హింస వీడితే సరే.. లేదంటే అంతే..!!: మంత్రి చిదంబరం

మావోయిస్టుల అంతుచూసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం వ్యాఖ్యానించారు. మావోయిస్టుల దుశ్చర్యలు రోజు రోజుకి పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో, మావోలు హింసను వీడితేనే వారితో చర్చలు జరుపుతామని మంత్రి స్పష్టం చేశారు. మావోలు హింసను వీడని పక్షంలో వారితో చర్చలు జరపే ప్రసక్తే లేదని హోం మంత్రి అన్నారు.
Source: Yahoo! Telugu: News | 12 Mar 2010 | 8:07 am

లాహోర్‌లో బాంబు పేలుళ్ళు: ఇరవై మంది మృతి

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో శుక్రవారం అత్యంత శక్తివంతమైన బాంబులు పేలడంతో ఇరవై మంది మృతి చెందగా నలభై మందికి పైగా తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసు అధికారులు తెలిపారు. లాహోర్‌ క్యాంట్ వద్దనున్న ఆర్ ఏ బజారు ప్రాంతంలోని బస్టాండ్‌లో ఈ పేలుళ్ళు జరిగాయని పోలీసులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 12 Mar 2010 | 8:05 am

తమిళనాడు సచివాలయ ప్రారంభోత్సవంలో సీఎం!

తమిళనాడు నూతన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య పాల్గొననున్నారు. దీనికోసం శనివారం చిత్తూరు పర్యటనను కూడా ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తమిళనాడు శాసనసభ కొత్త భవన సముదాయాన్ని శనివారం సాయంత్రం ఆవిష్కరించనున్నారు.
Source: Yahoo! Telugu: News | 12 Mar 2010 | 7:49 am

ఊతమివ్వని ఐఐపీ గణాంకాలు: నష్టాల్లో సెన్సెక్స్

శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్‌ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభంలో లాభాలతో ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 30 పాయింట్లు పడిపోయింది. దీంతో సెన్సెక్స్ 17,137 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా రెండు పాయింట్లు క్షీణించి 5,130 పాయింట్ల మార్కును తాకింది.
Source: Yahoo! Telugu: News | 12 Mar 2010 | 7:33 am

నష్టాల్లోనే కొనసాగుతోన్న సెన్సెక్స్

శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభంలో లాబాలను చవిచూసిన బాంబే స్టాక్ మార్కెట్, మధ్యాహ్నానికి నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, 24 పాయింట్లు పడిపోయి, 17,143 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ నిఫ్టీ కేవలం ఒక్క పాయింట్ మాత్రమే క్షీణించి, 5,131 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 12 Mar 2010 | 7:16 am

స్వల్ప నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్

బాంబే స్టాక్ మార్కెట్ వారాంతమైన శుక్రవారం మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభంలో లాభాలను ఆర్జించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 12 పాయింట్ల నష్టంతో 17,155 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా -0.90 పాయింట్ల కనిష్ఠ నష్టంతో, 5,132 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 12 Mar 2010 | 7:06 am

పోలీసు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు నేత రమణ

వరంగల్ జిల్లాలోని తాడ్వాయి మండలంలో శుక్రవారం ఉదయం నుంచి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత కొండల రెడ్డి అలియాస్ టెక్ రమణ మృతి చెందారు.
Source: Yahoo! Telugu: News | 12 Mar 2010 | 6:54 am

అక్కడ "ముద్దు" పబ్లిక్‌గా పెట్టుకోవచ్చు: నాగచైతన్య

"ఏ మాయ చేసావె"లో కిస్ సీన్స్ గురించి టాలీవుడ్‌లో చర్చ జరుగుతూనే ఉంది. ఛాన్సు దొరికినపుడల్లా చిత్రం హీరోహీరోయిన్లను సినీజనం ముద్దు గురించి అడుగుతూనే వున్నారు. ఇదే విషయంపై నాగచైతన్యను అడిగినపుడు.. తను ముద్దు పెట్టిన సీన్ అభ్యంతరకరంగా లేదనీ, కథ మేరకే దర్శకుడు అలా చేయమన్నారని చెప్పారు. మొదటిగా న్యూజీలాండ్‌లో క్లైమాక్స్ సీన్ షూట్ చేశారనీ, అక్కడ కిస్ సీన్ పబ్లిక్‌గా పెట్టుకోవచ్చని తెలిపాడు. కనుక... ముందుగా హీరోయిన్‌ను అక్కడే కిస్ చేశానని చెప్పుకొచ్చాడు. ఆ ధైర్యంతోనే మొదటి భాగంలో రైల్వే ప్రయాణంలో కిస్ చేశాననీ, దాంతో ముద్దు పెట్టుకునేటపుడు ఉండే బెరుకు కాస్తా పోయిందని వివరించారు. ఏదేమైనా ముద్దులివ్వడంలో తండ్రికి తగ్గ కొడుకుగా నాగచైతన్య పేరు తెచ్చుకుంటున్నాడన్నమాట.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2010 | 6:48 am

విద్యార్థి దశలోనే విద్యను పూర్తి చేయాలి: నరసింహన్

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చెందిన 50వ స్నాతకోత్సవం శుక్రవారం స్థానిక శ్రీనివాస ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమైంది. స్నాతకోత్సవంలో గవర్నర్ నరసింహన్ ఛాన్సలర్ హోదాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశలోనే తమ చదువును పూర్తి చేసుకోవాలని, దీనికిగాను తమ సమయాన్ని చదువుకే కేటాయించాలని ఆయన కోరారు.
Source: Yahoo! Telugu: News | 12 Mar 2010 | 6:34 am

పెరిగిన పారిశ్రామికోత్పత్తి: లాభాల్లో స్టాక్ మార్కెట్

దేశంలోని పారిశ్రామికోత్పత్తులు జనవరి నెలలో దాదాపు 16.7 శాతం వృద్ధి సాధించింది. దీంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో స్వల్పంగా పుంజుకుంది.ఫలితంగా సెన్సెక్స్ కేవలం ఐదు పాయింట్లు మాత్రమే బలపడి, 17,173 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం ఆరు పాయింట్ల స్వల్ప నష్టంతో, 5,140 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 12 Mar 2010 | 6:29 am

సేవా సంస్థలకే నోబెల్ నగదు బహుమతి : ఒబామా

నోబెల్ శాంతి పురస్కారం ద్వారా అందిన రూ.14 లక్షల అమెరికా డాలర్ల నగదు మొత్తాన్ని అమెరికా అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, సేవా సంస్థలకు పంచిపెట్టనున్నారు. ఈ మేరకు నోబెల్ పురస్కారం ద్వారా లభించిన మొత్తాన్ని పది సేవా సంస్థలకు అందజేయనున్నట్లు ఒబామా ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 12 Mar 2010 | 6:22 am

విక్టరీ వెంకటేష్ హీరోగా "ఆప్త రక్షక"

విక్టరీ వెంకటేష్ కథనాయకుడిగా ప్రముఖ దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై కన్నడ సన్సేషనల్ హిట్ ఆప్తరక్షక ఆధారంగా నిర్మిస్తున్న భారీ చిత్రం మే నెలలో ప్రారంభం కానుంది. కన్నడంలో ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టిస్తోన్న బిగ్గెస్ట్ హిట్ ఆప్త రక్షక తెలుగు రీమేక్ రైట్స్ కోసం ఎంతోమంది ప్రయత్నించినా బెల్లంకొండ సురేష్ ఈ హక్కులను దక్కించుకున్నారు. ఇందులో హీరోగా ఎవరు నటిస్తారన్న విషయంపై ఎన్నో ఊహాగానాలు వచ్చినా విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్నారని చెప్పి బెల్లంకొండ సస్పెన్స్‌కు తెరదించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Mar 2010 | 5:33 am

హింస వీడితే సరే.. లేదంటే అంతే..!!: మంత్రి చిదంబరం

మావోయిస్టుల అంతుచూసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం వ్యాఖ్యానించారు. మావోయిస్టుల దుశ్చర్యలు రోజు రోజుకి పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో, మావోలు హింసను వీడితేనే వారితో చర్చలు జరుపుతామని మంత్రి స్పష్టం చేశారు. మావోలు హింసను వీడని పక్షంలో వారితో చర్చలు జరపే ప్రసక్తే లేదని హోం మంత్రి అన్నారు.
Source: జాతీయ | 12 Mar 2010 | 2:50 am

తమిళనాడు సచివాలయ ప్రారంభోత్సవంలో సీఎం!

తమిళనాడు నూతన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య పాల్గొననున్నారు. దీనికోసం శనివారం చిత్తూరు పర్యటనను కూడా ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తమిళనాడు శాసనసభ కొత్త భవన సముదాయాన్ని శనివారం సాయంత్రం ఆవిష్కరించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Mar 2010 | 2:21 am

పోలీసు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు నేత రమణ

వరంగల్ జిల్లాలోని తాడ్వాయి మండలంలో శుక్రవారం ఉదయం నుంచి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత కొండల రెడ్డి అలియాస్ టెక్ రమణ మృతి చెందారు.
Source: ఏపీ న్యూస్ | 12 Mar 2010 | 1:24 am

విద్యార్థి దశలోనే విద్యను పూర్తి చేయాలి: నరసింహన్

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చెందిన 50వ స్నాతకోత్సవం శుక్రవారం స్థానిక శ్రీనివాస ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమైంది. స్నాతకోత్సవంలో గవర్నర్ నరసింహన్ ఛాన్సలర్ హోదాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశలోనే తమ చదువును పూర్తి చేసుకోవాలని, దీనికిగాను తమ సమయాన్ని చదువుకే కేటాయించాలని ఆయన కోరారు.
Source: ఏపీ న్యూస్ | 12 Mar 2010 | 1:06 am

వెబ్‌దునియాకు ఇండియన్ డిజిటల్ మీడియా అవార్డు

ఆన్‌లైన్‌ ప్రకటనల రంగంలో దేశంలోని పలు భాషలలో అత్యంత ప్రత్యేకత కనబరిచి భాషా పరిరక్షణ కోసం పాటుపడుతున్న వెబ్‌‌దునియాకు 2010 సంవత్సరానికిగాను ఇండియన్ డిజిటల్ మీడియా పురస్కారంతోపాటు బంగారు పతకం లభించింది.
Source: జాతీయ | 12 Mar 2010 | 12:11 am

శనివారం చెన్నైలో పర్యటించనున్న ప్రధాని, సోనియా!

తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో నిర్మితమవుతున్న సచివాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకుగాను కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం చెన్నైకి చేరుకోనున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ చెన్నైకి రానున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Source: జాతీయ | 11 Mar 2010 | 11:54 pm

గుజరాత్ ముఖ్యమంత్రికి సమన్లు జారీ చేసిన సుప్రీం

గోధ్రాలో 2002లో జరిగిన అల్లర్ల కేసులో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక పరిశోధన బృందం(సిట్‌) సమన్లు జారీ చేసింది. ఈనెల 21లోపు హాజరుకావాలని కోర్టు ఆ సమన్లలో పేర్కొంది.
Source: జాతీయ | 11 Mar 2010 | 11:48 pm

ఐరాస ఎయిడ్స్ రాయబారిగా బాలీవుడ్ భామ ప్రీతీ జింటా

ప్రాణాంతకమైన ఎయిడ్స్‌ వ్యాధిపై ప్రజలలో చైతన్యం కలిగించేందుకు ఆమె క్రికెట్‌, బాలీవుడ్‌ వర్గాలతో కలిసి ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకుగాను ఆమెకు ఐరాసలో హెచ్ఐవీ-ఎయిడ్స్ కార్యక్రమంలో భాగంగా సౌహార్ద్ర రాయబారిగా నియమిస్తూ ఐరాసా ఉత్తర్వులు జారీ చేసింది.
Source: జాతీయ | 11 Mar 2010 | 11:47 pm

డీఎస్... పదవికి రాజీనామా చేయండి: విద్యార్థి జేఏసి

పీసీసి అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ తక్షణమే తన పదవికి రాజీనామా చేసి తెలంగాణా ఉద్యమంలోకి రావాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. తెలంగాణా ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా శ్రీనివాస్, వెంటనే పదవిని వదిలేసి తెలంగాణా రాష్ట్ర సాధనకు తనవంతు కృషి చేయాలన్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Mar 2010 | 11:38 pm

భారత్- రష్యాల మధ్య పది బిలియన్ డాలర్ల ఒప్పందం

రష్యా ప్రధాని వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆహ్వానంపై మన దేశంలో 22 గంటల పర్యటనకు గాను గురువారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో పుతిన్- ప్రధాని మన్మోహన్ మధ్య కొన్ని కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
Source: జాతీయ | 11 Mar 2010 | 11:21 pm

వరంగల్ జిల్లాలో మావోలకు పోలీసులకు మధ్య కాల్పులు

జిల్లాలోని తాడ్వాయి మండలంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం గురువారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. దీంతో మండలంలోని కొడిశాల-పందాల గ్రామాల మధ్య కూంబింగ్‌ నిర్వహిస్తోన్న పోలీసులకు శుక్రవారం ఉదయం మావోయిస్టులు తారసపడడంతో కాల్పులు జరిపారు. ప్రతిగా మావోయిస్టులు ఎదురు కాల్పులకు దిగినట్లు సమచారం
Source: ఏపీ న్యూస్ | 11 Mar 2010 | 10:02 pm

లారెన్స్ "సూపర్ కౌ బాయ్" ఆడియో విడుదల

రాఘవ లారెన్స్, పద్మప్రియ, లక్ష్మీరాయ్, సంధ్య నటిస్తోన్న సూపర్ కౌబాయ్ చిత్రం ఆడియో విడుదలైంది. మంగళవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో అక్కినేని నాగార్జున ఆడియోను విడుదల చేసి లారెన్స్‌కు ఇచ్చారు
Source: Yahoo! Telugu: Entertainment | 11 Mar 2010 | 12:08 pm

బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం

నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరో విభిన్న పాత్రలో ప్రేక్షకులను రంజింప చేయడానికి సిద్ధమవుతున్నారు. లక్కీ మీడియా సంస్థ నిర్మిస్తోన్న బ్రహ్మలోకం టు యమలోకం( వయా భూలోకం)లో ఆయన బ్రహ్మదేవునిగా నటిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Mar 2010 | 12:06 pm

రెమ్యునరేషన్ పెంచిన క్యూట్ అండ్ సెక్సీ బేబీ!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు పొందిన హీరోయిన్ ఇలియానా. ఈ క్యూట్ అండ్ సెక్సీ బేబీ తన రెమ్యునరేషన్‌ను ఆమాతం పెంచేసింది. యువ హీరో రామ్ సరసన "రామ రామ.. కృష్ణ కృష్ణ" అనే కొత్త చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలోనే తన పారితోషకాన్ని పెంచినట్టు చిత్ర పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ భామ రూ.90 లక్షల నుంచి రూ.కోటి వరకు అందుకుంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Mar 2010 | 8:20 am

పశ్చిమ బెంగాల్ సిఎంని హతమార్చే ఉద్దేశం లేదు: దీపక్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యను హతమార్చే ఉద్దేశం తమకు లేదని మావోయిస్టు అగ్రనేత కిషన్‌ జీకి అత్యంత నమ్మకస్తుడైన నేత తెలుగు దీపక్ అలియాస్ వెంకటేశ్వర రెడ్డి చెప్పారు.
Source: జాతీయ | 11 Mar 2010 | 8:15 am

రాష్ట్రంలో పరిస్థితి ప్రశాంతంగావుంది : నరసింహన్

గవర్నర్ నరసింహన్ రెండు రోజుల జిల్లా పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లాలోని హార్సిలీహిల్స్‌కు గురువారం ఉదయం చేరుకున్నారు. ఇక్కడ ఆయన అతిథిగృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితి ప్రశాంతంగానే ఉందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Mar 2010 | 7:42 am

దేశ రాజధానిలో ప్రారంభమైన తెలంగాణ జాతర

తెలంగాణ గురించి ప్రత్యేకంగా దేశ రాజధానిలోని ప్రజలు, నాయకులకు తెలియజేసేందుకు తెలంగాణ జాతరను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ యువ ఐక్యకార్యాచరణ సమితి నాయకులు తెలిపారు. తెలంగాణ జాతరలో భాగంగా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఈ జాతర ఉంటుందని వారు తెలిపారు
Source: జాతీయ | 11 Mar 2010 | 7:39 am

రాజీవ్ హత్య కేసు: నళిని విడుదలకు రంగం సిద్ధం!

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో గత 19 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రధాన నిందితురాలు నళిని విడుదల చేసే అంశంపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఆమె విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ.. జనతా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి వంటి వారు నళిని విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Source: జాతీయ | 11 Mar 2010 | 5:12 am

సంప్రదింపుల తర్వాతే లోక్‌సభకు మహిళా బిల్లు!

మహిళా రిజర్వేషన్ బిల్లుపై అన్ని పార్టీలతో సమాలోచనలు నిర్వహించిన తర్వాతే లోక్‌సభలో ప్రవేశపెడుతామని యూపీఏ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని విపక్ష పార్టీలకు గురువారం హామీ ఇచ్చింది.
Source: జాతీయ | 11 Mar 2010 | 3:04 am