వార్తా పత్రికలను వెనక్కు నెట్టిన ఇంటర్‌నెట్

ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం పెరిగుతుండటంతో టీవీలు ఆ వార్తలను ప్రసారం చేసేందుకు ముందుకు వచ్చాయి. కాని టీవీలకు ధీటుగా ఇప్పుడు ఇంటర్‌‌నెట్ వార్తలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాయి. దీంతో ఎక్కడ, ఎప్పుడు, ఏ సంఘటన జరిగినా అది వెంటనే మనకు ఇంటర్‌నెట్‌‍లో దర్శనమిస్తోందని, ప్రజలు కూడా ఇంటర్‌నెట్‌నే ఎక్కువగా ఇష్టపడుతున్నారని వార్తా ఏజెన్సీ అయిన డిపిఎ మంగళవారం తన సర్వేలో వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 2 Mar 2010 | 8:15 am

హిందుస్థాన్ భారతీయులందరిదీ: ఆశా భోంష్లే

హిందుస్థాన్ భారతీయులందరికీ చెందుతుందని ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోంష్లే అభిప్రాయపడ్డారు. అదేసమయంలో తాను మహారాష్ట్రియన్‌గా ఉండటాన్ని గర్విస్తున్నట్టు ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, మరాఠీ సెంటిమెంట్‌పై లోతుగా వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు. ప్రధానంగా ముంబై, మఠాఠీ అంశాలకు ఆమె దూరంగా ఉన్నారు.
Source: Yahoo! Telugu: News | 2 Mar 2010 | 8:08 am

భారీ లాభాల దిశగా బాంబే స్టాక్ మార్కెట్

మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్‌కు అన్ని విధాలా కలిసొచ్చింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి విదేశీ మార్కెట్ల ప్రభావంతో ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 311 పాయింట్లు గణనీయంగా వృద్ధిచెంది, 16,741 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 93 పాయింట్లు బలపడి, 5,015 పాయింట్ల మార్కును తాకింది.
Source: Yahoo! Telugu: News | 2 Mar 2010 | 7:47 am

ఒబామా యంత్రాంగంలో భారతీయ మహిళకు చోటు!

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా యంత్రాంగంలో మరో భారత సంతతికి చెందిన మహిళకు చోటు దక్కింది. ప్రెసిడెంట్స్ అడ్వైసరీ కమిటీ ఆన్ ఆర్ట్స్‌లో ఇండో-అమెరికా ఆటార్నీగా ఉన్న అమీ కె.సింగ్‌కు చోటు కల్పించారు. ప్రతిష్టాత్మక జాన్ ఎఫ్ కెన్నడీ సెంటర్‌ ఫర్ పెర్ఫామింగ్ ఆర్ట్స్ కోసం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు వైట్‌హౌస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 2 Mar 2010 | 7:43 am

ఆసియా మార్కెట్ ప్రభావం: 5వేల మార్కును తాకిన నిఫ్టీ

ఆసియా మార్కెట్ ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభదాయకంగా కొనసాగుతోంది. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభాలను ఆర్జించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 270 పాయింట్లు భారీగా లాభపడి, 16,699 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 82 పాయింట్లు వృద్ధి చెంది, 5,004 మార్కును తాకింది.
Source: Yahoo! Telugu: News | 2 Mar 2010 | 7:39 am

అమ్మకాల్లో 22 శాతం వృద్ధి సాధించిన మారుతీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలోని ఫిబ్రవరి నెలలో తమ సంస్థకు చెందిన వాహనాల అమ్మకాలలో 22.05 శాతం వృద్ధి చెంది 96,650 వాహనాలు అమ్ముడైనాయని మారుతి సుజుకీ ఇండియా సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది
Source: Yahoo! Telugu: News | 2 Mar 2010 | 7:16 am

హైకమాండ్ చిలుక పలుకులే బొత్స మాటలు: దేవినేని

కాంగ్రెస్ హైకమాండ్‌కు చెందిన కొందరు పెద్దలు పలుకుతున్న చిలుక పలుకులనే మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. ఆయన మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 2 Mar 2010 | 6:37 am

అసలు ఆంధ్ర ప్రజలు విడిపోవాలనుకుంటున్నారా...?!!

వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగతులై రోజులు గడవకముందే రాష్ట్ర విభజన డిమాండ్ ఒక్కసారిగా ప్రజలపైకి దూసుక వచ్చింది. ఆ తర్వాత ఎన్నో మలుపులు తిరుగుతూ తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో మరోసారి వేడి రాజుకుంది. "రాష్ట్రాన్ని విడగొడతాం" అని కేంద్రం ప్రకటించినప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడిన సీమాంధ్ర నాయకులు క్రమంగా ఒక్కొక్కరూ ప్లేటు ఫిరాయిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 2 Mar 2010 | 6:36 am

నేడు భారత్‌కు రానున్న ఆసీస్ విదేశాంగ మంత్రి!

ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి స్టీఫెన్ స్మిత్ బుధవారం భారత్‌కు రానున్నారు. రెండో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని భారతీయులపై జరిగిన దాడులు, వాటిపై ఆసీస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను భారత అధికారులకు ఆయన వివరించనున్నారు.
Source: Yahoo! Telugu: News | 2 Mar 2010 | 6:18 am

3.5 లక్షల కోట్లకు చేరుకున్న దేశీయ ఆర్థిక లోటు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి పది నెలల కాలానికి దేశీయ ఆర్థిక లోటు 34 శాతం పెరిగి రూ. 3.5 లక్షల కోట్లకు చేరుకుందని ఆర్థిక నిపుణులు తెలిపారు. అదే నిరుడు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి రూ. 2.62 లక్షల కోట్లుగా ఉండింది. ముఫై నాలుగు శాతం లోటు పెరగడానికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు
Source: Yahoo! Telugu: News | 2 Mar 2010 | 6:08 am

రానా సూపర్ మూవీ "లీడర్" ట్రెయిలర్ మీకోసం...

డా. డి. రామానాయుడు మనుమడు, సురేష్‌బాబు కొడుకు రామానాయుడు(రానా)ను హీరోగా పరిచయం చేస్తూ ఏవీఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థ 'లీడర్' చిత్రాన్నినిర్మించింది. విడుదలైన అన్ని కేంద్రాలలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న జూనియర్ రామానాయుడు నటనలోనూ శభాష్ అనిపించుకుంటున్నాడు. కాలేజీ జీవితాన్ని కళ్లకు కట్టినట్టు ‘హ్యాపిడేస్’గా మలచిన "శేఖర్ కమ్ముల" నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో ‘లీడర్’ చిత్రంలో ద్వారా చక్కగా చెప్పారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..
Source: Yahoo! Telugu: Entertainment | 2 Mar 2010 | 5:59 am

జగపతిబాబు "సాధ్యం" ట్రెయిలర్

జగపతిబాబు, ప్రియమణి జంటగా రూపొందుతోన్న చిత్రం సాధ్యం. ఈ చిత్రాన్ని కుమార్ బ్రదర్స్ సినిమా పతాకంపై కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... "వైవిద్యమైన కథ, కథనాలతో రూపొందుతోన్న చిత్రమిది. 'ఆది' చిత్రం ఫేమ్ కీర్తిచావ్లా కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఇప్పటివరకూ జగపతిబాబు, ప్రియమణిలు తమ కెరీర్‌లో పోషించనటువంటి భిన్నమైన పాత్రలను ఇందులో చేస్తున్నారు. చిన్న చరణ్ సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలకు మంచి స్పందన వస్తోంది. హీరో, హీరోయిన్ల పాత్రలు అందరికీ థ్రిల్లింగ్ కలిగిస్తాయి. కథ, కథనాలే చిత్రానికి ప్రధాన బలం. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాము" అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Mar 2010 | 5:50 am

హీరోయిన్లే వాంప్‌ల్లా ఉంటున్నారు.. నాతో పనేంటి..?: అభినయశ్రీ

"అ అంటే అమలాపురం" అంటూ కుర్రకారును వెర్రెత్తించిన ఐటంగర్ల్ అభినయశ్రీకి ఇంకా పెళ్లి వయస్సురాలేదట. ఐటంసాంగ్‌ల ద్వారా సినిమాల్లోకి వచ్చిన ఈ భామ ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రలవైపు మొగ్గుచూపుతుంది. డాన్స్‌ చేసిచేసి తనకేకాదు చూసే ప్రేక్షకుడికి కూడా మొహం మొత్తిందని అసలు విషయం బయట పెట్టేసింది. అంతేకాదు.. హీరోయిన్లే వాంప్‌ల్లా ఉంటుంటే ఇక మాతోపనేముందని? నిర్మొహమాటం సెలవిస్తోంది.ఇక ఐటంసాంగ్‌లు, డాన్స్ అవకాశాలు అంతగా చేతికందకపోవడంతో పెళ్లి చేసేసుకుంటారా? అని అభినయశ్రీని అడిగితే.. ముందు గ్రాఫిక్స్ స్టూడియో ఏర్పాటు కోసం కష్టపడుతున్నా. ఆ రంగంలో ఎదిగాక పెళ్లిగురించి ఆలోచిస్తా. బహుశా కనీసం పెళ్లికి ఆరు సంవత్సరాలైనా పట్టవచ్చునని అభినయశ్రీ చెబుతోంది. ఇంకేముంది..? ఆరేళ్ల తర్వాతైనా అభినయశ్రీకి పెళ్లి వయస్సు వస్తుందేమో? వేచి చూడాల్సిందే..!.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Mar 2010 | 4:48 am

కరిష్మా కొటక్ గ్లామర్ ట్రెయిలర్

చలన చిత్రరంగంపై అవగాహన లేకుండా ప్రవేశిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న పాయింట్ తో తెరకెక్కిన చిత్రం గ్లామర్. శంకర్ దాదా జిందాబాద్ ఫేమ్ కరిష్మా కోఠక్ ప్రధాన పాత్రలో జనం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.కరిష్మా కోఠక్ మాట్లాడుతూ... గ్లామర్‌తోపాటు నటనకు అవకాశం ఉన్న చక్కటి పాత్రను ఈ చిత్రంలో పోషించానని అన్నారు. ఈ సినిమా విడుదల తర్వాత తెలుగులో తనకు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేయగా, ఇందులోని ఆరు పాటలు చాలా బాగా వచ్చాయని సంగీత దర్శకుడు బాంబే రవి అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Mar 2010 | 4:37 am

హిందుస్థాన్ భారతీయులందరిదీ: ఆశా భోంష్లే

హిందుస్థాన్ భారతీయులందరికీ చెందుతుందని ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోంష్లే అభిప్రాయపడ్డారు. అదేసమయంలో తాను మహారాష్ట్రియన్‌గా ఉండటాన్ని గర్విస్తున్నట్టు ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, మరాఠీ సెంటిమెంట్‌పై లోతుగా వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు. ప్రధానంగా ముంబై, మఠాఠీ అంశాలకు ఆమె దూరంగా ఉన్నారు.
Source: జాతీయ | 2 Mar 2010 | 2:38 am

రాణింపునకు విశ్వసనీయత ముఖ్యం: వైఎస్.జగన్

ఏదైనా రంగంలో రాణించాలంటే విశ్వసనీయత ముఖ్యమని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్ అన్నారు. కడప ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. మాట మీద నిలబడిన వారే రాజకీయాల్లో రాణిస్తారని ఆయన అన్నారు. రాజకీయాల్లోనే కాకుండా ఏ రంగంలోనైనా అడుగుపెట్టేవారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
Source: ఏపీ న్యూస్ | 2 Mar 2010 | 2:24 am

హైకమాండ్ చిలుక పలుకులే బొత్స మాటలు: దేవినేని

కాంగ్రెస్ హైకమాండ్‌కు చెందిన కొందరు పెద్దలు పలుకుతున్న చిలుక పలుకులనే మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. ఆయన మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 2 Mar 2010 | 1:08 am

అపఖ్యాతిపాలు చేసేందుకు ఆ వ్యాసం: తస్లీమా నస్రీన్

తన రచనల్లో ఎక్కడా కూడా బుర్ఖాకు వ్యతిరేకంగా రాయలేదని బంగ్లాదేశ్‌కు చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ స్పష్టం చేశారు. కన్నడ పత్రికల్లో తాను రాసినట్టుగా ప్రచురితమైన వ్యాసం తనను అపఖ్యాతిపాలు చేసేందుకే దాన్ని ప్రచురించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 2 Mar 2010 | 12:34 am

రేపు మధ్యాహ్నం తెరాస పొలిట్‌బ్యూరో కీలక భేటీ!

తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్‌బ్యూరో సమావేశం బుధవారం జరుగనుంది. ఆ పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో బుధవారం మధ్యాహ్నం పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు నేతృత్వంలో జరుగనున్నట్టు ఆ పార్టీ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
Source: ఏపీ న్యూస్ | 1 Mar 2010 | 11:48 pm

పెట్రో ధరల తగ్గింపు తీర్మానానికి చంద్రబాబు డిమాండ్!

ఇటీవల పెరిగిన పెట్రో డీజల్ ధరలను తగ్గించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం సభా కార్యక్రమాలు ప్రారంభమైన వెంటనే ఆయన ఈ తరహా తీర్మానానికి పట్టుబట్టారు. దీనికి స్పీకర్ తిరస్కరించారు.
Source: ఏపీ న్యూస్ | 1 Mar 2010 | 11:23 pm

నేటి నుంచి నాగా వేర్పాటువాదులతో కేంద్రం చర్చలు!

ఆరు దశాబ్దాలుగా పరిష్కారం లభించని అఖండ నాగాలాండ్ ఏర్పాటు డిమాండ్‌ పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అఖండ నాగాలాండ్ ఉద్యమ నేతలతో కేంద్రం మంగళవారం నుంచి చర్చలు జరుపనుంది. గత ఆరు దశాబ్దాలుగా మిన్నకుండిని కేంద్రం ఈ దఫా మాత్రం ఉద్యమకారులను చర్చలకు ఆహ్వానించడం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు.
Source: జాతీయ | 1 Mar 2010 | 11:02 pm

మాజీ మంత్రి బాలాగౌడ్‌కు అసెంబ్లీ నివాళులు!

అనారోగ్యం కారణంగా మృతి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి బాలాగౌడ్‌‌కు రాష్ట్ర శాశన సభ ఘన నివాళులు సమర్పించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 82 సంవత్సరాల బాలాగౌడ్ సోమవారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 1 Mar 2010 | 10:49 pm

రాజ్యసభలో తెలంగాణ ప్రైవేటు బిల్లు: ప్రకాష్ జావ్‌దేకర్

రాజ్యసభలో తెలంగాణ ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జావ్‌దేకర్ వెల్లడించారు. ఈనెల ఐదో తేదన ప్రత్యేక తీర్మానంపైనా, ప్రైవేటు బిల్లుపైనా చర్చకు ఉపక్రమిస్తామని వెల్లడించారు. ఈ బిల్లుపై తమ పార్టీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 1 Mar 2010 | 10:39 pm

తస్లీమా నవల రేపిన హింస: కర్ణాటకలో ఇద్దరి మృతి!

బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ నవలను కన్నడంలోకి అనువదించడం వల్ల కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లాలో మత కలహాలకు దారి తీసింది. ఈ నవల సారాంశం ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని పేర్కొంటూ.. ఆ వర్గం వారు ఆగ్రహోద్రుక్తులయ్యారు. ఫలితంగా రెండు వర్గాల మధ్య హింస చెలరేగింది. ఈ ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, వందమందికి పైగా గాయపడ్డారు.
Source: జాతీయ | 1 Mar 2010 | 9:14 pm

పెట్రో ధరలు తగ్గించే ప్రసక్తే లేదు: ప్రధాని మన్మోహన్

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే ప్రసక్తే లేదని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తేల్చి చెప్పారు. అయితే, యూపీఏ స్వపక్షంలోనే నిరసన జ్వాలలు వ్యక్తమవుతుండటంతో పునరాలోచన చేయాలని కాంగ్రెస్ అదినేత్రి సోనియా గాంధీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
Source: జాతీయ | 1 Mar 2010 | 9:04 pm

అంత గోలెందుకు...? బాగుకోసమే చెపుతున్నా: బొత్స

మొన్నటివరకూ సమైక్య స్వరం వినిపిస్తూ వచ్చిన బొత్స ఉన్నట్లుండి హఠాత్తుగా విభజన రాగం అందుకోవడంతో ఆంధ్ర ప్రాంతంలో ఆయనకు అడుగడుగునా నిరసనలు ఎదురవుతున్నాయి. ఎక్కడికెళ్లినా విద్యార్థులు ఆయనను అడ్డుకుంటున్నారు. ఎక్కడికెళ్లినా సమైక్య నినాదం అందుకోవాలని ఘెరావ్ చేస్తున్నారు
Source: ఏపీ న్యూస్ | 1 Mar 2010 | 9:23 am

మహేష్‌తో సినిమా అంటే మాటలు కాదు: మంజుల

"తమ్ముడే... కానీ వాడి డేట్స్ కోసం నేను ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్నానో తెలుసా...? వాడితో సినిమా చేయాలంటే మాటలు కాద"ని అంటోంది మహేష్ బాబు సోదరి మంజుల. "మహేష్ బాబుతో సినిమా తీయడం అంటేనే గొప్ప కల. అందుకే తనతో ప్రతి సినిమా నా కలల చిత్రమే అవుతుంది. తమ్ముడని కాదు కానీ... తనతో పనిచేయడం చాలా సంతోషంగా సౌకర్యవంతంగా ఉంటుంది. చాలా సరదాగా అందర్నీ నవ్విస్తూ జీవితంలో ఏ కష్టమొచ్చినా నవ్వుతూ ఉండాలని చెపుతుంటాడు. అవి నాన్నగారి నుంచి వాడికబ్బాయి. అందుకే వాడితో సినిమా చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఏ మాయ చేసావె మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు మహేష్ బాబుతో సినిమాకు ప్లాన్ చేస్తున్నా. గౌతమ్ మీనన్ కూడా మహేష్‌కు కథ సిద్ధం చేశారు. అందులో నాకు తగిన పాత్ర వస్తే నటిస్తాన"ని అంటోంది మంజుల.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Mar 2010 | 9:23 am

పెరిగిన ధరలపై ఉమ్మడి పోరు: తెదేపా, వామపక్షాలు

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణలు కలిసి సోమవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ధరల పెంపుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరుసల్పేందుకు చర్చలు జరిపారు.
Source: ఏపీ న్యూస్ | 1 Mar 2010 | 8:37 am

తస్లీమా కథనంతో కర్నాటకలో హింస: ఒకరు మృతి

రచయిత్రి తస్లీమా నస్రీన్ వివాదాస్పద కథనంతో బెంగళూరులోని షిమాగో ప్రాంతం అట్టుడికింది. మతపరమైన పరదా సంప్రదాయాలను చర్చిస్తూ తస్లిమా రాసిన కథనాన్ని ఓ దినపత్రిక ప్రచురించడంతో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన షిమాగోలో ఆందోళనలు చెలరేగాయి.
Source: జాతీయ | 1 Mar 2010 | 8:37 am

కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైన నామినేటెడ్ పోస్టుల లొల్లి

రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేదు. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్యను కలిసి సోమవారం సాయంత్రం విన్నవించారు. రాష్ట్రంలో ఇంతవరకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేదని తమ ప్రభుత్వం ఏర్పడి దాదాపు తొమ్మిది నెలలు పూర్తి కావస్తోందని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని విహెచ్ ముఖ్యమంత్రిని కోరారు. ఇందులో ప్రధానంగా బిసి, బలహీనవర్గాల వారికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 1 Mar 2010 | 8:08 am

మార్చి 3న మార్కెట్లో మగధీర డీవీడీ

మగధీర డీవీడీ కొత్త టెక్నాలజీల్లో వస్తుంది. బ్లూ- రే అనే టెక్నాలజీతో హాలీవుడ్ చిత్రాలు హోమ్ డీవీడీలో విడుదలవుతాయి. తెలుగులో తొలిసారిగా ఆ టెక్నాలజీ ద్వారా "మగధీర" విడుదలవుతోంది. బాలాజీ వీడియోస్ నిరంజన్ ఖర్చుకు వెనుకాడకుండా ఈ డీవీడీని విడుదల చేస్తున్నారని చిత్ర నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ... యూఎస్, యూరప్ దేశాల్లో బ్లూ రే టెక్నాలజీ డీవీడీలు విడుదలవుతున్నాయి. ఇది ఖర్చుతో కూడుకున్నదైనా బాలాజీ వీడియోస్ నిరంజన్‌గారు ధైర్యం చేసి ముందుకు తెచ్చారు. ప్రతీ ఇంటిలో ఈ డీవీడీతో సినిమాను చక్కని క్లారిటీతో చూడొచ్చు అని పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Mar 2010 | 7:25 am

మగాళ్లనైతే "ఖయ్ ఖయ్"... ఆడాళ్లకు "హాయ్..!!"

బ్రహ్మానందం గురించి తెలిసినవారెవరూ.. ఆయన గురించి మంచి చెప్పిన పాపాన పోరు. మగవారిని, ఆడవారిని వేరువేరుగా చూడటం బ్రహ్మానందానికి కొట్టిన పిండని ముఖం మీదే చెప్పేసి వెళుతుంటారు. బ్రహ్మానందాన్ని మగవారు పలుకరిస్తే.. నొసలు చిట్లించో.. ముభావంగానో ఉండిపోతాడట. అదే ఆడవారు... అందులోనూ కొంచెం వయస్సులో ఉన్నవాళ్లు పలకరిస్తే.. చిరునవ్వుతో ఎంతోకాలం నుంచి పరిచయం ఉన్నట్లు చాలాసేపు వదలకుండా.. వాళ్లు ఇహ చాలు వదులు బాబోయ్ అన్నంతవరకూ మాట్లాడుతూనే ఉంటాటడట. కొత్త, పాత తేడా లేకుండా ఆడవారితో చాలా చనువుగా ఉంటాడనీ, అదే మగవారైతే.. అంటీ అంటనట్లుగా ఉంటూ... తప్పించుక తిరుగుతాడని టాలీవుడ్ సినీజనం టాక్. ఏమిటీ వైఖరి... లింగవివక్షతా లేక.. ఇదేమైనా వీక్‌నెస్సా..?!! అని చాలామంది తీవ్రంగా ఆలోచిస్తున్నారట. అన్నట్లు బ్రహ్మానందానికి పద్మ బిరుదు వచ్చాక అది మరింత ముదిరి తల బిరుసు పెరిగిందని అంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Mar 2010 | 5:33 am

నవదీప్ యాగం చిత్రం ట్రెయిలర్

అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన "యాగం" చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. రాజు, ప్రవీణ్‌లు నిర్మాణ సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రంలో నవదీప్, భూమిక, కిమ్ శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో భూమిక ఎయిర్ హొస్టెస్‌గా నటిస్తోంది.ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ... బ్యాంకాక్‌లోని రూరల్ ఏరియాలో ఓ బార్లో నవదీప్, కిమ్ శర్మ పనిచేస్తుంటారు. భూమిక ఎయిర్ హొస్టెస్‌గా వర్క్ చేస్తుంటారు. వీరి ముగ్గురి మధ్య జరిగే కథే ఈ చిత్రం. ఓ వైపు ఎంతో జోవియల్‌గా, సరదాగా వుంటూ మరోవైపు సీరియస్‌గానూ వుండే కథానాయకుని పాత్ర ఉత్సుకతను కలిగిస్తుంది. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా వుంటుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Mar 2010 | 4:51 am

జమ్ము-కాశ్మీర్‌ రాష్ట్రంలో లష్కరే తోయిబా శిబిరాలు!

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థకు చెందిన స్థావరాలు ఉన్నట్టు ఒక జాతీయ మీడియా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో వెలుగు చూసింది. కాశ్మీర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఈ స్థావరాలు ఉన్నట్టు మీడియా వెల్లడించింది.
Source: జాతీయ | 1 Mar 2010 | 4:51 am

సీమాంధ్రులూ... బొత్సను చూసి బుద్ధి తెచ్చుకోండి: సీహెచ్

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలు మంత్రి బొత్స సత్యనారాయణను చూసి బుద్ధి తెచ్చుకోవాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సీహెచ్.విద్యాసాగర్ రావు సూచించారు. భాష పేరిట ఒక జాతి ఒకే ప్రాంతంలో ఉండాలనే నిబంధన ఏమీ లేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 1 Mar 2010 | 4:51 am

మహేష్‌తో సినిమా అంటే మాటలు కాదు: మంజుల

"తమ్ముడే... కానీ వాడి డేట్స్ కోసం నేను ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్నానో తెలుసా...? వాడితో సినిమా చేయాలంటే మాటలు కాద"ని అంటోంది మహేష్ బాబు సోదరి మంజుల. "మహేష్ బాబుతో సినిమా తీయడం అంటేనే గొప్ప కల. అందుకే తనతో ప్రతి సినిమా నా కలల చిత్రమే అవుతుంది. తమ్ముడని కాదు కానీ... తనతో పనిచేయడం చాలా సంతోషంగా సౌకర్యవంతంగా ఉంటుంది. చాలా సరదాగా అందర్నీ నవ్విస్తూ జీవితంలో ఏ కష్టమొచ్చినా నవ్వుతూ ఉండాలని చెపుతుంటాడు. అవి నాన్నగారి నుంచి వాడికబ్బాయి. అందుకే వాడితో సినిమా చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఏ మాయ చేసావె మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు మహేష్ బాబుతో సినిమాకు ప్లాన్ చేస్తున్నా. గౌతమ్ మీనన్ కూడా మహేష్‌కు కథ సిద్ధం చేశారు. అందులో నాకు తగిన పాత్ర వస్తే నటిస్తాన"ని అంటోంది మంజుల.
Source: వినోదం | 1 Mar 2010 | 3:54 am

చిత్తశుద్ధి చూపితే కలిసి పయనించేందుకు సిద్ధం: ప్రధాని

తీవ్రవాదం అణిచివేతకు పాకిస్థాన్ చిత్తశుద్ధితో పని చేస్తే ఆ దేశంతో కలిసి అదనంగా మరో మైలు ప్రయాణించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పునరుద్ఘాటించారు. అలాగే, పాక్‌తో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.
Source: జాతీయ | 1 Mar 2010 | 2:07 am

మార్చి 3న మార్కెట్లో మగధీర డీవీడీ

మగధీర డీవీడీ కొత్త టెక్నాలజీల్లో వస్తుంది. బ్లూ- రే అనే టెక్నాలజీతో హాలీవుడ్ చిత్రాలు హోమ్ డీవీడీలో విడుదలవుతాయి. తెలుగులో తొలిసారిగా ఆ టెక్నాలజీ ద్వారా "మగధీర" విడుదలవుతోంది. బాలాజీ వీడియోస్ నిరంజన్ ఖర్చుకు వెనుకాడకుండా ఈ డీవీడీని విడుదల చేస్తున్నారని చిత్ర నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ... యూఎస్, యూరప్ దేశాల్లో బ్లూ రే టెక్నాలజీ డీవీడీలు విడుదలవుతున్నాయి.
Source: వినోదం | 1 Mar 2010 | 1:56 am