|
సంప్రదింపుల తర్వాతే లోక్‌సభకు మహిళా బిల్లు!మహిళా రిజర్వేషన్ బిల్లుపై అన్ని పార్టీలతో సమాలోచనలు నిర్వహించిన తర్వాతే లోక్‌సభలో ప్రవేశపెడుతామని యూపీఏ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని విపక్ష పార్టీలకు గురువారం హామీ ఇచ్చింది.Source: Yahoo! Telugu: News | 11 Mar 2010 | 8:34 am రెమ్యునరేషన్ పెంచిన క్యూట్ అండ్ సెక్సీ బేబీ!టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు పొందిన హీరోయిన్ ఇలియానా. ఈ క్యూట్ అండ్ సెక్సీ బేబీ తన రెమ్యునరేషన్‌ను ఆమాతం పెంచేసింది. యువ హీరో రామ్ సరసన "రామ రామ.. కృష్ణ కృష్ణ" అనే కొత్త చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలోనే తన పారితోషకాన్ని పెంచినట్టు చిత్ర పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ భామ రూ.90 లక్షల నుంచి రూ.కోటి వరకు అందుకుంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 11 Mar 2010 | 8:20 am స్టాక్ మార్కెట్: ట్రేడింగ్‌లో నిలకడగా సెన్సెక్స్ సూచీముంబై స్టాక్ మార్కెట్‌లో గురువారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ నిలకడగా ఉంది. ట్రేడింగ్ ఆరంభంలో స్వల్పంగా నష్టపోయిన సెన్సెక్స్ సూచీ మధ్యాహ్నం 12 గంటలకు వంద పాయింట్లకు పైగా లాభపడింది. ఆ తర్వాత మళ్లీ తగ్గింది. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్ ఆరు పాయింట్లు లాభంతో రూ.17105 వద్ద కొనసాగుతోంది. అలాగే నిఫ్టీ సైతం ఒక్క పాయింట్ కోల్పోయి 5115 వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 11 Mar 2010 | 8:07 am హైదరా"భాగో".. వై"జాగో": విశాఖలో విశాల అవకాశాలు!రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తన ప్రాభవాన్ని మెల్లగా కోల్పోతోంది. ఐటీ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిగడించిన ఈ నగరంపై ప్రస్తుతం నీలి నీడలు కమ్ముకున్నాయి. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పుణ్యమాని రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఫలితంగా అంతర్జాతీయ కంపెనీలు ఈ నగరానికి ముఖం చాటేస్తున్నాయి. ఫలితంగా ఒకపుడు ఎంతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన భాగ్యనగరం.. ప్రస్తుతం ఉపాధి అవకాశాల కల్పనలో అట్టడుగు స్థాయికి పడిపోయే ప్రమాదం పొంచివుంది.Source: Yahoo! Telugu: News | 11 Mar 2010 | 7:40 am మారుతి 800పై విదేశాల్లోను తగ్గిన మోజుదేశీయ వాహన నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న మారుతి సుజుకికి చెందిన మారుతి 800 ఫిబ్రవరి 2010లో కేవలం ఐదు కార్లను మాత్రమే ఎగుమతి చేసింది. అదే నిరుడు ఇదే కాలంలో 162 కార్లను ఎగుమతి చేసింది. అదే దేశీయ మార్కెట్లో మారుతి-800 అమ్మకాలు ఇరవై రెండు శాతం తగ్గి 3178 కార్లను అమ్మింది. అదే నిరుడు ఇదే కాలానికి 4,075 మారుతి-800 కార్లను అమ్మింది.Source: Yahoo! Telugu: News | 11 Mar 2010 | 7:28 am మీ వస్తువులను సురక్షితంగా చేరుస్తాం: రైల్వే శాఖసరుకుల రవాణాను అత్యంత ఆధునీకరణ చేసి ఫ్రైట్ ఆపరేషన్ సిస్టమ్ ద్వారా వస్తువులను సురక్షితంగా పంపే ఏర్పాట్లలోనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రస్తుతం సరుకుల రవాణా చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పనిగా తయారైందని, దీంతో తమ శాఖ ఫ్రెట్ ఆపరేషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఓఎస్) ద్వారా ప్రారంభిచినట్లు రైల్వే అధికార వర్గాలు గురువారం న్యూ ఢిల్లీలో తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 11 Mar 2010 | 7:07 am స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ సూచీలో ఒడిదుడుకులు!ముంబై స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ సూచీలో ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. గురువారం ఉదయం ట్రేడింగ్ ఆరంభమైనప్పటి నుంచి ఈ ఎగుడుదిగుడులు కనిపిస్తున్నాయి. స్వల్ప నష్టాలతో ఆరంభమైన ట్రేడింగ్, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వంద పాయింట్లు లాభపడింది.Source: Yahoo! Telugu: News | 11 Mar 2010 | 6:39 am ఉద్యోగులను నియమించనున్న టొయోటాతమ సంస్థలో వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి దాదాపు 1,200 మందిని కొత్తగా ఉద్యోగాలలోకి తీసుకోనున్నట్లు టొయోటా మోటార్ కార్ప్ గురువారం ప్రకటించింది. ఇందులో భాగంగా మెకానికల్ ఉద్యోగులను కూడా నియమించేందుకు తమ సంస్థ ప్రణాళికలు రూపొందించుకుందని కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొందిSource: Yahoo! Telugu: News | 11 Mar 2010 | 6:14 am సమైక్యమై మా బలం: శ్రీకృష్ణ కమిటీకి లగడపాటి నివేదిక!సమైక్యాంధ్ర హీరో, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మరోమారు సమైక్యాంధ్ర వాదాన్ని గట్టిగా వినిపించారు. ఈ దఫా బహిరంగంగా కాకుండా, నివేదిక రూపంలో వినిపించారు. రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి ఆయన 29 పేజీల నివేదికను గురువారం న్యూఢిల్లీలో అందజేశారు.Source: Yahoo! Telugu: News | 11 Mar 2010 | 6:13 am సీమ నేతల వల్లే తెలంగాణకు నష్టం: ఎమ్మెల్యే శంకర్ రావురాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది రాయలసీమ వాసులేనని, వారి నుంచే తెలంగాణకు ఎక్కువ నష్టం వాటిల్లిందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ రావు అన్నారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. రాయలసీమలోని నాలుగు జిల్లాలకు చెందిన వారు ముఖ్యమంత్రులు అయ్యారని గుర్తు చేశారు.Source: Yahoo! Telugu: News | 11 Mar 2010 | 5:58 am చిదంబరంతో సమావేశమైన తెలంగాణ ఎంపీలు!తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర హోం మంత్రి పి.చిదంబరంతో గురువారం భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్న వీరంతా వీలు చూసుకుని ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం.Source: Yahoo! Telugu: News | 11 Mar 2010 | 5:47 am సంప్రదింపుల తర్వాతే లోక్‌సభకు మహిళా బిల్లు!మహిళా రిజర్వేషన్ బిల్లుపై అన్ని పార్టీలతో సమాలోచనలు నిర్వహించిన తర్వాతే లోక్‌సభలో ప్రవేశపెడుతామని యూపీఏ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని విపక్ష పార్టీలకు గురువారం హామీ ఇచ్చింది.Source: జాతీయ | 11 Mar 2010 | 3:04 am సమైక్యమై మా బలం: శ్రీకృష్ణ కమిటీకి లగడపాటి నివేదిక!సమైక్యాంధ్ర హీరో, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మరోమారు సమైక్యాంధ్ర వాదాన్ని గట్టిగా వినిపించారు. ఈ దఫా బహిరంగంగా కాకుండా, నివేదిక రూపంలో వినిపించారు. రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి ఆయన 29 పేజీల నివేదికను గురువారం న్యూఢిల్లీలో అందజేశారు.Source: ఏపీ న్యూస్ | 11 Mar 2010 | 12:43 am సీమ నేతల వల్లే తెలంగాణకు నష్టం: ఎమ్మెల్యే శంకర్ రావురాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది రాయలసీమ వాసులేనని, వారి నుంచే తెలంగాణకు ఎక్కువ నష్టం వాటిల్లిందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ రావు అన్నారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. రాయలసీమలోని నాలుగు జిల్లాలకు చెందిన వారు ముఖ్యమంత్రులు అయ్యారని గుర్తు చేశారు.Source: ఏపీ న్యూస్ | 11 Mar 2010 | 12:28 am చిదంబరంతో సమావేశమైన తెలంగాణ ఎంపీలు!తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర హోం మంత్రి పి.చిదంబరంతో గురువారం భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్న వీరంతా వీలు చూసుకుని ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 11 Mar 2010 | 12:18 am బిల్లును వ్యతిరేకిస్తున్న 70 శాతం భాజపా ఎంపీలు33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుపై భిన్న స్వరాలు వ్యక్తమవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు సమాజ్‌వాదీ, రాష్ట్రీయ జనతా దళ్, జనతాదళ్‌లోని ఒక వర్గం, లోక్‌జనశక్తి మాత్రమే బిల్లును వ్యతిరేకించాయి. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు కూడా నిరసన గళం విప్పుతున్నారు. ఈ పార్టీకి చెందిన 70 శాతం ఎంపీలు బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ఇది కమలనాథులను ఆందోళనకు గురి చేస్తోంది.Source: జాతీయ | 10 Mar 2010 | 11:35 pm ముందు మీరు రాజీనామా చేయండి: ఎర్రబల్లి హితవుతమను రాజీనామా చేయమని కోరే ముందుగా మీరు రాజీనామా చేయాలని తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు, ఆ పార్టీ ఎంపీ విజయశాంతిలకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబల్లి దయాకర్ రావు హితవు పలికారు.Source: ఏపీ న్యూస్ | 10 Mar 2010 | 10:45 pm దేశంలో ప్రతి లక్ష మందికి 129 మంది పోలీసులు!దేశ జనాభా సంఖ్యకు అనుగుణంగా పోలీసుల ఎంపిక జరగడం లేదన్ని జగమెరిగిన సత్యం. తమ స్వప్రయోజనాల కోసం వెంపర్లాడే పాలకులు ప్రజలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే వాదనలు ఉన్నాయి. ఈ విషయం వివిధ సర్వేల గణాంకాలే రుజువు చేశాయి. ఒక వీవీఐపీకి డజను మందికి పైగా సాయుధ భద్రతను కల్పిస్తున్నాయి. మరి సామాన్య ప్రజల భద్రతకు ఆ దేవుడే దిక్కు.Source: జాతీయ | 10 Mar 2010 | 10:30 pm చేనేత కార్మికులపై గళమెత్తిన తెదేపా-వామపక్షాలు!చితికి పోతున్న చేనేత కార్మికుల బతుకులను బాగు చేయాలని కోరుతూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, వామపక్ష పార్టీలు గురువారం ఉదయం హైదరాబాద్‌లో ధర్నా చేపట్టాయి. గన్‌పార్క్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో మగ్గం, రాట్నం వడుకుతూ వినూత్న తరహాలో ఆందోళన చేపట్టగా, ఇందులో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, వామపక్ష నేతలు పాల్గొన్నారు.Source: ఏపీ న్యూస్ | 10 Mar 2010 | 9:14 pm తెదేపా అధ్యక్ష పగ్గాలు బాలకృష్ణ చేపట్టాలి: లక్ష్మీపార్వతిస్వర్గీయ ఎన్.టి.రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలను సినీ నటుడు, ఎన్టీఆర్ నట వారసుడు నందమూరి బాలకృష్ణ చేపట్టాలని ఎన్టీఆర్ తెదేపా అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి పిలుపునిచ్చారు. తన బిడ్డ పార్టీ పగ్గాలు చేపట్టిన మరుక్షణంలే నందమూరి కుటుంబమంతా ఏకమై పార్టీ పటిష్టతకు పాటుపడుతుందని ఆమె జోస్యం చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 10 Mar 2010 | 9:06 pm వెనక్కి తగ్గిన ఎస్పీ-ఆర్జేడీ: బిల్లు తేదీ ఖరారుపై కాంగ్రెస్!మహిళా బిల్లు పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు శాంతించాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టే ఖరారుపై కసరత్తు చేస్తోంది. అలాగే, కస్సుబుస్సుమంటున్న భాగస్వామ్య పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, రైల్వే మంత్రి మమతా బెనర్జీని బుజ్జగించే చర్యల్లో రాజకీయ కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ రంగంలోకి దిగారు.Source: జాతీయ | 10 Mar 2010 | 8:41 pm లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచడి మహాప్రభో: ఎంపీల మొర!దేశ ఎంపీలు నిద్రలేమి రాత్రులు గడుపుతున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎగువసభ ఆమోదం తెలిపిన మరుక్షణం నుంచి వీరికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. ప్రస్తుతం లోక్‌సభలో సీట్ల సంఖ్య 543 (మొత్తం 545)గా ఉంది. మహిళా బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపితే ఈ పురుష పుంగువుల సంఖ్య సభలో సగానికి పైగా పడిపోతుంది.Source: జాతీయ | 10 Mar 2010 | 8:31 pm అమ్మా..! నీ ఇంటికొస్తా...!!: యువరత్న బాలకృష్ణవెండితెర వెలుగు స్వర్గీయ ఎన్.టి.రామారావు రెండో భార్య లక్ష్మీ పార్వతి ఇంటికి నందమూరి బాలకృష్ణ బుధవారం పనిగట్టుక వెళ్లారు. ఇంటికి వెళ్లిన బాలకృష్ణ, తన తండ్రి మ్యూజియం శిథిలావస్థలో ఉండటాన్ని గమనించి, దానిని ఎన్టీఆర్ అభిమానుల సందర్శనార్థం ఆధునీకరించాలని తల్లి లక్ష్మీపార్వతికి విన్నవించినట్లు ఓ ప్రైవేటు టెలివిజన్ వెల్లడించింది.గతంలో తమ మధ్య నెలకొన్న పొరపొచ్చాలు తొలగిపోయాయనీ, అమ్మ( లక్ష్మీ పార్వతి)తో తనకు ఎటువంటి విభేదాలు లేవని యువరత్న బాలకృష్ణ వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు లక్ష్మీ పార్వతి కూడా తన కొడుకు(బాలకృష్ణ)తో తనకు ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని చెప్పినట్లు వార్త. మొత్తమ్మీద చానాళ్ల తర్వాత ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ తన ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉన్నదని లక్ష్మీ పార్వతి ఆనందాన్ని వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Mar 2010 | 8:45 am సోనియాకు భారత రత్న ఇవ్వాలి: గంగా భవానిదేశంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను కల్పించే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి నెగ్గిందని, ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి భారతరత్న అవార్డును ఇవ్వాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేసింది.Source: ఏపీ న్యూస్ | 10 Mar 2010 | 8:19 am నిత్య "రాసలీలల" స్వామి నిత్యానంద: డ్రైవర్ లెనిన్ఇటీవల రాసలీలల వీడియోతో దక్షిణ భారత వార్తా ఛానెళ్ళలో దర్శనమిచ్చిన నిత్యానంద స్వామి నిత్యం రాసలీలల్లో మునిగి తేలేవాడని అతని కారు డ్రైవర్ లెనిన్ చెపుతున్నాడు.Source: జాతీయ | 10 Mar 2010 | 8:04 am బిల్లును ఈనెల 16లోగా సభలో ప్రవేశపెడతాం: బన్సాల్మహిళా రిజర్వేషన్ బిల్లును మార్చి 16 తేదీలోగా లోక్‌సభలో ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి పి కె బన్సాల్ బుధవారం న్యూ ఢిల్లీలో వెల్లడించారు.Source: జాతీయ | 10 Mar 2010 | 7:35 am అనుష్క నాకు అక్కలా ఉంటుంది: నాగ చైతన్యతనకిష్టమైన నటీమణులు శ్రీదేవి, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్... అంటూ అక్కినేని నాగచైతన్య చెప్పాడు. "ఏ మాయ చేసావె" చిత్రం సక్సెస్ తర్వాత ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పుకొచ్చాడు. అదిసరే.. టాలీవుడ్ బ్యూటీ అనుష్క సంగతి చెప్పలేదేమిటని ఓ తుంటరి విలేకరి వేసిన ప్రశ్నకు నవ్వుతూ... "అనుష్క అయితే నాకు అక్కలా ఉంటుంద"ని సమాధానమిచ్చాడు. కనుక ఆమెతో నటించే ఛాన్సే లేదని చెప్పినట్లయింది. తన తండ్రి నాగార్జునతో కలిసి నటించే ఆలోచన ఉన్నదనీ, స్క్రిప్ట్ సమకూరితే తప్పకుండా చేస్తానని వెల్లడిస్తూ... తండ్రీ కొడుకుల్లా కాక అన్నదమ్ములుగా నటిస్తామని సూచనప్రాయంగా చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Mar 2010 | 6:05 am రజనీకాంత్ కౌబాయ్ అయితే...?అవును. సూపర్ స్టార్ రజనీకాంత్ కౌబాయ్ అయితే ఫ్యాన్స్‌లో పెద్ద క్రేజ్ ఏర్పడుతుంది. కానీ రోబో సినిమా బిజీలో ఉండటంతో ఆ ఛాన్స్‌ను రజనీ కోల్పోయారనే చెప్పాలి. శింబు దేవన్ అనే దర్శకుడు కౌబాయ్ కథను తీసుకుని లారెన్స్ వద్దకు వచ్చాడు. ఆ కథను విన్నాక చాలా ఎంజాయ్ చేశాడు లారెన్స్. కానీ నాకే ఎందుకు చెబుతున్నారని అడిగితే... శింబుదేవన్ కోడైరెక్టర్ అందుకు సమాధానమిచ్చాడు. ముందుగా రజనీసాబ్ కోసం రాసుకున్నారు. సిగరెట్ తాగడం, క్యాప్ పెట్టుకోవడం, తుపాకి పేల్చడం వంటివి రజనీ స్టైల్ వెరైటీగా ఉంటుంది. కానీ రజనీగారు రోబో షూటింగ్‌లో బిజీగా ఉండటం... అది సంవత్సరాలు పట్టడంతో లారెన్స్‌కు కూడా ఒక స్టైల్ ఉంది అని శింబుదేవన్‌కు లారెన్స్ చిత్రాలు చూపించాడట. దాంతో దర్శకుడు లారెన్స్‌ను ఓకే చేశారు. ఆ సినిమానే "సూపర్ కౌబాయ్". తమిళంలో ఆడియో విడుదలైంది. సినిమాను ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు లారెన్స్ హైదరాబాదులో ప్రకటించారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Mar 2010 | 5:33 am పేరుకు మాత్రమే హోం.. పగ్గాలు వారి చేతుల్లోనే: టిజాక్తెలంగాణ ప్రాంతానికి చెందిన సబితా ఇంద్రారెడ్డి పేరుకు మాత్రమే రాష్ట్ర హోం మంత్రిగా ఉన్నారని, పాలనా పగ్గాలన్ని ఆంధ్రా పాలకుల చేతుల్లోనే ఉన్నట్టు తెలంగాణ ఐకాస కన్వీనర్ ఆచార్య కోదండరామ్ ఆరోపించారు. ఆయన హైదరాబాద్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. మరో వారం రోజుల్లో తెలంగాణ ఉద్యమయాత్రను చేపడుతామన్నారు.Source: ఏపీ న్యూస్ | 10 Mar 2010 | 5:24 am ముస్తాబవుతోన్న జూనియర్ ఎన్టీఆర్ బృందావనంఎన్టీఆర్ సినిమా "బృందావనం గోవిందుడు అందరి వాడేలే" షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. అదుర్స్ తర్వాత అంత హిట్ రావాలని ఆయన ఎదురుచూస్తున్నారు. కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ నెలతో హైదరాబాద్ షెడ్యూల్ పూర్తవుతుంది. వచ్చే నెల నుంచి కేరళలో షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ చాలా తగ్గారు. లవర్ బాయ్‌గా కనిపిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Mar 2010 | 5:18 am ఆఫ్ఘన్ సేవలను తగ్గించుకునే యోచనలో భారత్!తీవ్రవాద బాధిత దేశంగా గుర్తింపు పొందిన ఆఫ్ఘనిస్థాన్‌లో అందిస్తున్న వైద్య, రోడ్డు నిర్మాణ సేవలను తగ్గించుకునే దిశగా కేంద్రం భావిస్తోంది. వివిధ రకాల సేవల్లో నిమగ్నమైవున్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు దాడులు చేస్తున్నారు. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.Source: జాతీయ | 10 Mar 2010 | 4:53 am చెదిరిపోని సజీవ సాక్ష్యం మిడ్తూరు "చెన్నకేశవ ఆలయం"శతాబ్దాల చరిత్రను తనలో ఇముడ్చుకుని, ఆ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన పురాతన దేవాలయం మిడ్తూరులోని "శ్రీ లక్ష్మీ చెన్న కేశవ ఆలయం". శిల్ప సంపదకు, ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలిచిన ఈ ఆలయం ఆంధ్రరాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోనే అతిపెద్ద ఆలయంగా విరాజిల్లుతోంది. సూర్యభగవానుడంతటివాడు ప్రతియేటా స్వామివారి పాద పూజ చేసి తరిస్తుండటం విశేషంగా చెప్పుకునే ఈ ఆలయాన్ని ఓసారి దర్శిద్దామా..?!Source: వినోదం | 10 Mar 2010 | 4:47 am రాయలసీమను తెలంగాణలో కలపాలి: జేసీదివాకర్రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయిస్తే రాయలసీమ ప్రాంతాన్ని తెలంగాణలో విలీనం చేయాలని రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జె.సి.దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్ర ప్రాంతంతో ఉంటే రాయలసీమకు నీటి కష్టాలు తప్పదని ఆయన హెచ్చరించారు. అందువల్ల రాలయసీమ తెలంగాణలో విలీనం చేయాలని ఆయన కోరారు.Source: ఏపీ న్యూస్ | 10 Mar 2010 | 4:18 am అమ్మా..! నీ ఇంటికొస్తా...!!: యువరత్న బాలకృష్ణవెండితెర వెలుగు స్వర్గీయ ఎన్.టి.రామారావు రెండో భార్య లక్ష్మీ పార్వతి ఇంటికి నందమూరి బాలకృష్ణ బుధవారం పనిగట్టుక వెళ్లారు. ఇంటికి వెళ్లిన బాలకృష్ణ, తన తండ్రి మ్యూజియం శిథిలావస్థలో ఉండటాన్ని గమనించి, దానిని ఎన్టీఆర్ అభిమానుల సందర్శనార్థం ఆధునీకరించాలని తల్లి లక్ష్మీపార్వతికి విన్నవించినట్లు ఓ ప్రైవేటు టెలివిజన్ వెల్లడించింది.గతంలో తమ మధ్య నెలకొన్న పొరపొచ్చాలు తొలగిపోయాయనీ, అమ్మ( లక్ష్మీ పార్వతి)తో తనకు ఎటువంటి విభేదాలు లేవని యువరత్న బాలకృష్ణ వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు లక్ష్మీ పార్వతి కూడా తన కొడుకు(బాలకృష్ణ)తో తనకు ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని చెప్పినట్లు వార్త. మొత్తమ్మీద చానాళ్ల తర్వాత ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ తన ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉన్నదని లక్ష్మీ పార్వతి ఆనందాన్ని వ్యక్తం చేశారు.Source: వినోదం | 10 Mar 2010 | 3:18 am సబ్ కోటా కావాలి... ప్రభుత్వమూ ఉండాలి: మంత్రి మమతమహిళా రిజర్వేషన్ బిల్లులో ముస్లిం మహిళలకు కొన్ని సీట్లు విధిగా కేటాయించేలా ఉప కోటాను ప్రవేశపెట్టాలని కేంద్ర రైల్వే శాఖామంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అదేసమయంలో యూపీఏ ప్రభుత్వం పూర్తికాలం మనుగడ సాగించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.Source: జాతీయ | 10 Mar 2010 | 3:11 am చంద్రబాబూ.. పదివేల మంది పొట్టకొట్టొద్దు: శైలజానాథ్బ్రహ్మణి స్టీల్ కంపెనీలో పది వేల మంది సిబ్బంది పని చేస్తున్నారని వారి కడుపు కొట్టవద్దని ప్రభుత్వ విప్ శైలజానాథ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ప్రాంతంలోని బ్రహ్మణి స్టీల్ కంపెనీకి ప్రభుత్వం భూమి, నీటిని కేటాయించడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఇదే అంశాన్ని బుధవారం అసెంబ్లీలో జరిగిన సమావేశాల్లో లేవనెత్తి, ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోశారు.Source: ఏపీ న్యూస్ | 10 Mar 2010 | 3:02 am
|