|
రాష్ట్రంలో వివిధ ప్రమాదాలు: 14 మంది దుర్మరణం!నల్గొండ, విజయనగరం జిల్లాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది దుర్మరణం పాలయ్యారు. నల్గొండలో ట్రాక్టర్ చెరువులో బోల్తా పడటంతో 12 మంది మృత్యువాత పడగా, విజయనగరం జిల్లాలో మరో ఇద్దరు మృతి చెందారు. ఈ రెండు ప్రమాదాలు ఆదివారం జరిగాయి.Source: Yahoo! Telugu: News | 7 Mar 2010 | 8:28 am క్రమంగా తగ్గుతున్న ఆహార ధాన్యాల ధరలు: ప్రణబ్ ముఖర్జీనిత్యావసర వస్తువులు ధరలు క్రమంగా తగ్గుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఆదివారం ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ పాల్, గోదుమ, బియ్యం, కూరగాయల ధరలు పెరగాయన్నారు. దీంతో గత 20వ తేదీతో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం 17.87 శాతానికి చేరుకుందన్నారు. అంతకుముందు ఇది 20 శాతంగా ఉన్నట్టు ఆయన గుర్తు చేశారు.Source: Yahoo! Telugu: News | 7 Mar 2010 | 8:01 am హఫీజ్ అరెస్టును భారత్ డిమాండ్ చేయలేదు: ఖురేషీజమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ ముహ్మద్ సయీద్‌ను అరెస్టు చేయాలని భారత్ డిమాండ్ చేయలేదని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మొహ్మద్ ఖురేషీ అన్నారు. అలాగే, భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన విదేశాంగ కార్యదర్శుల స్థాయి సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు రాలేదని ఆయన అన్నారు.Source: Yahoo! Telugu: News | 7 Mar 2010 | 7:47 am కుటుంబాలకు సాయం చేసేందుకు నిధులు లేవు: మాయావతికృపాల్జీ మహారాజ్ ఆశ్రమంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వ వద్ద నిధులు లేవని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి స్పష్టం చేశారు. అందువల్ల మృతుల కుటుంబలతో పాటు.. క్షతగాత్రులకు కేంద్ర ప్రభుత్వమే ఆర్థిక సాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.Source: Yahoo! Telugu: News | 7 Mar 2010 | 6:29 am తీవ్రవాద సంస్థలపై ఐఎస్ఐ ఒత్తిడి: భారత్‌పై దాడులకు సిద్ధం!భారత్‌పై దాడులతో విరుచుకుపడాలని పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న తీవ్రవాద సంస్థలకు పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ఆదేశాలు జారీ చేసింది. దాడులు చేయాల్సిందిగా తీవ్రమైన ఒత్తిడి చేస్తోంది. దీంతో భారత్‌లోని వివిధ నగరాలపై దాడులు చేసేందుకు తీవ్రవాద సంస్థలు కుట్ర పన్నుతున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థ్ నగర్‌లో సల్మాన్ అనే తీవ్రవాదిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.Source: Yahoo! Telugu: News | 7 Mar 2010 | 5:41 am ఈ యేడాది 21 శాతం పెరగనున్న బొగ్గు దిగుమతులు!2010-11 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు దిగుమతులు 21 శాతం మేరకు పెరగనున్నట్టు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. విదేశీయులతో కలిసి ఉమ్మడి భాగస్వామ్యంతో బొగ్గు గనులకు రానున్న కాలంలో బిడ్డులు వేయడం ద్వారా దిగుమతులు పుంజుకోనున్నాయని పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 7 Mar 2010 | 5:21 am భారత్‌లో రెట్టింపైన అమెరికా యంత్రాలు దిగుమతి!అమెరికా యంత్రాల దిగుమతుల శాతం ఎక్కువయ్యాయి. భారత్‌లో గత యేడాది ఈ దిగుమతుల శాతం ఎక్కువయ్యాయి. నిర్మాణ రంగానికి చెందిన యంత్రాల ఎగుమతులు యుఎస్ నుంచి మన దేశానికి గతేడాదిలో మొత్తంగా 55 శాతం పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 7 Mar 2010 | 5:08 am రూ.40 కోట్ల డాలర్లకు యూఏసీ విమాన ఒప్పందం!రష్యా విమానాల తయారీ కంపెనీ యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (యూఏసీ) మన దేశానికి చెందిన మూడు విమానయాన కంపెనీలతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీలకు 40 కోట్ల డాలర్ల విలువ కలిగిన ఎనిమిది ప్రయాణీకుల విమానాలను సరఫరా చేయనున్నట్లుగా ప్రకటించింది. "ఇండియన్ ఎవియేషన్-2010" సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కంపెనీ డైరెక్టర్ (రీజినల్ ఎయిర్‌క్రాఫ్ట) యూరీ గ్రుడినీ మాట్లాడుతూ భారత దేశానికి చెందిన ముగ్గురు విమాన ఆపరేటర్లతో ఎనిమిది విమానాలను సరఫరా చేయటానికి అవగాహనా ఒప్పందం చేసుకున్నట్లుగా వివరించారు.Source: Yahoo! Telugu: News | 7 Mar 2010 | 5:02 am మహిళల్లో పెరుగుతున్న హృద్రోగ వ్యాధులు: వైద్యులు!ఇటీవలి కాలంలో మహిళల్లో హృద్రోగ వ్యాధులు ఎక్కువ అవుతున్నట్టు వైద్యులు వెల్లడించారు. 40 సంవత్సరాలు దాటిన మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు సఫోలా లైఫ్ స్టడీలో తేలిందని ఇంటర్నేషనల్ మోనోపాజ్ సొసైటీ భారత ప్రతినిధి డాక్టర్ ధురుషా తెలిపారు.Source: Yahoo! Telugu: News | 7 Mar 2010 | 4:37 am క్షమాపణా.. ఆ మాటకు ప్రసక్తే లేదు: చంద్రబాబు నాయుడుఇందిరాపార్కు వద్ద న్యాయవాదులపై జరిగిన దాడి వ్యవహారంలో క్షమాపణ చెపట్టే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై తాము పోరాటం చేసే సమయంలో మరో రాజకీయ పార్టీ కార్యకర్తలు వచ్చి ధర్నాను ఆటంకపరచడం సరికాదన్నారు.Source: Yahoo! Telugu: News | 7 Mar 2010 | 3:54 am రాష్ట్రంలో వివిధ ప్రమాదాలు: 14 మంది దుర్మరణం!నల్గొండ, విజయనగరం జిల్లాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది దుర్మరణం పాలయ్యారు. నల్గొండలో ట్రాక్టర్ చెరువులో బోల్తా పడటంతో 12 మంది మృత్యువాత పడగా, విజయనగరం జిల్లాలో మరో ఇద్దరు మృతి చెందారు. ఈ రెండు ప్రమాదాలు ఆదివారం జరిగాయి.Source: ఏపీ న్యూస్ | 7 Mar 2010 | 2:58 am కుటుంబాలకు సాయం చేసేందుకు నిధులు లేవు: మాయావతికృపాల్జీ మహారాజ్ ఆశ్రమంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వ వద్ద నిధులు లేవని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి స్పష్టం చేశారు. అందువల్ల మృతుల కుటుంబలతో పాటు.. క్షతగాత్రులకు కేంద్ర ప్రభుత్వమే ఆర్థిక సాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.Source: జాతీయ | 7 Mar 2010 | 1:00 am క్షమాపణా.. ఆ మాటకు ప్రసక్తే లేదు: చంద్రబాబు నాయుడుఇందిరాపార్కు వద్ద న్యాయవాదులపై జరిగిన దాడి వ్యవహారంలో క్షమాపణ చెపట్టే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై తాము పోరాటం చేసే సమయంలో మరో రాజకీయ పార్టీ కార్యకర్తలు వచ్చి ధర్నాను ఆటంకపరచడం సరికాదన్నారు.Source: ఏపీ న్యూస్ | 6 Mar 2010 | 10:24 pm జనతాదళ్ (యు)లో చీలిక తెచ్చిన మహిళా బిల్లు!మహిళా బిల్లు జనతాదళ్ (యు)లో చీలిక తెచ్చింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బిల్లుకు మద్దతు ప్రకటించారు. కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆ పార్టీకి చెందిన ఎంపీలు రెండుగా చీలిపోయారు. యుపీఏ సంకీర్ణ సర్కారు సోమవారం రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 6 Mar 2010 | 10:14 pm భారతీయ సిబ్బంది కాబూల్‌లోనే ఉంటారు: మంత్రి కృష్ణఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందిలో ఏ ఒక్కరూ వెనక్కి తిరిగి రావడం లేదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ తెలిపారు. ఆఫ్ఘన్‌లో వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది భారత్‌కు వెనక్కి తిరిగి వస్తున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై మంత్రి కృష్ణ స్పందించారు.Source: జాతీయ | 6 Mar 2010 | 10:02 pm "ఎక్స్‌పోజింగ్"తో రప్పించాలనుకుంటే... "సాధ్య"మేనా..?!!విపరీతమైన ఎక్స్‌పోజింగ్‌ను ప్రమోషన్లో చూపించి క్యాష్ చేసుకోవాలనే చీప్ టెక్నిక్‌కు ప్రేక్షకులు పడిపోతారనుకునే రోజులు కావని నిర్మాత తెలుసుకోవాలి. జాతీయస్థాయి నటిగా గుర్తింపు తెచ్చుకుంటేమటుకు ఎక్స్‌పోజింగ్ చేస్తే తప్పేంటని ప్రశ్నించినట్లుంది ఈ సినిమాలో ప్రియమణి పాత్ర. చేసే పనిని పవిత్రంగా భావిస్తే ఇటువంటి చిత్రాలు రావేమో...కథలోకి వెళితే....జీవితంలో ప్రతి దానికి భయపడే మనస్తత్వం గల అమ్మాయి సుహాని (ప్రియమణి). చివరికి ఇంటి వాచ్‌మెన్ నుంచి ఆఫీస్ బాస్‌వరకూ ఎవర్ని చూసినా అదే ఫీలింగ్‌లో ఉంటుంది. ఆ ఫీలింగ్‌తోనే ఆఫీసు నుంచి లేటుగా వస్తుంది. అనుకోకుండా దారిలో కృష్ణప్రసాద్(తనికెళ్ల భరణి) రోడ్డు ప్రమాదంలో చావుబతుల్లో ఉంటే ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి రక్షిస్తుంది. దానికి ప్రతిఫలంగా అతని దగ్గరున్న తుపాకిని సుహానికి ఇచ్చి నీ జీవితంలో నిన్ను విసిగించిన ఎవరినైనా చంపేయమంటాడు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Mar 2010 | 9:30 am "హైస్కూల్"కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. కోర్టు రెడ్ సిగ్నల్హైస్కూల్ టీచర్‌ను ప్రేమించడం... ఆ తర్వాత ఆమెను రకరకాలుగా చుంభించినట్లు ఊహా లోకాల్లోకి విహరించడం, చివర్లో అదంతా తప్పు.. చదువుపై శ్రద్ధ పెట్టడమే హైస్కూల్ విద్యార్థి చేయాల్సిందంటూ... ఉపదేసించే చిత్రం హైస్కూల్. గతంలో ఈ తరహాలో జుగుప్సాకరమైన చిత్రాలు వచ్చినప్పుడు మహిళా సంఘాలు, మానవహక్కుల సంఘాలు థియేటర్ల ఆందోళన చేసేవి. హైస్కూల్ సినిమాకు అదే జరిగింది. గత రెండు నెలలుగా ఇటువంటి కారణంతోనే ఈ చిత్రం విడుదలకు నోచులేకపోయింది.Source: Yahoo! Telugu: Entertainment | 6 Mar 2010 | 8:39 am నిత్యానంద స్వామి రాసలీలలను చిత్రీకరించింది నేనే: లెనిన్ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపిన నిత్యానందస్వామి రాసలీలలను అతని డ్రైవరే చిత్రీకిరంచినట్లు చెన్నై పోలీసులు శనివారం మీడియాకు తెలిపారు.Source: జాతీయ | 6 Mar 2010 | 7:34 am మార్చి 7న అల్లు అర్జున్ "వరుడు" ఆడియోస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం వరుడు ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్చి 7న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దానయ్య మాట్లాడుతూ... అల్లు అర్జున్ పెర్‌ఫార్మెన్స్ హైలెట్‌గా గుణశేఖర్‌గారి ఎక్స్‌లెంట్ టేకింగ్‌తో వరుడు చిత్రం అద్భుతంగా రూపొందింది. ఈ చిత్రానికి మణిశర్మ సూపర్ పాటలు అందించారు. ఈ సూపర్ హిట్ ఆడియోను మార్చి 7న ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నామన్నారు. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన కొత్త హీరోయిన్ నటిస్తుండగా ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య విలన్‌గా నటించడం విశేషంSource: Yahoo! Telugu: Entertainment | 6 Mar 2010 | 6:59 am మార్చి 12న వస్తున్న ఆకాశ రామన్నమన్యం సూర్యనారాయణ సమర్పణలో మెగా బ్రదర్ నాగబాబు ఆశీస్సులతో మన్యం ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై క్రేజీ యంగ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్, అశోక్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ఆకాశరామన్న. అల్లరి నరేష్, శివాజీ, రాజీవ్ కనకాల హీరోలుగా, మీరా జాస్మిన్, గౌరీ పండిట్‌లు కథానాయికలుగా ఒక విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.Source: Yahoo! Telugu: Entertainment | 6 Mar 2010 | 6:47 am 122 కేంద్రాల్లో "నమో వెంకటేశ" అర్థ శతదినోత్సవంవిక్టరీ వెంకటేష్‌తో హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ డి. సురేష్ బాబు సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన నమో వెంకటేశ అర్థ శతదినోత్సవం పూర్తి చేసుకుని శరవేగంతో శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... 122 కేంద్రాల్లో నమో వెంకటేశ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుని 100 రోజులను చేరుకునేందుకు పరుగులు తీస్తోంది. మా బ్యానర్లో తొలి చిత్రం ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, వెంకటేష్ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Mar 2010 | 6:41 am మహిళా బిల్లు మా పార్టీకి చెందిన కల: నితిన్ గడ్కారీలోక్సభలో మహిళా బిల్లును ప్రవేశపెట్టడం తమ పార్టీ కల అని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ అభిప్రాయపడ్డారుSource: జాతీయ | 6 Mar 2010 | 6:14 am 155 కేంద్రాల్లో ఎన్టీఆర్ "అదుర్స్" అర్థ శతదినోత్సవంయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో కొడాలి నాని సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మించిన అదుర్స్ దిగ్విజయంగా అర్థ శతదినోత్సవం పూర్తి చేసుకుని శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 6 Mar 2010 | 6:01 am చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి: న్యాయవాదులురాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద శనివారం న్యాయవాదులపై తెలుగుదేశంపార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలంగాణ న్యాయావదుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది.Source: ఏపీ న్యూస్ | 6 Mar 2010 | 5:36 am తెలంగాణ న్యాయవాదులపై దాడులను ఖండించిన కాంగ్రెస్తెలంగాణ న్యాయవాదులపై శనివారం తెలుగు దేశం పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు దాడులకు పాల్పడటం సిగ్గు చేటని కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 6 Mar 2010 | 5:26 am "ఎక్స్‌పోజింగ్"తో రప్పించాలనుకుంటే... "సాధ్య"మేనా..?!!విపరీతమైన ఎక్స్‌పోజింగ్‌ను ప్రమోషన్లో చూపించి క్యాష్ చేసుకోవాలనే చీప్ టెక్నిక్‌కు ప్రేక్షకులు పడిపోతారనుకునే రోజులు కావని నిర్మాత తెలుసుకోవాలి. జాతీయస్థాయి నటిగా గుర్తింపు తెచ్చుకుంటేమటుకు ఎక్స్‌పోజింగ్ చేస్తే తప్పేంటని ప్రశ్నించినట్లుంది ఈ సినిమాలో ప్రియమణి పాత్ర. చేసే పనిని పవిత్రంగా భావిస్తే ఇటువంటి చిత్రాలు రావేమో...Source: వినోదం | 6 Mar 2010 | 4:02 am తెలంగాణ న్యాయవాదులు- తెదేపా నాయకులకు మధ్య ఘర్షణరాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద తెలుగు దేశం పార్టీ నేతలు వామపక్ష నేతలతో కలిసి ధరల పెంపుదలపై శనివారం మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాట్లాడుతుండగా తెలంగాణ ప్రాంతానికి చెందిన న్యాయవాదులు అడ్డుకున్నారు. ప్రత్యేక తెలంగాణపై చంద్రబాబు తన వైఖరేంటో ఇక్కడే చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ తెలుగు దేశం కార్యకర్తలకు తెలంగాణ న్యాయవాదులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు న్యాయవాదులు తీవ్రంగా గాయపడ్డారుSource: ఏపీ న్యూస్ | 6 Mar 2010 | 3:54 am మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధానిమహిళా సంక్షేమానికి యూపీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ పునరుద్ఘాటించారు. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టడానికి తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇంకా మహిళల సామాజిక, రాజకీయ సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు.Source: జాతీయ | 6 Mar 2010 | 3:16 am "హైస్కూల్"కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. కోర్టు రెడ్ సిగ్నల్హైస్కూల్ టీచర్‌ను ప్రేమించడం... ఆ తర్వాత ఆమెను రకరకాలుగా చుంభించినట్లు ఊహా లోకాల్లోకి విహరించడం, చివర్లో అదంతా తప్పు.. చదువుపై శ్రద్ధ పెట్టడమే హైస్కూల్ విద్యార్థి చేయాల్సిందంటూ... ఉపదేసించే చిత్రం హైస్కూల్. గతంలో ఈ తరహాలో జుగుప్సాకరమైన చిత్రాలు వచ్చినప్పుడు మహిళా సంఘాలు, మానవహక్కుల సంఘాలు థియేటర్ల ఆందోళన చేసేవి. హైస్కూల్ సినిమాకు అదే జరిగింది. గత రెండు నెలలుగా ఇటువంటి కారణంతోనే ఈ చిత్రం విడుదలకు నోచులేకపోయింది.Source: వినోదం | 6 Mar 2010 | 3:10 am యూపీలో ఇండియన్ ముజాహిద్ధీన్ తీవ్రవాది అరెస్టు!ఇండియన్ ముజాహిద్ధీన్ తీవ్రవాద సంస్థకు చెందిన సల్మాన్ అనే ఉగ్రవాదిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన తీవ్రవాద వ్యతిరేక దళం శనివారం అరెస్టు చేసింది. సల్మాన్ అలియాస్ చోటు అని పిలువబడే ఈ తీవ్రవాదిని యూపీలోని సిద్ధార్థ నగర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.Source: జాతీయ | 6 Mar 2010 | 3:07 am ధరల పెరుగదలపై ఆందోళన_ తెదేపా, వామపక్ష నేతల అరెస్ట్రాష్ట్రంలో పెరగిన నిత్యావసర సరుకుల ధరలపై తెలుగుదేశం పార్టీ వామపక్ష నేతలతో కలిసి శనివారం రాష్ట్ర రాజధానిలో తీవ్రమైన ఆందోళనా కార్యక్రమం నిర్వహించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 6 Mar 2010 | 2:18 am ప్రధానోపాధ్యాయుడిని కిడ్నాప్ చేసిన మావోలురాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి రబీ లోచన్ మిత్రాను మావోలు హతమార్చడంతో ఆరుగురు గ్రామస్థులను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఆరుగురు గ్రామస్తులను వెంటనే ప్రభుత్వం విడుదల చేయకపోతే తాము కిడ్నాప్ చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని హతమారుస్తామని మావోయిస్టుల బృందం పేర్కొంది.Source: జాతీయ | 6 Mar 2010 | 2:02 am మార్చి 7న అల్లు అర్జున్ "వరుడు" ఆడియోస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం వరుడు ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్చి 7న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దానయ్య మాట్లాడుతూ... అల్లు అర్జున్ పెర్‌ఫార్మెన్స్ హైలెట్‌గా గుణశేఖర్‌గారి ఎక్స్‌లెంట్ టేకింగ్‌తో వరుడు చిత్రం అద్భుతంగా రూపొందింది. ఈ చిత్రానికి మణిశర్మ సూపర్ పాటలు అందించారు. ఈ సూపర్ హిట్ ఆడియోను మార్చి 7న ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నామన్నారు. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన కొత్త హీరోయిన్ నటిస్తుండగా ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య విలన్‌గా నటించడం విశేషంSource: వినోదం | 6 Mar 2010 | 1:29 am
|