కాబూల్ ఆత్మాహుతి దాడిలో లష్కర్: ఆఫ్ఘన్ వర్గాలు!

ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల వెనుక లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థ హస్తం ఉన్నట్టు ఆ దేశ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత వారంలో జరిగిన కారు బాంబు, ఆత్మాహుతి దాడుల్లో పాక్ కేంద్రంగా పని చేసే లష్కర్ తోయిబా పాత్ర ఉన్నట్టు ఆఫ్ఘన్ నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో తొమ్మిది మంది భారతీయులతో పాటు.. 16 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 3 Mar 2010 | 7:59 am

ఊపందుకున్న ట్రేడింగ్: లాభాల్లో స్టాక్ మార్కెట్

దేశీయ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల్లో పయనిస్తోంది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభాలను ఆర్జించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స మధ్యాహ్నం 1.30 గంటలకు 156 పాయింట్ల మేర లాభపడి, 16,928 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 47 పాయింట్లు బలపడి, 5,064 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 3 Mar 2010 | 7:56 am

ఫిబ్రవరి నెలలో తగ్గిన ఎసిసి సిమెంట్ అమ్మకాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలోని ఫిబ్రవరి నెలలో తమ సంస్థకు చెందిన సిమెంట్ అమ్మకాలలో తగ్గి 17.1 లక్షల టన్నులకు చేరుకుందని ఎసిసి సిమెంట్ కంపనీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అదే నిరుడు ఇదే నెలలో కంపెనీకి చెందిన సిమెంట్ అమ్మకాలు 17.5 లక్షల టన్నులుగా ఉండిందని కంపెనీ ఆ ప్రకటనలో వివరించింది
Source: Yahoo! Telugu: News | 3 Mar 2010 | 7:44 am

మార్చి 25న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మహారాష్ట్ర

మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25వ తేదీన శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా మార్చి 25వ తేదీన మహారాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 3 Mar 2010 | 7:28 am

తాలిబాన్‌ దాడులపై ప్రత్యక్ష ప్రసారాలకు ఆఫ్ఘన్ బ్రేక్!

ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో తిష్టవేసిన తాలిబాన్ తీవ్రవాద సంస్థలపై జరుగుతున్న దాడులపై ప్రత్యక్ష ప్రసారాలపై ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. పలు టీవీ ఛానళ్ళు ఇస్తున్న లైవ్ కవరేజ్‌ల వల్ల తాలిబాన్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారని ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల వీటిపై నిషేధం విధిస్తున్నట్టు వివరణ ఇచ్చింది.
Source: Yahoo! Telugu: News | 3 Mar 2010 | 7:12 am

వచ్చే ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఆఫర్: యూకోబ్యాంక్

రానున్న ఆర్థిక సంవత్సరంలో తమ బ్యాంకుకు చెందిన నిధులను మరింతగా పెంచుకునే అంశంపై తమ బోర్డు డైరెక్టర్లతో మార్చి నెల 19న సమావేశం కానున్నామని, ఏప్రిల్-మే నెలల మధ్యకాలంలో పబ్లిక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టేందుకు తమ బోర్డు సభ్యులు చర్చిస్తారని యూకో బ్యాంక్ ఛైర్మెన్, ఎండీ ఎస్‌‍కే గోయల్ బుధవారం మీడియాకు తెలిపారు
Source: Yahoo! Telugu: News | 3 Mar 2010 | 7:10 am

కూలిన సూర్యకిరణ్ విమానం: ఇద్దరు పైలట్లు మృతి!

బేగంపేట ఎయిర్‌షో ప్రారంభ వేడుకల్లో చోటు చేసుకున్న విషాదకర సంఘటనలో పైలట్, కో పైలట్లు ఇద్దరూ మృతి చెందిననట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఏకే.ఖాన్ తెలిపారు. ఎయిర్ షో ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు సూర్య కిరణ్ విమానాలు సాహస విన్యాసాలను బుధవారం చేపట్టాయి.
Source: Yahoo! Telugu: News | 3 Mar 2010 | 7:01 am

పెంచిన పెట్రో ధరలపై మిత్రపక్షాలతో చర్చిస్తాం: ప్రణబ్

పెట్రో ధరల పెంపుపై తమ మిత్రపక్షాలు నిరసన గళం విప్పాయని, దీంతో తాము పెంచిన ధరలకు కారణాలను వివరించేందుకు వారితో సమావేశమై చర్చిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ న్యూ ఢిల్లీలో తెలిపారు
Source: Yahoo! Telugu: News | 3 Mar 2010 | 6:41 am

బేగంపేటలో కూలిన విమానం.. పైలట్ మృతి: ఏకేఖాన్

బేగంపేట్ ఎయిర్‌షో ప్రదర్శన ప్రారంభ వేడుకల్లో చోటు చేసుకున్న విషాదంలో పైలట్ మృతి చెందినట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఏకే.ఖాన్ తెలిపారు. అలాగే, మరో నలుగు గాయపడినట్టు ఆయన బుధవారం వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 3 Mar 2010 | 6:34 am

3జీ సేవలను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత సంచార నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు చెందిన 3జీ సేవలను రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రారంభించారు.
Source: Yahoo! Telugu: News | 3 Mar 2010 | 6:06 am

అది మీరనుకునే కెమిస్ట్రీ కాదు: జగపతి బాబు

ప్రియమణి, జగపతి బాబుల మధ్య ప్రేమాయణం సాగుతుందనేది ఇండస్ట్రీలో పాత వార్తే. అయినా ఈ మధ్య ఎక్కువగా ఫంక్షన్లకు ఇద్దరూ అటెండ్ కావడం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. లేటు వయసులో ప్రేమాయణం అంటున్న జగపతిబాబును "ప్రవరాఖ్యుడు"లో రొమాంటిక్ సీన్స్ బాగా పండాయనీ, దీన్నిబట్టి మీ ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరిందని విలేకరులు అడిగారు. దీంతో జగపతి బాబు... "మీరడిగే కెమిస్ట్రీ నాకు తెలుసు. కానీ... మేమిద్దరం మంచి స్నేహితులం. మా మధ్య ఉన్న స్నేహానుబంధం తెరపై రిఫ్లెక్ట్ అయి రొమాంటిక్ సీన్స్‌కు రియల్‌గా ఉన్న అనుభూతి కలుగుతుంది" అని చెప్పాడు. అంతకుమించి ఏమీ లేదని వెల్లడించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Mar 2010 | 5:02 am

వరుణ్ సందేశ్ "మరో చరిత్ర" ట్రెయిలర్

మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వరుణ్ సందేశ్, అనిత హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "మరో చరిత్ర". గతంలో దశావతారం కమల్ హాసన్, స్వప్న జంటగా నటించగా, కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన "మరో చరిత్ర" క్లాసిక్ చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది.ఇదే తరహాలో వరుణ్ సందేశ్ హీరోగా రూపొందుతోన్న "మరో చరిత్ర" తెలుగు ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రానికి రవియాదవ్ దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తన మిత్రులతో కలసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Mar 2010 | 4:54 am

అమెరికా ప్రోద్భలంతోనే ఆ చర్చలు: ఎల్కే.అద్వానీ!

భారత్ - పాకిస్థాన్ దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల కార్యదర్శుల స్థాయి సమావేశం అమెరికా ప్రోద్భలంతోనే జరిగిందని భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ ఎల్కే.అద్వానీ అరోపించారు. భారత ప్రభుత్వం తరపున కేంద్ర విదేశాంగ కార్యదర్శి నిరుపమారావు పాల్గొనగా, పాక్ తరపున ఆ దేశ విదేశాంగ కార్యదర్శి పాల్గొన్నారు.
Source: జాతీయ | 3 Mar 2010 | 2:53 am

విభజనకు జైకొట్టు.. భవిష్యత్ బాగుంటుంది: జానా

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి రాష్ట్ర మాజీ హోంమంత్రి కె.జనారెడ్డి ఒక సూచన చేశారు. చిరంజీవి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సలహా ఇచ్చినట్టు సమాచారం. భవిష్యత్ బాగుండాలంటే సమైక్యవాదానికి గుడ్‌బై చెప్పి.. విభజనకు అనుకూలంగా ప్రకటన చేయాలని కోరినట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 3 Mar 2010 | 2:37 am

మార్చి 25న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మహారాష్ట్ర

మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25వ తేదీన శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా మార్చి 25వ తేదీన మహారాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Source: జాతీయ | 3 Mar 2010 | 1:59 am

బేగంపేటలో కూలిన విమానం.. పైలట్ మృతి: ఏకేఖాన్

బేగంపేట్ ఎయిర్‌షో ప్రదర్శన ప్రారంభ వేడుకల్లో చోటు చేసుకున్న విషాదంలో పైలట్ మృతి చెందినట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఏకే.ఖాన్ తెలిపారు. అలాగే, మరో నలుగు గాయపడినట్టు ఆయన బుధవారం వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 3 Mar 2010 | 1:33 am

కూలిన సూర్యకిరణ్ విమానం: ఇద్దరు పైలట్లు మృతి!

బేగంపేట ఎయిర్‌షో ప్రారంభ వేడుకల్లో చోటు చేసుకున్న విషాదకర సంఘటనలో పైలట్, కో పైలట్లు ఇద్దరూ మృతి చెందిననట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఏకే.ఖాన్ తెలిపారు. ఎయిర్ షో ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు సూర్య కిరణ్ విమానాలు సాహస విన్యాసాలను బుధవారం చేపట్టాయి.
Source: ఏపీ న్యూస్ | 3 Mar 2010 | 1:32 am

బేగంపేట్ ఎయిర్‌షోలో విషాదం: కూలిన సూర్యకిరణ్!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభమైన బేగంపేట ఎయిర్‌ షోలో విషాదం చోటు చేసుకుంది. అట్టహాసంగా ప్రారంభమైన ఎయిర్‌షో వేడుకల్లో ఆరంభంలోనే అపశృతి చోటు చేసుకుంది. నేవీకి చెందిన నాలుగు సూర్యకిరణ్ విమానాలు ఆకాశంలో సాహస విన్యాసాలు చేస్తుండగా, అందులో ఒకటి అకస్మాతుగా జనావాసాలపై కూలిపోయింది.
Source: ఏపీ న్యూస్ | 3 Mar 2010 | 1:07 am

గవర్నర్ "విందు"కు.. కమిటీ "ముందు"కు తెరాస!

తెలంగాణ రాష్ట్ర సమితి తన వైఖరిని మెల్లగా మార్చుకుంటోంది. రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు, సంప్రదింపులు జరిపేందుకు కేంద్రం వేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఎదుట హాజరుకావాలని నిర్ణయించింది. అలాగే, శ్రీకృష్ణ బృందంతో పాటు ఎనిమిది పార్టీల నేతలకు గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ ఈనెల నాలుగో తేదీన ఇచ్చే ప్రత్యేక విందు కార్యక్రమానికి కూడా హాజరుకావాలని తెరాస అధినాయకత్వం నిర్ణయించింది.
Source: ఏపీ న్యూస్ | 3 Mar 2010 | 12:02 am

ఆర్టీపీఎస్‌కు తక్షణం నీరివ్వాలి: ప్రతిపక్షాల డిమాండ్!

రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ (ఆర్టీపిఎస్)కు తక్షణం మైలవరం కాల్వ నుంచి నీరు ఇవ్వాలని బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. ఆర్టీపీఎస్‌కు కాదని బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీకి నీరు సరఫరా చేయడం పట్ల ప్రతిపక్షాల తప్పు పట్టాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకోవాలని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సూచించారు.
Source: ఏపీ న్యూస్ | 2 Mar 2010 | 11:39 pm

భారత్‌ను ప్రేమించాను.. కానీ తిరస్కరించింది: హుస్సేన్

భారతదేశాన్ని ఎంతగానో ప్రేమించానని అయితే, ఆ దేశమే తనను తిరస్కరించిందని ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు. సంఘ్ పరివార్ శక్తులు తనపై విమర్శల దాడి పరంపర కొనసాగిస్తుంటే.. రాజకీయ నేతలు, మేధావులు, కళాకారులు పెదవి విప్పలేదు. ఇది తన హృదయాన్ని ఎంతగానో గాయపరిచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 2 Mar 2010 | 10:50 pm

వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టిన విపక్షాలు

శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలుగుదేశం, సీపీఎంలు మహిళలకు పావలా వడ్డీ రుణాలు, పెన్షన్లపై, డీఎస్సీ-2008 క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు పోస్టింగులపై ప్రజారాజ్యం పార్టీ, విశ్వవిద్యాలయాలకు నూతన పాలకమండళ్లపై సీపీఐ, చేతి, కులవృత్తులకు బడ్జెట్‌లో నామమాత్రపు కేటాయింపులపై భారతీయ జనతా పార్టీలు వాయిదా తీర్మానాలను ప్రవేశ పెట్టాయి
Source: ఏపీ న్యూస్ | 2 Mar 2010 | 9:55 pm

కోల్‌కతా నగరంలో అరెస్టైన మావోయిస్ట్‌ అగ్రనేత దీపక్

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీకి కుడిభుజంగా భావించే తెలుగు దీపక్‌ను కోల్‌కతాలో మంగళవారంనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన వెంకటేశ్వరరెడ్డి (40) రాడికల్‌ విద్యార్థి సంఘం నేత రవిచంద్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధుడు. ఇతనిని కోల్‌కతా శివార్లలోని సర్శునాలో అరెస్టు చేసినట్టు సీఐడీ అడిషనల్‌ డీజీపీ రాజ్‌ కనోజియా మీడియాకు తెలిపారు.
Source: జాతీయ | 2 Mar 2010 | 9:01 pm

ధరలపై లోక్‌సభను దిగ్బంధనం చేయనున్న ప్రతిపక్షాలు

దేశంలో ఇటీవల పెరిగిన ఇంధన ధరల పెంపును నిరసిస్తూ బుధవారం లోక్‌సభను స్తంభింపజేయాలని ప్రతిపక్షాలు వ్యూహప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఉభయసభల్లోనో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు వామపక్షాలు, భాజపా తదితర ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి.
Source: జాతీయ | 2 Mar 2010 | 8:25 pm

వేసవిలో ప్రేక్షకుల ముందుకు "బెట్టింగ్ బంగార్రాజు"

ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మిస్తున్న చిత్రం బెట్టింగ్ బంగార్రాజు. ఇ. సత్తిబాబు దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్స్ కూడా పూర్తయింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర దర్శకుడు సత్తిబాబు చెప్పారు.నరేష్ మాట్లాడుతూ... పెద్ద సంస్థల్లో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉన్నది. గమ్యం తర్వాత నాగరాజు సంభాషణలు రాశారు. ఇందులో నాలుగు పాటలున్నాయి. బెండు అప్పారావు, బ్లేడు బాబ్జీలా ఇది సెంటిమెంట్ గా ఉంటుందని అందరూ అంటున్నారన్నారు. చలపతిరావు మాట్లాడుతూ... ప్రస్తుతం నరేష్ యుగం నడుస్తోందనీ, ఏడాదికి 6 చిత్రాల్లో నటిస్తూ 10మందికి పని కల్పిస్తున్నాడని ప్రశంసించారు. మయూరి ఫిలిం సుధాకర్ మాట్లాడుతూ... మా బ్యానర్లో 84వ చిత్రమిది. కామెడీతోపాటు చిన్నపాటి సందేశం కూడా ఇందులో ఉందని తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Mar 2010 | 12:18 pm

ఆడియో వేడుకలో "జై తెలంగాణా": "పులి" సైగతో గప్‌చిప్

రాజకీయాల్లో అవినీతి నిర్మూలిస్తేనే దేశం బాగుపడుతుందనే కథాంశంతో "లెనిన్" అనే చిత్రం తయారవుతోంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం ఫిలిమ్ ఛాంబర్లో జరిగింది. తెలంగాణా జర్నలిస్ట్ ఫోరం నాయకుడు, ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ అల్లం నారాయణ ముఖ్య అతిథిగా వచ్చారు. సీడీ విడుదల అనంతరం ఆయన మట్లాడుతుండగా.. "కార్యకర్తలు కొంతమంది జై తెలంగాణా అంటూ నినదించారు. చిత్ర దర్శకుడు పులి అమృత్ సైగ చేయగానే వెంటనే ఆపివేశారు. తర్వాత అల్లం నారాయణ మాట్లాడుతూ... "సినిమావాళ్లపై మాకేమీ కోపం లేదు. రాజకీయనాయకులు తెలంగాణా గొడవల్లో రకరకాలుగా స్పందించినా ఇండస్ట్రీ మాత్రం చాలా చక్కగా మాట్లాడింది. వారి మాటల్లో క్లారిటీ ఉంది. మేం ఇండస్ట్రీని కబ్జా చేయడం లేదు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Mar 2010 | 12:06 pm

బికినీ వేసుకోవడం వల్ల సినిమా హిట్ అవదు: నయనతార

తొలుత శింబు.. ఇప్పుడు ప్రభుదేవాల ప్రేమాయణంలో బాగా వార్తల్లోకి వచ్చిన నయనతార... చిత్రసీమలో పాపులారిటీయే ముఖ్యమని చెపుతోంది. అంతేకాదు అదెలా సంపాదించుకోవాలనే విషయంలో పెద్దగా విలువలు పాటించనక్కర్లేదని అంటోంది. గతంలో ఆమెను వెతుక్కుంటూ వచ్చిన ఆఫర్ హిందీ "గజిని"ని తిరస్కరించింది. అదేమో పెద్ద హిట్టయి కూర్చుంది. అలా ఎందుకు చేశావ్..? అని అడిగితే... "అవును. అలా ఎందుకు కాదన్నానో నాకిప్పటికీ అర్థం కావడం లేదు.. మీకేమైనా తెలుసా...?" అని మనల్నే ప్రశ్నిస్తోంది.తమిళ 'బిల్లా' చిత్రంలో బికినీ వేయడం వల్ల ఆ చిత్రం హిట్ అయిందా...? అనడిగితే, "సినిమా బాగుంటేనే జనం చూస్తారు.. బికినీలు వేసుకోవడం వల్ల కాదు. అలాగైతే ప్రతి సినిమాలోనూ హీరోయిన్ల చేత బికినీలే వేయిస్తారుగా" అని చమత్కరిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Mar 2010 | 8:49 am

శ్రీకృష్ణకు అభిప్రాయాలు చెప్పండి: చిదంబరం

శ్రీకృష్ణ కమిటీ రాజధానికి వస్తున్న నేపధ్యంలో కేంద్రం హోం మంత్రి చిదంబరం మాట్లాడుతూ... రాష్ట్రంలోని భాద్యతాయుత పార్టీలన్నీ శ్రీకృష్ణ కమీటిని కలిసి వారి వారి అభిప్రాయాలను వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు.
Source: జాతీయ | 2 Mar 2010 | 7:36 am

రానా సూపర్ మూవీ "లీడర్" ట్రెయిలర్ మీకోసం...

డా. డి. రామానాయుడు మనుమడు, సురేష్‌బాబు కొడుకు రామానాయుడు(రానా)ను హీరోగా పరిచయం చేస్తూ ఏవీఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థ 'లీడర్' చిత్రాన్నినిర్మించింది. విడుదలైన అన్ని కేంద్రాలలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న జూనియర్ రామానాయుడు నటనలోనూ శభాష్ అనిపించుకుంటున్నాడు. కాలేజీ జీవితాన్ని కళ్లకు కట్టినట్టు ‘హ్యాపిడేస్’గా మలచిన "శేఖర్ కమ్ముల" నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో ‘లీడర్’ చిత్రంలో ద్వారా చక్కగా చెప్పారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..
Source: Yahoo! Telugu: Entertainment | 2 Mar 2010 | 5:59 am

జగపతిబాబు "సాధ్యం" ట్రెయిలర్

జగపతిబాబు, ప్రియమణి జంటగా రూపొందుతోన్న చిత్రం సాధ్యం. ఈ చిత్రాన్ని కుమార్ బ్రదర్స్ సినిమా పతాకంపై కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... "వైవిద్యమైన కథ, కథనాలతో రూపొందుతోన్న చిత్రమిది. 'ఆది' చిత్రం ఫేమ్ కీర్తిచావ్లా కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఇప్పటివరకూ జగపతిబాబు, ప్రియమణిలు తమ కెరీర్‌లో పోషించనటువంటి భిన్నమైన పాత్రలను ఇందులో చేస్తున్నారు. చిన్న చరణ్ సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలకు మంచి స్పందన వస్తోంది. హీరో, హీరోయిన్ల పాత్రలు అందరికీ థ్రిల్లింగ్ కలిగిస్తాయి. కథ, కథనాలే చిత్రానికి ప్రధాన బలం. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాము" అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Mar 2010 | 5:50 am

ధరల పెరుగుదలలో ప్రతిపక్షాల పాత్రా ఉంది: ములాయం

దేశంలో నిత్యావసరవస్తు ధరలు పెరగడంలో ప్రతిపక్షాల పాత్ర కూడా ఉందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ అన్నారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అడ్డుకోవడంలో ప్రతిపక్షాలు విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు.
Source: జాతీయ | 2 Mar 2010 | 5:18 am

హీరోయిన్లే వాంప్‌ల్లా ఉంటున్నారు.. నాతో పనేంటి..?: అభినయశ్రీ

"అ అంటే అమలాపురం" అంటూ కుర్రకారును వెర్రెత్తించిన ఐటంగర్ల్ అభినయశ్రీకి ఇంకా పెళ్లి వయస్సురాలేదట. ఐటంసాంగ్‌ల ద్వారా సినిమాల్లోకి వచ్చిన ఈ భామ ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రలవైపు మొగ్గుచూపుతుంది. డాన్స్‌ చేసిచేసి తనకేకాదు చూసే ప్రేక్షకుడికి కూడా మొహం మొత్తిందని అసలు విషయం బయట పెట్టేసింది. అంతేకాదు.. హీరోయిన్లే వాంప్‌ల్లా ఉంటుంటే ఇక మాతోపనేముందని? నిర్మొహమాటం సెలవిస్తోంది.ఇక ఐటంసాంగ్‌లు, డాన్స్ అవకాశాలు అంతగా చేతికందకపోవడంతో పెళ్లి చేసేసుకుంటారా? అని అభినయశ్రీని అడిగితే.. ముందు గ్రాఫిక్స్ స్టూడియో ఏర్పాటు కోసం కష్టపడుతున్నా. ఆ రంగంలో ఎదిగాక పెళ్లిగురించి ఆలోచిస్తా. బహుశా కనీసం పెళ్లికి ఆరు సంవత్సరాలైనా పట్టవచ్చునని అభినయశ్రీ చెబుతోంది. ఇంకేముంది..? ఆరేళ్ల తర్వాతైనా అభినయశ్రీకి పెళ్లి వయస్సు వస్తుందేమో? వేచి చూడాల్సిందే..!.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Mar 2010 | 4:48 am

తెదేపా ఇచ్చిన సొమ్ముకంటే ఎక్కువగా ఇస్తాం: రోశయ్య

చీమకుర్తి గ్రానైట్ క్వారీ ప్రమాదంలో మృత్యువాత పడిన కార్మికుల కుటుంబాలకు తెలుగుదేశం హయాంలో చెల్లించిన సాయం కంటే పది వేల రూపాయలు ఎక్కువగానే చెల్లిస్తామని ముఖ్యమంత్రి రోశయ్య అసెంబ్లీకి తెలిపారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని హంస గ్రానైట్ క్వారీ ప్రమాదంపై మంగళవారం అసెంబ్లీ తీవ్రస్థాయిలో గందరగోళం జరిగిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 2 Mar 2010 | 4:47 am

కరిష్మా కొటక్ గ్లామర్ ట్రెయిలర్

చలన చిత్రరంగంపై అవగాహన లేకుండా ప్రవేశిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న పాయింట్ తో తెరకెక్కిన చిత్రం గ్లామర్. శంకర్ దాదా జిందాబాద్ ఫేమ్ కరిష్మా కోఠక్ ప్రధాన పాత్రలో జనం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.కరిష్మా కోఠక్ మాట్లాడుతూ... గ్లామర్‌తోపాటు నటనకు అవకాశం ఉన్న చక్కటి పాత్రను ఈ చిత్రంలో పోషించానని అన్నారు. ఈ సినిమా విడుదల తర్వాత తెలుగులో తనకు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేయగా, ఇందులోని ఆరు పాటలు చాలా బాగా వచ్చాయని సంగీత దర్శకుడు బాంబే రవి అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Mar 2010 | 4:37 am

చీమకుర్తి మృతులకు రూ.15 లక్షలు ఇవ్వాలి: బాబు

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని హంస గ్రానైట్ క్వారీ ప్రమాదంలో అశువులు బాసిన ఒక్కో మృతుని కుటుంబానికి 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 2 Mar 2010 | 4:19 am

తెలంగాణ వ్యాప్తంగా శాంతియుత నిరసనలు: టి ఐకాస

జస్టీస్ శ్రీకృష్ణ కమిటి రాకను నిరశిస్తూ తెలంగాణ వ్యాప్తంగా శాంతియుత నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నిర్ణయించింది. ఇందులోభాగంగా ఈనెల నాలుగు, ఐదు తేదీల్లో హైదరాబాద్‌లో జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని నిరసన తెలుపాలని నిర్ణయించినట్టు ఐకాస కన్వీనర్ ఆచార్య కోదండరామ్ తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 2 Mar 2010 | 4:11 am

బికినీ వేసుకోవడం వల్ల సినిమా హిట్ అవదు: నయనతార

తొలుత శింబు.. ఇప్పుడు ప్రభుదేవాల ప్రేమాయణంలో బాగా వార్తల్లోకి వచ్చిన నయనతార... చిత్రసీమలో పాపులారిటీయే ముఖ్యమని చెపుతోంది. అంతేకాదు అదెలా సంపాదించుకోవాలనే విషయంలో పెద్దగా విలువలు పాటించనక్కర్లేదని అంటోంది. గతంలో ఆమెను వెతుక్కుంటూ వచ్చిన ఆఫర్ హిందీ "గజిని"ని తిరస్కరించింది.
Source: వినోదం | 2 Mar 2010 | 3:20 am

హిందుస్థాన్ భారతీయులందరిదీ: ఆశా భోంష్లే

హిందుస్థాన్ భారతీయులందరికీ చెందుతుందని ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోంష్లే అభిప్రాయపడ్డారు. అదేసమయంలో తాను మహారాష్ట్రియన్‌గా ఉండటాన్ని గర్విస్తున్నట్టు ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, మరాఠీ సెంటిమెంట్‌పై లోతుగా వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు. ప్రధానంగా ముంబై, మఠాఠీ అంశాలకు ఆమె దూరంగా ఉన్నారు.
Source: జాతీయ | 2 Mar 2010 | 2:38 am