|
అన్నారంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్: ఇస్రోపాలమూరు జిల్లా షాద్‌నగర్ సమీపంలోని అన్నారంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నెలకొల్పనుంది. ఈ కేంద్ర నిర్మాణానికి ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణ శుక్రవారం భూమిపూజ చేశారు.Source: Yahoo! Telugu: News | 27 Feb 2010 | 7:43 am వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిందే: శంకర్రావుజస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తమ పదవులకు రాజీనామా చేసిన తెలంగాణ ప్రాంత శాసనసభ్యులను తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిందేనని కంటోన్మెంట్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ రావు అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ చేర్చిందన్నారు.Source: Yahoo! Telugu: News | 27 Feb 2010 | 7:09 am కిరణ్ రాథోడ్ "హై స్కూల్" ప్రేమాయణంప్రౌఢ స్త్రీ(కిరణ్ రాథోడ్)తో 13 ఏళ్ళ బాయ్(కార్తీక్) సాగించే ప్రేమాయణాన్ని హైస్కూల్‌గా తెరకెక్కించారు. రొమాన్స్, కామెడీ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తాయి. గ్లామర్ హీరోయిన్‌గా ప్రేక్షకులకు సుపరిచితురాలైన కిరణ్‌రాథోడ్ ఈ సినిమాలో గ్లామర్‌తోపాటు చక్కని నటన కూడా ప్రదర్శించింది.ఈ చిత్రంలో కిరణ్ రాథోడ్ గ్లామర్ సినిమాకి ఎస్సెట్. కిరణ్‌తోపాటు మిగతా పాత్రల్లో గుండు హనుమంతరావు, గౌతంరాజు, జెన్నీ, రజిత, తిలక్, మల్లిక కనిపించనున్నారు. అలాగే చిత్రానికి సంగీతం: సాకేత్ సాయిరామ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నరసింహ నందిSource: Yahoo! Telugu: Entertainment | 27 Feb 2010 | 7:01 am శివాజీ తాజ్ మహల్ ట్రెయిలర్శివాజీ, శ్రుతి నాయకానాయికలుగా అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తాజ్ మహల్. కన్నడంలో విజయం సాధించిన తాజ్ మహల్ చిత్రం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నాజర్, ఎంఎస్ నారాయణ, వేణుమాధవ్, రఘుబాబు, తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ వీక్షించండి.Source: Yahoo! Telugu: Entertainment | 27 Feb 2010 | 6:35 am నాలుగు మహానగరాలలో పెట్రోలు, డీజిల్ ధరలిలావున్నాయి...కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ (2010-11)లో ముడి చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పెంచడంతో పెట్రో ధరలు పెరిగిపోయాయి. దీంతో దేశంలోని మహానగరాలలో పెట్రోలు, డీజిల్ ప్రతి లీటరు ధరలు ఇలా ఉన్నాయి :-పెట్రోలునగరం ఇదివరకటి ధర ప్రస్తుతం పెరిగిన ధర తేడాఢిల్లీ రూ. 44.72లు రూ.47.43లు రూ. 2.71లు కోలకతా రూ. 48.32లు రూ.51.15లు రూ. 2.83లు ముంబై రూ.48.76లు రూ. 51.68లు రూ. 2.92లు చెన్నయ్ రూ.48.65లు రూ. 51.59లు రూ.2.94లు డీజిల్ఢిల్లీ రూ.32.92లు రూ.35.47లు రూ.2.55లు కోలకతా రూ.35.03లు రూ.37.73లు రూ.2.70లు ముంబై రూ.36.70లు రూ. 39.60లు రూ.2.90లు చెన్నయ్ రూ.34.98లు రూ.37.78లు రూ.2.80లుSource: Yahoo! Telugu: News | 27 Feb 2010 | 6:28 am చిలీలో భారీ భూకంపం: సునామీ హెచ్చరికలు జారీ!దక్షిణ చిలీలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.3గా నమోదైట్టు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. దీంతో ఈ ప్రకంపనలతో ఆ ప్రాంతమంతా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. చిలీ రాజధాని శాంటియాగోకు 197 మైళ్ళ దూరంలో, 36.9 మైళ్ళ లోతులో ప్రకంపనలు శనివారం ఉదయం 3.34 గంటల ప్రాంతంలో కనిపించినట్టు పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 27 Feb 2010 | 6:27 am రైల్వే రవాణా సేవాపన్నుపై పునః పరిశీలించండి: అమిత్రైల్వే ద్వారా రవాణా చేసే వస్తువులపై సేవాపన్నులో ఎలాంటి రాయితీలు ప్రకటించకపోవడంతో ఆ శాఖ కాస్త ఇబ్బందుల్లో కూరుకోనుంది. దీంతో రైల్వై శాఖ కేంద్ర ప్రభుత్వానికి దాదారు ఆరువేల కోట్ల రూపాయలను చెల్లించాల్సివుంటుంది. కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ మరోమారు రైల్వే రవాణాపై సేవా పన్ను విధించడాన్ని పునఃపరిశీలించాలని రైల్వే నిపుణుల కమిటీ ఛైర్మెన్ అమిత్ మిత్రా సూచించారు.Source: Yahoo! Telugu: News | 27 Feb 2010 | 6:05 am కాబూల్‌కు ప్రత్యేక విమానం పంపిన భారత్!ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో తాలిబాన్ తీవ్రవాదులు శుక్రవారం జరిపిన ఆత్మాహుతి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం కాబూల్‌కు ప్రత్యేక విమానాన్ని కేంద్రం శనివారం పంపించింది.Source: Yahoo! Telugu: News | 27 Feb 2010 | 6:03 am శభాష్.. బొత్స వర్యా: మంత్రి కోమటిరెడ్డి ప్రశంస!రాష్ట్రం విడిపోవడమే మంచిదని పంచాయతీ రాజ్ శాఖామంత్రి, కోస్తా నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల పట్ల సాటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోతేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.Source: Yahoo! Telugu: News | 27 Feb 2010 | 5:54 am గ్రానైట్ క్వారీ ప్రమాదం: కొనసాగుతున్న శవాల వెలికితీత!ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని హంస గ్రానైట్ క్వారీలో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదంలో మృత్యువాత పడిన కార్మికుల మతృదేహాల వెలికితీత శనివారం కూడా కొనసాగుతోంది. మతృదేహాలపై భారీ ఎత్తున మట్టిపెళ్ళలు, గ్రానైట్ రాళ్లు పడి ఉండటంతో వెలికితీత పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.Source: Yahoo! Telugu: News | 27 Feb 2010 | 5:39 am మార్చి 4, 5 తేదీల్లో శ్రీకృష్ణ బృందం రాష్ట్ర పర్యటన!జస్టీస్ శ్రీకృష్ణ బృందం రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనుంది. వచ్చే నెల నాలుగు, ఐదు తేదీల్లో రాష్ట్రంలో పర్యటించాలని నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు రాజధాని హైదరాబాద్‌లో తిష్టవేసి ప్రధాన రాజకీయ పార్టీలతో సమగ్రంగా చర్చలు జరుపనుంది.Source: Yahoo! Telugu: News | 27 Feb 2010 | 5:30 am శ్రీకృష్ణ కమిటీ ఎదుట హాజరుకాము: వెంకయ్య నాయుడుజస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఎదుట తమ పార్టీ హాజరుకాబోదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనను ఈ కమిటీ తేల్చగలదా అని ప్రశ్నించారు.Source: Yahoo! Telugu: News | 27 Feb 2010 | 5:21 am గరం గరం "కిలాడి" ట్రెయిలర్... వీక్షించండిపందెం కోడి, పొగరు, భరణి మొదలైన సూపర్ హిట్ చిత్రాల ద్వారా హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న యాక్షన్ హీరో విశాల్ ఇప్పుడు మరో భారీ చిత్రాన్ని చేశారు. జీకే ఫిలిమ్ కార్పొరేషన్ పతాకంపైన కిలాడి అనే క్రేజీ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. నిర్మాత విక్రమ్ కృష్ణ మాట్లాడుతూ... "మా కిలాడి చిత్రంలో విశాల్ ఇంతవరకూ నటించనటువంటి ప్లే బాయ్ పాత్రను అద్వితీయంగా పోషించారు. తను దేన్నైనా ఎన్నిక చేసుకునే ముందు మూడు విధాలుగా ఆలోచించుకోవడం అలవాటు. ఆ విధంగానే జీవిత భాగస్వామి విషయంలో కూడా ముగ్గురు అమ్మాయిల్ని అనుకుంటాడు. ఈ ముగ్గురిలో ఎవరిని కిలాడి సొంతం చేసుకుంటాడన్నదాన్ని వెండితెరమీద చూడాల్సిందే" అని చెపుతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Feb 2010 | 4:48 am వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిందే: శంకర్రావుజస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తమ పదవులకు రాజీనామా చేసిన తెలంగాణ ప్రాంత శాసనసభ్యులను తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిందేనని కంటోన్మెంట్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ రావు అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ చేర్చిందన్నారు.Source: ఏపీ న్యూస్ | 27 Feb 2010 | 2:48 am అన్నారంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్: ఇస్రోపాలమూరు జిల్లా షాద్‌నగర్ సమీపంలోని అన్నారంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నెలకొల్పనుంది. ఈ కేంద్ర నిర్మాణానికి ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణ శుక్రవారం భూమిపూజ చేశారు.Source: ఏపీ న్యూస్ | 27 Feb 2010 | 2:21 am కాబూల్‌కు ప్రత్యేక విమానం పంపిన భారత్!ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో తాలిబాన్ తీవ్రవాదులు శుక్రవారం జరిపిన ఆత్మాహుతి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం కాబూల్‌కు ప్రత్యేక విమానాన్ని కేంద్రం శనివారం పంపించింది.Source: జాతీయ | 27 Feb 2010 | 12:33 am శభాష్.. బొత్స వర్యా: మంత్రి కోమటిరెడ్డి ప్రశంస!రాష్ట్రం విడిపోవడమే మంచిదని పంచాయతీ రాజ్ శాఖామంత్రి, కోస్తా నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల పట్ల సాటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోతేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 27 Feb 2010 | 12:25 am గ్రానైట్ క్వారీ ప్రమాదం: కొనసాగుతున్న శవాల వెలికితీత!ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని హంస గ్రానైట్ క్వారీలో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదంలో మృత్యువాత పడిన కార్మికుల మతృదేహాల వెలికితీత శనివారం కూడా కొనసాగుతోంది. మతృదేహాలపై భారీ ఎత్తున మట్టిపెళ్ళలు, గ్రానైట్ రాళ్లు పడి ఉండటంతో వెలికితీత పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.Source: ఏపీ న్యూస్ | 27 Feb 2010 | 12:09 am మార్చి 4, 5 తేదీల్లో శ్రీకృష్ణ బృందం రాష్ట్ర పర్యటన!జస్టీస్ శ్రీకృష్ణ బృందం రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనుంది. వచ్చే నెల నాలుగు, ఐదు తేదీల్లో రాష్ట్రంలో పర్యటించాలని నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు రాజధాని హైదరాబాద్‌లో తిష్టవేసి ప్రధాన రాజకీయ పార్టీలతో సమగ్రంగా చర్చలు జరుపనుంది.Source: ఏపీ న్యూస్ | 27 Feb 2010 | 12:01 am శ్రీకృష్ణ కమిటీ ఎదుట హాజరుకాము: వెంకయ్య నాయుడుజస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఎదుట తమ పార్టీ హాజరుకాబోదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనను ఈ కమిటీ తేల్చగలదా అని ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 26 Feb 2010 | 11:52 pm డబ్బుతో ప్రాణాలకు వెలకడుతున్నారు: చిరంజీవిచీమకుర్తిలోని హంసగ్రానైట్ క్వారీ ప్రమాద స్థలిని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్వారీ యజమానులు తమ స్వలాభాపేక్షతో నిట్టనిలువుగా తవ్వకాలు చేస్తున్నందునే ఈ ఘోర ప్రమాదం జరిగిందని చిరంజీవి అన్నారు.Source: ఏపీ న్యూస్ | 26 Feb 2010 | 11:50 pm పూణే పేలుళ్లు: 17కు పెరిగిన మృతుల సంఖ్య!ఈనెల 13వ తేదీన జరిగిన పూణేలో జరిగిన బాంబు పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య శనివారానికి 17కు చేరింది. ఈ పేలుళ్ళలో తీవ్రంగా గాయపడిన 23 సంవత్సరాల మహిళ గురువారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 26 Feb 2010 | 11:30 pm పసికందును చంపిన కుక్క: గొంతుకోసుకున్న వైద్యుడు!రాష్ట్రంలోని రెండు ప్రధాన ఆస్పత్రుల్లో రెండు విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆస్పత్రిలో పసికందును కుక్క చంపేయగా, కడపలోని రిమ్స్ ఆస్పత్రిలో ఒక వైద్యుడు కొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.Source: ఏపీ న్యూస్ | 26 Feb 2010 | 10:05 pm విభజనకు అనుకూలంగా నివేదిక ఇస్తా: మంత్రి బొత్స!రాష్ట్రాన్ని విభజించాలన్నదే తన వ్యక్తిగత వాదనగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ముందు విభజనకు అనుకూలంగానే తాను, తన కుటుంబ సభ్యులం నివేదిక ఇస్తామని ప్రకటించారు. తెలుగు భాష మాట్లాడేవారు రెండుగా విడిపోతే తప్పేమిటని అని ఆయన ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 26 Feb 2010 | 9:51 pm సచిన్‌కు భారతరత్న: కేంద్రానికి మహారాష్ట్ర సిఫార్సు!అంతర్జాతీయ క్రికెట్ చరిత్ర పుటల్లో తనకంటూ ఒక పేజీని సువర్ణాక్షరాలతో లిఖించుకున్న క్రికెట్ హీరో, భారత పరుగుల యంత్రం సచిన్ రమేష్ టెండూల్కర్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న వరించనుందా? అవుననే అంటున్నాయి మహారాష్ట్ర ప్రభుత్వ వర్గాలు.Source: జాతీయ | 26 Feb 2010 | 9:33 pm నేటినుంచి మన్మోహన్ సౌదీ అరేబియా పర్యటన!ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సౌదీ అరేబియా పర్యటన శనివారం నుంచి ప్రారంభంకానుంది. మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటన కోసం ఆయన నేడు న్యూఢిల్లీ నుంచి బయలుదేరి సౌదీ రాజధాని రియాద్‌కు చేరుకుంటారు. ఆయన వెంట భారత వాణిజ్య, పారిశ్రామికవేత్తల, అధికార ప్రతినిధుల బృందం కూడా సౌదీకి వెళుతోంది.Source: జాతీయ | 26 Feb 2010 | 8:37 pm ప్రియురాలితో "ఏ మాయ చేసావె" అంటోన్న ప్రియుడుకార్తీక్ (నాగచైతన్య) మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి తన చిరకాల కోరిక సినిమా దర్శకుడవ్వాలనుకుంటాడు. జెస్సీ (సమంత) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఆమె ఉంటున్న ఇంట్లోనే కార్తీక్ ఫ్యామిలీ ఉంటుంది. తండ్రి సంజయస్వరూప్, తల్లి సురేఖావాణి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌లా మొదటి చూపులోనే కార్తీక్ జెస్సీని ప్రేమించేస్తాడు. రోజు కలుసుకోవడం, కబుర్లు చెప్పుకోవడం మామూలే. ఒకరోజు ఐ లవ్ యు చెప్పేస్తాడు. ఆ తర్వాత రోజు నుంచి ఆమె కన్పించదు.Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2010 | 10:33 am నా కాలు జారిన ఫోటోలు ప్రదర్శిస్తున్నారు: ఛార్మిమొన్నటివరకూ బాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్లు ఆయా దర్శకనిర్మాతలపై ఫిర్యాదులు చేస్తూ వార్తల్లో నానుతూ ఉండటం మనకు తెలుసు. తాజాగా టాలీవుడ్ కూడా ఈ జాబితాలో చేరేందుకు పోటీపడుతోంది. ఛార్మింగ్ అందాల ఛార్మి, తను నటించిన "మాయగాడు" చిత్ర నిర్మాతపై ఇంతెత్తు లేచి అతనిపై 'మా'లో ఫిర్యాదు చేసింది. షూటింగ్ సమయంలో తను ప్రమాదవశాత్తూ కాలు జారి కిందపడినప్పుడు, ఆ ఫోటోలను దొంగతనంగా తీసి పబ్లిసిటీకి సదరు నిర్మాత ఉపయోగించుకుంటున్నారనీ, అదేమని అడిగితే బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అసలు ఆ చిత్ర నిర్మాత ప్రవర్తన బాగా లేదని ఆరోపించింది. ఇదిలావుంటే... మాయగాడు నిర్మాత మాత్రం, ఛార్మి చెప్పేవన్నీ వట్టి అబద్ధాలని కొట్టి పారేస్తున్నారు. ఆ చిత్రంలో ఆమెకు నచ్చిన దుస్తులను వేసుకుని వచ్చేదనీ, మాయగాడులో ఎక్స్‌పోజ్ చేసిన దానికి మించిన ఎక్స్‌పోజింగ్ చాలా చిత్రాల్లో చేసిందని అంటున్నారు. తన ప్రవర్తన ఎటువంటిదో బయటకు వచ్చి చెప్పాలని అన్నారు. ఛార్మి వైఖరి మూలంగా తాను లక్షల రూపాయలు నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2010 | 9:56 am డీఎస్‌కు దమ్ముంటే జేఏసీ అభ్యర్థిపై పోటీ చేయాలి: హరీష్డీఎస్ వ్యాఖ్యలపై తెలంగాణా రాష్ట్ర సమితి మండిపడింది. దమ్ముంటే నిజామాబాద్ నియోజకవర్గంలో తాము పోటీగా నిలబెట్టే జేఏసీ అభ్యర్థిపై డీఎస్ పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆ ఎన్నికలో డీఎస్ ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని తెరాస నాయకుడు హరీష్ రావు అన్నారు.Source: ఏపీ న్యూస్ | 26 Feb 2010 | 8:31 am ఏ మాయ చేసావే చిత్రం ట్రెయిలర్ మీకోసంఅక్కినేని నాగేశ్వర రావు మనవడు, నాగార్జున కుమారుడు నాగచైతన్య సినిమాపై ఉన్న మక్కువతో ఈ రంగంలోకి వచ్చినా తనకు దీర్ఘకాలిక ప్రణాళికలు ఏవీ లేవని చెపుతున్నారు. స్టెప్ బై స్టెప్ ఎక్కాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. తాజాగా, ఇందిరా ప్రొడక్షన్ పతాకంపై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో "ఏ మాయ చేసావే" చిత్రంలో నటించారు. "లవ్ అనేది కామన్. ఎటువంటి చిత్రమైనా అందులో అంతర్లీనంగా ప్రేమ ఉంటుంది. అది లేకపోతే బోర్ కొడుతుంది. అందరికీ లవ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. లేకపోతే.. జీవితంలో కష్టం. ఈ చిత్రం చూశాక అందరికీ అలా అనిపిస్తుంది" అని చెప్పే నాగచైతన్యకు సంబంధించిన చిత్రం ఏ మాయ చేసావే చిత్రం ట్రెయిలర్ మీకోసం....Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2010 | 8:29 am భారతీయులపై దాడులు నీతిబాహ్యమైనవి: ఎస్ఎం కృష్ణఆఫ్గనిస్థాన్లోని కాబూల్‌లోని పార్క్ రెసిడెంట్స్ వద్ద శుక్రవారం జరిగిన బాంబు పేలుడు దుర్ఘటనలో భారతదేశానికి చెందిన తొమ్మిదిమంది మృతి చెందారని, మృతి చెందిన వారిలో మరికొంతమంది ఆఫ్గన్ దేశస్తులు, ఇతరులున్నారని, ఆ దేశం భారత్‌కు సమాచారం అందించింది. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖామంత్రి ఎస్ఎం కృష్ణ స్పందిస్తూ ఆఫ్గన్‌లో జరిగిన బాంబు దాడులు నీతిబాహ్యమైనవని ఆయన అన్నారు.Source: జాతీయ | 26 Feb 2010 | 7:55 am ప్రేమ పేరు చెపితే ఝిల్లుమనాలి: దీపికా పదుకునే"ప్రేమ" అనే పదానికి ఎందరో.. ఏవేవో అర్థాలు చెబుతుంటే.. బాలీవుడ్ సౌందర్యరాశి దీపికా పదుకునే కూడా వారి మాదిరిగానే ప్రేమకు కొత్త అర్థాలను చెపుతోంది. " నేను ప్రేమ అనే భావనను నమ్ముతాను. కుటుంబ సంబంధాలు, వివాహవ్యవస్థలను ఎంతగా నమ్ముతానో ప్రేమను కూడా అలాగే నమ్ముతాను" అని అంటోంది. "నా దృష్టిలో నిజమైన ప్రేమ ఒక్కసారే పుడుతుంది. ఇది నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి చెబుతున్నాను. అసలు ప్రేమ పేరు చెబితే మనసు, శరీరం ఒక్కసారిగా ఝిల్లుమనాలి" అని దీపికా స్పష్టం చేసింది. మరి నీకెప్పుడు ఝిల్లుమంటుందీ...? అని ప్రశ్నిస్తూ కారాలు మీరాలు నూరుతూ కొరకొరా చూసింది.Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2010 | 7:42 am నిత్యావసర వస్తు ధరలపై ప్రతిపక్ష పార్టీల ఐక్యతారాగం!ధరల పెరుగుదలపై జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యతారాగాన్ని ఆలపించాయి. ఇప్పటికే ధరల పెరుగదలతో ప్రజలు అల్లాడుతుంటే.. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని 7.5 శాతం పెంచడాన్ని విపక్షాలన్నీ ఖండిస్తున్నాయి. దీనికి నిరసనగా అన్ని పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పాఠం కొనసాతుండగా అన్ని విపక్ష పార్టీలు మూకుమ్మడగా సభ నుంచి వాకౌట్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.Source: జాతీయ | 26 Feb 2010 | 5:03 am ప్రణబ్ సాధారణ బడ్జెట్‌పై ప్రధాని మన్మోహన్ హర్షం!కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ప్రవేశపెట్టిన 2010-11 వార్షిక బడ్జెట్‌పై ప్రధాని మన్మోహన్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీకి అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించారని ఆయన కితాబిచ్చారు.Source: జాతీయ | 26 Feb 2010 | 4:16 am సాయిబాబా మహిమలకు అద్దం పట్టే "ఓం సాయిరాం"బాబా భక్తుల అనుభవాలను సేకరించి, యధార్థ సంఘటనల ఆధారంగా "ఓం సాయిరాం" (సబ్‌కా మాలిక్ ఏక్) చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర దర్శకుడు, నిర్మాత జి.ఎల్.బి. శ్రీనివాస్ తెలిపారు. శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో జాకీషరాఫ్, నాజర్, కోట ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2010 | 4:14 am అలాంటి ఛాన్స్ అందరికీ రాదుగా..!: అసిన్నటనకు ఆస్కారం ఉందా? లేదా? అనే విషయం గురించి అంతగా పట్టించుకోనని గజిని భామ అసిన్ అంటోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో మకాం వేసిన అసిన్ "లండన్ డ్రీమ్స్"లో నటించింది. అందులో పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదని వస్తున్న వార్తలకు అసిన్ స్పందిస్తూ.. "అగ్రస్థాయి నటులే మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్న రోజులివి. సల్మాన్‌ఖాన్, అజయ్‌దేవగన్ లాంటి నటుల సరసన నటించే అవకాశం అందరికీ రాదు. ఇందులో నాయికగా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. అంతేగాని ఇటువంటి చిత్రంలో కథకు ప్రాధాన్యత ఉందా? లేదా? అనేది చూడను" అని అసిస్ చెబుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2010 | 3:56 am ఏ మాయ చేసావే చిత్రం ట్రెయిలర్ మీకోసంఅక్కినేని నాగేశ్వర రావు మనవడు, నాగార్జున కుమారుడు నాగచైతన్య సినిమాపై ఉన్న మక్కువతో ఈ రంగంలోకి వచ్చినా తనకు దీర్ఘకాలిక ప్రణాళికలు ఏవీ లేవని చెపుతున్నారు. స్టెప్ బై స్టెప్ ఎక్కాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. తాజాగా, ఇందిరా ప్రొడక్షన్ పతాకంపై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో "ఏ మాయ చేసావే" చిత్రంలో నటించారు. "లవ్ అనేది కామన్. ఎటువంటి చిత్రమైనా అందులో అంతర్లీనంగా ప్రేమ ఉంటుంది. అది లేకపోతే బోర్ కొడుతుంది. అందరికీ లవ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. లేకపోతే.. జీవితంలో కష్టం. ఈ చిత్రం చూశాక అందరికీ అలా అనిపిస్తుంది" అని చెప్పే నాగచైతన్యకు సంబంధించిన చిత్రం ఏ మాయ చేసావే చిత్రం ట్రెయిలర్ మీకోసం....Source: వినోదం | 26 Feb 2010 | 3:08 am ఉస్మానియా ఘటనపై త్రిసభ్య కమిటీకి సుప్రీం ఆదేశంరాష్ట్ర రాజధానిలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న సంఘటనలపై పూర్తి నివేదిక ఇచ్చేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే, ఓయూలో బలగాల మొహరింపు కూడా ఈ కమిటీ సూచన మేరకే జరగాలని సుప్రీంకోర్టు పేర్కొంది.Source: జాతీయ | 26 Feb 2010 | 2:32 am ప్రేమ పేరు చెపితే ఝిల్లుమనాలి: దీపికా పదుకునే"ప్రేమ" అనే పదానికి ఎందరో.. ఏవేవో అర్థాలు చెబుతుంటే.. బాలీవుడ్ సౌందర్యరాశి దీపికా పదుకునే కూడా వారి మాదిరిగానే ప్రేమకు కొత్త అర్థాలను చెపుతోంది. " నేను ప్రేమ అనే భావనను నమ్ముతాను. కుటుంబ సంబంధాలు, వివాహవ్యవస్థలను ఎంతగా నమ్ముతానో ప్రేమను కూడా అలాగే నమ్ముతాను" అని అంటోంది. "నా దృష్టిలో నిజమైన ప్రేమ ఒక్కసారే పుడుతుంది. ఇది నేను పెరిగిన వాతావరణాన్ని...Source: వినోదం | 26 Feb 2010 | 2:13 am
|