రాజీనామాను ఉపసంహరించుకున్న మైనంపల్లి!

తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీ సభ్యుడు మైనంపల్లి హన్మంత రావు సోమవారం తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తమ ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించిన అమరవీరుల కుటుంబాలకు పోటీచేసే అవకాశం కల్పించే నిమిత్తం ఆయన తన పదవికి ఆదివారం రాజీనామా చేసిన విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 8 Mar 2010 | 8:10 am

భారీ లాభాల దిశగా స్టాక్ మార్కెట్ పయనం

సోమవారం బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాల దిశగా ర్యాలీని కొనసాగిస్తోంది. ఆటో, బ్యాంకింగ్, హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడం బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధికి ప్రధాన కారణమైంది. దీంతో మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాల దిశగా ర్యాలీని పయనింపజేస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 8 Mar 2010 | 8:02 am

లాహోర్‌లో ఆత్మాహుతి దాడి: 11 మంది దుర్మరణం!

పాకిస్థాన్‌లోని లాహోర్‌ సోమవారం ఆత్మాహుతి దాడులతో దద్ధరిల్లింది. ఈ దాడుల్లో 11 మంది మృత్యువాత పడగా, మరో 61 మంది గాయపడ్డారు. ప్రత్యేక దర్యాప్తు సంస్థ (ఎస్.ఐ.ఓ) కార్యాలయం ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది.
Source: Yahoo! Telugu: News | 8 Mar 2010 | 7:51 am

మహిళా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన మొయిలీ

మహిళా బిల్లును కేంద్ర న్యాయశాఖా మంత్రి వీరప్ప మొయిలీ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనికి ఆర్జేడీ, ఎస్పీ పార్టీలకు చెందిన సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బిల్లు ప్రతులను రాజ్యసభ ఛైర్మన్‌పై విసిరి వేశారు. ఈ రెండు పార్టీలకు చెందిన సభ్యులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ.. మంత్రి మొయిలీ మాత్రం బిల్లును సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో కూడా ఆ పార్టీల నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 8 Mar 2010 | 7:33 am

దేశీయ ఆర్థిక వృద్ధి 8.5 శాతానికి చేరుకుంటుంది: సిఐఐ

వచ్చే ఆర్థిక సంవత్సరం దేశీయ ఆర్థిక వృద్ధి 8-8.5 శాతానికి చేరుకుంటుందని దేశంలోని కార్పోరేట్ కంపెనీల ప్రధాన కార్యనిర్వహణాధికారులు(సీఈఓ) తెలిపినట్లు సిఐఐ తెలిపింది
Source: Yahoo! Telugu: News | 8 Mar 2010 | 7:24 am

పుంజుకున్న ట్రేడింగ్: వృద్ధిబాటలో స్టాక్ మార్కెట్

దేశీయ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పయనిస్తోంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి పురోగమనం వైపు కొనసాగుతోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 174 పాయింట్లు పుంజుకుని, 17,140 మార్కును తాకింది. అలాగే నిఫ్టీ కూడా 50 పాయింట్లు పుంజుకుని 5,135 మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 8 Mar 2010 | 7:17 am

ఫిబ్రవరిలో 33 శాతం పెరిగిన కార్ల అమ్మకాలు

దేశంలో ఫిబ్రవరి నెలలో జరిగిన కార్ల అమ్మకాలలో 33 శాతం వృద్ధి చెంది 153,845 కార్లు అమ్ముడైనట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ (ఎస్ఐఏఎమ్) సోమవారం తెలిపింది
Source: Yahoo! Telugu: News | 8 Mar 2010 | 7:09 am

యూపీఏకు మద్దతు ఉపసంహరించుకున్న ఎస్పీ-ఆర్జేడీ!

కేంద్రంలోని యూపీఏ సర్కారుకు ఇస్తున్న మద్దతును ఎస్పీ, ఆర్జేడీలు ఉపసంహరించుకున్నాయి. ములాయం సింగ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి 22 మంది సభ్యులు ఉండగా, లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీకి ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఈ రెండు పార్టీలు యూపీఏకు ఇప్పటి వరకు భేషరతుగా మద్దతు ప్రకటించగా, ప్రస్తుతం దీన్ని ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పారు. దీంతో యూపీఏ సర్కారుకు ఉపసంహరణతో యూపీఏ సంకీర్ణ సర్కారు బలం 287కు తగ్గిపోయింది.
Source: Yahoo! Telugu: News | 8 Mar 2010 | 6:35 am

బియ్యం ఎగుమతులు చేసే ఆలోచన లేదు: సింధియా

దేశీయ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతులు చేసే ఆలోచనేదీ లేదని, సరైన రీతిలో స్థానిక రైతుల నుంచి బియ్యం కొనుగోలు చేయని పక్షంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామే తప్ప విదేశాలకు తమ దేశంలో ఉత్పత్తయ్యే బియ్యాన్ని ఎగుమతులు చేయమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమవారం లోక్‌సభలో వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 8 Mar 2010 | 6:22 am

విదేశీ మార్కెట్ల ప్రభావం: లాభాల్లో స్టాక్ మార్కెట్

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగుతోంది. అమెరికా, ఆసియా, యూరప్ మార్కెట్ల ప్రభావంతో స్టాక్ మార్కెట్ వృద్ధిబాటలో పయనిస్తోంది. ఫలితంగా సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, 141 పాయింట్లు పుంజుకుని 17,136 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 42 పాయింట్లు బలపడి, 5,131 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 8 Mar 2010 | 6:18 am

ఆడ- మగ సాన్నిహిత్యం పెరిగితే "సెక్స్" ఖాయం: అమృత

ఆడ- మగ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంటే అక్కడ ఖచ్చితంగా సెక్స్ చోటుచేసుకుంటుందని కుండబద్ధలు కొట్టినట్లు చెపుతోంది అమృతా అరోరా. ఈ సెక్స్ అనేది పెళ్లికి ముందా...? లేదంటే ఆ తర్వాత జరుగుతుందా అనే ప్రశ్నకు తావేలేదనీ చెపుతోంది.ఆడ- మగ దూరాన్ని మరిచి మరింత దగ్గరైతే వారిమధ్య ఏదో ఒక బలహీన క్షణంలో సెక్స్ చోటుచేసుకుంటుందని అమృతా అరోరా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇదిలావుంటే... అప్పట్లో పెళ్లికి ముందు సెక్స్ సమర్థనీయమే అని ఖుష్బూ, సానియా మీర్జా వంటివారు స్టేట్మెంట్లు ఇచ్చి విమర్శలకు గురయ్యారు. సానియా అయితే ఏకంగా నిశ్చితార్థం జరిగాక అతడిని కాదని వదిలేసింది కూడా. ఏదేమైనా సెక్స్ అనేది ఇద్దరి వ్యక్తుల వ్యక్తిగత విషయమని అమృత చెపుతోంది. ఇద్దరు వ్యక్తులు ఇష్టపడినప్పుడు వారి మధ్య సెక్స్ జరగకుండా ఆపడం ఎవరితరం కాదని బల్లగుద్ది మరీ చెపుతోంది. బహుశా ఇది అమృత స్వానుభవమేమోనని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Mar 2010 | 5:59 am

ఆరు ఆస్కార్లను కైవసం చేసుకున్న "ది హర్ట్ లాకర్"

ప్రపంచ మహిళా దినోత్సవం రోజున మరో అద్భుతం జరిగింది. 82వ అకాడమీ ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవాలలో ఓ మహిళ చరిత్ర సృష్టిస్తూ ఉత్తమ డైరెక్టర్ క్యాటగిరీలో ఆస్కార్ అవార్డును కైవసం చేసుకున్నది. ఆమె ఎవరో కాదు... అవతార్ చిత్రంతో ఆస్కార్ల పంట పండించాలనుకుని కలలుకన్న జేమ్స్ కేమరూన్ సతీమణి కాత్రిన్ బిగిలో. లాస్ ఏంజలిస్‌లో అత్యంత ఘనంగా జరిగిన ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవాల్లో బిగిలో దర్శకత్వం వహించిన "ద హర్ట్ లాకర్" ఉత్తమ చిత్రంగా ఎంపికై ఆస్కార్‌ను తన్నుకెళ్లడమే కాక మరో ఐదు క్యాటగిరీల్లో అవార్డులను కైవసం చేసుకుని ఏకంగా ఆరు అవార్డులను తన ఖాతాలో జమ చేసుకున్నది."బ్లైండ్ సైడ్" చిత్రంలో కథానాయకగా నటించిన సీన్ పెన్న్ ఉత్తమ నాయక క్యాటగిరీలో ఆస్కార్ దక్కించుకున్నది. క్రేజీ హార్ట్ చిత్రంలో నటించిన జెఫ్ బ్రిడ్జెస్ ఉత్తమ కథానాయకుడుగా ఎంపికయ్యారు. జేమ్స్ కేమరూన్ చిత్రం "అవాతార్" చిత్రానికి ఆస్కార్ల పంట పండుతుందనుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. ఈ చిత్రం బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ క్యాటగిరీల్లో మాత్రమే ఆస్కార్ అవార్డులను దక్కించుకోగలగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Mar 2010 | 4:51 am

రాష్ట్రంలో విద్యుత్ కోత సర్వసాధారణం: మంత్రి పొన్నాల

రాష్ట్రంలో విద్యుత్ కోత విధించడం సర్వసాధారణమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయినట్టు చెప్పారు. అందువల్ల కరెంట్ కోత అమలవుతోందన్నారు. అయితే, విద్యుత్ కోత రాష్ట్ర ప్రజలకు కొత్తేమీ కాదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Mar 2010 | 2:52 am

రాజీనామాను ఉపసంహరించుకున్న మైనంపల్లి!

తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీ సభ్యుడు మైనంపల్లి హన్మంత రావు సోమవారం తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తమ ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించిన అమరవీరుల కుటుంబాలకు పోటీచేసే అవకాశం కల్పించే నిమిత్తం ఆయన తన పదవికి ఆదివారం రాజీనామా చేసిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 8 Mar 2010 | 2:41 am

మహిళా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన మొయిలీ

మహిళా బిల్లును కేంద్ర న్యాయశాఖా మంత్రి వీరప్ప మొయిలీ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనికి ఆర్జేడీ, ఎస్పీ పార్టీలకు చెందిన సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బిల్లు ప్రతులను రాజ్యసభ ఛైర్మన్‌పై విసిరి వేశారు. ఈ రెండు పార్టీలకు చెందిన సభ్యులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ.. మంత్రి మొయిలీ మాత్రం బిల్లును సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో కూడా ఆ పార్టీల నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 8 Mar 2010 | 2:04 am

యూపీఏకు మద్దతు ఉపసంహరించుకున్న ఎస్పీ-ఆర్జేడీ!

కేంద్రంలోని యూపీఏ సర్కారుకు ఇస్తున్న మద్దతును ఎస్పీ, ఆర్జేడీలు ఉపసంహరించుకున్నాయి. ములాయం సింగ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి 22 మంది సభ్యులు ఉండగా, లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీకి ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఈ రెండు పార్టీలు యూపీఏకు ఇప్పటి వరకు భేషరతుగా మద్దతు ప్రకటించగా, ప్రస్తుతం దీన్ని ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పారు. దీంతో యూపీఏ సర్కారుకు ఉపసంహరణతో యూపీఏ సంకీర్ణ సర్కారు బలం 287కు తగ్గిపోయింది.
Source: జాతీయ | 8 Mar 2010 | 1:13 am

రాజ్యసభలో మహిళా బిల్లు: ఉభయ సభలు వాయిదా!

మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ మరుక్షణమే ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీలకు చెందిన సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది.
Source: జాతీయ | 8 Mar 2010 | 12:09 am

చర్చలకు రాకుంటే.. దాడులు చేస్తాం: కిషన్‌జీ హెచ్చరిక!

మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు కేంద్రం ముందుకురాకుంటే దాడులు చేస్తామని మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ హెచ్చరించారు. ఈ దాడులు కోల్‌కతా, భువనేశ్వర్‌లను కేంద్రంగా చేసుకుని ఈ దాడులు చేస్తామని ఆయన తాజాగా ప్రకటించారు.
Source: జాతీయ | 8 Mar 2010 | 12:07 am

నేడు సీపీఎం రాష్ట్ర కార్యవర్గం భేటీ: కీలకాంశాలపై చర్చ!

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్స్కిస్టు) రాష్ట్ర కార్యవర్గం సోమవారం హైదరాబాద్‌లో సోమవారం భేటీ కానుంది. ఈ భేటీలో నిత్యావసర వస్తు ధరల పెరుగదలతో పాటు జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చే నివేదికపై చర్చించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Mar 2010 | 10:53 pm

ఏకాభిప్రాయం ఎండమావే: కాంగ్రెస్ ఎంపీల ఆందోళన!

ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జపించిన ఏకాభిప్రాయ మంత్రం తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లోనే కాకుండా.. ఎన్నటికీ ఏకాభిప్రాయం సాధ్యం కాదని వారు అభిప్రాయపడ్డారు. ఏకాభిప్రాయంతోనే రాష్ట్ర సాధన వస్తుదని భావిస్తే అది ఎండమావిలాంటిదని 'టి' ప్రాంతానికి చెందిన ఎంపీలు మదు యాష్కీ, మందా జగన్నాథం, జి.వివేక్‌లు అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Mar 2010 | 10:47 pm

కేసీఆర్.. నిన్ను వదలా: తెదేపా తెలంగాణ నేతలు!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావును తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ నేతలు టార్గెట్ చేసుకున్నారు. తెలంగాణ ప్రాతంలో కేసీఆర్ తిరగనివ్వకుండా చేయాలని ప్రతిన పూనారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైన కేసీఆర్.. తమపై దుష్ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 7 Mar 2010 | 9:59 pm

ముంబై పేలుళ్లు కేసు: 9న కసబ్ తుది విచారణ!

ముంబై బాంబు పేలుళ్ళ కేసు తుది విచారణ ఈనెల తొమ్మిదో నుంచి ఆరంభమవుతుంది. సజీవంగా పట్టుబడి ఏకైక ఉగ్రవాదం అజ్మల్ కసబ్‌పై నమోదైన అభియోగాలపై తుది విచారణను చేపడుతారు. గత యేడాది కాలంగా కసబ్ వద్ద విచారణ జరిపిన విషయం తెల్సిందే. ఈ సమయంలో పరస్పర విరుద్ధమైన ప్రకటనలపైనే ప్రాసిక్యూషన్ ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉంది.
Source: జాతీయ | 7 Mar 2010 | 9:02 pm

ఎన్నాళ్లకెన్నాళ్లకు: మహిళా బిల్లుకు నేటికి సాకారం!

భారతీయ మహిళ చిరకాల స్వప్నం నేటికి సాకారం కానుంది. కొన్ని దశాబ్దాలుగా జరుపుకుంటున్న మహిళా సాధికార దినోత్సవ ప్రతిఫలం నేటికి దక్కనుంది. మహిళా సాధికారతే లక్ష్యంగా దేశ పార్లమెంట్‌ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా సోమవారం మిగిలిపోనుంది. ఓర్పు.. నేర్పు... కూర్పు.... ఉన్న భారతీయ మహిళకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించడమే లక్ష్యంగా 33 శాతం రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.
Source: జాతీయ | 7 Mar 2010 | 8:55 pm

క్షమాపణా.. ఆ మాటకు ప్రసక్తే లేదు: చంద్రబాబు

ఇందిరాపార్కు వద్ద న్యాయవాదులపై జరిగిన దాడి వ్యవహారంలో క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై తాము పోరాటం చేసే సమయంలో మరో రాజకీయ పార్టీ కార్యకర్తలు వచ్చి ధర్నాను ఆటంకపరచడం సరికాదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Mar 2010 | 4:05 am

పాకిస్థాన్ ప్రకటనపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన భారత్!

జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ అరెస్టు వ్యవహారంపై పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముంబై దాడుల ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సయీద్‌ అరెస్టును భారత్ డిమాండ్ చేయడం లేదని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ ప్రకటన చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
Source: జాతీయ | 7 Mar 2010 | 3:54 am

తెదేపా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాజీనామా!

తెలుగుదేశం పార్టీకి చెందిన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదివారం తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తిరుపతి, రేణిగుంట విమానాశ్రయంవద్ద స్పీకర్ కిరణ్‌కుమార్‌రెడ్డిని కలుసుకుని తన రాజీనామా లేఖను సమర్పించారు. తన వ్యక్తిగత కారణాల వల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్పీకర్‌కు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 7 Mar 2010 | 3:21 am

మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు బిల్లు ఎందుకు: ములాయం

మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు బిల్లు అవసరం లేదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత (ఎస్‌పి) ములాయం సింగ్ యాదవ్ అన్నారు. 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు తాము పూర్తిగా వ్యతిరేకం కాదన్నారు. దీనిపై ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. మహిళలకు ప్రత్యేక బిల్లు అవసరంలేదన్నారు.
Source: జాతీయ | 7 Mar 2010 | 3:20 am

డీఎస్ అందరివాడు.. నేను సమైక్యవాదిని: జేసీ

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఆ రాష్ట్ర ప్రజల అందరివాడని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేసీ.దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావుతో సమావేశమయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 7 Mar 2010 | 3:00 am

జేఏసీ నుంచి తక్షణం తప్పుకోండి: చంద్రబాబు ఆదేశం

తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి ఆ ప్రాంతానికి చెందిన పార్టీ నేతలంతా తక్షణం తప్పుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 7 Mar 2010 | 2:59 am

రాష్ట్రంలో వివిధ ప్రమాదాలు: 14 మంది దుర్మరణం!

నల్గొండ, విజయనగరం జిల్లాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది దుర్మరణం పాలయ్యారు. నల్గొండలో ట్రాక్టర్ చెరువులో బోల్తా పడటంతో 12 మంది మృత్యువాత పడగా, విజయనగరం జిల్లాలో మరో ఇద్దరు మృతి చెందారు. ఈ రెండు ప్రమాదాలు ఆదివారం జరిగాయి.
Source: ఏపీ న్యూస్ | 7 Mar 2010 | 2:58 am