'సమైక్య'మే కొండంత బలం.. ఎదురుదాడే అజెండా: తెదేపా వ్యూహం!

రాష్ట్ర విభజన అంశంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తన వైఖరిని మార్చుకుందా.? తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు రెండూ రెండు నేత్రాలు అని చెప్పుకుంటూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఆలోచన మారిందా..? రాష్ట్ర విభజనకు సముఖంగా లేని ఆయన పరోక్షంగా సమైక్యవాదాన్ని బలపరుస్తున్నారా...? ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు పై ప్రశ్నలకు అవుననే సమాధానం చెపుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలే తమ వైఖరిని మార్చుకోగా.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తాము పంథా మార్చుకుంటే తప్పేమిటని తెదేపా నేతలు ప్రశ్నిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 14 Mar 2010 | 9:31 am

దురంతో రైలును ప్రారంభించిన ముఖ్యమంత్రి

రాష్ట్ర రాజధాని పక్కనున్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య ఆదివారం దురంతో రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. దీంతో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దురంతో రైలు పట్టాలకెక్కింది.
Source: Yahoo! Telugu: News | 14 Mar 2010 | 8:28 am

జడ్పీ సమావేశాన్ని అడ్డుకున్న విద్యార్థులు

ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సమావేశం వాయిదా పడటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు
Source: Yahoo! Telugu: News | 14 Mar 2010 | 8:17 am

అమెరికాలో భారీ వర్షాలు: స్తంభించిన జనజీవనం

ఈశాన్య అమెరికాలోని పలు ప్రాంతాలలో విపరీతమైన ఈదురు గాలులతోపాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలలో విద్యుత్ లేకపోవడంతో అంతా చీకటిమయంగా మారిపోయింది. అలాగే పలు విమానాల రాకపోకలను కూడా వాటి రూట్లను మార్చివేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Source: Yahoo! Telugu: News | 14 Mar 2010 | 7:48 am

ముంబైలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం నాడు ఇద్దరు ఉగ్రవాదులను మహారాష్ట్రలోని ఉగ్రవాద నిరోధక సంస్థ(ఏటీఎస్)ఆదివారం అదుపులోకి తీసుకుంది
Source: Yahoo! Telugu: News | 14 Mar 2010 | 7:19 am

కొచ్చిలో అత్యవసర ల్యాండింగ్ అయిన విమానం

కొచ్చి నుంచి ముంబై వెళుతున్న గో ఎయిర్ విమానం ప్రయాణమైన కాసేపటికే కొచ్చిలో శనివారం రాత్రి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. విమానంలో 110 మంది ప్రయాణీకులున్నారని, ప్రయాణీకులు సురక్షితంగానే ఉన్నట్లు విమానాశ్రయాధికారులు తెలిపారు
Source: Yahoo! Telugu: News | 14 Mar 2010 | 5:47 am

కాందహార్‌లో ఆత్మాహుతి దాడులు: ముఫై మంది మృతి

కాందహార్‌లో తాలిబన్ తీవ్రవాదులైన ఆత్మాహుతి దళానికి చెందిన నలుగురు శనివారం సాయంత్రం ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు.
Source: Yahoo! Telugu: News | 14 Mar 2010 | 5:29 am

ప్రతి గ్రామంలోను బ్యాంకింగ్ సేవలుంటాయి: ఆర్‌బీఐ

దేశంలోని అన్ని గ్రామాలలోను వచ్చే 2015 నాటికి బ్యాంకింగ్ సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుందని భారతీయ రిజర్వు బ్యాంకు ఉప గవర్నర్ కేసీ చక్రవర్తి తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 14 Mar 2010 | 5:14 am

తితిదే పెద జీయర్‌స్వామి కన్నుమూత

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య కైంకర్యాల పూజా పర్యవేక్షకుడు పెద జీయర్‌ స్వామి(83) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు.
Source: Yahoo! Telugu: News | 14 Mar 2010 | 4:30 am

కూలర్, ఫ్యాన్లు వేసవి కాలంలో వేడెక్కుతున్నాయి

కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఇటీవల ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్లో ఎక్సైజ్ సుంకం పెంచడంతో పెట్రో ధరలు పెరిగాయి. దీంతో కూలర్లు, ఫ్యాన్ల ధరలు కూడా పెరిగాయి. కూలర్లు, ఫ్యాన్లు తయారు చేసే చిన్న, పెద్ద కంపెనీలు సీలింగ్ ఫ్యాన్, కూలర్ల ధరలను పెంచాయని వ్యాపర వర్గాలు తెలిపాయి
Source: Yahoo! Telugu: News | 14 Mar 2010 | 4:10 am

ములాయంకు తృటిలో తప్పిన ప్రమాదం: రన్‌వేపై సైకిల్ మానవుడు

సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌‌కు తృటిలో ప్రమాదం తప్పింది. వివరాలలోకి వెళితే ఆయన ప్రయాణిస్తున్న విమానం ఇటావాలోని విమానాశ్రయంలో ఆదివారం ఉదయం దిగుతున్నప్పుడు రన్‌వేపై ఒక వ్యక్తి సైకిల్‌తో వచ్చాడు. అయితే పైలెట్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందని అధికార వర్గాలు తెలిపాయి.
Source: జాతీయ | 14 Mar 2010 | 3:45 am

దురంతో రైలును ప్రారంభించిన ముఖ్యమంత్రి

రాష్ట్ర రాజధాని పక్కనున్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య ఆదివారం దురంతో రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. దీంతో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దురంతో రైలు పట్టాలకెక్కింది.
Source: ఏపీ న్యూస్ | 14 Mar 2010 | 3:00 am

జడ్పీ సమావేశాన్ని అడ్డుకున్న విద్యార్థులు

ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సమావేశం వాయిదా పడటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు
Source: ఏపీ న్యూస్ | 14 Mar 2010 | 1:48 am

ముంబైలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం నాడు ఇద్దరు ఉగ్రవాదులను మహారాష్ట్రలోని ఉగ్రవాద నిరోధక సంస్థ(ఏటీఎస్)ఆదివారం అదుపులోకి తీసుకుంది
Source: జాతీయ | 14 Mar 2010 | 12:50 am

కొచ్చిలో అత్యవసర ల్యాండింగ్ అయిన విమానం

కొచ్చి నుంచి ముంబై వెళుతున్న గో ఎయిర్ విమానం ప్రయాణమైన కాసేపటికే కొచ్చిలో శనివారం రాత్రి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. విమానంలో 110 మంది ప్రయాణీకులున్నారని, ప్రయాణీకులు సురక్షితంగానే ఉన్నట్లు విమానాశ్రయాధికారులు తెలిపారు
Source: జాతీయ | 13 Mar 2010 | 11:18 pm

తితిదే పెద జీయర్‌స్వామి కన్నుమూత

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య కైంకర్యాల పూజా పర్యవేక్షకుడు పెద జీయర్‌ స్వామి(83) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు.
Source: ఏపీ న్యూస్ | 13 Mar 2010 | 10:01 pm

ఏప్రిల్ 16న ప్రభాస్- కరుణాకరన్ "డార్లింగ్"

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తొలిప్రేమ కరుణాకరన్ దర్శకత్వంలో ఛత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఫిలిమ్ "డార్లింగ్" ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది.ఈ సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ... కరుణాకరన్ నాకు ఇష్టమైన డైరెక్టర్. తొలిప్రేమ, ఉల్లాసంగా... ఉత్సాహంగా, చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యాను. డార్లింగ్ స్టోరీ నన్ను ఎంతగానో ఇన్‌స్పైర్ చేసింది. లవ్ అండ్ యాక్షన్, ఎంటర్‌టైన్మెంట్, ఫ్యామిలీ ఫీల్ అన్నీ ఉండే మంచి సినిమా "డార్లింగ్" అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Mar 2010 | 11:08 am

రవితేజ హీరోగా ఎల్లో ఫ్లవర్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం

క్రేజీస్టార్ రవితేజ హీరోగా యువదర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుప్పాల నిర్మిస్తున్న భారీ చిత్రం మార్చి 25న ప్రారంభం కాబోతోంది.ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ... రవితేజ హీరోగా నిర్మించే ఈ చిత్రం కోసం హరీశ్ శంకర్ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. భారీ ఎత్తున హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మార్చి 25న ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. ఫస్ట్ పిక్చర్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రం మా బ్యానర్‌కు మంచి పేరు తెస్తుందని అన్నారు
Source: Yahoo! Telugu: Entertainment | 13 Mar 2010 | 10:24 am

ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు "ఆవారా"!

లైఫ్‌లో ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకుంటూ జాలీగా గడిపే ఓ కుర్రాడు మొదటి చూపులోనే అమ్మాయి ప్రేమలో పడితే, అనుకోని పరిస్థితుల్లో ఆ అమ్మాయితో కారులో ప్రయాణం చేయాల్సి వస్తే.. అనంతరం పరిస్థితులు ఎలా ఉంటాయనే కథాంశంతో "ఆవారా" చిత్రం రూపొందింది. లవ్, రొమాన్స్, యాక్షన్ కలిసిన ఈ చిత్రాన్ని చక్కని ఎంటర్‌టైనర్ తీర్చిద్దామని చిత్ర నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్ చెప్పారు. శుక్రవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన సమావేశంలో ఈ చిత్రం గురించి చెబుతూ.. "యుగానికి ఒక్కడు" తర్వాత కార్తీ నటించిన రెండవ చిత్రమిది. ఎన్నో సూపర్‌హిట్స్ ఇచ్చిన లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన చిత్రమిది. ఇందులోని ఐదు పాటవకు యువన్‌శంకర్‌రాజా సంగీతం అందించారు. ఈ నెలలోనే ఆడియోను ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేయనున్నాం" అని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Mar 2010 | 8:41 am

అదంతా "మార్ఫింగ్" మాయ: నిత్య"ఆనంద" వేదన

గత వారం రోజులుగా నిత్యానంద- రంజిత సెక్స్ వీడియోలతో మీడియా హోరెత్తించింది. నిత్యానంద మాత్రం ఆ వీడియోలో కన్పించింది తానైనప్పటికీ మార్ఫింగ్ మాయతో ఉన్నది లేనట్లుగా చూపించారని ఓ ప్రైవేటు టీవీ ఛానల్‌తో చెప్పుకొచ్చారు.
Source: జాతీయ | 13 Mar 2010 | 8:34 am

రాహు కేతువులు పోయారు.. జేఏసీ పునీతమైంది: తెరాస

తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి రాహు (కాంగ్రెస్) కేతువు (తెదేపా)లు పోయారని, అందువల్ల ఐకాస పునీతమైందని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, కేసీఆర్ తనయుడు కె.తారకరామారావు అభిప్రాయపడ్డారు. జేఏసీ నుంచి తెలుగుదేశం పార్టీని బహిష్కరించడం పట్ల ఆయన స్పందనను శనివారం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 13 Mar 2010 | 8:25 am

25న వస్తోన్న వరుణ్‌సందేశ్ "మరోచరిత్ర"

వరుణ్‌సందేశ్, అనిత జంటగా దిల్‌రాజు నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం "మరోచరిత్ర". మ్యాట్నీమీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌పై దిల్‌రాజు తన స్నేహితులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెమెరామెన్ రవియాదవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ప్రముఖ తమిళ దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన అలనాటి 'మరోచరిత్ర' చిత్రాన్ని ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దామని నిర్మాత దిల్‌రాజు అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా డీటీఎస్ వర్క్ జరుపుకుంటోందని ఆయన చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Mar 2010 | 8:18 am

భవిష్యత్ ప్రణాళికలును రూపొందిచుకోండి: కిరణ్ కుమార్

విద్యార్థులు తమ భవిష్యత్ ప్రణాళికలను చక్కగా రూపొందించుకోవాలని, రాష్ట్రంలో వనరులు సమృద్ధిగా ఉన్నాయని రాష్ట్ర శాసనసభ సభాపతి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి సూచించారు. రానున్న రోజుల్లో మన రాష్ట్రం ఆర్థికంగా కూడా మరింత అభివృద్ధి సాధించగలదని ఆయన అభిప్రాయపడ్డారు
Source: ఏపీ న్యూస్ | 13 Mar 2010 | 7:58 am

కౌబాయ్ పాత్ర రావడం నా అదృష్టం: లారెన్స్

గ్రూప్ డాన్సర్ స్థాయి నుంచి డాన్స్ మాస్టర్... ఆ తర్వాత కథానాయకుడు.. ఆ తర్వాత దర్శకుడు... త్వరలో నిర్మాతగా మారుతున్న వ్యక్తి రాఘవ లారెన్స్. మరోవైపు డాన్స్ స్కూలును కూడా స్థాపించి కొత్త తరానికి ఆహ్వానం పలుకుతున్నారు. గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ... చెన్నైలోని అంబత్తూరులో తన ఇలవేల్పు రాఘవేంద్రస్వామి దేవాలయం పనిలో బిజీగా ఉన్నారు. అదే సమయంలో కౌబాయ్ చిత్రంలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెపుతున్నారు. ఈ చిత్రం ఈనెల 26న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషన్లో భాగంగా ఆయన హైదరాబాదు వచ్చారు. ఈ సందర్భంగా లారెన్స్ చెప్పిన సంగతులు మీకోసం.. తెల్లటి వస్త్రాలతో చాలా ప్రశాంతంగా కన్పించారు. మనిషి కాస్త తగ్గినట్లుగా కూడా ఉన్నారు. మీలో చాలా మార్పు వచ్చిందే... చాలా కూల్‌గా ఉన్నారు...?నిజమా.. ఇప్పటివరకూ ఆలోచించలేదు. నాలో ఏమార్పు రాలేదు. రాఘవేంద్రస్వామి గుడిలో బిజీగా ఉండటం వల్ల కొద్దిరోజులు మాల వేసాను. బహుశా... ఆ ప్రభావం ఉన్నదేమో నేనైతే ఆలోచించలేదు. నా సినిమాలకు గ్యాప్ కూడా అందుకే. గుడి కట్టడం నా చిరకాల కోరిక. అందుకే దానికి ప్రాధాన్యత ఇచ్చాను.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Mar 2010 | 6:35 am

కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ ఘెరావ్: కార్యక్రమాలు రద్దు!

హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కపిల్ సిబాల్‌కు తెలంగాణ విద్యార్థుల నుంచి చుక్కెదురైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తక్షణం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ మంత్రి కాన్వాయ్‌ను చుట్టుముట్టారు.
Source: ఏపీ న్యూస్ | 13 Mar 2010 | 5:49 am

ఎంసెట్‌కు జాతీయ స్థాయిలో ఉమ్మడి పరీక్ష: కపిల్ సిబాల్

ఇంజనీరింగ్, మెడికల్ అండ్ కామన్ ఎంట్రెన్స్‌కు జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశపరీక్షను నిర్వహించే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మానవవనరుల శాఖామంత్రి కపిల్ సిబాల్ అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 13 Mar 2010 | 5:43 am

జేఏసీ నుంచి తెదేపా వెలి వెనుక కేసీఆర్ కుట్ర: నాగం

తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నుంచి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని బహిష్కరించడం వెనుక తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు కుట్ర వుందని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణపై ఏకాభిప్రాయం తప్పనిసరని ప్రధాని మన్మోహన్ సింగే చేసిన వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకోని తెరాస కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్, కేసీఆర్‌లు తమను టార్గెట్ చేయడం వారి కుట్రలో భాగమేనన్నారు.
Source: ఏపీ న్యూస్ | 13 Mar 2010 | 5:34 am

సెల్- హ్యాండీకామ్‌లలో న్యూడ్ సెక్స్ సినిమా

అవును ఇవ్వాళ ఎక్కడ చూసినా వ్యక్తిగత జీవితం బట్టబయలవుతోంది. నాలుగు గోడల మధ్య జరిగే కార్యక్రమాన్ని ఐ కెమేరాల్లో బంధించి క్యాష్ చేసుకోవడం ఎక్కువై పోయింది. ఇటువంటి సంఘటనల నేపధ్యం చేసుకుని డేరింగ్ లేడీ ఏక్తా కపూర్ "లవ్, సెక్స్ ఔర్ ధోకా" చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించారు.మార్చి 19వ తేదీన వెండితెరపై ఈ సినిమా వేడి రగిల్చనుంది. ఈ చిత్రంలో ప్రేమ... సాన్నిహత్యం... స్నేహం ప్రతిబింబిస్తాయి. అంతేకాదు ఇరువురు ఇష్టపడి సెక్స్ చేసుకునేటపుడు కొందరు ఆ కార్యక్రమాన్ని దొంగతనంగా చిత్రీకరించి బ్లాక్ మెయిల్ ఎలా చేస్తారన్న దానిపైనా సినిమా సాగుతుందని బాలీవుడ్ సినీవర్గాలు అంటున్నాయి.అన్నిటికీ మించి మారుతున్న జీవన శైలిలో స్త్రీపురుషుల మధ్య సెక్స్ సంబంధాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి సంబంధాలను కొందరు హ్యాండీకామ్స్, ఐ కెమేరాలు, సీసీటీవీలు, మొబైల్ కెమేరాలలో బంధించి మానసిక కామవాంఛలను తీర్చుకుంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Mar 2010 | 4:58 am

స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం సీట్లు: పవార్

స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు యాభైశాతం రిజర్వేషన్లు కల్పించాలని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్, కేంద్ర ఆహార శాఖామంత్రి శరద్ పవార్ కోరారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాజ్యసభలో మద్దతు ప్రకటించిన ఎన్సీపీ.. స్థానిక సంస్థల్లో ఈ సంఖ్యను యాభై శాతానికి పెంచాలని డిమాండ్ చేసింది.
Source: జాతీయ | 13 Mar 2010 | 4:14 am

ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు "ఆవారా"!

లైఫ్‌లో ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకుంటూ జాలీగా గడిపే ఓ కుర్రాడు మొదటి చూపులోనే అమ్మాయి ప్రేమలో పడితే, అనుకోని పరిస్థితుల్లో ఆ అమ్మాయితో కారులో ప్రయాణం చేయాల్సి వస్తే.. అనంతరం పరిస్థితులు ఎలా ఉంటాయనే కథాంశంతో "ఆవారా" చిత్రం రూపొందింది. లవ్, రొమాన్స్, యాక్షన్ కలిసిన ఈ చిత్రాన్ని చక్కని ఎంటర్‌టైనర్ తీర్చిద్దామని చిత్ర నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్ చెప్పారు.
Source: వినోదం | 13 Mar 2010 | 3:58 am