|
పరిచయాలు పెంచుకోండీ..!!: హీరోయిన్ల తల్లులుకాలంతోపాటు అభిరుచులు మారాయి. విలువలూ మారుతున్నాయి. ఒకప్పుడు హీరోయిన్ తల్లులు తమ పిల్లల్ని ఏ విధంగా రక్షించుకోవాలని చూస్తుండేవారు. కూతుళ్లకు రక్షణ కవచంగా ఉండేవారు. షాట్ పూర్తవగానే హీరోయిన్ వచ్చి తల్లి ప్రక్కనే కూర్చునేది.టాప్ పొజిషన్‌లో ఉన్న హీరోయిన్ తల్లి కోరికలు గొంతెమ్మ కోరికల్లా ఉండేవి. గంట అదనంగా చేయాలంటే తల్లులు పేచీ పెట్టేవారు. తమ కూతుళ్లు హీరోలతో చనువుగా బహిరంగంగా మాట్లాడనిచ్చేవారు కాదు. మరి ఇప్పుడు అంతా మారిపోయింది. హీరోయిన్ తల్లులే హీరోలతో చాలా కలివిడిగా ఉంటున్నారు. యువహీరోలను తమ ఇంటికో లేదంటే క్లబ్‌లకో పిలిచి పార్టీలివ్వడం ఆనవాయితీ అయింది. కూతుళ్లను హీరోలతో స్నేహం చేసే వాతావరణాన్ని వారే స్వయంగా కల్పిస్తున్నారు. ఈ మధ్యనే పేరున్న ఒక పెద్ద హీరో... "హీరోయిన్ల తల్లులు చాలా సహకరిస్తున్నార"ని స్టేట్మెంట్ ఇచ్చాడు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2010 | 8:14 am లాడెన్ ఆచూకీ ఐఎస్ఐకు తెలుసు: యూఎస్ రచయితఅంతర్జాతీయ తీవ్రవాద సంస్థ అల్‌ఖైదీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకు తెలుసని అమెరికాకు చెందిన రక్షణ నిపుణుడు, రచయిత స్టీఫెన్ టన్నెర్ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ వివరాలను వెల్లడించేందుకు ఐఎస్ఐ సిద్ధంగా లేదన్నారు. లాడెన్‌కు రక్షణను ఈ గూఢచర్య సంస్థే పర్యవేక్షిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 4 Mar 2010 | 8:06 am నష్టాల్లో అంతర్జాతీయ మార్కెట్లు: సెన్సెక్స్ పతనంఅమెరికా, ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా నష్టాల్లో కూరుకుపోవడం స్టాక్ మార్కెట్‌కు ఏ మాత్రం కలిసిరాలేదు. గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాలతో కొనసాగిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 57 పాయింట్లు క్షీణించి, 16,942 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 18 పాయింట్ల స్వల్ప నష్టంతో, 5,069 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 4 Mar 2010 | 7:53 am రామ్‌జానకీ ఆలయంలో తొక్కిసలాట: 60మంది మృతి!ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌గడ్ జిల్లా ఉన్న కృపాల్‌జీ మహారాజ్ ఆశ్రమం (రామ్ జానకీ ఆలయం)లో గురువారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో 60 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమిక సమాచారం. మరో 40 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది.Source: Yahoo! Telugu: News | 4 Mar 2010 | 7:46 am "ఉమెన్స్ డే" రోజున మహిళా బిల్లు: వీరప్ప మొయిలీ"ఉమెన్స్ డే" సందర్భంగా మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఓ కానుకను అందించనుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లును మహిళా దినోత్సవం రోజున రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ తెలిపారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లు వచ్చే వారం (మార్చి 8) ఉమెన్స్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు ఆస్కారం ఉందని మొయిలీ అన్నారు.Source: Yahoo! Telugu: News | 4 Mar 2010 | 7:39 am విదేశీ మార్కెట్ల ప్రభావం: నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీఅంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనిస్తోంది. గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనంలో పయనిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 91 పాయింట్లు క్షీణించి, 16,908 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 36 పాయింట్లు పతనమై, 5,051 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 4 Mar 2010 | 7:23 am మా ఆయన మాటతో నేను ఏకీభవించను: బొత్స ఝాన్సీసమైక్యాంధ్ర గళాలలో ఒక భిన్న స్వరం గత వారం రోజులుగా తన వాదనను వినిపిస్తోంది. రాష్ట్రాన్ని చీల్చితే తప్పేమిటని ప్రశ్నిస్తోంది. ఆ గళం ఎవరిదో కాదు... మంత్రి బొత్స సత్యనారాయణది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తేనే సాధ్యమని ఆయన గత వారం రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులు కూడా ఇదే మాటను చెపుతారన్నారు.Source: Yahoo! Telugu: News | 4 Mar 2010 | 7:22 am ఫిబ్రవరిలో భారీగా పెరిగిన ఆడి ఇండియా విక్రయాలుగత నెలలో తమ కంపెనీ విక్రయాలు భారీగా పెరిగినట్టు లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా బుధవారం వెల్లడించింది. అంతకుముందు నెలతో పోల్చుకుంటే విక్రయాలు రెండంకెల శాతానికి చేరుకుందని తెలిపింది. ఫిబ్రవరి 252 కార్లు విక్రయించినట్టు పేర్కొంది. గత యేడాది ఇదే సమయంలో కార్ల విక్రయాలు 113 యూనిట్లుగా ఉన్నాయని ప్రస్తుతం వీటి సంఖ్య 252కు చేరుకున్నట్టు గుర్తు చేసింది.Source: Yahoo! Telugu: News | 4 Mar 2010 | 6:21 am ఎఫ్ఐఏ "రెడ్‌బుక్"లో కనిపించని లష్కర్ నేతల పేర్లు!తీవ్రవాదంపై చిత్తశుద్ధితో పని చేస్తున్నట్టు ప్రగల్భాలు పలుకుతున్న పాకిస్థాన్.. ఆచరణలో మాత్రం ఆ చర్యలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఆ దేశానికి చెందిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తయారు చేసిన రెడ్‌బుక్‌లో మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టుల పేర్లు ఒక్కటి కూడా లేకపోవడం పాక్ చిత్తశుద్ధి ఏపాటిదో వెల్లడవుతోంది.Source: Yahoo! Telugu: News | 4 Mar 2010 | 6:11 am నష్టాల్లో కొనసాగుతోన్న బాంబే స్టాక్ మార్కెట్గురువారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే క్షీణించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 79 పాయింట్లు పతనమై, 16,920 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 28 పాయింట్లు క్షీణించి, 5,059 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 4 Mar 2010 | 6:01 am పెట్రో ధరల పెంపు: ప్రణబ్‌కు సోనియా అండదండలు!పెట్రో ధరలు పెంచడాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమర్థించారు. ఈ వ్యవహారంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి ఆమె అండగా నిలబడ్డారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలతో పాటు.. యూపీఏ భాగస్వామ్య కూటమిలోని కొన్ని మిత్రపక్షాలు పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 4 Mar 2010 | 5:36 am నాకు బ్రెయిన్ లేదు.. నేనేం చెప్పగలను: ప్రకాష్ రాజ్"నాకు బ్రెయిన్ లేదు. నేనేమి చెప్పగలను" అని జాతీయస్థాయి నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో అనడం వెటకారమో... అతిశయోక్తో... ఏది అన్వయించుకోవచ్చో అనే సందిగ్ధావస్థ విలేకరులకు కలిగింది. లేటెస్ట్‌గా ఆయన భూమికతో కలిసి 'కలెక్టర్ గారి భార్య' చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరే ప్రధాన పాత్రలు. భార్యాభర్తలు ఇగో వల్ల ఒకరికొకరు పోటీపడి సంసారానికి దూరంగా ఉంటారు. ఆ తర్వాత ఆమె ఉన్నత స్థితికి చేరుతుంది. ఆ తర్వాత ఇద్దరూ తమ తప్పులు తెలుసుకుని కలిసిపోతారు. ఇదీ సినిమా కథ. ఈ చిత్రం గురించి చెప్పేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకాష్ రాజ్ మాట్లాడారు. "చిత్ర దర్శక నిర్మాత దిల్ రాజు ద్వారా కథ నా దగ్గరకు వచ్చింది. కథ బాగానే ఉంది. కానీ ఆయన తీయగలరో లేదో అని అనుమానంతో మంచి రైటర్స్‌ను తీసుకుని రండి అని చెప్పాను. వెంటనే పరుచూరి బ్రదర్స్‌ను తీసుకువచ్చారు. మంచి ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. భార్యభర్తల సంబంధాలు తెలియజెప్పే ఇటువంటి సినిమా నాకూ అవసరమే..." అంటూ ముగించారుSource: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2010 | 4:43 am ప్రకాష్ రాజ్- భూమికల "కలెక్టర్ గారి భార్య"ప్రకాష్ రాజ్, భూమిక నటిస్తున్న చిత్రానికి "కలెక్టర్ గారి భార్య" అనే పేరును నిర్ణయించారు. అమోద్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై బి. వనితా రెడ్డి, ఎ. రాధికా రెడ్డి నిర్మిస్తున్నారు. టేకుల కృపాకర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ.. యూఎస్‌లో 23 ఏళ్లుగా ఉన్నాను. సినిమాలు పిచ్చిగా చూసేవాడిని. ప్రకాష్ రాజ్ గురించి కథను రాసుకున్నాను. రెండేళ్లుగా కథను సిద్ధం చేసుకుని వచ్చాను. కమర్షియల్ సినిమా కాకుండా సమాజానికి ఏదో మేలు చేయాలని సినిమా తీశాను. ఆడపిల్ల తల్లిదండ్రులకు చక్కని సందేశం కూడా ఉంది. త్వరలో ఆడియోను ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేస్తాం అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2010 | 4:23 am "గమ్యం" హీరోయిన్ కమలిని ముఖర్జీ పర్సనల్ టచ్"ఆనంద్" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హోమ్లీ హీరోయిన్ కమలినీ ముఖర్జీ. తమిళం, మలయాళం, హిందీ, కన్నడ సినిమాల్లో తనదైన నటనా శైలితో ప్రేక్షకులను, అభిమానులను ఇట్టే కట్టిపడేస్తోన్న కమలిని ముఖర్జీకి తెలుగులో గమ్యం, హ్యాపీడేస్ చిత్రాలు మంచి గుర్తింపును సంపాదించిపెట్టాయి. కమలిని ముఖర్జీ పుట్టిన రోజు సందర్భంగా ఆమె వ్యక్తిగత వివరాలు మీ కోసం.. పుట్టినరోజు: మార్చి 4, 1980.జన్మస్థలం: కొల్‌కతా, వయస్సు: 29,తండ్రి: వ్యాపారవేత్త, తల్లి: గార్మెంట్ డిజైనర్,తెలుగులో తొలి చిత్రం: ఆనంద్, చదువు: ఇంగ్లీష్ లిట్ (డిగ్రీ), అవార్డులు: ఉత్తమ నటిగా ఆరు నంది అవార్డులు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Mar 2010 | 4:08 am రామ్‌జానకీ ఆలయంలో తొక్కిసలాట: 60మంది మృతి!ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌గడ్ జిల్లా ఉన్న కృపాల్‌జీ మహారాజ్ ఆశ్రమం (రామ్ జానకీ ఆలయం)లో గురువారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో 60 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమిక సమాచారం. మరో 40 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది.Source: జాతీయ | 4 Mar 2010 | 2:33 am "ఉమెన్స్ డే" రోజున మహిళా బిల్లు: వీరప్ప మొయిలీ"ఉమెన్స్ డే" సందర్భంగా మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఓ కానుకను అందించనుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లును మహిళా దినోత్సవం రోజున రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ తెలిపారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లు వచ్చే వారం (మార్చి 8) ఉమెన్స్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు ఆస్కారం ఉందని మొయిలీ అన్నారు.Source: జాతీయ | 4 Mar 2010 | 2:10 am మా ఆయన మాటతో నేను ఏకీభవించను: బొత్స ఝాన్సీసమైక్యాంధ్ర గళాలలో ఒక భిన్న స్వరం గత వారం రోజులుగా తన వాదనను వినిపిస్తోంది. రాష్ట్రాన్ని చీల్చితే తప్పేమిటని ప్రశ్నిస్తోంది. ఆ గళం ఎవరిదో కాదు... మంత్రి బొత్స సత్యనారాయణది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తేనే సాధ్యమని ఆయన గత వారం రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులు కూడా ఇదే మాటను చెపుతారన్నారు.Source: ఏపీ న్యూస్ | 4 Mar 2010 | 1:53 am పెట్రో ధరల పెంపు: ప్రణబ్‌కు సోనియా అండదండలు!పెట్రో ధరలు పెంచడాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమర్థించారు. ఈ వ్యవహారంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి ఆమె అండగా నిలబడ్డారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలతో పాటు.. యూపీఏ భాగస్వామ్య కూటమిలోని కొన్ని మిత్రపక్షాలు పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 4 Mar 2010 | 12:06 am తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి వెల్లడించాలి: టి వాదులు!తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ వైఖరిని తక్షణం వెల్లడించాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేశారు. ఆ తర్వాత పలువురు టి వాదులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ నివాసాన్ని గురువారం ఉదయం ముట్టడించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలలకొంది.Source: ఏపీ న్యూస్ | 3 Mar 2010 | 11:49 pm ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయన ఘటనపై కేసు నమోదు!అంతర్జాతీయ విమానాల ప్రదర్శన-2010 సందర్భంగా బోయినపల్లిలో సాగర్ పవన్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయిన ఘటనకు సంబంధిచి స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ కింద బోయినపల్లి పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది.Source: ఏపీ న్యూస్ | 3 Mar 2010 | 11:35 pm 9 నుంచి తెలంగాణ ఉద్యమం ఉధృతం: ప్రొ. కోదండరామ్ఈనెల తొమ్మిదో తేదీ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్టు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ ఆచార్య కోదండరామ్ తెలిపారు. దీనిపై ఆయన గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు వ్యతిరేకం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అయితే, ఈకమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర వైఖరికి నిరసన తెలుతున్నట్టు ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 3 Mar 2010 | 11:29 pm ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా..!: స్పీకర్బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం సభ్యులపై చేసిన వ్యాఖ్యలను స్పీకర్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఉపసంహరించుకున్నారు. తెదేపా నుద్దేశించిన తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టినట్లైతే, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు గురువారం సభలో ప్రకటించారు. గురువారం సభ ప్రారంభంకాగానే సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ.. నిన్న తాను చేసిన వ్యాఖ్యలు ఏదో ద్వేషంతో మాట్లాడలేదని, సభను అదుపుచేయాలనే ఉద్దేశంతో మాట్లాడినట్లు వివరణ ఇచ్చారు. దాంతో సభ సజావుగా ప్రారంభమైంది.Source: ఏపీ న్యూస్ | 3 Mar 2010 | 10:55 pm కేంద్రంతో చర్చలకు సరికొత్త షరతులు విధించిన కిషన్‌జీ!మావోయిస్టు అగ్రనేత కిషన్ జీ సరికొత్త షరతులను తెరపైకి తెచ్చారు. కేంద్రంతో చర్చలకు సిద్ధమేనంటూ స్పష్టం చేస్తూనే.. పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన అనుచరులను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మావోయిస్టు అగ్రనేత ఒక ప్రత్రికా ప్రకటనను తాజాగా విడుదల చేశారు.Source: జాతీయ | 3 Mar 2010 | 10:18 pm సచిన్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాల్సిందే: ప్రకాష్భారత పరుగుల యంత్రం సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. దీనిపై ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జావదేకర్ మాట్లాడుతూ.. సచిన్‌కు భారతరత్న ప్రకటించడంలో ఎలాంటి తప్పులేదన్నారు. తన క్రీడాప్రతిభ, సామర్థ్యం, ఉత్తమ వ్యక్తిత్వంతో యావత్ భారత ప్రజల మనసులను సచిన్ గెలుచుకున్నాడని చెప్పారు.Source: జాతీయ | 3 Mar 2010 | 9:38 pm కూలిన సాగర్ పవన్ : విచారణకు రక్షణ శాఖ ఆదేశం!భారతీయ వైమానిక ప్రదర్శన-2010లో భాగంగా రక్షణ శాఖకు చెందిన విమానాల విన్యాసాల్లో ఒక ఎయిర్ క్రాఫ్ట్ కూలి ఇద్దరు పైలెట్లు దుర్మరణం పాలైన సంఘటనపై దర్యాప్తుకు కేంద్ర రక్షణ శాఖ ఆదేశించింది. బుధవారం ఉదయం 11.54 గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయం గగనతలంలో నౌకాదళానికి చెందిన సాగర్ పవన్ విమానం ఒకటి జనవాస ప్రాంతాల్లో కుప్పకూలి పోయిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 3 Mar 2010 | 8:59 pm విభజన పర్వం ఆరంభం: నేడు జస్టీస్ శ్రీకృష్ణ బృందం రాక!రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ గురువారం రాష్ట్రానికి రానుంది. ఈ కమిటీ ఛైర్మన్ జస్టీస్ శ్రీకృష్ణ, కమిటీ సభ్య కార్యదర్శి వీకే.దుగ్గల్‌తో పాటు మిగిలిన ముగ్గురు సభ్యులు కూడా హైదరాబాద్‌కు చేరుకుంటారు.Source: ఏపీ న్యూస్ | 3 Mar 2010 | 8:42 pm కేరళలో కె.విశ్వనాథ్- అల్లరి నరేశ్ చిత్రంచెరుకూరి కౌసలేంద్రరావుగారి ఆశీస్సులతో శ్రీ రాజరాజేశ్వరి సోమేశ్వర ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రీశ్రీ రాజరాజేశ్వరి ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం షూటింగ్ కేరళలో మొదలైంది. అల్లరి నరేశ్, మంజరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలను హీరోయిన్ హౌస్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 3 Mar 2010 | 2:11 pm నిత్యానందతో నటి రంజిత రాసలీలలు నిజమేనా...?!!కల్కి ఆశ్రమంలో ఆధ్యాత్మకత ముసుగులో అక్రమ వ్యాపారం వ్యవహారం అలావుండగానే తమిళనాడులో ప్రఖ్యాత స్వామిగా పిలువబడే నిత్యానంద స్వామి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. నిత్యానంద వికృత చేష్టలను తమిళనాడులోని అన్ని ఛానళ్లు ప్రసారం చేశాయి. ఇదిలావుండగా స్వామి రాసలీలల్లో కోలీవుడ్‌కు చెందిన కొందరు తారామణులు కూడా ఉన్నట్లు సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 3 Mar 2010 | 10:29 am నాగచైతన్యతో 'కిస్'లా..? అవి సినిమా ముద్దులు: సమంతనాగచైతన్య సరసన హీరోయిన్‌గా నటించి తెలుగు పరిశ్రమకు పరిచయమైన భామ సమంత. ఆ సినిమాలో ఆమె నటించిన జెస్సీ పాత్రకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా యూత్‌ని జెస్సీ క్యారెక్టర్ ద్వారా బాగా ఆకట్టుకుంది సమంత. తొలి చిత్రంతోనే సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా గుర్తింపు పొంది ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో "బృందావనం" చిత్రంలో నటిస్తూ టాలీవుడ్‌లో బిజీ బిజీగా ఉంది. "ఏ మాయ చేసావె" సక్సెస్ నేపధ్యంలో ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు...మీరు తెలుగు వారంటున్నారే..?మా నాన్న తరపువారంతా తెలుగువారే. కొన్ని తరాలకు ముందు తమిళనాడుకు తరలివచ్చారు. అమ్మ మలయాళీ. ఇంట్లో తమిళం, ఇంగ్లీషు మాట్లాడుకుంటాం.మరి తెలుగు సంగతో.. తెలుగు మాట్లాడతారా...?కొన్ని పదాలను పట్టుకోగలుగుతాను. మాట్లాడటం రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. ఏ మాయ చేసావె సమయంలో డైలాగులను బట్టీపట్టి చెప్పేదాన్ని. పెద్ద కష్టమేమీ అనిపించలేదు.Source: Yahoo! Telugu: Entertainment | 3 Mar 2010 | 8:18 am ఎయిర్ షో దుర్ఘటన: ఇద్దరు పైలెట్ల మృతిబేగంపేట ఎయిర్‌షో ప్రారంభ వేడుకల్లో చోటు చేసుకున్న విషాదకర సంఘటనలో పైలట్, కో పైలట్లు ఇద్దరూ మృతి చెందిననట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఏకే.ఖాన్ తెలిపారు. ఎయిర్ షో ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు సూర్య కిరణ్ విమానాలు సాహస విన్యాసాలను బుధవారం చేపట్టాయి.Source: ఏపీ న్యూస్ | 3 Mar 2010 | 7:38 am సీఎం పదవికి రోశయ్య అన్‌ఫిట్.. బొత్స ఫిట్: దామోదర్ రెడ్డిముఖ్యమంత్రి పదవికి కె.రోశయ్య అన్‌ఫిట్ అని, పంచాయతీ రాజ్ శాఖామంత్రి ఆర్.దామోదర్ రెడ్డి ఫిట్ అని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రిSource: ఏపీ న్యూస్ | 3 Mar 2010 | 7:25 am ప్రమోద్ మహాజన్ సోదరుడు ప్రవీణ్ మహాజన్ మృతిభారతీయ జనతా పార్టీ యువ నేత దివంగత ప్రమోద్ మహాజన్ సోదరుడు ప్రవీణ్ మహాజన్ బుధవారం కన్నుమూశారు. బ్రెయిన్ హేమరేజ్ వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆయన థానేలోని ఒక ప్రవేట్ ఆస్పత్రిలో మృతి చెందినట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రమోద్ మహాజన్ హత్య కేసులో జీవితకారాగార శిక్షను అనుభవిస్తున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 3 Mar 2010 | 6:19 am శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇస్తే తప్పేంటి: కేసీఆర్ ప్రశ్నరాష్ట్ర పరిస్థితులపై సంప్రదింపులు జరిపేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇస్తే తప్పేమిటని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ప్రశ్నించారు. తెరాస పొలిట్‌బ్యూరో సమావేశం బుధవారం మధ్యాహ్నం ఆ పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో జరిగింది. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు.Source: ఏపీ న్యూస్ | 3 Mar 2010 | 5:47 am రేపటి నుంచి శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర పర్యటన!రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ గురువారం రాష్ట్రానికి రానుంది. ఈ కమిటీ ఛైర్మన్ జస్టీస్ శ్రీకృష్ణ, కమిటీ సభ్య కార్యదర్శి వీకే.దుగ్గల్‌తో పాటు మిగిలిన ముగ్గురు సభ్యులు కూడా హైదరాబాద్‌కు రానున్నారు.Source: ఏపీ న్యూస్ | 3 Mar 2010 | 5:17 am అది మీరనుకునే కెమిస్ట్రీ కాదు: జగపతి బాబుప్రియమణి, జగపతి బాబుల మధ్య ప్రేమాయణం సాగుతుందనేది ఇండస్ట్రీలో పాత వార్తే. అయినా ఈ మధ్య ఎక్కువగా ఫంక్షన్లకు ఇద్దరూ అటెండ్ కావడం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. లేటు వయసులో ప్రేమాయణం అంటున్న జగపతిబాబును "ప్రవరాఖ్యుడు"లో రొమాంటిక్ సీన్స్ బాగా పండాయనీ, దీన్నిబట్టి మీ ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరిందని విలేకరులు అడిగారు. దీంతో జగపతి బాబు... "మీరడిగే కెమిస్ట్రీ నాకు తెలుసు. కానీ... మేమిద్దరం మంచి స్నేహితులం. మా మధ్య ఉన్న స్నేహానుబంధం తెరపై రిఫ్లెక్ట్ అయి రొమాంటిక్ సీన్స్‌కు రియల్‌గా ఉన్న అనుభూతి కలుగుతుంది" అని చెప్పాడు. అంతకుమించి ఏమీ లేదని వెల్లడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 3 Mar 2010 | 5:02 am వరుణ్ సందేశ్ "మరో చరిత్ర" ట్రెయిలర్మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వరుణ్ సందేశ్, అనిత హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "మరో చరిత్ర". గతంలో దశావతారం కమల్ హాసన్, స్వప్న జంటగా నటించగా, కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన "మరో చరిత్ర" క్లాసిక్ చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది.ఇదే తరహాలో వరుణ్ సందేశ్ హీరోగా రూపొందుతోన్న "మరో చరిత్ర" తెలుగు ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రానికి రవియాదవ్ దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తన మిత్రులతో కలసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 3 Mar 2010 | 4:54 am ఎయిర్ క్రాష్ "షో"కు అడ్డంకి కాదు: ప్రఫుల్ పటేల్విమాన ప్రమాదం కారణంగా ఎయిర్ షోను నిలిపివేస్తారనే సందేహానికి తావులేదనీ, అనుకోకుండా ప్రమాదం జరిగిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. ఈ ట్రాజెడీ ఎయిర్ షోకు అడ్డంకి కాదని అన్నారు.Source: జాతీయ | 3 Mar 2010 | 3:47 am అమెరికా ప్రోద్భలంతోనే ఆ చర్చలు: ఎల్కే.అద్వానీ!భారత్ - పాకిస్థాన్ దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల కార్యదర్శుల స్థాయి సమావేశం అమెరికా ప్రోద్భలంతోనే జరిగిందని భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ ఎల్కే.అద్వానీ అరోపించారు. భారత ప్రభుత్వం తరపున కేంద్ర విదేశాంగ కార్యదర్శి నిరుపమారావు పాల్గొనగా, పాక్ తరపున ఆ దేశ విదేశాంగ కార్యదర్శి పాల్గొన్నారు.Source: జాతీయ | 3 Mar 2010 | 2:53 am మార్చి 25న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మహారాష్ట్రమహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25వ తేదీన శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా మార్చి 25వ తేదీన మహారాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.Source: జాతీయ | 3 Mar 2010 | 1:59 am
|