|
ధరల పెరుగదలపై ఆందోళన_ తెదేపా, వామపక్ష నేతల అరెస్ట్రాష్ట్రంలో పెరగిన నిత్యావసర సరుకుల ధరలపై తెలుగుదేశం పార్టీ వామపక్ష నేతలతో కలిసి శనివారం రాష్ట్ర రాజధానిలో తీవ్రమైన ఆందోళనా కార్యక్రమం నిర్వహించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.Source: Yahoo! Telugu: News | 6 Mar 2010 | 7:48 am ప్రధానోపాధ్యాయుడిని కిడ్నాప్ చేసిన మావోలురాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి రబీ లోచన్ మిత్రాను మావోలు హతమార్చడంతో ఆరుగురు గ్రామస్థులను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఆరుగురు గ్రామస్తులను వెంటనే ప్రభుత్వం విడుదల చేయకపోతే తాము కిడ్నాప్ చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని హతమారుస్తామని మావోయిస్టుల బృందం పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 6 Mar 2010 | 7:32 am మార్చి 7న అల్లు అర్జున్ "వరుడు" ఆడియోస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం వరుడు ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్చి 7న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దానయ్య మాట్లాడుతూ... అల్లు అర్జున్ పెర్‌ఫార్మెన్స్ హైలెట్‌గా గుణశేఖర్‌గారి ఎక్స్‌లెంట్ టేకింగ్‌తో వరుడు చిత్రం అద్భుతంగా రూపొందింది. ఈ చిత్రానికి మణిశర్మ సూపర్ పాటలు అందించారు. ఈ సూపర్ హిట్ ఆడియోను మార్చి 7న ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నామన్నారు. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన కొత్త హీరోయిన్ నటిస్తుండగా ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య విలన్‌గా నటించడం విశేషంSource: Yahoo! Telugu: Entertainment | 6 Mar 2010 | 6:59 am ప్రముఖ పారిశ్రామిక వేత్త జిపి బిర్లా కన్నుమూతగత కొద్ది రోజులుగా అస్వస్థతకు గురైన జిపి బిర్లా(86) శనివారం కోలకతాలోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. దేశంలో ప్రముఖ వ్యాపార వేత్త అయిన జిపి బిర్లా సికే బిర్లా తనయుడు. సికే బిర్లా జిపి-సికే బిర్లా గ్రూపు కంపెనీలకు ఛైర్మెన్‌గా వ్యవహరిచే వారు.Source: Yahoo! Telugu: News | 6 Mar 2010 | 6:50 am మార్చి 12న వస్తున్న ఆకాశ రామన్నమన్యం సూర్యనారాయణ సమర్పణలో మెగా బ్రదర్ నాగబాబు ఆశీస్సులతో మన్యం ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై క్రేజీ యంగ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్, అశోక్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ఆకాశరామన్న. అల్లరి నరేష్, శివాజీ, రాజీవ్ కనకాల హీరోలుగా, మీరా జాస్మిన్, గౌరీ పండిట్‌లు కథానాయికలుగా ఒక విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.Source: Yahoo! Telugu: Entertainment | 6 Mar 2010 | 6:47 am 122 కేంద్రాల్లో "నమో వెంకటేశ" అర్థ శతదినోత్సవంవిక్టరీ వెంకటేష్‌తో హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ డి. సురేష్ బాబు సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన నమో వెంకటేశ అర్థ శతదినోత్సవం పూర్తి చేసుకుని శరవేగంతో శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... 122 కేంద్రాల్లో నమో వెంకటేశ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుని 100 రోజులను చేరుకునేందుకు పరుగులు తీస్తోంది. మా బ్యానర్లో తొలి చిత్రం ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, వెంకటేష్ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Mar 2010 | 6:41 am పెరిగిన సిగరెట్టు ధరలు ఆహ్వానించ దగ్గ విషయం: ఐటిసిదేశంలోని ధూమపాన ప్రియులకు ధూమపానం కాసింత ఘాటుగా మారే అవకాశాలున్నాయి. ఇటీవల బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంకం పెంచడంతో తప్పని పరిస్థితుల్లో సిగరెట్టు ధరలను పెంచక తప్పడం లేదని ఐటిసి తెలిపింది.Source: Yahoo! Telugu: News | 6 Mar 2010 | 6:34 am ధరలు దిగివచ్చే దాకా ఉద్యమం చేస్తాం: బాబుపెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే దాకా ఉద్యమం ఆగదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెట్రో ధరలు పెంచి తద్వారా ఆహార పదార్థాల పెరుగుదలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయనీ, ఫలితంగా సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు.Source: Yahoo! Telugu: News | 6 Mar 2010 | 6:21 am భారతీయ జనతా పార్టీ అధినేతగా ఎన్నికైన కిషన్రెడ్డిభాజపా రాష్ట్ర అధ్యక్షునిగా తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, అంబర్ పేట ఎమ్మెల్యేగానున్న జి. కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ శనివారం ప్రకటించింది.Source: Yahoo! Telugu: News | 6 Mar 2010 | 6:17 am శ్రీలంకలో నిరుపమా రావు మూడో రోజుల పర్యటనకేంద్ర విదేశాంగ మంత్రి నిరుపమా రావు శ్రీలంక పర్యటన చేపట్టనున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటన కోసం శనివారం నిరుపమా రావు శ్రీలంకకు చేరుకోనున్నారు. శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సే మరియు ఆ దేశ విదేశాంగ మంత్రి రోహితా బొగొల్లగమతో నిరుపమా రావులతో భేటీ కానున్నారు.Source: Yahoo! Telugu: News | 6 Mar 2010 | 6:05 am 155 కేంద్రాల్లో ఎన్టీఆర్ "అదుర్స్" అర్థ శతదినోత్సవంయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో కొడాలి నాని సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మించిన అదుర్స్ దిగ్విజయంగా అర్థ శతదినోత్సవం పూర్తి చేసుకుని శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 6 Mar 2010 | 6:01 am ఏకాభిప్రాయం పేరుతో కాలయాపన చేయకండి: కోదండరామ్ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై ఏకాభిప్రాయం, కమిటీల పేరుతో కాలయాపన చేయకండని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ శనివారం హైదరాబాద్‌లో అన్నారు.Source: Yahoo! Telugu: News | 6 Mar 2010 | 5:59 am దూసుకుపోతున్న ఆహార ద్రవ్యోల్బణం: 17.87%ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతోంది. ఫిబ్రవరి 20 వారాంతానికి అది 17.87 శాతంగా నమోదైంది. పాలు, గోధుమలు, బియ్యం, కూరగాయల ధరలు భగ్గుమనడంతో ఆహార ద్రవ్యోల్బణం మరోసారి చుక్కలను చూస్తోంది. అంతకుముందు వారం ఇది 17.58 శాతంగా నమోదైంది.Source: Yahoo! Telugu: News | 6 Mar 2010 | 5:44 am ఇరాక్ ఎన్నికలను వెంటనే ఆపండి..!: అల్‌ఖైదా హెచ్చరికఇరాక్ పార్లమెంట్ ఎన్నికలు ఆదివారం జరుగనున్న నేపథ్యంలో, ప్రముఖ తీవ్రవాద సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇరాక్ పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోకూడదని అల్‌ఖైదా హెచ్చరించింది. అలాగాకుండా ప్రజలు ఓటువేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అల్‌ఖైదా హెచ్చరించింది.Source: Yahoo! Telugu: News | 6 Mar 2010 | 5:15 am యూపీలో ఇండియన్ ముజాహిద్ధీన్ తీవ్రవాది అరెస్టు!ఇండియన్ ముజాహిద్ధీన్ తీవ్రవాద సంస్థకు చెందిన సల్మాన్ అనే ఉగ్రవాదిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన తీవ్రవాద వ్యతిరేక దళం శనివారం అరెస్టు చేసింది. సల్మాన్ అలియాస్ చోటు అని పిలువబడే ఈ తీవ్రవాదిని యూపీలోని సిద్ధార్థ నగర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.Source: జాతీయ | 6 Mar 2010 | 3:07 am ధరల పెరుగదలపై ఆందోళన_ తెదేపా, వామపక్ష నేతల అరెస్ట్రాష్ట్రంలో పెరగిన నిత్యావసర సరుకుల ధరలపై తెలుగుదేశం పార్టీ వామపక్ష నేతలతో కలిసి శనివారం రాష్ట్ర రాజధానిలో తీవ్రమైన ఆందోళనా కార్యక్రమం నిర్వహించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 6 Mar 2010 | 2:18 am ప్రధానోపాధ్యాయుడిని కిడ్నాప్ చేసిన మావోలురాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి రబీ లోచన్ మిత్రాను మావోలు హతమార్చడంతో ఆరుగురు గ్రామస్థులను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఆరుగురు గ్రామస్తులను వెంటనే ప్రభుత్వం విడుదల చేయకపోతే తాము కిడ్నాప్ చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని హతమారుస్తామని మావోయిస్టుల బృందం పేర్కొంది.Source: జాతీయ | 6 Mar 2010 | 2:02 am ధరలు దిగివచ్చే దాకా ఉద్యమం చేస్తాం: బాబుపెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే దాకా ఉద్యమం ఆగదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెట్రో ధరలు పెంచి తద్వారా ఆహార పదార్థాల పెరుగుదలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయనీ, ఫలితంగా సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు.Source: ఏపీ న్యూస్ | 6 Mar 2010 | 12:52 am భారతీయ జనతా పార్టీ అధినేతగా ఎన్నికైన కిషన్రెడ్డిభాజపా రాష్ట్ర అధ్యక్షునిగా తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, అంబర్ పేట ఎమ్మెల్యేగానున్న జి. కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ శనివారం ప్రకటించింది.Source: ఏపీ న్యూస్ | 6 Mar 2010 | 12:50 am ఏకాభిప్రాయం పేరుతో కాలయాపన చేయకండి: కోదండరామ్ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై ఏకాభిప్రాయం, కమిటీల పేరుతో కాలయాపన చేయకండని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ శనివారం హైదరాబాద్‌లో అన్నారు.Source: ఏపీ న్యూస్ | 6 Mar 2010 | 12:31 am సహాయ చర్యలకు నిధుల్లేవు.. ఖజానా ఖాళీ: మాయఉత్తరప్రదేశ్లోని ఓ ఆశ్రమంలో జరిగిన తొక్కిసలాట ఉదంతంపై తగిన సహాయ చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ఖజానాలో నిధులు లేవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి పేర్కొన్నారు. ప్రతాప్‌ఘర్ జిల్లాలోని మన్గర్ గ్రామంలోని క్రిపాల్ మహరాజ్ ఆశ్రమంలో గత గురువారం తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో 26 మంది చిన్నారులు, 37 మంది మహిళలతో పాటు 63 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 6 Mar 2010 | 12:09 am ముంబయి మహానగరం అందరిది: బాల్ థాకరేబాల్ థాకరే, శివసేన పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో ముంబయి మహానగరం వ్యవహారంపై తన భావాలను వెల్లడించారు. ముంబయి నగరానికి వచ్చిన వలస ప్రజలందరూ కలసిమెలసి సంతోషంగా నగరంలో జీవించవచ్చని, ఇది అందరికీ చెందుతుందని చెప్పుకున్నారు.Source: జాతీయ | 5 Mar 2010 | 11:45 pm సీఎం వైఖరిపై విపక్షాల ఆగ్రహం, వివరణ ఇచ్చిన రోశయ్యశాసనసభలో శుక్రవారం ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య సభలో వ్యవహరించిన తీరుపై విపక్షాలు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి వైఖరికి నిరసన తెలిపిన తర్వాతే సభను సజావుగా నిర్వహిస్తామని విపక్షాలు శాసనసభాపతి కిరణ్‌కుమార్ రెడ్డికి తేల్చి చెప్పాయి. దీంతో ముఖ్యమంత్రి రోశయ్య వివరణ ఇచ్చుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 5 Mar 2010 | 11:05 pm రంగుల హోళీతో పుట్టినరోజు జరుపుకున్న చౌహాన్మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 51వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన తన పుట్టిన రోజు మరియు రంగ్ పంచమి (హోళీ) వేడుకల్లో చౌహాన్ ఉత్సాహంతో పాల్గొన్నారు.Source: జాతీయ | 5 Mar 2010 | 10:41 pm నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి: తెదేపాప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరలను రాష్ట్ర ప్రభుత్వం అదుపు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ఇది ప్రారంభం మాత్రమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు శనివారం స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 5 Mar 2010 | 10:40 pm ఆంధ్రప్రదేశ్ విభజనకు ఏకాభిప్రాయం కావాలి: ప్రధానిరాష్ట్ర విభజన విషయంలో దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రధాని నోరు విప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై ఏకాభిప్రాయం అవసరమని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు.Source: జాతీయ | 5 Mar 2010 | 8:36 pm కిరణ్ రాథోడ్ "హైస్కూల్" వాల్‌పోస్టర్లపై పేడపాఠశాలలో చదువుకునే విద్యార్థి, ప్రౌఢ సుందరితో ప్రేమాయణం నేపధ్యంలో తెరకెక్కిన చిత్రం హైస్కూల్. ఈ చిత్రంలో ప్రౌఢ సుందరిగా కిరణ్ రాథోడ్ నటించింది. ఈ సినిమాలో బాలునితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇటువంటి సినిమాలు సమాజాన్ని పక్కదోవ పట్టిస్తాయని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు హైస్కూల్ సినిమాను విడుదల చేయకుండా చూడాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళకు దిగారు. కొంతమంది ఆందోళనకారులు హైస్కూల్ చిత్రానికి సంబంధించిన వాల్ పోస్టర్లపై పశువుల పేడని విసిరి తమ నిరసనను తెలిపారు. ఇదిలావుండగా హైస్కూలు చిత్రం విడుదల నిలిపి వేయాలంటూ హైకోర్టు స్టే విధించింది.Source: Yahoo! Telugu: Entertainment | 5 Mar 2010 | 12:00 pm "లీడర్" రానాను చూసి జూనియర్ ఎన్టీఆర్ "అదుర్స్"కుర్ర హీరోల్లో ఎవరి ఫాలోయింగ్ వారికే సొంతంగా ఉంటుంది. కానీ కొంతమంది నూతన కథానాయకుల స్టామినా చూసినప్పుడు అప్పటికే ఫీల్డ్‌లో ఉన్న యువ హీరోలకు గుబులు పట్టుకుంటుంది. ప్రస్తుతం అటువంటి గుబులులో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడని టాలీవుడ్ సినీజనం అంటున్నారు. శేఖర్ కమ్ముల చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన "లీడర్" రానా, తొలి చిత్రంతోనే సూపర్ మార్కులు కొట్టేశాడు. బేస్ నుంచి వాయిస్ దాకా దుమ్ము లేపాడు. దానికితోడు అతని హావభావాలు సైతం చూడముచ్చటగా ఉన్నాయని చూసిన జనం అంటున్నారు. అంతేకాదు... ఇటీవల లీడర్ సక్సెస్ నేపధ్యంలో ఓ ఫంక్షన్ ఏర్పాటు చేస్తే.. అక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆయా పౌరాణికాల్లో వల్లెవేసిన భారీ డైలాగులను ఏకబిగిన చెప్పేశాడట. దీంతో అక్కడున్న నందమూరి ఫ్యాన్స్ అంతా ఒహటే ఈలలు... చప్పట్లట.వీటిని ఆస్వాదించినవారు, రానాకు పౌరాణిక, చారత్రక సినిమాల్లోనూ నటించే సత్తా ఉందని చాలా మంది అతనిపై పొగడ్తల వర్షం కురిపించారట. పొడగరి కూడా అయిన రానా, నాడు ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల్లో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నారో... అలాగే రానా కూడా ఆకట్టుకోగలరని అన్నారట.Source: Yahoo! Telugu: Entertainment | 5 Mar 2010 | 8:42 am ఇది "జలగ" ప్రభుత్వం: నాగం జనార్థన్ రెడ్డిప్రజలపై తమ ఇష్టం వచ్చిన రీతిలో పన్నులు వేసి డబ్బులు రాబట్టుకోవడమే పనిగా రోశయ్య సర్కార్ పెట్టుకున్నదని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి విమర్శించారు. ఒకవైపు ప్రజలు నిత్యావసర ధరలు పెరిగిపోయి నానా యాతనలు పడుతుంటే వ్యాట్ పన్నును 14.5 శాతం చేసి ధరలకు మరింత ఆజ్యం పోసిందన్నారు.Source: ఏపీ న్యూస్ | 5 Mar 2010 | 8:08 am భాజపా రాష్ట్ర రథసారథిగా జి.కిషన్ రెడ్డి ఎన్నిక!భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను శనివారం భాజపా అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది.Source: ఏపీ న్యూస్ | 5 Mar 2010 | 5:26 am మహిళా బిల్లు: విప్‌ను జారీ చేసిన కాంగ్రెస్-భాజపామహిళా బిల్లుకు మోక్షం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ జరిగింది. ఈ బిల్లు సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు సందర్భంగా సభ్యులందరూ సభలో ఉండాలని అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీలు విప్‌ను జారీ చేశాయి. మూడు లైన్లతో కూడిన ఈ విప్ ప్రకటనను శుక్రవారం జారీ చేశాయి.Source: జాతీయ | 5 Mar 2010 | 5:15 am బిల్డర్ లవ్‌లో టబు: మగాడితో తిరిగితే అది లవ్వేనా...?!!మొన్నటివరకూ టబుకు టాలీవుడ్‌లో నాగార్జునతో ఎఫైర్ ఉండేదని వార్తలు వస్తుండేవి. హైదరాబాద్‌లోనే ఆమె ఎక్కువగా గడపడానికి కారణం అదేనని చాలామంది చెవినిల్లు కట్టుక మరీ చెపుతుండేవారు. కానీ ఇటీవల టబు రూటు మార్చిందని తెలుస్తోంది.హైదరాబాదుకు చెందిన పెద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ సంస్థ బిల్డర్‌తో ప్రేమలో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అతని పేరు ఇంకా బయటకు రాలేదు. ఈ మధ్యకాలంలో టబు ఎక్కడికి వెళ్లినా అతను ఆమె పక్కనే ఉండటంతో వ్యవహారం గుప్పుమంది. ఆ మధ్య వైశ్రాయ్ హోటల్ కొత్తగా ప్రారంభించిన శాఖ ప్రారంభోత్సవానికి విఐపీలు వచ్చారు. అక్కడ తళుక్కుమని మెరిసి మళ్లీ మాయమైందట. అయితే ఓ మగాడితో కలిసి నడిచినంత మాత్రాన లవ్ అనేయడమేనా...? అని టబు కస్సుబుస్సు లాడుతోందట. రాసుకు పూసుకు తిరుగుతుంటే లవ్ కాక మరేమిటో...? అని ప్రశ్నిస్తున్నారు టాలీవుడ్ సినీజనం.Source: Yahoo! Telugu: Entertainment | 5 Mar 2010 | 5:05 am సమంత - నాగచైతన్యల "ఏ మాయ చేసావె" ట్రెయిలర్అక్కినేని నాగేశ్వర రావు మనవడు, నాగార్జున కుమారుడు నాగచైతన్య నటించిన ఏ మాయ చేసావె చిత్రం విజయవంతమైంది. ఇందిరా ప్రొడక్షన్ పతాకంపై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ట్రూత్ లవ్ స్టోరీగా మార్కులు కొట్టేసింది. నాగచైతన్యకు- సమంతలకు నిజమైన బ్రేక్ చిత్రంగా "ఏ మాయ చేసావే" నిలిచి పోతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 5 Mar 2010 | 4:40 am తెలంగాణ ఏర్పడితే ఐఎస్ఐ గుప్పిట్లో రాష్ట్రం: లగడపాటిప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే రాష్ట్రం పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ గుప్పెట్లోకి వెళ్లిపోతుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమానికి కేవలం పదేళ్ళ చరిత్ర మాత్రమే ఉందన్నారు.Source: ఏపీ న్యూస్ | 5 Mar 2010 | 3:29 am ఏప్రిల్ నుంచి రాజకీయ నేతలతో చర్చలు: శ్రీకృష్ణ కమిటీఏప్రిల్ నెల నుంచి రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలతో చర్చలు ప్రారంభిస్తామని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ వెల్లడించింది. రెండు రోజుల రాష్ట్ర తొలి పర్యటన విజయవంతంగా ముగిసినట్టు కమిటీ సభ్యులు ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 5 Mar 2010 | 3:21 am టెండూల్కర్‌పై శివసేన చీఫ్ బాల్‌థాక్రే ప్రశంసల వర్షం!ప్రాంతీయాభిమానంపై "టీం ఇండియా" క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై ఇటీవల దుమ్మెత్తిపోసిన శివసేన పార్టీ ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 20 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తోన్న సచిన్ టెండూల్కర్‌ను మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీతో సమానంగా కొనియాడింది.Source: జాతీయ | 5 Mar 2010 | 2:43 am
|