|
రాజు బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టుసత్యం కంప్యూటర్స్ సంస్థలో నిరుడు జనవరిన దాదాపు పది వేల కోట్ల రూపాయల మేరకు కుంభకోణం జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజు సుప్రీం కోర్టులో బెయిల్ పిటీషన్‌ను దాఖలు చేశారు. అతని బెయిల్ పిటీషన్‌ను సోమవారం ధర్మాసనం తిరస్కరించింది.Source: Yahoo! Telugu: News | 15 Mar 2010 | 8:55 am నానాటికీ బలహీన పడుతున్న అల్‌ఖైదా: హాల్బ్రూక్అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా నానాటికీ బలహీన పడుతోందని పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలకు అమెరికా ప్రత్యేక దూత హాల్‌బ్రూక్ అభిప్రాయపడ్డారు. ఈ సంస్థకు చెందిన అగ్రనేతల్లో ఇప్పటికే 12 మంది మట్టుబెట్టామని ఆయన గుర్తు చేశారు.Source: Yahoo! Telugu: News | 15 Mar 2010 | 8:51 am ధరలు పెరగడంతో ఫిబ్రవరిలో పెరిగిన ద్రవ్యోల్బణంనిత్యావసర సరుకుల ధరలతోపాటు ఇతర సరుకుల ధరలు పెరగడంతో ఫిబ్రవరి నెలలో ద్రవ్యోల్బణం రేటు వృద్ధి చెంది 9.89 శాతానికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం సోమవారం న్యూ ఢిల్లీలో వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 15 Mar 2010 | 8:21 am సమన్వయ లోపం: రక్షణ క్షిపణి ప్రయోగం విఫలం!సమన్వయ లోపం కారణంగా దేశ అధునాతన సాంకేతిక గగనతల రక్షణ క్షిపణి ప్రయోగం మరోమారు వాయిదా పడింది. ఈ ప్రయోగాన్ని ఆదివారమే నిర్వహించాల్సి ఉండగా క్షిపణిలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా సోమవారానికి వాయిదా వేశారు. అయితే, సోమవారం అధికారుల సమన్వయ లోపం కారణంగా క్షిపణి ప్రయోగాన్ని వాయిదా వేశారు.Source: Yahoo! Telugu: News | 15 Mar 2010 | 8:20 am నష్టాల్లోనే స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ పతనంఆసియా మార్కెట్ ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం దిశగా ర్యాలీని కొనసాగిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, ఉదయం 11.30 గంటల ప్రాంతంలో 62 పాయింట్లు క్షీణించి, 17,103 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 25 పాయింట్లు పతనమై, 5,111 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 15 Mar 2010 | 6:25 am ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో "ఆ ముగ్గురు" నేతలు!ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం పచ్చజెండా ఊపింది. అలాగే, వయోభారంతో అలసిపోతున్న ముఖ్యమంత్రి రోశయ్యకు డిప్యూటీని ఎంపిక చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. అయితే, ఈ ఉప ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసే అభ్యర్థి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఉండాలని షరతు విధించినట్టు చెపుతోంది.Source: Yahoo! Telugu: News | 15 Mar 2010 | 6:12 am టార్గెట్‌కన్నా తక్కువ ఉత్పత్తులను సాధించిన ఓఎన్జీసీప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తమ ఉత్పత్తులు కేవలం 24.9 మిలియన్ టన్నుల మేరకు ముడి చమురు ఉత్పత్తులు జరిగాయని ఓఎన్‌జీసీ ఆఫ్‌షోర్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఎస్. వాసుదేవ సోమవారం న్యూ ఢిల్లీలో తెలిపారు.Source: Yahoo! Telugu: News | 15 Mar 2010 | 6:08 am "సాఫ్ట్‌వేర్ సూపర్ పవర్"గా మారనున్న భారత్: గార్ట్నర్భారతదేశం వచ్చే 2020 నాటికి "సాఫ్ట్‌వేర్ సూపర్ పవర్"గా మారనుందని ఐటీ దిగ్గజమైన గార్ట్నర్ సంస్థ విశ్లేషకులు, డైరెక్టర్ పార్థ అయ్యంగార్ న్యూ ఢిల్లీలో తెలిపారు. న్యూ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో భారతదేశం సాఫ్ట్‌వేర్ రంగాన్ని శాసించే స్థాయికి చేరుకుంటుందని తెలిపారు.Source: Yahoo! Telugu: News | 15 Mar 2010 | 6:05 am విదర్భ రాష్ట్ర ఏర్పాటుకు భాజపా మద్దతు: గడ్కారీమహారాష్ట్రను రెండు ముక్కలు చేసిన ప్రత్యేక విదర్భ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడితే ఆ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.Source: Yahoo! Telugu: News | 15 Mar 2010 | 5:50 am 320 ప్రాంతాల్లో ధ్వంస రచనకు లష్కర్ కుట్ర: యూఎస్ప్రపంచ వ్యాప్తంగా 320 ప్రాంతాల్లో బాంబులు పెట్టి ధ్వంస రచన చేసేందుకు లష్కర్ తీవ్రవాద సంస్థ కుట్ర పన్నినట్టు అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇందులో 20 ప్రాంతాలు భారత్‌లోనే ఉన్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి. గత 2008 సంవత్సరం నవంబరు 26వ తేదీన ముంబైపై జరిగిన తీవ్రవాదుల దాడులపై అమెరికా నిఘా వర్గాలు సమీక్ష నిర్వహించాయి.Source: Yahoo! Telugu: News | 15 Mar 2010 | 5:36 am నిత్యానంద- రంజిత సెక్స్ సీడీల జంబో ప్యాక్తమిళనాట ప్రస్తుతం సెక్స్ స్వామిగా చెప్పుకుంటున్న నిత్యానంద- రంజితల కామకేళీ విలాసాలను చిత్రీకరించిన సీడీలు ఆయా సీడీ షాపుల్లో జంబో ప్యాకెట్లుగా అమ్ముతున్నారట. నిత్యానంద శృంగార రస దృశ్యాలకు ఆయా టీవీ ఛానళ్లు సెన్సార్ చేసి చూపించాయి. కానీ ఉన్నది ఉన్నట్లుగా తీసిన వీడియో తాలూకు దృశ్యాలను సీడీలు - వీడియోలలోకి ఎక్కించిన కొందరు వ్యాపారులు తమిళనాట సీడీల మార్కెట్లలో అమ్ముతున్నారట. పైగా ప్రతి సీడీపై నిత్యానంద- రంజిత కామకేళీ ఒరిజినల్ అంటూ పెద్ద అక్షరాలతో ముద్రించి మరీ అమ్ముతున్నారు. నిత్యానంద- రంజిత సెక్స్ సీడీలు అందుబాటులోకి వచ్చాయని తెలియగానే ఆయా వర్గాల ప్రజలు వాటిని ఎగబడి కొంటున్నారట. దీంతో సీడీలకు గిరాకీ పెరగటంతో వాటి రేటును అమాంతం పెంచేసినట్లు కోలీవుడ్ సీడీల మార్కెట్ చెపుతోంది. ఒకటో రెండో తమిళ సినిమాలతో కూడిన సీడీలు రూ. 50 నుంచి రూ. 60 మధ్య అమ్ముడవుతుండగా, నిత్యానంద సెక్స్ సీడీలు మాత్రం ఏకంగా రూ. 250 నుంచి రూ. 400 వరకూ పలుకుతున్నాయట. అవసరమైతే రూ. 500 చెల్లించడానికైనా సిద్ధమని జనం ఎగబడుతున్నారట.Source: Yahoo! Telugu: Entertainment | 15 Mar 2010 | 5:24 am ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో "ఆ ముగ్గురు" నేతలు!ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం పచ్చజెండా ఊపింది. అలాగే, వయోభారంతో అలసిపోతున్న ముఖ్యమంత్రి రోశయ్యకు డిప్యూటీని ఎంపిక చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. అయితే, ఈ ఉప ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసే అభ్యర్థి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఉండాలని షరతు విధించినట్టు చెపుతోంది.Source: ఏపీ న్యూస్ | 15 Mar 2010 | 12:43 am విదర్భ రాష్ట్ర ఏర్పాటుకు భాజపా మద్దతు: గడ్కారీమహారాష్ట్రను రెండు ముక్కలు చేసిన ప్రత్యేక విదర్భ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడితే ఆ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.Source: జాతీయ | 15 Mar 2010 | 12:20 am విభజనపై సోనియా నిర్ణయమే శిరోధార్యం: మంత్రి ఆనంరాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయమే తమకు శిరోధార్యమని రాష్ట్ర పురపాలక వ్యవహారాల శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మించిన కొత్త భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ వ్యక్తిగా ఆమోదిస్తామన్నారు.Source: ఏపీ న్యూస్ | 14 Mar 2010 | 11:56 pm శ్రీకృష్ణ కమిటీతో ఫలితం శూన్యం: ప్రజాగాయకుడు గద్దర్!రాష్ట్ర విభజన అంశాన్ని తేల్చేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ వల్ల ఒనగూరే ప్రయోజనం శూన్యమని ప్రజా గాయకుడు గద్దర్ అభిప్రాయపడ్డారు. ఆయన తుఫ్రాన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ, కోస్తాంధ్ర ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటామని శ్రీకృష్ణ కమిటీ పేర్కొంటోందని, ఇద్దరి అభిప్రాయాలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 14 Mar 2010 | 11:49 pm అలాంటి వారిని తుపాకీతో కాల్చివేయాలి: లగడపాటిభారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులను పాకిస్థాన్ ముస్లింలుగా పోల్చే వారిని తుపాకీతో కాల్పి పారేయాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌లో ఉండే ముస్లింల సంఖ్య పది కోట్లు ఉండగా, భారత్‌లో వీరి సంఖ్య 15 కోట్లుగా ఉందని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా, ఇక్కడ ఉండే ప్రతి ముస్లిం భారతీయుడిగా ఉండేందుకే ఇష్టపడతారని ఆయన అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 14 Mar 2010 | 11:42 pm నదిలో బస్సు బోల్తా: 26 మంది విద్యార్థుల మృతి!రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహార యాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు ఒకటి జైపూర్ సమీపంలో నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 26 మంది మృత్యువాత పడగా, మరో 38 మంది విద్యార్థులు గాయపడ్డారు. సోమవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.Source: జాతీయ | 14 Mar 2010 | 10:25 pm నేడు పార్లమెంట్ ముందుకు "అణు" విపత్తు బిల్లు!కేంద్రంలోని యూపీఏ సంకీర్ణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డామేజ్ (అణు విపత్తు బిల్లు) బిల్లును లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు గనుక పార్లమెంట్‌లో ఆమోదం పొందితే అణు విపత్తులకు నష్టపరిహారం చెల్లించేందుకు వెసులుబాటు కలుగుతుంది.Source: జాతీయ | 14 Mar 2010 | 10:25 pm పెళ్లి చేసుకోబోతున్నా... కానీ అతని పేరు చెప్పనుఎన్నాళ్లగానో పెళ్లి చేసుకుందామని ఎదురు చూస్తున్న నగ్మా కల నిజమవనుంది. చెల్లెలు జ్యోతికకు పెళ్లైన దగ్గర్నుంచీ వివాహం చేసుకోవాలని నగ్మా శతవిధాలా యత్నించి చివరికి ఓ వరుడు తారసపడటంతో అతడిని వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. అంతకు ముందు ఎడమచేతి వాటం క్రికెటర్ సౌరవ్ గంగూలీతో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత భోజ్‌పురి సినిమాలకు వెళ్లి అక్కడ ఓ హీరోతో లవ్వాట సాగించింది. అయితే వాళ్లిద్దరితో ఉన్నది ప్రేమ సంబంధం కాదనీ, స్నేహ సంబంధమని ఆ తర్వాత అందరినీ బుకాయించిందనుకోండి. ఆ సంగతి అలావుంచితే... రాజకీయాలు, సినిమాలు పెళ్లికి అడ్డంకిగా నిలుస్తాయని సదరు వరుడు కండిషన్లు పెట్టడంతో వాటిని సైతం వదులుకునేందుకు ఈ ప్రౌఢ సుందరి సిద్ధమైనట్లు భోగట్టా. 2009 ఎన్నికల్లో ఎంపీ సీటు ఆశించి భంగపడ్డ తర్వాత రాజకీయ కెరీర్‌పైనా ఆశ వదులుకుని చివరికి ఇల్లాలి పాత్ర పోషించడానికి రెడీ అయింది. వివాహమాడబోతున్న వరుడెవరో చెప్పమంటే "ష్.. అతని పేరు మాత్రం అడక్కండి. నేను చెప్పను" అంటోంది. ఎవరైనా పెళ్లి చెడగొడతారని భయమేమో..?!!Source: Yahoo! Telugu: Entertainment | 14 Mar 2010 | 12:28 pm అందాలు ఆరబోయనిదే ఎవరూ చూడరు: కంగనా"ఏక్ నిరంజన్" చిత్రంలో ప్రభాస్ ప్రక్కన నటించిన కంగనా రనౌత్ మత్తు కళ్ల సుందరిగా పేరు తెచ్చుకున్నా పెద్దగా సక్సెస్ రాలేదు. కానీ బాలీవుడ్‌లో జాతీయ అవార్డు స్థాయికి ఎదిగింది. తాను ముఖానికి రంగేసుకున్నప్పటినుంచీ ఏదో అవార్డు పొందుతూనే ఉన్నాననీ అంటోంది. తన చిత్రం గ్యాంగస్టర్‌కు వచ్చిన అవార్డు ఆ చిత్ర రూపకర్తలకే అంకితమని చెబుతోంది. నో ప్రాబ్లమ్, ఇంకా పేరుపెట్టని రెండు చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇప్పటిదాకా తాను చేసిన పాత్రలన్నటిలోనూ మంచి గుర్తింపు వచ్చిందని గొప్పలు చెప్పుకుంటోంది. అయితే హీరోయిన్లు అందాలు ఆరబోయనిదే ఎవరూ చూడరని బల్లగుద్ది చెపుతోంది. ఒకవేళ ఎవరైనా నేను చూపించను అని ముడుచుక కూచుంటే.. మరో నటి ఆరబోయడానికి సిద్ధమవుతోందని చెప్పుకొస్తోంది. ఇంతగా చెపుతుందంటే తదుపరి చిత్రాల్లో ఎంత మేరకు ఆరబోసేందుకు సిద్ధమవుతుందో చూడాలి మరి.Source: Yahoo! Telugu: Entertainment | 14 Mar 2010 | 10:17 am తెలంగాణాకు తెరాస శనిగ్రహం: తెలుగుదేశం ధ్వజంతమ పార్టీని ఏవేవో గ్రహాలతో పోల్చుతూ... తుంటరి కూతలు కూస్తున్న తెరాస పార్టీ నేతలను తాము తలుచుకుంటే రోడ్డు మీద తిరగనివ్వమని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించారు. తెలంగాణా సాధనకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నదన్నారు.Source: ఏపీ న్యూస్ | 14 Mar 2010 | 7:33 am తెలంగాణా ఐకాస అతుకుల బొంత: నారాయణతెలంగాణా సాధిస్తామని మూకుమ్మడిగా కాంగ్రెస్- తెలుగుదేశం- తెరాస కలిసి ఐక్య కార్యచరణ సమతిగా ఏర్పడినప్పుడే.. అది ముక్కలై పోతుందని తాను ముందే చెప్పానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 14 Mar 2010 | 4:57 am ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తాం : బుద్ధదేవ్తమ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుంటోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య అన్నారు.Source: జాతీయ | 14 Mar 2010 | 4:45 am ముంబైలో ఇద్దరు ఉగ్రవాదులు: అరెస్ట్ చేసిన పోలీసులుదేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం నాడు ఇద్దరు ఉగ్రవాదులను మహారాష్ట్రలోని ఉగ్రవాద నిరోధక సంస్థ(ఏటీఎస్)ఆదివారం అదుపులోకి తీసుకుందిSource: జాతీయ | 14 Mar 2010 | 4:25 am చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం.. రండి: పాక్‌తో భారత్ముంబయి మహానగరంపై ఉగ్రవాద దాడుల అనంతరం భారతదేశం- పాకిస్తాన్ ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపధ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలను పటిష్టపరుచుకునేందుకు గాను కొత్తగా చర్చలు జరుపుకుందామని పాకిస్తాన్‌కు భారతదేశం పిలుపునిచ్చింది.Source: జాతీయ | 14 Mar 2010 | 4:25 am ములాయంకు తృటిలో తప్పిన ప్రమాదం: రన్‌వేపై సైకిల్ మానవుడుసమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. వివరాలలోకి వెళితే ఆయన ప్రయాణిస్తున్న విమానం ఇటావాలోని విమానాశ్రయంలో ఆదివారం ఉదయం దిగుతున్నప్పుడు రన్‌వేపై ఒక వ్యక్తి సైకిల్‌తో వచ్చాడు. అయితే పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందని అధికార వర్గాలు తెలిపాయి.Source: జాతీయ | 14 Mar 2010 | 3:45 am దురంతో రైలును ప్రారంభించిన ముఖ్యమంత్రిరాష్ట్ర రాజధాని పక్కనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య ఆదివారం దురంతో రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. దీంతో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దురంతో రైలు పట్టాలకెక్కింది.Source: ఏపీ న్యూస్ | 14 Mar 2010 | 3:00 am జడ్పీ సమావేశాన్ని అడ్డుకున్న విద్యార్థులుప్రత్యేక తెలంగాణకు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సమావేశం వాయిదా పడటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారుSource: ఏపీ న్యూస్ | 14 Mar 2010 | 1:48 am
|