సంవత్సరాంతంలో భారత్‌కు రానున్న బరాక్ ఒబామా

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ యేడాది ఆఖరులో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి రాబర్ట్ బ్లేక్ వెల్లడించారు. దక్షిణ, మధ్య ఆసియా దేశాల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న రాబర్ట్ బ్లేక్ తమ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటనపై స్పందిస్తూ.. ఒబామా పాలనా యంత్రాంగంలో భారత్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 21 Feb 2010 | 8:25 am

ఆయుధాలు కలిగిన 12 మంది సిక్కుల అరెస్టు

పంజాబ్ రాష్ట్రంలో మారణాయుధాలు కలిగిన 12 మంది సిక్కులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి తుపాకీలతో పాటు జెలిటన్ స్టిక్‌లను, ప్రేలుడ పదార్థాలు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పాక్ ప్రేరేపిత సిక్కు తీవ్రవాదులుగా వీరిని పోలీసులు భావిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 21 Feb 2010 | 8:09 am

తెలంగాణ ఉద్యమం: ఓయూ పరీక్షలు వాయిదా

కేంద్రప్రభుత్వం త్వరలోనే తెలంగాణను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. ఉస్మానియా యూనివర్శిటీలో జరుగుతోన్న ఉద్యమంతో ఓయూ పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా.. ఉస్మానియా వర్శిటీలో నెలకొన్న పరిస్థితులతో సోమ, మంగళవారం నిర్వహించనున్న పరీక్షలను వాయిదా వేశారు.
Source: Yahoo! Telugu: News | 21 Feb 2010 | 7:53 am

నవ్వుల రేడు ఇక లేడు: అంత్యక్రియలు నేడు!

తుదిశ్వాస విడిచిన నవ్వుల రారాజు పద్మనాభం అంత్యక్రియలు ఆదివారం చెన్నయ్‌లో జరుగనున్నాయి. 400పైగా చిత్రాల్లో నటించి... అయిదు చిత్రాలు నిర్మించి... రెండు సినిమాలకు దర్శకత్వం వహించి... చివరి నిమిషం దాకా ఉల్లాసంగా గడిపిన ఆయన శనివారం చెన్నయ్‌లో కన్నుమూసిన విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 21 Feb 2010 | 6:43 am

కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు: ఆర్.దామోదర్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని స్థాపించే యోచన ఏదీ తనకు లేదని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేసిన ఉన్న ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తన వెంట ఉంటే తెలంగాణ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ పెట్టనున్నట్టు ఆదివారం కొన్ని దినపత్రికల్లో వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు.
Source: Yahoo! Telugu: News | 21 Feb 2010 | 6:34 am

ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తాం: పవార్!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నిత్యావసర వస్తు ధరలపై ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇస్తామని కేంద్ర ఆహార శాఖామంత్రి శరద్ పవార్ తెలిపారు. నిత్యావసర వస్తు ధరల పెరుగుదలకు శరద్ పవారే కారణమని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 21 Feb 2010 | 6:19 am

చోరీ చేసిన ఐదుగురి దోషుల చేతులు నరికివేత!

ఒక చోరీ కేసులో దోషులుగా తేలిన ఐదుగురికి చేతులు నరికి వేశారు. ఈ శిక్షను పాకిస్థాన్‌లో అమలు చేశారు. ఉత్తర పాకిస్థాన్‌లోని ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిపై పాక్ నుంచి వెలువడే "డైలీ టైమ్స్" పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది. వీరంతా ఒక చిన్నపాటీ చోరీ కేసులో పాలుపంచుకున్నట్టు స్థానికులు ఆరోపించారు. దీంతో తాలిబాన్ తీవ్రవాదులు అరెస్టు చేసి, వారి సొంత కోర్టులో కేసు విచారణ జరిపారు.
Source: Yahoo! Telugu: News | 21 Feb 2010 | 5:56 am

2015 నాటికి లక్ష కార్ల విక్రయం: మహీంద్రా

వచ్చే 2015 సంవత్సరం నాటికి ఒక్కో యేడాదికి లక్ష కార్లను విక్రయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ప్రకటించింది. గత యేడాది 14 లక్షల ద్వితీయ తరగతి కార్లను విక్రయించినట్టు ఆ సంస్థ తాజాగా వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 21 Feb 2010 | 5:37 am

పూణేలో పేలుళ్లు: 14కు పెరిగిన మృతుల సంఖ్య!

మహారాష్ట్రలోని పూణే నగరంలో ఇటీవల జరిగిన బాంబు పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఆదివారానికి 14కు చేరుకుంది. ఈనెల 13వ తేదీన పూణేలోని నిత్యం రద్దీగా ఉండే జర్మనీ బేకరీ వద్ద ఈ పేలుడు సంభవించిన విషయం తెల్సిందే. పేలుళ్ళ రోజున సంఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోగా, మరో 51 మంది గాయపడిన విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 21 Feb 2010 | 5:28 am

ఓటమిని అంగీకరించిన ఉక్రెయిన్ మాజీ ప్రధాని

ఉక్రెయిన్ ప్రధాని ఎన్నికల్లో తాను ఓటమిని అంగీకరిస్తున్నట్టు మాజీ ప్రధాని యూనియా తైమొషెంకో ప్రకటించారు. తన ప్రత్యర్థి యనుకోవిచ్ గెలుపును సవాల్ చేస్తూ కోర్టులో దాఖలైన పిటీషన్‌ను కూడా విరమించుకున్నట్టు ఆయన శనివారం తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 21 Feb 2010 | 4:35 am

ఆయుధాలు కలిగిన 12 మంది సిక్కుల అరెస్టు

పంజాబ్ రాష్ట్రంలో మారణాయుధాలు కలిగిన 12 మంది సిక్కులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి తుపాకీలతో పాటు జెలిటన్ స్టిక్‌లను, ప్రేలుడ పదార్థాలు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పాక్ ప్రేరేపిత సిక్కు తీవ్రవాదులుగా వీరిని పోలీసులు భావిస్తున్నారు.
Source: జాతీయ | 21 Feb 2010 | 2:45 am

తెలంగాణ ఉద్యమం: ఓయూ పరీక్షలు వాయిదా

కేంద్రప్రభుత్వం త్వరలోనే తెలంగాణను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. ఉస్మానియా యూనివర్శిటీలో జరుగుతోన్న ఉద్యమంతో ఓయూ పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా.. ఉస్మానియా వర్శిటీలో నెలకొన్న పరిస్థితులతో సోమ, మంగళవారం నిర్వహించనున్న పరీక్షలను వాయిదా వేశారు.
Source: ఏపీ న్యూస్ | 21 Feb 2010 | 2:23 am

నవ్వుల రేడు ఇక లేడు: అంత్యక్రియలు నేడు!

తుదిశ్వాస విడిచిన నవ్వుల రారాజు పద్మనాభం అంత్యక్రియలు ఆదివారం చెన్నయ్‌లో జరుగనున్నాయి. 400పైగా చిత్రాల్లో నటించి... అయిదు చిత్రాలు నిర్మించి... రెండు సినిమాలకు దర్శకత్వం వహించి... చివరి నిమిషం దాకా ఉల్లాసంగా గడిపిన ఆయన శనివారం చెన్నయ్‌లో కన్నుమూసిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 21 Feb 2010 | 1:13 am

కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు: ఆర్.దామోదర్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని స్థాపించే యోచన ఏదీ తనకు లేదని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేసిన ఉన్న ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తన వెంట ఉంటే తెలంగాణ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ పెట్టనున్నట్టు ఆదివారం కొన్ని దినపత్రికల్లో వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Feb 2010 | 1:05 am

ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తాం: పవార్!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నిత్యావసర వస్తు ధరలపై ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇస్తామని కేంద్ర ఆహార శాఖామంత్రి శరద్ పవార్ తెలిపారు. నిత్యావసర వస్తు ధరల పెరుగుదలకు శరద్ పవారే కారణమని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే.
Source: జాతీయ | 21 Feb 2010 | 12:49 am

పూణేలో పేలుళ్లు: 14కు పెరిగిన మృతుల సంఖ్య!

మహారాష్ట్రలోని పూణే నగరంలో ఇటీవల జరిగిన బాంబు పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఆదివారానికి 14కు చేరుకుంది. ఈనెల 13వ తేదీన పూణేలోని నిత్యం రద్దీగా ఉండే జర్మనీ బేకరీ వద్ద ఈ పేలుడు సంభవించిన విషయం తెల్సిందే. పేలుళ్ళ రోజున సంఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోగా, మరో 51 మంది గాయపడిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 20 Feb 2010 | 11:58 pm

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యాదయ్య మృతి!

తెలంగాణా రాష్ట్రం సత్వరమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యాయత్నం చేసిన యాదయ్య మరణించాడు. ఇంటర్ విద్యార్థి యాదయ్య తన శరీరంపై కిరోసిన్ పోసుకుని శుక్రవారం ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విద్యార్థి తీవ్రగాయాలకు గురికావడంతో డీఆర్‌డీఎల్ ఆసుపత్రికి తరలించారు. కానీ యాదయ్యకు చికిత్స ఫలించక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Source: ఏపీ న్యూస్ | 20 Feb 2010 | 10:43 pm

రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి వాడివేడిగా జరుగనున్నాయి. వివిధ అంశాలపై యూపీఏ సర్కారును నిలదీసేందుకు ప్రతిపక్షం ఇప్పటికే అస్త్ర శస్త్రాలతో సిద్ధంగా ఉంది. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు గాను ప్రతిపక్ష పార్టీల నేతలతో స్పీకర్‌ మీరాకుమార్‌ శనివారం అల్పాహార విందును కూడా ఏర్పాటు చేశారు.
Source: జాతీయ | 20 Feb 2010 | 10:33 pm

"మాయా ప్రపంచం" నుంచి నిష్క్రమించిన పద్మనాభం

"మాయాప్రపంచం"తో తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన పద్మనాభం శనివారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో మరణించారు. రేలంగి, రమణారెడ్డి, రాజబాబు వంటి మేటి హాస్య నటుల మధ్య తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకుంటూ ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తిన పద్మనాభం ఇకలేరు. 1931 ఆగస్టులో జన్మించిన ఆయన 2010, ఫిబ్రవరి 20న పరమపదించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Feb 2010 | 1:56 pm

భారీ బడ్జెట్‌తో "లవకుశ" యానిమేషన్

25 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో "ది కాణిపాకం క్రియేషన్స్"వారు రాయుడు విజన్ మీడియా లిమిటెడ్ వారితో కలిసి నిర్మించిన 2డి యానిమేషన్ చిత్రం "లవకుశ- ద వారియర్ ట్విన్స్". చిత్రం గురించి దర్శకుడు దవళ సత్యం మాట్లాడుతూ... "కథ ఇంతకుముందే సినిమాగా వచ్చింది. మళ్లీ లవకుశలా అనే అనుమానం రావచ్చు. రామాయణం మన పురాణం. మన చరిత్ర వీటిని ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలనే మన పూర్వీకులు రకరకాల రూపాలలో రామాయణ గాధను చెప్పారు. వాల్మీకి ఆశ్రమంలో లవకుశలు జన్మించి పెద్దయ్యాక శ్రీరాముడితో తలపడతారు. ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశాలు ఓ ప్రత్యేకత. నాలుగేళ్లుగా యానిమేషన్ టీమ్ ఎంతో శ్రమించి భారతీయులు గర్వపడే చిత్రంగా మలిచారు" అని చెప్పారు. ఆర్.టీవీ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ... ఒకేసారి హిందీ, ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషల్లో వేసవిలో విడుదల చేస్తున్నామని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Feb 2010 | 8:53 am

"రంగ ది దొంగ" షూటింగ్ ప్రారంభం

శ్రీకాంత్ హీరోగా జీవి దర్శకుడిగా గోల్డెన్ లైన్ ఫిలిమ్స్ అండ్ గాడ్ ఫాదర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న "రంగ ది దొంగ" సినిమా రామానాయుడు స్టూడియోలో శుక్రవారం ప్రారంభమైంది. ఓపెనింగ్ షాట్‌కు బాలకృష్ణ క్లాప్ కొట్టగా, రామానాయుడు స్విచాన్ చేశారు. బి.గోపాల్ దర్శకత్వం వహించారు.అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ... "ఈ సినిమా కథను రెండేళ్ల క్రితం జీవీ చెప్పారు. ఇందులో నాది మాస్ ఎంటర్ టైన్మెంట్ క్యారెక్టర్. జీవీ నటుడు అయినప్పటికీ ఆయనలో మంచి ప్రతిభ ఉంది. 'మహాత్మ' చిత్రం తర్వాత మనోహర్ మళ్లీ నాతో సినిమా తీస్తున్నారని చెప్పారు. మనోహర్ మాట్లాడుతూ, శ్రీకాంత్‌తో రెండవ సినిమా. ఈ చిత్ర కథ శ్రీకాంత్ ఇంట్లో నాకు జీవీగారు వినిపించారు. దర్శకుడిగా ఆయన తనను తాను నిరూపించుకుంటాడనే నమ్మకముందని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Feb 2010 | 7:58 am

ప్రాధాన్యతా రంగాలకు కేటాయింపులు లేవు: జేపీ

ప్రజా సంక్షేమంలో ప్రాధాన్యతా రంగాలైన విద్య, ఉపాధి కల్పన, వైద్య ఆరోగ్య శాఖలకు తగినంత మొత్తంలో నిధుల కేటాయింపులు జరగలేదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. శనివారం రోశయ్య ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 20 Feb 2010 | 7:20 am

మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ కనిపించుట లేదు!

కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి, ఎన్డీయే మాజీ కన్వీనర్ జార్జి ఫెర్నాండెజ్ కనిపించుట లేదు. ఈ విషయాన్ని ఆయన సోదరులతో పాటు.. ఆప్తమిత్రుడు మాజీ జస్టీస్ ఎంఎన్ వెంకటాచలయ్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తికోసమే ఆయన భార్యా, కుమార్తె కిడ్నాప్ చేసి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు.
Source: జాతీయ | 20 Feb 2010 | 6:58 am

రాజీనామా చేస్తే.. మళ్లీ గెలవగలనా: కిషన్ మథనం!

ప్రస్తుత పరిస్థితుల్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే తిరిగి గెలుస్తానో లేదోననే బెంగ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాసనసభానేత కిషన్ రెడ్డికి పట్టుకుంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కారణంగా హిమాయత్ నగర్ నుంచి అంబర్‌పేటకు వెళ్లాల్సి వచ్చింది. 2009లో జరిగిన ఎన్నికల్లో అప్పటి మంత్రి, స్థానికేతరుడైన ఫరీదుద్దీన్‌పై కిషన్ రెడ్డి సునాయాసంగా గెలుపొందారు.
Source: ఏపీ న్యూస్ | 20 Feb 2010 | 6:42 am

పెద్దాయన అంకెల గారడీతో మోసం చేశారు: బాబు

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పెదవి విరిచారు. 16 దఫాలు బడ్జెట్‌ను దాఖలు చేసి రికార్డు సృష్టించిన పెద్దాయన మరోమారు అంకెల గారడీతో ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు.
Source: ఏపీ న్యూస్ | 20 Feb 2010 | 6:19 am

నదీ జలాల సమస్య పరిష్కారానికి కేంద్రం జోక్యం: కరుణ

దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రధాన నదీ జలాల సమస్యల పరిష్కారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి విజ్ఞప్తి చేశారు. అపుడే అన్ని రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుందన్నారు.
Source: జాతీయ | 20 Feb 2010 | 5:53 am

పాక్‌తో చర్చలు.. ఎదుర్కొనేందుకు సిద్దం: ప్రధాని

దాయాది దేశం పాకిస్థాన్‌తో విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు జరపాలని నిర్ణయించామని, ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీల నుంచి ఎదురయ్యే విమర్శల దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. పాకిస్థాన్‌తో జరిగే చర్చల అంశాలపై పార్లమెంట్‌లో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు.
Source: జాతీయ | 20 Feb 2010 | 4:09 am

జర్నలిస్టులపై కేసుల ఎత్తివేస్తాం: హోంమంత్రి సబితా

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఘటనలో మీడియా ప్రతనిధులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేసినట్టు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం ప్రకటించారు. ఓయూ ప్రంగణంలో జర్నలిస్టులపై పోలీసులు జరిపిన దాడికి నరసనగా ఈరోజు బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించాలని పాత్రికేయ సంఘాలు నిర్ణయించారు.
Source: ఏపీ న్యూస్ | 20 Feb 2010 | 3:49 am

తెరాస ఎంపీల రాజీనామాలు తిరస్కృతి: మీరాకుమార్

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు చెందిన ఇద్దరు ఎంపీల రాజీనామా లేఖలను తిరస్కరించినట్టు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపై సంప్రదింపులు జరిపేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలకు వ్యతిరేకంగా తెరాస ఎంపీలు రాజీనామాలు చేశారు.
Source: జాతీయ | 20 Feb 2010 | 3:02 am

ఉస్మానియాలో మరో విద్యార్థి ఆత్మహత్యా యత్నం

తెలంగాణా రాష్ట్రం సత్వరమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇంటర్ చదువుతున్న విద్యార్థి యాదయ్య ఆత్మహత్య యత్నం చేశాడు. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విద్యార్థి 90 శాతం గాయాలు పాలైనట్లు సమచారం. ఇదిలావుండగా విద్యార్థి ఆత్మహత్య యత్నం తెలియడంతో మరోసారి ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Source: ఏపీ న్యూస్ | 20 Feb 2010 | 3:00 am

కొత్తగా రాజీవ్ గిరి బాలా ఆరోగ్య బీమా: కె. రోశయ్య

రాష్ట్రంలో కొత్తగా రాజీవ్ గిరి బాలా ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ముఖ్యమంత్రి కె.రోశయ్య తన వార్షిక బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే, వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని ఎయిడ్స్ రోగులకు కూడా నెలవారీ పింఛన్లు మంజూరు చేయనున్నట్టు ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 20 Feb 2010 | 2:53 am