|
దావూద్‌కు కుటుంబాన్ని మరో చోటికి తరలించే యోచన?పాకిస్థాన్‌లో ఉంటున్న తన కుటుంబాన్ని మరో చోటికి తరలించాలనే యోచనలో అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం ఇన్నట్టు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఒత్తిడి అధికం కావడంతో పాక్‌లో నెలకొన్న పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో మరో సురక్షితమైన ప్రాంతానికి తరలించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నట్టు వినికిడి.Source: Yahoo! Telugu: News | 17 Mar 2010 | 8:59 am విమర్శలు బేఖాతర్: మాయావతికి మరో రూ.నోట్ల దండఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై వస్తున్న విమర్శలను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవ ఉత్సవాల్లో ఆమెకు బహుకరించిన వెయ్యి రూపాయిల నోట్ల దండపై దేశ వ్యాప్తంగా చర్చతో పాటు.. విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితిల్లో బుధవారం మరో నోట్ల దండను ఆ పార్టీ నేతలు బహుకరించారు. ఈ దండలో 18 లక్షల రూపాయల విలువచేసే నోట్లను పొందుపరిచారు.Source: Yahoo! Telugu: News | 17 Mar 2010 | 8:41 am ఆశాజనకంగా అంతర్జాతీయ మార్కెట్లు: సెన్సెక్స్ వృద్ధిఅంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగా కొనసాగడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభాలతో పుంజుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 127 పాయింట్లు బలపడి, 17,510 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 35 పాయింట్లు వృద్ధి చెంది, 5,233 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 17 Mar 2010 | 8:41 am ఆర్థికవృద్ధిపై ప్రణబ్ ప్రకటన: సెన్సెక్స్ వృద్ధిఆర్థిక వృద్ధి రేటు త్వరలో 9-10% పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రకటన బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధికి సహకరించింది. ఫలితంగా బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభాలను ఆర్జించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 155 పాయింట్లు లాభపడి, 17,538 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 17 Mar 2010 | 8:18 am ఏప్రిల్‌లో మంత్రివర్గ విస్తరణ: వ్యతిరేకులకు చెక్!రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. క్లిష్ట పరిస్థితుల్లో సీఎం పీఠాన్ని అధిరోహించిన కొణిజేటి రోశయ్య.. పాత మంత్రివర్గంతోనే ఇంతకాలం నెట్టుకొస్తున్నారు. ఎన్నో రకాలైన ఆటుపోట్లు ఎదురైనా.. విమర్శలు వెల్లువెత్తినా ఆయన ఎక్కడా తొణకలేదు.. బెణకలేదు. అధిష్టానం అప్పగించిన బాధ్యతలను ముదిమి వయస్సులోనూ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 17 Mar 2010 | 7:51 am డబ్బు తీసుకోకుండా ఓటు వేసే దమ్ముందా...?నేటి కుళ్లు రాజకీయ వ్యవస్థను తూర్పారబడుతూ తెరకెక్కిన చిత్రం "లీడర్". ఈ చిత్రం ద్వారా తెలుగుతెరకు కొత్తగా పరిచయమైన రానా యాక్టింగ్ చక్కగా సరిపోయింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శింపబడుతోన్న ఈ చిత్రంలో దర్శకుడు శేఖర్ కమ్ముల పలు "పంచ్" డైలాగులను వాడి ప్రజలను ఆలోచనలో పడవేశారు.రాజకీయ నాయకుడుకు ఉన్న కోణాలన్నిటినీ దాదాపు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. స్వలాభాపేక్షతో కాకుండా ఉన్నత భావాలతో ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ఓ యువకుడు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. మొత్తమ్మీద తొలి చిత్రంతోనే స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ రామానాయుడు మనవడు, డి. సురేష్ బాబు కుమారుడైన జూనియర్ రామానాయుడు( రానా) మంచి మార్కులే కొట్టేశాడు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Mar 2010 | 7:42 am పుంజుకున్న ట్రేడింగ్: లాభాల్లో స్టాక్ మార్కెట్దేశీయ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాల దిశగా ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం దిశగా పయనిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 143 పాయింట్లు పుంజుకుని, 17,526 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 46 పాయింట్లు వృద్ధి చెంది, 5,246పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 17 Mar 2010 | 7:35 am శాఖమూరి ఎన్‌కౌంటర్... 22, 23 తేదీల్లో బంద్: మావోలుమావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు సోలిపేట కొండల్ రెడ్డిల ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈనెల 22, 23, తేదీల్లో బంద్‌కు పిలుపునిస్తున్నట్టు మావోయిస్టులు ప్రకటించారు. 48 గంటలపాటు సాగే ఈ బంద్ మొత్తం ఆరు రాష్ట్రాల్లో పాటిస్తామని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కిషన్ జీ తరపు ప్రతినిధి ధనుంజయ్ వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 17 Mar 2010 | 7:06 am ఆర్థికంగా చైనాను అధిగమించనున్న భారత్: అంజలికావచ్చే 2018 నాటికి భారతదేశం ఆర్థికంగా మరింత వృద్ధి చెంది పొరుగుదేశమైన చైనాను కూడా అధిగమిస్తుందని తమ సర్వేలో తేలినట్లు ఈఐయూ సీనియర్ విశ్లేషకులు అంజలికా బర్దాలాయ్ మీడియాకు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 17 Mar 2010 | 7:00 am ఉద్యోగుల జీతాలు 12 శాతం మేర పెరగడం ఖాయంఆసియాలో ఆర్థిక మాంద్యం తగ్గుముఖం పట్టడంతో ఆ ఖండంలో ఉన్న కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలను పెంచే యోచనలో ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలోని కంపెనీలు ఉద్యోగులకు 12 శాతం మేర జీతాలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.Source: Yahoo! Telugu: News | 17 Mar 2010 | 6:57 am త్వరలోనే తెదేపా జాతీయ పార్టీ: ఎమ్మెల్యే ఎల్.రమణతెలుగుదేశం పార్టీ త్వరలోనే జాతీయ పార్టీగా ఆవిర్భవించనుందని ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎల్.రమణ అభిప్రాయపడ్డారు. దీనికి సమయం మరెంతో దూరంలో లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైన వెంటనే తమ పార్టీకి జాతీయ హోదా లభిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.Source: Yahoo! Telugu: News | 17 Mar 2010 | 6:46 am పైరసీని అరికట్టకపోతే షూటింగ్‌లు బంద్: సురేష్పైరసీ వ్యవహారం ముదిరి పాకాన పడుతున్నట్లు కనబడుతోంది. బుధవారం చిత్ర పరిశ్రమలోని పెద్ద నిర్మాతలందరూ ఒకచోట చేరి పైరసీని అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే ఓ చట్టాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, కేరళ, తమిళనాడులో ఉన్నట్లు పైరసీని గూండా యాక్ట్ కిందకు తీసుక రావాలని కోరారు. ఉన్న చట్టాన్ని అమలు చేస్తే సరిపోతుందని ముఖ్యమంత్రి రోశయ్య వ్యాఖ్యానిస్తే, పరిశీలిస్తామని మంత్రి గీతారెడ్డి చెప్పడంపై నిర్మాతల మండలి అసంతృప్తిని వ్యక్తం చేసింది. గతంలో పైరసీ సెల్ ఏర్పాటు చేసి పైరసీలకు పాల్పడుతున్న సుమారు 6వేల మందిని పట్టుకుని పోలీసులకు అప్పచెబితే... వారంతా దర్జాగా బయటే తిరుగుతున్నారన్నారు. వారికి సరైన శిక్షలు పడకపోవడంతో తిరిగి కాలర్ ఎగరేసుకుంటూ పైరసీ కార్యకలాపాలను యధేచ్ఛగా చేసుకుంటూ పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Mar 2010 | 6:13 am అతను సెక్సీ సింహం: శ్రద్దా దాస్జగపతి బాబు అంటే చాలు అతనిలో శోభన్ బాబును చూస్తున్నామని చాలామంది హీరోయిన్లు చెపుతుంటారు. అయితే శ్రద్దాదాస్ మాత్రం జగపతిని మరోలా చూసింది. "జగపతి బాబును సెక్సీ సింహం అని పిలుస్తాను. మనిషి మ్యాన్లీగా ఉంటాడు. సూటిగా చూస్తూ ఆయనతో మాట్లాడలేను. అధినేత చిత్రంలో ఆయనతో కలిసి నటించాను. గడగడా మాట్లాడేస్తాడు. అందుకే ఆయన ఎదురుగా నేను మాట్లాడలేను. ఇక శివాజీతో ఓ సినిమా చేశాను. నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ అని తెలుసుకుని... ఆశ్చర్యపోయాడు. అంతేకాక.. అసలు నీలో అమ్మాయి లక్షణాలు ఏ కోశానా లేవని అంటాడు. అవన్నీ పక్కన పెడితే... అతని నుంచి చాలా నేర్చుకున్నా"నని చెబుతోంది శ్రద్దా.Source: Yahoo! Telugu: Entertainment | 17 Mar 2010 | 5:48 am విమర్శలు బేఖాతర్: మాయావతికి మరో రూ.నోట్ల దండఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై వస్తున్న విమర్శలను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవ ఉత్సవాల్లో ఆమెకు బహుకరించిన వెయ్యి రూపాయిల నోట్ల దండపై దేశ వ్యాప్తంగా చర్చతో పాటు.. విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితిల్లో బుధవారం మరో నోట్ల దండను ఆ పార్టీ నేతలు బహుకరించారు. ఈ దండలో 18 లక్షల రూపాయల విలువచేసే నోట్లను పొందుపరిచారు.Source: జాతీయ | 17 Mar 2010 | 3:12 am శాఖమూరి ఎన్‌కౌంటర్... 22, 23 తేదీల్లో బంద్: మావోలుమావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు సోలిపేట కొండల్ రెడ్డిల ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈనెల 22, 23, తేదీల్లో బంద్‌కు పిలుపునిస్తున్నట్టు మావోయిస్టులు ప్రకటించారు. 48 గంటలపాటు సాగే ఈ బంద్ మొత్తం ఆరు రాష్ట్రాల్లో పాటిస్తామని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కిషన్ జీ తరపు ప్రతినిధి ధనుంజయ్ వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2010 | 1:37 am త్వరలోనే తెదేపా జాతీయ పార్టీ: ఎమ్మెల్యే ఎల్.రమణతెలుగుదేశం పార్టీ త్వరలోనే జాతీయ పార్టీగా ఆవిర్భవించనుందని ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎల్.రమణ అభిప్రాయపడ్డారు. దీనికి సమయం మరెంతో దూరంలో లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైన వెంటనే తమ పార్టీకి జాతీయ హోదా లభిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2010 | 1:18 am చిత్తశుద్ధితో 610 జీవో అమలు: మంత్రి శ్రీధర్ బాబుహైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ శాఖల ఖాళీల భర్తీలో 610 జీవోను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖామంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ పరిధిలో తెలంగాణ యువతకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2010 | 1:00 am నిన్నెవడూ బొట్టుపెట్టి పిలువలేదు: రోశయ్య ఆగ్రహంముఖ్యమంత్రి రోశయ్యకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇప్పటికే వయోభారంతో కుంగిపోతున్న ఆయనకు.. తాజాగా హైదరాబాద్ ఫ్రీజోన్ అంశం తలనొప్పిగా మారింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన రివ్వూ పిటీషన్ కొట్టివేసింది. దీనిపై ప్రతిపక్ష సభ్యులు ఒక్కసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టాయి.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2010 | 12:53 am ఆ నిబంధన సవరణకు కృషి చేద్దాం: తెదేపా ఎమ్మెల్యేలుహైదరాబాద్ ఫ్రీజోన్ అంశం రాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. బుధవారం సమావేశాలు ప్రారంభమైన మరుక్షణమే ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా సభ్యులు ఈ అంశంపై చర్చకు పట్టుబట్టారు. అయితే, స్పీకర్ ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి తీర్మానాలను తిరస్కరించారు.Source: ఏపీ న్యూస్ | 17 Mar 2010 | 12:40 am ఎన్డీ.తివారీ పితృత్వం కేసు: ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా!ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నారాయణ్ దత్ తివారీ (ఎన్డీ.తివారీ) పితృత్వం కేసు మరోమారు వాయిదా పడింది. తివారీ తన తండ్రిగా ప్రకటించాలని రోహిత్ శర్మ అనే 30 సంవత్సరాల యువకుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. తొలుత ఈ పిటీషన్‌ను కోర్టు కొట్టి వేసింది. ఆ సమయంలో తివారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా ఉన్నారు.Source: జాతీయ | 17 Mar 2010 | 12:31 am నోట్ల దండతో చిక్కులు: నేతలతో మాయా మంతనాలు!పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా పార్టీ నేతలు వెయ్యి రూపాయిల నోట్లతో తయారు చేసి, వేసిన గజ మాలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు మరింతగా రెచ్చిపోతున్నాయి. అదే సమయంలో నోట్ల దండపై ఆదాయ పన్ను శాఖ అధికారులు కూడా దృష్టిసారించారు. దీనిపై ఆరా తీసేందుకు సిద్ధమవుతున్నారు.Source: జాతీయ | 16 Mar 2010 | 11:55 pm హైదరాబాద్ ఫ్రీజోన్ కాదు: ఆరో జోన్‌లో భాగమే: సీఎంరాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని, ఆరో జోన్‌లో భాగమేనని ముఖ్యమంత్రి కె.రోశయ్య స్పష్టం చేశారు. అయితే, ఫ్రీజోన్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటీషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిందన్నారు. దీనిపై చర్చించేందుకు బుధవారం సాయంత్రం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 16 Mar 2010 | 10:43 pm పార్టీ పదవుల భర్తీలో మహిళలకు పెద్దపీట: గడ్కారీమహిళల పట్ల తమకున్న మక్కువను భారతీయ జనతా పార్టీ చాటుకుంది. పార్టీ పదవుల భర్తీలో మహిళలకు పెద్దపీట వేసింది. భాజపా రథసారథి నితిన్ గడ్కారీ కొత్తగా ప్రకటించిన జట్టులో మహిళలకు సుమారుగా 33 శాతం పదవులను కట్టబెట్టడం గమనార్హం. చట్టసభల్లోనే కాకుండా, పార్టీ పదవుల్లో కూడా మహిళలకు తామే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆయన గట్టి సందేశాన్ని ఇతర రాజకీయ పార్టీలకు పంపారు.Source: జాతీయ | 16 Mar 2010 | 9:35 pm సమాజ్‌వాదీ పార్టీని మట్టికరిపిస్తా : అమర్ సింగ్వచ్చే సాధారణ ఎన్నికలలో తాను సమాజ్‌వాదీ పార్టీని మట్టి కరిపించేందుకు ఆ పార్టీపై పోరాటం చేస్తానని, దీనికి తను కొత్తపార్టీని స్థాపించే విషయంపై ఈ నెల 28న సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాజ్‌వాదీ పార్టీ తిరుగుబాటు నేత అమర్ సింగ్ బాలియాలో తెలిపారు.Source: జాతీయ | 16 Mar 2010 | 9:14 pm పైరసీని గూండా యాక్ట్ కింద చేర్చండి: శివాజీకోట్లు వెచ్చించి సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలకు నష్టం చేకూర్చే పైరసీకారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలో ఉన్న గూండా యాక్ట్, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని హీరో శివాజీ అన్నారు.అసెంబ్లీలో చిరంజీవి, జయసుధలు పైరసీని అరికట్టాలని కోరిన మేరకు వారికి సంఘీభావం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇదిలావుండగా మాయగాడు నిర్మాత యలమంచి రవిచంద్ సోమవారంనాడు ఫిలింఛాంబర్ బయట పైరసీ నివారణకు తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Mar 2010 | 12:28 pm "ఛాలెంజర్స్" సిద్ధార్థతో ప(దు)డుకునే చెట్టాపట్టాల్దీపికా పదుకునే పేరు చెపితే కుర్రకారు మనసులు జివ్వుమంటాయి. ఇప్పుడా భామ ఐపీఎల్ 2010 క్రికెట్ పోటీలను వీక్షిస్తూ మహా బిజీగా ఉన్నది. ఆమె ఒక్కతే అనుకునేరు.. తోడుగా మరో యువకుడు కూడా ఆమె ఉంటున్నాడు. ఎవరని అనుకుంటున్నారా...? రాయల్ ఛాలెంజర్స్ యజమాని విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ. దీపికా పదుకునే ఎక్కడుంటే సిద్ధార్థ అక్కడ కనిపిస్తున్నాడనే కంటే సిద్ధార్థ ఎక్కడ ఉంటే పదుకునే అక్కడ ఉంటోందని చెప్పవచ్చు. వీళ్లద్దరూ ఐపీఎల్ క్రికెట్ పోటీలు ఎక్కడ జరుగుతుంటే అక్కడ ప్రత్యక్షమవుతున్నారట. ఉన్నట్లుండి ఇద్దరూ మాయమై అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారట. ఎక్కడికి వెళుతున్నారబ్బా...? అని కొంతమంది సినీజీవులు వారిని వెంటాడే పనిలో ఉన్నారట. ఆ సంగతి అలావుంటే విజయ మాల్యా కుమారుడు సిద్ధార్థ దీపికా పదుకునేతోపాటు ఆమె స్నేహితులను కూడా చాలా చక్కగా చూసుకుంటున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా దీపికానే చెపుతోందట. ఎక్కడ మ్యాచ్ ఉంటే అక్కడికి తన స్నేహితులను కింగ్ ఫిషర్ విమానాల్లో చేరవేస్తూ సరదా చేస్తున్నాడని సిద్ధార్థను పొగడ్తలతో ముంచెత్తుతోందట.Source: Yahoo! Telugu: Entertainment | 16 Mar 2010 | 9:14 am మాయా "డబ్బుల మాల"పై ఐటీ అధికారుల ఆరా !ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతికి ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు సోమవారం వెయ్యి రూపాయల నోట్లతో తయారు చేయించిన "డబ్బుల మాల"ను బహుకరించారు. ఆ డబ్బుల మాలపై ఆదాయపన్ను శాఖాధికారులు విచారణ చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు.Source: జాతీయ | 16 Mar 2010 | 8:11 am పోలీసులకు రంజిత పూర్తి నగ్న వీడియో..?!!నిత్యానంద- రంజిత సెక్స్ స్కాండల్ రోజుకో మలుపు తిరుగుతోంది. నిత్యానందతో రాసలీలల్లో పాల్గొన్న నటి రంజితకు సంబంధించి పూర్తి నగ్న వీడియో చెన్నై పోలీసుల వద్ద ఉన్నట్లు భోగట్టా. రంజిత- నిత్యానందల సెక్స్ వీడియోను తీసిన డ్రైవర్ ధర్మానంద ఈ విషయాన్ని ధృవీకరించినట్లు తమిళ మీడియా గగ్గోలు పెడుతోంది. అయితే ఇవన్నీ వట్టి బూటకపు వార్తలనీ, తనపై ఎవరో పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని అటు నిత్యానంద.. ఇటు రంజిత వేర్వేరుగా స్పందించారు. నిత్యానంద అయితే సోమవారం కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరిస్తూ తానిప్పుడూ మౌనవ్రతం చేస్తున్నాననీ, అసత్య ప్రచారం చేస్తున్నవారికి తగిన శిక్ష పడుతుందని వేదాంత వచనాలు వల్లిస్తున్నారు. కానీ నిత్యానంద డ్రైవర్ ధర్మానంద మాత్రం రంజితకు సంబంధించిన పూర్తి నగ్న వీడియోను తీశాడనీ, వాటిని నేరుగా పోలీసులకు అప్పగించాడని అంటున్నారు. ఇదే గనక నిజమైతే రంజిత- నిత్యానందకు జైలు ఖాయమని చెపుతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Mar 2010 | 7:06 am అనుష్క "పంచాక్షరి" షూటింగ్ పూర్తి!"అరుంధతి"గా సంచలన విజయాన్ని సాధించిన అందాల తార అనుష్క "పంచాక్షరి"గా ప్రేక్షకులను అలరించనుంది. అనుష్క ప్రధాన పాత్రలో కింగ్ నాగార్జున పర్సనల్ మేకప్‌మేన్ బొమ్మదేవర రామచంద్రరావు (చంద్ర) సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై వి. సముద్ర దర్శకత్వంలో నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం "పంచాక్షరి" షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. రాజమండ్రి షెడ్యూల్‌తో దాదాపుగా ఈ చిత్రం పూర్తయ్యింది. ఏప్రిల్ మొదటివారంలో ఆడియోను, ఏప్రిల్ చివరివారంలో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత చంద్ర సన్నాహాలు చేస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Mar 2010 | 6:40 am సమైక్యమే మా నినాదం.. ఆ దిశగానే నివేదిక: పీఆర్పీరాష్ట్ర ప్రజలంతా సమైక్యంగా ఉండాలని ప్రజారాజ్యం పార్టీ కోరుకుంటుంది. ఆ దిశగానే జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి నివేదిక సమర్పిస్తామని ప్రరాపా సీనియర్ నేత సీ.రామచంద్రయ్య తెలిపారు. దీనిపై ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ భాషా, పాలనా సౌలభ్యం, భౌగోళిక స్వరూపాల ఆధారంగా విభజన జరగాలని తొలి ఎస్సార్సీ గతంలో చెప్పిందని ఆయన గుర్తు చేశారు.Source: ఏపీ న్యూస్ | 16 Mar 2010 | 5:41 am రాజకీయ ప్రక్షాళనే లక్ష్యంగా కొత్త పార్టీ : రాందేవ్ బాబానిన్న మొన్నటి వరకు ఆధ్యాత్మిక బోధనలు, ప్రవచనాలు, యోగా శిక్షణా తరగతులు నిర్వహించడే దినచర్యగా పెట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడమే ఏకైక లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్టు ఆయన మంగళవారం ప్రకటించారు.Source: జాతీయ | 16 Mar 2010 | 5:26 am వచ్చే నెల 12కు లోక్‌సభ సమావేశాలు వాయిదా: స్పీకర్ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు. తాత్కాలిక విరామంలో భాగంగానే ఈ సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు ఆయన తెలిపారు.Source: జాతీయ | 16 Mar 2010 | 4:49 am భాజపా జాతీయ కార్యవర్గాన్ని విస్తరించిన నితిన్ గడ్కారీభారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం విస్తరణలో గత మూడు నెలలుగా నెలకొన్న ఉత్కంఠతకు ఆ పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ తెరదించారు. తన కొత్త పరివారాన్ని ఆయన మంగళవారం విస్తరించారు. 13 మంది ఉపాధ్యక్షులు, 10 మంది ప్రధాన కార్యదర్శులు, 15 మంది కార్యదర్శులతో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యవర్గంలో యువతతో పాటు అనుభవానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా, యువ వివాదాస్పద నేత వరుణ్ గాంధీకి పార్టీ పదవిని కట్టబెట్టడం గమనార్హం.Source: జాతీయ | 16 Mar 2010 | 3:55 am భాజపా జాతీయ కార్యవర్గంలో తొమ్మండుగురు ఆంధ్రులు!భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ తన పరివారాన్ని మంగళవారం విస్తరించారు. ఇందులో తొమ్మిది మంది ఆంధ్రులకు ఆయన స్థానం కల్పించారు. పార్టీ కార్యదర్శులుగా, జాతీయ అధికార ప్రతినిధిగా, కార్యవర్గ సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితులుగా ఇలా పలు విభాగాల్లో రాష్ట్ర నేతలకు చోటు కల్పించారు.Source: ఏపీ న్యూస్ | 16 Mar 2010 | 2:54 am ప్రభుత్వ పథకాల లోపాలను సరిదిద్దుతాం: రోశయ్యప్రజాసంక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లోని చిన్నపాటి లోపాలను సరిద్దిదుతామని ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. అలాగే, వికృతినామ సంవత్సరంలో రాష్ట్రంలో వర్షాలు సకాలంలో పడి, పాడి పంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాక్షించారు. ముఖ్యంగా రైతు బాంగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని ఆయన చెప్పుకొచ్చారు.Source: ఏపీ న్యూస్ | 16 Mar 2010 | 2:46 am
|