిరేకిస్తామని భారతీయ జనతా పార్టీ మహిళా సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టనున్న అణు పరిహార బిల్లు విదేశీ సంస్థలకు మేలు చేకూర్చేలా ఉందని అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈ బిల్లును తాము వ్యతిరేకించి తీరుతామన్నారు.
Source: జాతీయ | 22 Mar 2010 | 5:27 am

అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు: చిరు

సోమవారం విశాఖపట్టణంలో మెగాస్టార్ అభిమానులు ఏర్పాటు చేసిన ఆంతరంగిక సమావేశంలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు చిరంజీవిని సినిమాల్లో రీ-ఎంట్రీపై ప్రశ్నించినపుడు... నవ్వుతూ, అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడని సమాధానమిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 22 Mar 2010 | 4:28 am

నా భవిష్యత్‌ను అధిష్టానం నిర్ణయిస్తుందని: ధర్మపురి

తన భవిష్యత్‌ను పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. అలాగే, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పార్టీ చేసే అంశాన్ని కూడా పార్టీ హైకమాండ్‌కే వదిలి వేసినట్టు ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 22 Mar 2010 | 4:00 am

కడుపు రగిలి మాట్లాడుతున్నాం...: ప్రరాపా ఎమ్మెల్యేలు

తమ పార్టీపై కొన్న పత్రికలు, టీవీ ఛానల్స్ కావాలానే దురుద్దేశపూర్వకంగా కథనాలను ప్రసారం చేస్తున్నాయని ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆరోపించారు. తమ పీఆర్పీ రేటింగ్, సర్కులేషన్ పెంచుకునేందుకు ఇలాంటి ఎల్లో జర్నలిజానికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. తమ పార్టీ అధినేత చిరంజీని వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు, బలం పుంజుకుంటున్న పార్టీని నిర్వీర్యం చేసేందుకు ఆ ఛానల్ ఇలాంటి కథనాలను ప్రసారం చేసిందని వారు పేర్కొన్నారు. అందుకే కడపు రలిగి ఇలా మాట్లాడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 22 Mar 2010 | 3:20 am

టీవీ ఛానల్‌ కార్యాలయంపై ప్రరాపా కార్యకర్తల దాడి!

ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రజారాజ్యం పార్టీ బాక్స్ ఖాళీ అని ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ ఆదివారం ఒక కథనాన్ని ప్రసారం చేసింది. దీన్ని సహించలేని ఆ పార్టీ కార్యకర్తలు సోమవారం ఆ టీవీ ఛానల్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు. ముఖ్యంగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న పధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 22 Mar 2010 | 3:03 am