|
గోవాలో రష్యా మహిళ అనుమానాస్పద మృతిగోవాలో మరో విదేశీ మహిళ ప్రాణాలు కోల్పోయింది. విహార యాత్రకు వచ్చిన రష్యా మహిళ గోవా హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇది గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పోలీసు ఇన్‌స్పెక్టర్ మంజునాత్ దేశాయ్ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 18 Mar 2010 | 9:07 am నష్టాల బాటలో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ పతనందేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే మిశ్రమ ఫలితాలను నమోదుచేసుకుంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 45 పాయింట్ల నష్టంతో 17,444 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ కూడా ఏడు పాయింట్ల పతనంతో 5,224 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 18 Mar 2010 | 7:36 am నేను చేస్తానని చెప్పాగా.. బంద్ ఎందుకు..?: రోశయ్యపైరసీ జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని చెప్పినప్పటికీ సినీ పరిశ్రమ శుక్రవారం బంద్‌కు పిలుపునివ్వడంపై ముఖ్యమంత్రి రోశయ్య "మా"పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పైరసీకి పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టంగా చెప్పినప్పటికీ బంద్‌లు, నిరాహార దీక్షలు చేయడం దేనికని నేరుగా "మా" సభ్యులకే ఫోన్ చేసి అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, సినీనటి జయసుధ సినీ నిర్మాతలకు పైరసీ ద్వారా జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడే పైరసీ చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చామని ముఖ్యమంత్రి రోశయ్య వారితో చెప్పినట్లు తెలిసింది. ఇంత స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ చిత్ర పరిశ్రమ ఇలా స్పందించడం ఏం బాగా లేదనీ, కనుక వెంటనే బంద్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించినట్లు సమాచారం.ఈ నేపధ్యంలో ఫిలిం ఛాంబర్లో "మా" అత్యవసరంగా సమావేశమై శుక్రవారం బంద్ విషయంపై చర్చ చేపట్టింది. ముఖ్యమంత్రి సూచనల మేరకు బంద్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటుందో... లేదంటే స్పష్టమైన హామీ అంటూ రోడ్డెక్కుతుందో చూడాలి.Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2010 | 7:02 am ఫ్రీజోన్‌పై అసెంబ్లీలో తీర్మానం వద్దు: లగడపాటి విజ్ఞప్తిహైదరాబాద్ను ఫ్రీజోన్‌గానే ఉంచాలని, దీన్ని ఆరో జోన్ పరిధిలోకి మార్చేందుకు వీలుగా అసెంబ్లీలో తీర్మానం చేయవద్దని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్‌ను గురువారం కలిసి ఒక వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫ్రీజోన్ అంశంపై తీర్మానం వద్దని ఆయన గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినట్టు సమావేశం అనంతరం లగడపాటి మీడియాకు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 18 Mar 2010 | 6:57 am స్వల్ప నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్గురువారం బాంబే స్టాక్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు లాభనష్టాలతో ర్యాలీని కొనసాగిస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 20 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,469 పాయింట్ల వద్ద పయనిస్తుండగా, నిఫ్టీ కేవలం రెండు పాయింట్ల నష్టంతో, 5,229 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 18 Mar 2010 | 6:51 am 14 ఎఫ్‌ను ఎలా సవరిస్తారో అదీ చూస్తాం: దేవినేనిరాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14 ఎఫ్ పేరాను ఎలా సవరిస్తారో (తొలగిస్తారో) మేం చూస్తామని తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించే అధికారం ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.Source: Yahoo! Telugu: News | 18 Mar 2010 | 6:49 am పాఠశాలలకు అధిక చక్కెరల పెప్సీ- కోక్‌లు "బంద్"2012 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో తమ శీతల పానీయాలలో కొన్ని రకాలైన పానీయల అమ్మకాలను నిలుపుదల చేయాలనుకుంటున్నట్లు ప్రముఖ శీతలపానీయ కంపెనీలైన పెప్సీ, కోకా కోలాలు ప్రకటించాయి. పూర్తి చక్కెరతో కూడిన సాప్ట్ పానీయాలను పాఠశాలల్లో అమ్మకూడదని తమకు తాముగా నిర్ణయం తీసుకున్నామని పెప్సీ కంపెనీ తెలిపిందిSource: Yahoo! Telugu: News | 18 Mar 2010 | 6:38 am 2012లో విజయవాడ-చెన్నయ్‌లకు గ్యాస్ సరఫరా: దేవ్రావచ్చే 2012 సంవత్సరం నాటికి విజయవాడ-చెన్నయ్, చెన్నయ్-తూత్తుక్కుడి నగర వాసుల గృహాలకే వంటగ్యాస్‌ను సరఫరా చేయనున్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి మురళీ దేవ్‌రా తెలిపారు. ఇందుకోసం నిర్మిస్తున్న పైపులైన్ నిర్మాణ పనులు నిర్ణీత కాలంలోగా పూర్తి చేయాల్సిందిగా ఆదేశించినట్టు ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 18 Mar 2010 | 6:34 am అవయవాలను దానం చేసిన పాకిస్థాన్ అధ్యక్షుడుపాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తన అవయవాలను దానం చేశారు. మరణానంతరం తన శరీర అవయవాలను ఇతరులకు ఉపయోగించేలా అవయవదాన పత్రాలపై ఆయన గురువారం సంతకాలు చేశారు. తన సతీమణి, మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో సిద్ధాంతాల్లో ఒకటైన అవయవదానంపై విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.Source: Yahoo! Telugu: News | 18 Mar 2010 | 6:22 am ప్రేయసికి నిప్పు: నేపాల్‌కు పరారైన ఎస్పీ ఎమ్మెల్యేప్రేమించిన యువతిని హతమార్చేందుకు నిప్పు పెట్టిన సమాజ్‌వాదీ పార్టీ శాసనసభ్యుడు నేపాల్‌కు పారిపోయినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సదర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎస్పీకి చెందిన శ్రీపత్ అజాద్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 18 Mar 2010 | 6:08 am రవితేజ "రొమాంటిక్ రుషి" నిత్యానంద లీలలేనా...!!టాలీవుడ్‌లో కొత్త సినిమాలకు సంతకాలు చేస్తూ మహా బిజీగా ఉన్న నటుడు రవితేజ. "వీర", "డాన్ శీను" చిత్రాల్లో నటిస్తున్న రవితేజ కొత్తగా "రొమాంటిక్ రుషి" అనే చిత్రంలో నటించడానకి అంగీకారం తెలిపాడు. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.రవితేజ నటిస్తున్న చిత్రాలు పూర్తవగానే రొమాంటిక్ రుషి చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు చిత్ర దర్శకనిర్మాతలు చెపుతున్నారు. ఇదిలావుండగా "రొమాంటిక్ రుషి" అనే పేరు వినగానే నిత్యానంద వ్యవహారాన్నేమైనా నేపధ్యంగా తీసుకుంటున్నారా...? అని సినీజనం సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే "రొమాంటిక్ రుషి"లో నిత్యానందగా రవితేజ నటిస్తే... మరి రంజిత పాత్రలో ఏ హీరోయిన్ నటించబోతున్నదీ...అనే ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. అయితే నిత్యానంద జీవితం ఆధారంగా తాము ఏ చిత్రాన్ని తీయడం లేదనీ, రొమాంటిక్ రుషి కథ విభిన్నమైనదనీ సదరు చిత్ర దర్శకుడు చెపుతున్నారట.Source: Yahoo! Telugu: Entertainment | 18 Mar 2010 | 5:53 am కర్ణాటకలో 11 మంది ఛోటా షకీల్ అనుచరుల అరెస్టుకర్ణాటక రాష్ట్రంలో అండర్ వరల్డ్ క్రిమినల్ ఛోటా షకీల్ ముఠాకు చెందిన 11 మందిని అరెస్టు చేశారు. వీరిలో షార్ప్ షూటర్ గణేష్ శెట్టి కూడా ఉన్నట్టు ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 18 Mar 2010 | 5:48 am డిసెంబరు 31లోపు పని పూర్తి చేస్తాం: జస్టీస్ శ్రీకృష్ణఎట్టి పరిస్థితుల్లోనైనా తమ పనిని డిసెంబరు 31వ తేదీలోపు పూర్తి చేస్తామని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని ఆ కమిటీ ఛైర్మన్ జస్టీస్ శ్రీకృష్ణ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల అధ్యయనానికి కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ న్యూఢిల్లీలో సమావేశమైన విషయం తెల్సిందే. ఈ కమీటీ భేటీ కావడం ఇది మూడోసారి.Source: ఏపీ న్యూస్ | 18 Mar 2010 | 3:53 am గోవాలో రష్యా మహిళ అనుమానాస్పద మృతిగోవాలో మరో విదేశీ మహిళ ప్రాణాలు కోల్పోయింది. విహార యాత్రకు వచ్చిన రష్యా మహిళ గోవా హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇది గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పోలీసు ఇన్‌స్పెక్టర్ మంజునాత్ దేశాయ్ తెలిపారు.Source: జాతీయ | 18 Mar 2010 | 3:38 am 14 ఎఫ్‌ను ఎలా సవరిస్తారో అదీ చూస్తాం: దేవినేనిరాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14 ఎఫ్ పేరాను ఎలా సవరిస్తారో (తొలగిస్తారో) మేం చూస్తామని తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించే అధికారం ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 18 Mar 2010 | 1:34 am ఫ్రీజోన్‌పై అసెంబ్లీలో తీర్మానం వద్దు: లగడపాటి విజ్ఞప్తిహైదరాబాద్ను ఫ్రీజోన్‌గానే ఉంచాలని, దీన్ని ఆరో జోన్ పరిధిలోకి మార్చేందుకు వీలుగా అసెంబ్లీలో తీర్మానం చేయవద్దని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్‌ను గురువారం కలిసి ఒక వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫ్రీజోన్ అంశంపై తీర్మానం వద్దని ఆయన గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినట్టు సమావేశం అనంతరం లగడపాటి మీడియాకు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 18 Mar 2010 | 1:28 am ప్రేయసికి నిప్పు: నేపాల్‌కు పరారైన ఎస్పీ ఎమ్మెల్యేప్రేమించిన యువతిని హతమార్చేందుకు నిప్పు పెట్టిన సమాజ్‌వాదీ పార్టీ శాసనసభ్యుడు నేపాల్‌కు పారిపోయినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సదర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎస్పీకి చెందిన శ్రీపత్ అజాద్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.Source: జాతీయ | 18 Mar 2010 | 12:38 am కర్ణాటకలో 11 మంది ఛోటా షకీల్ అనుచరుల అరెస్టుకర్ణాటక రాష్ట్రంలో అండర్ వరల్డ్ క్రిమినల్ ఛోటా షకీల్ ముఠాకు చెందిన 11 మందిని అరెస్టు చేశారు. వీరిలో షార్ప్ షూటర్ గణేష్ శెట్టి కూడా ఉన్నట్టు ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు.Source: జాతీయ | 18 Mar 2010 | 12:18 am ఎన్నికల్లో పోటీ చేయడం మా పార్టీ బాధ్యత: మొయిలీఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఒక జాతీయ పార్టీగా పోటీ చేయడం తమ కనీస బాధ్యత అని కేంద్ర న్యాయ శాఖామంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. అందువల్ల తెలంగాణ ఉద్యమం కారణంగా ఖాళీ ఏర్పడిన అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆయన తేల్చి చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2010 | 11:11 pm ఫ్రీజోన్‌పై తీర్మానాన్ని అడ్డుకుంటాం: సీమాంధ్ర సభ్యులురాష్ట్రంలో మరో చిచ్చు ఆరంభమైంది. హైదరాబాద్ ఫ్రీజోన్ అంశంపై మళ్లీ వివిధ పార్టీల ఎమ్మెల్యేల మధ్య విభేదాలు పొడచూపాయి. ఫ్రీజోన్ అంశంపై అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఏకగ్రీవ తీర్మానాన్ని అడ్డుకుంటామని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు గురువారం ముఖ్యమంత్రి రోశ్యయతో ఆయన ఛాంబర్‌లో భేటీ అయ్యారు.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2010 | 11:05 pm నీ పేరెత్తానా.. నీ ఊరెత్తానా... కూర్చోవయ్యా: రోశయ్యముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు కోపం ఎక్కువైపోతోంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులపై ఎదురుదాడికి దిగుతున్నారు. తన ప్రసంగానికి ఏమాత్రం అడ్డుతగిలినా అసహనంతో ఊగిపోతున్నారు. అంతటితో ఆగకుండా ఆ సభ్యునిపై మాటలతూటాలను ప్రయోగిస్తున్నారు. రోశయ్య వ్యవహారశైలి అధికార పార్టీ సభ్యులకు నవ్వు తెప్పిస్తుండగా, ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహానికి లోనవుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2010 | 10:41 pm దేశ నదుల ప్రక్షాళనకు రూ.33 వేల కోట్లు కావాలి!దేశంలోని పవిత్ర నదీ జలాలు నానాటికీ కలుషితమవుతున్నాయి. ఫలితంగా ఈ జలాలను మంచినీటిగానే కాకుండా చివరకు స్నానం చేసేందుకు కూడా పనిరాకుండా పోతున్నాయని పచ్చి నిజాన్ని భక్తులు తెలుసుకోవాల్సి వుంది. ఈ నదుల ప్రక్షాళనకు 33 వేల కోట్ల రూపాయలు అవసరం అవతాయని నిపుణులు అంచనా వేశారు.Source: జాతీయ | 17 Mar 2010 | 10:04 pm ఉత్తరప్రదేశ్‌లో ఏప్రిల్ 14 నుంచి కాంగ్రెస్ యాత్రలు!ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి తమపై చేస్తున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే నెల 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త యాత్రను చేపట్టనుంది. ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చుట్టివచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది.Source: జాతీయ | 17 Mar 2010 | 9:34 pm పైరసీకి వ్యతిరేకంగా 19న టాలీవుడ్ బంద్నిర్మాతలను భారీగా కుంగదీస్తున్న పైరసీ రక్కసిని మట్టుబట్టేందుకు తెలుగు సినీ పరిశ్రమ పట్టుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం పైరసీపై గూండా చట్టాన్ని ప్రయోగిస్తామని హామీ ఇవ్వడంతోపాటు అమలు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి తెలుగు సినీ పరిశ్రమ అంతా డిమాండ్ చేస్తుంది. ఇందుకు గాను మార్చి 19న సినిమా పరిశ్రమ బంద్ చేయనున్నట్లు ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు వెల్లడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Mar 2010 | 12:42 pm పైరసీకారులు నిర్మాతల జేబులు కత్తిరిస్తున్నారు: చిరుసినీ నిర్మాతల జేబుల్ని పైరసీకారులు కొల్లగొడుతున్నారని చిరంజీవి అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోందని ఎద్దేవా చేశారు. పైరసీపై ప్రభుత్వం చర్య తీసుకునేంతవరకూ అసెంబ్లీలో పోరాడతామన్నారు. ఇది ఏ ఒక్కరి సమస్యో కాదనీ, కొన్ని వేల కుటుంబాల సమస్య అనీ అన్నారు. గత మూడు రోజులుగా ఫిలిమ్ ఛాంబర్లో పైరసీపై పోరాడుతున్న "మాయగాడు" చిత్ర నిర్మాత యలమంచి రవిచంద్‌కు మద్దతుగా చిరంజీవి బుధవారం మధ్యాహ్నం సంఘీభావం తెలిపారు. ఇంకా అల్లు అర్జున్, అక్కినేని నాగార్జున, ఎన్టీఆర్, నాగచైతన్యతోపాటు 24 క్రాఫ్ట్‌కు చెందిన సంఘాలు సంఘీభావాన్ని తెలిపాయి.Source: Yahoo! Telugu: Entertainment | 17 Mar 2010 | 11:43 am కుమారస్వామి క్రియేషన్స్ చిత్రం "స్వర్ణ మంజరి"కుమారస్వామి క్రియేషన్స్ చిత్రం "స్వర్ణ మంజరి" బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. విష్ణు హీరోగా పరిచయమవుతున్నారు. అమృతవల్లి కథానాయికగా నటిస్తోంది. ఓపెనింగ్ షాట్‌కు దర్శకుడు సముద్ర క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు సాగర్ స్విచ్చాన్ చేశారు. కెమేరామెన్ శ్రీనివాసరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఇంద్ర మాట్లాడుతూ.. ఇదో వైవిధ్యమైన కథాంశం. ఉయ్యూరులో షూటింగ్ చేస్తాం. కిరణ్ రాథోడ్ స్పెషల్ సాంగ్‌లో పాల్గొంటుందని చెప్పారు. హీరో విష్ణు మాట్లాడుతూ.. నేను పలు సీరియల్స్‌లో నటించాను. హీరోగా తొలిసారిగా నటిస్తున్నాను. మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. ఈ చిత్రానికి కథ: అప్పాజీ, కో ప్రొడ్యూసర్స్: కేఎస్ అర్జున్, కొడాలి రాజ్ కుమార్, గుబ్బా అమరేష్, గుమ్మడి శ్రీనివాస్.Source: Yahoo! Telugu: Entertainment | 17 Mar 2010 | 11:27 am ఎనిమిది కథలతో సినిమాఫైవ్ ఫింగర్స్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై జలంధర్ అనే నిర్మాత "8" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం బుధవారం ఫిలిమ్ ఛాంబర్ క్లబ్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రమంత్రి డి.కె. అరుణ హాజరయ్యారు. దేవేందర్ గౌడ్ కెమేరా స్విచ్చాన్ చేశారు.ఈ సందర్భంగా నిర్మాత జలంధర్ మాట్లాడుతూ.. "కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. షూటింగ్ ప్రారంభించాం. 100 రోజుల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాము. ఈ చిత్రంలో మొత్తం 8 కథలుంటాయి. ఒక్కో కథకు ఒక్కో దర్శకుడు దర్శకత్వం వహిస్తారు. అలాగే ఇందులో నటించే నటీనటులు ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామ"ని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Mar 2010 | 11:11 am హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ఉంచాల్సిందే: ఎంపీ లగడపాటిహైదరాబాద్ను ఫ్రీ జోన్‌గా ఉంచాల్సిందేనని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాజ్యాంగ సవరణ చేపట్టాలని చేస్తున్న పార్టీల వాదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన ముఖ్యమంత్రి కె.రోశయ్యకు ఆయన బుధవారం లేఖ రాశారు.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2010 | 9:33 am డబ్బు తీసుకోకుండా ఓటు వేసే దమ్ముందా...?నేటి కుళ్లు రాజకీయ వ్యవస్థను తూర్పారబడుతూ తెరకెక్కిన చిత్రం "లీడర్". ఈ చిత్రం ద్వారా తెలుగుతెరకు కొత్తగా పరిచయమైన రానా యాక్టింగ్ చక్కగా సరిపోయింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శింపబడుతోన్న ఈ చిత్రంలో దర్శకుడు శేఖర్ కమ్ముల పలు "పంచ్" డైలాగులను వాడి ప్రజలను ఆలోచనలో పడవేశారు.రాజకీయ నాయకుడుకు ఉన్న కోణాలన్నిటినీ దాదాపు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. స్వలాభాపేక్షతో కాకుండా ఉన్నత భావాలతో ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ఓ యువకుడు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. మొత్తమ్మీద తొలి చిత్రంతోనే స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ రామానాయుడు మనవడు, డి. సురేష్ బాబు కుమారుడైన జూనియర్ రామానాయుడు( రానా) మంచి మార్కులే కొట్టేశాడు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Mar 2010 | 7:42 am అణు ప్రమాద పరిహార బిల్లుపై చర్చకు సిద్ధం: ప్రభుత్వంఅణు రియాక్టర్ల ప్రమాద పరిహార బిల్లుపై ప్రతిపక్షాల ఒత్తిడికి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తలొగ్గింది. ఈ బిల్లుపై శాంతియుత వాతావరణంలో చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రతిపాదన చేసింది. ఈ అంశంపై కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖామంత్రి పృథ్విరాజ్ చౌహాన్ మాట్లాడుతూ.. విదేశీ పెట్టుబడులతో అణు రియాక్టర్లను ప్రారంభించాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదన్నారు.Source: జాతీయ | 17 Mar 2010 | 7:33 am రాజ్యాంగ సవరణకు అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కేసీఆర్ఫ్రీజోన్ అంశంపై ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రమత్తు వీడాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని ఆయన కోరారు.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2010 | 7:19 am పైరసీని అరికట్టకపోతే షూటింగ్‌లు బంద్: సురేష్పైరసీ వ్యవహారం ముదిరి పాకాన పడుతున్నట్లు కనబడుతోంది. బుధవారం చిత్ర పరిశ్రమలోని పెద్ద నిర్మాతలందరూ ఒకచోట చేరి పైరసీని అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే ఓ చట్టాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, కేరళ, తమిళనాడులో ఉన్నట్లు పైరసీని గూండా యాక్ట్ కిందకు తీసుక రావాలని కోరారు. ఉన్న చట్టాన్ని అమలు చేస్తే సరిపోతుందని ముఖ్యమంత్రి రోశయ్య వ్యాఖ్యానిస్తే, పరిశీలిస్తామని మంత్రి గీతారెడ్డి చెప్పడంపై నిర్మాతల మండలి అసంతృప్తిని వ్యక్తం చేసింది. గతంలో పైరసీ సెల్ ఏర్పాటు చేసి పైరసీలకు పాల్పడుతున్న సుమారు 6వేల మందిని పట్టుకుని పోలీసులకు అప్పచెబితే... వారంతా దర్జాగా బయటే తిరుగుతున్నారన్నారు. వారికి సరైన శిక్షలు పడకపోవడంతో తిరిగి కాలర్ ఎగరేసుకుంటూ పైరసీ కార్యకలాపాలను యధేచ్ఛగా చేసుకుంటూ పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Mar 2010 | 6:13 am అతను సెక్సీ సింహం: శ్రద్దా దాస్జగపతి బాబు అంటే చాలు అతనిలో శోభన్ బాబును చూస్తున్నామని చాలామంది హీరోయిన్లు చెపుతుంటారు. అయితే శ్రద్దాదాస్ మాత్రం జగపతిని మరోలా చూసింది. "జగపతి బాబును సెక్సీ సింహం అని పిలుస్తాను. మనిషి మ్యాన్లీగా ఉంటాడు. సూటిగా చూస్తూ ఆయనతో మాట్లాడలేను. అధినేత చిత్రంలో ఆయనతో కలిసి నటించాను. గడగడా మాట్లాడేస్తాడు. అందుకే ఆయన ఎదురుగా నేను మాట్లాడలేను. ఇక శివాజీతో ఓ సినిమా చేశాను. నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ అని తెలుసుకుని... ఆశ్చర్యపోయాడు. అంతేకాక.. అసలు నీలో అమ్మాయి లక్షణాలు ఏ కోశానా లేవని అంటాడు. అవన్నీ పక్కన పెడితే... అతని నుంచి చాలా నేర్చుకున్నా"నని చెబుతోంది శ్రద్దా.Source: Yahoo! Telugu: Entertainment | 17 Mar 2010 | 5:48 am పాకిస్థాన్‌లో 42 ఉగ్రవాద స్థావరాలు: ఏకే ఆంటోనీపాకిస్థాన్ కేంద్రంగా 42 ఉగ్రవాద సంస్థలు పని చేస్తున్నట్టు కేంద్ర రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ స్పష్టం చేశారు. వీటి కార్యకలాపాలను నిర్వీర్యం చేసేందుకు పాక్ పాలకులు కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.Source: జాతీయ | 17 Mar 2010 | 4:22 am విమర్శలు బేఖాతర్: మాయావతికి మరో రూ.నోట్ల దండఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై వస్తున్న విమర్శలను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవ ఉత్సవాల్లో ఆమెకు బహుకరించిన వెయ్యి రూపాయిల నోట్ల దండపై దేశ వ్యాప్తంగా చర్చతో పాటు.. విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితిల్లో బుధవారం మరో నోట్ల దండను ఆ పార్టీ నేతలు బహుకరించారు. ఈ దండలో 18 లక్షల రూపాయల విలువచేసే నోట్లను పొందుపరిచారు.Source: జాతీయ | 17 Mar 2010 | 3:12 am ప్రకృతి చెక్కిన శిల్పం "బ్రైస్ కన్‌యోన్ నేషనల్ పార్క్"ఎరుపు, పసుపు, గులాబీ, నారింజ, బ్రౌన్ రంగుల్లో లెక్కకుమించీ కనిపించే గుళ్ళు, గోపురాలు, గుహలు, అంతఃపురాలను పోలిన ప్రకృతి చెక్కిన శిల్పాలు "బ్రైస్ కన్‌యోన్ నేషనల్ పార్కు"లో చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. రక రకాల ఆకృతుల్లో, వినూత్నమైన శిల్పాలు నిండి ఉండే ఈ సన్నటి లోయలో చిత్ర విచిత్రమైన రంగులతో రాళ్లన్నీ గుసగుసలాడుతున్నట్లు అనిపిస్తుంటుంది.Source: వినోదం | 17 Mar 2010 | 2:42 am
|