రాజ్యసభలో గడిచిన గండం: "మహిళా బిల్లు"కు మోక్షం!

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఒక గండం గడిచింది. ఎగువ సభ (రాజ్యసభ)లో ఈ బిల్లుకు మోక్షం లభించింది. బిల్లుపై ఎలాంటి చర్చ సాగకుండానే మోజువాణి ఓటుతో ఆమోదముద్ర వేశారు. యూపీఏ సంకీర్ణ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు.
Source: Yahoo! Telugu: News | 9 Mar 2010 | 8:35 am

జాఫ్నాలో రాయబార కార్యాలయం ప్రారంభిస్తాం: భారత్

ఉత్తర శ్రీలంక ప్రాంతంలోని జాఫ్నా పట్టణంలో భారత రాయబార కార్యలయాన్ని ప్రారంభించనున్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ కార్యదర్శి నిరుపమా రావు వెల్లడించారు. ప్రస్తుతం క్యాండీ కేంద్రంగా ఇండియన్ కాన్సులేట్ పని చేస్తోంది. ఎల్టీటీఈ ప్రాబల్య ప్రాంతంగా గుర్తింపు పొందిన జాఫ్నాలో ఈ కార్యాలయాన్ని కొత్తగా ప్రారంభించాలని భావిస్తున్నట్టు కొలంబో పర్యటనలో ఉన్న విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 9 Mar 2010 | 8:16 am

తొలుత ఆమోదం.. ఆ తర్వాత సవరణలు: సోనియా గాంధీ

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏ రూపంలోనై ఆమోదం పొందేలా చేసేందుకు అధికార యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇందుకోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాజకీయ కురువృద్ధుడు, విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీలు రంగంలోకి దిగారు. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎస్పీ, ఆర్జేడీ అధినేతలతో వారు మంతనాలు నిర్వహించారు.
Source: Yahoo! Telugu: News | 9 Mar 2010 | 7:53 am

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ "వరుడు" ట్రెయిలర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం వరుడు ఆడియో మార్చి 7న రిలీజ్ అయింది. ఈ సందర్భంగా నిర్మాత దానయ్య మాట్లాడుతూ... అల్లు అర్జున్ పెర్‌ఫార్మెన్స్ హైలెట్‌గా గుణశేఖర్‌గారి ఎక్స్‌లెంట్ టేకింగ్‌తో వరుడు చిత్రం అద్భుతంగా రూపొందింది. ఈ చిత్రానికి మణిశర్మ సూపర్ పాటలు అందించారు. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ"న్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన కొత్త హీరోయిన్ నటిస్తుండగా ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య విలన్‌గా నటించడం విశేషం.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Mar 2010 | 7:46 am

కంపెనీల్లో కొనసాగనున్న బోనస్‌ల పరంపర

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా ఆ ప్రభావం దేశీయ కంపెనీలపై తీవ్రంగానే పడిందని చెప్పాలి. దీంతో పలు దేశీయ కంపెనీల్లోని ఉద్యోగులకు జీతభత్యాలు పెరగలేదు సరికదా కనీసం బోనస్‌లను కూడా చెల్లించలేని స్థితికి చేరుకున్నాయి. ప్రస్తుతం పరిస్థితి మారింది. దేశీయ వ్యాపార రంగం ఆర్థిక మాంద్యం నుంచి బయట పడుతుండటంతో దేశంలోని పలు కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్‌లు చెల్లించేందుకు సన్నాహాలు ప్రారంభించాయి.
Source: Yahoo! Telugu: News | 9 Mar 2010 | 7:40 am

స్వల్ప నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్

మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాలను చవిచూసిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఏడు పాయింట్లు స్వల్పంగా పతనమై, 17,110 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా ఐదు పాయింట్లు స్వల్పంగా క్షీణించి, 5,118 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 9 Mar 2010 | 7:22 am

వాస్తవ పరిస్థితులతో నివేదిక తయారీ: పీసీసీ చీఫ్

రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులపై సమగ్ర నివేదికను తయారు చేసి జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి సమర్పిస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఈనెల 12వ తేదీన జరిగే కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్‌ల సదస్సులో పాల్గొనేందుకు ఆయన మంగళవారం హస్తినకు వెళ్లారు.
Source: Yahoo! Telugu: News | 9 Mar 2010 | 6:46 am

చక్కెరను భారీగా ఉత్పత్తి చేయనున్న ఉత్తరప్రదేశ్

దేశంలో చక్కెర ఉత్పత్తులు తగ్గుముఖం పట్టడంతో ధరలు ఆకాశాన్నంటాయని, దీంతో ప్రస్తుత సీజన్ చివరి నాటికి తమ రాష్ట్రంలో 45 లక్షల మిలియన్ టన్నుల చక్కెరను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని చెరకు ఉత్పత్తి కమీషనర్ సుధీర్ ఎమ్ బోబాడే మంగళవారం లక్నోలో తెలిపారు
Source: Yahoo! Telugu: News | 9 Mar 2010 | 6:43 am

అది "రక్తి"బంధం కాదు.. నిత్యానందపై భక్తి: రంజిత

తమిళ స్వామి నిత్యానందతో శృంగారం చేస్తూ కనబడిన నటి రంజిత, ఆయనతో తనకున్న సంబంధం రక్తితో కూడుకున్నది కాదనీ, కేవలం భక్తితో కూడినదని చెప్పింది. ఈ విషయాన్ని కొన్ని తమిళ పత్రికలు ప్రచురించాయి. నిత్యానంద సెక్స్ స్కాండల్ బయటపడిన తర్వాత కనిపించకుండా పోయిన రంజిత ఒక రహస్య ప్రదేశం నుంచి తన సందేశాన్ని పత్రికల వారికి తెలిపినట్లు ప్రింట్ మీడియాలో కథనాలు వచ్చాయి. నిత్యానందతో సన్నిహితంగా మసలినట్లు కనబడిన యువతిని తానేనని రంజిత ఒప్పుకున్నట్లు తెలిసింది. కాగా ఆ వీడియోలో ఉన్నది నిత్యానందేనని చెప్పినట్లు భోగట్టా. ఆమె ఒక తమిళ పత్రికతో మాట్లాడుతూ..." నా భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నిత్యానంద ఆశ్రయాన్ని కోరాను. నా భర్తతో ఉన్న సమయంలో నేను మానసికంగా దెబ్బతిన్నాను. దీంతో నిత్యానంద వద్ద ప్రశాంతత లభిస్తుందని అక్కడికి వెళ్లాను. అనుకున్నట్లుగానే ఆయన బోధనలు నాపై ఎంతగానో ప్రభావితం చూపాయి. దీంతో ఆయనకు శిష్యురాలిగా మారిపోయాను" అని చెప్పింది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Mar 2010 | 6:43 am

పాకిస్థాన్ ఖైదీలను ఆ దేశానికి పంపేయండి: సుప్రీంకోర్టు

దేశంలోని వివిధ జైళ్ళలో మగ్గుతూ తమ శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న ఖైదీలను విడుదల చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. విడుదల చేసిన వారిని సురక్షితంగా పాకిస్థాన్‌కు పంపేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరింది. ఇందుకోసం రెండు నెలలు గడువు విధించింది. అయితే, ఖైదీల విడుదలను కేంద్ర ప్రభుత్వ అడ్వకేట్ వ్యతిరేకించారు.
Source: Yahoo! Telugu: News | 9 Mar 2010 | 6:37 am

తెలంగాణ కోసం మరో విద్యార్థి ఆత్మహత్య: వీసీ ఘెరావ్!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజకీయ నేతలను నమ్ముకుంటే వంచనకు గురవుతామని, అందువల్ల లక్ష్య సాధన కోసం యువతే నడుం బిగించాలని ఆ విద్యార్థి తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
Source: Yahoo! Telugu: News | 9 Mar 2010 | 6:26 am

నెల్లూరు మేయర్ భానుశ్రీ నివాసంలో ఏసీబీ తనిఖీలు!

నెల్లూరు జిల్లా మేయర్ భానుశ్రీ నివాసంపై మంగళవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు కోటి రూపాయల విలువ చేసే అక్రమ ఆస్తులు కలిగివున్నట్టు వారు కనుగొన్నారు. అలాగే, ఒక బ్యాంకు లాకం చెవిని స్వాధీనం చేసుకున్నామని, దాన్ని తెరిస్తే గానీ అందులో ఏముందో తెలియదని అధికారులు చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 9 Mar 2010 | 6:12 am

చూపిస్తే సరిపోదు.. ఆకట్టుకోవాలి: శ్రద్దా ఆర్య

నేటి హీరోయిన్ అంటే గ్లామర్‌తోపాటు పెర్ఫార్మెన్స్ రెండూ రెండు కళ్లులాంటివని శ్రద్ద ఆర్య అంటోంది. తను చేసే పాత్రల్లో ఇవి రెండూ ఉండాలనీ, ఏది మిస్ అయినా పాత్ర తేలిపోతుందని చెపుతోంది. కేవలం అందాలను ఆరబోసినంత మాత్రన ప్రేక్షకులు చూస్తారని తాను అనుకోనని, కనుక దానితోపాటు అభినయం కూడా ఉండాలంటోంది. అయితే ఆరబోతకు తను అభ్యంతరం చెప్పననీ, అలాఅని కేవలం వాటికే ప్రాధాన్యత అంటే తాను అంగీకరించనని నిక్కచ్చిగా చెబుతోంది. గొడవ అనే చిత్రంతో తెలుగులో పరిచయమైన శ్రద్దా ఆర్య తాజాగా ఏవీఎస్ కోతిమూకలో నటిస్తోంది. హిందీలో అమితాబ్ బచ్చన్ కుమార్తెగా నటించాననీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్నాననీ చెపుతోంది. మీడియా తనను పెళ్లి గురించి అడుగుతోందనీ, అయితే తనకు ప్రేమ పెళ్లిపై నమ్మకం లేదని, పెద్దలు చేసే పెళ్లిపై తనకు నమ్మకం ఎక్కవని చెప్పింది. కనుక పెద్దలు చేసే పెళ్లికి ఇంకా చాలా టైమ్ పడుతుందని చెప్పుకొచ్చింది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Mar 2010 | 4:41 am

రాజ్యసభలో గడిచిన గండం: "మహిళా బిల్లు"కు మోక్షం!

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఒక గండం గడిచింది. ఎగువ సభ (రాజ్యసభ)లో ఈ బిల్లుకు మోక్షం లభించింది. బిల్లుపై ఎలాంటి చర్చ సాగకుండానే మోజువాణి ఓటుతో ఆమోదముద్ర వేశారు. యూపీఏ సంకీర్ణ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు.
Source: జాతీయ | 9 Mar 2010 | 3:06 am

తొలుత ఆమోదం.. ఆ తర్వాత సవరణలు: సోనియా గాంధీ

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏ రూపంలోనై ఆమోదం పొందేలా చేసేందుకు అధికార యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇందుకోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాజకీయ కురువృద్ధుడు, విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీలు రంగంలోకి దిగారు. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎస్పీ, ఆర్జేడీ అధినేతలతో వారు మంతనాలు నిర్వహించారు.
Source: జాతీయ | 9 Mar 2010 | 2:23 am

వాస్తవ పరిస్థితులతో నివేదిక తయారీ: పీసీసీ చీఫ్

రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులపై సమగ్ర నివేదికను తయారు చేసి జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి సమర్పిస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఈనెల 12వ తేదీన జరిగే కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్‌ల సదస్సులో పాల్గొనేందుకు ఆయన మంగళవారం హస్తినకు వెళ్లారు.
Source: ఏపీ న్యూస్ | 9 Mar 2010 | 1:17 am

తెలంగాణ కోసం మరో విద్యార్థి ఆత్మహత్య: వీసీ ఘెరావ్!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజకీయ నేతలను నమ్ముకుంటే వంచనకు గురవుతామని, అందువల్ల లక్ష్య సాధన కోసం యువతే నడుం బిగించాలని ఆ విద్యార్థి తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
Source: ఏపీ న్యూస్ | 9 Mar 2010 | 12:56 am

నెల్లూరు మేయర్ భానుశ్రీ నివాసంలో ఏసీబీ తనిఖీలు!

నెల్లూరు జిల్లా మేయర్ భానుశ్రీ నివాసంపై మంగళవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు కోటి రూపాయల విలువ చేసే అక్రమ ఆస్తులు కలిగివున్నట్టు వారు కనుగొన్నారు. అలాగే, ఒక బ్యాంకు లాకం చెవిని స్వాధీనం చేసుకున్నామని, దాన్ని తెరిస్తే గానీ అందులో ఏముందో తెలియదని అధికారులు చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 9 Mar 2010 | 12:43 am

ఎస్పీ, ఆర్జేడీ సభ్యులను సస్పెండ్ చేసిన హమీద్ అన్సారీ!

మహిళా రిజర్వేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్ పార్టీలకు చెందిన సభ్యులను రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ మంగళవారం సస్పెండ్ చేశారు. రెండో రోజు కూడా సభా కార్యక్రమాలకు అడ్డు తగడలడంతో విధిలేని పరిస్థితుల్లో ఏడుగురు ఎంపీలను ఈ బడ్జెట్ సమావేశాల ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి, సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.
Source: జాతీయ | 9 Mar 2010 | 12:01 am

"కోత"లపై ప్రరాపా ఆందోళన: "విద్యుత్" సౌధ వద్ద ఉద్రిక్తత!

విద్యుత్ కోతపై ప్రజారాజ్యం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీలో తమ నిరసనను వ్యక్తం చేయడమే కాకుండా, ప్రత్యక్ష ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఆ పార్టీకి చెందిన 16 మంది శాసన సభ్యులు విద్యుత్ సౌధను ముట్టడించేందుకు పూనుకున్నారు. అసెంబ్లీ నుంచి విద్యుత్ సౌధ వరకు పాదయాత్రగా బయలుదేరిన వారిని తొలుత ఖైరతాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Mar 2010 | 11:31 pm

వరద పునరావాసంలో ప్రభుత్వం విఫలం: చంద్రబాబు

వరద సహాయక చర్యలు చేపట్టడంలోనూ, పునరావాసం కల్పించడంలోనూ రాష్ట్ర సర్కారు పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో వరద సహాయక చర్యలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా విపక్ష నేత మాట్లాడుతూ వరద సమయంలో ప్రభుత్వం నిద్రమత్తులో జోగుతున్నదని ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Mar 2010 | 11:22 pm

ఆ మూడు నగరాలపై టెర్రర్ గురి: మంత్రి చిదంబరం!

ముంబై, కోల్‌కతా, బెంగుళూరు నగరాలపై దాడులు చేసేందుకు తీవ్రవాదులు కుట్రపన్నినట్టు కేంద్ర హోం శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మూడు నగరాలతో పాటు.. ముఖ్యమైన పట్టణాల్లో కూడా భద్రతాయంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి చిదంబరం వెల్లడించారు.
Source: జాతీయ | 8 Mar 2010 | 11:07 pm

నాణ్యవంతమైన జీవితానికి న్యూఢిల్లీ అత్యుత్తమం!

నాణ్యవంతమైన జీవితం అనుభవించేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీ అత్యుత్తమైన నగరంగా తేలింది. దక్షిణాది రాష్ట్ర రాజధానుల్లో చెన్నయ్‌కు మూడో స్థానం లభించింది. "లైవ్‌బులిటీ ఇండెక్స్-10" అనే పేరుతో భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
Source: జాతీయ | 8 Mar 2010 | 11:07 pm

విద్యుత్ కోతపై విపక్షాల నిరసన: రేపు ప్రభుత్వ ప్రకటన!

రాష్ట్రంలో అమలవుతున్న విద్యుత్ కోతపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, వామపక్షాలు, ప్రజారాజ్యం పార్టీలు తీవ్ర నిరసనకు దిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ప్రజారాజ్యం పార్టీ సభ్యులు లాంతర్లు చేతబూని నిరసన వ్యక్తం చేయగా, తెలుగుదేశం, వామపక్ష పార్టీలు గన్‌పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశాయి. అక్కడ నుంచి వారు లాంతర్లను ప్రదర్శిస్తూ అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశారు.
Source: ఏపీ న్యూస్ | 8 Mar 2010 | 9:54 pm

యాదవ త్రయంతో ప్రధాని మన్మోహన్ కీలక భేటీ!

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యాదవ త్రయంతో ఆయన మంగళవారం ఉదయం భేటీ కానున్నారు. ఇందుకోసం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఎస్పీ అధినేత ములాయం సింగ్, జనతాదళ్ (యు) అధినేత శరద్ యాదవ్‌లు ప్రధాని నివాసానికి చేరుకున్నారు.
Source: జాతీయ | 8 Mar 2010 | 9:13 pm

"చంద్రముఖి-2"లో మెగాస్టార్ చిరంజీవి..?!!

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, మెగాస్టార్ చిరంజీవి స్లిమ్‌గా మారడానికి వెనుక గల కారణం ఆయన తిరిగి సినిమాల్లో నటించడానికేనని మెగా ఫ్యాన్స్ చెపుతున్నారు. కాకపోతే ఎప్పటినుంచో అనుకుంటున్న "ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి" చిత్రానికి బదులు "చంద్రముఖి-2"లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి.కన్నడంలో విష్ణువర్థన్ నటించిన ఆప్తరక్షక చిత్రం కర్ణాటక బాక్సాఫీసు వద్ద బద్దలుకొట్టి రికార్డులు సృష్టించింది. ఇప్పుడీ సినిమాను తెలుగులో చిరంజీవితో తీయాలని తమిళ దర్శకుడు పి.వాసు కసరత్తు చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్. చిరంజీవి ఇమేజ్‌కు తగినట్లుగా కథలో మార్పులు చేర్పులు చేయనున్నట్లు వార్త. అంతేకాదు ఇందులో భాగంగా ఇప్పటికే చిరంజీవిని పి.వాసు కలిసినట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. కాగా చిరంజీవి మాత్రం రాజకీయాల్లో తనేమిటో నిరూపించుకున్న తర్వాతే మళ్లీ సినిమాలవైపు చూస్తానని అంటున్నారు. మరి మెగా ఫ్యాన్స్ కల ఎప్పటికి తీరుతుందో వేచి చూడాలి..!!
Source: Yahoo! Telugu: Entertainment | 8 Mar 2010 | 12:37 pm

రాంగ్ నంబర్ వస్తే చెల్లా చెదురే: అల్లు అర్జున్

వరుడు సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో పెండ్లి వస్త్రాలతో చిత్రం టీమ్ హాజరైంది. వధువు పాత్రధారి ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంచారు. కానీ ఆడియో వేడుకను అల్లు అర్జున్ పెళ్లిచూపుల వేదికగా మారడం విశేషం. అతిథులంతా "వరుడు" సినిమా పెండ్లి వ్యవస్థపై తీసిందనీ, 16 రోజుల పండుగ అంటూ జరిగే పెళ్లి తంతు.. ఆ తర్వాత 5 రోజులకు.. రానురాను ఒక్కరోజు వేడుకగా మారిపోయిందంటూ చిత్రం గురించి వివరించారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "ఈ సినిమా పెండ్లి తంతు గురించి కనుక.. ఎలాగో అల్లు అర్జున్‌కు 25 ఏళ్లు వచ్చాయి. అందుకే పెళ్లి చేయాలని నేను, నా భార్య కలిసి ఓ రోజు ఇంట్లో అర్జున్‌ని అడిగాం. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. గౌరవంగా చేస్తాను అన్నాను. కాసేపు సైలెంట్ అయిన తర్వాత.. మీరు ఎవరిని చూసినా చేసుకుంటాను డాడీ.. అని చెప్పాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Mar 2010 | 10:00 am

మహిళా రిజర్వేషన్‌ను 25 శాతానికి కుదించనున్న కేంద్రం

మహిళా బిల్లును సభలో ప్రవేశపెట్టి ఓటింగ్‌కు తీసుకువచ్చేందుకు సోమవారం కేంద్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. కానీ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బహుజన్ సమాజ్ పార్టీలు మహిళా రిజర్వేషన్‌ని 20 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇదిలావుండగా భాజపాతోపాటు వామపక్షాలు మహిళా బిల్లును ఓటింగ్‌కు ప్రవేశపెట్టే ముందు చర్చ జరగాలని పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్‌ను 25 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
Source: జాతీయ | 8 Mar 2010 | 7:33 am

నేడు సీపీఎం రాష్ట్ర కార్యవర్గం భేటీ: కీలకాంశాలపై చర్చ!

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్స్కిస్టు) రాష్ట్ర కార్యవర్గం సోమవారం హైదరాబాద్‌లో భేటీ కానుంది. ఈ భేటీలో నిత్యావసర వస్తు ధరల పెరుగదలతో పాటు జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చే నివేదికపై చర్చించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Mar 2010 | 7:28 am

ఆడ- మగ సాన్నిహిత్యం పెరిగితే "సెక్స్" ఖాయం: అమృత

ఆడ- మగ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంటే అక్కడ ఖచ్చితంగా సెక్స్ చోటుచేసుకుంటుందని కుండబద్ధలు కొట్టినట్లు చెపుతోంది అమృతా అరోరా. ఈ సెక్స్ అనేది పెళ్లికి ముందా...? లేదంటే ఆ తర్వాత జరుగుతుందా అనే ప్రశ్నకు తావేలేదనీ చెపుతోంది.ఆడ- మగ దూరాన్ని మరిచి మరింత దగ్గరైతే వారిమధ్య ఏదో ఒక బలహీన క్షణంలో సెక్స్ చోటుచేసుకుంటుందని అమృతా అరోరా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇదిలావుంటే... అప్పట్లో పెళ్లికి ముందు సెక్స్ సమర్థనీయమే అని ఖుష్బూ, సానియా మీర్జా వంటివారు స్టేట్మెంట్లు ఇచ్చి విమర్శలకు గురయ్యారు. సానియా అయితే ఏకంగా నిశ్చితార్థం జరిగాక అతడిని కాదని వదిలేసింది కూడా. ఏదేమైనా సెక్స్ అనేది ఇద్దరి వ్యక్తుల వ్యక్తిగత విషయమని అమృత చెపుతోంది. ఇద్దరు వ్యక్తులు ఇష్టపడినప్పుడు వారి మధ్య సెక్స్ జరగకుండా ఆపడం ఎవరితరం కాదని బల్లగుద్ది మరీ చెపుతోంది. బహుశా ఇది అమృత స్వానుభవమేమోనని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Mar 2010 | 5:59 am

ఆచార్య కోదండరామ్‌పై చర్యలు తీసుకోలేం: రోశయ్య

అర్థంపర్థం లేని డిమాండ్లు చేస్తున్న తెలంగాణ ఐకాస కన్వీనర్ ఆచార్య కోదండరామ్‌పై చర్య తీసుకోలేమని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆచార్య వృత్తిలో ఉండే కోదండరామ్ ఇష్టానుసారంగా మాట్లాడటం భావ్యం కాదన్నారు. ఏ ప్రాంత ఇంటర్ పరీక్ష జవాబు పత్రాలను ఆ ప్రాంతంలోనే దిద్దాలన్న వాదన అర్థరహితమన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Mar 2010 | 5:30 am

స్వల్ప మార్పులతో మహిళా బిల్లు ఆమోదం: లగడపాటి

మహిళా రిజర్వేషన్ బిల్లును స్వల్ప మార్పులతో పార్లమెంట్ ఉభయసభలు ఆమోదం పొందే అవకాశం ఉందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. 33 శాతం రిజర్వేషన్ బిల్లును యధావిధిగా ఆమోదించే అవకాశాలు సభలో కనిపించడం లేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Mar 2010 | 5:27 am

ఆరు ఆస్కార్లను కైవసం చేసుకున్న "ది హర్ట్ లాకర్"

ప్రపంచ మహిళా దినోత్సవం రోజున మరో అద్భుతం జరిగింది. 82వ అకాడమీ ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవాలలో ఓ మహిళ చరిత్ర సృష్టిస్తూ ఉత్తమ డైరెక్టర్ క్యాటగిరీలో ఆస్కార్ అవార్డును కైవసం చేసుకున్నది. ఆమె ఎవరో కాదు... అవతార్ చిత్రంతో ఆస్కార్ల పంట పండించాలనుకుని కలలుకన్న జేమ్స్ కేమరూన్ సతీమణి కాత్రిన్ బిగిలో. లాస్ ఏంజలిస్‌లో అత్యంత ఘనంగా జరిగిన ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవాల్లో బిగిలో దర్శకత్వం వహించిన "ద హర్ట్ లాకర్" ఉత్తమ చిత్రంగా ఎంపికై ఆస్కార్‌ను తన్నుకెళ్లడమే కాక మరో ఐదు క్యాటగిరీల్లో అవార్డులను కైవసం చేసుకుని ఏకంగా ఆరు అవార్డులను తన ఖాతాలో జమ చేసుకున్నది."బ్లైండ్ సైడ్" చిత్రంలో కథానాయకగా నటించిన సీన్ పెన్న్ ఉత్తమ నాయక క్యాటగిరీలో ఆస్కార్ దక్కించుకున్నది. క్రేజీ హార్ట్ చిత్రంలో నటించిన జెఫ్ బ్రిడ్జెస్ ఉత్తమ కథానాయకుడుగా ఎంపికయ్యారు. జేమ్స్ కేమరూన్ చిత్రం "అవాతార్" చిత్రానికి ఆస్కార్ల పంట పండుతుందనుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. ఈ చిత్రం బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ క్యాటగిరీల్లో మాత్రమే ఆస్కార్ అవార్డులను దక్కించుకోగలగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Mar 2010 | 4:51 am

రాంగ్ నంబర్ వస్తే చెల్లా చెదురే: అల్లు అర్జున్

వరుడు సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో పెండ్లి వస్త్రాలతో చిత్రం టీమ్ హాజరైంది. వధువు పాత్రధారి ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంచారు. కానీ ఆడియో వేడుకను అల్లు అర్జున్ పెళ్లిచూపుల వేదికగా మారడం విశేషం. అతిథులంతా "వరుడు" సినిమా పెండ్లి వ్యవస్థపై తీసిందనీ, 16 రోజుల పండుగ అంటూ జరిగే పెళ్లి తంతు.. ఆ తర్వాత 5 రోజులకు.. రానురాను ఒక్కరోజు వేడుకగా మారిపోయిందంటూ చిత్రం గురించి వివరించారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "ఈ సినిమా పెండ్లి తంతు గురించి కనుక.. ఎలాగో అల్లు అర్జున్‌కు 25 ఏళ్లు వచ్చాయి. అందుకే పెళ్లి చేయాలని నేను, నా భార్య కలిసి ఓ రోజు ఇంట్లో అర్జున్‌ని అడిగాం. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. గౌరవంగా చేస్తాను అన్నాను. కాసేపు సైలెంట్ అయిన తర్వాత.. మీరు ఎవరిని చూసినా చేసుకుంటాను డాడీ.. అని చెప్పాడు.
Source: వినోదం | 8 Mar 2010 | 4:32 am

మహిళా బిల్లుపై అఖిల పక్ష నేతలతో ప్రధాని భేటీ!

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి కేంద్రం సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. శతాధిక మహిళా దినోత్సవం సందర్భంగా బిల్లుకు మోక్షం కలిగించాలనే పట్టుదలతో యూపీఏ సంకీర్ణ సర్కారు ఉంది. ఇందులోభాగంగా బిల్లును ఎగువ సభ (రాజ్యసభ)లో సోమవారం మూడు పార్టీల నిరసనల మధ్య ప్రవేశపెట్టింది.
Source: జాతీయ | 8 Mar 2010 | 4:19 am

రాష్ట్రంలో విద్యుత్ కోత సర్వసాధారణం: మంత్రి పొన్నాల

రాష్ట్రంలో విద్యుత్ కోత విధించడం సర్వసాధారణమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయినట్టు చెప్పారు. అందువల్ల కరెంట్ కోత అమలవుతోందన్నారు. అయితే, విద్యుత్ కోత రాష్ట్ర ప్రజలకు కొత్తేమీ కాదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Mar 2010 | 2:52 am

మహిళా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన మొయిలీ

మహిళా బిల్లును కేంద్ర న్యాయశాఖా మంత్రి వీరప్ప మొయిలీ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనికి ఆర్జేడీ, ఎస్పీ పార్టీలకు చెందిన సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బిల్లు ప్రతులను రాజ్యసభ ఛైర్మన్‌పై విసిరి వేశారు. ఈ రెండు పార్టీలకు చెందిన సభ్యులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ.. మంత్రి మొయిలీ మాత్రం బిల్లును సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో కూడా ఆ పార్టీల నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 8 Mar 2010 | 2:04 am