టెండూల్కర్‌పై శివసేన చీఫ్ బాల్‌థాక్రే ప్రశంసల వర్షం!

ప్రాంతీయాభిమానంపై "టీం ఇండియా" క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై ఇటీవల దుమ్మెత్తిపోసిన శివసేన పార్టీ ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 20 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తోన్న సచిన్ టెండూల్కర్‌ను మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీతో సమానంగా కొనియాడింది.
Source: Yahoo! Telugu: News | 5 Mar 2010 | 8:13 am

7.5 శాతం ఆర్థిక వృద్ధిని సాధిస్తాం: ప్రధాని మన్మోహన్

లోక్ సభలో ప్రధాని మాట్లాడుతూ... ఈ ఆర్థిక సంవత్సరంలో 7.2 నుంచి 7.5 మధ్య ఆర్థికాభివృద్ధిని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నాటికి ఖచ్చితంగా 8 శాతం వృద్ధిని సాధిస్తామన్న విశ్వాసం తనకున్నదన్నారు.
Source: Yahoo! Telugu: News | 5 Mar 2010 | 8:09 am

భారతీయ బాలుడి మృతిపై కెవిన్ రుఢ్ తీవ్ర ఖండన!

మూడేళ్ళ భారతీయ బాలుడు దారుణ హత్యకు గురికావడం పట్ల ఆస్ట్రేలియా ప్రధాని కెవిన్ రుఢ్‌తో పాటు.. విక్టోరియా ప్రధానమంత్రి జాన్ బ్రుంబీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యను వారు ఖండించారు. దీనిపై రుఢ్ మాట్లాడుతూ.. ఇది ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసే అంశం. ఈ రోజు ఉదయాన్నే వార్తాకథనాలు చూశాను. గత రాత్రి ఈ వార్తను విన్నాను అని చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 5 Mar 2010 | 8:03 am

పుంజుకున్న స్టాక్ మార్కెట్: లాభాల్లో సెన్సెక్స్

శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగుతోంది. క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌‌కేర్, టెక్, పవర్, ఎఫ్ఎమ్‌సీజీ, ఆటో, బ్యాంక్, పీఎస్‌యూ, ఐటీ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో సెన్సెక్స్, నిఫ్టీలు పుంజుకున్నాయి. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 44 పాయింట్లు వృద్ధి చెంది, 17,016 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 16 పాయింట్లు బలపడి, 5,097 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 5 Mar 2010 | 8:02 am

స్వల్ప నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్

శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ ఆశాజనకంగా ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే పుంజుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో స్వల్ప నష్టాలను చవిచూసింది.ఫలితంగా బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ పది పాయింట్లు పతనమై, 16,961 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం ఐదు పాయింట్లు స్వల్పంగా పడిపోయి, 5,074 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 5 Mar 2010 | 7:23 am

ఆందోళన కలిగిస్తున్న పెరిగిన ధరలు: మన్మోహన్

దేశంలో పెరుగుతున్న నిత్యావసర వస్తు ధరలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ పెరిగిన ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 5 Mar 2010 | 6:49 am

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం: రాష్ట్ర వాసుల మృతి!

మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు హైదరాబాద్ వాసులతో పాటు తొమ్మిది మృత్యువాత పడ్డారు. మరికొందరు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
Source: Yahoo! Telugu: News | 5 Mar 2010 | 6:28 am

వస్తే కొండ.. పోతే వెంట్రుక: మంత్రి బొత్స సత్యనారాయణ

రాష్ట్ర విభజనపై తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తనకు మద్దతుగా మరికొంత మంది చేరి ఉద్యమం చేయడం వల్లే జై ఆంధ్ర వస్తే కొండ లభించినట్టే కదా అన్నారు. రాకుంటే తానొక్కడినే కదా నష్టపోతాను అని అన్నారు.
Source: Yahoo! Telugu: News | 5 Mar 2010 | 6:26 am

ఆసియా మార్కెట్ ప్రభావం: లాభాల్లో స్టాక్ మార్కెట్

వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి పురోగమనం దిశగా పయనించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 69 పాయింట్లు పుంజుకుని, 17,041 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 14 పాయింట్లు బలపడి, 5,094 పాయింట్ల మార్కును తాకింది.
Source: Yahoo! Telugu: News | 5 Mar 2010 | 5:48 am

తెదేపా తెలంగాణ ఫోరం ఏర్పాటు: సీమాంధ్రలో నిరసనలు!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనంలో భాగంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల తెలంగాణ ప్రాంతంలో పార్టీ పరిస్థితి మెరుగుపడినా.. సీమాంధ్ర ప్రాంతాల్లో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు.
Source: Yahoo! Telugu: News | 5 Mar 2010 | 5:30 am

బిల్డర్ లవ్‌లో టబు: మగాడితో తిరిగితే అది లవ్వేనా...?!!

మొన్నటివరకూ టబుకు టాలీవుడ్‌లో నాగార్జునతో ఎఫైర్ ఉండేదని వార్తలు వస్తుండేవి. హైదరాబాద్‌లోనే ఆమె ఎక్కువగా గడపడానికి కారణం అదేనని చాలామంది చెవినిల్లు కట్టుక మరీ చెపుతుండేవారు. కానీ ఇటీవల టబు రూటు మార్చిందని తెలుస్తోంది.హైదరాబాదుకు చెందిన పెద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ సంస్థ బిల్డర్‌తో ప్రేమలో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అతని పేరు ఇంకా బయటకు రాలేదు. ఈ మధ్యకాలంలో టబు ఎక్కడికి వెళ్లినా అతను ఆమె పక్కనే ఉండటంతో వ్యవహారం గుప్పుమంది. ఆ మధ్య వైశ్రాయ్ హోటల్ కొత్తగా ప్రారంభించిన శాఖ ప్రారంభోత్సవానికి విఐపీలు వచ్చారు. అక్కడ తళుక్కుమని మెరిసి మళ్లీ మాయమైందట. అయితే ఓ మగాడితో కలిసి నడిచినంత మాత్రాన లవ్ అనేయడమేనా...? అని టబు కస్సుబుస్సు లాడుతోందట. రాసుకు పూసుకు తిరుగుతుంటే లవ్ కాక మరేమిటో...? అని ప్రశ్నిస్తున్నారు టాలీవుడ్ సినీజనం.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Mar 2010 | 5:05 am

సమంత - నాగచైతన్యల "ఏ మాయ చేసావె" ట్రెయిలర్

అక్కినేని నాగేశ్వర రావు మనవడు, నాగార్జున కుమారుడు నాగచైతన్య నటించిన ఏ మాయ చేసావె చిత్రం విజయవంతమైంది. ఇందిరా ప్రొడక్షన్ పతాకంపై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ట్రూత్ లవ్ స్టోరీగా మార్కులు కొట్టేసింది. నాగచైతన్యకు- సమంతలకు నిజమైన బ్రేక్ చిత్రంగా "ఏ మాయ చేసావే" నిలిచి పోతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Mar 2010 | 4:40 am

టెండూల్కర్‌పై శివసేన చీఫ్ బాల్‌థాక్రే ప్రశంసల వర్షం!

ప్రాంతీయాభిమానంపై "టీం ఇండియా" క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై ఇటీవల దుమ్మెత్తిపోసిన శివసేన పార్టీ ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 20 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తోన్న సచిన్ టెండూల్కర్‌ను మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీతో సమానంగా కొనియాడింది.
Source: జాతీయ | 5 Mar 2010 | 2:43 am

ఆందోళన కలిగిస్తున్న పెరిగిన ధరలు: మన్మోహన్

దేశంలో పెరుగుతున్న నిత్యావసర వస్తు ధరలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ పెరిగిన ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు.
Source: జాతీయ | 5 Mar 2010 | 1:19 am

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం: రాష్ట్ర వాసుల మృతి!

మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు హైదరాబాద్ వాసులతో పాటు తొమ్మిది మృత్యువాత పడ్డారు. మరికొందరు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
Source: ఏపీ న్యూస్ | 5 Mar 2010 | 12:58 am

వస్తే కొండ.. పోతే వెంట్రుక: మంత్రి బొత్స సత్యనారాయణ

రాష్ట్ర విభజనపై తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తనకు మద్దతుగా మరికొంత మంది చేరి ఉద్యమం చేయడం వల్లే జై ఆంధ్ర వస్తే కొండ లభించినట్టే కదా అన్నారు. రాకుంటే తానొక్కడినే కదా నష్టపోతాను అని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 5 Mar 2010 | 12:57 am

తెదేపా తెలంగాణ ఫోరం ఏర్పాటు: సీమాంధ్రలో నిరసనలు!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనంలో భాగంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల తెలంగాణ ప్రాంతంలో పార్టీ పరిస్థితి మెరుగుపడినా.. సీమాంధ్ర ప్రాంతాల్లో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 5 Mar 2010 | 12:00 am

తెలంగాణలో ప్రధాని జోక్యం చేసుకోవాలి: వెంకయ్య

తెలంగాణ అంశంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ సమావేశాల్లో భాగంగా ఆయన తెలంగాణ అంశంపై మాట్లాడారు. రాష్ట్రం ఉద్యమ ఆందోళనల కారణంగా అట్టుడికి పోతుంటే.. కేంద్రం మాత్రం శ్రీకృష్ణ కమిటీతో కాలయాపన చేస్తోందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Mar 2010 | 11:59 pm

పైలట్ల తప్పిదం వల్లే వైఎస్ దుర్మరణ: మంత్రి పటేల్

పైలట్ల తప్పిదం వల్లే ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి మృత్యువాత పడ్డారని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి ప్రఫుల్ పటేల్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఏవియేషన్ షో -2010లో పాల్గొన్న ఆయన గురువారం మాట్లాడుతూ.. పైలట్ల తప్పిదమే వైఎస్‌ను బలితీసుకుందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Mar 2010 | 11:30 pm

ఆర్టీఐ చట్టం: మన్మోహన్-సోనియాల మధ్య విభేదాలు!

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ల మధ్య విభేదాలు పొడచూపినట్టు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధి నుంచి మినహాయించే అంశంలో ఈ అభిప్రాయభేదాలు తలెత్తినట్టు సమాచారం.
Source: జాతీయ | 4 Mar 2010 | 11:17 pm

హరీష్ రావుకు తెదేపా సభ్యుడు మైనంపల్లి సవాల్!

తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ ఎమ్మెల్యే హరీష్ రావుకు తెలుగుదేశం పార్టీ సభ్యుడు మైనంపల్లి హనుమంతరావు ఒక సవాల్ విసిరారు. తాను తన స్థానానికి రాజీనామా చేసి, ఆ సీటును తెలంగాణ కోసం అమరవీరుల తల్లిదండ్రులకు కేటాయించేలా కృషి చేస్తానని ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 4 Mar 2010 | 10:04 pm

విద్యారంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం: సిబాల్

దేశ విద్యా విధానంలో భారీ ఎత్తున సంస్కరణలు తీసుకుని రానున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. ఇందులోభాగంగా, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే బిల్లు రూపకల్పన సిద్ధమైనట్టు ఆయన తెలిపారు. ఈ బిల్లు ఏ క్షణమైనా కేబినెట్‌ ముందుకు రావొచ్చని ఆయన చెప్పారు.
Source: జాతీయ | 4 Mar 2010 | 9:34 pm

ఆలయంలో తొక్కిసలాట" 65కు పెరిగిన మృతులు!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో గల రామ్‌జానకీ మందిరంలో గురువారం జరిగిన తొక్కిసలాటలో మరణించిన భక్తుల సంఖ్య శుక్రవారానికి 63కు పెరిగింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే కావడం గమనార్హం. మరికొంత మంది గాయపడ్డారు. కాగా, మృతుల్లో 36 మంది మహిళలు, 27 మంది పిల్లలు ఉన్నట్టు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
Source: జాతీయ | 4 Mar 2010 | 9:02 pm

పరిచయాలు పెంచుకోండీ..!!: హీరోయిన్ల తల్లులు

కాలంతోపాటు అభిరుచులు మారాయి. విలువలూ మారుతున్నాయి. ఒకప్పుడు హీరోయిన్ తల్లులు తమ పిల్లల్ని ఏ విధంగా రక్షించుకోవాలని చూస్తుండేవారు. కూతుళ్లకు రక్షణ కవచంగా ఉండేవారు. షాట్ పూర్తవగానే హీరోయిన్ వచ్చి తల్లి ప్రక్కనే కూర్చునేది.టాప్ పొజిషన్‌లో ఉన్న హీరోయిన్ తల్లి కోరికలు గొంతెమ్మ కోరికల్లా ఉండేవి. గంట అదనంగా చేయాలంటే తల్లులు పేచీ పెట్టేవారు. తమ కూతుళ్లు హీరోలతో చనువుగా బహిరంగంగా మాట్లాడనిచ్చేవారు కాదు. మరి ఇప్పుడు అంతా మారిపోయింది. హీరోయిన్ తల్లులే హీరోలతో చాలా కలివిడిగా ఉంటున్నారు. యువహీరోలను తమ ఇంటికో లేదంటే క్లబ్‌లకో పిలిచి పార్టీలివ్వడం ఆనవాయితీ అయింది. కూతుళ్లను హీరోలతో స్నేహం చేసే వాతావరణాన్ని వారే స్వయంగా కల్పిస్తున్నారు. ఈ మధ్యనే పేరున్న ఒక పెద్ద హీరో... "హీరోయిన్ల తల్లులు చాలా సహకరిస్తున్నార"ని స్టేట్మెంట్ ఇచ్చాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2010 | 8:14 am

తెలంగాణ సమస్య భార్యాభర్తల బంధం లాంటిది: శ్రీ కృష్ణ

తెలంగాణ సమస్య భార్యాభర్తల సంబంధంలాంటిదని జస్టిస్ శ్రీ కృష్ణ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై కూలంకష అధ్యయనం కోసం హైదరాబాద్ చేరుకున్న శ్రీ కృష్ణ బృందం గురువారం సాయంత్రం ఏర్పాటైన మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు శ్రీకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ అంశంపై ఎవరు ఎలాంటి అభిప్రాయాలు తెలిపినా వాటిని పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే రోజుకు 50 మెమోరాండంలు కమిటీకి అందుతున్నాయని శ్రీకృష్ణ తెలియజేశారు.
Source: ఏపీ న్యూస్ | 4 Mar 2010 | 7:28 am

అన్ని పార్టీలను కలుపుకుని ముందుకెళ్తాం: శ్రీ కృష్ణ

తమ కమిటీని ప్రారంభంలో కొన్ని పార్టీలు వ్యతిరేకించినా అందరినీ కలుపుకుని సమిష్టిగా ముందుకెళతామని.. జస్టీస్ శ్రీకృష్ణ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ప్రారంభమైన మీడియా సమావేశంలో ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 4 Mar 2010 | 6:54 am

ఉగ్రవాదులను అణచడానికే సైనిక సంపత్తి: ఆంటోనీ

అగ్రదేశమైన అమెరికా అందిస్తున్న సైనిక సహాయాన్ని పాకిస్థాన్ అల్‌ఖైదా లాంటి ఉగ్రవాదులను అణచడానికే ఉపయోగించాలని భారత రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. అమెరికా అందిస్తున్న సైనిక ఆయుధ సంపత్తిని పాకిస్థాన్ భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించకుండా చూసే బాధ్యత అమెరికాపై ఉందని ఆంటోనీ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 4 Mar 2010 | 6:35 am

అమలాపురంలో కిడ్నాప్‌కు గురైన అజ్జు క్షేమం!

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కిడ్నాప్‌కు గురైన మూడేళ్ల బాలు అజ్జు ఆచూకీ లభ్యమైంది. అమలాపురం పట్టణం గాంధీనగర్‌కు చెందిన టీవీఎస్ షోరూం అధినేత నామాన బాలు మూడేళ్ల కుమారుడు అజ్జు బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కిడ్నాప్‌కు గురయ్యాడు.
Source: ఏపీ న్యూస్ | 4 Mar 2010 | 6:26 am

నాకు బ్రెయిన్ లేదు.. నేనేం చెప్పగలను: ప్రకాష్ రాజ్

"నాకు బ్రెయిన్ లేదు. నేనేమి చెప్పగలను" అని జాతీయస్థాయి నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో అనడం వెటకారమో... అతిశయోక్తో... ఏది అన్వయించుకోవచ్చో అనే సందిగ్ధావస్థ విలేకరులకు కలిగింది. లేటెస్ట్‌గా ఆయన భూమికతో కలిసి 'కలెక్టర్ గారి భార్య' చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరే ప్రధాన పాత్రలు. భార్యాభర్తలు ఇగో వల్ల ఒకరికొకరు పోటీపడి సంసారానికి దూరంగా ఉంటారు. ఆ తర్వాత ఆమె ఉన్నత స్థితికి చేరుతుంది. ఆ తర్వాత ఇద్దరూ తమ తప్పులు తెలుసుకుని కలిసిపోతారు. ఇదీ సినిమా కథ. ఈ చిత్రం గురించి చెప్పేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకాష్ రాజ్ మాట్లాడారు. "చిత్ర దర్శక నిర్మాత దిల్ రాజు ద్వారా కథ నా దగ్గరకు వచ్చింది. కథ బాగానే ఉంది. కానీ ఆయన తీయగలరో లేదో అని అనుమానంతో మంచి రైటర్స్‌ను తీసుకుని రండి అని చెప్పాను. వెంటనే పరుచూరి బ్రదర్స్‌ను తీసుకువచ్చారు. మంచి ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. భార్యభర్తల సంబంధాలు తెలియజెప్పే ఇటువంటి సినిమా నాకూ అవసరమే..." అంటూ ముగించారు
Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2010 | 4:43 am

ప్రకాష్ రాజ్- భూమికల "కలెక్టర్ గారి భార్య"

ప్రకాష్ రాజ్, భూమిక నటిస్తున్న చిత్రానికి "కలెక్టర్ గారి భార్య" అనే పేరును నిర్ణయించారు. అమోద్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై బి. వనితా రెడ్డి, ఎ. రాధికా రెడ్డి నిర్మిస్తున్నారు. టేకుల కృపాకర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ.. యూఎస్‌లో 23 ఏళ్లుగా ఉన్నాను. సినిమాలు పిచ్చిగా చూసేవాడిని. ప్రకాష్ రాజ్ గురించి కథను రాసుకున్నాను. రెండేళ్లుగా కథను సిద్ధం చేసుకుని వచ్చాను. కమర్షియల్ సినిమా కాకుండా సమాజానికి ఏదో మేలు చేయాలని సినిమా తీశాను. ఆడపిల్ల తల్లిదండ్రులకు చక్కని సందేశం కూడా ఉంది. త్వరలో ఆడియోను ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేస్తాం అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2010 | 4:23 am

"గమ్యం" హీరోయిన్ కమలిని ముఖర్జీ పర్సనల్ టచ్

"ఆనంద్" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హోమ్లీ హీరోయిన్ కమలినీ ముఖర్జీ. తమిళం, మలయాళం, హిందీ, కన్నడ సినిమాల్లో తనదైన నటనా శైలితో ప్రేక్షకులను, అభిమానులను ఇట్టే కట్టిపడేస్తోన్న కమలిని ముఖర్జీకి తెలుగులో గమ్యం, హ్యాపీడేస్ చిత్రాలు మంచి గుర్తింపును సంపాదించిపెట్టాయి. కమలిని ముఖర్జీ పుట్టిన రోజు సందర్భంగా ఆమె వ్యక్తిగత వివరాలు మీ కోసం.. పుట్టినరోజు: మార్చి 4, 1980.జన్మస్థలం: కొల్‌కతా, వయస్సు: 29,తండ్రి: వ్యాపారవేత్త, తల్లి: గార్మెంట్ డిజైనర్,తెలుగులో తొలి చిత్రం: ఆనంద్, చదువు: ఇంగ్లీష్ లిట్ (డిగ్రీ), అవార్డులు: ఉత్తమ నటిగా ఆరు నంది అవార్డులు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2010 | 4:08 am

రామ్‌జానకీ ఆలయంలో తొక్కిసలాట: 60మంది మృతి!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌గడ్ జిల్లా ఉన్న కృపాల్‌జీ మహారాజ్ ఆశ్రమం (రామ్ జానకీ ఆలయం)లో గురువారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో 60 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమిక సమాచారం. మరో 40 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది.
Source: జాతీయ | 4 Mar 2010 | 2:33 am

"ఉమెన్స్ డే" రోజున మహిళా బిల్లు: వీరప్ప మొయిలీ

"ఉమెన్స్ డే" సందర్భంగా మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఓ కానుకను అందించనుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లును మహిళా దినోత్సవం రోజున రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ తెలిపారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లు వచ్చే వారం (మార్చి 8) ఉమెన్స్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు ఆస్కారం ఉందని మొయిలీ అన్నారు.
Source: జాతీయ | 4 Mar 2010 | 2:10 am

మా ఆయన మాటతో నేను ఏకీభవించను: బొత్స ఝాన్సీ

సమైక్యాంధ్ర గళాలలో ఒక భిన్న స్వరం గత వారం రోజులుగా తన వాదనను వినిపిస్తోంది. రాష్ట్రాన్ని చీల్చితే తప్పేమిటని ప్రశ్నిస్తోంది. ఆ గళం ఎవరిదో కాదు... మంత్రి బొత్స సత్యనారాయణది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తేనే సాధ్యమని ఆయన గత వారం రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులు కూడా ఇదే మాటను చెపుతారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Mar 2010 | 1:53 am