|
7.5 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం ఆదా!స్వదేశంలో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇస్తూ తీసుకున్న నిర్ణయంతో 7.5 బిలియన్ డాలర్ల (రూ.34500 కోట్లు) విదేశీ మారకద్రవ్యం ఆదా కానుంది. ఈ విషయాన్ని ఇండస్ట్రీస్ బాడీ అసోచామ్ వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 21 Mar 2010 | 9:30 am 2015 నాటికి 1.6 మిలియన్ల ప్రజలకు గుండెపోటుదేశంలో గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య వచ్చే 2015 సంవత్సరానికి ఒక్కో యేడాది 1.6 మిలియన్లకు చేరుకోనుంది. దీనివల్ల కనీసం మూడింట ఒకటో వంతు ప్రజలు అంగ వికలాంగులుగా మారే అవకాశం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 21 Mar 2010 | 8:26 am తీవ్రవాదంపై శ్రద్ధ చూపని యూపీఏ ప్రభుత్వం: లెఫ్ట్దేశంలో నానాటికీ పెరిగిపోతున్న తీవ్రవాద దుశ్చర్యలను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యల పట్ల కేంద్రం అశ్రద్ధ చూపుతోందని వామపక్ష పార్టీలు ఆరోపించారు. ముఖ్యంగా, ముంబై దాడులకు సూత్రధారిగా నేరాన్ని అంగీకరించిన అమెరికా జాతీయుడు డేవిడ్ హెడ్లీ వ్యవహారంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తోందని దుయ్యబట్టాయి. అమెరికాతో కుదుర్చుకున్న రహస్య అజెండా కారణంగా భారత్ ఇలా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 21 Mar 2010 | 7:55 am నవాజ్ షరీఫ్ - లాడెన్‌ల మధ్య ఐదు సార్లు భేటీ!పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ అల్‌ఖైదీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ల మధ్య ఐదు సార్లు భేటీ జరిగింది. ఈ భేటీని పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) మాజీ ఉన్నతాధికారి ఖలీద్ ఖ్వాజా ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఖ్వాజా స్వయంగా వెల్లడించారు. దీంతో ఐఎస్ఐకు అల్‌ఖైదీ తీవ్రవాద సంస్థలకు మధ్య సంబంధం ఉన్నట్టు మరోమారు రూఢీ అయింది.Source: Yahoo! Telugu: News | 21 Mar 2010 | 7:39 am ప్రత్యక్ష పన్నుల రూపేణా రూ.3.54 లక్షల కోట్లు వసూలు!ఈనెల 18వ తేదీ వరకు ప్రత్యక్ష పన్నుల రూపేణా రూ.3.54 లక్షల కోట్ల రూపాయలు వసూలైనట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 3.87 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇందులో కార్పొరేట్ పన్నుల రూపేణా రూ.2.34లక్షల కోట్లు, ఆదాయం పన్ను ద్వారా రూ.1.2 లక్షల కోట్లు వసూలు చేసినట్టు పేర్కొంది. ఇతర శాఖల ద్వారా 78 వేల కోట్ల రూపాయలు వసూలైనట్టు తెలిపింది.Source: Yahoo! Telugu: News | 21 Mar 2010 | 7:27 am రేపు సీఎం రోశయ్య క్యాంపు కార్యాలయ ప్రవేశంముఖ్యమంత్రి కె.రోశయ్య సీఎం క్యాంపు కార్యాలయ ప్రవేశం సోమవారం జరుగనుంది. ఉదయం 10.26 నిమిషాలకు ముఖ్యమంత్రి కార్యాలయంలోకి అడుగుపెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. సోమవారం మంచిరోజుగా వేదడింతులు వెల్లడించడంతో ఆ రోజున సీఎం క్యాంపు కార్యాలయంలోని అడుగుపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. దీనికి ముఖ్యమంత్రి సమ్మంతించారు.Source: Yahoo! Telugu: News | 21 Mar 2010 | 6:52 am బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు పటిష్ట చర్యలు: ఆనంరాష్ట్రంలో వినియోగంలో ఉన్న బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు పటిష్టమైన చర్యలు చేపడుతామని రాష్ట్ర నగర పాలక వ్యవహారాల శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నెల్లూరు పట్టాణాభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన హయాంలో 12200 కోట్లరూపాయల నిధులతో వివిధ అభవృద్ధి పనులు చేపట్టినట్టు మంత్రి ఆనం వివరించారు.Source: Yahoo! Telugu: News | 21 Mar 2010 | 6:44 am ఆధిపత్యం కోసం తెదేపా-కాంగ్రెస్ పోటాపోటీ: చిరంజీవిరాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్, విపక్ష తెలుగుదేశం పార్టీలు ప్రజా సమస్యల పరిష్కారానికి ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. ముఖ్యంగా, ప్రధాన ప్రతిపక్షంగా తెదేపా తన బాధ్యతను నెరవేర్చడంలో పూర్తిగా విఫమైందని ఆయన దుయ్యబట్టారు.Source: Yahoo! Telugu: News | 21 Mar 2010 | 6:34 am ల్యాండ్ బ్యాంకును నెలకొల్పిన బెంగాల్ ప్రభుత్వంరాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమలకు అవసరమైన భూములను సేకరించే నిమిత్తం పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేసింది. ఈ బ్యాంకు ద్వారా నాలుగు వేల ఎకరాల భూమిని సేకరించనుంది. అంతేకాకుండా బ్యాంకు ఏర్పాటుతో భూముల సేకరణ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.Source: Yahoo! Telugu: News | 21 Mar 2010 | 5:58 am ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధం: బరాక్ ఒబామాఅణ్వస్త్రాలను సమకూర్చుకోవాలన్న ఇరాన్ ఆకాంక్షపై ఆ దేశంతో చర్చలు జరుపడానికి తాము సంసిద్ధమేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. అలాగే, ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఎలాంటి సెన్సార్‌షిప్ భయం లేకుండా ఉపయోగించుకునేలా చూస్తామని ఆయన తాజాగా హామీ ఇచ్చారు.Source: Yahoo! Telugu: News | 21 Mar 2010 | 5:32 am 2015 నాటికి 1.6 మిలియన్ల ప్రజలకు గుండెపోటుదేశంలో గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య వచ్చే 2015 సంవత్సరానికి ఒక్కో యేడాది 1.6 మిలియన్లకు చేరుకోనుంది. దీనివల్ల కనీసం మూడింట ఒకటో వంతు ప్రజలు అంగ వికలాంగులుగా మారే అవకాశం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ వెల్లడించింది.Source: జాతీయ | 21 Mar 2010 | 2:57 am తీవ్రవాదంపై శ్రద్ధ చూపని యూపీఏ ప్రభుత్వం: లెఫ్ట్దేశంలో నానాటికీ పెరిగిపోతున్న తీవ్రవాద దుశ్చర్యలను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యల పట్ల కేంద్రం అశ్రద్ధ చూపుతోందని వామపక్ష పార్టీలు ఆరోపించారు. ముఖ్యంగా, ముంబై దాడులకు సూత్రధారిగా నేరాన్ని అంగీకరించిన అమెరికా జాతీయుడు డేవిడ్ హెడ్లీ వ్యవహారంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తోందని దుయ్యబట్టాయి. అమెరికాతో కుదుర్చుకున్న రహస్య అజెండా కారణంగా భారత్ ఇలా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.Source: జాతీయ | 21 Mar 2010 | 2:26 am రేపు సీఎం రోశయ్య క్యాంపు కార్యాలయ ప్రవేశంముఖ్యమంత్రి కె.రోశయ్య సీఎం క్యాంపు కార్యాలయ ప్రవేశం సోమవారం జరుగనుంది. ఉదయం 10.26 నిమిషాలకు ముఖ్యమంత్రి కార్యాలయంలోకి అడుగుపెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. సోమవారం మంచిరోజుగా వేదడింతులు వెల్లడించడంతో ఆ రోజున సీఎం క్యాంపు కార్యాలయంలోని అడుగుపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. దీనికి ముఖ్యమంత్రి సమ్మంతించారు.Source: ఏపీ న్యూస్ | 21 Mar 2010 | 1:22 am బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు పటిష్ట చర్యలు: ఆనంరాష్ట్రంలో వినియోగంలో ఉన్న బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు పటిష్టమైన చర్యలు చేపడుతామని రాష్ట్ర నగర పాలక వ్యవహారాల శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నెల్లూరు పట్టాణాభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన హయాంలో 12200 కోట్లరూపాయల నిధులతో వివిధ అభవృద్ధి పనులు చేపట్టినట్టు మంత్రి ఆనం వివరించారు.Source: ఏపీ న్యూస్ | 21 Mar 2010 | 1:15 am ఆధిపత్యం కోసం తెదేపా-కాంగ్రెస్ పోటాపోటీ: చిరంజీవిరాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్, విపక్ష తెలుగుదేశం పార్టీలు ప్రజా సమస్యల పరిష్కారానికి ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. ముఖ్యంగా, ప్రధాన ప్రతిపక్షంగా తెదేపా తన బాధ్యతను నెరవేర్చడంలో పూర్తిగా విఫమైందని ఆయన దుయ్యబట్టారు.Source: ఏపీ న్యూస్ | 21 Mar 2010 | 1:05 am భారత్‌లో విధ్వంసం సృష్టిస్తాం: తీవ్రవాదుల హెచ్చరికభారత్లో యధేచ్చగా దాడులు నిర్వహిస్తూ విధ్వంసం సృష్టిస్తామని పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న తీవ్రవాద సంస్థలు మరోమారు హెచ్చరించాయి. దీంతో దేశంలోని అన్ని రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, కీలక పర్యాటక ప్రాంతాలు, పుణ్యస్థానాల వద్ద గట్టిభద్రతను ఏర్పాటు చేశారు.Source: జాతీయ | 20 Mar 2010 | 11:46 pm సెక్స్ ఆరోపణలు వచ్చిన బాబాలకు ఉరిశిక్ష: రాందేవ్ఆధ్యాత్మిక ముసుగులో రాసలీలలు నిర్వహించే బాబాలను ఉరి తీయాలని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాతో పాటు దేశంలోని పలువురు బాబాలు అభిప్రాయపడ్డారు. నానాటికీ అవినీతిమయమవుతున్న రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు స్వాభిమాన్ అనే పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు రాందేవ్ ప్రకటించిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 20 Mar 2010 | 10:08 pm "వధువు" ఎవరో తెలుసా..? అమృతసర్ అమ్మాయి..!: డివివిఅల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ దర్శకుడిగా యూనివర్సల్ మీడియా పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం "వరుడు" ఈ నెల 31 ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికైనా "వధువు" ఎవరనే విషయాన్ని చెప్పలేనని నిర్మాత శనివారంనాడు మీడియాతో చెప్పారు. వధువు గురించి రకరకాల కథనాలు వస్తున్నాయని, సినిమాలో ఇంటర్‌వెల్‌కు ముందే వధువును చూపిస్తామని అన్నారు. వధువు పాత్ర పోషించిన అమ్మాయి అమృతసర్‌కు చెందిందని మాత్రం చెప్పారు. ఆమె నటీమణా? కాదా? అనే రిలీజ్‌నాడే తెలియజేస్తామని నిర్మాత అన్నారు. అసలు హీరో కూడా పెండ్లి చూపుల్లోనే ఆ అమ్మాయిని చూస్తాడని, ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడటం, పెండ్లి తంతు ఐదు రోజులు జరగడం నేపథ్యంలో "వరుడు" సినిమా రూపొందిందని నిర్మాత వెల్లడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Mar 2010 | 11:41 am ఏప్రిల్ 9న వస్తోన్న తనీష్, మధురిమల "మౌనరాగం"తనీష్, మధురిమ, సుహాసిని కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం "మౌనరాగం". ఈ చిత్రాన్ని వచ్చేనెల తొమ్మిదో తేదీన విడుదలచేస్తున్నామని నిర్మాత శాన నాగ అశోక్‌కుమార్ చెప్పారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి మాటల రచయిత చింతపల్లి రమణ మాట్లాడుతూ.. "వసంతం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రాలు తీసిన పతాకంపై మరో మంచి చిత్రం వస్తుంది. ప్రేమలోనే కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. హీరోహీరోయిన్లు కథాపరంగా చక్కగా సరిపోయారు. డైలాగ్‌ల పరంగా అరుంథతి ఎంతపేరు తెచ్చిందో ఈ చిత్రానికి కూడా నాకు అంతే పేరు వస్తుందని నమ్ముతున్నాను" అని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Mar 2010 | 11:19 am శరవేగంగా కృష్ణుడి "పప్పు" సినిమా షూటింగ్!కృష్ణుడు, సుబ్బరాజు, దీపిక కాంబినేషన్‌లో "పప్పు" అనే చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఆర్య ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సపన్‌సుపర్తి దర్శకత్వంలో ప్రవీణ్‌రెడ్డి నల్లా, నగేష్ యాడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. " నేను అష్టాచమ్మాకు కోడైరక్టర్‌గా పనిచేశాను. అప్పుడే కథ రాసుకున్నాను. కృష్ణుడు మంచి పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో సుబ్బరాజు పాత్ర కూడా చాలా కీలకమైంది. స్నేహం నేపథ్యంలో సాగే చిత్రమిది" అని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Mar 2010 | 11:08 am "బెట్టింగ్ బంగార్రాజు" ఆడియో విడుదల"బెట్టింగ్ బంగార్రాజు" అనే పేరు వినగానే ఇది పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని అర్థమవుతుంది. సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వినోద భరిత చిత్రాలకు కేర్ఆఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న హీరో నరేష్ ఈ చిత్రకథానాయకుడైతే, నాయిక ఇందులో అతనితో జోడీ కడుతోంది. వినోదాత్మక చిత్రాలను రూపొందించడంలో ప్రత్యేకతను కనబరిచే దర్శకుడు ఇ. సత్తిబాబు మరోసారి ప్రేక్షకుల ప్రశంసలందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో మయూరి కంపెనీ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. ప్రముఖ గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, అనంతశ్రీరామ్‌లు ఇందులోని గీతాలను రచించారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Mar 2010 | 10:55 am ఏప్రిల్‌లో అక్కినేని-శ్రీహరి-సాయిరాంశంకర్‌ల సినిమా షూటింగ్!ఆరోప్రాణం, పవిత్ర ప్రేమ, కృష్ణబాబు, తిరుమల తిరుపతి వెంకటేశ, అల్లరి రాముడు, అడవిరాముడు, ఒక ఊరిలో వంటి హిట్ చిత్రాల్ని నిర్మించిన ఫ్రెండ్లీ మూవీస్ అధినేత చంటి అడ్డాల తాజాగా నిర్మిస్తున్న భారీ చిత్రంలో డా.అక్కినేని నాగేశ్వరరావు, రియల్‌స్టార్ శ్రీహరి, "బంపర్ ఆఫర్" హీరో సాయిరాం శంకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం గురించి హీరో సాయిరాం శంకర్ మాట్లాడుతూ.. "బంపర్ ఆఫర్ హిట్ అయిన తర్వాత హీరోగా నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ చంటి అడ్డాల నిర్మిస్తున్న ఈ చిత్రం కథ ఎంతో నచ్చి పూర్తిగా దీనిమీదే దృష్టి సారించాను. స్టూడెంట్ నెం.1, నిన్నేపెళ్ళాడుతా వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన పృథ్వితేజ ఈ చిత్రానికి అద్భుతమైన కథ సిద్ధం చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Mar 2010 | 10:12 am ఉద్యమం కోసం త్వరలోనే తెలంగాణ దినపత్రిక : కేసీఆర్తెలంగాణ ప్రజల కోసం త్వరలోనే తెలంగాణ దినపత్రికను ప్రారంభించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు వెల్లడించారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ఈ పత్రిక నడుస్తుందన్నారు. శనివారం హైదరాబాద్‌లో "వీర తెలంగాణ" అనే పేరుతో ప్రచురించనున్న మాసపత్రికను ఆయన ఆవిష్కరించారు.Source: ఏపీ న్యూస్ | 20 Mar 2010 | 8:47 am రేపటి నుంచి తెలంగాణ ఉద్యమ బస్సు యాత్ర!తెలంగాణ ఉద్యమ బస్సు యాత్ర ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. ఆ ప్రాంతంలోని తొమ్మిది జిల్లాల్లో ఈ యాత్ర సాగుతుంది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సు యాత్రలో తెలంగాణ ఐకాస కన్వీనర్ ఆచార్య కోదండరామ్, ఆ ప్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్వామిగౌడ్, రాష్ట్ర నేతలు విఠల్, మాజీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొంటారు.Source: ఏపీ న్యూస్ | 20 Mar 2010 | 6:39 am అక్రమాలు నిరూపిస్తా.. రాజకీయాల్లో కొనసాగుతా: బాబుప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల పంపిణీలో చోటు చేసుకుంటున్న అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. ఈ పథకంలో జరుగుతున్న అక్రమాలపై తాము వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోయిందన్నారు.Source: ఏపీ న్యూస్ | 20 Mar 2010 | 6:31 am "వధువు" ఎవరో తెలుసా..? అమృతసర్ అమ్మాయి..!: డివివిఅల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ దర్శకుడిగా యూనివర్సల్ మీడియా పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం "వరుడు" ఈ నెల 31 ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికైనా "వధువు" ఎవరనే విషయాన్ని చెప్పలేనని నిర్మాత శనివారంనాడు మీడియాతో చెప్పారు. వధువు గురించి రకరకాల కథనాలు వస్తున్నాయని...Source: వినోదం | 20 Mar 2010 | 6:17 am మావోల దుశ్చర్య: అధికారుల కిడ్నాప్.. ఆపై విడుదలజార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు శనివారం ఓ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఏకంగా ఐదుగురు ప్రభుత్వ అధికారులను వారు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌కు గురైన వారిలో అడిషినల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కూడా ఉన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని లతేహార్ జిల్లాలో ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. కొన్ని గంటల పాటు బందీలుగా పెట్టుకున్న తర్వాత వీరిని క్షేమంగా విడుదల చేసినట్టు పోలీసులు వెల్లడించారు.Source: జాతీయ | 20 Mar 2010 | 5:50 am ఏప్రిల్ 9న వస్తోన్న తనీష్, మధురిమల "మౌనరాగం"తనీష్, మధురిమ, సుహాసిని కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం "మౌనరాగం". ఈ చిత్రాన్ని వచ్చేనెల తొమ్మిదో తేదీన విడుదలచేస్తున్నామని నిర్మాత శాన నాగ అశోక్‌కుమార్ చెప్పారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి మాటల రచయిత చింతపల్లి రమణ మాట్లాడుతూ.. "వసంతం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రాలు తీసిన పతాకంపై మరో మంచి చిత్రం వస్తుంది. ప్రేమలోనే కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. హీరోహీరోయిన్లు కథాపరంగా చక్కగా సరిపోయారు. డైలాగ్‌ల పరంగా అరుంథతి ఎంతపేరు తెచ్చిందో ఈ చిత్రానికి కూడా నాకు అంతే పేరు వస్తుందని నమ్ముతున్నాను" అని అన్నారు.Source: వినోదం | 20 Mar 2010 | 5:49 am శరవేగంగా కృష్ణుడి "పప్పు" సినిమా షూటింగ్!కృష్ణుడు, సుబ్బరాజు, దీపిక కాంబినేషన్‌లో "పప్పు" అనే చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఆర్య ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సపన్‌సుపర్తి దర్శకత్వంలో ప్రవీణ్‌రెడ్డి నల్లా, నగేష్ యాడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. " నేను అష్టాచమ్మాకు కోడైరక్టర్‌గా పనిచేశాను. అప్పుడే కథ రాసుకున్నాను. కృష్ణుడు మంచి పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో సుబ్బరాజు పాత్ర కూడా చాలా కీలకమైంది. స్నేహం నేపథ్యంలో సాగే చిత్రమిది" అని చెప్పారు.Source: వినోదం | 20 Mar 2010 | 5:39 am "బెట్టింగ్ బంగార్రాజు" ఆడియో విడుదల"బెట్టింగ్ బంగార్రాజు" అనే పేరు వినగానే ఇది పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని అర్థమవుతుంది. సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వినోద భరిత చిత్రాలకు కేర్ఆఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న హీరో నరేష్ ఈ చిత్రకథానాయకుడైతే, నాయిక ఇందులో అతనితో జోడీ కడుతోంది. వినోదాత్మక చిత్రాలను రూపొందించడంలో ప్రత్యేకతను కనబరిచే దర్శకుడు ఇ. సత్తిబాబు మరోసారి ప్రేక్షకుల ప్రశంసలందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో మయూరి కంపెనీ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. ప్రముఖ గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, అనంతశ్రీరామ్‌లు ఇందులోని గీతాలను రచించారు.Source: వినోదం | 20 Mar 2010 | 5:26 am గ్లామర్‌గా కన్పించడంలో తప్పులేదు. కానీ..!?: పద్మప్రియ"పద్మప్రియ" అనే పేరు తమిళ ఇండస్ట్రీకి బాగా తెలుసు. పెద్దగా అందగత్తె గాకపోయినా స్వతహాగా ఉన్న అందాన్ని మెరుగులు దిద్దుకుని., కీలక పాత్రలను పోషిస్తోంది. "స్ట్రైకర్"తో బాలీవుడ్‌లో ప్రవేశించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో "శ్రీను వాసంతి లక్ష్మి" అనే చిత్రంలో హీరో సోదరిగా నటించింది. తాజాగా తెలుగులో చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో "అందరి బంధువయ"తో పాటు లారెన్స్ "సూపర్ కౌబాయ్" అనే చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన పద్మప్రియ గ్లామర్ గురించి మాట్లాడుతూ.. ఒక నటీమణి గ్లామర్‌గా కన్పించడంలో తప్పులేదు. కానీ ఎక్కడా మితిమీరి ప్రవర్తించి ఎబ్బెట్టుగా కనిపించకూడదు. నేనిప్పటి దాకా అలా కనిపించలేదు. ఇక మీదట కూడా కథను, సినిమాను, నా పాత్రను బట్టే వస్త్రధారణ విషయంలో పట్టువిడుపులు గురించి ఆలోచిస్తాను" అని చెబుతోంది. మరి గ్లామర్‌పై పద్మప్రియ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు నిర్మాతలు ఏ మేరకు ఛాన్సులిస్తారో వేచి చూడాల్సిందే..!Source: Yahoo! Telugu: Entertainment | 20 Mar 2010 | 5:04 am ఏప్రిల్‌లో అక్కినేని-శ్రీహరి-సాయిరాంశంకర్‌ల సినిమా షూటింగ్!ఆరోప్రాణం, పవిత్ర ప్రేమ, కృష్ణబాబు, తిరుమల తిరుపతి వెంకటేశ, అల్లరి రాముడు, అడవిరాముడు, ఒక ఊరిలో వంటి హిట్ చిత్రాల్ని నిర్మించిన ఫ్రెండ్లీ మూవీస్ అధినేత చంటి అడ్డాల తాజాగా నిర్మిస్తున్న భారీ చిత్రంలో డా.అక్కినేని నాగేశ్వరరావు, రియల్‌స్టార్ శ్రీహరి, "బంపర్ ఆఫర్" హీరో సాయిరాం శంకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం గురించి హీరో సాయిరాం శంకర్ మాట్లాడుతూ.. "బంపర్ ఆఫర్ హిట్ అయిన తర్వాత హీరోగా నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ చంటి అడ్డాల నిర్మిస్తున్న ఈ చిత్రం కథ ఎంతో నచ్చి పూర్తిగా దీనిమీదే దృష్టి సారించాను. స్టూడెంట్ నెం.1, నిన్నేపెళ్ళాడుతా వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన పృథ్వితేజ ఈ చిత్రానికి అద్భుతమైన కథ సిద్ధం చేశారు.Source: వినోదం | 20 Mar 2010 | 4:43 am పాకిస్థాన్‌లో న్యూఢిల్లీ: రైల్వేశాఖ యాడ్‌లో విచిత్రం!మొన్న కేంద్ర పర్యాటక శాఖ.. నేడు కేంద్ర రైల్వే శాఖ. కేంద్ర ప్రభుత్వ శాఖలకు పాకిస్థాన్‌పై అధిక మోజు ఉన్నట్టు కనిపిస్తోంది. పర్యాటక శాఖ గతంలో పత్రికలకు ఇచ్చిన యాడ్‌లో పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మాజీ చీఫ్ ఫోటోను పెట్టి ప్రచురించింది. ఈ వివాదం ఇంకా సద్దుమణగక ముందే తాజాగా కేంద్ర రైల్వే శాఖకు చెందిన తూర్పు రైల్వే మరో వివాదానికి తెరతీసింది. దేశ రాజధాని న్యూఢిల్లీ పాకిస్థాన్‌లో ఉన్నట్టు చూపింపే మ్యాప్‌తో కూడిన ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటన ఆ శాఖ అధికారులనే కాకుండా దేశ ప్రజలను విస్తుపోయేలా చేసింది.Source: జాతీయ | 20 Mar 2010 | 4:01 am నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన తొగాడియా అరెస్టు.. విడుదల!పోలీసులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి కంధమాల్‌లోకి ప్రవేశించేందుకు సాహసం చేసిన విశ్వ హిందూ పరిషత్ సీనియర్ నేత ప్రవీణ్ తొగాడియాను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను విడుదల చేశారు.Source: జాతీయ | 20 Mar 2010 | 3:10 am
|