|
కొత్తగా రాజీవ్ గిరి బాలా ఆరోగ్య బీమా: కె. రోశయ్యరాష్ట్రంలో కొత్తగా రాజీవ్ గిరి బాలా ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ముఖ్యమంత్రి కె.రోశయ్య తన వార్షిక బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే, వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని ఎయిడ్స్ రోగులకు కూడా నెలవారీ పింఛన్లు మంజూరు చేయనున్నట్టు ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 20 Feb 2010 | 8:23 am ఉస్మానియాలో మరో విద్యార్థి ఆత్మహత్యా యత్నంతెలంగాణా రాష్ట్రం సత్వరమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇంటర్ చదువుతున్న విద్యార్థి యాదయ్య ఆత్మహత్య యత్నం చేశాడు. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విద్యార్థి 90 శాతం గాయాలు పాలైనట్లు సమచారం. ఇదిలావుండగా విద్యార్థి ఆత్మహత్య యత్నం తెలియడంతో మరోసారి ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.Source: Yahoo! Telugu: News | 20 Feb 2010 | 8:08 am 2010-11 రాష్ట్ర వార్షిక బడ్జెట్: వివిధ శాఖల కేటాయింపులు!2010-11 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కె.రోశయ్య ఆర్థిక మంత్రి హోదాలో శనివారం మధ్యాహ్నం శాసనసభలో ప్రవేశపెట్టారు. అలాగే, శాసనమండలిలో మంత్రి గాదె వెంకటరెడ్డి సమర్పించారు. ఓట్ ఆన్ అకౌంట్‌తో కలిపి రోశయ్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది 16వ సారి కావడం గమనార్హం.Source: Yahoo! Telugu: News | 20 Feb 2010 | 8:04 am "రంగ ది దొంగ" షూటింగ్ ప్రారంభంశ్రీకాంత్ హీరోగా జీవి దర్శకుడిగా గోల్డెన్ లైన్ ఫిలిమ్స్ అండ్ గాడ్ ఫాదర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న "రంగ ది దొంగ" సినిమా రామానాయుడు స్టూడియోలో శుక్రవారం ప్రారంభమైంది. ఓపెనింగ్ షాట్‌కు బాలకృష్ణ క్లాప్ కొట్టగా, రామానాయుడు స్విచాన్ చేశారు. బి.గోపాల్ దర్శకత్వం వహించారు.అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ... "ఈ సినిమా కథను రెండేళ్ల క్రితం జీవీ చెప్పారు. ఇందులో నాది మాస్ ఎంటర్ టైన్మెంట్ క్యారెక్టర్. జీవీ నటుడు అయినప్పటికీ ఆయనలో మంచి ప్రతిభ ఉంది. 'మహాత్మ' చిత్రం తర్వాత మనోహర్ మళ్లీ నాతో సినిమా తీస్తున్నారని చెప్పారు. మనోహర్ మాట్లాడుతూ, శ్రీకాంత్‌తో రెండవ సినిమా. ఈ చిత్ర కథ శ్రీకాంత్ ఇంట్లో నాకు జీవీగారు వినిపించారు. దర్శకుడిగా ఆయన తనను తాను నిరూపించుకుంటాడనే నమ్మకముందని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Feb 2010 | 7:58 am చక్కెర ధరలను నియంత్రించాలంటే దిగుమతి తప్పనిసరిచక్కెర ధరలను అదుపు చేసేందుకు విదేశాల నుంచి వెంటనే 30 నుంచి 50 లక్షల టన్నుల మేర చక్కెరను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందని పిఎంఈఏసీ ఛైర్మెన్ సి రంగరాజన్ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఆయన పిఎంఈఏసీ తరపున ఆర్థిక సమీక్ష నివేదికలో తెలిపారు.Source: Yahoo! Telugu: News | 20 Feb 2010 | 7:53 am రోశయ్య మార్కు బడ్జెట్-2010: జలయజ్ఞానికే పెద్దపీట!ఆర్థిక మంత్రిగా అవతారమెత్తిన ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తన మార్కును ప్రతిబింభించేలా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వైఎస్ కలలను సాఫల్యం చేసే దిశగా ఆయన బడ్జెట్‌ను తీర్చిదిద్దారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జలయజ్ఞానికి ఎప్పటిలా పెద్ద పీట వేశారు.Source: Yahoo! Telugu: News | 20 Feb 2010 | 7:32 am ఉస్మానియా వర్శిటీ ఉపకులపతి కారు ధ్వంసం!ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు మరోమారు రెచ్చిపోయారు. ఈ దఫా పోలీసులపై మాత్రం కాదు. తమ విశ్వవిద్యాలయానికే పెద్దదిక్కుగా ఉండే ఉపకులపతి తిరుపతిరావుపై దాడికి దిగారు. ఆయన కారుపై రాళ్ళ వర్షం కురిపించారు. ఈ దాడిలో కారు అధ్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.Source: Yahoo! Telugu: News | 20 Feb 2010 | 5:25 am ఆర్థిక సమీక్ష ముఖ్యాంశాలుప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఆర్థిక సమీక్ష ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. * ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2009-10)లో దేశీయ ఆర్థిక వృద్ధి 7.2 శాతం పైగా వృద్ధి సాధిస్తుందన్న ఆశాభావం ఉంది. అదే వచ్చే ఆర్థిక సంవత్సరం (2010-11)లో దేశీయ ఆర్థిక వృద్ధి 8.2 శాతానికి చేరుకోగా, మరో ఆర్థిక సంవత్సరం (2011-12)లో 9 శాతానికి చేరుకుంటుందని పిఎంఈఏసీ ఛైర్మెన్ రంగరాజన్ అభిప్రాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 20 Feb 2010 | 5:12 am జమ్మూలో ఎన్‌కౌంటర్: పాక్ మిలిటెంట్ హతంజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన మిలిటెంట్ హతమయ్యాడు. అలాగే, స్పెషల్ పోలీసు ఆఫీసర్ తీవ్రంగా గాయపడినట్టు స్థానిక పోలీసు వర్గాలు వెల్లడించాయి. రీసి జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్నట్టు వారు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 20 Feb 2010 | 4:59 am లాభాలు తగ్గినా ఆదాయం పెంచుకున్న డెల్జనవరి(2010)తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో తమ సంస్థకు చెందిన నికర లాభాలు 4.84 శాతం తగ్గి 33.4 కోట్ల డాలర్లకు చేరుకుంది. అదే త్రైమాసికంలో తన కంపెనీలోని అన్ని వర్గాల్లోను ఆదాయం వృద్ధి బాటలో పయనించిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.Source: Yahoo! Telugu: News | 20 Feb 2010 | 4:50 am చారిత్రాత్మక మసీదు కూలి 36 మంది దుర్మరణం!మొరాకో నగరంలో 18వ శతాబ్దికి చెందిన చారిత్మాత్మక మసీదు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 71 మంది గాయాపడ్డారు. శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు మొరాకో అంతర్గత భద్రతా శాఖ వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 20 Feb 2010 | 4:45 am కొత్తగా రాజీవ్ గిరి బాలా ఆరోగ్య బీమా: కె. రోశయ్యరాష్ట్రంలో కొత్తగా రాజీవ్ గిరి బాలా ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ముఖ్యమంత్రి కె.రోశయ్య తన వార్షిక బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే, వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని ఎయిడ్స్ రోగులకు కూడా నెలవారీ పింఛన్లు మంజూరు చేయనున్నట్టు ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 20 Feb 2010 | 2:53 am ఉస్మానియాలో మరో విద్యార్థి ఆత్మహత్యా యత్నంతెలంగాణా రాష్ట్రం సత్వరమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇంటర్ చదువుతున్న విద్యార్థి యాదయ్య ఆత్మహత్య యత్నం చేశాడు. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విద్యార్థి 90 శాతం గాయాలు పాలైనట్లు సమచారం. ఇదిలావుండగా విద్యార్థి ఆత్మహత్య యత్నం తెలియడంతో మరోసారి ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.Source: ఏపీ న్యూస్ | 20 Feb 2010 | 2:39 am 2010-11 రాష్ట్ర వార్షిక బడ్జెట్: వివిధ శాఖల కేటాయింపులు!2010-11 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కె.రోశయ్య ఆర్థిక మంత్రి హోదాలో శనివారం మధ్యాహ్నం శాసనసభలో ప్రవేశపెట్టారు. అలాగే, శాసనమండలిలో మంత్రి గాదె వెంకటరెడ్డి సమర్పించారు. ఓట్ ఆన్ అకౌంట్‌తో కలిపి రోశయ్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది 16వ సారి కావడం గమనార్హం.Source: ఏపీ న్యూస్ | 20 Feb 2010 | 2:34 am రోశయ్య మార్కు బడ్జెట్-2010: జలయజ్ఞానికే పెద్దపీట!ఆర్థిక మంత్రిగా అవతారమెత్తిన ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తన మార్కును ప్రతిబింభించేలా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వైఎస్ కలలను సాఫల్యం చేసే దిశగా ఆయన బడ్జెట్‌ను తీర్చిదిద్దారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జలయజ్ఞానికి ఎప్పటిలా పెద్ద పీట వేశారు.Source: ఏపీ న్యూస్ | 20 Feb 2010 | 2:27 am మరో తెలుగు హాస్య 'కలికితురాయి' నేల రాలింది!తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరో ఆణిముత్యాన్ని కోల్పోయింది. తన హాస్య నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన బసవరాజు వెంకట పద్మనాభరావు అలియాస్ పద్మనాభం శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు వయస్సు 79 సంవత్సరాలు.Source: ఏపీ న్యూస్ | 20 Feb 2010 | 2:27 am ఉస్మానియా వర్శిటీ ఉపకులపతి కారు ధ్వంసం!ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు మరోమారు రెచ్చిపోయారు. ఈ దఫా పోలీసులపై మాత్రం కాదు. తమ విశ్వవిద్యాలయానికే పెద్దదిక్కుగా ఉండే ఉపకులపతి తిరుపతిరావుపై దాడికి దిగారు. ఆయన కారుపై రాళ్ళ వర్షం కురిపించారు. ఈ దాడిలో కారు అధ్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.Source: ఏపీ న్యూస్ | 19 Feb 2010 | 11:55 pm అవినీతి అంతానికి సేవా సంస్థలు రావాలి: సీవీసీదేశంలో పెరిగిపోతున్న అవినీతి భూతాన్ని తరిమికొట్టేందుకు స్వచ్ఛంద సంస్థలతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర విజిలెన్స్ కమీషన్ (సీవీసీ) ప్రధాన విజిలెన్స్ కమీషనర్ ప్రత్యూష్ సిన్హా తెలిపారు.Source: జాతీయ | 19 Feb 2010 | 11:30 pm జమ్మూలో ఎన్‌కౌంటర్: పాక్ మిలిటెంట్ హతంజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన మిలిటెంట్ హతమయ్యాడు. అలాగే, స్పెషల్ పోలీసు ఆఫీసర్ తీవ్రంగా గాయపడినట్టు స్థానిక పోలీసు వర్గాలు వెల్లడించాయి. రీసి జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్నట్టు వారు తెలిపారు.Source: జాతీయ | 19 Feb 2010 | 11:30 pm నేడు వార్షిక బడ్జెట్: రికార్డు సృష్టించనున్న రోశయ్య!రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కె.రోశయ్య శనివారం మధ్యాహ్నం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే, తన యాభై యేళ్ళ రాజకీయ జీవితంలో 16వ శాసనసభకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించనున్నారు. ఆర్థిక మంత్రిగా తొమ్మిది సార్లు పూర్తి బడ్జెట్‌లు, ఆరుసార్లు ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెటలను ప్రవేశపెట్టి జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పనున్నారు.Source: ఏపీ న్యూస్ | 19 Feb 2010 | 10:52 pm జార్ఖండ్ బీడీవోను విడిచిపెట్టిన మావోయిస్టులుజార్ఖండ్లో ఈ నెల 13న అపహరించుకుపోయిన ధాల్‌భుమ్‌గఢ్ బ్లాక్ అభివృద్ధి అధికారి (బీడీవో) ప్రశాంత్ కుమార్ నాయక్‌ను మావోయిస్టులు శుక్రవారం విడిచిపెట్టారు. నాయక్‌ను జార్ఖండ్‌లోని థాల్‌భూమ్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఆరున్నర గండలకు విడుదల చేసినట్లు పోలీసులు వర్గాలు ధ్రువీకరించారుSource: జాతీయ | 19 Feb 2010 | 9:57 pm గట్టి బందోబస్తు నడుమ హైదరాబాద్ప్రత్యేక తెలంగాణ అంశంపై పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని, శాసన సభ్యులు, ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు విద్యార్థుల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ), తెలంగాణ విద్యార్థుల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) శనివారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వారి ప్రయత్నాన్ని భగ్నం చేసేందుకు హైదరాబాద్‌లో పోలీసులు భారీగా మొహరించి గట్టి బందోబస్తు నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 19 Feb 2010 | 9:57 pm సిన్సియర్ సిటిజన్ "లీడర్" అయితే...?!!రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు బాంబ్ బ్లాస్ట్‌కు గురవుతుంది. చుట్టుపక్కల కొంతమంది చనిపోతారు. సీఎం కోమాలోకి వెళతాడు. అతని కుమారుడు అర్జున్ ప్రసాద్( రానా) అమెరికా నుంచి తండ్రిని చూసేందుకు వస్తాడు. తన తల్లి సుహాసినితో కలిసి ఆసుపత్రికి వెళతాడు. చివరి కోరికగా కొడుకు సీఎం కావాలని కోరతాడు తండ్రి. మరోవైపు సీఎం సోదరుని కొడుకు ధనుంజయ్ తను సీఎం అవడానికి సన్నాహాలు చేసుకుంటాడు. అందుకు ఎమ్మెల్యేలందరినీ తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. ఇదిలావుండగా, రానా తన తండ్రి డైరీని పరీక్షిస్తాడు. 2000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నట్లు గ్రహిస్తాడు. తన తండ్రి ఇంత అవినీతిపరుడా..? అని తల్లిని ప్రశ్నస్తాడు. వ్యవస్థ మారకపోవడంతో తన భర్త అలా అయ్యాడని తల్లి చెపుతుంది. రాష్ట్రంలో బడుగు వర్గాల పరిస్థితి స్వయంగా చూసిన రానా తన తండ్రి కోరిక మేరకు సీఎం కావాలని నిర్ణయించుకుంటాడు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Feb 2010 | 10:43 am రోజుకో నాయిక అందుబాటులో ఉంటోంది: రోజామాకంటే ముందుతరం వాళ్లు 30 ఏళ్లపాటు నాయికగా చలామణి అయ్యారు. మా వరకు వచ్చేసరికి 10 నుంచి 15 ఏళ్ల వరకూ ఉన్నాయి. ఇప్పుడు రోజుకో నాయిక అందుబాటులో ఉంటోంది. వారి పేర్లు గుర్తు పెట్టుకోవాలన్నా కష్టంగా ఉంటుంది. వారి పేర్లను కొద్ది రోజుల్లో మర్చిపోతున్నామని సీనియర్ నటి రోజా అంటోంది. ఇటీవలే "శంభో శివ శంభో"లో నటించింది. తాజాగా "గోలీమార్" చిత్రంలో నటిస్తోంది. సినిమా నుంచి వచ్చినా అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాననీ, అయినా తననెంతో ఆదరిస్తున్నారని పొంగిపోతోంది. భర్త సెల్వమణి గురించి చెబుతూ... ఆయనలాంటి వ్యక్తి దొరకడం అదృష్టమని చెపుతోంది. తామిద్దరం ఎవరికివారు జీవితంలో ఎదగాలనే భావన ఉన్నవారమనీ, తన ఎదుగుదలకు ఆయన చాలా దోహదపడ్డారని మురిసిపోతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 19 Feb 2010 | 9:04 am హైదరాబాద్ దెయ్యమంటే రెచ్చగొట్టడమే అవుతుంది: లగడపాటిసమైక్యాంధ్రకోసం తన వాణిని వినిపిస్తున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తాను మాట్లాడుతున్న మాటలను కొందరు వక్రీకరించి పలు అర్థాలను వెతికి మరీ చెపుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను దెయ్యమంటే రెచ్చగొట్టడమవుతుంది కానీ... కన్నతల్లి వంటిది అంటే రెచ్చగొట్టడమెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 19 Feb 2010 | 7:00 am "కళాతపస్వి" విశ్వనాథ్ పుట్టినరోజు శుభాకాంక్షలువెండితెరపై జీవితాలను అందించి ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న 'కళాతపస్వి' విశ్వనాథ్ పుట్టినరోజు ఫిబ్రవరి 19, 1930. 1960లో సినీ దర్శకులుగా తన కెరీర్‌ను ప్రారంభించిన విశ్వనాథ్ తెలుగు ప్రేక్షకులకు ఆణిముత్యాల్లాంటి ఎన్నో చిత్రాలను అందించారు.తొలి చిత్రాలు అంతగా పేరు తీసుకురాకపోయనప్పటికీ ఆ తర్వాత దృశ్యరూప కావ్యాల్లాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించి మురిపించారు. అందులో జీవన జ్యోతి, శంకరాభరణం, సప్తపది, శుభలేఖ, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శృతి లయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, స్వాతి కిరణం, ఆపద్భాందవుడు, శుభ సంకల్పం, స్వరాభిషేకం వంటి చిత్రాలను అందించారు. కళాతపస్వి ఇంకా మరిన్ని దృశ్యకావ్యాలను అందించాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెపుదాం...Source: Yahoo! Telugu: Entertainment | 19 Feb 2010 | 5:17 am ప్రాంతాల వారిగా దేశ విభజనకు వ్యతిరేకం: ఎంఐఎంఈ దేశాన్ని ప్రాంతాల వారీగా విభజించేందుకు తాము అంగీకరించబోమని ఎంఐఎం తేల్చి చెప్పింది. అలాగే, తెలంగాణ రాష్ట్రం ఇస్తారో లేదా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో కేంద్రం మరో ప్రకటన ద్వారా వెల్లడించాలని ఆ పార్టీ సభ్యుడు అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 19 Feb 2010 | 5:07 am నృత్య దర్శకుడుగా దర్శకరత్న డాక్టర్ దాసరికథా రచయితగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన డాక్టర్ దాసరి నారాయణరావు స్క్రీన్ ప్లే రచయితగా, గీత రచయితగా, సంభాషణల రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఇలా అంచెలంచెలుగా ఎదిగి సినిమా పరిశ్రమలోని అందరివాడయ్యారు. ఎన్నో ఎన్నెన్నో మంచి పనులు చేస్తూ అందరి అభినందనలు అందుకున్నారు. నాడు అంతా కొత్త వారితో "స్వర్గం నరకం" చిత్రం చేసి ఎందరినో పరిచయం చేసిన ఆయన ఇప్పుడు మళ్లీ 81మంది అంతా కొత్తవారిని పరిచయం చేస్తూ 'యంగ్ ఇండియా'ను రూపొందిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Feb 2010 | 4:50 am ధరల పెరుగుదలపై సంతకాల సేకరణ: భాజపానిత్యావసర వస్తువుల ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగి పోవడాన్ని నిరశిస్తూ.. దేశ వ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో జరుగుతున్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఓ తీర్మానం చేశారు.Source: జాతీయ | 19 Feb 2010 | 4:33 am శివసేన రాజనీతి అర్థం కావడం లేదు: నటుడు షారూక్శివసేన పార్టీ రాజనీతి తనకేమాత్రం అర్థం కావడం లేదని బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ అభిప్రాయపడ్డారు. తన తాజా చిత్రం "మై నేమ్ ఈజ్ ఖాన్" చిత్రంలో ఏదైనా సన్నివేశం వారికి అభ్యంతరకరంగా ఉంటే మాత్రం వారికి క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు షారూక్ వెల్లడించారు.Source: జాతీయ | 19 Feb 2010 | 3:38 am విధి విధానాలు మార్చే ప్రసక్తే లేదు: మంత్రి మొయిలీఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపై అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపేందుకు ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలను మార్చే ప్రసక్తే లేదని కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. దీనిపై ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. విధి విధానాలను వ్యతిరేకిస్తూ తమ పదవులకు రాజీనామా చేసిన వారికి ఒక్కటే చెప్పామన్నారు. తక్షణం రాజీనామాలు వెనక్కి తీసుకుని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి సహకరించాలని కోరినట్టు చెప్పారు.Source: జాతీయ | 19 Feb 2010 | 2:45 am
|