చిత్రకారుడు ఎంఎఫ్.హుస్సేన్‌కు ఖతార్ పౌరసత్వం!

విశ్వవిఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్.హుస్సేన్‌కు ఖతార్ ప్రభుత్వం పౌరసత్వం కల్పించింది. దీంతో ఆయన ఏడు దశాబ్దాలుగా మాతృదేశం భారత్‌తో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నారు. ఇందులోభాగంగా, ఆయన భారత్ పౌరసత్వాన్ని వదులుకుంటున్నట్టు ప్రకటించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 25 Feb 2010 | 8:39 am

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు అంశాల పంపిణీ పూర్తి!

రాష్ట్రంలోని పరిస్థితుల అధ్యయనానికి కేంద్రం హోం శాఖ ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీలోని సభ్యులకు అంశాల పంపిణీ పూర్తయింది. రాజకీయ చారిత్రాత్మక, న్యాయపరమైన అంశాలను కమిటీ సభ్య కార్యదర్శి వీకేదుగ్గల్, రణీబీర్ సింగ్‌లు పరిశీలిస్తారు. అలాగే సామాజిక, సాంస్కృతిక అంశాలను రవీంద కౌర్, అబూ సలే షరఫ్ పరిశీలిస్తారని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 25 Feb 2010 | 8:26 am

టెక్స్‌టెక్ ఇంటర్నేషన్‌ను కైవసం చేసుకున్న జువ్!

యూరోపియిన్ సర్వీస్ ప్రొవైడర్ జువ్ గ్రూపు చెన్నయ్ కేంద్రంగా పని చేసే టెక్స్‌టెక్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్వాధీనం చేసుకుంది. ఈ కంపెనీని 25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు.
Source: Yahoo! Telugu: News | 25 Feb 2010 | 7:32 am

తగ్గిన ఆహార ద్రవ్యోల్బణం

ఆహార ద్రవ్యోల్బణం తగ్గి 17.58 శాతానికి చేరుకుంది. ఫిబ్రవరి 13తో ముగిసిన వారాంతానికి పప్పు దినుసులు, కూరగాయల ధరలు తగ్గడంతో ఆహార ద్రవ్యోల్బణం కాసింత తగ్గి 17.58 శాతానికి చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 25 Feb 2010 | 7:22 am

విదేశీ మార్కెట్ల ప్రభావం: సెన్సెక్స్ పతనం

ఆసియా, అమెరికా మార్కెట్ల ట్రేడింగ్ క్షీణించడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం శుక్రవారం (26వతేదీ) లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ కూడా సెన్సెక్స్, నిఫ్టీలపై ప్రభావం చూపలేకపోయింది. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 59 పాయింట్లు పతనమై, 16,196 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 13 పాయింట్లు క్షీణించి, 4,845 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 25 Feb 2010 | 7:08 am

కాంగ్రెస్ ప్రతిపాదన.. ప్రరాపా విలీనానికి కాదు: చిరంజీవి

అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజారాజ్యం పార్టీని తమ అదుపాజ్ఞల్లో పెట్టుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇందులోభాగంగా, ఒక రాజ్యసభ సీటును ప్రరాపాకు ఎరవేసింది. అయితే ఈ ప్రతిపాదనకు సై అంటే.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లతాయనే మీమాంసలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో పాటు.. ఆ పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు.
Source: Yahoo! Telugu: News | 25 Feb 2010 | 6:47 am

నష్టాలతో కొనసాగుతోన్న బాంబే స్టాక్ మార్కెట్

గురువారం బాంబే స్టాక్ మార్కెట్‌కు ఏమాత్రం కలిసిరాలేదు. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 52 పాయింట్లు క్షీణించి, 16,203 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 13 పాయింట్లు పతనమై, 4,845 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 25 Feb 2010 | 6:41 am

నక్సలిజం అణిచివేతపై చిత్తశుద్ధిలేని ప్రభుత్వం: భగవత్

దేశంలో పెట్రేగిపోతున్న తీవ్రవాదం, నక్సలిజాన్ని అణిచి వేసేందుకు కేంద్రంలోని యూపీఏ సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆరోపించారు. అందువల్ల ఈ రెండు సమస్యలు దేశానికి ప్రధాన ముప్పుగా పరిణమించాయన్నారు.
Source: Yahoo! Telugu: News | 25 Feb 2010 | 6:28 am

మార్చిలో "సూపర్‌కౌబాయ్"గా వస్తోన్న లారెన్స్!

మాస్, డాన్ వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు "స్టైల్" వంటి సూపర్‌హిట్ చిత్రం హీరో, డైరక్టర్ అయిన రాఘవ లారెన్స్ హీరోగా 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భారీ చిత్రం "సూపర్‌కౌబాయ్". ఈ చిత్రాన్ని ఎ.జి.ఎస్. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కల్పాతి ఎస్. అగోరమ్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం గురించి హీరో రాఘవలారెన్స్ మాట్లాడుతూ.. "సూపర్‌కౌబాయ్" చిత్రాన్ని లావిష్‌గా ఎ.జి.ఎస్ సంస్థ నిర్మిస్తోంది. శింబుదేవన్ ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. ఈ కౌబాయ్ చిత్రంలో యాక్షన్‌తోపాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ వుంటుంది. జి.వి.ప్రకాష్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. రేర్ లొకేషన్స్‌లో తీసిన "సూపర్‌కౌబాయ్" హీరోగా నాకు సూపర్ డూపర్ హిట్ చిత్రం అవుతుంది" అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Feb 2010 | 6:24 am

ఐఎస్ఐ, ఆర్మీ చీఫ్‌ల వద్ద విచారణకు పాక్ అనుమతి!

దివంగత మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో పాకిస్థాన్ ఐఎస్ఐ, ఆర్మీ చీఫ్‌ల వద్ద విచారణ జరిపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భుట్టో హత్యపై ఐక్యరాజ్య సమితితో విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే. ఈ కేసులో పాక్ ఆర్మీ చీఫ్ అష్పాక్ ఖయానీ, ఇతర సీనియర్ మిలిటరీ అధికారుల వద్ద విచారణ జరిపి, వారి అభిప్రాయాలను రికార్డు చేసేందుకు పాక్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Source: Yahoo! Telugu: News | 25 Feb 2010 | 6:15 am

శ్రీహరి, మీనాల "దాసన్నా" ట్రైలర్స్ విడుదల

శ్రీహరి, మీనా కాంబినేషన్‌లో నటించిన "దాసన్నా" చిత్రం ట్రైలర్స్ విడుదలయ్యాయి. ట్రైలర్స్ విడుదల సందర్భంగా నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ.. షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుని డీటీఎస్ మిక్సింగ్ జరుగుతోందన్నారు. అన్ని కార్యక్రమాలను ముగించుకుని మార్చి మొదటివారంలో ఆడియోను రిలీజ్ చేస్తున్నామని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Feb 2010 | 6:15 am

ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన మంత్రి

కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే వలన ప్రజల ఆశలపై నీళ్ళు చల్లింది. దేశంలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గే సూచనలు ఇప్పట్లో లేవని ఆ నివేదికలో పేర్కొంది. ఆర్థిక సర్వే, 12వ ఆర్థిక సంఘం నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఆర్థిక వృద్ధిరేటు 8.75 శాతంగా ఉంటుందని ఆయన సభలో తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 25 Feb 2010 | 6:01 am

"రండి..రండి.." అని ప్రకాష్‌రాజ్ పిలిస్తే చిర్రెత్తింది..!: నవనీత్

మంచిగామాట్లాడేవారంటే ఇష్టమని గ్లామర్ క్వీన్ నవనీత్‌కౌర్‌ చెబుతోంది. మంచితనమనేది మాటల్లోనే తెలుస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని అంటోన్న నవీనీత్‌ కౌర్.. పంజాబీ, తమిళ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉందని చెబుతోంది. మొట్టమొదటి తెలుగు చిత్రం షూటింగ్‌లో ప్రకాష్‌రాజ్‌ తనను 'రండి..రండి..' అని పిలిస్తే... నాకు చిర్రెత్తింది.మా భాషలో "రండి" అంటే వేరే అర్థముంది. తిడుతున్నాడని కోపంగా మాట్లాడాను. కానీ తెలుగులో "రండి" అనేమాటలో ఉన్న ఆప్యాయతను చూసి ఆశ్చర్యపోయాను. అని నవనీత్ కౌర్ చెప్పింది.అలాగే బాడీ సీక్రెట్‌ గురించి చెబుతూ.. రోజూ జాకింగ్‌ డాన్స్‌ చేస్తుంటా... అంతకంటే సీకెట్ర్‌ లేదు. ప్రస్తుతం నాలుగేళ్ళవరకు పెళ్లి ఆలోచనలేదు. అబ్బాయి గురించి కూడా లేదు. ఆ తర్వాతే పెండ్లిగురించి ఆలోచిస్తానని చెబుతున్న నవనీత్‌ .. పాత్రమేరకు బికినీ వేయడంలో తప్పులేదని చెబుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Feb 2010 | 3:46 am

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు అంశాల పంపిణీ పూర్తి!

రాష్ట్రంలోని పరిస్థితుల అధ్యయనానికి కేంద్రం హోం శాఖ ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీలోని సభ్యులకు అంశాల పంపిణీ పూర్తయింది. రాజకీయ చారిత్రాత్మక, న్యాయపరమైన అంశాలను కమిటీ సభ్య కార్యదర్శి వీకేదుగ్గల్, రణీబీర్ సింగ్‌లు పరిశీలిస్తారు. అలాగే సామాజిక, సాంస్కృతిక అంశాలను రవీంద కౌర్, అబూ సలే షరఫ్ పరిశీలిస్తారని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ వెల్లడించింది.
Source: జాతీయ | 25 Feb 2010 | 2:57 am

కాంగ్రెస్ ప్రతిపాదన.. ప్రరాపా విలీనానికి కాదు: చిరంజీవి

అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజారాజ్యం పార్టీని తమ అదుపాజ్ఞల్లో పెట్టుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇందులోభాగంగా, ఒక రాజ్యసభ సీటును ప్రరాపాకు ఎరవేసింది. అయితే ఈ ప్రతిపాదనకు సై అంటే.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లతాయనే మీమాంసలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో పాటు.. ఆ పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Feb 2010 | 1:18 am

నక్సలిజం అణిచివేతపై చిత్తశుద్ధిలేని ప్రభుత్వం: భగవత్

దేశంలో పెట్రేగిపోతున్న తీవ్రవాదం, నక్సలిజాన్ని అణిచి వేసేందుకు కేంద్రంలోని యూపీఏ సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆరోపించారు. అందువల్ల ఈ రెండు సమస్యలు దేశానికి ప్రధాన ముప్పుగా పరిణమించాయన్నారు.
Source: జాతీయ | 25 Feb 2010 | 12:58 am

"మాస్టర్ బ్లాస్టర్‌"ను అభినందిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం!

టీం ఇండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై శాసనసభ ప్రశంసల వర్షం కురిపించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో డబుల్ సెంచరీ సాధించి అరుదైన ప్రపంచ రికార్డును సాధించిన సచిన్ టెండూల్కర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రశంసించారు. గ్వాలియర్ గడ్డపై వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన సచిన్ టెండూల్కర్‌కు అభినందనలు తెలుపుతూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
Source: ఏపీ న్యూస్ | 25 Feb 2010 | 12:27 am

ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం: సీఎం

గౌరవ ప్రతిపక్ష సభ్యుడు రేవంత్ రెడ్డి తనపై చేసిన అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే ముఖ్యమంత్రి పదవి నుంచే కాకుండా రాజకీయాల నుంచి కూడా శాశ్వతంగా వైదొలుగుతానని ముఖ్యమంత్రి కె.రోశయ్య సవాల్ విసిరారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 24 Feb 2010 | 10:59 pm

పిల్లలం కాదు.. పాఠాలు చెప్పించుకునేందుకు: బాబు

మీతో పాఠాలు చెప్పించుకునేందుకు తామేమీ స్కూల్ పిల్లలం కామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్షాలకు స్పీకర్ సరైన అవకాశాలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపిస్తూ కఠువుగా వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Feb 2010 | 10:49 pm

హోంశాఖ కార్యాలయంలో ఆగిపోయిన ఫ్యాక్స్ మిషన్

కేంద్ర హోంశాఖ, నక్సలైట్ల మధ్య సంబంధాలు నెరిపేందుకు హోంశాఖ కార్యాలయానికి చెందిన ఫ్యాక్స్ నంబరు, నక్సలైట్ల మొబైల్ ఫోన్ నెంబరును ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. దీంతో సంప్రదింపులు జరిపేందుకు అనువుగా ఉంటుందని అందరూ భావించారు. కాని మాటలు ప్రారంభించే సమయంలోనే కేంద్ర హోంశాఖకు చెందిన ఫ్యాక్స్ మిషన్ ఆగిపోయింది. అలాగే నక్సలైట్ల ఫోను జామ్ అయ్యింది.
Source: జాతీయ | 24 Feb 2010 | 9:57 pm

రానున్న కాలం నానో టెక్నాలజీదే : అబ్దుల్ కలాం

రానున్న రోజుల్లో నానో టెక్నాలజీదే అని భారతమాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్పష్టం చేశారు. నానో, బయో లాంటి మిగిలిన టెక్నాలజీలు కలిపి ఒక కొత్త బ్రాంచిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
Source: జాతీయ | 24 Feb 2010 | 8:47 pm

నేడు భేటీకానున్న జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ

రాష్ట్ర అంశాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టీస్‌ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ మలి భేటీ గురువారం రోజున ఢిల్లీలో జరగనుంది.
Source: జాతీయ | 24 Feb 2010 | 8:31 pm

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సినీ కెరీర్‌పై మచ్చ..!?

మహేష్‌బాబు చిత్రం రోజులతరబడి వెనక్కుపోవడంపట్ల సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌తోపాటు కృష్ణ సన్నిహితులుకూడా నిరుత్సాహానికి గురయినట్లు తెలుస్తోంది. అతిథి తర్వాత మహేష్‌బాబు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో చేస్తున్న చిత్రం గూడ్స్‌బండిలా సాగుతోంది.దీంతో మహేష్‌బాబు కెరీర్‌పై మచ్చ ఏర్పడుతుందనీ, రకరకాల సమస్యల్లో మహేష్‌బాబు ఉన్నాడనే వార్తలు వస్తున్నాయని సోమవారం సాయంత్రం పద్మాలయలో కృష్ణను కలిసి పలువురు దృష్టికి తీసుకువచ్చారు. శింగనమల రమేష్‌బాబు అనే నిర్మాత సరిగ్గా చిత్రాన్ని తీయలేకపోవడంతోపాటు, దర్శకుడు చొరవకూడా సరిగ్గా లేదని విమర్శలు వస్తున్నాయి. కృష్ణ సన్నిహితులు మల్లికార్జునరావు మాత్రం ఈ విషయం వాస్తమని తెలియజేస్తూ... కొద్దిరోజులు ఓపికపట్టంది. అన్నీ సర్దుకుంటాయి. ఆ తర్వాత తానే ఓ అద్భుతమైనచిత్రాన్ని తీస్తానని వారికి హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Feb 2010 | 10:34 am

రైల్వే శాఖను మాకు కేటాయించండి: లగడపాటి

కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై విజయవాడ ఎంపీ, కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సరిపడా ప్రాజెక్టులు కేటాయించుకునేందుకు వీలుగా రైల్వే శాఖను రాష్ట్రానికి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ అధినేత్రి సోనియా గాంధీలను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్టు చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 24 Feb 2010 | 7:21 am

మమత బడ్జెట్‌పై రాష్ట్ర ప్రతిపక్షాల పెదవి విరుపు!

కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన 2010-11 వార్షిక బడ్జెట్‌పై రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నేతలు పెదవి విరిచారు. అధికార పార్టీ సభ్యులు మాత్రం చాలా బాగుందని మెచ్చుకున్నారు. అలాగే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కూడా బడ్జెట్‌ను స్వాగతించారు. తాము ఐదు వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపితే.. మూడో వంతు కేటాయింపులు జరిగినట్టు ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 24 Feb 2010 | 7:02 am

జస్టీస్ శ్రీకృష్ణ సహాయకారిగా రాజీవ్ శర్మ నియామకం!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సంప్రదింపులు జరిపేందుకు కేంద్రం హోం శాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీకి నోడల్ అధికారిగా రాజీవ్ శర్మ ఎంపికయ్యారు. ఈయనను శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వీకే.దుగ్గల్ తన హైదరాబాద్ పర్యటనలో ఎంపిక చేశారు.
Source: ఏపీ న్యూస్ | 24 Feb 2010 | 6:52 am

ఎందుకో ఆయన దృష్టి నాపై పడలేదు: ఇలియానా

తనకు ఫిక్షన్‌, సస్పెన్స్‌ తరహా కథలంటే చాలా ఇష్టమని గోవా భామ ఇలియానా చెబుతోంది. షూటింగ్‌ గ్యాప్‌లో హీరోయిన్లు ఫోన్లలోనూ, బాతాఖానీతో కాలక్షేపం చేస్తుంటారు. తాను మాత్రం చక్కగా పుస్తకాలు చదువుతానని చెబుతోంది. ముఖ్యంగా ఫిక్షన్‌, సస్పెన్స్‌ తరహా పుస్తకాలంటే చెవికోసుకుంటాననంటోంది. సినిమాల్లోకూడా వాటినే ఆసక్తిగా చూస్తానని అంటోంది. మరి రామ్‌గోపాల్ వర్మ చిత్రాల్లో నటిస్తే పోయేదికగదా.. అంటే.. ఆయన దృష్టి ఎందుకో తనపై పడలేదని అంటోంది. అయినా.. ఆయన చిత్రాల్లో ఎక్స్‌పోజింగ్‌ ఎక్కువగా ఉంటుందనీ, ప్రస్తుతం అంత ఎక్స్‌పోజింగ్‌ చేయలేనని స్పష్టంచేస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Feb 2010 | 6:01 am

27 నుంచి పార్లమెంట్‌కు నాలుగు రోజుల సెలవు!

హోలీ పండుగను పురస్కరించుకుని పార్లమెంట్‌కు నాలుగు రోజుల పాటు సెలవు దినాలుగా ప్రకటించారు. హోలీ పండుగను పురస్కరించుకుని ఈనెల 27వ తేదీ నుంచి మార్చి రెండో తేదీ వరకు సెలవులు ప్రకటించారు.
Source: జాతీయ | 24 Feb 2010 | 4:56 am

రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరిగింది: నాదేండ్ల

కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై రాష్ట్రంలో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా.. మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచేలా ఉందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ నాదేండ్ల మనోహర్ తెలిపారు. గతంతో పోలీస్తే ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరిగిందని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 24 Feb 2010 | 3:29 am

పుణె పేలుళ్ళు: 16 చేరుకున్న మృతుల సంఖ్య

పుణెలో ఫిబ్రవరి 13న జరిగిన బాంబు దాడుల్లో తీవ్రంగా గాయపడిన 21 సంవత్సరాల యువకుడు బుధవారం ఉదయం స్థానిక జహంగీర్ ఆసుపత్రిలో మృతి చెందాడు. దీంతో పేలుళ్ళ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరుకుంది
Source: జాతీయ | 24 Feb 2010 | 3:03 am

ఇండో-పాక్ చర్చల్లో మూడో దేశం జోక్యం లేదు: ఆంటోనీ

ఈనెల 25వ తేదీన జరిగే భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగే చర్చల్లో మూడో దేశం జోక్యాన్ని సహించబోమని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ స్పష్టం చేశారు. పాక్ చేసిన ఈ ప్రతిపాదనను ఆయన ఖండించారు.
Source: జాతీయ | 24 Feb 2010 | 2:10 am