|
"ఛాలెంజర్స్" సిద్ధార్థతో ప(దు)డుకునే చెట్టాపట్టాల్దీపికా పదుకునే పేరు చెపితే కుర్రకారు మనసులు జివ్వుమంటాయి. ఇప్పుడా భామ ఐపీఎల్ 2010 క్రికెట్ పోటీలను వీక్షిస్తూ మహా బిజీగా ఉన్నది. ఆమె ఒక్కతే అనుకునేరు.. తోడుగా మరో యువకుడు కూడా ఆమె ఉంటున్నాడు. ఎవరని అనుకుంటున్నారా...? రాయల్ ఛాలెంజర్స్ యజమాని విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ. దీపికా పదుకునే ఎక్కడుంటే సిద్ధార్థ అక్కడ కనిపిస్తున్నాడనే కంటే సిద్ధార్థ ఎక్కడ ఉంటే పదుకునే అక్కడ ఉంటోందని చెప్పవచ్చు. వీళ్లద్దరూ ఐపీఎల్ క్రికెట్ పోటీలు ఎక్కడ జరుగుతుంటే అక్కడ ప్రత్యక్షమవుతున్నారట. ఉన్నట్లుండి ఇద్దరూ మాయమై అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారట. ఎక్కడికి వెళుతున్నారబ్బా...? అని కొంతమంది సినీజీవులు వారిని వెంటాడే పనిలో ఉన్నారట. ఆ సంగతి అలావుంటే విజయ మాల్యా కుమారుడు సిద్ధార్థ దీపికా పదుకునేతోపాటు ఆమె స్నేహితులను కూడా చాలా చక్కగా చూసుకుంటున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా దీపికానే చెపుతోందట. ఎక్కడ మ్యాచ్ ఉంటే అక్కడికి తన స్నేహితులను కింగ్ ఫిషర్ విమానాల్లో చేరవేస్తూ సరదా చేస్తున్నాడని సిద్ధార్థను పొగడ్తలతో ముంచెత్తుతోందట.Source: Yahoo! Telugu: Entertainment | 16 Mar 2010 | 9:14 am భాజపా జాతీయ కార్యవర్గాన్ని విస్తరించిన గడ్కారీభారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం విస్తరణలో గత మూడు నెలలుగా నెలకొన్న ఉత్కంఠతకు ఆ పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ తెరదించారు. తన కొత్త పరివారాన్ని ఆయన మంగళవారం విస్తరించారు. 13 మంది ఉపాధ్యక్షులు, 10 మంది ప్రధాన కార్యదర్శులు, 15 మంది కార్యదర్శులతో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యవర్గంలో యువతతో పాటు అనుభవానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా, యువ వివాదాస్పద నేత వరుణ్ గాంధీకి పార్టీ పదవిని కట్టబెట్టడం గమనార్హం.Source: Yahoo! Telugu: News | 16 Mar 2010 | 9:01 am లాభాలతో కొనసాగుతోన్న బాంబే స్టాక్ మార్కెట్మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగుతోంది. ప్రారంభంలో తిరోగమనం దిశగా ర్యాలీని ప్రారంభించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 33 పాయింట్లు పుంజుకుని, 17,198 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 19 పాయింట్లు బలపడి, 5,148 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 16 Mar 2010 | 8:29 am భాజపా జాతీయ కార్యవర్గంలో తొమ్మండుగురు ఆంధ్రులు!భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ తన పరివారాన్ని మంగళవారం విస్తరించారు. ఇందులో తొమ్మిది మంది ఆంధ్రులకు ఆయన స్థానం కల్పించారు. పార్టీ కార్యదర్శులుగా, జాతీయ అధికార ప్రతినిధిగా, కార్యవర్గ సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితులుగా ఇలా పలు విభాగాల్లో రాష్ట్ర నేతలకు చోటు కల్పించారు.Source: Yahoo! Telugu: News | 16 Mar 2010 | 8:24 am ప్రభుత్వ పథకాల లోపాలను సరిదిద్దుతాం: రోశయ్యప్రజాసంక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లోని చిన్నపాటి లోపాలను సరిద్దిదుతామని ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. అలాగే, వికృతినామ సంవత్సరంలో రాష్ట్రంలో వర్షాలు సకాలంలో పడి, పాడి పంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాక్షించారు. ముఖ్యంగా రైతు బాంగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని ఆయన చెప్పుకొచ్చారు.Source: Yahoo! Telugu: News | 16 Mar 2010 | 8:15 am బిగ్ ఎఫ్ఎమ్‌లో రిలయన్స్ మీడియా వరల్డ్ క్లాసిఫైడ్ యాడ్స్వ్యాపార దిగ్గజం అనిల్ అంబానీ గ్రూపుకు చెందిన రిలయన్స్ మీడియా వరల్డ్ తన 92.7 ఎఫ్ఎమ్ రేడియోలో క్లాసిఫైడ్ యాడ్ విభాగాన్ని మంగళవారం ప్రారంభించింది.Source: Yahoo! Telugu: News | 16 Mar 2010 | 7:57 am మరో వెయ్యి శాఖలను ప్రారంభించనున్న ఎస్బీఐతమ బ్యాంక్ దేశవ్యాప్తంగానున్న గ్రామాలు, చిన్న పట్టణాలలో వెయ్యి శాఖలను ప్రారంభిస్తున్నామని, ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభమౌతుందని భారతీయ స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ జేకే సిన్హా న్యూ ఢిల్లీలో వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 16 Mar 2010 | 7:09 am పోలీసులకు రంజిత పూర్తి నగ్న వీడియో..?!!నిత్యానంద- రంజిత సెక్స్ స్కాండల్ రోజుకో మలుపు తిరుగుతోంది. నిత్యానందతో రాసలీలల్లో పాల్గొన్న నటి రంజితకు సంబంధించి పూర్తి నగ్న వీడియో చెన్నై పోలీసుల వద్ద ఉన్నట్లు భోగట్టా. రంజిత- నిత్యానందల సెక్స్ వీడియోను తీసిన డ్రైవర్ ధర్మానంద ఈ విషయాన్ని ధృవీకరించినట్లు తమిళ మీడియా గగ్గోలు పెడుతోంది. అయితే ఇవన్నీ వట్టి బూటకపు వార్తలనీ, తనపై ఎవరో పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని అటు నిత్యానంద.. ఇటు రంజిత వేర్వేరుగా స్పందించారు. నిత్యానంద అయితే సోమవారం కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరిస్తూ తానిప్పుడూ మౌనవ్రతం చేస్తున్నాననీ, అసత్య ప్రచారం చేస్తున్నవారికి తగిన శిక్ష పడుతుందని వేదాంత వచనాలు వల్లిస్తున్నారు. కానీ నిత్యానంద డ్రైవర్ ధర్మానంద మాత్రం రంజితకు సంబంధించిన పూర్తి నగ్న వీడియోను తీశాడనీ, వాటిని నేరుగా పోలీసులకు అప్పగించాడని అంటున్నారు. ఇదే గనక నిజమైతే రంజిత- నిత్యానందకు జైలు ఖాయమని చెపుతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Mar 2010 | 7:06 am ఇస్రో వద్ద జరిగింది ఉగ్రవాద దాడి కాదు: మంత్రి చిదంబరంబెంగుళూరు నగర శివార్లలో ఉన్న ఇస్రో కేంద్రం సమీపంలో ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల సంఘటన ఉగ్రవాద దాడి కాదని కేంద్ర హోం మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం నుంచి ధృవీకరించినట్టు ఆయన మంగళవారం తెలిపారు.Source: Yahoo! Telugu: News | 16 Mar 2010 | 7:02 am స్వల్ప లాభాల్లో బాంబే స్టాక్ మార్కెట్మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి హెచ్చుతగ్గులతో ర్యాలీని కొనసాగిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 27 పాయింట్లు వృద్ధిచెంది, 17,192 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా పది పాయింట్ల స్వల్ప లాభంతో 5,139 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.Source: Yahoo! Telugu: News | 16 Mar 2010 | 6:52 am నేపాల్ సంకీర్ణ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం: విపక్షాలునేపాల్ సంకీర్ణ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఆ దేశ విపక్ష పార్టీలు చర్యలు చేపట్టాయి. ఇందుకోసం అన్ని పార్టీలకు చెందిన సభ్యుల నుంచి సంతకాలు సేకరిస్తున్నాయి. నేపాల్‌లో కమ్యూనిస్టు పార్టీ, నేపాల్ కాంగ్రెస్ పార్టీ, మాదేశీ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఆ దేశ పార్లమెంట్‌లో ఉన్న మొత్తం 601 సీట్లకు గాను మావోయిస్టు పార్టీకి 238 మంది సభ్యులు ఉన్నారు.Source: Yahoo! Telugu: News | 16 Mar 2010 | 6:46 am లాభాల్లో బాంబే స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ వృద్ధిమంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, 18 పాయింట్లు వృద్ధి చెంది, 17,183 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా ఐదు పాయింట్ల స్వల్ప లాభంతో, 5,134 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 16 Mar 2010 | 6:43 am అనుష్క "పంచాక్షరి" షూటింగ్ పూర్తి!"అరుంధతి"గా సంచలన విజయాన్ని సాధించిన అందాల తార అనుష్క "పంచాక్షరి"గా ప్రేక్షకులను అలరించనుంది. అనుష్క ప్రధాన పాత్రలో కింగ్ నాగార్జున పర్సనల్ మేకప్‌మేన్ బొమ్మదేవర రామచంద్రరావు (చంద్ర) సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై వి. సముద్ర దర్శకత్వంలో నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం "పంచాక్షరి" షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. రాజమండ్రి షెడ్యూల్‌తో దాదాపుగా ఈ చిత్రం పూర్తయ్యింది. ఏప్రిల్ మొదటివారంలో ఆడియోను, ఏప్రిల్ చివరివారంలో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత చంద్ర సన్నాహాలు చేస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Mar 2010 | 6:40 am భాజపా జాతీయ కార్యవర్గాన్ని విస్తరించిన గడ్కారీభారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం విస్తరణలో గత మూడు నెలలుగా నెలకొన్న ఉత్కంఠతకు ఆ పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ తెరదించారు. తన కొత్త పరివారాన్ని ఆయన మంగళవారం విస్తరించారు. 13 మంది ఉపాధ్యక్షులు, 10 మంది ప్రధాన కార్యదర్శులు, 15 మంది కార్యదర్శులతో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యవర్గంలో యువతతో పాటు అనుభవానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా, యువ వివాదాస్పద నేత వరుణ్ గాంధీకి పార్టీ పదవిని కట్టబెట్టడం గమనార్హం.Source: జాతీయ | 16 Mar 2010 | 3:31 am భాజపా జాతీయ కార్యవర్గంలో తొమ్మండుగురు ఆంధ్రులు!భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ తన పరివారాన్ని మంగళవారం విస్తరించారు. ఇందులో తొమ్మిది మంది ఆంధ్రులకు ఆయన స్థానం కల్పించారు. పార్టీ కార్యదర్శులుగా, జాతీయ అధికార ప్రతినిధిగా, కార్యవర్గ సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితులుగా ఇలా పలు విభాగాల్లో రాష్ట్ర నేతలకు చోటు కల్పించారు.Source: ఏపీ న్యూస్ | 16 Mar 2010 | 2:54 am ప్రభుత్వ పథకాల లోపాలను సరిదిద్దుతాం: రోశయ్యప్రజాసంక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లోని చిన్నపాటి లోపాలను సరిద్దిదుతామని ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. అలాగే, వికృతినామ సంవత్సరంలో రాష్ట్రంలో వర్షాలు సకాలంలో పడి, పాడి పంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాక్షించారు. ముఖ్యంగా రైతు బాంగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని ఆయన చెప్పుకొచ్చారు.Source: ఏపీ న్యూస్ | 16 Mar 2010 | 2:46 am ఇస్రో వద్ద జరిగింది ఉగ్రవాద దాడి కాదు: మంత్రి చిదంబరంబెంగుళూరు నగర శివార్లలో ఉన్న ఇస్రో కేంద్రం సమీపంలో ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల సంఘటన ఉగ్రవాద దాడి కాదని కేంద్ర హోం మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం నుంచి ధృవీకరించినట్టు ఆయన మంగళవారం తెలిపారు.Source: జాతీయ | 16 Mar 2010 | 1:32 am ఇస్రో కేంద్రం వద్ద భద్రతా జవాన్లపై దుండగుల కాల్పులు!బెంగుళూరు నగర శివారు ప్రాంతంలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) వద్ద భద్రతగా ఉన్న జవాన్లపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే, ఇది ఉగ్రవాదుల దుశ్చర్య కాదని ఇస్రో ఉన్నత వర్గాలు స్పష్టం చేశాయి.Source: జాతీయ | 16 Mar 2010 | 12:13 am 'శ్రీవికృతి'లో అంతా వికాసమే: చిరంజీవి ప్రధాన భూమిక!శ్రీవికృతి నామ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీకి అంతా వికాసమేనని వేదపండితులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాగ శ్రవణం చేశారు.Source: ఏపీ న్యూస్ | 15 Mar 2010 | 11:51 pm నేత కార్మికులకు ఉగాది కానుక: రుణాలు మాఫీ!నానాటికీ చితికిపోతున్న నేత కార్మికుల బతుకులను ఆదుకునేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులోభాగంగా, రాష్ట్రంలోని చేనేత కార్మికులు తీసుకున్న రుణాలలో 312 కోట్ల రూపాయలను మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై బుధవారం అసెంబ్లీ సమావేశంలో అధికారపూర్వకంగా ఒక ప్రకటన చేయనుంది.Source: ఏపీ న్యూస్ | 15 Mar 2010 | 11:29 pm రాష్ట్రంలో వైభవంగా జరుగుతున్న ఉగాది వేడుకలుతెలుగు ప్రజల తొలి పండుగ తెలుగు నూతన సంవత్సరాది. ఉగాదిగా పిలుచుకునే ఈ పర్వదినం రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరుగుతోంది. వికృతినామ సంవత్సర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వంతో పాటు.. వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి.Source: ఏపీ న్యూస్ | 15 Mar 2010 | 11:20 pm ఈనెల 19వ తేదీ నుంచి తమిళనాడు బడ్జెట్ సమావేశాలుతమిళనాడు రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈనెల 19వ తేదీ నుంచి జరుగనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి తెలిపారు. ఈ సమావేశాలు కొత్తగా నిర్మించిన అసెంబ్లీ భవన సముదాయంలో జరుగుతాయని ఆయన చెప్పారు.Source: జాతీయ | 15 Mar 2010 | 10:02 pm అండమాన్‌లో అంతరించి పోతున్న కొండజాతి తెగ!అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో నివశించే కొండజాతి తెగ పూర్తిగా అంతరించి పోతోంది. దీంతో ఈ తెగను పరిరక్షించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ తెగ నివశించే ప్రాంతాల్లో పర్యాటకుల సందర్శనను నిషేధించింది. అండమాన్ దీవుల్లోని దక్షిణ ప్రాంతంలో ఐవరా అనే కొండజాతి ప్రజలు దశాబ్దాల కాలంగా జీవిస్తున్నారు.Source: జాతీయ | 15 Mar 2010 | 9:53 pm ఏప్రిల్ రెండో వారంలో బాలకృష్ణ "సింహా"బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహా వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాల కథానాయకుడు యువరత్న బాలకృష్ణ హీరోగా, భద్ర, తులసి వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న భారీ చిత్రం "సింహా". ఈ చిత్రానికి సంబంధించి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్‌లో మార్చి 17 నుంచి పాటల చిత్రీకరణ జరుగబోతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 15 Mar 2010 | 12:25 pm మార్చి 31న అల్లు అర్జున్- గుణశేఖర్ "వరుడు"స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్‌ల సూపర్ కాంబినేషన్లో యూనివర్సల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం "వరుడు" మార్చి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి బ్యాలెన్స్ వున్న పాటను మార్చి 12 నుంచి అల్లు అర్జున్, హీరోయిన్, 50మంది డ్యాన్సర్లపై చిత్రీకరిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 15 Mar 2010 | 12:08 pm సంక్షేమ పథకాలు ప్రజాకర్షక పథకాలుగా మారిపోయాయి: జేపీరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజాకర్షక పథకాలుగా మారిపోయాయని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ ఆవేదన వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 15 Mar 2010 | 8:09 am మాజీ డిప్యూటీ సీఎం కోనేరు రంగారావు అస్తమయంకాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన సోమవారం మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 15 Mar 2010 | 6:21 am బీఎస్పీ రజతోత్సవం: రూ.200 కోట్లతో మహోత్సవంబహుజన్ సమాజ్‌వాదీ పార్టీ రజతోత్సవాలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ సుప్రిమో మాయావతి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దేశంలో ఏ పార్టీ నిర్వహించనంత స్థాయిలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ఉత్సవాలకు ఏకంగా రూ.200 కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు.Source: జాతీయ | 15 Mar 2010 | 6:02 am పోఖ్రాన్ ఆర్మీ విన్యాసాల్లో అపశ్రుతి: జవాన్ల మృతిపోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన ప్రాంతంలో నిర్వహించిన ఆర్మీ విన్యాసాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. దీంతో నలుగురు జవాన్లు మృత్యువాత పడ్డారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకోగా, దీనిపై ఆర్మీ విచారణకు ఆదేశించింది. పోఖ్రాన్ వద్ద నిర్వహించిన ఆర్మీ విన్యాసాల్లో భాగంగా 81 ఎంఎం మోర్టార్స్ ఫైరింగ్ విన్యాసాలు నిర్వహిస్తుండగా పేలుడు సంభవించింది.Source: జాతీయ | 15 Mar 2010 | 5:39 am నిత్యానంద- రంజిత సెక్స్ సీడీల జంబో ప్యాక్తమిళనాట ప్రస్తుతం సెక్స్ స్వామిగా చెప్పుకుంటున్న నిత్యానంద- రంజితల కామకేళీ విలాసాలను చిత్రీకరించిన సీడీలు ఆయా సీడీ షాపుల్లో జంబో ప్యాకెట్లుగా అమ్ముతున్నారట. నిత్యానంద శృంగార రస దృశ్యాలకు ఆయా టీవీ ఛానళ్లు సెన్సార్ చేసి చూపించాయి. కానీ ఉన్నది ఉన్నట్లుగా తీసిన వీడియో తాలూకు దృశ్యాలను సీడీలు - వీడియోలలోకి ఎక్కించిన కొందరు వ్యాపారులు తమిళనాట సీడీల మార్కెట్లలో అమ్ముతున్నారట. పైగా ప్రతి సీడీపై నిత్యానంద- రంజిత కామకేళీ ఒరిజినల్ అంటూ పెద్ద అక్షరాలతో ముద్రించి మరీ అమ్ముతున్నారు. నిత్యానంద- రంజిత సెక్స్ సీడీలు అందుబాటులోకి వచ్చాయని తెలియగానే ఆయా వర్గాల ప్రజలు వాటిని ఎగబడి కొంటున్నారట. దీంతో సీడీలకు గిరాకీ పెరగటంతో వాటి రేటును అమాంతం పెంచేసినట్లు కోలీవుడ్ సీడీల మార్కెట్ చెపుతోంది. ఒకటో రెండో తమిళ సినిమాలతో కూడిన సీడీలు రూ. 50 నుంచి రూ. 60 మధ్య అమ్ముడవుతుండగా, నిత్యానంద సెక్స్ సీడీలు మాత్రం ఏకంగా రూ. 250 నుంచి రూ. 400 వరకూ పలుకుతున్నాయట. అవసరమైతే రూ. 500 చెల్లించడానికైనా సిద్ధమని జనం ఎగబడుతున్నారట.Source: Yahoo! Telugu: Entertainment | 15 Mar 2010 | 5:24 am ప్రజల సమాచారం మేరకే మావో డంపు స్వాధీనం: డీజీపీప్రజలు ఇచ్చిన సమాచారం మేరకే తూర్పుగోదావరి జిల్లా తణుకులో మావోయిస్టుల డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర డీజీపీ గిరీష్ కుమార్ చెప్పారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టు కార్యక్రమాలు అడ్డుకోవడానికి ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చి తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు.Source: ఏపీ న్యూస్ | 15 Mar 2010 | 5:04 am "అణు" విపత్తు బిల్లుపై వెనక్కి తగ్గిన యూపీఏ సర్కారు!అణు విద్యుత్ కర్మాగారాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే నష్టపరిహారం చెల్లించే అణు విపత్తు బిల్లుపై కేంద్రంలోని యూపీఏ సంకీర్ణ సర్కారు వెనక్కి తగ్గింది. సోమవారం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావించింది. అయితే, ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీతో సహా, అమెరికాతో అణు ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వామపక్ష పార్టీలు కూడా బిల్లు ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నాయి. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది.Source: జాతీయ | 15 Mar 2010 | 4:55 am సమన్వయ లోపం: రక్షణ క్షిపణి ప్రయోగం విఫలం!సమన్వయ లోపం కారణంగా దేశ అధునాతన సాంకేతిక గగనతల రక్షణ క్షిపణి ప్రయోగం మరోమారు వాయిదా పడింది. ఈ ప్రయోగాన్ని ఆదివారమే నిర్వహించాల్సి ఉండగా క్షిపణిలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా సోమవారానికి వాయిదా వేశారు. అయితే, సోమవారం అధికారుల సమన్వయ లోపం కారణంగా క్షిపణి ప్రయోగాన్ని వాయిదా వేశారు.Source: జాతీయ | 15 Mar 2010 | 3:02 am
|