|
25న వస్తోన్న వరుణ్‌సందేశ్ "మరోచరిత్ర"వరుణ్‌సందేశ్, అనిత జంటగా దిల్‌రాజు నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం "మరోచరిత్ర". మ్యాట్నీమీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌పై దిల్‌రాజు తన స్నేహితులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెమెరామెన్ రవియాదవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ప్రముఖ తమిళ దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన అలనాటి 'మరోచరిత్ర' చిత్రాన్ని ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దామని నిర్మాత దిల్‌రాజు అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా డీటీఎస్ వర్క్ జరుపుకుంటోందని ఆయన చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Mar 2010 | 8:18 am నిత్యావసర సేవల నిర్వహణా చట్టం పరిధిలోకి ఐటీరాష్ట్రంలోని ఐటీ, ఐటీ ఆధారిత రంగాలను నిత్యావసర సేవల నిర్వహణా చట్టం పరిధిలోకి తీసుకురావలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్‌లో మీడియాకు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 13 Mar 2010 | 8:13 am కజగస్థాన్‌ను ముంచెత్తిన వరదలు: 30 మంది మృతికజగస్థాన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రెండు రిజర్వాయర్ల గేట్లు తెగిపోయాయి. రిజర్వాయర్ గేట్లు తెగిపోవడంతో వరద నీరు ప్రజలు నివసించే ప్రాంతాలను ముంచేశాయి. ఈ వరదల్లో 30మంది మరణించి ఉంటారని పోలీసులు వెల్లడించారు. అంతేగాకుండా దాదాపు 2,500 మందికి పైగా నిరాశ్రయులైయ్యారని వారు చెప్పారు.Source: Yahoo! Telugu: News | 13 Mar 2010 | 7:56 am నరేంద్ర మోడీకి సమన్లు పంపిన ప్రత్యేక దర్యాప్తు బృందంగుజరాత్ అల్లర్ల కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో పాటు భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి నళినీ భట్‌కు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శనివారం సమన్లు జారీ చేసింది. అల్లర్ల కేసులో విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరుకావాలని అందులో పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 13 Mar 2010 | 6:42 am వెయ్యి మందిని నియమించనున్న ఎస్బీఐతమ బ్యాంకు ఈ ఏడాదిలోగా వెయ్యిమంది ఉద్యోగులను నియమించేందుకు ప్రణాళికలు రూపొందించుకుందని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) అధ్యక్షుడు ఓపి భట్ట్ ముంబైలో తెలిపారు.Source: Yahoo! Telugu: News | 13 Mar 2010 | 6:40 am కౌబాయ్ పాత్ర రావడం నా అదృష్టం: లారెన్స్గ్రూప్ డాన్సర్ స్థాయి నుంచి డాన్స్ మాస్టర్... ఆ తర్వాత కథానాయకుడు.. ఆ తర్వాత దర్శకుడు... త్వరలో నిర్మాతగా మారుతున్న వ్యక్తి రాఘవ లారెన్స్. మరోవైపు డాన్స్ స్కూలును కూడా స్థాపించి కొత్త తరానికి ఆహ్వానం పలుకుతున్నారు. గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ... చెన్నైలోని అంబత్తూరులో తన ఇలవేల్పు రాఘవేంద్రస్వామి దేవాలయం పనిలో బిజీగా ఉన్నారు. అదే సమయంలో కౌబాయ్ చిత్రంలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెపుతున్నారు. ఈ చిత్రం ఈనెల 26న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషన్లో భాగంగా ఆయన హైదరాబాదు వచ్చారు. ఈ సందర్భంగా లారెన్స్ చెప్పిన సంగతులు మీకోసం.. తెల్లటి వస్త్రాలతో చాలా ప్రశాంతంగా కన్పించారు. మనిషి కాస్త తగ్గినట్లుగా కూడా ఉన్నారు. మీలో చాలా మార్పు వచ్చిందే... చాలా కూల్‌గా ఉన్నారు...?నిజమా.. ఇప్పటివరకూ ఆలోచించలేదు. నాలో ఏమార్పు రాలేదు. రాఘవేంద్రస్వామి గుడిలో బిజీగా ఉండటం వల్ల కొద్దిరోజులు మాల వేసాను. బహుశా... ఆ ప్రభావం ఉన్నదేమో నేనైతే ఆలోచించలేదు. నా సినిమాలకు గ్యాప్ కూడా అందుకే. గుడి కట్టడం నా చిరకాల కోరిక. అందుకే దానికి ప్రాధాన్యత ఇచ్చాను.Source: Yahoo! Telugu: Entertainment | 13 Mar 2010 | 6:35 am బడ్జెట్‌తో బ్రతుకు బండి లాగించడం కష్టమే: అరుణ్బడ్జెట్లో పెట్రోలుపై ఎక్సైజ్ సుంకం పెంచడంతో నిత్యావసర సరుకులతోపాటు గృహ నిర్మాణాల ఖర్చు, విద్య, ఆరోగ్యం తదితరాల ధరలు పెరిగిపోయాయని, ప్రభుత్వ విధానాలతో సాధారణ మనిషి జీవించే పరిస్థితి లేదని రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ ఆరోపించారుSource: Yahoo! Telugu: News | 13 Mar 2010 | 6:21 am ఆ మూడు కారణాల వల్లే తెదేపాను వెలివేశాం: కోదండరామ్జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాజీనామాలు చేయక పోవడం, జేఏసీపై పదేపదే విమర్శలు చేయడం, తెలంగాణపై చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయక పోవడం వల్లే తెలంగాణ ఐకాస నుంచి ఆ పార్టీని బహిష్కరించినట్టు కన్వీనర్ ఆచార్య కోదండరామ్ వివరణ ఇచ్చారు. దీనిపై ఆయన శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తెదేపా వైఖరేమిటో ఇప్పటికైనా చెప్పాలని డిమాండ్ చేశారు.Source: Yahoo! Telugu: News | 13 Mar 2010 | 6:21 am వరద సాయంలో విఫలమైన ప్రభుత్వం: చంద్రబాబువరద బాధితులకు పూర్తి సాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తన రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన శనివారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ తప్పింద వల్లే గత యేడాది వరదలు సంభవించాయన్నారు.Source: Yahoo! Telugu: News | 13 Mar 2010 | 5:55 am నేడు తమిళనాడు రాష్ట్ర కొత్త సచివాలయం ప్రారంభం!తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక హంగులతో కొత్తగా నిర్మించిన శాసనసభ భవన సముదాయాన్ని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ శనివారం సాయంత్రం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.Source: Yahoo! Telugu: News | 13 Mar 2010 | 5:14 am పాకిస్థాన్‌కు సైనిక సాయం అందించం: వ్లాదిమిర్ పుతిన్తీవ్రవాద కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేంత వరకు పాకిస్థాన్‌కు సైనిక సాయం అందించబోమని భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు ప్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. అదేసమయంలో తీవ్రవాదంపై భారత్-రష్యా దేశాలు కలిసి సాగిస్తున్న సంయుక్తం పోరు సత్ఫలితాన్ని ఇస్తుందన్నారు.Source: Yahoo! Telugu: News | 13 Mar 2010 | 5:00 am సెల్- హ్యాండీకామ్‌లలో న్యూడ్ సెక్స్ సినిమాఅవును ఇవ్వాళ ఎక్కడ చూసినా వ్యక్తిగత జీవితం బట్టబయలవుతోంది. నాలుగు గోడల మధ్య జరిగే కార్యక్రమాన్ని ఐ కెమేరాల్లో బంధించి క్యాష్ చేసుకోవడం ఎక్కువై పోయింది. ఇటువంటి సంఘటనల నేపధ్యం చేసుకుని డేరింగ్ లేడీ ఏక్తా కపూర్ "లవ్, సెక్స్ ఔర్ ధోకా" చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించారు.మార్చి 19వ తేదీన వెండితెరపై ఈ సినిమా వేడి రగిల్చనుంది. ఈ చిత్రంలో ప్రేమ... సాన్నిహత్యం... స్నేహం ప్రతిబింబిస్తాయి. అంతేకాదు ఇరువురు ఇష్టపడి సెక్స్ చేసుకునేటపుడు కొందరు ఆ కార్యక్రమాన్ని దొంగతనంగా చిత్రీకరించి బ్లాక్ మెయిల్ ఎలా చేస్తారన్న దానిపైనా సినిమా సాగుతుందని బాలీవుడ్ సినీవర్గాలు అంటున్నాయి.అన్నిటికీ మించి మారుతున్న జీవన శైలిలో స్త్రీపురుషుల మధ్య సెక్స్ సంబంధాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి సంబంధాలను కొందరు హ్యాండీకామ్స్, ఐ కెమేరాలు, సీసీటీవీలు, మొబైల్ కెమేరాలలో బంధించి మానసిక కామవాంఛలను తీర్చుకుంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Mar 2010 | 4:58 am ఆఫ్ఘన్‌లోని భారత దౌత్యవేత్తలకు కిడ్నాప్ ముప్పు!ఆఫ్ఘనిస్థాన్‌లో వివిధ రకాల సేవలు అందిస్తున్న భారత పౌరులు, దౌత్యవేత్తలకు తీవ్రవాదుల నుంచి కిడ్నాప్ ముప్పు పొంచివుంది. తీవ్రవాద సంస్థల నుంచి ఎదురుకానున్న ఈ ముప్పు గురించి స్పష్టమైన సమాచారాన్ని నిఘా వర్గాలు సేకరించారు. దీంతో కాబూల్‌లో ఉన్న దౌత్యవేత్తలకు భద్రత కల్పించే నిమిత్తం కొంత మంది ఇండో టిబెట్ బెటాలియన్ పోలీసులు ఆఫ్ఘనిస్థాన్‌కు కేంద్రం పంపింది.Source: Yahoo! Telugu: News | 13 Mar 2010 | 4:42 am నరేంద్ర మోడీకి సమన్లు పంపిన ప్రత్యేక దర్యాప్తు బృందంగుజరాత్ అల్లర్ల కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో పాటు భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి నళినీ భట్‌కు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శనివారం సమన్లు జారీ చేసింది. అల్లర్ల కేసులో విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరుకావాలని అందులో పేర్కొంది.Source: జాతీయ | 13 Mar 2010 | 1:13 am ఆ మూడు కారణాల వల్లే తెదేపాను వెలివేశాం: కోదండరామ్జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాజీనామాలు చేయక పోవడం, జేఏసీపై పదేపదే విమర్శలు చేయడం, తెలంగాణపై చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయక పోవడం వల్లే తెలంగాణ ఐకాస నుంచి ఆ పార్టీని బహిష్కరించినట్టు కన్వీనర్ ఆచార్య కోదండరామ్ వివరణ ఇచ్చారు. దీనిపై ఆయన శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తెదేపా వైఖరేమిటో ఇప్పటికైనా చెప్పాలని డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 13 Mar 2010 | 12:52 am వరద సాయంలో విఫలమైన ప్రభుత్వం: చంద్రబాబువరద బాధితులకు పూర్తి సాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తన రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన శనివారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ తప్పింద వల్లే గత యేడాది వరదలు సంభవించాయన్నారు.Source: ఏపీ న్యూస్ | 13 Mar 2010 | 12:25 am నేడు తమిళనాడు రాష్ట్ర కొత్త సచివాలయం ప్రారంభం!తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక హంగులతో కొత్తగా నిర్మించిన శాసనసభ భవన సముదాయాన్ని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ శనివారం సాయంత్రం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.Source: జాతీయ | 12 Mar 2010 | 11:45 pm పర్మినెంట్ పరిధిలో చోటు కల్పించలేం: త్రివిధ దళాలుదేశ రక్షణ రంగంలో పని చేసి పదవీ విరమణ పొందిన యాభై మంది మహిళా ఉన్నతాధికారులను తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించలేమని ఆర్మీ, నేవీ దళాలకు చెందిన ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. షార్ట్ సర్వీస్ కమిషన్‌లో చేరిన ఈ మహిళా అధికారులు తమ సర్వీసు కాలం పూర్తయిన తర్వాత పదవీ విమరణ పొందారు. దీన్ని వ్యతిరేకిస్తూ వారు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.Source: జాతీయ | 12 Mar 2010 | 11:03 pm 26/11 దాడులు పునరావృతమైతే సహించం: చిదంబరం26/11 తరహా దాడులు భవిష్యత్‌లో పునరావృతమైతే సహించే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. ఆ చర్యలు సైనిక చర్యగా ఉంటుందా లేదా మరొలా ఉంటుదా అనేది అప్పటి పరిస్థితి తీవ్రతను బట్టి ఉంటుందన్నారు. శుక్రవారం రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.Source: జాతీయ | 12 Mar 2010 | 10:57 pm రాజకీయ నేతగా కాదు.. ఓ సీమవాసిగా వెల్లడించా: జేసీరాయలసీమ ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతంలో విలీనం చేయాలని చెప్పడం ఒక రాజకీయ నేతగా వెల్లడించిన అభిప్రాయం కాదని, ఒక సాధారణ సీమవాసిగా చెప్పానని మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డి అన్నారు. ఇందులో ఎలాంటి స్వలాభాలు లేవన్నారు.Source: ఏపీ న్యూస్ | 12 Mar 2010 | 10:43 pm జీహెచ్‌ఎంసీ ట్రేడ్ యూనియన్లకు 27న ఎన్నికలుగ్రేటర్ హైదరాబాద్ మునిసిఫల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్లకు ఈనెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర కార్మిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికలో పోటీ చేయడానికి అర్హత ఉన్న సంస్థల పేర్లను కూడా ఈ కమిషన్ ప్రకటించింది. వీటిలో కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, సీపీఎం, సీపీఐలు బలపరిచిన ట్రేడ్ యూనియన్‌లు ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.Source: ఏపీ న్యూస్ | 12 Mar 2010 | 10:25 pm అది టీజేఏసీ కాదు.. తెరాస ఐరాస: తెదేపా నేతల ధ్వజం!తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ అన్ని వర్గాలను కలుపుకుని పోయే తెలంగాణ రాష్ట్ర జేఏసీ కాదని ఆ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు చేతిలో కీలుబొమ్మగా ఉండే తెరాస ఐక్య కార్యాచరణ సమితి అని ఆ పార్టీ సీనియర్ నేత వేణుగోపాలాచారి ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 12 Mar 2010 | 10:17 pm శాశ్వత కమిషన్ పరిధిలోకి చేర్చండి: ఢిల్లీ హైకోర్టుదేశ రక్షణ రంగంలో పని చేసే మహిళలను శాశ్వత కమిషన్ (పర్మినెంట్) పరిధిలోకి చేర్చాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి సూచించింది. ఇది భారత నారీమణికి మరో శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లుకు ఎగువ సభ ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 12 Mar 2010 | 9:43 pm అనుకున్నదే జరిగింది: జేఏసీ నుంచి తెదేపా బహిష్కరణ!అందరూ ఊహించినట్టుగానే జరిగింది. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస) నుంచి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని బహిష్కరించారు. పూటకో మాట మాట్లాడే నేతలు ఐకాసలో ఉన్న ఒకటే.. లేకపోయినా ఒక్కటేనంటూ ఐకాస కన్వీనర్ ఆచార్య కోదండరామ్ మండిపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 12 Mar 2010 | 8:49 pm ఆకాశ రామన్న.. బుర్రకు భలే పదును..!!పనీపాట లేకుండా తేజ( రాజీవ్ కనకాల) పబ్‌లో తాగుతూ చిందులేస్తుంటాడు. అక్కడ పబ్‌లో ఓ స్వామీజీ( రఘు బాబు) తన శిష్యులతో వచ్చి చిందులేస్తుంటాడు. తనకొచ్చిన అనుమానాల స్వామీజీతో చెప్పి తేజ నివృత్తి చేసుకుంటాడు. తప్పు చేస్తే తగిన శిక్ష దేవుడు విధిస్తాడని చెపుతాడు స్వామీజీ. కానీ తాము అందుకు అతీతులమని స్వామీజి చెప్పిన మరుక్షణంలో కారు యాక్సిడెంట్లో చనిపోతాడు. దాంతో కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని చివరి మాట చెపుతాడు స్వామీజీ. కథాగమనం ఎలా సాగుతుందో ప్రారంభ సన్నివేశంలో తెలిసిపోతుంది. అంటే ఇంకా ఇటువంటి తప్పులు చేసేవారు కొందరున్నారు. వారు ఎన్ని తప్పులు చేశారు. వాటికి తగిన శిక్ష ఎలా పడింది అనేది సినిమా. కాకపోతే ఈ పాయింట్ చెప్పడానికి దర్శకుడు ఎన్నుకున్న కొత్త మార్గం రివర్స్ స్క్రీన్ ప్లే.Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2010 | 12:23 pm రవితేజ- సెక్సీ క్వీన్ శ్రేయ జంటగా "డాన్ శీను"క్రేజీస్టార్ రవితేజ, శ్రేయ జంటగా ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వెంకట్ కె. అచ్చిరెడ్డి సమర్పణలో వి.సురేష్ రెడ్డి సహ నిర్మాతగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ క్రేజీ చిత్రం డాన్ శీను నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం నైజాం ఏరియాలో ఏషియన్ ఫిలింస్, ఓవర్సీస్ గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ ఫ్యాన్సీ ఆఫర్‌తో కొన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సీడెడ్ ఏరియా రైట్స్ జి.బి.ఆర్. ఫిలిమ్స్ మహేష్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు హరి పిక్చర్స్ హరికుమార్ మంచి ఆఫర్స్ ఇచ్చి స్వంతం చేసుకున్నారు. ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుండగానే స్పీడ్ గా బిజినెస్ అవుతున్న డాన్ శీను టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2010 | 11:02 am పేద విద్యార్థికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రూ. 5వేలు సాయంకర్నూలు జిల్లా ఆదోని పట్టణం గణికల్ గ్రామంలో బి. నగేష్ అనే పేద విద్యార్థికి విద్యాభ్యాసం నిమిత్తం ఐదు వేల రూపాయలను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేతులు మీదుగా ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షులు కె.ఎం ముజీబ్ అహ్మద్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్.చాంద్ బాషా, జి. బాలూ యాదవ్, కె. అశోక్, కె.విశ్వనాథ్, కెఎస్. శేఖర్, ఎ.ఎస్.చాంద్, కె. అభిరాము, వై.రవికుమార్, కె. వెంకటేష్, బి. వీరేంద్ర, వి. వీరేష్, వి. మల్లేష్, బి. నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2010 | 10:44 am ది రెసిడెన్సీ టవర్‌లో నేటి నుంచి వింటేజ్ నైట్!తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లోని నక్షత్ర హోటళ్ళలో ఒకటైన ది రెసిడెన్సీ టవర్‌లో నేటి నుంచి బ్లాక్ అండ్ వైట్ పేరిట సంగీత విభావరి జరుగనుంది. స్థానిక త్యాగరాయ నగర్‌లోని జీఎన్‌శెట్టి రోడ్డులో ఉన్న ది రెసిడెన్సీ హోటల్‌లో శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ కార్యక్రం ప్రారంభమవుతుంది. ఇందులో ప్రఖ్యాత గాయకుడు డీజే.సురోజిత్ గుహా హాలీవుడ్, బాలీవుడ్ గీతాలను ఆలపిస్తారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2010 | 10:08 am కరిష్మా కపూర్‌కు బాబు పుట్టాడోచ్..!బాలీవుడ్ సుందరాంగి కరిష్మా కపూర్ ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం కరిష్మా కపూర్‌లో బాబు పుట్టాడని ఆమె కుటుంబీకులు తెలిపారు. ఢిల్లీకి చెందిన పారిశ్రామిక వేత్త సంజయ్ కుమార్‌తో కరిష్మా కపూర్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లికి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న కరిష్మా కొపూర్ యాడ్ చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది. ఇకపోతే.. కరిష్మా కపూర్ దంపతులు ఇప్పటికే ఐదేళ్ల సమైరా అనే అమ్మాయి ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఓ పండంటి మగబిడ్డకు కరిష్మా కపూర్ జన్మనిచ్చిందని ఆమె కుటుంబీకులు వెల్లడించారు. ఇంకా తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని వారు చెప్పారు. కరిష్మా కపూర్‌కు మగ సంతానం పుట్టడంతో ఆమె స్నేహితురాలు, జ్యుయెల్లరీ డిజైనర్ ఫరాఖాన్ అలితో పాటు పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు కరిష్మాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే 35 ఏళ్ల కరిష్మా కపూర్‌కు రాజా హిందూస్థానీ, హీరో నెంబర్.1, దిల్ తో పాగల్ హై వంటి చిత్రాలు మంచి గుర్తింపును సంపాదించిపెట్టిన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2010 | 9:14 am అది బూటకపు ఎన్‌కౌంటర్: సోలిపేట రామలింగారెడ్డితన సోదరుడిని ముంబయి నుంచి పట్టుకొచ్చి వరంగల్‌లో పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి చంపి వేశారని టెక్ రమణ సోదరుడు, తెరాస మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి ఆరోపించారు. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి, హోం మంత్రిలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 12 Mar 2010 | 8:35 am అక్కడ "ముద్దు" పబ్లిక్‌గా పెట్టుకోవచ్చు: నాగచైతన్య"ఏ మాయ చేసావె"లో కిస్ సీన్స్ గురించి టాలీవుడ్‌లో చర్చ జరుగుతూనే ఉంది. ఛాన్సు దొరికినపుడల్లా చిత్రం హీరోహీరోయిన్లను సినీజనం ముద్దు గురించి అడుగుతూనే వున్నారు. ఇదే విషయంపై నాగచైతన్యను అడిగినపుడు.. తను ముద్దు పెట్టిన సీన్ అభ్యంతరకరంగా లేదనీ, కథ మేరకే దర్శకుడు అలా చేయమన్నారని చెప్పారు. మొదటిగా న్యూజీలాండ్‌లో క్లైమాక్స్ సీన్ షూట్ చేశారనీ, అక్కడ కిస్ సీన్ పబ్లిక్‌గా పెట్టుకోవచ్చని తెలిపాడు. కనుక... ముందుగా హీరోయిన్‌ను అక్కడే కిస్ చేశానని చెప్పుకొచ్చాడు. ఆ ధైర్యంతోనే మొదటి భాగంలో రైల్వే ప్రయాణంలో కిస్ చేశాననీ, దాంతో ముద్దు పెట్టుకునేటపుడు ఉండే బెరుకు కాస్తా పోయిందని వివరించారు. ఏదేమైనా ముద్దులివ్వడంలో తండ్రికి తగ్గ కొడుకుగా నాగచైతన్య పేరు తెచ్చుకుంటున్నాడన్నమాట.Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2010 | 6:48 am సాయుధ శాఖలో మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్!సాయుధ శాఖలో పనిచేస్తున్న మహిళా అధికారుల సమస్యల పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికన ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి సూచించింది. రక్షణ శాఖలో పనిచేస్తున్న మహిళా అధికారులు, రిటైర్డ్ అధికారులు వేర్వేరుగా దాఖలు చేసిన రెండు పిటిషన్లను శుక్రవారం విచారించిన సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మార్గనిర్దేశించింది. ఈ విధులను త్రివిధ దళాలకు వర్తింపజేయాలని న్యాయ స్థానం పేర్కొంది.Source: జాతీయ | 12 Mar 2010 | 5:46 am విక్టరీ వెంకటేష్ హీరోగా "ఆప్త రక్షక"విక్టరీ వెంకటేష్ కథనాయకుడిగా ప్రముఖ దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై కన్నడ సన్సేషనల్ హిట్ ఆప్తరక్షక ఆధారంగా నిర్మిస్తున్న భారీ చిత్రం మే నెలలో ప్రారంభం కానుంది. కన్నడంలో ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టిస్తోన్న బిగ్గెస్ట్ హిట్ ఆప్త రక్షక తెలుగు రీమేక్ రైట్స్ కోసం ఎంతోమంది ప్రయత్నించినా బెల్లంకొండ సురేష్ ఈ హక్కులను దక్కించుకున్నారు. ఇందులో హీరోగా ఎవరు నటిస్తారన్న విషయంపై ఎన్నో ఊహాగానాలు వచ్చినా విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్నారని చెప్పి బెల్లంకొండ సస్పెన్స్‌కు తెరదించారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2010 | 5:33 am రవితేజ- సెక్సీ క్వీన్ శ్రేయ జంటగా "డాన్ శీను"క్రేజీస్టార్ రవితేజ, శ్రేయ జంటగా ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వెంకట్ కె. అచ్చిరెడ్డి సమర్పణలో వి.సురేష్ రెడ్డి సహ నిర్మాతగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ క్రేజీ చిత్రం డాన్ శీను నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం నైజాం ఏరియాలో ఏషియన్ ఫిలింస్, ఓవర్సీస్ గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ ఫ్యాన్సీ ఆఫర్‌తో...Source: వినోదం | 12 Mar 2010 | 5:33 am పేద విద్యార్థికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రూ. 5వేలు సాయంకర్నూలు జిల్లా ఆదోని పట్టణం గణికల్ గ్రామంలో బి. నగేష్ అనే పేద విద్యార్థికి విద్యాభ్యాసం నిమిత్తం ఐదు వేల రూపాయలను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేతులు మీదుగా ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షులు కె.ఎం ముజీబ్ అహ్మద్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్.చాంద్ బాషా, జి. బాలూ యాదవ్, కె. అశోక్, కె.విశ్వనాథ్, కెఎస్. శేఖర్, ఎ.ఎస్.చాంద్, కె. అభిరాము, వై.రవికుమార్, కె. వెంకటేష్, బి. వీరేంద్ర, వి. వీరేష్, వి. మల్లేష్, బి. నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.Source: వినోదం | 12 Mar 2010 | 5:17 am ది రెసిడెన్సీ టవర్‌లో నేటి నుంచి వింటేజ్ నైట్!తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లోని నక్షత్ర హోటళ్ళలో ఒకటైన ది రెసిడెన్సీ టవర్‌లో నేటి నుంచి బ్లాక్ అండ్ వైట్ పేరిట సంగీత విభావరి జరుగనుంది. స్థానిక త్యాగరాయ నగర్‌లోని జీఎన్‌శెట్టి రోడ్డులో ఉన్న ది రెసిడెన్సీ హోటల్‌లో శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ కార్యక్రం ప్రారంభమవుతుంది. ఇందులో ప్రఖ్యాత గాయకుడు డీజే.సురోజిత్ గుహా హాలీవుడ్, బాలీవుడ్ గీతాలను ఆలపిస్తారు.Source: వినోదం | 12 Mar 2010 | 5:09 am మహిళా బిల్లుపై మా వైఖరి మారబోదు: లాలూ ప్రసాద్మహిళా బిల్లుపై తమ వైఖరి మారబోదని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. లోక్‌సభలో మహిళా బిల్లుపై తమ నిరసన కొనసాగుతోందని ఆయన తేల్చి చెప్పారు. శుక్రవారం లోక్‌సభ సమావేశాలకు వెళుతూ లాలూ ప్రసాద్‌యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ.. మహిళా బిల్లుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై ఆయన తప్పు బట్టారు.Source: జాతీయ | 12 Mar 2010 | 4:48 am మా నాన్న కేసీఆర్... నా రోల్ మోడల్ కాదు: కవితప్రత్యేక తెలంగాణా వాదం తెరమీదికి వచ్చిన తర్వాత తెలంగాణా రాష్ట్ర సమితిలో ఉన్న ఛోటా మోటా నాయకులందరూ ప్రజలకు బాగా తెలిసిపోయారు. అదలా ఉంచితే తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె కూడా మీడియా ద్వారా ప్రజల ముందుకు వచ్చారు. ప్రత్యేక తెలంగాణాను ఆకాంక్షించే కవితకు సీమాంధ్రలోనే ఎక్కువ మంది స్నేహితులున్నారట.Source: ఏపీ న్యూస్ | 12 Mar 2010 | 4:40 am కరిష్మా కపూర్‌కు బాబు పుట్టాడోచ్..!బాలీవుడ్ సుందరాంగి కరిష్మా కపూర్ ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం కరిష్మా కపూర్‌లో బాబు పుట్టాడని ఆమె కుటుంబీకులు తెలిపారు. ఢిల్లీకి చెందిన పారిశ్రామిక వేత్త సంజయ్ కుమార్‌తో కరిష్మా కపూర్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లికి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న కరిష్మా కొపూర్ యాడ్ చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది. ఇకపోతే.. కరిష్మా కపూర్ దంపతులు ఇప్పటికే ఐదేళ్ల సమైరా అనే అమ్మాయి ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఓ పండంటి మగబిడ్డకు కరిష్మా కపూర్ జన్మనిచ్చిందని ఆమె కుటుంబీకులు వెల్లడించారు. ఇంకా తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని వారు చెప్పారు. కరిష్మా కపూర్‌కు మగ సంతానం పుట్టడంతో ఆమె స్నేహితురాలు, జ్యుయెల్లరీ డిజైనర్ ఫరాఖాన్ అలితో పాటు పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు కరిష్మాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే 35 ఏళ్ల కరిష్మా కపూర్‌కు రాజా హిందూస్థానీ, హీరో నెంబర్.1, దిల్ తో పాగల్ హై వంటి చిత్రాలు మంచి గుర్తింపును సంపాదించిపెట్టిన సంగతి తెలిసిందే.Source: వినోదం | 12 Mar 2010 | 3:45 am హింస వీడితే సరే.. లేదంటే అంతే..!!: మంత్రి చిదంబరంమావోయిస్టుల అంతుచూసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం వ్యాఖ్యానించారు. మావోయిస్టుల దుశ్చర్యలు రోజు రోజుకి పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో, మావోలు హింసను వీడితేనే వారితో చర్చలు జరుపుతామని మంత్రి స్పష్టం చేశారు. మావోలు హింసను వీడని పక్షంలో వారితో చర్చలు జరపే ప్రసక్తే లేదని హోం మంత్రి అన్నారు.Source: జాతీయ | 12 Mar 2010 | 2:50 am తమిళనాడు సచివాలయ ప్రారంభోత్సవంలో సీఎం!తమిళనాడు నూతన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య పాల్గొననున్నారు. దీనికోసం శనివారం చిత్తూరు పర్యటనను కూడా ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తమిళనాడు శాసనసభ కొత్త భవన సముదాయాన్ని శనివారం సాయంత్రం ఆవిష్కరించనున్నారు.Source: ఏపీ న్యూస్ | 12 Mar 2010 | 2:21 am
|