తెలంగాణపై "బాబు" మనసులోని మాట చెప్పాలి: విహెచ్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై తెలుగుదేశం పార్టీ అధినేత మనసులో ఏముందో వెంటనే చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు చంద్రబాబును ప్రశ్నించారు.
Source: Yahoo! Telugu: News | 28 Feb 2010 | 8:17 am

కొత్త పెన్షన్ పథకంలో చేరితే వెయ్యి రూపాయలు: ప్రణబ్

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ‌లోక్‌సభలో ప్రవేశపెట్టబడిన బడ్జెట్లో కొత్త పెన్షన్ పథకం(ఎన్‌పీఎస్)లో చేరితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలు చెల్లించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 28 Feb 2010 | 7:55 am

తెదేపా నాయకులపై దాడులకు పాల్పడ్డ ఆమంచి వర్గీయులు

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులపై ఆదివారం చీరాలలో ఆమంచి వర్గీయులు దాడి చేశారు.
Source: Yahoo! Telugu: News | 28 Feb 2010 | 6:57 am

చిలీలో ముమ్మరమైన సహాయక చర్యలు

దక్షిణ అమెరికాలోని చిలీ ప్రాంతంలో శనివారం జరిగిన భారీ భూకంపంతో అతలాకుతలమైంది. ఈ అనూహ్య ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 300 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు దాదాపు రెండు మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులైనారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Source: Yahoo! Telugu: News | 28 Feb 2010 | 6:43 am

చిలీ భూకంప బాధితులను ఆదుకుంటా: ఒబామా

తమ ప్రభుత్వం భూకంప బాధితులను ఆదుకునేందుకు సత్వర చర్యలు చేపట్టిందని, బాధితులను ఆదుకునేందుకు మరింతగా శ్రమిస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మీడియాకు తెలిపారు. కాగా చిలీ ప్రభుత్వం తమ ప్రభుత్వాన్ని ఇంత వరకు అడగలేదని ఆయన అన్నారు.
Source: Yahoo! Telugu: News | 28 Feb 2010 | 6:29 am

గడ్చిరోలిలో ప్రారంభమైన గ్రీన్ హంట్ కార్యక్రమం

మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌లో భాగంగా వందలాది సాయుధ బలగాలను మొహరింపజేసినట్లు మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం మీడియాకు తెలిపారు. కేంద్ర బలగాలైన 'కోబ్రా' సీఆర్పీఎఫ్‌ బలగాలతో పాటు రాష్ట్ర సాయుధ బలగాలు ఈ పోరులో పాల్గొంటాయని అధికార వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 28 Feb 2010 | 5:34 am

సిఎం జోక్యంతో సమసిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు వివాదం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఔటర్‌ రింగ్‌రోడ్డు రెండవ విడత నిర్మాణానికి ముఖ్యమంత్రి రోశయ్య ఈ రోజు చేయనున్న శంకుస్థాపన కార్యక్రమం వివాదాలకు దారితీసింది. ముఖ్యమంత్రి జోక్యంతో వివాదం సద్దుమణిగింది. మేడ్చెర్ల ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కెఎల్‌ఆర్‌) రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ముఖ్యమంత్రి నచ్చజెప్పడంతో ఆయన వెనక్కు తగ్గారు
Source: Yahoo! Telugu: News | 28 Feb 2010 | 4:48 am

లంగర్ హౌస్ ఫ్లైఓవర్‌కు మహాత్ముని పేరు పెట్టండి: భాజపా

నగరంలోని ప్రధాన పర్యాటక ప్రాంతమైన గోల్కొండ, గండిపేట, మొయినాబాద్, చేవెళ్ళ రహదారులను కలిపే లంగర్‌హౌస్ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్యని భాజపా నేత బద్దం బాల్‌రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు అడ్డుకుని ఫ్లైఓవర్‌కు మహాత్మునిపేరు పెట్టాలని ఆందోళన చేపట్టారు.
Source: Yahoo! Telugu: News | 28 Feb 2010 | 4:32 am

ఢిల్లీలో విమానాన్ని ఆపిన తాగుబోతు

వివరాలలోకి వెళితే బీహర్‌లోని బెగుసరి జిల్లాకు చెందిన అరుణ్‌రాయ్‌(33) తప్పతాగి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సరిహద్దు గోడ దూకి 29వ రన్‌వే దగ్గరకు వచ్చాడని విమానాశ్రయాధికారులు తెలిపారు
Source: Yahoo! Telugu: News | 28 Feb 2010 | 4:04 am

పెట్రో ధరల ప్రభావం ద్రవ్యోల్బణంపై ఉండదు: మాంటెక్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను పెంచటంతో ఆ ప్రభావం ద్రవ్యోల్బణం పడుతుందన్న భయాలను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా పేర్కొన్నారు. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పెంచటం సరైన నిర్ణయమేనని, కాని ద్రవ్యోల్బణం పెరగటానికి దారితీస్తుందని భావించటం లేదని ఆయన మీడియాకు వివరించారు.
Source: Yahoo! Telugu: News | 28 Feb 2010 | 3:28 am

తెలంగాణపై "బాబు" మనసులోని మాట చెప్పాలి: విహెచ్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై తెలుగుదేశం పార్టీ అధినేత మనసులో ఏముందో వెంటనే చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు చంద్రబాబును ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 28 Feb 2010 | 2:48 am

తెదేపా నాయకులపై దాడులకు పాల్పడ్డ ఆమంచి వర్గీయులు

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులపై ఆదివారం చీరాలలో ఆమంచి వర్గీయులు దాడి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 28 Feb 2010 | 1:28 am

గడ్చిరోలిలో ప్రారంభమైన గ్రీన్ హంట్ కార్యక్రమం

మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌లో భాగంగా వందలాది సాయుధ బలగాలను మొహరింపజేసినట్లు మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం మీడియాకు తెలిపారు. కేంద్ర బలగాలైన 'కోబ్రా' సీఆర్పీఎఫ్‌ బలగాలతో పాటు రాష్ట్ర సాయుధ బలగాలు ఈ పోరులో పాల్గొంటాయని అధికార వర్గాలు తెలిపాయి.
Source: జాతీయ | 28 Feb 2010 | 12:05 am

సిఎం జోక్యంతో సమసిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు వివాదం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఔటర్‌ రింగ్‌రోడ్డు రెండవ విడత నిర్మాణానికి ముఖ్యమంత్రి రోశయ్య ఈ రోజు చేయనున్న శంకుస్థాపన కార్యక్రమం వివాదాలకు దారితీసింది. ముఖ్యమంత్రి జోక్యంతో వివాదం సద్దుమణిగింది. మేడ్చెర్ల ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కెఎల్‌ఆర్‌) రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ముఖ్యమంత్రి నచ్చజెప్పడంతో ఆయన వెనక్కు తగ్గారు
Source: ఏపీ న్యూస్ | 27 Feb 2010 | 11:18 pm

లంగర్ హౌస్ ఫ్లైఓవర్‌కు మహాత్ముని పేరు పెట్టండి: భాజపా

నగరంలోని ప్రధాన పర్యాటక ప్రాంతమైన గోల్కొండ, గండిపేట, మొయినాబాద్, చేవెళ్ళ రహదారులను కలిపే లంగర్‌హౌస్ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్యని భాజపా నేత బద్దం బాల్‌రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు అడ్డుకుని ఫ్లైఓవర్‌కు మహాత్మునిపేరు పెట్టాలని ఆందోళన చేపట్టారు.
Source: ఏపీ న్యూస్ | 27 Feb 2010 | 11:03 pm

ఢిల్లీలో విమానాన్ని ఆపిన తాగుబోతు

వివరాలలోకి వెళితే బీహర్‌లోని బెగుసరి జిల్లాకు చెందిన అరుణ్‌రాయ్‌(33) తప్పతాగి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సరిహద్దు గోడ దూకి 29వ రన్‌వే దగ్గరకు వచ్చాడని విమానాశ్రయాధికారులు తెలిపారు
Source: జాతీయ | 27 Feb 2010 | 10:34 pm

పుణే పేలుడులో అంతుపట్టని ట్రిగ్గర్‌ మెకానిజం

పుణె పేలుడు కేసులో ఇప్పటివరకూ సరైన క్లూ కనుక్కోలేక అధికారులు సతమతమవుతున్నారు. ప్రత్యేకించి ఈ కేసు దర్యాప్తును చేపట్టిన మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్‌ స్వ్కాడ్‌(ఏటీఎస్‌) కూడా ఈ విషయాన్ని నిర్ధారించలేకపోతోంది. ఫలితంగా అనుమానితుల జాబితా పెరిగి దర్యాప్తు జటిలంగా మారుతోంది
Source: జాతీయ | 27 Feb 2010 | 9:30 pm

కోట్లు ఇస్తేనే రియాల్టీ "షో" అంటోన్న ఐష్

అందాల సుందరి ఐశ్వర్యారాయ్ బాలీవుడ్ కుర్రహీరోయిన్ల తాకిడికి తట్టులేకపోతోందో ఏమో గానీ టీవీ రియాల్టీ షోలకు ఓకే అంటోదట. అయితే తను రియాల్టీ షోలు చేయాలంటే కోట్లకొలది డబ్బును పారితోషికంగా ఇస్తే వస్తానని షరతులు విధిస్తుందట. దీంతో ఆయా టీవీ చానల్స్ బెదిరిపోతున్నాయట.కానీ కలర్స్ చానల్ మాత్రం ఐష్ ఎంత అడిగితే అంత ఇస్తామని ముందుకు ఉరుకుతోందట. అయినప్పటికీ ఐశ్వర్య విధిస్తున్న కొన్ని షరతుల వల్ల తాము ఆమెతో చేయాలనుకున్న రియాల్టీ షో కాస్త ఆలస్యమవుతోందని సదరు ఛానల్ చెప్పుకొస్తోంది. ఐష్ మాత్రం కూల్‌గా తను అనుకున్నట్లుగా అన్నీ కుదిరితే... ఓ పాపాయిని కనేసి ఎంచక్కా రియాల్టీ షోలకు పరిమితమైపోదామని యోచిస్తున్నట్లు బాలీవుడ్ సినీజనం అంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Feb 2010 | 2:13 pm

మంచు మనోజ్ "బిందాస్" ట్రెయిలర్

ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై 'ప్రయాణం' ఫేమ్ మంచు మనోజ్ హీరోగా, షీనా కథానాయికగా నటించిన చిత్రం "బిందాస్". "అజయ్‌గాడి విజయగాథ" అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక. ఈ చిత్రం ద్వారా వర్షం, నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా, పౌర్ణమి చిత్రాలకు రచయితగా పనిచేసిన వీరూ పోట్ల దర్శకుడిగా పరిచయమయ్యారు.ఇదిలా ఉంటే.. ఏలేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుని తెరకెక్కిన "ప్రయాణం" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మంచు మనోజ్‌కు "బిందాస్" సినిమా రెండో సినిమా కావడం గమనార్హం. "బిందాస్" చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూద్దామా..
Source: Yahoo! Telugu: Entertainment | 27 Feb 2010 | 12:18 pm

షూటింగ్ పూర్తి చేసుకున్న "కిల్లర్"

శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై నగేష్ నారదాశి దర్శకత్వంలో మిస్ ఇండియా వరల్డ్ గద్దె సింధూర హీరోయిన్‌గా నూతన నిర్మాత కిరణ్ నిర్మిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ కిల్లర్ చిత్రం ఇటీవల రామోజీ ఫిలిమ్ సిటీలో పాట చిత్రీకరణ జరుపుకుని షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు నగేష్ నారదాశి మాట్లాడుతూ... "గద్దె సింధూర మెయిన్ లీడ్‌గా చేస్తున్న పూర్తి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఐదు పాటలుంటాయి. మార్చి నెలలో పాటలను విడుదల చేసి ఏప్రిల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Feb 2010 | 10:28 am

సచిన్‌కు భారత రత్న అవార్డు ఇవ్వాల్సిందే: శివసేన

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అంతర్జాతీయ ఒకరోజు ఆట (ఒన్‌డే ఇంటర్నేషనల్)లో రెండు శతకాల (డబుల్ సెంచరీ) పరుగులు సాధించి రికార్డు సృష్టించిన నేపథ్యంలో అతనికి భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని ఇటీవల ప్రకటించారు. దీంతో శనివారం శివసేన కూడా సచిన్‌కు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాల్సిందేనని తెలిపింది.
Source: జాతీయ | 27 Feb 2010 | 8:50 am

యుగానికి ఒక్కడు ట్రెయిలర్

పలు విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన సుప్రసిద్ధ దర్శకుడు శ్రీ రాఘవ తాజాగా సూర్య సోదరుడైన కార్తి కథానాయకుడుగా 40 కోట్ల రూపాయల వ్యయంతో యుగానికి ఒక్కడు చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రానికి రీమాసేన్ సెక్సీ నటన తోడైంది. అన్ని ప్రధాన ధియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ వీక్షించండి.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Feb 2010 | 8:36 am

పాటల చిత్రీకరణలో "బద్మాష్"

సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ దర్శకునిగా మారి రూపొందిస్తున్న చిత్రం బద్మాష్. జి.పి.సిద్దార్థ్ ఫిలిమ్ అకాడమీ పతాకంపై డాక్టర్ జి. నాగయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ సిద్దార్థ్, ఏక్తా నాయకానాయికలుగా పరిచయమవుతున్నారు.నిర్మాత మాట్లాడుతూ... "టాకీ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ చేస్తున్నాం. ఇటీవల హీరో హీరోయిన్లపై హైదరాబాద్‌లో ఈ చల్లని సాయంత్రం ఝమ్మంది లవ్ మంత్రం... పాటను చిత్రీకరించాం. ఈ పాటను స్వర్ణ నృత్య దర్శకత్వం వహించారు. ప్రస్తుతం గోల్కొండ పోర్ట్ పరిసరాల్లో "నిన్నా మొన్నా అటు మొన్నా నిన్నే చూసినా..." పాట చిత్రీకరిస్తున్నాం.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Feb 2010 | 8:21 am

గ్రామీణ ప్రాంతాల్లో విద్యాసంస్థల ఏర్పాటుకు సిబాల్ పిలుపు

దేశీయ గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలను ప్రారంభించేందుకు ప్రైవేట్ సంస్థలు ముందుకు రావడం లేదని సెక్టార్, గ్రామాలలో అత్యంతాధునికమైన పాఠశాలలను ప్రారంభించేందుకు ప్రైవేట్ విద్యా సంస్థలు ముందుకు రావాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి కపిల్ సీబాల్ కోరారు.
Source: జాతీయ | 27 Feb 2010 | 8:01 am

కిరణ్ రాథోడ్ "హై స్కూల్" ప్రేమాయణం

ప్రౌఢ స్త్రీ(కిరణ్ రాథోడ్)తో 13 ఏళ్ళ బాయ్(కార్తీక్) సాగించే ప్రేమాయణాన్ని హైస్కూల్‌గా తెరకెక్కించారు. రొమాన్స్‌, కామెడీ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తాయి. గ్లామర్‌ హీరోయిన్‌గా ప్రేక్షకులకు సుపరిచితురాలైన కిరణ్‌రాథోడ్‌ ఈ సినిమాలో గ్లామర్‌తోపాటు చక్కని నటన కూడా ప్రదర్శించింది.ఈ చిత్రంలో కిరణ్‌ రాథోడ్‌ గ్లామర్‌ సినిమాకి ఎస్సెట్‌. కిరణ్‌తోపాటు మిగతా పాత్రల్లో గుండు హనుమంతరావు, గౌతంరాజు, జెన్నీ, రజిత, తిలక్‌, మల్లిక కనిపించనున్నారు. అలాగే చిత్రానికి సంగీతం: సాకేత్‌ సాయిరామ్‌, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నరసింహ నంది
Source: Yahoo! Telugu: Entertainment | 27 Feb 2010 | 7:01 am

శివాజీ తాజ్ మహల్ ట్రెయిలర్

శివాజీ, శ్రుతి నాయకానాయికలుగా అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తాజ్ మహల్. కన్నడంలో విజయం సాధించిన తాజ్ మహల్ చిత్రం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నాజర్, ఎంఎస్ నారాయణ, వేణుమాధవ్, రఘుబాబు, తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ వీక్షించండి.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Feb 2010 | 6:35 am

ఉపఎన్నికల్లో పోటీ చేయదలిస్తే తన్నులే: జేఏసి

తెలంగాణాకోసం రాజీనామాలు సమర్పించిన నాయకుల స్థానాల్లో తిరిగి ఆయా రాజకీయ నేతలు తప్ప మరెవరైనా పోటీ చేస్తే తన్నులు తింటారని తెలంగాణా విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని డీఎస్ ప్రకటించడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.
Source: ఏపీ న్యూస్ | 27 Feb 2010 | 5:08 am

కమిటీ విధానాలు మార్చాల్సిందే: ఆర్.దామోదర్ రెడ్డి

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలు మార్చాల్సిందేనని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఆర్.దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ కమిటీ విధి విధానాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు.
Source: ఏపీ న్యూస్ | 27 Feb 2010 | 5:07 am

గరం గరం "కిలాడి" ట్రెయిలర్... వీక్షించండి

పందెం కోడి, పొగరు, భరణి మొదలైన సూపర్ హిట్ చిత్రాల ద్వారా హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న యాక్షన్ హీరో విశాల్ ఇప్పుడు మరో భారీ చిత్రాన్ని చేశారు. జీకే ఫిలిమ్ కార్పొరేషన్ పతాకంపైన కిలాడి అనే క్రేజీ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. నిర్మాత విక్రమ్ కృష్ణ మాట్లాడుతూ... "మా కిలాడి చిత్రంలో విశాల్ ఇంతవరకూ నటించనటువంటి ప్లే బాయ్ పాత్రను అద్వితీయంగా పోషించారు. తను దేన్నైనా ఎన్నిక చేసుకునే ముందు మూడు విధాలుగా ఆలోచించుకోవడం అలవాటు. ఆ విధంగానే జీవిత భాగస్వామి విషయంలో కూడా ముగ్గురు అమ్మాయిల్ని అనుకుంటాడు. ఈ ముగ్గురిలో ఎవరిని కిలాడి సొంతం చేసుకుంటాడన్నదాన్ని వెండితెరమీద చూడాల్సిందే" అని చెపుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Feb 2010 | 4:48 am

యూపీలో బాలికపై ముగ్గురు క్లాస్‌మెట్స్ అత్యాచారం!

తుపాకీ ఎక్కుపెట్టి 11వ తరగతి చదువుతున్న విద్యార్థినిని అదే తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాగ్‌పట్ జిల్లాలో ఈ సంఘటన జరిగినట్టు ఆ జిల్లా పోలీసులు శనివారం వెల్లడించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపారు.
Source: జాతీయ | 27 Feb 2010 | 4:30 am

పెట్రోల్-డీజల్ ధరల పెంపు: స్వపక్షంలో విపక్షం!

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ పుణ్యమాని యూపీఏ భాగస్వామ్య పార్టీల్లో విభేదాలు వచ్చాయి. ఈ బడ్జెట్‌లో పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు. ఫలితంగా పెట్రోల్, డీజల్ ధరలు ఒకేసారి రూ.2.50పైసలకు పైగా పెరగగా, ఇవి శుక్రవారం అర్థరాత్రి నుంచే అమలుకు వచ్చాయి.
Source: జాతీయ | 27 Feb 2010 | 3:36 am

వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిందే: శంకర్‌రావు

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తమ పదవులకు రాజీనామా చేసిన తెలంగాణ ప్రాంత శాసనసభ్యులను తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిందేనని కంటోన్మెంట్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ రావు అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ చేర్చిందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 27 Feb 2010 | 2:48 am

అన్నారంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌: ఇస్రో

పాలమూరు జిల్లా షాద్‌నగర్ సమీపంలోని అన్నారంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నెలకొల్పనుంది. ఈ కేంద్ర నిర్మాణానికి ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణ శుక్రవారం భూమిపూజ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 27 Feb 2010 | 2:21 am