ఉస్మానియా ఘటనపై త్రిసభ్య కమిటీకి సుప్రీం ఆదేశం

రాష్ట్ర రాజధానిలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న సంఘటనలపై పూర్తి నివేదిక ఇచ్చేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే, ఓయూలో బలగాల మొహరింపు కూడా ఈ కమిటీ సూచన మేరకే జరగాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 26 Feb 2010 | 8:02 am

భారీ లాభాల దిశగా సెన్సెక్స్, నిఫ్టీల పయనం

శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాలను ఆర్జించే దిశగా ర్యాలీని కొనసాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రభావంతో ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 287 పాయింట్లు భారీగా పుంజుకుని, 16,541 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 96 పాయింట్లు బలపడి, 4,955 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది
Source: Yahoo! Telugu: News | 26 Feb 2010 | 7:50 am

భారీగా పుంజుకున్న బాంబే స్టాక్ మార్కెట్

వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ భారీగా పుంజుకుంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలను ఆర్జించాయి. ఫలితంగా శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, 311 పాయింట్లు భారీగా పుంజుకుని, 16,565 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 128 పాయింట్లు భారీగా లాభపడి, 4,988 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 26 Feb 2010 | 7:49 am

ప్రేమ పేరు చెపితే ఝిల్లుమనాలి: దీపికా పదుకునే

"ప్రేమ" అనే పదానికి ఎందరో.. ఏవేవో అర్థాలు చెబుతుంటే.. బాలీవుడ్ సౌందర్యరాశి దీపికా పదుకునే కూడా వారి మాదిరిగానే ప్రేమకు కొత్త అర్థాలను చెపుతోంది. " నేను ప్రేమ అనే భావనను నమ్ముతాను. కుటుంబ సంబంధాలు, వివాహవ్యవస్థలను ఎంతగా నమ్ముతానో ప్రేమను కూడా అలాగే నమ్ముతాను" అని అంటోంది. "నా దృష్టిలో నిజమైన ప్రేమ ఒక్కసారే పుడుతుంది. ఇది నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి చెబుతున్నాను. అసలు ప్రేమ పేరు చెబితే మనసు, శరీరం ఒక్కసారిగా ఝిల్లుమనాలి" అని దీపికా స్పష్టం చేసింది. మరి నీకెప్పుడు ఝిల్లుమంటుందీ...? అని ప్రశ్నిస్తూ కారాలు మీరాలు నూరుతూ కొరకొరా చూసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2010 | 7:42 am

గృహరుణాలు పొందేవారికి శుభవార్త: ప్రణబ్

కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం లోక్‌సభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా దేశంలో గృహనిర్మాణాలు చేపట్టేందుకు ప్రజలు బ్యాంకుల ద్వారా తీసుకునే గృహరుణాలపై ఒకశాతం వడ్డీని రాయితీగా ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 26 Feb 2010 | 7:03 am

పేదలు-రైతుల వ్యతిరేక బడ్జెట్: కె.ఎర్రన్నాయుడు

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు కె.ఎర్రన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పేదల, రైతుల వ్యతిరేక బడ్జెట్‌గా అభివర్ణించారు.
Source: Yahoo! Telugu: News | 26 Feb 2010 | 6:46 am

ఎగుమతిదారులకు వడ్డీలో రాయితీ : ఆర్థిక మంత్రి

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం కారణంగా కేంద్ర ప్రభుత్వం గతంలో పలు ప్రోత్సాహక ప్యాకేజీలను ప్రకటించింది. అందులో భాగంగా ఎగుమతి దారులు తీసుకునే రుణాలపై రెండు శాతం రాయితీని మరో ఏడాదిపాటు పొడిగించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం లోక్‌సభలో ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 26 Feb 2010 | 6:39 am

భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య చర్చలు: అమెరికా హర్షం!

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య శాంతియుత చర్చలు ప్రారంభం కావడంపై అగ్ర దేశమైన అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ఇంకా భారత్, పాకిస్థాన్‌ల మధ్య ముఖాముఖి శాంతి చర్చలు జరగడాన్ని అమెరికా స్వాగతించింది. ఇరు దేశాల ప్రయోజనాల కోసం జరిగే భారత్-పాక్ చర్చలకు తాము పూర్తి మద్దతిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 26 Feb 2010 | 6:38 am

సాధారణ బడ్జెట్: బంగారం-వెండిలు మరింత ప్రియం

విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన 2010-11 సంవత్సర సాధారణ బడ్జెట్ పుణ్యమాని బంగారం, వెండి ధరలు మరింత ప్రియం కానున్నాయి. బంగారం నిల్వలో భారత్ పదో స్థానంలో ఉందని ఆర్థిక సర్వే వెల్లడించిన మరుసటి రోజే ఈ ధరలకు రెక్కలు రావడం గమనార్హం. బంగారం, వెండిపై ఎక్సైజ్ సుంకాలను పెంచుతున్నట్టు ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 26 Feb 2010 | 6:35 am

2010-11 సంవత్సర బడ్జెట్ అంచనా ఇదీ..!

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో బడ్జెట్ అంచనా కింది విధంగా ఉంది. మొత్తం వ్యయం రూ.11,08,749 కోట్లు కాగా, ప్రణాళికా వ్యయం రూ.3,73,092 కోట్లుగా ఉంది.
Source: Yahoo! Telugu: News | 26 Feb 2010 | 6:33 am

పెట్రోపై 7.5% ఎక్సైజ్ డ్యూటి: నిత్యావసరాలకు "గుదిబండ"

ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆహార పదార్థాల ధరల అదుపునకు బదులు మరింత పెరిగే విధంగా నిర్ణయాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆహార పదార్థాల ధరల అదుపునకు అవసరమైన చర్యలు తీసుకుంటామంటూనే పెట్రోల్‌పై 5 శాతం, డీజిల్‌పై 7.5 శాతం మేర ఎక్సైజ్ డ్యూటీ పెంచడమే దీనికి నిదర్శనమంటున్నారు.
Source: Yahoo! Telugu: News | 26 Feb 2010 | 6:33 am

సాయిబాబా మహిమలకు అద్దం పట్టే "ఓం సాయిరాం"

బాబా భక్తుల అనుభవాలను సేకరించి, యధార్థ సంఘటనల ఆధారంగా "ఓం సాయిరాం" (సబ్‌కా మాలిక్ ఏక్) చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర దర్శకుడు, నిర్మాత జి.ఎల్.బి. శ్రీనివాస్ తెలిపారు. శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో జాకీషరాఫ్, నాజర్, కోట ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2010 | 4:14 am

అలాంటి ఛాన్స్ అందరికీ రాదుగా..!: అసిన్

నటనకు ఆస్కారం ఉందా? లేదా? అనే విషయం గురించి అంతగా పట్టించుకోనని గజిని భామ అసిన్ అంటోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో మకాం వేసిన అసిన్ "లండన్ డ్రీమ్స్"లో నటించింది. అందులో పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదని వస్తున్న వార్తలకు అసిన్ స్పందిస్తూ.. "అగ్రస్థాయి నటులే మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్న రోజులివి. సల్మాన్‌ఖాన్, అజయ్‌దేవగన్ లాంటి నటుల సరసన నటించే అవకాశం అందరికీ రాదు. ఇందులో నాయికగా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. అంతేగాని ఇటువంటి చిత్రంలో కథకు ప్రాధాన్యత ఉందా? లేదా? అనేది చూడను" అని అసిస్ చెబుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Feb 2010 | 3:56 am

ఉస్మానియా ఘటనపై త్రిసభ్య కమిటీకి సుప్రీం ఆదేశం

రాష్ట్ర రాజధానిలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న సంఘటనలపై పూర్తి నివేదిక ఇచ్చేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే, ఓయూలో బలగాల మొహరింపు కూడా ఈ కమిటీ సూచన మేరకే జరగాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
Source: జాతీయ | 26 Feb 2010 | 2:32 am

పేదలు-రైతుల వ్యతిరేక బడ్జెట్: కె.ఎర్రన్నాయుడు

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు కె.ఎర్రన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పేదల, రైతుల వ్యతిరేక బడ్జెట్‌గా అభివర్ణించారు.
Source: ఏపీ న్యూస్ | 26 Feb 2010 | 1:21 am

పెట్రోపై 7.5% ఎక్సైజ్ డ్యూటి: నిత్యావసరాలకు "గుదిబండ"

ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆహార పదార్థాల ధరల అదుపునకు బదులు మరింత పెరిగే విధంగా నిర్ణయాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆహార పదార్థాల ధరల అదుపునకు అవసరమైన చర్యలు తీసుకుంటామంటూనే పెట్రోల్‌పై 5 శాతం, డీజిల్‌పై 7.5 శాతం మేర ఎక్సైజ్ డ్యూటీ పెంచడమే దీనికి నిదర్శనమంటున్నారు.
Source: జాతీయ | 26 Feb 2010 | 1:20 am

బీహార్‌లో ఘోరం: భార్యాపిల్లను కాల్చివేసిన ఎమ్మెల్యే!

దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన బీహార్‌లో మరో ఘోరం జరిగింది. ఆ రాష్ట్రంలోని జమై శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న అధికార జనతాదళ్ (యు) పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభయ్ సింగ్ తన భార్యా పిల్లలను కాల్చి వేశారు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
Source: జాతీయ | 25 Feb 2010 | 10:13 pm

మహిళా బిల్లుకు మోక్షం: కేంద్ర మంత్రివర్గం ఆమోదం!

మళ్లీ మహిళా బిల్లు తెరపైకి వచ్చింది. అన్ని రకాల చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు గాను రూపొందించిన ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గురువారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
Source: జాతీయ | 25 Feb 2010 | 10:13 pm

అయ్యా.. మీ రాజీనామాలు చెల్లవ్: కిరణ్ కుమార్ రెడ్డి

తమ పదవులకు రాజీనామా చేసిన కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలకు చెందిన ముగ్గురు సభ్యుల రాజీనామా లేఖలను స్పీకర్ ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి తోసిపుచ్చారు. కాంగ్రెస్ సభ్యులు ఆర్.దామోదర్ రెడ్డి, చెరకు ముత్యం రెడ్డి, ప్రరాపా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలు మనస్పూర్తిగా రాజీనామాలు చేయలేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు వారు ముగ్గురితో స్పీకర్ సమావేశమైన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Feb 2010 | 10:12 pm

"గీతాంజలి" ఫీల్‌ను కలిగించే "ఏ మాయ చేసావే": నాగచైతన్య

వెండితెరపై అక్కినేని వారసుడు నాగచైతన్య. సినిమాపై ఉన్న మక్కువతో ఈ రంగంలోకి వచ్చినా తనకు దీర్ఘకాలిక ప్రణాళికలు ఏవీ లేవని చెపుతున్నారు. స్టెప్ బై స్టెప్ ఎక్కాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. తాజాగా, ఇందిరా ప్రొడక్షన్ పతాకంపై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో "ఏ మాయ చేసావే" చిత్రంలో నటించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Feb 2010 | 12:46 pm

విధిరాతను ఎవరూ తప్పించలేరు: సమంత

"ఏ మాయ చేసావె" సినిమాతోనే పెద్ద బేనర్‌లో ఛాన్స్ కొట్టేసిన సమంత వేదాంతం చెబుతోంది. "చెన్నైలోని స్టెల్లా మేరిస్ కాలేజీలో చదువుతున్నాను. తొలుత తమిళ సినిమా అవకాశం వచ్చింది. అక్కడ నుంచి నాగచైతన్య చిత్రానికి ఎంపిక అయ్యాను. నా పేరులో ఉన్న అర్థం ఏమిటంటే..? ప్రార్థనలను శ్రద్ధగా వినే వ్యక్తి" అని సమంత వివరణ ఇచ్చింది. అలాగే "స్వర్గం, నరకం, విధిరాత వంటి విషయాల మీద నాకు నమ్మకం ఎక్కువ. ఎంత కష్టపడ్డా అదృష్టమన్నది తోడు కావాలన్నది నా నమ్మకం. అలాగే విధిరాతను ఎవరు తప్పించలేరు" అని సమంత వేదాంతం అల్లుకుంటూ పోయింది. ఇంకా "అద్దం ముందు నిలబడి.. ఆల్‌దిబెస్ట్. అవార్డ్ గోస్‌టు.. సమంత అని చెప్పుకుంటాను. ఆ రోజుకోసం ఎదురుచూస్తుంటాను" అని సమంత మనసులోని మాటను బయటపెట్టింది. మరి ఆ ఛాన్స్ సమంతకు మనం కూడా కోరుకుందాం..!
Source: Yahoo! Telugu: Entertainment | 25 Feb 2010 | 9:24 am

శ్రీకృష్ణ కమిటీని తిరస్కరిస్తున్నాం: కోదండరామ్!

రాష్ట్ర పరిస్థితులపై సంప్రదింపులు జరిపేందుకు కేంద్రం వేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Feb 2010 | 8:05 am

మార్చిలో "సూపర్‌కౌబాయ్"గా వస్తోన్న లారెన్స్!

మాస్, డాన్ వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు "స్టైల్" వంటి సూపర్‌హిట్ చిత్రం హీరో, డైరక్టర్ అయిన రాఘవ లారెన్స్ హీరోగా 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భారీ చిత్రం "సూపర్‌కౌబాయ్". ఈ చిత్రాన్ని ఎ.జి.ఎస్. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కల్పాతి ఎస్. అగోరమ్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం గురించి హీరో రాఘవలారెన్స్ మాట్లాడుతూ.. "సూపర్‌కౌబాయ్" చిత్రాన్ని లావిష్‌గా ఎ.జి.ఎస్ సంస్థ నిర్మిస్తోంది. శింబుదేవన్ ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. ఈ కౌబాయ్ చిత్రంలో యాక్షన్‌తోపాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ వుంటుంది. జి.వి.ప్రకాష్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. రేర్ లొకేషన్స్‌లో తీసిన "సూపర్‌కౌబాయ్" హీరోగా నాకు సూపర్ డూపర్ హిట్ చిత్రం అవుతుంది" అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Feb 2010 | 6:24 am

శ్రీహరి, మీనాల "దాసన్నా" ట్రైలర్స్ విడుదల

శ్రీహరి, మీనా కాంబినేషన్‌లో నటించిన "దాసన్నా" చిత్రం ట్రైలర్స్ విడుదలయ్యాయి. ట్రైలర్స్ విడుదల సందర్భంగా నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ.. షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుని డీటీఎస్ మిక్సింగ్ జరుగుతోందన్నారు. అన్ని కార్యక్రమాలను ముగించుకుని మార్చి మొదటివారంలో ఆడియోను రిలీజ్ చేస్తున్నామని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Feb 2010 | 6:15 am

తెలుగులో మాట్లాడిన నేరానికి విద్యార్థినికి శిక్ష!

రాష్ట్ర వాణిజ్య రాజధానిగా చెప్పుకునే విజయవాడ నగరం నడిబొడ్డున తెలుగు భాషకు తీరని అన్యాయం, అవమానం జరిగింది. స్థానిక సెయింట్ ఆన్స్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని తెలుగులో మాట్లాడినందుకు టీచర్ చిత్ర హింసలు పెట్టింది. సాటి విద్యార్థుల ముందు బట్టలు విప్పదీసి అర్థనగ్నంగా నిలబెట్టింది. అంతటితో కోపం తీరని ఆ టీచర్.. చిన్నారిని చితక బాదింది.
Source: ఏపీ న్యూస్ | 25 Feb 2010 | 5:16 am

చక్కబడుతున్న రాష్ట్ర పరిస్థితులు: గవర్నర్ నరసింహన్

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా నెలకొన్న పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నాయని గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఇప్పుడు తలెత్తడం లేదన్నారు. పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయన్నారు. రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతున్నాయంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Feb 2010 | 4:46 am

సత్యం కుంభకోణం: ఆడిటర్‌కు బెయిల్ నిరాకరణ

సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో సంబంధం ఉన్నట్టు అభియోగాలు నమోదైన ఆడిటర్ గోపాలకృష్ణకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన దాఖలు చేసుకున్న పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది.
Source: ఏపీ న్యూస్ | 25 Feb 2010 | 4:28 am

తీవ్రవాదాన్ని రూపుమాపే బాధ్యత పాక్‌దే: నిరుపమా

పాక్ భాభాగం నుంచి ప్రేరేపితమయ్యే తీవ్రవాదాన్ని రూపుమాపాల్సిన కనీస బాధ్యత ఆ దేశంపైనే ఉందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిరుపమారావు స్పష్టం చేశారు. ముంబై పేలుళ్ళకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె నొక్కివక్కాణించారు.
Source: జాతీయ | 25 Feb 2010 | 3:56 am

"రండి..రండి.." అని ప్రకాష్‌రాజ్ పిలిస్తే చిర్రెత్తింది..!: నవనీత్

మంచిగామాట్లాడేవారంటే ఇష్టమని గ్లామర్ క్వీన్ నవనీత్‌కౌర్‌ చెబుతోంది. మంచితనమనేది మాటల్లోనే తెలుస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని అంటోన్న నవీనీత్‌ కౌర్.. పంజాబీ, తమిళ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉందని చెబుతోంది. మొట్టమొదటి తెలుగు చిత్రం షూటింగ్‌లో ప్రకాష్‌రాజ్‌ తనను 'రండి..రండి..' అని పిలిస్తే... నాకు చిర్రెత్తింది.మా భాషలో "రండి" అంటే వేరే అర్థముంది. తిడుతున్నాడని కోపంగా మాట్లాడాను. కానీ తెలుగులో "రండి" అనేమాటలో ఉన్న ఆప్యాయతను చూసి ఆశ్చర్యపోయాను. అని నవనీత్ కౌర్ చెప్పింది.అలాగే బాడీ సీక్రెట్‌ గురించి చెబుతూ.. రోజూ జాకింగ్‌ డాన్స్‌ చేస్తుంటా... అంతకంటే సీకెట్ర్‌ లేదు. ప్రస్తుతం నాలుగేళ్ళవరకు పెళ్లి ఆలోచనలేదు. అబ్బాయి గురించి కూడా లేదు. ఆ తర్వాతే పెండ్లిగురించి ఆలోచిస్తానని చెబుతున్న నవనీత్‌ .. పాత్రమేరకు బికినీ వేయడంలో తప్పులేదని చెబుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Feb 2010 | 3:46 am

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు అంశాల పంపిణీ పూర్తి!

రాష్ట్రంలోని పరిస్థితుల అధ్యయనానికి కేంద్రం హోం శాఖ ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీలోని సభ్యులకు అంశాల పంపిణీ పూర్తయింది. రాజకీయ చారిత్రాత్మక, న్యాయపరమైన అంశాలను కమిటీ సభ్య కార్యదర్శి వీకేదుగ్గల్, రణీబీర్ సింగ్‌లు పరిశీలిస్తారు. అలాగే సామాజిక, సాంస్కృతిక అంశాలను రవీంద కౌర్, అబూ సలే షరఫ్ పరిశీలిస్తారని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ వెల్లడించింది.
Source: జాతీయ | 25 Feb 2010 | 2:57 am