|
ధర్మపురికి ప్రజలే బుద్ధి చెపుతారు: లక్ష్మీనారాయణఉప ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌కు తెలంగాణ ప్రాంత ప్రజలే తగిన బుద్ధి చెపుతారని భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో తనకు ప్రత్యర్థిగా ఎవరు పోటీ చేసినా చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు.Source: Yahoo! Telugu: News | 1 Mar 2010 | 8:23 am చిత్తశుద్ధి చూపితే కలిసి పయనించేందుకు సిద్ధం: ప్రధానితీవ్రవాదం అణిచివేతకు పాకిస్థాన్ చిత్తశుద్ధితో పని చేస్తే ఆ దేశంతో కలిసి అదనంగా మరో మైలు ప్రయాణించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పునరుద్ఘాటించారు. అలాగే, పాక్‌తో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 1 Mar 2010 | 7:36 am మార్చి 3న మార్కెట్లో మగధీర డీవీడీమగధీర డీవీడీ కొత్త టెక్నాలజీల్లో వస్తుంది. బ్లూ- రే అనే టెక్నాలజీతో హాలీవుడ్ చిత్రాలు హోమ్ డీవీడీలో విడుదలవుతాయి. తెలుగులో తొలిసారిగా ఆ టెక్నాలజీ ద్వారా "మగధీర" విడుదలవుతోంది. బాలాజీ వీడియోస్ నిరంజన్ ఖర్చుకు వెనుకాడకుండా ఈ డీవీడీని విడుదల చేస్తున్నారని చిత్ర నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ... యూఎస్, యూరప్ దేశాల్లో బ్లూ రే టెక్నాలజీ డీవీడీలు విడుదలవుతున్నాయి. ఇది ఖర్చుతో కూడుకున్నదైనా బాలాజీ వీడియోస్ నిరంజన్‌గారు ధైర్యం చేసి ముందుకు తెచ్చారు. ప్రతీ ఇంటిలో ఈ డీవీడీతో సినిమాను చక్కని క్లారిటీతో చూడొచ్చు అని పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 1 Mar 2010 | 7:25 am దేశంలో పెరిగిన విమానయాన ఇంధన ధరలు: ఐఓసీదేశీయ ముడి చమురు ధరల కంపెనీలు ఏటీఎఫ్ ధరలను పెంచడంతో జెట్ ఇంధనం లేక ఏటీఎఫ్ ధరలు ఢిల్లీలో ప్రతి కిలో లీటరుకు రూ. 1,325లు పెరిగి రూ. 39,307లకు చేరుకుంది. అదే ముంబైలో ప్రతి కిలో లీటరు ఏటీఎఫ్ ధర రూ. 1,380లు పెరిగి రూ. 40,547లకు చేరుకుంది. పెంచిన ఈ ధరలు సోమవారం అర్థరాత్రి నుంచే అమలులోకి వస్తాయని ఐండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ ప్రతినిధి సోమవారం న్యూ ఢిల్లీలో వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 1 Mar 2010 | 7:21 am భారత్‌పై యుద్ధమే పాక్‌కు శరణ్యం: హఫీజ్ సయీద్కాశ్మీర్, నదీ జలాల పంపిణీ వంటి కీలక సమస్యల పరిష్కారం కోసం భారత్ చర్చలకు సమ్మతించని పక్షంలో యుద్ధం చేయడం మినహా పాకిస్థాన్‌కు మరో మార్గం లేదని ముంబై దాడుల సూత్రధారి, జైషే మొహ్మద్ చీఫ్ హఫీజ్ మొహ్మద్ సయీద్ అన్నారు. చర్చలకున్న అన్ని దారులు మూసుకుంటే.. ఇక మిగిలిన ఏకైకమార్గం ఇదేనన్నారు.Source: Yahoo! Telugu: News | 1 Mar 2010 | 7:19 am బాలయ్య 'సింహా'కు తెలంగాణ వాదుల ఆటంకం!తెలంగాణవాదులు మరోమారు రెచ్చిపోయారు. ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో కీసర మండలంలోని రాంపల్లిదాయరలో సోమవారం బాలయ్య నటిస్తున్న "సింహా" చిత్ర యూనిట్ షూటింగ్ చేపట్టింది. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది తెలంగాణవాదులు సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నారు.Source: Yahoo! Telugu: News | 1 Mar 2010 | 7:03 am శ్రీకృష్ణ బృందం రాకను నిరశిస్తూ సింగరేణి సమ్మె!రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సంప్రదింపులు జరిపేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఈనెల నాలుగో తేదీన రాష్ట్రానికి రానుంది. ఈ బృందం రాకను నిరశిస్తూ సింగరేణి సంస్థలోని కార్మిక సంస్థల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధం సంస్థ 24 గంటల పాటు బంద్‌కు పిలుపునిచ్చింది. మార్చి నాలుగో తేదీ నుంచి ఈబంద్ 24 గంటల పాటు సాగుతుందని ఆ సంఘం నేత మల్లయ్య సోమవారం ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 1 Mar 2010 | 6:56 am సౌదీ ముడి చమురును రెండింతలు సరఫరా చేస్తుంది: దేవరారానున్న రోజుల్లో భారతదేశానికి అవసరమైన ముడి చమురును రెండింతల మేరకు అంటే ప్రతి ఏడాది దాదాపు 40 మిలియన్ మెట్రిక్ టన్నుల(ఎమ్ఎమ్‌టి) ముడి చమురును సరఫరా చేసేందుకు అరబ్ దేశం అంగీకరించిందని కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి మురళీ దేవరా తెలిపారు.Source: Yahoo! Telugu: News | 1 Mar 2010 | 6:47 am ఫిబ్రవరిలో వృద్ధి సాధించిన పారిశ్రామికోత్పత్తులు: పిఎమ్ఐదేశీయ పారిశ్రామికోత్పత్తులు గత నెల(ఫిబ్రవరి)లో వృద్ధి బాటలో పయనించిందని పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ తన నివేదికలో తెలిపింది.Source: Yahoo! Telugu: News | 1 Mar 2010 | 6:28 am కంపెనీ కార్యదర్శులు 50 వేలమంది అవసరం: ఐసిఎస్ఐప్రస్తుతం దేశంలో పారిశ్రామిక రంగం చాలా అభివృద్ధి చెందుతోందని, దీనికి తోడు రానున్న 2020 నాటికి దేశంలోని కంపెనీలకు కంపెనీ కార్యదర్శులు దాదాపు 50 వేలమంది అవసరం అవుతారని ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసిఎస్ఐ) తెలిపింది.Source: Yahoo! Telugu: News | 1 Mar 2010 | 6:10 am 'గాడ్‌మెన్'పై మోకా చట్ట ప్రయోగం: పోలీసుల యోచన!ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ పోలీసులకు పట్టుబడిన దొంగ బాబా (గాడ్‌మెన్)పై మోకా చట్టాన్ని ప్రయోగించాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. 39 సంవత్సరాల ఈ గాడ్‌మెన్ తనకు తాను దైవమనిషినని చెప్పుకుంటూ కోట్లాది రూపాయల సెక్స్ రాకెట్ కుంభకోణంలో చిక్కుకున్న విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 1 Mar 2010 | 5:43 am మగాళ్లనైతే "ఖయ్ ఖయ్"... ఆడాళ్లకు "హాయ్..!!"బ్రహ్మానందం గురించి తెలిసినవారెవరూ.. ఆయన గురించి మంచి చెప్పిన పాపాన పోరు. మగవారిని, ఆడవారిని వేరువేరుగా చూడటం బ్రహ్మానందానికి కొట్టిన పిండని ముఖం మీదే చెప్పేసి వెళుతుంటారు. బ్రహ్మానందాన్ని మగవారు పలుకరిస్తే.. నొసలు చిట్లించో.. ముభావంగానో ఉండిపోతాడట. అదే ఆడవారు... అందులోనూ కొంచెం వయస్సులో ఉన్నవాళ్లు పలకరిస్తే.. చిరునవ్వుతో ఎంతోకాలం నుంచి పరిచయం ఉన్నట్లు చాలాసేపు వదలకుండా.. వాళ్లు ఇహ చాలు వదులు బాబోయ్ అన్నంతవరకూ మాట్లాడుతూనే ఉంటాటడట. కొత్త, పాత తేడా లేకుండా ఆడవారితో చాలా చనువుగా ఉంటాడనీ, అదే మగవారైతే.. అంటీ అంటనట్లుగా ఉంటూ... తప్పించుక తిరుగుతాడని టాలీవుడ్ సినీజనం టాక్. ఏమిటీ వైఖరి... లింగవివక్షతా లేక.. ఇదేమైనా వీక్‌నెస్సా..?!! అని చాలామంది తీవ్రంగా ఆలోచిస్తున్నారట. అన్నట్లు బ్రహ్మానందానికి పద్మ బిరుదు వచ్చాక అది మరింత ముదిరి తల బిరుసు పెరిగిందని అంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 1 Mar 2010 | 5:33 am నవదీప్ యాగం చిత్రం ట్రెయిలర్అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన "యాగం" చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. రాజు, ప్రవీణ్‌లు నిర్మాణ సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రంలో నవదీప్, భూమిక, కిమ్ శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో భూమిక ఎయిర్ హొస్టెస్‌గా నటిస్తోంది.ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ... బ్యాంకాక్‌లోని రూరల్ ఏరియాలో ఓ బార్లో నవదీప్, కిమ్ శర్మ పనిచేస్తుంటారు. భూమిక ఎయిర్ హొస్టెస్‌గా వర్క్ చేస్తుంటారు. వీరి ముగ్గురి మధ్య జరిగే కథే ఈ చిత్రం. ఓ వైపు ఎంతో జోవియల్‌గా, సరదాగా వుంటూ మరోవైపు సీరియస్‌గానూ వుండే కథానాయకుని పాత్ర ఉత్సుకతను కలిగిస్తుంది. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా వుంటుంది.Source: Yahoo! Telugu: Entertainment | 1 Mar 2010 | 4:51 am ధర్మపురికి ప్రజలే బుద్ధి చెపుతారు: లక్ష్మీనారాయణఉప ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌కు తెలంగాణ ప్రాంత ప్రజలే తగిన బుద్ధి చెపుతారని భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో తనకు ప్రత్యర్థిగా ఎవరు పోటీ చేసినా చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు.Source: ఏపీ న్యూస్ | 1 Mar 2010 | 2:54 am చిత్తశుద్ధి చూపితే కలిసి పయనించేందుకు సిద్ధం: ప్రధానితీవ్రవాదం అణిచివేతకు పాకిస్థాన్ చిత్తశుద్ధితో పని చేస్తే ఆ దేశంతో కలిసి అదనంగా మరో మైలు ప్రయాణించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పునరుద్ఘాటించారు. అలాగే, పాక్‌తో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.Source: జాతీయ | 1 Mar 2010 | 2:07 am బాలయ్య 'సింహా'కు తెలంగాణ వాదుల ఆటంకం!తెలంగాణవాదులు మరోమారు రెచ్చిపోయారు. ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో కీసర మండలంలోని రాంపల్లిదాయరలో సోమవారం బాలయ్య నటిస్తున్న "సింహా" చిత్ర యూనిట్ షూటింగ్ చేపట్టింది. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది తెలంగాణవాదులు సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 1 Mar 2010 | 1:34 am శ్రీకృష్ణ బృందం రాకను నిరశిస్తూ సింగరేణి సమ్మె!రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సంప్రదింపులు జరిపేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఈనెల నాలుగో తేదీన రాష్ట్రానికి రానుంది. ఈ బృందం రాకను నిరశిస్తూ సింగరేణి సంస్థలోని కార్మిక సంస్థల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధం సంస్థ 24 గంటల పాటు బంద్‌కు పిలుపునిచ్చింది. మార్చి నాలుగో తేదీ నుంచి ఈబంద్ 24 గంటల పాటు సాగుతుందని ఆ సంఘం నేత మల్లయ్య సోమవారం ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 1 Mar 2010 | 1:27 am 'గాడ్‌మెన్'పై మోకా చట్ట ప్రయోగం: పోలీసుల యోచన!ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ పోలీసులకు పట్టుబడిన దొంగ బాబా (గాడ్‌మెన్)పై మోకా చట్టాన్ని ప్రయోగించాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. 39 సంవత్సరాల ఈ గాడ్‌మెన్ తనకు తాను దైవమనిషినని చెప్పుకుంటూ కోట్లాది రూపాయల సెక్స్ రాకెట్ కుంభకోణంలో చిక్కుకున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 1 Mar 2010 | 12:14 am మాకు కోదండరామ్-తెరాస హైకమాండ్ కాదు: దానంకాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు తెలంగాణ ఐకాస కన్వీనర్ ఆచార్య కోదండరామ్, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావులు హైకమాండ్ కాదని రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసేది లేనిదీ మా హైకమాండ్ నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 28 Feb 2010 | 11:49 pm మార్చి 6న భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్ష ఎన్నిక!భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష ఎన్నిక ఈనెల ఆరో తేదీన జరుగనుంది. ప్రస్తుతం ఈ పదవికి ఆ పార్టీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి పేరు బలంగా వినిపిస్తుండగా, తాజాగా ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.హరిబాబు పేరు తెర పైకి వచ్చింది.Source: ఏపీ న్యూస్ | 28 Feb 2010 | 11:38 pm రాజ్‌భవన్‌లో నరసింహన్: నివాసంలో చంద్రబాబు!రాష్ట్రంలో హోలీ సంబరాలు మిన్నంటాయి. రాష్ట్ర ప్రథమ పౌరుడు ఈఎస్ఎల్ నరసింహన్ తన హోదాను కొద్దిసేపు పక్కన పెట్టి హోలీ సంబరాల్లో మునిగి పోయారు. అలాగే, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా తన నివాసంలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొని కార్యకర్తలను ఉత్తేజ పరిచారు.Source: ఏపీ న్యూస్ | 28 Feb 2010 | 11:25 pm యూపీఏకు వ్యతిరేకంగా సైకిల్ ర్యాలీ: ఎస్పీ నిర్ణయం!కేంద్రంలోని యూపీఏ సంకీర్ణ సర్కారుకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ ర్యాలీ నిర్వహించాలని సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయించింది. ఈనెల ఎనిమిదో తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ర్యాలీలు నిర్వహిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి సోమవారం తెలిపారు.Source: జాతీయ | 28 Feb 2010 | 10:51 pm రాష్ట్ర మంత్రి గాదె వెంకటరెడ్డికి తీవ్ర అస్వస్థత!రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖామంత్రి గాదె వెంకటరెడ్డి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మంత్రికి షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి. దీంతో శ్వాసపీల్చుకోవడం కష్టంగా మారడంతో ఆయన హుటాహుటిన గుంటూరు జిల్లాలోని పొన్నూరుకు తరలించారు. అక్కడ నుంచి ఆయనను గుంటూరు జిల్లా కేంద్రంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.Source: ఏపీ న్యూస్ | 28 Feb 2010 | 10:31 pm తెలంగాణ రాష్ట్రం ఎన్నటికీ రాదు: ఎంపీ సబ్బంహరితెలంగాణ రాష్ట్రం ఎన్నటికీ రాదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ సబ్బంహరి జోస్యం చెప్పారు. అలాగే, రాష్ట్రం ముక్కలయ్యే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదన్నారు. అందువల్ల సమైక్యాంధ్ర ప్రదేశ్‌గానే రాష్ట్రం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.Source: ఏపీ న్యూస్ | 28 Feb 2010 | 10:01 pm యూపీఏ ప్రభుత్వాన్ని అస్థిర పరచం: మమతా బెనర్జీపెట్రో ధరల పెంపును అడ్డుపెట్టుకుని యూపీఏ ప్రభుత్వాన్ని అస్థిరపరచబోమని కేంద్ర రైల్వే శాఖామంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలకు లేఖ రాశారు. అయితే, సామాన్య ప్రజలపై భారాన్ని ఏదోలా తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.Source: జాతీయ | 28 Feb 2010 | 9:37 pm శశిథరూర్ వ్యాఖ్యలపై మండిపడిన ప్రతిపక్షాలు!భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సౌదీ అరేబియా మధ్యవర్తిత్వం వహించాలని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. కీలక శాఖలో ఉండే బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తున్నారని భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.Source: జాతీయ | 28 Feb 2010 | 8:47 pm కన్యాకుమారిలో జరిగిన తితిదే పాలకమండలి సమావేశంతమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి ఆదివారం సమావేశమైంది. ఈ సమావేశంలో పాలక మండలి సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో రూ. 1400 కోట్లతో తితిదే వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించారు.Source: జాతీయ | 28 Feb 2010 | 5:51 am రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న యూపీఏ: బండారుకేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దేశంలోని రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆయన దుయ్యబట్టారు.Source: ఏపీ న్యూస్ | 28 Feb 2010 | 3:34 am చీమకుర్తి క్వారీలో కొనసాగుతున్న సహాయక చర్యలుచీమకుర్తిలోని ఓ గ్రానైట్ క్వారీలో శిథిలాల తొలగింపు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఘటన జరిగి నాలుగురోజులు అయినా ఇంకా సహాయక కార్యక్రమాలు కొనసాగుతుండం గమనార్హం.ఆదివారం నాడు కూడా శిథిలాల నుంచి ఇంకో మృతదేహాన్ని వెలికి తీయడంతో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. శిథిలాల కింద ఇంకా ఏడు మృత దేహాలు ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.Source: ఏపీ న్యూస్ | 28 Feb 2010 | 3:17 am పెట్రోలు ధరలు తగ్గించండి: మమత బెనర్జీఇటీవల దేశంలో పెరిగిన పెట్రోలు ధరలను వెంటనే తగ్గించాలని తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, కేంద్ర రైల్వే శాఖామంత్రి మమత బెనర్జీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీలకు శనివారం విన్నవించారు.Source: జాతీయ | 28 Feb 2010 | 3:06 am
|