పెరగిన సిఎన్‌జీ గ్యాస్ ధరలు

దేశంలో పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ధరలు పెంచిన తర్వాత శుక్రవారం సిఎన్‌జీ గ్యాస్ ధరలను పెంచినట్లు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సంస్థ తెలిపింది. పెంచిన ధరలు అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయని సంస్థ పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 20 Mar 2010 | 9:03 am

నేపాల్ మాజీ పీఎం గిరిజా ప్రసాద్ కోయిరాలా మృతి

నేపాల్ దేశం మహా నేతను కోల్పోయింది. ఆ దేశ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించిన ఆ దేశ మాజీ ప్రధాని, నేపాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధ్యక్షుడు గిరిజా ప్రసాద్ కోయిరాలా కన్నుమూశారు. ఆయనకు వయస్సు 87 సంవత్సరాలు. శనివారం మధ్యాహ్నం 12.10 నిమిషాల ప్రాంతంలో నేపాల్ ఉప ప్రధాని, ఆయన కుమార్తె సుజాతా కోయిరాలా నివాసంలో గిరిజా ప్రసాద్ తుదిశ్వాస విడిచినట్టు నేపాల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గోపాల్ మాన్ శ్రేష్టా తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 20 Mar 2010 | 9:03 am

దేశం‍లో ఇంటర్నెట్ వాడకందార్లు 71 మిలియన్లు: ఐఎమ్ఆర్‌బీ

దేశంలోని నగరాలు, పట్టణాలలో నివసించేవారిలో ఇంగ్లీషు మాట్లాడే ప్రతి ఐదుగురిలో నలుగురు కంప్యూటర్‌ను వినియోగిస్తున్నారని, వీరు ఖచ్చితంగా ఇంటర్నెట్ చూస్తున్నట్లు తమ సర్వేలో తేలిందని ఐఎమ్ఏఐ అధ్యక్షుడు సుభో రాయ్ మీడియాకు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 20 Mar 2010 | 8:37 am

ద్రవ్యోల్బణం అదుపుకే వడ్డీ రేట్లలో మార్పులు: ఆర్‌బీఐ

వచ్చే ఆర్థిక సంవత్సరం (2010-11) లో వివిధ రంగాలలో వృద్ధి రేటు పెరుగుతుండటంతో రానున్న రోజుల్లో రుణగిరాకీని పెంచవచ్చు. ఓ వైపు ద్రవ్యోల్బణాన్ని సాధ్యమైనంత కనిష్ఠ స్థాయిలో ఉంచేందుకు అటు ప్రభుత్వం, ఇటు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అవసరమైన చర్యలు తీసుకోనున్న నేపథ్యంలో ఏప్రిల్‌ తరువాత వడ్డీరేట్లలో మార్పులు అనివార్యమని ఆర్థికరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 20 Mar 2010 | 8:14 am

బ్యాంకు రుణాలపై స్వల్పంగా వడ్డీ రేట్లు పెంపు: ఎస్‌బీఐ

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థగా పేరొందిన భారతీయ స్టేట్ బ్యాంకు రుణాలపై వడ్డీ శాతాన్ని స్వల్పంగా పెంచనున్నట్టు సూచన ప్రాయంగా వెల్లడించింది. భారతీయ రిజర్వు బ్యాంకు శుక్రవారం రెపో, రివర్స్ రెపో రేట్లను పెంచిన విషయం తెల్సిందే. దీని ఫలితంగా బ్యాంకు రుణాలపై కూడా వడ్డీ రేట్లను సవరించాలని నిర్ణయించింది.
Source: Yahoo! Telugu: News | 20 Mar 2010 | 8:03 am

మంత్రుల డిన్నర్ మీటింగులపై ఆరా తీయలేదు: సీఎం

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు మంత్రులు విందు సమావేశాలపై తాను ఆరా తీసినట్టు వచ్చిన వార్తల్లో అణు మాత్రం నిజం లేదని ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. అలాగే కొందరు మంత్రులను తాను మందలించినట్టు కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా ఆయన ఖండించారు.
Source: Yahoo! Telugu: News | 20 Mar 2010 | 7:40 am

మురికి వాడల నిర్మూలనలో భారత్ కృషి భేష్: సమితి

మురికి వాడలు లేని దేశంగా తీర్చి దిద్దేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల ఐక్యరాజ్య సమితి హర్షం వ్యక్తం చేసింది. గడచిన పదేళ్ళలో 5.9 కోట్ల మంది గుడిసెవాసులకు పక్కా గృహాలు నిర్మించి వారి జీవితాల్లో వెలుగులు నింపిందని గుర్తు చేసింది.
Source: Yahoo! Telugu: News | 20 Mar 2010 | 7:18 am

నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన తొగాడియా అరెస్టు.. విడుదల!

పోలీసులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి కంధమాల్‌లోకి ప్రవేశించేందుకు సాహసం చేసిన విశ్వ హిందూ పరిషత్ సీనియర్ నేత ప్రవీణ్ తొగాడియాను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను విడుదల చేశారు.
Source: Yahoo! Telugu: News | 20 Mar 2010 | 7:05 am

50 శాతం పెరగనున్న మామిడి ఉత్పత్తులు

గత సంవత్సరంలో దిగుబడి సాధించిన మామిడి ఉత్పత్తులకన్నా ఈ ఏడాది ఉత్పత్తయ్యే మామిడి ఉత్పత్తుల్లో 50 శాతం మేరకు వృద్ధి సాధించి మామిడి దిగుబడి బాగుంటుందని గుజరాత్ హార్టీకల్చర్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు కేపీ కికానీ మీడియాకు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 20 Mar 2010 | 6:48 am

22వ తేదీకి వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శనివారం ఉదయం సభా కార్యక్రమాలు ప్రారంభమైన వెంటనే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సభ్యులు లేచి ఉపాధి హామీ నిధుల పంపిణీ అక్రమాలపై చర్చ జరగాలని పట్టుబట్టారు. వీరికి ప్రజారాజ్యం పార్టీ సభ్యులు మద్దతు తెలిపారు. ముందుగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తెదేపా సభ్యులు చర్చకు డిమాండ్ చేయడాన్ని స్పీకర్ అంగీకరించలేదు.
Source: Yahoo! Telugu: News | 20 Mar 2010 | 6:40 am

గ్లామర్‌గా కన్పించడంలో తప్పులేదు. కానీ..!?: పద్మప్రియ

"పద్మప్రియ" అనే పేరు తమిళ ఇండస్ట్రీకి బాగా తెలుసు. పెద్దగా అందగత్తె గాకపోయినా స్వతహాగా ఉన్న అందాన్ని మెరుగులు దిద్దుకుని., కీలక పాత్రలను పోషిస్తోంది. "స్ట్రైకర్"తో బాలీవుడ్‌లో ప్రవేశించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో "శ్రీను వాసంతి లక్ష్మి" అనే చిత్రంలో హీరో సోదరిగా నటించింది. తాజాగా తెలుగులో చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో "అందరి బంధువయ"తో పాటు లారెన్స్ "సూపర్ కౌబాయ్" అనే చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన పద్మప్రియ గ్లామర్ గురించి మాట్లాడుతూ.. ఒక నటీమణి గ్లామర్‌గా కన్పించడంలో తప్పులేదు. కానీ ఎక్కడా మితిమీరి ప్రవర్తించి ఎబ్బెట్టుగా కనిపించకూడదు. నేనిప్పటి దాకా అలా కనిపించలేదు. ఇక మీదట కూడా కథను, సినిమాను, నా పాత్రను బట్టే వస్త్రధారణ విషయంలో పట్టువిడుపులు గురించి ఆలోచిస్తాను" అని చెబుతోంది. మరి గ్లామర్‌పై పద్మప్రియ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు నిర్మాతలు ఏ మేరకు ఛాన్సులిస్తారో వేచి చూడాల్సిందే..!
Source: Yahoo! Telugu: Entertainment | 20 Mar 2010 | 5:04 am

నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన తొగాడియా అరెస్టు.. విడుదల!

పోలీసులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి కంధమాల్‌లోకి ప్రవేశించేందుకు సాహసం చేసిన విశ్వ హిందూ పరిషత్ సీనియర్ నేత ప్రవీణ్ తొగాడియాను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను విడుదల చేశారు.
Source: జాతీయ | 20 Mar 2010 | 3:10 am

మంత్రుల డిన్నర్ మీటింగులపై ఆరా తీయలేదు: సీఎం

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు మంత్రులు విందు సమావేశాలపై తాను ఆరా తీసినట్టు వచ్చిన వార్తల్లో అణు మాత్రం నిజం లేదని ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. అలాగే కొందరు మంత్రులను తాను మందలించినట్టు కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా ఆయన ఖండించారు.
Source: ఏపీ న్యూస్ | 20 Mar 2010 | 2:10 am

22వ తేదీకి వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శనివారం ఉదయం సభా కార్యక్రమాలు ప్రారంభమైన వెంటనే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సభ్యులు లేచి ఉపాధి హామీ నిధుల పంపిణీ అక్రమాలపై చర్చ జరగాలని పట్టుబట్టారు. వీరికి ప్రజారాజ్యం పార్టీ సభ్యులు మద్దతు తెలిపారు. ముందుగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తెదేపా సభ్యులు చర్చకు డిమాండ్ చేయడాన్ని స్పీకర్ అంగీకరించలేదు.
Source: ఏపీ న్యూస్ | 20 Mar 2010 | 1:11 am

రాజకీయ మార్గదర్శకుడు సీఎం నరేంద్ర మోడీ: గడ్కారీ

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. మోడీ... ఒక రాజకీయ మార్గదర్శకుడిగా కొనియాడారు. గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే కాకుండా, ఇతర ముఖ్యమంత్రులకు భిన్నంగా పాలన సాగిస్తూ ప్రజల మద్దతు పొందుతున్నారన్నారు.
Source: జాతీయ | 20 Mar 2010 | 12:57 am

గుజరాత్‌లో తీవ్రవాదులకు ప్రత్యేక జైళ్లు: నరేంద్ర మోడీ

తీవ్రవాద అణిచివేతపై తనకున్న ముక్కువను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మరోమారు చాటుకున్నారు. వివిధ విధ్వంస కార్యకలాపాల్లో పట్టుబడే తీవ్రవాదులకు ప్రత్యేక జైళ్ళను నిర్మించనున్నారు. ఇందుకోసం 20 కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేకంగా తీవ్రవాదుల కోసం జైలును నిర్మించతలపెట్టారు. గాంధీనగర్‌కు సమీపంలోని నిర్మితమయ్యే ఈ జైలులో 600 మంది తీవ్రవాదులను బంధించవచ్చు.
Source: జాతీయ | 20 Mar 2010 | 12:22 am

నెల్లూరులో ఇంటర్ ప్రశ్నపత్రాల లీక్: అదుపులో సిబ్బంది!

ఇంటర్ మొదటి సంవత్సరం ప్రశ్నపత్రాలు నెల్లూరు జిల్లాల్లో లీక్ అయ్యాయి. జిల్లా కేంద్రంలోని కృష్ణచైతన్య కళాశాలలో ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. నిర్ణీత సమయం కంటే ప్రశ్నపత్రాలను లీక్ చేసి విద్యార్థులకు అందజేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. కళాశాల యాజమాన్యం పరారైంది.
Source: ఏపీ న్యూస్ | 19 Mar 2010 | 11:18 pm

విభేదాలు ఎన్నివున్నా.. ప్రజాక్షేమమే లక్ష్యం: జగన్

మన మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ.. ప్రజాక్షేమమే మనందరి అంతిమ లక్ష్యంగా ఉండాలని కడప పార్లమెంట్ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలను విస్మరించకుండా, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగాలని ఆయన కోరారు.
Source: ఏపీ న్యూస్ | 19 Mar 2010 | 11:08 pm

తెలంగాణకు పట్టిన ఏకైక శని రాములమ్మ: ప్రరాపా

తెలంగాణ ప్రజానీకాన్ని పట్టిపీడిస్తున్న శని గ్రహం మెదక్ ఎంపీ విజయశాంతి అని ప్రజారాజ్యం పార్టీ ధ్వజమెత్తింది. చిరంజీవి సరసన నటించి తన కంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న ఆమె ప్రగల్భాలు పలకడం మానుకోవాలని ఆ పార్టీ నేతలు బూరగడ్డ వేదవ్యాస్, వాసిరెడ్డి పద్మ సలహా ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 19 Mar 2010 | 10:51 pm

హైజాక్‌ చేసిన వారికి ఇకపై మరణ శిక్ష: కేంద్రం

విమానాలను హైజాక్ చేసే వారికి మరణ దండనను శిక్షగా చేర్చుతూ చట్టాన్ని సవరించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని కేంద్ర హోంశాఖామంత్రి పి. చిదంబరం తెలిపారు.
Source: జాతీయ | 19 Mar 2010 | 10:21 pm

గడ్కారీపై ప్రారంభమైన ఆగ్రహావేశాలు

భారతీయ జనతా పార్టీలో నూతన పదాధికారుల్లో తనకు స్థానం కల్పించకపోవడంపై షాట్‌గన్ శత్రుఘ్న సిన్హా తోపాటు బీహార్‌కు చెందిన మరో ముగ్గురు సీనియర్ నేతలు పార్టీ జాతీయ అధ్యక్షునిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Source: జాతీయ | 19 Mar 2010 | 9:46 pm

నన్ను భరించేవాడు కావాలి: అనుష్క

ప్రేమ, పెళ్లి గురించి పదహారేళ్లున్నప్పుడున్న కలలు ఇరవై దాటాక ఉండవని అనుష్క అంటోంది. ప్రేమ గురించి అడిగితే.. ప్రేమా లేదూ... దోమాలేదు.. పని గురించి ఆలోచించడానికే టైం సరిపోవడం లేదు... ఇంకా ప్రేమ గురించి ఆలోచించే సమయమెక్కడిదీ..? అని ప్రశ్నిస్తోంది. అయినా వదలకుండా.. ఎవరినైనా ప్రేమించారా...? అని అడిగితే, తెరమీద వెంటపడే హీరోలను ప్రేమించడానికే నాకు సమయం సరిపోతోంది. ఇక నిజ జీవితంలో ప్రేమ గురించి మాట్లాడటానికేముంది...? అని ముక్తసరిగా చెబుతోంది. ఒక వయస్సు వచ్చాక జీవితంలో నిజాలు కళ్లకు కనిపిస్తాయి. వరుడి గురించి నాలో పెద్దగా కలలు లేవు. మంచి మనిషి అయితే చాలంటోంది. మంచి మనిషంటే.. అన్నిటికీ మించి నన్ను భరించేవాడుగా ఉండాలని అసలు విషయం చెప్పేసింది. మరి ఏం భరించాలని అడిగితే మాత్రం చెప్పట్లేదు.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Mar 2010 | 1:36 pm

ఫ్రీజోన్‌పై చిరంజీవి స్పందన బాగుంది: లగడపాటి

తెలంగాణాలోని కొన్ని జిల్లాలు మినహా మిగిలిన తెలంగాణా ప్రాంత వాసులకు అన్యాయం జరిగే ఫ్రీజోన్ అంశంపై తెరాస నాయకునికి మిగిలిన నేతలందరూ వంత పాడుతున్నారని విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఈ విషయంలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అనుసరిస్తున్న విధానం చాలా బావుందని సమర్థించారు.
Source: ఏపీ న్యూస్ | 19 Mar 2010 | 9:37 am

గ్రీన్ హంట్ ఆపకపోతే హింస తప్పదు: కిషన్ జీ

ఆపరేషన్ గ్రీన్ హంట్ ఆపకపోతే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని మావోయిస్టు నేత కిషన్ జీ హెచ్చరించారు. అమాయక గిరిజన ప్రజలపై జరుపుతున్న దాడులను ఆపకపోతే సమాధానం ఎలా చెప్పాలో తమకు తెలుసునని ఓ వార్తా సంస్థకు ఫోనులో చెప్పినట్లు సమాచారం.
Source: జాతీయ | 19 Mar 2010 | 9:24 am

నాన్నా... నాగుపాము డ్యాన్స్ చేస్తా: రామ్ చరణ్ తేజ

రామ్ చరణ్ తేజ తదుపరి చిత్రం "ఆరెంజ్" ఐదుగురు హీరోయిన్లతో కలర్‌ఫుల్‌గా తయారవుతోంది. ఈ చిత్రంలోనూ మెగాస్టార్ సూపర్ హిట్ సాంగ్ ఒకటి సీక్వెల్‌గా వాడుకోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మెగా "ఘరానా మొగుడు" చిత్రంలోని 'బంగారు కోడిపెట్ట...' పాటను మగధీరలో కొత్త బాణీలో రామ్ చరణ్ స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించిన నేపధ్యంలో నాటి మెగా హిట్ "ఖైదీ"లోని 'రగులుతోంది మొగలి పొద..' పాటను "ఆరెంజ్"లో వాడుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ పాటకోసం రామ్ చరణ్ తేజ నాగుపాము డ్యాన్స్‌ను ప్రత్యేకంగా ప్రాక్టీసు చేస్తున్నాడట. చిరంజీవి ఒక్కసారి లుక్కేసి ఓకే... ప్రొసీడ్ అంటే రామ్ చరణ్ పాము నాట్యంతో అలరించడానికి రెడీగా ఉన్నట్లు చిత్ర యూనిట్ చెపుతోంది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సూపర్ లవర్ బాయ్‌గా కనిపించనున్నాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Mar 2010 | 9:09 am

రాయల తెలంగాణ వద్దు.. సమైక్య రాష్ట్రమే ముద్దు!

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపే సమయం దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నిన్నటి వరకు గ్రేటర్ రాయలసీమ, రాయల తెలంగాణ డిమాండ్లను తెరపైకి తెచ్చిన సీమ ప్రాంత నేతలు.. ఇపుడు వెనక్కి తగ్గారు. రాష్ట్ర ప్రజలంతా సమైక్యంగానే ఉందామని ఐక్యతారాగాన్ని ఆలపించారు.
Source: ఏపీ న్యూస్ | 19 Mar 2010 | 7:56 am

రంజితను నిత్యానంద "స్వామి" మళ్లీ రమ్మన్నాడట

వెనకటికెవరో చెప్పినట్లే... అటువంటి సహవాసం 90 ఏళ్లయినా అలాగే అంటిపెట్టుకుని ఉంటుందట. ఎవరు మటుకు తొలిసారిగా ప్రేమామృతం పంచిన ప్రియురాలు/ప్రియుడిన మరిచిపోతారూ...? దీనిని నిజం చేస్తున్నట్లున్నారు తమిళనాట సెక్స్ స్వామిగా పిలువబడుతున్న నిత్యానంద - రంజితలు. వీరిద్దరి సెక్స్ వీడియోలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ ఇద్దరూ వాటిని చాలా తేలిగ్గా కొట్టి పారేశారు. అంతేకాదు తమ బంధాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని మీడియాలో కనబడినప్పుడల్లా చెప్పుకుంటున్నారు. ఇదిలావుంటే తాజాగా నిత్యానందతో రంజిత రహస్యంగా సమావేశమైనట్లు కోలీవుడ్ వర్గాలు గుసగుసలు పోతున్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Mar 2010 | 7:22 am

యూవీ బంతులను కొడుతుంటే... ఓహ్!!: ఆంచల్

మొన్న బెంగళూరులో కింగ్స్ లెవన్ జట్టు రాయల్ ఛాలెంజర్స్‌పై ఘోరంగా పరాజయాన్ని చవిచూసింది. దీంతో జట్టు సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరుసటి మ్యాచ్‌లో గెలవాలంటే గర్ల్ ఫ్రెండ్‌తో గడపాలని వెనకటికి ఓ ఇంగ్లండు క్రీడా వైద్యులు చెప్పినదాన్ని యువరాజ్ పాటించాలని అనుకున్నాడో ఏమోగానీ దీపికా పదుకునే వంటి పాత గాళ్ ఫ్రెండ్స్‌ను వదిలేసి కొత్తగా మరో అమ్మాయిని చూసుకున్నాడు. ఓడిపోయిన విచారాన్నంతా ఆ అమ్మాయి ఇచ్చిన నైట్ పార్టీతో తీర్చుకున్నాడు. ఇంతకూ ఎవరా అమ్మాయి...? అంటారా...? టాప్ మోడల్ ఆంచల్ కుమార్. యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌ను చూసి తాను ఫ్లాటై పోయానని చెపుతోందట. అతడు తన బ్యాట్‌తో బంతులను అత్యంత సొగసుగా బౌండరీలకు తరలించడం చూసి ముగ్ధురాలై పోయానని కనబడినవారికల్లా చెవిలో జోరీగలా ఒహటే చెపుతోందట. అవును మరి.. నచ్చిన పురుషుడు గురించి ఎంత చెప్పినా... ఎంత మాట్లాడినా తక్కువగానే ఉంటుంది మరి.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Mar 2010 | 6:56 am

ఇద్దరు మావోల హతం: పోలీసుల అదుపులో ఆజాద్?

ఖమ్మం జిల్లాల్లో శుక్రవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. అలాగే, ఖమ్మం జిల్లా పోలీసుల అదుపులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ అలియాస్ రాజ్‌కుమార్ ఉన్నట్టు వదంతులు వ్యాపించాయి. దీనిపై రాష్ట్ర డీజీపీ గిరీష్ కుమార్ వెంటనే స్పందించారు. పోలీసుల అదుపులో రాజ్‌కుమార్ లేరని స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 19 Mar 2010 | 6:31 am

హెడ్లీకి విధించే జీవితశిక్షపై భారత్ సంతృప్తి: జీకేపిళ్లై

నేరాన్ని అంగీకరించిన పాకిస్థాన్ జాతీయుడైన అమెరికా పౌరుడు డేవిడ్ కలోమెన్ హెడ్లీకి మరణశిక్షకు బదులు జీవితకారాగార శిక్షను కోర్టు విధిస్తే భారత్ సంతృప్తి వ్యక్తం చేస్తుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి జీకే.పిళ్లై అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 19 Mar 2010 | 5:48 am

ఓయూ కేసు విచారణను 26కు వాయిదా వేసిన సుప్రీం

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బలగాల మోహరింపు అంశంపై దాఖలైన పిటిషన్ విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది. బలగాల మోహరింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు త్రిసభ్య కమిటీలు తమ నివేదికలను కోర్టుకు సమర్పించాయి. ఈ నివేదికలను ప్రతివాదులకు కూడా అందజేయాలని కోర్టు సూచిస్తూ.. కేసు తదుపరి విచారణను 26వ తేదీకి వాయిదా వేసింది.
Source: ఏపీ న్యూస్ | 19 Mar 2010 | 5:47 am

సీఎం కార్యక్రమాలను అడ్డుకోండి: సీమాంధ్ర విద్యార్థులు

హైదరాబాద్‌ను ఫ్రీజోన్ నుంచి మినహాయింపు ఇస్తూ ముఖ్యమంత్రి కె.రోశయ్య అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడాన్ని సీమాంధ్ర విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే, ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థులు శనివారం విశాఖ బంద్‌కు పిలుపునిచ్చారు. దీనికి ప్రజారాజ్యం పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. అలాగే, జిల్లా పర్యటనకు వస్తే ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని ఏయూ జేఏసీ హెచ్చరించింది.
Source: ఏపీ న్యూస్ | 19 Mar 2010 | 5:33 am

నాన్నా... నాగుపాము డ్యాన్స్ చేస్తా: రామ్ చరణ్ తేజ

రామ్ చరణ్ తేజ తదుపరి చిత్రం "ఆరెంజ్" ఐదుగురు హీరోయిన్లతో కలర్‌ఫుల్‌గా తయారవుతోంది. ఈ చిత్రంలోనూ మెగాస్టార్ సూపర్ హిట్ సాంగ్ ఒకటి సీక్వెల్‌గా వాడుకోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మెగా "ఘరానా మొగుడు" చిత్రంలోని 'బంగారు కోడిపెట్ట...' పాటను మగధీరలో కొత్త బాణీలో రామ్ చరణ్ స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించిన నేపధ్యంలో నాటి మెగా హిట్ "ఖైదీ"లోని 'రగులుతోంది మొగలి పొద..' పాటను "ఆరెంజ్"లో వాడుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ పాటకోసం రామ్ చరణ్ తేజ నాగుపాము డ్యాన్స్‌ను ప్రత్యేకంగా ప్రాక్టీసు చేస్తున్నాడట. చిరంజీవి ఒక్కసారి లుక్కేసి ఓకే... ప్రొసీడ్ అంటే రామ్ చరణ్ పాము నాట్యంతో అలరించడానికి రెడీగా ఉన్నట్లు చిత్ర యూనిట్ చెపుతోంది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సూపర్ లవర్ బాయ్‌గా కనిపించనున్నాడు.
Source: వినోదం | 19 Mar 2010 | 3:41 am

హైజాకింగ్ వ్యతిరేక బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

విమానాల హైజాకింగ్ వ్యతిరేక బిల్లు (యాంటీ హైజాకింగ్ లా)కు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లు ఆమల్లోకి వస్తే విమానాల హైజాకింగ్‌కు పాల్పడే వారికి మరణదండన విధిస్తారు. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం ఉదయం జరిగింది. ఇందులో యాటీ హైజాకింగ్ లాకు ఆమోదముద్ర తెలిపే కీలక నిర్ణయం తీసుకుంది.
Source: జాతీయ | 19 Mar 2010 | 3:24 am