భారీ లాభాల దిశగా బాంబే స్టాక్ మార్కెట్

సోమవారం బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాల దిశగా పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఆశాజనకంగా కొనసాగుతోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 177 పాయింట్లు పుంజుకుని 16,369 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 47 పాయింట్లు బలపడి, 4,892 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 22 Feb 2010 | 7:14 am

ఏవీఎస్ దర్శకత్వంలో కృష్ణుడి "కోతీమూక"

హాస్య నటుడు ఏవీఎస్ దర్శకత్వం వహిస్తున్న నాల్గవ చిత్రం కోతిమూక. తులసి పూజిత ఫిలిమ్స్ పతాకంపై వెంకట్ జగదీష్. కె మోహన్ కుమార్ నిర్మిస్తున్నారు. సోమవారం అన్నపూర్ణా స్టూడియోస్‌లో ప్రారంభమైంది. హీరో కృష్ణుడు, హీరోయిన్ శ్రద్ధ ఆర్యపై ముహూర్తపు షాట్ తీశారు. రామానాయుడు క్లాప్ కొట్టగా, సి. కల్యాణ్ కెమేరా స్విచాన్ చేశారు. మురళీ మోహన్ దర్శకత్వం వహించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Feb 2010 | 6:58 am

రూ. ఐదు వేలకే టచ్ స్క్రీన్ మొబైల్: ఎల్జీ

ఎలక్ట్రానిక్ పరికరాల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న ఎల్‌జీ సంస్థ ప్రస్తుత సంవత్సరం చివరి నాటికి టచ్ స్క్రీన్ మొబైల్ అమ్మకాలలో 20 శాతం వృద్ధి సాధించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు ఎల్‌జీ సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా నూతనంగా కేవలం రూ. 5 వేలకే టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.
Source: Yahoo! Telugu: News | 22 Feb 2010 | 6:49 am

మురికి వాడలు లేని దేశంగా భారత్: ప్రతిభా పాటిల్

మురికి వాడలు లేని దేశంగా భారత్‌ను తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రకటించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆమె సోమవారం ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం "ఆమ్ ఆద్మీ" సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అభివృద్ధి ఫలాలు కిందిస్థాయి ప్రజానీకానికి చేరేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
Source: Yahoo! Telugu: News | 22 Feb 2010 | 6:39 am

పుంజుకున్న కొనుగోళ్లు: లాభాల్లో సెన్సెక్స్

మెటల్, బ్యాంక్, ఐటీ, ఆయిల్, గ్యాస్, సీజీ, పీఎస్‌యూ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల్లో పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాల్లో ర్యాలీని కొనసాగిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 148 పాయింట్లు పుంజుకుని, 16,340 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 45 పాయింట్లు వృద్ధి చెంది, 4,890 పాయింట్లు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 22 Feb 2010 | 6:34 am

రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావనకు రాని తెలంగాణ!

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సోమవారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తెలంగాణ అంశం ప్రస్తావనకు రాలేదు. దీంతో తెలంగాణ ప్రాంత ఎంపీలు పార్లమెంట్ వెలుపల తమ నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఫ్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం అత్మార్పణ చేసుకున్న విద్యార్థి యాదవయ్యకు నివాళులు అర్పించారు.
Source: Yahoo! Telugu: News | 22 Feb 2010 | 6:31 am

నమిత చాలా చాలా చాలా హాట్ గురూ..!!

సెక్సీ బాంబ్ నమిత బాలీవుడ్ నటి కత్రినాకైఫ్‌కు ఫుల్ కాంపిటీషన్ ఇస్తోంది. ఈ ఏడాది మొట్టమొదటిసారిగా గూగుల్ శోధనలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని ఎందరో ఇండియన్ హాటెస్ట్ బ్యూటీలను మట్టి గరిపించింది. టాప్ సెర్చర్స్‌లో నమిత అగ్రస్థానంలో ఉన్నట్లు గూగుల్ ప్రకటించింది. దక్షిణాది తారలలో అంతకుముందు నయనతార ముందడుగులో ఉండేది. కానీ నయనను బీట్ చేస్తూ నమిత ఆ స్థానాన్ని ఆక్రమించేసింది. నమిత తర్వాత త్రిష, శ్రేయ, మమతా మోహన్ దాస్ హాటెస్ట్ లిస్ట్‌లో ఉన్నట్లు గూగుల్ సెర్చ్‌లో వెల్లడైంది. టాప్ టెన్ సెర్చ్ లిస్ట్‌లో నమితతో పాటు కత్రినాకైఫ్ మాత్రమే భారతదేశం నుంచి ఉన్నారంటే ఈ తారల పట్ల ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. నమిత హోమ్లీ క్యారెక్టర్స్ చేసినంతకాలం అంతగా పేరు రాలేదు. చివరికి హాట్ అవతారం ఎత్తిన తర్వాత ఆమెను టీనేజ్ కుర్రకారు ఆకాశానికి ఎత్తేశారు. ఏదైనా కొత్త స్టిల్స్ వస్తే చాలు నమిత అందాలను ఆస్వాదించేందుకు నెట్ ప్రియులు ఎగబడుతున్నట్లు గూగుల్ శోధన ఫలితాల ద్వారా వెల్లడవుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Feb 2010 | 6:05 am

కోడ్-షేర్ అంశంపై బిఎతో సంప్రదింపులు: కేఎఫ్

తమ సంస్థకు చెందిన వ్యాపార కార్యకలాపాలను మరింతగా విస్తరించుకునేందుకుగాను తాము బ్రిటిష్ ఎయిర్‌వేస్ సంస్థతో చర్చలు జరుపుతున్నామని, ఇందులో భాగంగా తమ సంస్థకు చెందిన విమానాలలో ప్రయాణీకలను బుక్ చేసే విషయంగా సంప్రదింపులు జరిపినట్లు కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ అధిపతి విజయ్ మాల్యా ముంబైలో సోమవారం వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 22 Feb 2010 | 5:33 am

వచ్చే యేడాది 20 వేల ఉద్యోగాల భర్తీ: ఎస్బీఐ

వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2010-11)లో కొత్తగా 20 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు ప్రకటించింది. వివిధ గ్రూపుల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆ బ్యాంకు ప్రతినిధులు ముంబైలో తాజాగా ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 22 Feb 2010 | 5:17 am

తీవ్రవాదం-ధరల పెరుగుదల పెను సవాల్: రాష్ట్రపతి

సరిహద్దు తీవ్రవాదం, నిత్యావసర వస్తు ధరల పెరుగుదలే ప్రస్తుతం మన అందరి ముందున్న పెనుసవాల్ అని రాష్ట్రపతి ప్రతిభా దేవీసింగ్ పాటిల్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవ సందర్భంగా ఆమె సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
Source: Yahoo! Telugu: News | 22 Feb 2010 | 5:15 am

26/11 కేసు: మరోమారు వాయిదా పడిన పాక్ కోర్టు

ముంబై దాడుల కేసు విచారణ పాకిస్థాన్ కోర్టు మరోమారు వాయిదా వేసింది. 26/11 దాడుల కేసును విచారించేందుకు రావల్పిండిలో తీవ్రవాద వ్యతిరేక కోర్టును పాక్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, ఈ కేసు విచారణ సోమవారం జరగాల్సి ఉండగా, స్థానిక బార్ కౌన్సిల్ ఎన్నికల కారణంగా ఈ కేసు విచారణకు నోచుకోలేదు. దీంతో కేసు తదుపరి విచారణను మార్చి ఆరో తేదీకి కోర్టు వాయిదా వేసింది.
Source: Yahoo! Telugu: News | 22 Feb 2010 | 5:12 am

భారీ లాభాల్లో బాంబే స్టాక్ మార్కెట్

సోమవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి విదేశీ మార్కెట్ల ప్రభావంతో ఊపందుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో 204 పాయింట్లు వృద్ధి చెంది, 16,395 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 57 పాయింట్లు పతనమై, 4,902 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 22 Feb 2010 | 4:51 am

మురికి వాడలు లేని దేశంగా భారత్: ప్రతిభా పాటిల్

మురికి వాడలు లేని దేశంగా భారత్‌ను తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రకటించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆమె సోమవారం ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం "ఆమ్ ఆద్మీ" సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అభివృద్ధి ఫలాలు కిందిస్థాయి ప్రజానీకానికి చేరేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
Source: జాతీయ | 22 Feb 2010 | 1:10 am

రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావనకు రాని తెలంగాణ!

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సోమవారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తెలంగాణ అంశం ప్రస్తావనకు రాలేదు. దీంతో తెలంగాణ ప్రాంత ఎంపీలు పార్లమెంట్ వెలుపల తమ నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఫ్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం అత్మార్పణ చేసుకున్న విద్యార్థి యాదవయ్యకు నివాళులు అర్పించారు.
Source: ఏపీ న్యూస్ | 22 Feb 2010 | 1:02 am

తీవ్రవాదం-ధరల పెరుగుదల పెను సవాల్: రాష్ట్రపతి

సరిహద్దు తీవ్రవాదం, నిత్యావసర వస్తు ధరల పెరుగుదలే ప్రస్తుతం మన అందరి ముందున్న పెనుసవాల్ అని రాష్ట్రపతి ప్రతిభా దేవీసింగ్ పాటిల్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవ సందర్భంగా ఆమె సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
Source: జాతీయ | 21 Feb 2010 | 11:45 pm

రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం!

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ఉభయ సభలు సమావేశం కాగా, ఈ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు.
Source: జాతీయ | 21 Feb 2010 | 10:59 pm

నాకు.. మ్యాచ్‌లు ఆడేంత సీన్ లేదు: సీఎం రోశయ్య!

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో మ్యాచ్‌లు ఆడేంత సీన్ నాకు లేదని ముఖ్యమంత్రి కె.రోశయ్య అభిప్రాయపడ్డారు. అలాగే, ఎవరితోనూ మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడలేనన్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Feb 2010 | 10:58 pm

పరిపాలనకు చిన్న రాష్ట్రాలు ఓకే: మోహన్ భగవత్

పరిపాలనా సౌలభ్యం కొరకు చిన్న రాష్ట్రాల ఏర్పాటును రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వాగతిస్తుందని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. అయితే, ఒకే భాష మాట్లాడేవారిని రెండుగా విభజేందుకు తాము వ్యతిరేకిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పరోక్షంగా ఆయన ప్రస్తావించారు.
Source: జాతీయ | 21 Feb 2010 | 10:36 pm

రోశయ్య-చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్: టీజీవన్ రెడ్డి!

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి కె.రోశయ్య, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులు మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి ఆరోపించారు. వీరిద్దరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియకు అడ్డుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు
Source: ఏపీ న్యూస్ | 21 Feb 2010 | 10:36 pm

ఎన్‌డీఏ రథసారథిగా ఎన్నికైన అద్వానీ

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) రథసారథిగా భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్‌ కృష్ణ అద్వానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనతాదళ్(యూ) నేత శరద్‌ యాదవ్‌ పూర్తిస్థాయి కన్వీనరుగా ఎంపికయ్యారు.
Source: జాతీయ | 21 Feb 2010 | 8:37 pm

ఉస్మానియా వర్శిటీలో నక్సలైట్లు లేరు: తిరుమలరావు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మావోయిస్టులు ఎవరూ లేరని ఉపకులపతి తిరుపతి రావు స్పష్టం చేశారు. దీనిపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తన అనుమతి లేనిదే పోలీసులు క్యాంపస్‌లో అడుగుపెట్టడానికి వీలులేదన్నారు. ఓయూ క్యాంపస్‌లో శాంతి నెలకొల్పడానికి శాయశక్తుల మేరకు కృషి చేస్తానని వీసీ హామీ ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 21 Feb 2010 | 5:35 am

విద్యార్ధులెవరూ ప్రాణత్యాగాలు చేసుకోవద్దు: డీఎస్

తెలంగాణ కోసం విద్యార్ధులెవరూ ప్రాణత్యాగాలు చేయవద్దని పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ యాదయ్య మృతికి సంతాపం తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. యాదయ్య యువకుడు, ఎంతో భవిష్యత్ ఉన్నవాడు ఇలా ఆత్మాహుతి చేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచైనా విద్యార్ధులే కాదు, తెలంగాణవాదులు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 21 Feb 2010 | 5:34 am

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బడ్జెట్: సీఎం

తాను ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రవేశపెట్టినట్టు ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. ఇది బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యమైనదిగా ఉందని పేర్కొన్నారు. ఆదివారం విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన అచ్యుతాపురంలో స్థానిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Feb 2010 | 5:34 am

యూపీఏ ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తాం: మమతా

కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును కొనసాగిస్తామని కేంద్ర రైల్వే శాఖామంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. దీనిపై ఆమె ఆదివారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. యూపీఏలోని భాగస్వామ్య పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు.
Source: జాతీయ | 21 Feb 2010 | 4:03 am

ఆయుధాలు కలిగిన 12 మంది సిక్కుల అరెస్టు

పంజాబ్ రాష్ట్రంలో మారణాయుధాలు కలిగిన 12 మంది సిక్కులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి తుపాకీలతో పాటు జెలిటన్ స్టిక్‌లను, ప్రేలుడ పదార్థాలు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పాక్ ప్రేరేపిత సిక్కు తీవ్రవాదులుగా వీరిని పోలీసులు భావిస్తున్నారు.
Source: జాతీయ | 21 Feb 2010 | 2:45 am

తెలంగాణ ఉద్యమం: ఓయూ పరీక్షలు వాయిదా

కేంద్రప్రభుత్వం త్వరలోనే తెలంగాణను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. ఉస్మానియా యూనివర్శిటీలో జరుగుతోన్న ఉద్యమంతో ఓయూ పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా.. ఉస్మానియా వర్శిటీలో నెలకొన్న పరిస్థితులతో సోమ, మంగళవారం నిర్వహించనున్న పరీక్షలను వాయిదా వేశారు.
Source: ఏపీ న్యూస్ | 21 Feb 2010 | 2:23 am