|
నాన్నా... నాగుపాము డ్యాన్స్ చేస్తా: రామ్ చరణ్ తేజరామ్ చరణ్ తేజ తదుపరి చిత్రం "ఆరెంజ్" ఐదుగురు హీరోయిన్లతో కలర్‌ఫుల్‌గా తయారవుతోంది. ఈ చిత్రంలోనూ మెగాస్టార్ సూపర్ హిట్ సాంగ్ ఒకటి సీక్వెల్‌గా వాడుకోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మెగా "ఘరానా మొగుడు" చిత్రంలోని 'బంగారు కోడిపెట్ట...' పాటను మగధీరలో కొత్త బాణీలో రామ్ చరణ్ స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించిన నేపధ్యంలో నాటి మెగా హిట్ "ఖైదీ"లోని 'రగులుతోంది మొగలి పొద..' పాటను "ఆరెంజ్"లో వాడుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ పాటకోసం రామ్ చరణ్ తేజ నాగుపాము డ్యాన్స్‌ను ప్రత్యేకంగా ప్రాక్టీసు చేస్తున్నాడట. చిరంజీవి ఒక్కసారి లుక్కేసి ఓకే... ప్రొసీడ్ అంటే రామ్ చరణ్ పాము నాట్యంతో అలరించడానికి రెడీగా ఉన్నట్లు చిత్ర యూనిట్ చెపుతోంది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సూపర్ లవర్ బాయ్‌గా కనిపించనున్నాడు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Mar 2010 | 9:09 am మిశ్రమ ఫలితాల్లో సెన్సెక్స్, నిఫ్టీల పయనంవారంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభ, నష్టాలతో ర్యాలీని కొనసాగిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో 14 పాయింట్లు పుంజుకుని, 17,534 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అయితే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం -0.85 పాయింట్ల కనిష్ఠ నష్టంతో, 5,245 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 19 Mar 2010 | 8:55 am హైజాకింగ్ వ్యతిరేక బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదంవిమానాల హైజాకింగ్ వ్యతిరేక బిల్లు (యాంటీ హైజాకింగ్ లా)కు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లు ఆమల్లోకి వస్తే విమానాల హైజాకింగ్‌కు పాల్పడే వారికి మరణదండన విధిస్తారు. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం ఉదయం జరిగింది. ఇందులో యాటీ హైజాకింగ్ లాకు ఆమోదముద్ర తెలిపే కీలక నిర్ణయం తీసుకుంది.Source: Yahoo! Telugu: News | 19 Mar 2010 | 8:54 am ఐపీఎల్ విదేశాల్లో నిర్వహిస్తే...?!! : లలిత్ మోడీప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లు గ్రాండ్ సక్సెస్ అవుతుండటంతో ఇదే తరహాలో ప్రతి ఏడాది యూకే, మధ్య తూర్పు, ఉత్తర అమెరికా దేశాలలో ఐపీఎల్ మ్యాచ్‌ను నిర్వహించాలన్న యోచనలో లలిత్ మోడీ ఉన్నట్లు సమాచారం.Source: Yahoo! Telugu: News | 19 Mar 2010 | 7:48 am నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ మార్కెట్రియాల్టీ, ఐటీ, ఆయిల్, గ్యాస్ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి స్వల్ప లాభాలను ఆర్జించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కేవలం ఒక్క రెండు పాయింట్ల నష్టంతో 17517 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా నాలుగు పాయింట్ల స్వల్ప నష్టంతో, 5,239 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 19 Mar 2010 | 7:27 am రంజితను నిత్యానంద "స్వామి" మళ్లీ రమ్మన్నాడటవెనకటికెవరో చెప్పినట్లే... అటువంటి సహవాసం 90 ఏళ్లయినా అలాగే అంటిపెట్టుకుని ఉంటుందట. ఎవరు మటుకు తొలిసారిగా ప్రేమామృతం పంచిన ప్రియురాలు/ప్రియుడిన మరిచిపోతారూ...? దీనిని నిజం చేస్తున్నట్లున్నారు తమిళనాట సెక్స్ స్వామిగా పిలువబడుతున్న నిత్యానంద - రంజితలు. వీరిద్దరి సెక్స్ వీడియోలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ ఇద్దరూ వాటిని చాలా తేలిగ్గా కొట్టి పారేశారు. అంతేకాదు తమ బంధాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని మీడియాలో కనబడినప్పుడల్లా చెప్పుకుంటున్నారు. ఇదిలావుంటే తాజాగా నిత్యానందతో రంజిత రహస్యంగా సమావేశమైనట్లు కోలీవుడ్ వర్గాలు గుసగుసలు పోతున్నాయి.Source: Yahoo! Telugu: Entertainment | 19 Mar 2010 | 7:22 am ఫ్రీజోన్ అంశంపై సభా కార్యక్రమాలను అడ్డుకున్న ప్రరాపాఫ్రీజోన్ అంశంపై ప్రభుత్వం ఏకపక్షంగా తీర్మానం చేసి ఆమోదించడాన్ని ప్రజారాజ్యం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనికి వ్యతిరేకంగా శుక్రవారం ఆ పార్టీకి చెందిన సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. సభ ప్రారంభమైన వెంటనే పోడియం వద్దకు దూసుకెళ్లిన సభ్యులు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభను 15 నిమిషాల పాటు సభను సభాపతి వాయిదా వేశారు.Source: Yahoo! Telugu: News | 19 Mar 2010 | 7:12 am గృహనిర్మాణ రంగానికి 3.6 లక్షల కోట్లు కావాలి: హెచ్డీఎఫ్సీరానున్న ఐదు సంవత్సరాలలో భారతదేశంలోని ఆరు కోట్ల మంది ప్రజలకు 2.65 కోట్ల గృహ నిర్మాణాలను చేపట్టేందుకుగాను భారతదేశానికి 3.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమని హెచ్‌డీఎఫ్‌సీ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ రేణూ సూద్ కర్నాడ్ ముంబైలో తెలిపారు.Source: Yahoo! Telugu: News | 19 Mar 2010 | 7:02 am యూవీ బంతులను కొడుతుంటే... ఓహ్!!: ఆంచల్మొన్న బెంగళూరులో కింగ్స్ లెవన్ జట్టు రాయల్ ఛాలెంజర్స్‌పై ఘోరంగా పరాజయాన్ని చవిచూసింది. దీంతో జట్టు సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరుసటి మ్యాచ్‌లో గెలవాలంటే గర్ల్ ఫ్రెండ్‌తో గడపాలని వెనకటికి ఓ ఇంగ్లండు క్రీడా వైద్యులు చెప్పినదాన్ని యువరాజ్ పాటించాలని అనుకున్నాడో ఏమోగానీ దీపికా పదుకునే వంటి పాత గాళ్ ఫ్రెండ్స్‌ను వదిలేసి కొత్తగా మరో అమ్మాయిని చూసుకున్నాడు. ఓడిపోయిన విచారాన్నంతా ఆ అమ్మాయి ఇచ్చిన నైట్ పార్టీతో తీర్చుకున్నాడు. ఇంతకూ ఎవరా అమ్మాయి...? అంటారా...? టాప్ మోడల్ ఆంచల్ కుమార్. యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌ను చూసి తాను ఫ్లాటై పోయానని చెపుతోందట. అతడు తన బ్యాట్‌తో బంతులను అత్యంత సొగసుగా బౌండరీలకు తరలించడం చూసి ముగ్ధురాలై పోయానని కనబడినవారికల్లా చెవిలో జోరీగలా ఒహటే చెపుతోందట. అవును మరి.. నచ్చిన పురుషుడు గురించి ఎంత చెప్పినా... ఎంత మాట్లాడినా తక్కువగానే ఉంటుంది మరి.Source: Yahoo! Telugu: Entertainment | 19 Mar 2010 | 6:56 am చర్చలేకుండా ఆమోదించడం భావ్యం కాదు: భాజపాఫ్రీజోన్ అంశంపై చేసిన తీర్మానంపై ఎలాంటి చర్చ లేకుండా సభలో ఆమోదించడం సరికాదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను ఫ్రీజోన్ నుంచి మినహాయించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సమ్మతం తెలిపాయన్నారు.Source: Yahoo! Telugu: News | 19 Mar 2010 | 6:56 am చిన్నారుల మరణ మృదంగం: టాప్-20లో భారత్ పేరు!ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఇది అగ్రరాజ్యాలకు దడలు పుట్టిస్తోంది. భారత్ అగ్రరాజ్యంగా అవతరించడం మరెంతో దూరంలో లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రతి ఒక్కరినీ గగుర్పాటుకు గురిచేసే అంశమేమిటంటే.. అధిక సంఖ్యలో చిన్నారులు మరణిస్తున్న దేశాల జాబితాలో భారత్ పేరుండటం. ప్రపంచంలో బాగా వెనుకబడిన దేశాలుగా గుర్తింపు పొందిన ఆప్ఘనిస్థాన్, జాంబియా తదితర దేశాల సరసన భారత్‌కు కూడా ఉండటం ప్రతి పౌరుడినీ దిగ్భ్రాంతికి గురిచేసే అంశం.Source: Yahoo! Telugu: News | 19 Mar 2010 | 6:40 am సర్వశిక్షా అభియాన్‌కు చేయూతనివ్వనున్న ప్రపంచబ్యాంక్భారత ప్రభుత్వం రూపొందించిన సర్వశిక్షా అభియాన్ పథకానికి చేయూతనిచ్చేందుకు 1.05 బిలియన్ డాలర్ల మేరకు ప్రపంచ బ్యాంక్ గురువారం రుణాన్ని మంజూరు చేసింది. దీంతో దేశంలోని పలువురు బాలబాలికలకు విద్యనభ్యసించే అవకాశం కలుగుతుంది.Source: Yahoo! Telugu: News | 19 Mar 2010 | 6:28 am ఇరాన్ అణ్వాయుధాల వల్లే ఉద్రిక్తత: బరాక్ ఒబామాఇరాన్ భారీ ఎత్తున అణ్వాయుధాలు కలిగి ఉండటం వల్లే మధ్య ఆసియాలో అణ్వాయుధ పోటీ తలెత్తడంతో పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు. ఆయన గురువారం ఒక టీవీ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై చర్చించారు.Source: Yahoo! Telugu: News | 19 Mar 2010 | 6:20 am హైజాకింగ్ వ్యతిరేక బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదంవిమానాల హైజాకింగ్ వ్యతిరేక బిల్లు (యాంటీ హైజాకింగ్ లా)కు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లు ఆమల్లోకి వస్తే విమానాల హైజాకింగ్‌కు పాల్పడే వారికి మరణదండన విధిస్తారు. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం ఉదయం జరిగింది. ఇందులో యాటీ హైజాకింగ్ లాకు ఆమోదముద్ర తెలిపే కీలక నిర్ణయం తీసుకుంది.Source: జాతీయ | 19 Mar 2010 | 3:24 am ఫ్రీజోన్ అంశంపై సభా కార్యక్రమాలను అడ్డుకున్న ప్రరాపాఫ్రీజోన్ అంశంపై ప్రభుత్వం ఏకపక్షంగా తీర్మానం చేసి ఆమోదించడాన్ని ప్రజారాజ్యం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనికి వ్యతిరేకంగా శుక్రవారం ఆ పార్టీకి చెందిన సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. సభ ప్రారంభమైన వెంటనే పోడియం వద్దకు దూసుకెళ్లిన సభ్యులు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభను 15 నిమిషాల పాటు సభను సభాపతి వాయిదా వేశారు.Source: ఏపీ న్యూస్ | 19 Mar 2010 | 1:43 am చర్చలేకుండా ఆమోదించడం భావ్యం కాదు: భాజపాఫ్రీజోన్ అంశంపై చేసిన తీర్మానంపై ఎలాంటి చర్చ లేకుండా సభలో ఆమోదించడం సరికాదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను ఫ్రీజోన్ నుంచి మినహాయించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సమ్మతం తెలిపాయన్నారు.Source: ఏపీ న్యూస్ | 19 Mar 2010 | 1:26 am చిన్నారుల మరణ మృదంగం: టాప్-20లో భారత్ పేరు!ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఇది అగ్రరాజ్యాలకు దడలు పుట్టిస్తోంది. భారత్ అగ్రరాజ్యంగా అవతరించడం మరెంతో దూరంలో లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రతి ఒక్కరినీ గగుర్పాటుకు గురిచేసే అంశమేమిటంటే.. అధిక సంఖ్యలో చిన్నారులు మరణిస్తున్న దేశాల జాబితాలో భారత్ పేరుండటం. ప్రపంచంలో బాగా వెనుకబడిన దేశాలుగా గుర్తింపు పొందిన ఆప్ఘనిస్థాన్, జాంబియా తదితర దేశాల సరసన భారత్‌కు కూడా ఉండటం ప్రతి పౌరుడినీ దిగ్భ్రాంతికి గురిచేసే అంశం.Source: జాతీయ | 19 Mar 2010 | 1:10 am రోశయ్య సీఎం క్యాంపు కార్యాలయ ముహుర్తం ఖరారు!ముఖ్యమంత్రి కె.రోశయ్య సీఎం క్యాంపు కార్యాలయ ప్రవేశం చేయనున్నారు. ఇందుకోసం వేద పండితులు శుభ ముహుర్తాన్ని ఖరారు చేశారు. ఈనెల 24వతే దీన ఉదయం 8.46 నిమిషాలకు మంచి శుభగడియలు ఉన్నాయని, అందువల్ల ఆ రోజున సీఎం క్యాంపు కార్యాలయంలోని అడుగుపెట్టాలని వారు సూచించారు. దీనికి ముఖ్యమంత్రి సమ్మంతించారు. దీంతో కార్యాలయ ప్రవేశం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 19 Mar 2010 | 12:23 am నేటి నుంచి తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలుతమిళనాడు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. దాదాపు 450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త అసెంబ్లీ ప్రాంగణంలో ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.అన్బళగన్ 2010-11 సంవత్సరానికి గాను వార్షికబడ్జెట్‌ను సభలో ప్రవేశపెడుతారు.Source: జాతీయ | 18 Mar 2010 | 11:36 pm కొందరు మంత్రులు సమావేశం పెట్టారటగా...: సీఎం ఆరా!ఫ్రీజోన్ అంశంపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానికి వ్యతిరేకంగా కొందరు మంత్రులు సమావేశం పెట్టారంట నిజమేనా అని కొందరు మంత్రులతో ముఖ్యమంత్రి రోశయ్య ఆరా తీశారు. శుక్రవారం ఉదయం తనను కలిసిన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు మంత్రులతో పిచ్చాపాటిగా మాట్లాడుతున్న సమయంలో సీఎం పైవిధంగా ప్రశ్నించినట్టు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 18 Mar 2010 | 11:20 pm మిస్టర్ చిరు.. హైదరాబాద్‌ను వదిలివెళ్లు: రాములమ్మతెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒకనాటి హీరో హీరోయిన్ల మధ్య మళ్లీ నిప్పు రాజుకుంది. ఆది నుంచి వీరి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. వారిద్దరే మెగాస్టార్ చిరంజీవి. తెలంగాణ ఆడబిడ్డ విజయశాంతి. చిరంజీవి అంటే అస్సలు పడని విజయశాంతి ఆయనపై మరోమారు కత్తులుకారాలు నూరుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 18 Mar 2010 | 10:59 pm మాయావతి ఆస్తుల వివరాల సేకరణలో కాంగ్రెస్!ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. దళిత వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అని మాయావతి చేసిన ఆరోపణలపై యూపీకి చెందిన కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే దళిలకు దేశంలో ఓ గుర్తింపు, సముచిత స్థానం లభించిందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ అన్నారు.Source: జాతీయ | 18 Mar 2010 | 10:04 pm "మాయా" దండ విలువ రూ.ఐదు కోట్లు: ఐటీ వర్గాలుఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతికి పార్టీ రజతోత్సవాల సందర్భంగా బహుకరించిన రూ.నోట్ల మాల విలువ ఐదు కోట్ల రూపాయలుగా ఉంటుందని ఆదాయపన్ను శాఖ వర్గాలు వెల్లడించాయి. బీఎస్పీ పార్టీ నేతలు వెయ్యి రూపాయల నోట్లతో ఈ దండను తయారు చేసి, ఆమె మెడలో వేశారు. దీనిపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.Source: జాతీయ | 18 Mar 2010 | 9:53 pm పైరసీపై ప్రభుత్వ స్పందన భేష్: బంద్ విరమించుకుంటున్నాంపైరసీపై ప్రభుత్వం ఇచ్చిన హామీతో సంతృప్తి చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) శుక్రవారం తలపెట్టిన బంద్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ ప్రకటించారు. యధావిధిగా సినిమా షూటింగ్‌లు జరుగుతాయని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2010 | 1:39 pm షర్ట్ బటన్ పెట్టని రీమా: "బ్రా"లో అందాలు క్లిక్ క్లిక్మొన్నీమధ్య రీమాసేన్ తన చిత్రం "సొసైటీ" ప్రమోషన్ కోసం స్మితా థాకరే ఏర్పాటు చేసిన పార్టీకి హాజరైంది. తెల్లటి క్యాజువల్ చొక్కాను ధరించిన రీమా, ఎదను పట్టి ఉంచే బ్రా మరింత పలుచనదని గుర్తించలేదో ఏమోగానీ చొక్కా గుండీ పెట్టడం మరిచిపోయింది. దీంతో బ్రా అందాలు అలవోకగా బయటకు కనిపించడం మొదలుపెట్టాయట. అంతే..! ఫోటోగ్రాఫర్లందరూ ఆమె చుట్టూ చేరి క్లిక్‌ల మీద క్లిక్‌మనిపించారట. ఎన్నడూ లేని విధంగా అంతమంది ఫోటోగ్రాఫర్లు అంతగా తన ఫోటోలకోసం ఎందుకు ఎగబడ్డారని రీమాసేన్ తర్వాత ప్రశ్నించిందట. ఆ ప్రశ్నకు జవాబు ఏం చెప్పలో తెలియక అక్కడున్నవారు నేల చూపులు చూడ్డం మొదలుపెట్టారట. చిత్రం ఏమిటంటే.. అప్పటిక్కూడా అమ్మడు చొక్కా గుండీ పెట్టనే లేదట.Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2010 | 1:29 pm మేం పైరసీకి వ్యతిరేకం.. ప్రభుత్వానికి కాదు: గోపాల కృష్ణపైరసీకారుల్ని కఠినంగా శిక్షించేలా చట్టం తేవాలని చలనచిత్ర రంగం శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి గీతారెడ్డి గురువారం సాయంత్రం సినీ పెద్దలను తమ సమస్యలపై చర్చించేందుకు తన ఛాంబర్‌కు రావాల్సిందింగా పిలుపునివ్వడంతో 24 క్రాఫ్ట్‌కు చెందిన నాయకులు తర్జనభర్జనలు పడుతున్నారు. ఈ విషయంపై పరచూరి గోపాలకృష్ణ స్పందిస్తూ... తాము పైరసీకి వ్యతిరేకమేకానీ, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. మరోవైపు... ముఖ్యమంత్రిగారు, ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినా బంద్‌కు ఎందుకు పిలుపునిచ్చారనేది కూడా చర్చకు వచ్చిందనీ, ఏదేమైనా రేపు ఏం చేస్తామనేది సాయంత్రం వెల్లడిస్తామని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2010 | 11:35 am అప్పుడు చాక్లెట్లు పంచాను: అక్కినేని నాగేశ్వర్రావు"నా మనవడు సుశాంత్ పుట్టినప్పుడు నేను వైజాగ్ షూటింగ్‌లో ఉన్నాను. వాడు అమెరికాలో పుట్టాడు. ఈ విషయం తెలిసి షూటింగ్‌లో చాక్లెట్లు పంచాను. నాకు తెలిసి అదే పండుగలా చేసుకున్నాను. ఆ తర్వాత పుట్టినరోజు ఇంటిలో మామూలుగా చేసుకున్నాను. ఇప్పుడు మటుకు నా అభిమానుల సమక్షంలో జరుపుకుంటున్నాడు" అని అక్కినేని నాగేశ్వరరావు గురువారం సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా కేక్ తినిపిస్తూ అభిమానులనుద్దేశించి అన్నారు. "నా అభిమానులు దండలు వేస్తారు. అవే మాకు అండదండలు..." అని పేర్కొన్నారు.అక్కినేని నటవారసునిగా సుశాంత్ కాళిదాసు, కరెంట్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలుకరించారు. తాజాగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చేయనున్నారు. శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది జులైలో ప్రారంభిస్తున్నట్లు శ్రీనివాసరావు చెప్పారు. ఇదే ఏడాదిలో అక్కినేని నాగార్జునతో చిత్రం ఉంటుందని తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2010 | 11:19 am "ఓం సాయిరాం" షూటింగ్ ప్రారంభంశ్రీ మల్లాది వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో జీఎస్బీ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఓం సాయిరాం చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో గురువారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సీనియర్ నిర్మాత కె. అచ్చిరెడ్డి క్లాప్‌నివ్వగా, దర్శకుల సంఘాధ్యక్షుడు సాగర్ కెమేరా స్విచాన్ చేశారు. ఈ సన్నివేశానికి దర్శకుడు వి. సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు.ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు, నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ... షిర్డీ సాయి భక్తుల యదార్థ అనుభవాలతో అల్లిన కథతో ఈ సినిమాను తీస్తున్నాం. కలలో కనిపించి ఈ సినిమా తీయమని సాయి ఆదేశించారు. ఈ రోజు నుంచి నాలుగు రోజులపాటు చిత్రీకరణ జరిపి, ఏప్రిల్ తొలివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం అని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2010 | 11:03 am మహిళ హక్కులకోసం "కలెక్టర్ గారి భార్య"ప్రకాష్ రాజ్, భూమిక జంటగా నూతన చిత్ర నిర్మాణ సంస్థ అమోగ్ ఎంటర్ టైన్మెంట్స్ తమ తొలిచిత్రంగా "కలెక్టర్ గారి భార్య"ను రూపొందిస్తోంది. సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా దీనిని దర్శకుడు టేకుల కృపాకర్ రెడ్డి రూపొందిస్తున్నారు. వి.వనితావాణి, ఎ.రాధికా రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రంకోసం ఓ గీతాన్ని నాయిక భూమికతోపాటు దాదాపు ఐదువందలమంది మహిళలు పాల్గొనగా హైదరాబాద్‌లోని రోడ్లపై చిత్రీకరించారు. "చేయిచేయి కలిపి కదలవే మగవానితో సమ హక్కులు పొందేవరకు.." అనే పల్లవితో సాగే ఈ గీతాన్ని రచయిత పైడిశెట్టి రామ్ రచించగా, శివశంకర్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరించారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2010 | 10:19 am దారిద్ర్యరేఖకు దిగువనున్న ప్రజలకు 25 కేజీల గోధుమలుదారిద్ర్యరేఖకు దిగువున ఉండే ప్రజలకు నెలకు 25 కేజీల గోధుమలను సరఫరా చేయనున్నట్టు కేంద్ర ఆహార శాఖామంత్రి శరద్ పవార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును వచ్చే నెలలో ప్రారంభమయ్యే సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు.Source: జాతీయ | 18 Mar 2010 | 7:14 am నేను చేస్తానని చెప్పాగా.. బంద్ ఎందుకు..?: రోశయ్యపైరసీ జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని చెప్పినప్పటికీ సినీ పరిశ్రమ శుక్రవారం బంద్‌కు పిలుపునివ్వడంపై ముఖ్యమంత్రి రోశయ్య "మా"పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పైరసీకి పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టంగా చెప్పినప్పటికీ బంద్‌లు, నిరాహార దీక్షలు చేయడం దేనికని నేరుగా "మా" సభ్యులకే ఫోన్ చేసి అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, సినీనటి జయసుధ సినీ నిర్మాతలకు పైరసీ ద్వారా జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడే పైరసీ చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చామని ముఖ్యమంత్రి రోశయ్య వారితో చెప్పినట్లు తెలిసింది. ఇంత స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ చిత్ర పరిశ్రమ ఇలా స్పందించడం ఏం బాగా లేదనీ, కనుక వెంటనే బంద్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించినట్లు సమాచారం.ఈ నేపధ్యంలో ఫిలిం ఛాంబర్లో "మా" అత్యవసరంగా సమావేశమై శుక్రవారం బంద్ విషయంపై చర్చ చేపట్టింది. ముఖ్యమంత్రి సూచనల మేరకు బంద్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటుందో... లేదంటే స్పష్టమైన హామీ అంటూ రోడ్డెక్కుతుందో చూడాలి.Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2010 | 7:02 am త్వరలో పైరసీ నిరోధానికి ఆర్డినెన్స్: సీఎం హామీవచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పైరసీకి ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చేందుకు ముఖ్యమంత్రి కె.రోశయ్య అంగీకరించారని తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఛైర్మన్ ఎం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. అలాగే, లైసెన్సు లేని వీడియో దుకాణాలను మూడు నెలల్లో మూసి వేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి జె.గీతారెడ్డి హామీ ఇచ్చినట్టు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 18 Mar 2010 | 7:00 am అప్పుడు చాక్లెట్లు పంచాను: అక్కినేని నాగేశ్వర్రావు"నా మనవడు సుశాంత్ పుట్టినప్పుడు నేను వైజాగ్ షూటింగ్‌లో ఉన్నాను. వాడు అమెరికాలో పుట్టాడు. ఈ విషయం తెలిసి షూటింగ్‌లో చాక్లెట్లు పంచాను. నాకు తెలిసి అదే పండుగలా చేసుకున్నాను. ఆ తర్వాత పుట్టినరోజు ఇంటిలో మామూలుగా చేసుకున్నాను. ఇప్పుడు మటుకు నా అభిమానుల సమక్షంలో జరుపుకుంటున్నాడు" అని అక్కినేని నాగేశ్వరరావు గురువారం సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా కేక్ తినిపిస్తూ అభిమానులనుద్దేశించి అన్నారు. "నా అభిమానులు దండలు వేస్తారు. అవే మాకు అండదండలు..." అని పేర్కొన్నారు.అక్కినేని నటవారసునిగా సుశాంత్ కాళిదాసు, కరెంట్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలుకరించారు. తాజాగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చేయనున్నారు. శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది జులైలో ప్రారంభిస్తున్నట్లు శ్రీనివాసరావు చెప్పారు. ఇదే ఏడాదిలో అక్కినేని నాగార్జునతో చిత్రం ఉంటుందని తెలిపారు.Source: వినోదం | 18 Mar 2010 | 5:50 am "ఓం సాయిరాం" షూటింగ్ ప్రారంభంశ్రీ మల్లాది వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో జీఎస్బీ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఓం సాయిరాం చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో గురువారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సీనియర్ నిర్మాత కె. అచ్చిరెడ్డి క్లాప్‌నివ్వగా, దర్శకుల సంఘాధ్యక్షుడు సాగర్ కెమేరా స్విచాన్ చేశారు. ఈ సన్నివేశానికి దర్శకుడు వి. సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు.ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు, నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ... షిర్డీ సాయి భక్తుల యదార్థ అనుభవాలతో అల్లిన కథతో ఈ సినిమాను తీస్తున్నాం. కలలో కనిపించి ఈ సినిమా తీయమని సాయి ఆదేశించారు. ఈ రోజు నుంచి నాలుగు రోజులపాటు చిత్రీకరణ జరిపి, ఏప్రిల్ తొలివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం అని చెప్పారు.Source: వినోదం | 18 Mar 2010 | 5:34 am మహిళ హక్కులకోసం "కలెక్టర్ గారి భార్య"ప్రకాష్ రాజ్, భూమిక జంటగా నూతన చిత్ర నిర్మాణ సంస్థ అమోగ్ ఎంటర్ టైన్మెంట్స్ తమ తొలిచిత్రంగా "కలెక్టర్ గారి భార్య"ను రూపొందిస్తోంది. సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా దీనిని దర్శకుడు టేకుల కృపాకర్ రెడ్డి రూపొందిస్తున్నారు. వి.వనితావాణి, ఎ.రాధికా రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రంకోసం ఓ గీతాన్ని నాయిక భూమికతోపాటు...Source: వినోదం | 18 Mar 2010 | 4:50 am ఫ్రీజోన్‌పై శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదంరాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని, ఆరో జోన్‌లో భాగమని పేర్కొంటూ గురువారం శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సభ్యుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ముఖ్యమంత్రి కె.రోశయ్య మాత్రం తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టి ఆమోదించేలా చేశారు.Source: ఏపీ న్యూస్ | 18 Mar 2010 | 4:48 am ఏమిటీ దారుణం.. చర్చ లేకుండా ఆమోదిస్తారా...?: చిరురాష్ట్ర ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న కీలక అంశంమైన ఫ్రీజోన్‌పై ఎటువంటి చర్చ లేకుండా అధికార కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఏకపక్షంగా ఆమోదించడం దారుణమని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి విర్శించారు.Source: ఏపీ న్యూస్ | 18 Mar 2010 | 4:30 am డిసెంబరు 31లోపు పని పూర్తి చేస్తాం: జస్టీస్ శ్రీకృష్ణఎట్టి పరిస్థితుల్లోనైనా తమ పనిని డిసెంబరు 31వ తేదీలోపు పూర్తి చేస్తామని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని ఆ కమిటీ ఛైర్మన్ జస్టీస్ శ్రీకృష్ణ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల అధ్యయనానికి కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ న్యూఢిల్లీలో సమావేశమైన విషయం తెల్సిందే. ఈ కమీటీ భేటీ కావడం ఇది మూడోసారి.Source: ఏపీ న్యూస్ | 18 Mar 2010 | 3:53 am గోవాలో రష్యా మహిళ అనుమానాస్పద మృతిగోవాలో మరో విదేశీ మహిళ ప్రాణాలు కోల్పోయింది. విహార యాత్రకు వచ్చిన రష్యా మహిళ గోవా హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇది గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పోలీసు ఇన్‌స్పెక్టర్ మంజునాత్ దేశాయ్ తెలిపారు.Source: జాతీయ | 18 Mar 2010 | 3:38 am
|