మిశ్రమ ఫలితాల్లో బాంబే స్టాక్ మార్కెట్

బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులతో మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. దీంతో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 12 పాయింట్ల స్వల్ప నష్టంతో, 16,298 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం రెండు పాయింట్లు క్షీణించి, 4,867 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 24 Feb 2010 | 7:56 am

ఇండో-పాక్ చర్చల్లో మూడో దేశం జోక్యం లేదు: ఆంటోనీ

ఈనెల 25వ తేదీన జరిగే భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగే చర్చల్లో మూడో దేశం జోక్యాన్ని సహించబోమని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ స్పష్టం చేశారు. పాక్ చేసిన ఈ ప్రతిపాదనను ఆయన ఖండించారు.
Source: Yahoo! Telugu: News | 24 Feb 2010 | 7:40 am

రైల్వే బడ్జెట్-2010-11: రాష్ట్రానికి కేటాయించిన కొత్త రైళ్లు!

కేంద్రమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి అనేక కొత్త రైళ్ళను ప్రవేశపెట్టారు. ప్రతి యేడాది రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించిన మమతా బెనర్జీ ఈ దఫా మాత్రం కొంతమేరకు న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులోభాగంగానే, సికింద్రాబాద్‌లో వాటర్ బాటలింగ్ ప్లాంట్, క్రీడా అకాడెమీ, రైల్వే వేగన్స్ ఫ్యాక్టరీలను నెలకొల్పనున్నట్టు ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 24 Feb 2010 | 7:24 am

స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీల ర్యాలీ

బాంబే స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు స్వల్ప నష్టాల్లో ర్యాలీని కొనసాగిస్తున్నాయి. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి విదేశీ మార్కెట్ల ప్రభావంతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కేవలం 12 పాయింట్లు పతనమై, 16,274 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 12 పాయింట్ల స్వల్ప నష్టంతో 4,857 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 24 Feb 2010 | 7:11 am

రైల్వే బడ్జెట్-2010-11: ఆంధ్రప్రదేశ్‌కు సముచిత స్థానం!

రైల్వే బడ్జెట్-2010-11లో మన రాష్ట్రానికి కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ సముచిత స్థానం లభించినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటి నుంచో వేచిచూస్తున్న రైల్వేలేన్లతో పాటు కొన్ని కొత్త రైళ్ళను రాష్ట్రానికి కేటాయించిన మమత బెనర్జీ.. ప్రత్యేక ప్రాజెక్టుల్లోనూ సికింద్రాబాద్‌కు స్థానం కల్పించారు.
Source: Yahoo! Telugu: News | 24 Feb 2010 | 7:09 am

రైల్వే బడ్జెట్-2010-11: ఆంధ్రప్రదేశ్‌కు సముచిత స్థానం!

రైల్వే బడ్జెట్-2010-11లో మన రాష్ట్రానికి కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ సముచిత స్థానం లభించినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటి నుంచో వేచిచూస్తున్న రైల్వేలేన్లతో పాటు కొన్ని కొత్త రైళ్ళను రాష్ట్రానికి కేటాయించిన మమత బెనర్జీ.. ప్రత్యేక ప్రాజెక్టుల్లోనూ సికింద్రాబాద్‌కు స్థానం కల్పించారు.
Source: Yahoo! Telugu: News | 24 Feb 2010 | 7:08 am

అమెరికాలో మరిన్ని దాడులు: హెచ్చరించిన అల్‌ఖైదా

అరబ్‌లోనున్న అల్‌ఖైదాకు చెందిన కమాండర్ ఖాసిం అల్ రైమీ ఉగ్రవాదలు కోసం ప్రత్యేకంగా ఒక ఆన్‌లైన్ పత్రిక ద్వారా అమెరికావాసులు హెచ్చరికలు జారీ చేశాడు. అల్‌ఖైదా రానున్న రోజుల్లో మరిన్ని దాడులకు చేసేందుకు సిద్ధంగానున్నట్లు ఆన్‌‌లైన్ పత్రిక ద్వారా తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 24 Feb 2010 | 7:04 am

స్లీపర్ క్లాస్ ప్రయాణికులపై కరుణ చూపిన మమతా!

2010-11 రైల్వే బడ్జెట్‌లో సాధారణ ప్రయాణికులపై భారం మోపక పోయినప్పటికీ.. రైలు ఛార్జీలు మాత్రం తగ్గించేందుకు రైల్వే మంత్రి మమతా బెనర్జీ అంగీకరించలేదు. అయితే, స్లీపర్ క్లాస్ రైల్వే రిజర్వేషన్‌కు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలో పది రూపాయలు తగ్గించారు. అలాగే ఎసీ క్లాస్ రిజర్వేషన్ సర్వీస్ ఛార్జీలను కూడా 20 రూపాయలు తగ్గిస్తూ.. మమతా బెనర్జీ ఈ సంవత్సరపు రైల్వే బడ్జెట్‌ను లోక్‌సభలో బుధవారం ప్రవేశపెట్టారు.
Source: Yahoo! Telugu: News | 24 Feb 2010 | 6:47 am

రైల్వే బడ్జెట్: రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు ఇవే!

కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రంలో పలు కొత్త రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించారు. 2009-10 బడ్జెట్‌ కంటే 2010-11 బడ్జెట్‌లో మంత్రి కొత్త రైల్వే లైన్లను ప్రతిపాదించడం గమనార్హం.
Source: Yahoo! Telugu: News | 24 Feb 2010 | 6:28 am

తగ్గిన మొబైల్‌ఫోన్ల అమ్మకాలు

ఐటీ అనుసంధానమైన గార్టనర్ సంస్థ నిర్వహించిన సర్వే నివేదకననుసరించి 2008లో జరిగిన మొబైల్ ఫోన్ల అమ్మకాలతో పోలిస్తే నిరుడు జరిగిన అమ్మకాలలో 0.9 శాతం తగ్గుదల నమోదు చేసుకుని 1.21 వందల కోట్ల మొబైల్ ఫోన్లు అమ్ముడైనట్లు ఆ సంస్థకు చెందిన పరిశోధక డైరెక్టర్ కైరోలినా మిలానేసీ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 24 Feb 2010 | 6:26 am

ఎందుకో ఆయన దృష్టి నాపై పడలేదు: ఇలియానా

తనకు ఫిక్షన్‌, సస్పెన్స్‌ తరహా కథలంటే చాలా ఇష్టమని గోవా భామ ఇలియానా చెబుతోంది. షూటింగ్‌ గ్యాప్‌లో హీరోయిన్లు ఫోన్లలోనూ, బాతాఖానీతో కాలక్షేపం చేస్తుంటారు. తాను మాత్రం చక్కగా పుస్తకాలు చదువుతానని చెబుతోంది. ముఖ్యంగా ఫిక్షన్‌, సస్పెన్స్‌ తరహా పుస్తకాలంటే చెవికోసుకుంటాననంటోంది. సినిమాల్లోకూడా వాటినే ఆసక్తిగా చూస్తానని అంటోంది. మరి రామ్‌గోపాల్ వర్మ చిత్రాల్లో నటిస్తే పోయేదికగదా.. అంటే.. ఆయన దృష్టి ఎందుకో తనపై పడలేదని అంటోంది. అయినా.. ఆయన చిత్రాల్లో ఎక్స్‌పోజింగ్‌ ఎక్కువగా ఉంటుందనీ, ప్రస్తుతం అంత ఎక్స్‌పోజింగ్‌ చేయలేనని స్పష్టంచేస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Feb 2010 | 6:01 am

ఇండో-పాక్ చర్చల్లో మూడో దేశం జోక్యం లేదు: ఆంటోనీ

ఈనెల 25వ తేదీన జరిగే భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగే చర్చల్లో మూడో దేశం జోక్యాన్ని సహించబోమని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ స్పష్టం చేశారు. పాక్ చేసిన ఈ ప్రతిపాదనను ఆయన ఖండించారు.
Source: జాతీయ | 24 Feb 2010 | 2:10 am

రైల్వే బడ్జెట్: రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు ఇవే!

కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రంలో పలు కొత్త రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించారు. 2009-10 బడ్జెట్‌ కంటే 2010-11 బడ్జెట్‌లో మంత్రి కొత్త రైల్వే లైన్లను ప్రతిపాదించడం గమనార్హం.
Source: ఏపీ న్యూస్ | 24 Feb 2010 | 1:03 am

మీరు ఆరగించారుగా.. ఇక వదిలెయ్: సీఎం రోశయ్య

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు, ముఖ్యమంత్రి రోశయ్యల మధ్య ఆసక్తికరమైన చర్చ బుధవారం జరిగింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇంతవరకు జరగలేదని గౌరవ సభ్యుడు నర్సింహులు సభ దృష్టికి తెచ్చారు. వెంటనే ముఖ్యమంత్రి రోశయ్య కలుగజేసుకుని కాస్త కఠువుగా మాట్లాడారు. గౌరవ సభ్యుడు నర్సింహులు గారు భోజనం ఆరగించారు కదా, మిగిలిన వారి సంగతి మీకెందుకో అని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 23 Feb 2010 | 11:47 pm

కేసీఆర్‌ రాజీనామా చేయలేదెందుకు చెప్మా

ప్రత్యేక తెలంగాణ కోరుతూ తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ) పిలుపు మేరకు అందరితో రాజీనామాలు చేయించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కేసీఆర్‌ ఇప్పటివరకూ ఎందుకు రాజీనామా చేయలేదని కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శంకరరావు బుధవారం ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 23 Feb 2010 | 11:06 pm

సోపోర్‌లో ముగిసిన ఎన్‌కౌంటర్: 5గురు తీవ్రవాదుల మృతి

ఉత్తర కాశ్మీర్‌లోనున్న సోపోర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య దాదాపు 18 గంటలపాటు జరిగిన ఎదురు కాల్పులు ఎట్టకేలకు నిలిచిపోయాయి. ఇరువైపుల జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ సైనికాధికారితోపాటు ఇద్దరు జవాన్లు మృతి చెందారు. పాక్ ప్రాంతంవైపు నుంచి ఉగ్రవాదులు జరుపుతున్న కాల్పుల్లో ఐదుగురు తీవ్రవాదులు మృతిచెందారు.
Source: జాతీయ | 23 Feb 2010 | 10:19 pm

వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్

రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు బుధవారంనాడు ప్రారంభం కాగానే వివిధ అంశాలపై ప్రతిపక్ష సభ్యులు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టడంతో వాటిని శాసనసభాపతి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరస్కరించారు. దీంతో సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చ జరగాల్సిందేనని పట్టుపడుతూ నిరసన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 23 Feb 2010 | 10:02 pm

మరికాసేపట్లో రానున్న మమత "రైలు" బడ్జెట్

యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మమత దీదీ సమర్పిస్తున్న రైల్వే బడ్జెట్ ఇది రెండోసారి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడిచే పీస్ ఎక్స్‌ప్రెస్, ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను కలుపుతూ వెళ్లే సంస్కృతి ఎక్స్‌ప్రెస్‌లు ఈసారి హైలెట్‌గా నిలిచే అవకాశముందని రైల్వే వర్గాలు తెలిపాయి
Source: జాతీయ | 23 Feb 2010 | 9:09 pm

మార్కెట్లోకి రానున్న ఫైబర్ సిలిండర్లు

ప్రస్తుతమున్న ఇనుప వంటగ్యాస్ సిలిండర్లో ఎంత గ్యాస్ ఉంటుందో కనుక్కోవడం చాలా కష్టతరమౌతోంది. దీంతో ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వం ఫైబర్ సిలిండర్లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు అనుమతినిచ్చిందని కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి మురళీ దేవరా మంగళవారం రాజ్యసభకు తెలిపారు
Source: జాతీయ | 23 Feb 2010 | 8:20 pm

టాలీవుడ్‌ స్టార్స్ మధ్య నాట్యం చేస్తున్న "మాఫియా"

గత కొన్నేళ్ళుగా ఇండిస్ట్రీలో మాఫియా ఉందని వార్తలు వస్తున్నా.. అవేవీ లేవని.. సినీ పెద్దలు కొట్టిపారేస్తూ వచ్చారు. బాలకృష్ణ ఇంటివద్ద బెల్లంకొండ సురేష్‌‌పై హత్యాయత్నం, ఆ తర్వాత కొంతమంది ఫైనాన్సియర్లు నిర్మాతల్ని బెదిరించడం వంటి సంఘటనలు చాలా చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత పబ్‌ కల్చర్‌ ఎక్కువై... సినీ నటీమణులు పబ్‌ల్లో కాలక్షేపం చేయడం ఎక్కువైంది. ముమైత్‌ఖాన్‌, ఆర్తీ అగర్వాల్‌తోపాటు తరుణ్‌, రవితేజ సోదరుడు రఘు వంటివారెందరో ఈ పబ్‌లకు హాజరయ్యేవారు. లేటెస్ట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ ప్రకారం ఈ పబ్‌లే డ్రగ్‌ మాఫియా కేంద్రాలుగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. సినీ నటుడు తరుణ్‌ మరొకరితో కలిసి అన్నపూర్ణ స్టూడియో పక్కనే ఓ పబ్‌ను నిర్వహిస్తున్నారు. ఖరీదైన మందులతోపాటు ఆటపాటకు సెపరేట్‌ రూమ్స్‌కూడా ఉన్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Feb 2010 | 12:44 pm

చిన్నప్పుడే ముద్దు రుచి చూశా: ప్రియాంకా చోప్రా

"నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడే సడన్‌గా ఓ అబ్బాయి నా వద్దకు వచ్చి ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాడు. నాకు షాక్. అతనివైపు అలా చూస్తుండిపోయా. ఇదే సీన్ ఆ మధ్య ఓ చిత్రంలో దర్శకుడు చెపితే... ఒక్కసారి గతం గుర్తుకువచ్చింది. నాకు సుస్మితాసేన్ అంటే ఆరాధన. ఆమె విశ్వసుందరి కిరీటాన్ని ధరించడం టీవీల్లో చూశాను. ఎప్పటికైనా ఆ స్థాయికి చేరకపోతానా అనిపించింది. అప్పుడే అందంపై ఆరాధన పెరిగింద"ని అదే తనను ఇంతటి స్థాయికి తెచ్చిందని తన అనుభవాలను చెపుతోంది ప్రియాంకా చోప్రా.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Feb 2010 | 8:19 am

బెంగళూరులో అగ్నిప్రమాదం: 9మంది మృతి

బెంగళూరు ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డులో 12 అంతస్థుల కార్టెల్ భవనం అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 9మంది వ్యక్తులు మృతి చెందినట్లుగా, 60 మంది తీవ్ర గాయాలు పాలైనట్లు ప్రాథమిక సమాచారం.
Source: జాతీయ | 23 Feb 2010 | 7:24 am

నాగ్.. నన్ను సెక్సీ అని కూడా పిలుస్తారు: మమతా

నాగార్జునకు మమతా మోహన్ దాస్ అంటే చాలా ఇష్టం. "కింగ్"లో నాగ్ సోదరుని భార్యగా నటించింది. ఆమె నటించిన తీరు నాగ్‌ను ఆకట్టుకుంది. దాంతో ఆమెకు ఎలాగైనా తర్వాత చిత్రంలో ఆఫర్ ఇవ్వాలని "కేడి" చిత్రంలో ఇచ్చారు. తనకు నచ్చిన నాయిక మమతా మోహన్ దాస్ అని కూడా చెప్పారు. ఇదే విషయాన్ని మమత ముందు ప్రస్తావిస్తే... "ఈ విషయాన్ని నాగ్ నాతోనూ చెప్పారు. ఆయన అంతటితో ఆగరు. బ్యూటీ, సెక్సీ అని పిలుస్తారు. నటన, గానంతోపాటు నీలో ఎన్నో నైపుణ్యాలున్నాయని కూడా మెచ్చుకుంటారు. ఇంకా కష్టపడితే పైకొస్తావ్ అని కూడా చెపుతుంటారు. నిజంగా నాగ్ ఈజ్ గ్రేట్. ఆయనతో ఎన్ని చిత్రాలు చేయడానికైనా నేను రెడీ" అంటూ గలగలా నవ్వుతూ చెప్పింది మమత.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Feb 2010 | 5:59 am

విద్యార్థులు! సంయమనం పాటించండి: రోశయ్య

రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనల గురించి శాసనసభలో ముఖ్యమంత్రి రోశయ్య ప్రస్తావించారు. ఇందులో భాగంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని ఆయన మంగళవారం శాసనసభలో విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకుంటున్న తీరుపై ముఖ్యమంత్రి రోశయ్య తీవ్రంగా్ స్పందించారు. తెలంగాణ అంశంపై కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోందని, అలాగే రాష్ట్ర వ్యవహారాలను జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చూసుకుంటుందని ఆయన అన్నారు
Source: ఏపీ న్యూస్ | 23 Feb 2010 | 4:57 am

సీమాంధ్ర ఉత్పత్తులను కొనకండి: తెలంగాణా ఐకాస

కోదండరామ్ హైదరాబాద్‌‌లో మాట్లాడుతూ తెలంగాణేతరుల వ్యాపార సంస్థలపై తాము దాడులకు పాల్పడతామని వస్తున్న వార్తల్లో నిజం లేదని, కాని వారి ఉత్పత్తులను కొనకూడదని మాత్రం తాము ప్రచారం చేస్తామన్నారు. గాంధీ చెప్పిన సూత్రాలను తాము పాటిస్తామని, ఆయన చూపిన దారిలోనే నడుస్తామని ఆయన అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 23 Feb 2010 | 3:03 am

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా సుష్మా

భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలి హోదాను మంగళవారం లాంఛనంగా పొందారు. గతంలో భాజపా సీనియర్ నేత ఎల్‌ కె అద్వానీ ప్రతిపక్ష నాయకునిగా ఉన్న విషయం విదితమే.
Source: జాతీయ | 23 Feb 2010 | 2:46 am

చార్జీలు వడ్డన లేని రైలు బడ్జెట్..?!!

పేదలపక్షం నిలుస్తామని చెప్పే రైల్వేమంత్రి మమతా బెనర్జీ తను ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్లో ప్రయాణికులపై భారం మోపే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఒకవేళ ప్రయాణికుల రైలు చార్జీలు పెంచాల్సిన అగత్యం ఏర్పడితే, ప్రత్యేకించి ఎంపిక చేసిన క్లాసులపైనే భారం మోపాలన్న యోచనలో మంత్రి ఉన్నట్లు తెలుస్తోంది.
Source: జాతీయ | 23 Feb 2010 | 2:39 am

ధరల పెరుగుదలపై చర్చించేందుకు సిద్ధం: ప్రధాని

లోక్‌‍సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో ప్రతిపక్షాలు ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని, ముఖ్యంగా ధరలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.
Source: జాతీయ | 23 Feb 2010 | 1:34 am