|
చంద్రబాబూ.. పదివేల మంది పొట్టకొట్టొద్దు: శైలజానాథ్బ్రహ్మణి స్టీల్ కంపెనీలో పది వేల మంది సిబ్బంది పని చేస్తున్నారని వారి కడుపు కొట్టవద్దని ప్రభుత్వ విప్ శైలజానాథ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ప్రాంతంలోని బ్రహ్మణి స్టీల్ కంపెనీకి ప్రభుత్వం భూమి, నీటిని కేటాయించడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఇదే అంశాన్ని బుధవారం అసెంబ్లీలో జరిగిన సమావేశాల్లో లేవనెత్తి, ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోశారు.Source: Yahoo! Telugu: News | 10 Mar 2010 | 8:30 am ప్రభుత్వం తమ బ్యాంకులో వాటాదారుగా ఉండాల్సిందే: ఎస్బీఐప్రభుత్వం తమ బ్యాంకులో ప్రధాన వాటాదారుగా ఉండాల్సిందేనని దేశీయ బ్యాంకింగ్ రంగంలో దిగ్గజమైన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) ఛైర్మెన్ ఓ.పి.భట్ట్ బుధవారం ముంబైలో మీడియాకు తెలిపారుSource: Yahoo! Telugu: News | 10 Mar 2010 | 8:26 am తెలంగాణపై ఏకాభిప్రాయం ఎండమావే: ధర్మపురితెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో ఏకాభిప్రాయం అనేది ఎండమావిలాంటిందేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. ఏకాభిప్రాయం కావాలని ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించిన విషయం తనకు తెలియదన్నారు.Source: Yahoo! Telugu: News | 10 Mar 2010 | 7:54 am పుంజుకున్న కొనుగోళ్లు: లాభాల్లో స్టాక్ మార్కెట్బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభాలను ఆర్జించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 17,130 మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 5,125 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 10 Mar 2010 | 7:51 am బ్రహ్మణీ స్టీల్స్‌పై చంద్రన్న నిప్పులు: దద్ధరిల్లిన అసెంబ్లీ!దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన బ్రహ్మణీ స్టీల్స్ కంపెనీకి భూమి, నీరు కేటాయింపు వ్యవహారం బుధవారం అసెంబ్లీని కుదిపేసింది. మైనింగ్ మాఫియాకు కాంగ్రెస్ సర్కారు అండగా నిలుస్తోందంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.Source: Yahoo! Telugu: News | 10 Mar 2010 | 7:25 am అమెరికా ఉత్పత్తులను నిషేధించిన బ్రెజిల్బ్రెజిల్ ప్రభుత్వం నిషేధించిన అమెరికా ఉత్పత్తుల్లో తాజా పండ్లతోపాటు కంటి అద్దాలు కూడా ఉండటం గమనార్హం. అమెరికాకు చెందిన ఉత్పత్తులను నిషేధిస్తున్నట్లు రూపొందించిన వస్తువుల జాబితాను జెనీవాలోనున్న డబ్ల్యూటీఓ కార్యాలయంలో బ్రెజిల్ ప్రభుత్వం అందజేసింది.Source: Yahoo! Telugu: News | 10 Mar 2010 | 6:41 am యాదృచ్ఛికంగా తన్నడంతో మృతి చెందాడు: నిందితుడుఆస్ట్రేలియాలో హత్యకు గురైన మూడేళ్ళ బాలుడు కేసులో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ హత్యకు బాలుడి ఇంటిలోనే జీవిస్తున్న 29 సంవత్సరాల గుర్వీక్ ధిల్లాన్ ప్రధాన నిందితునిగా ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించి, అరెస్టు చేశారు.Source: Yahoo! Telugu: News | 10 Mar 2010 | 6:33 am త్వరలో ప్రతి గ్రామంలోను బ్రాడ్‌బ్యాండ్: సచిన్ పైలట్ప్రస్తుతం దేశవ్యాప్తంగానున్న దాదాపు 626,000 గ్రామాలలో బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుందని కేంద్ర ఐటీ, సమాచార శాఖ సహాయ మంత్రి సచిన్ పైలట్ బుధవారం మీడియాకు వివరించారుSource: Yahoo! Telugu: News | 10 Mar 2010 | 6:23 am మహిళా బిల్లు: ఆగని ఎస్పీ-ఆర్జేడీ ఎంపీల నిరసనలు!మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎస్పీ, ఆర్జేడీ ఎంపీల నిరసను కొనసాగుతున్నాయి. దీంతో లోక్‌సభ కార్యక్రమాలు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడ్డాయి. తాము ప్రతిపాదిస్తున్న సవరణలు బిల్లులో చేపట్టాల్సిందేనని వారు డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డు తగులుగుతున్నారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేయక తప్పలేదు.Source: Yahoo! Telugu: News | 10 Mar 2010 | 6:11 am అనుష్క నాకు అక్కలా ఉంటుంది: నాగ చైతన్యతనకిష్టమైన నటీమణులు శ్రీదేవి, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్... అంటూ అక్కినేని నాగచైతన్య చెప్పాడు. "ఏ మాయ చేసావె" చిత్రం సక్సెస్ తర్వాత ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పుకొచ్చాడు. అదిసరే.. టాలీవుడ్ బ్యూటీ అనుష్క సంగతి చెప్పలేదేమిటని ఓ తుంటరి విలేకరి వేసిన ప్రశ్నకు నవ్వుతూ... "అనుష్క అయితే నాకు అక్కలా ఉంటుంద"ని సమాధానమిచ్చాడు. కనుక ఆమెతో నటించే ఛాన్సే లేదని చెప్పినట్లయింది. తన తండ్రి నాగార్జునతో కలిసి నటించే ఆలోచన ఉన్నదనీ, స్క్రిప్ట్ సమకూరితే తప్పకుండా చేస్తానని వెల్లడిస్తూ... తండ్రీ కొడుకుల్లా కాక అన్నదమ్ములుగా నటిస్తామని సూచనప్రాయంగా చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Mar 2010 | 6:05 am అమెరికా మార్కెట్ ప్రభావం: లాభాల్లో స్టాక్ మార్కెట్అమెరికా స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జించడంతో బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధిని నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 81 పాయింట్లు పుంజుకుని, 17,133 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ కూడా 11 పాయింట్లు బలపడి, 5,112 పాయింట్ల మార్కు ను తాకింది.Source: Yahoo! Telugu: News | 10 Mar 2010 | 5:53 am రజనీకాంత్ కౌబాయ్ అయితే...?అవును. సూపర్ స్టార్ రజనీకాంత్ కౌబాయ్ అయితే ఫ్యాన్స్‌లో పెద్ద క్రేజ్ ఏర్పడుతుంది. కానీ రోబో సినిమా బిజీలో ఉండటంతో ఆ ఛాన్స్‌ను రజనీ కోల్పోయారనే చెప్పాలి. శింబు దేవన్ అనే దర్శకుడు కౌబాయ్ కథను తీసుకుని లారెన్స్ వద్దకు వచ్చాడు. ఆ కథను విన్నాక చాలా ఎంజాయ్ చేశాడు లారెన్స్. కానీ నాకే ఎందుకు చెబుతున్నారని అడిగితే... శింబుదేవన్ కోడైరెక్టర్ అందుకు సమాధానమిచ్చాడు. ముందుగా రజనీసాబ్ కోసం రాసుకున్నారు. సిగరెట్ తాగడం, క్యాప్ పెట్టుకోవడం, తుపాకి పేల్చడం వంటివి రజనీ స్టైల్ వెరైటీగా ఉంటుంది. కానీ రజనీగారు రోబో షూటింగ్‌లో బిజీగా ఉండటం... అది సంవత్సరాలు పట్టడంతో లారెన్స్‌కు కూడా ఒక స్టైల్ ఉంది అని శింబుదేవన్‌కు లారెన్స్ చిత్రాలు చూపించాడట. దాంతో దర్శకుడు లారెన్స్‌ను ఓకే చేశారు. ఆ సినిమానే "సూపర్ కౌబాయ్". తమిళంలో ఆడియో విడుదలైంది. సినిమాను ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు లారెన్స్ హైదరాబాదులో ప్రకటించారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Mar 2010 | 5:33 am ముస్తాబవుతోన్న జూనియర్ ఎన్టీఆర్ బృందావనంఎన్టీఆర్ సినిమా "బృందావనం గోవిందుడు అందరి వాడేలే" షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. అదుర్స్ తర్వాత అంత హిట్ రావాలని ఆయన ఎదురుచూస్తున్నారు. కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ నెలతో హైదరాబాద్ షెడ్యూల్ పూర్తవుతుంది. వచ్చే నెల నుంచి కేరళలో షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ చాలా తగ్గారు. లవర్ బాయ్‌గా కనిపిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Mar 2010 | 5:18 am చంద్రబాబూ.. పదివేల మంది పొట్టకొట్టొద్దు: శైలజానాథ్బ్రహ్మణి స్టీల్ కంపెనీలో పది వేల మంది సిబ్బంది పని చేస్తున్నారని వారి కడుపు కొట్టవద్దని ప్రభుత్వ విప్ శైలజానాథ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ప్రాంతంలోని బ్రహ్మణి స్టీల్ కంపెనీకి ప్రభుత్వం భూమి, నీటిని కేటాయించడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఇదే అంశాన్ని బుధవారం అసెంబ్లీలో జరిగిన సమావేశాల్లో లేవనెత్తి, ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోశారు.Source: ఏపీ న్యూస్ | 10 Mar 2010 | 3:02 am తెలంగాణపై ఏకాభిప్రాయం ఎండమావే: ధర్మపురితెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో ఏకాభిప్రాయం అనేది ఎండమావిలాంటిందేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. ఏకాభిప్రాయం కావాలని ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించిన విషయం తనకు తెలియదన్నారు.Source: ఏపీ న్యూస్ | 10 Mar 2010 | 2:25 am బ్రహ్మణీ స్టీల్స్‌పై చంద్రన్న నిప్పులు: దద్ధరిల్లిన అసెంబ్లీ!దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన బ్రహ్మణీ స్టీల్స్ కంపెనీకి భూమి, నీరు కేటాయింపు వ్యవహారం బుధవారం అసెంబ్లీని కుదిపేసింది. మైనింగ్ మాఫియాకు కాంగ్రెస్ సర్కారు అండగా నిలుస్తోందంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.Source: ఏపీ న్యూస్ | 10 Mar 2010 | 1:55 am మహిళా బిల్లు: ఆగని ఎస్పీ-ఆర్జేడీ ఎంపీల నిరసనలు!మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎస్పీ, ఆర్జేడీ ఎంపీల నిరసను కొనసాగుతున్నాయి. దీంతో లోక్‌సభ కార్యక్రమాలు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడ్డాయి. తాము ప్రతిపాదిస్తున్న సవరణలు బిల్లులో చేపట్టాల్సిందేనని వారు డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డు తగులుగుతున్నారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేయక తప్పలేదు.Source: జాతీయ | 10 Mar 2010 | 12:41 am సిక్కు అల్లర్ల కేసు: సజ్జన్ కుమార్‌కు బెయిల్ మంజూరు!1984 సంవత్సరంలో జరిగిన సిక్కుల వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ అడిషినల్ మెట్రోపాలిటన్ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటీషన్ విచారణ సమయంలో మాజీ ఎంపీ కోర్టుకు హాజరయ్యారు. బెయిల్ పిటీషన్‌పై వాదోపవాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.Source: జాతీయ | 9 Mar 2010 | 11:56 pm ప్రజారాజ్యం పార్టీకి గుడ్‌బై.. సొంత గూటికే మెట్ల!ఉభయగోదావరి జిల్లాల్లో వలస పోయిన తమ నేతలు, క్యాడర్‌ను తిరిగి రాబట్టుకునే దిశగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. ఇందులోభాగంగా రాష్ట్ర మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ రావు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి తెదేపా తీర్థం స్వీకరించారు.Source: ఏపీ న్యూస్ | 9 Mar 2010 | 11:34 pm తెలంగాణకు వారిద్దరే ప్రధాన అడ్డంకి: తెలుగు యువత!తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు, తెలంగాణ జేఏసీ కన్వీనర్ ఆచార్య కోదండరామ్‌లే ప్రధాన అడ్డంకి అని తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి ఎం.రవిచంద్ర ఆరోపించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దారన్నారు.Source: ఏపీ న్యూస్ | 9 Mar 2010 | 11:24 pm రేపటి నుంచి చిత్తూరు జిల్లాలో గవర్నర్ పర్యటన!రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ గురువారం నుంచి రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 11, 12 తేదీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అలాగే, ఈనెల 13వ తేదీన ఒక రోజు పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కె.రోశయ్య జిల్లాకు వస్తున్నారు. మూడు రోజుల్లో ఇద్దరు రాష్ట్రాధినేతలు జిల్లా పర్యటనకు వస్తుండటంతో జిల్లా పోలీసు యంత్రాగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది.Source: ఏపీ న్యూస్ | 9 Mar 2010 | 11:18 pm అవిశ్వాసం ప్రవేశపెట్టే సంఖ్యాబలం లేదు: ములాయంకేంద్రంలోని యూపీఏ సంకీర్ణ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఉద్దేశ్యం తమకు లేదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ స్పష్టం చేశారు. తమకు కేవలం 21 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. పైపెచ్చు.. తమవద్ద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే సంఖ్యాబలం లేదన్నారు.Source: జాతీయ | 9 Mar 2010 | 10:49 pm మహిళా బిల్లు ప్రకంపనలు: బీహార్ సీఎం వేరు కుంపటి?మహిళా రిజర్వేషన్ బిల్లు దేశంలోని పలు రాజకీయ పార్టీల మధ్య చిచ్చు రేపింది. ప్రధానంగా బీహార్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జనతాదళ్ (యు) పార్టీ రెండుగా చీలిపోయింది. ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. దీంతో నితీష్ కుమార్ వేరు కుంపటి పెట్టుకునే దిశగా ఆలోచన చేస్తున్నారు.Source: జాతీయ | 9 Mar 2010 | 9:31 pm నేడు రాష్ట్రపతికి ఆర్జేడీ మద్దతు ఉపసంహరణ లేఖ!కేంద్రంలోని యూపీఏ సంకీర్ణ సర్కారుకు ఇస్తున్న భేషరతు మద్దతును ఉపసంహరించుకున్నట్టు రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు, కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు మద్దతు ఉపసంహణ లేఖను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు అందజేయనున్నట్టు ఆయన ప్రకటించారు.Source: జాతీయ | 9 Mar 2010 | 9:19 pm రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు!ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 2,331 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి బలరామయ్య వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 9 Mar 2010 | 8:45 pm మనవడిలో లోపాలున్నాయి: అక్కినేని నాగేశ్వర్రావునాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన "ఏ మాయ చేసావె" చిత్రం సక్సెస్ మీట్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఉమెన్స్ డే నాడు జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల మాట్లాడుతూ... నాన్నగారు ఈ సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. రెండు కుటుంబాలు కలిసి తీసిన ఈ చిత్రం పోకిరి అంత హిట్ అవుతుందని చెప్పారు. చైతన్య మా ఇంటి హీరో. టాలెంట్ ఉంది. లవ్ స్టోరీని దర్శకుడు గౌతమ్ మీనన్ చక్కగా చూపించారని చెప్పారు.అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కృష్ణగారి అమ్మాయి మంజుల నా దగ్గరకు వచ్చి అంకుల్ ఒక కావ్యంలాంటి సినిమా చేస్తున్నాను అని చెప్పారు. సీనియర్ నటుడిగా నిర్మాత కష్టాలు తెలుసు కాబట్టి జాగ్రత్త అని చెప్పాను. సెక్స్, హింస రాజ్యమేలుతున్న ఈ సమయంలో చిన్న కథను తీసుకుని చెడు లేకుండా చక్కగా తీశారు.Source: Yahoo! Telugu: Entertainment | 9 Mar 2010 | 11:33 am "వరుడు" విడుదల రోజునే "వధువు" తెలుస్తుందివరుడు చిత్రంలో వధువు ఎవరన్నది దర్శకులు గుణశేఖర్ సస్పెన్స్‌లో ఉంచారు. ఆడియో ఫంక్షన్లో సైతం ప్రతి ఒక్కరూ వరుడులో హీరోయిన్ ఎవరు...? అని ఆసక్తిగా అడగడం విశేషం. ఈ విషయం గురించి దర్శకులు గుణశేఖర్ మాట్లాడుతూ... "కథ ప్రకారం ఇందులో హీరోయిన్ సినిమా రిలీజ్ వరకూ సస్పెన్స్‌లో ఉంచాలని అనుకున్నాం. ఇది పబ్లిసిటీ గిమ్మిక్కు కాదు. ఈ కథకి హీరోయిన్‌ని అలా రివీల్ చెయ్యకపోవడమే కరెక్ట్ అని ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు అనుకుంటారు. ఆడియెన్స్‌లో ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంతోపాటు ఈ కథకు కంపల్సరీగా అవసరం అయ్యే వరుడు హీరోయిన్ స్టిల్స్ గానీ, పేరును కానీ ఇంతవరకూ పబ్లిసిటీలో ఉపయోగించలేదు.Source: Yahoo! Telugu: Entertainment | 9 Mar 2010 | 11:11 am ముంబై దాడుల్లో పాక్ సైనికుల హస్తం: ఉజ్వల్ నికమ్ముంబైలో 26/11న జరిగిన తీవ్ర వాదుల దాడుల్లో పాల్గొన్న అజ్మల్ కసబ్, ఇతర ఉగ్రవాదులకు లష్కర్-ఏ-తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన శిబిరాల్లో శిక్షణ ఇప్పించడంలో పాకిస్థాన్ దేశానికి చెందిన సైనికాధికారుల పాత్ర ఉందని ప్రభుత్వ న్యాయవాది ఉజ్వల్ నికమ్ మంగళవారం ప్రత్యేక కోర్టుకు విన్నవించారు.Source: జాతీయ | 9 Mar 2010 | 8:56 am ప్రధానోపాధ్యాయుడిని విడిచిపెట్టిన మావోయిస్టులుపశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలోనున్న ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు రంజిత్ దూలేను ఇటీవల మావోయిస్టులు అపహరించుకు వెళ్ళారు. ప్రధానోపాధ్యాయుడు రంజిత్ దూలేను మంగళవారం మావోయిస్టులు విడిచిపెట్టారని స్థానిక పోలీసులు మీడియాకు వెల్లడించారు.Source: జాతీయ | 9 Mar 2010 | 8:13 am స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ "వరుడు" ట్రెయిలర్స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం వరుడు ఆడియో మార్చి 7న రిలీజ్ అయింది. ఈ సందర్భంగా నిర్మాత దానయ్య మాట్లాడుతూ... అల్లు అర్జున్ పెర్‌ఫార్మెన్స్ హైలెట్‌గా గుణశేఖర్‌గారి ఎక్స్‌లెంట్ టేకింగ్‌తో వరుడు చిత్రం అద్భుతంగా రూపొందింది. ఈ చిత్రానికి మణిశర్మ సూపర్ పాటలు అందించారు. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ"న్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన కొత్త హీరోయిన్ నటిస్తుండగా ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య విలన్‌గా నటించడం విశేషం.Source: Yahoo! Telugu: Entertainment | 9 Mar 2010 | 7:46 am అది "రక్తి"బంధం కాదు.. నిత్యానందపై భక్తి: రంజితతమిళ స్వామి నిత్యానందతో శృంగారం చేస్తూ కనబడిన నటి రంజిత, ఆయనతో తనకున్న సంబంధం రక్తితో కూడుకున్నది కాదనీ, కేవలం భక్తితో కూడినదని చెప్పింది. ఈ విషయాన్ని కొన్ని తమిళ పత్రికలు ప్రచురించాయి. నిత్యానంద సెక్స్ స్కాండల్ బయటపడిన తర్వాత కనిపించకుండా పోయిన రంజిత ఒక రహస్య ప్రదేశం నుంచి తన సందేశాన్ని పత్రికల వారికి తెలిపినట్లు ప్రింట్ మీడియాలో కథనాలు వచ్చాయి. నిత్యానందతో సన్నిహితంగా మసలినట్లు కనబడిన యువతిని తానేనని రంజిత ఒప్పుకున్నట్లు తెలిసింది. కాగా ఆ వీడియోలో ఉన్నది నిత్యానందేనని చెప్పినట్లు భోగట్టా. ఆమె ఒక తమిళ పత్రికతో మాట్లాడుతూ..." నా భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నిత్యానంద ఆశ్రయాన్ని కోరాను. నా భర్తతో ఉన్న సమయంలో నేను మానసికంగా దెబ్బతిన్నాను. దీంతో నిత్యానంద వద్ద ప్రశాంతత లభిస్తుందని అక్కడికి వెళ్లాను. అనుకున్నట్లుగానే ఆయన బోధనలు నాపై ఎంతగానో ప్రభావితం చూపాయి. దీంతో ఆయనకు శిష్యురాలిగా మారిపోయాను" అని చెప్పింది.Source: Yahoo! Telugu: Entertainment | 9 Mar 2010 | 6:43 am నాపై హత్యకు చంద్రబాబు కుట్ర: బంగి అనంతయ్య ఆరోపణ!తనను హత్య చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య ఆరోపించారు. ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఆయనపై సస్పెండ్ వేటు వేశారు.Source: ఏపీ న్యూస్ | 9 Mar 2010 | 6:32 am మహిళా బిల్లును ఆమోదించిన రాజ్యసభ: 33% రిజర్వేషన్లురాజ్యసభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు 165 మంది మద్దతు తెలుపగా ఒకే ఒక్క ఓటు వ్యతిరేకంగా వచ్చింది. దీంతో మహిళా బిల్లుకు రాజ్యసభలో సంపూర్ణ మద్దతు లభించినట్లయింది.Source: జాతీయ | 9 Mar 2010 | 6:16 am చూపిస్తే సరిపోదు.. ఆకట్టుకోవాలి: శ్రద్దా ఆర్యనేటి హీరోయిన్ అంటే గ్లామర్‌తోపాటు పెర్ఫార్మెన్స్ రెండూ రెండు కళ్లులాంటివని శ్రద్ద ఆర్య అంటోంది. తను చేసే పాత్రల్లో ఇవి రెండూ ఉండాలనీ, ఏది మిస్ అయినా పాత్ర తేలిపోతుందని చెపుతోంది. కేవలం అందాలను ఆరబోసినంత మాత్రన ప్రేక్షకులు చూస్తారని తాను అనుకోనని, కనుక దానితోపాటు అభినయం కూడా ఉండాలంటోంది. అయితే ఆరబోతకు తను అభ్యంతరం చెప్పననీ, అలాఅని కేవలం వాటికే ప్రాధాన్యత అంటే తాను అంగీకరించనని నిక్కచ్చిగా చెబుతోంది. గొడవ అనే చిత్రంతో తెలుగులో పరిచయమైన శ్రద్దా ఆర్య తాజాగా ఏవీఎస్ కోతిమూకలో నటిస్తోంది. హిందీలో అమితాబ్ బచ్చన్ కుమార్తెగా నటించాననీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్నాననీ చెపుతోంది. మీడియా తనను పెళ్లి గురించి అడుగుతోందనీ, అయితే తనకు ప్రేమ పెళ్లిపై నమ్మకం లేదని, పెద్దలు చేసే పెళ్లిపై తనకు నమ్మకం ఎక్కవని చెప్పింది. కనుక పెద్దలు చేసే పెళ్లికి ఇంకా చాలా టైమ్ పడుతుందని చెప్పుకొచ్చింది.Source: Yahoo! Telugu: Entertainment | 9 Mar 2010 | 4:41 am రాజ్యసభలో గడిచిన గండం: "మహిళా బిల్లు"కు మోక్షం!మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఒక గండం గడిచింది. ఎగువ సభ (రాజ్యసభ)లో ఈ బిల్లుకు మోక్షం లభించింది. బిల్లుపై ఎలాంటి చర్చ సాగకుండానే మోజువాణి ఓటుతో ఆమోదముద్ర వేశారు. యూపీఏ సంకీర్ణ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు.Source: జాతీయ | 9 Mar 2010 | 3:06 am తొలుత ఆమోదం.. ఆ తర్వాత సవరణలు: సోనియా గాంధీమహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏ రూపంలోనై ఆమోదం పొందేలా చేసేందుకు అధికార యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇందుకోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాజకీయ కురువృద్ధుడు, విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీలు రంగంలోకి దిగారు. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎస్పీ, ఆర్జేడీ అధినేతలతో వారు మంతనాలు నిర్వహించారు.Source: జాతీయ | 9 Mar 2010 | 2:23 am స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ "వరుడు" ట్రెయిలర్స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం వరుడు ఆడియో మార్చి 7న రిలీజ్ అయింది. ఈ సందర్భంగా నిర్మాత దానయ్య మాట్లాడుతూ... అల్లు అర్జున్ పెర్‌ఫార్మెన్స్ హైలెట్‌గా గుణశేఖర్‌గారి ఎక్స్‌లెంట్ టేకింగ్‌తో..Source: వినోదం | 9 Mar 2010 | 2:18 am
|