|
ఎయిర్‌టుఎయిర్ రీఫిల్లింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రయోగం సక్సెస్!గాలిలోనే ఇంధనం నింపుకునే ఎయిర్‌క్రాఫ్ట్‌ను పాకిస్థాన్ సోమవారం విజయవంతంగా ప్రయోగించింది. ప్రస్తుతం జరుగుతున్న హై మార్క్ - 2010 విన్యాసాల్లో భాగంగా ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా ప్రయోగించినట్టు పాకిస్థాన్ ఎయిర్‌పోర్స్ (పీఏఎఫ్) ప్రకటించింది. ఈ ప్రయోగం విజయంతో యుద్ధ విమానాలకు గాలిలోనే ఇంధనం నింపుకునే సౌకర్యాన్ని పాకిస్థాన్ కూడా సొంతం చేసుకుంది.Source: Yahoo! Telugu: News | 22 Mar 2010 | 9:24 am దేశీయ ఆర్థిక వృద్ధి 7.2 శాతానికి చేరుకుంటుంది: ప్రణబ్ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఆర్థిక వృద్ధి 7.2 శాతానికి చేరుకుంటుందని, అదే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతానికి చేరుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం బెంగుళూరులో వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 22 Mar 2010 | 9:18 am నా భవిష్యత్ అధిష్టానం నిర్ణయిస్తుందని: ధర్మపురితన భవిష్యత్‌ను పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. అలాగే, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పార్టీ చేసే అంశాన్ని కూడా పార్టీ హైకమాండ్‌కే వదిలి వేసినట్టు ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 22 Mar 2010 | 9:04 am కడుపు రగిలి మాట్లాడుతున్నాం...: ప్రరాపా ఎమ్మెల్యేలుతమ పార్టీపై కొన్న పత్రికలు, టీవీ ఛానల్స్ కావాలానే దురుద్దేశపూర్వకంగా కథనాలను ప్రసారం చేస్తున్నాయని ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆరోపించారు. తమ పీఆర్పీ రేటింగ్, సర్కులేషన్ పెంచుకునేందుకు ఇలాంటి ఎల్లో జర్నలిజానికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. తమ పార్టీ అధినేత చిరంజీని వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు, బలం పుంజుకుంటున్న పార్టీని నిర్వీర్యం చేసేందుకు ఆ ఛానల్ ఇలాంటి కథనాలను ప్రసారం చేసిందని వారు పేర్కొన్నారు. అందుకే కడపు రలిగి ఇలా మాట్లాడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 22 Mar 2010 | 8:49 am టీవీ ఛానల్ కార్యాలయంపై ప్రరాపా కార్యకర్తల దాడి!ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రజారాజ్యం పార్టీ బాక్స్ ఖాళీ అని ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ ఆదివారం ఒక కథనాన్ని ప్రసారం చేసింది. దీన్ని సహించలేని ఆ పార్టీ కార్యకర్తలు సోమవారం ఆ టీవీ ఛానల్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు. ముఖ్యంగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న పధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.Source: Yahoo! Telugu: News | 22 Mar 2010 | 8:32 am నష్టాల్లోనే కొనసాగుతోన్న బాంబే స్టాక్ మార్కెట్బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే కొనసాగుతోంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీ నష్టానికి గురైన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 93 పాయింట్లు క్షీణించి, 17,485 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 35 పాయింట్లు పతనమై, 5,227 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 22 Mar 2010 | 8:26 am తమిళనాడుకు మూడు గ్యాస్ పైపులైన్లు: సుదర్శన్వచ్చే రెండు సంవత్సరాలలో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా మూడు గ్యాస్ పైపులైన్లను ఏర్పాటు చేయనున్నట్లు పెట్రోలియం శాఖాధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గెయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ బెంగుళూరు నుంచి చెన్నైకి ఓ పైపులైనును ఏర్పాటు చేయనున్నట్లు పెట్రోలియం శాఖ కార్యదర్శి సుదర్శన్ చెన్నైలో మీడియాకు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 22 Mar 2010 | 7:50 am పాక్‌తో అణు ఒప్పందం: ఒబామా ప్రభుత్వం సుముఖత!?పాకిస్థాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు బరాక్ ఒబామా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. భారత్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం తరహాలోనే అమెరికా ప్రభుత్వం తమ దేశంతోనూ అణు ఒప్పందానికి సుముఖత చూపాలని పాక్ విజ్ఞప్తికి అనుగుణంగా యూఎస్ ప్రభుత్వం స్పందించినట్లు సమాచారం.Source: Yahoo! Telugu: News | 22 Mar 2010 | 7:33 am ఓబుళాపురం గనుల రీసర్వేకు సుప్రీం ఆదేశంఓబుళాపురం గనుల తవ్వకాలు సరిహద్దులతో సంబంధం లేకుండా అక్రమంగా జరుగుతున్నాయని దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై సుమారు గంటపాటు విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఓబుళాపురంలో లీజుకిచ్చిన గనుల ప్రాంతాలను తిరిగి రీ సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మొదటి సర్వేను ఈ నెల 26 నుంచి ప్రారంభించాలని పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 22 Mar 2010 | 7:26 am రెండు నెలల్లో తగ్గనున్న ద్రవ్యోల్బణం: అహ్లువాలియాదేశంలో ప్రస్తుతం రబీ సీజన్ పంట సమృద్ధిగా దిగుబడి అయ్యే సూచనలు కనపడుతున్నాయని, దీంతో వచ్చే రెండు నెలల్లో ద్రవ్యోల్బణం తగ్గుతుందని సోమవారం కేంద్ర ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మెన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఆశాభావం వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 22 Mar 2010 | 7:16 am ఈ రోజుల్లో అంతా విప్పేసి చూపిస్తున్నారు: అక్కినేని"సినిమా రంగానికి వచ్చి స్థిరపడినవారంతా ఈ రంగాన్ని "మదర్ ఇండస్ట్రీ" అంటారు. ఇక్కడ మదర్ అంటే మీకు తెలుసో తెలియదో కానీ.. అన్నివేళలా కంటికి రెప్పలా కాపాడే అమ్మ. అది సినీ ఇండస్ట్రీలో నిర్మాతే. నిర్మాతలే లేకపోతే సినిమాలు లేవు. అవి లేకపోతే మీ ముందు ఇలా ఏ హీరో నిలబడి మాట్లాడలేడు. దర్శకులు ఎవరైనా కావచ్చు. డబ్బులు పెట్టి తీసేవాడే మదర్" అంటూ.. మదర్ ఇండస్ట్రీ గురించి అక్కినేని నాగేశ్వరరావు సెలవిచ్చారు. మాయాబజార్ కలర్ సినిమా 50 రోజుల వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. "మాయాబజార్‌లో హీరో ఎవరు..? అనే ప్రశ్న చాలామంది నన్ను అడిగారు. ఎవరని చెప్పాలి. నా దృష్టిలో సావిత్ర అని చెప్పగలను. ఘటోత్కచునిగా ఆయన హావభావాలు పలికించడమే కాకుండా... స్త్రీగా ఆమె నటించిన హావభావాలు ఆ చిత్రానికి వన్నె తెచ్చాయి.Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2010 | 6:42 am సుప్రీమ్ ద్వారా బాలకృష్ణ "సింహా" ఓవర్సీస్నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'సింహా'ని ఓవర్సీస్‌లో సుప్రీమ్ రాజు విడుదల చేస్తున్నారు. 25 సెంటర్లలో 1000 షోలతో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు సుప్రీమ్ రాజు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడుతూ... గతంలో మగధీర ఓవర్సీస్ చేశాను. ఆ తర్వాత ఆర్య-2 చేశాను. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ చిత్రాన్ని అమెరికాలో విడుదల చేస్తున్నాం. ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2010 | 6:20 am శ్రీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫిలిమ్ "రంగ ది దొంగ"శ్రీకాంత్ హీరోగా సుధాకర్ నాయుడు దర్శత్వంలో గోల్డెన్ లయన్ ఫిలిమ్స్, గాడ్ ఫాదర్ ఫిలిమ్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం 'రంగ ది దొంగ'. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... దొంగ అనేది బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ ఫార్ములా. అందరు అగ్రతారలు దొంగగా నటించి విజయాలను కైవసం చేసుకున్నారు. ఆ పాత్రలతో పోలిస్తే శ్రీకాంత్ పోషించే దొంగ పాత్ర పూర్తి వైవిధ్యంగా ఉంటుంది. కథానాయిక విమలారామన్ ఇందులో పోలీస్ అధికారిణిగా నటిస్తోంది. ఆ పాత్ర తీరు తెన్నులు వినోదాత్మకంగా ఉంటుంది అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Mar 2010 | 6:07 am నా భవిష్యత్ అధిష్టానం నిర్ణయిస్తుందని: ధర్మపురితన భవిష్యత్‌ను పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. అలాగే, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పార్టీ చేసే అంశాన్ని కూడా పార్టీ హైకమాండ్‌కే వదిలి వేసినట్టు ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 22 Mar 2010 | 3:35 am కడుపు రగిలి మాట్లాడుతున్నాం...: ప్రరాపా ఎమ్మెల్యేలుతమ పార్టీపై కొన్న పత్రికలు, టీవీ ఛానల్స్ కావాలానే దురుద్దేశపూర్వకంగా కథనాలను ప్రసారం చేస్తున్నాయని ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆరోపించారు. తమ పీఆర్పీ రేటింగ్, సర్కులేషన్ పెంచుకునేందుకు ఇలాంటి ఎల్లో జర్నలిజానికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. తమ పార్టీ అధినేత చిరంజీని వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు, బలం పుంజుకుంటున్న పార్టీని నిర్వీర్యం చేసేందుకు ఆ ఛానల్ ఇలాంటి కథనాలను ప్రసారం చేసిందని వారు పేర్కొన్నారు. అందుకే కడపు రలిగి ఇలా మాట్లాడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 22 Mar 2010 | 3:20 am టీవీ ఛానల్ కార్యాలయంపై ప్రరాపా కార్యకర్తల దాడి!ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రజారాజ్యం పార్టీ బాక్స్ ఖాళీ అని ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ ఆదివారం ఒక కథనాన్ని ప్రసారం చేసింది. దీన్ని సహించలేని ఆ పార్టీ కార్యకర్తలు సోమవారం ఆ టీవీ ఛానల్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు. ముఖ్యంగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న పధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.Source: ఏపీ న్యూస్ | 22 Mar 2010 | 3:03 am తమిళనాడుకు మూడు గ్యాస్ పైపులైన్లు: సుదర్శన్వచ్చే రెండు సంవత్సరాలలో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా మూడు గ్యాస్ పైపులైన్లను ఏర్పాటు చేయనున్నట్లు పెట్రోలియం శాఖాధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గెయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ బెంగుళూరు నుంచి చెన్నైకి ఓ పైపులైనును ఏర్పాటు చేయనున్నట్లు పెట్రోలియం శాఖ కార్యదర్శి సుదర్శన్ చెన్నైలో మీడియాకు తెలిపారు.Source: జాతీయ | 22 Mar 2010 | 2:21 am ఓబుళాపురం గనుల రీసర్వేకు సుప్రీం ఆదేశంఓబుళాపురం గనుల తవ్వకాలు సరిహద్దులతో సంబంధం లేకుండా అక్రమంగా జరుగుతున్నాయని దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై సుమారు గంటపాటు విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఓబుళాపురంలో లీజుకిచ్చిన గనుల ప్రాంతాలను తిరిగి రీ సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మొదటి సర్వేను ఈ నెల 26 నుంచి ప్రారంభించాలని పేర్కొంది.Source: జాతీయ | 22 Mar 2010 | 1:57 am పశ్చిమబెంగాల్‌లో విధ్వంసం సృష్టించిన మావోయిస్టులుపశ్చిమబెంగాల్లో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. పశ్చిమబెంగాల్‌లోని రైల్వే ట్రాక్‌ను సోమవారం మావోయిస్టులు పేల్చి వేశారు. గోడపియాసల్-మిడ్నాపూర్ రైల్ ట్రాక్‌లో డిటోనేటర్లు, డైనమైట్లను అమర్చి నక్సలైట్లు పేల్చేశారని పోలీసులు తెలిపారు. దీంతో ఆ మార్గం మీదుగా నడిచే పలు రైళ్ళ రాకపోకలకు అంతరాయం కలిగింది. మావోలు పేల్చేసిన ట్రాక్‌ల వద్ద రైల్వే సిబ్బంది మరమ్మత్తు కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.Source: జాతీయ | 22 Mar 2010 | 1:36 am క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రిరాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య అధికారికంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 22 Mar 2010 | 1:09 am ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు: 9 మంది డీబార్రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు సోమవారం ఉదంయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమైనాయి. ఈ పరీక్షలు వచ్చే నెల ఎనిమిదవ తేదీవరకు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,755 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసామని, ఇందులో 13.63 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభమైన తొలిరోజు వరంగల్ జిల్లాలో తొమ్మిదిమంది విద్యార్థులు డీబార్ అయ్యారు.Source: ఏపీ న్యూస్ | 22 Mar 2010 | 12:51 am ఐదు రాష్ట్రాలకు భాజపా కొత్త అధ్యక్షుల ఎంపిక!భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఐదు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ఎంపిక చేసింది. జాతీయ కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా ఉన్న ఇద్దరిని రెండు రాష్ట్రాలకు అధ్యక్షులుగా ఆ పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ నియమించారు. మరో ముగ్గురు కొత్తవారిని రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా నియమించారు.Source: జాతీయ | 21 Mar 2010 | 11:47 pm బుల్లితెర యాంకర్‌గా మారనున్న రాములమ్మ!తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ నుంచి తెలంగాణ టీవీ ఛానల్ ప్రసారాలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే టెస్టింగ్ దశలో ఉన్న ఈ టీవీ ప్రసారాలను గురువారం నుంచి లాంఛనంగా ప్రారంభమవుతాయి. ఈ టీవీలో ప్రసారమయ్యే ఒక కార్యక్రమంలో మెదక్ ఎంపీ, ఆ పార్టీ మహిళా నేత, సినీ నటి విజయశాంతి యాంకర్‌గా పని కనిపించనున్నారు.Source: ఏపీ న్యూస్ | 21 Mar 2010 | 11:22 pm నేటి నుంచి మావోల బంద్: ఆరు రాష్ట్రాల్లో గట్టి భద్రత!కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ హంట్ ఆపరేషన్‌తో పాటు.. ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు శాఖమూరి బూటకపు ఎ1న్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు సోమవారం నుంచి 48 గంటల పాటు బంద్‌ను పాటిస్తున్నారు. ఈ బంద్ ప్రభావం ఆరు రాష్ట్రాల్లో ఉంటుంది.Source: జాతీయ | 21 Mar 2010 | 10:07 pm 2002 అల్లర్ల కేసు: సిట్ ఎదుట హాజరుకాని మోడీసుప్రీంకోర్టు ధర్మాసనం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఎదుట గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం హాజరుకాలేదు. సిట్ విచారణ నుంచి తప్పించుకునేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఆయన తరపు న్యాయనిపుణులు అన్వేషిస్తున్నారు.Source: జాతీయ | 21 Mar 2010 | 9:57 pm తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చుతున్న ధర్మపురి!తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ నీరుగార్చుతున్నారని పలువురు తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారు. ఎపుడో దుకాణం మూసేసిన తెలంగాణ రాష్ట్ర సారథ్య కమిటీని మళ్లీ తెరపైకి తీసుకుని రావడంలో కూడా మతలబు ఇదేనని, దీని వెనుక డీఎస్ పాత్ర ఉన్నట్టు వారు ఆరోపిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 21 Mar 2010 | 6:30 am ఎన్‌హెచ్9కి వైఎస్సార్ పేరు: మంత్రి ఆర్‌పిఎన్ సింగ్ హామీదివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరును తొమ్మిదవ నెంబర్ జాతీయ రహదారికి పెట్టాలని వచ్చిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని కేంద్ర రహదారులు, రవాణా శాఖ సహాయ మంత్రి ఆర్.పి.ఎన్.సింగ్ హామీ ఇచ్చారు. ఎన్‌హెచ్-9 విస్తరణ పనుల ప్రారంభోత్సవానికి ఆదివారం హైదరాబాద్ విచ్చేసిన కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి ఆర్‌పిఎన్. సింగ్‌ను పలువురు కాంగ్రెస్ నేతలు కలిశారు.Source: ఏపీ న్యూస్ | 21 Mar 2010 | 6:21 am పచ్చని కొండ ఈ నల్గొండ జిల్లా: ముఖ్యమంత్రి రోశయ్యనాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ నల్గొండ జిల్లా పచ్చని కొండగా మారిందని ముఖ్యమంత్రి కె.రోశయ్య తెలిపారు. ఆయన ఆదివారం ఈ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిరిసించర్లలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా నేడు పచ్చని కొండగా మారిందన్నారు.Source: ఏపీ న్యూస్ | 21 Mar 2010 | 6:06 am ఉద్యమాన్ని నడపడంలో నేతలు విఫలం: కోదండరామ్తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడపడంలో రాజకీయ నేతలు పూర్తిగా విఫలమయ్యారని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఛైర్మన్ ఆచార్య కోదండరామ్ ఆరోపించారు. అయితే, ప్రజల్లో మాత్రం ఉద్యమం ఎంతో బలంగా ఉందన్నారు.Source: ఏపీ న్యూస్ | 21 Mar 2010 | 5:58 am సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం సక్సెస్!సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒరిస్సా తీరంలోని బంగాళాఖాతంలో యుద్ధనౌక ఐఎన్ఎస్ రణ్‌వీర్ నుంచి ఈ క్షిపణి ప్రయోగం చేపట్టగా, ఇది విజయవంతమైనట్టు నేవీ అధికారులు వెల్లడించారు.Source: జాతీయ | 21 Mar 2010 | 5:43 am 2015 నాటికి 1.6 మిలియన్ల ప్రజలకు గుండెపోటుదేశంలో గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య వచ్చే 2015 సంవత్సరానికి ఒక్కో యేడాది 1.6 మిలియన్లకు చేరుకోనుంది. దీనివల్ల కనీసం మూడింట ఒకటో వంతు ప్రజలు అంగ వికలాంగులుగా మారే అవకాశం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ వెల్లడించింది.Source: జాతీయ | 21 Mar 2010 | 2:57 am తీవ్రవాదంపై శ్రద్ధ చూపని యూపీఏ ప్రభుత్వం: లెఫ్ట్దేశంలో నానాటికీ పెరిగిపోతున్న తీవ్రవాద దుశ్చర్యలను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యల పట్ల కేంద్రం అశ్రద్ధ చూపుతోందని వామపక్ష పార్టీలు ఆరోపించారు. ముఖ్యంగా, ముంబై దాడులకు సూత్రధారిగా నేరాన్ని అంగీకరించిన అమెరికా జాతీయుడు డేవిడ్ హెడ్లీ వ్యవహారంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తోందని దుయ్యబట్టాయి. అమెరికాతో కుదుర్చుకున్న రహస్య అజెండా కారణంగా భారత్ ఇలా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.Source: జాతీయ | 21 Mar 2010 | 2:26 am
|